
సాక్షి, హైదరాబాద్: కరోనా వారియర్స్ వీడియో సాంగ్‌ను డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు పోలీసు శాఖ చేస్తున్న నిరంతర కృషికి స్పూర్తినిస్తూ.. ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ‘కరోనా వారియర్’ వీడియోను సాంగ్‌ను రూపొందించారు. (దశల వారిగా షూటింగ్స్‌ను అనుమతి: కేసీఆర్)
నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ పాట విడుదల చేసిన సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ తదితర శాఖలు చేస్తున్న కృషికి ప్రోత్సాహంగా మహిత్ నారాయణ్ వీడియో సాంగ్‌ను రూపొందించడం పట్ల డీజీపీ అభినందించారు. బాలాజీ రచించిన ఈ పాటను గాయకులు మనో, గీతా మాధురిలతో పాటు తమిళ గాయకుడు టిప్పు, శ్రీకృష్ణ, సాయిచరణ్, నిహాత్, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణ, బేబీలు పాడారు. (సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వండి)
Comments
Please login to add a commentAdd a comment