రైతుల గొంతు నొక్కడం దారుణం
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజల స్వేచ్ఛను హరించే సెక్షన్-30ను తక్షణమే ఎత్తి వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎస్పీని కోరారు. భోగాపురం మండలంలోని నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో భూములు కోల్పోతున్న రైతుల నోళ్లు నొక్కేయటానికే ప్ర భుత్వం చేస్తున్న ప్రయత్నం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం కోలగట్లతో పాటు పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పెనుమత్స సాం బశివరాజు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయడు తదితరులు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్‌ను కలిసి వినతిపత్రం అందజేసి రైతుల ఇబ్బందులను వివరించారు.
ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రజలు శాంతికాముకులని, భోగాపురం ప్రాం తంలో జరుగుతున్న అన్యాయంపై ఎవరూ నోరెత్తకూడదనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం రై తుల ఆక్రందనను, ఆవేదనను బయట కు రాకుండా చేసేందుకే ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. విమానాశ్రయ నిర్మాణానికి ఎలైన్‌మెం ట్లు మార్చి మార్చి చివరకు నిరుపేద ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులకు చెం దిన భూముల్ని లాక్కునేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ నాయకులు వచ్చినపుడు షామియానాలు వేసి నా స్థానిక పోలీసులు సెక్షన్-30ను చూ పి రైతులను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
పార్టీ నాయకుల వినతిపై స్పం దించిన జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ సెక్షన్-30 అమలు, ఎత్తివేతపై ఉన్నతాధికారులతో సంప్రదిస్తామని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్‌పెనుమత్స సురేష్‌బాబు, కాకర్లపూడి.శ్రీనివాసరా జు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కేవీ సూ ర్యనారాయణరాజు, ఉప్పాడ సూర్యనారాయణ, ఉప్పాడ శివారెడ్డి, బెరైడ్డి ప్రభాకరరెడ్డి, మట్టా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.