
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావును అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా మంగళవారం డీజీపీ కార్యాలయ ముట్టడికి కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఛలో డీజీపీ కార్యాలయం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో డీజీపీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, డీజీపీ ఛాంబర్ సమీపంలో మంగళవారం షార్ట్‌సర్య్కూట్ ప్రమాదం జరిగింది. దీంతో ఆఫీసుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పునరుద్ధరణకు కార్యాలయ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment