రాజధాని ప్రాంతంలో సెక్షన్‌ 30 అమలు | Section 30 Implemented In Amaravati Area For Budget Sessions | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతంలో సెక్షన్‌ 30 అమలు

Published Thu, Jul 11 2019 10:30 PM | Last Updated on Thu, Jul 11 2019 10:46 PM

Section 30 Implemented In Amaravati Area For Budget Sessions - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో భద్రతను పెంచారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 అమలు చేయనున్నట్లు ఏపీ డీజీపీ కార్యాలయం అధికారులు గురువారం వెల్లడించారు. విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా పోలీస్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అసెంబ్లీ పరిసరాలు, సీఎం నివాస ప్రాంతాల వద్ద ఆందోళనలకు అనుమతి లేదని తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించాలని కోరారు. పోలీసుల అనుమతితో విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement