HMPV వైరస్‌ కలకలం.. నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్‌ | HMPV Virus Detected In Ahmedabad And 8th Case In Gujarat | Sakshi
Sakshi News home page

HMPV వైరస్‌ కలకలం.. నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్‌

Published Thu, Jan 30 2025 9:21 PM | Last Updated on Fri, Jan 31 2025 10:10 AM

HMPV Virus Detected In Ahmedabad And 8th Case In Gujarat

అహ్మదాబాద్‌: దేశంలో చైనా వైరస్‌ హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా గుజరాత్‌ నాలుగేళ్ల బాలుడు వైరస్‌ బారినపడ్డాడు. బాలుడికి హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) సోకింది. ప్రస్తుతం ఆసుపతత్రిలో బాలుడికి చికిత్స జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పాజిటివ్‌ కేసుతో గుజరాత్‌ హెచ్‌ఎంపీ బాధితుల సంఖ్య ఎనిమిది చేరింది.

వివరాల ప్రకారం.. జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. అనంతరం, బాలుడిని ఎస్‌జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్‌ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలుడికి హెచ్‌ఎంపీవీ సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు. దీంతో, సదరు బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. గుజరాత్‌లో ఇప్పటి వరకు ఎనిమిది హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్‌ఎంపీ కేసులు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లో 8, మహారాష్ట్రలో 3, కర్ణాటక 2, తమిళనాడులో 2, అసోంలో ఒక్క కేసు నమోదైంది.

అసలేంటీ హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్
2001లోనే హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది.  యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది.  చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.

అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే ఇతర వైరస్‌ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.

హెచ్ఎంపీవీ లక్షణాలు
ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది.  లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది.  సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.

  • దగ్గు

  • జ్వరం

  • జలుబు,

  • గొంతు నొప్పి

  • ఊపిరి ఆడకపోవడం

జాగ్రత్తలు ఇలా..
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా  ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్‌ వాష్‌‌, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి.   వైరస్‌బారిన  పడిన వారు సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటించడం ఉత్తమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement