సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు డీజీపీ కార్యాల యంలోని ఓ గోడ కూలిపోయింది. ఆదివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో సీపీఆర్‌ఓ కార్యాలయం, ఐపీఎస్ క్వార్టర్స్‌కు మధ్య ఉన్న ప్రధాన గోడ కూలింది. రాత్రి సమయంలోఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతమున్న సీపీఆర్‌ఓ కార్యాలయ భవనం నిజాం కాలంలో నిర్మించిందే కావడంతో.. వర్షాలకు ఇది కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆ భవనం కూడా ఎప్పుడు కూలుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
మొదటి అంతస్తులో సీపీఆర్‌ఓ కార్యాలయం కొనసాగుతుండగా, గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజీపీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధునీకరణ పనులు కూడా పూర్తికావచ్చాయి. ఇదే సమయంలో వర్షాలతో గోడ కూలడంతో భవనం కూడా డేంజర్ జోన్‌లో ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment