
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారినపడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా నుంచి ఒకరు రికవరీ కాగా, 19 మందికి చికిత్స కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన కేసుల్లో హైదరాబాద్‌లో నాలుగు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒక కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకు 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే..
Comments
Please login to add a commentAdd a comment