HMPV
-
మహమ్మారి కాదు మామూలు వైరస్సే
సాక్షి, హైదరాబాద్: ‘హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ)’ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 50, 60 ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.దేశంలో కేసుల నమోదుతో ఆందోళనచైనాలో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, చెన్నైలలో రెండు చొప్పున, అహ్మదాబాద్, కోల్‌కతాలలో ఒక్కో హెచ్ఎంపీవీ కేసు మాత్రమే నమోదయ్యాయి. మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.శ్వాస మార్గంలో వృద్ధి చెందే లక్షణంతో..కరోనా వైరస్ తరహాలోనే హెచ్ఎంపీవీ కూడా ‘ఆర్ఎన్ఏ’ రకం వైరస్. అందువల్ల దీనిలోనూ కరోనా తరహాలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒంటి ఒప్పులు తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రధానంగా మనం శ్వాస తీసుకునే మార్గం (రెస్పిరేటరీ ట్రాక్ట్)లోనే వృద్ధి చెందుతుందని... అంటే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల తరహాలో కొన్నిరోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని వివరిస్తున్నారు. ఇది కలసి వచ్చే అంశమని పేర్కొంటున్నారు. వైరస్ ప్రధానంగా నోటి తుంపరలు, తుమ్ముల ద్వారా వెలువడే తుంపరల ద్వారా వ్యాపిస్తుందని... ఆ తుంపరలు పడిన చోట తాకడం, వైరస్ సోకినవారిని తాకడం ద్వారా ఇతరులకు విస్తరిస్తుందని స్పష్టం చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.ఆందోళన వద్దుకరోనాలా వ్యాప్తి చెందుతూ ఉత్పాతం సృష్టించే లక్షణం హెచ్ఎంపీవీకి చాలా తక్కువ. కరోనా సమయంలోలాగే తుమ్ములు, దగ్గు నుంచి వచ్చే తుంపర్లకు దూరంగా ఉంటూ, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటే ఈ వైరస్ వల్ల ప్రమాదం దాదాపుగా ఉండదు. పైగా ఇప్పుడు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆందోళన అవసరం లేదు.– డాక్టర్ గురవారెడ్డి, సన్‌షైన్ హాస్పిటల్స్జాగ్రత్తలతో నివారణ సాధ్యమేచిన్నపాటి ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలు హెచ్ఎంపీవీ వైరస్‌ను దాదాపుగా నివారించవచ్చు. మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రపర్చుకుంటూ ఉండాలి. వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సమయానికి వ్యాక్సిన్లన్నీ ఇప్పించాలి. పెద్దలు, వృద్ధులు జలుబు వంటి లక్షణాలున్నవారి నుంచి దూరంగా ఉండాలి.– డాక్టర్ జయచంద్ర, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తచైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఈ ఆర్ఎన్ఏ వైరస్‌ను 2001లో గుర్తించారు. అప్పటి నుంచి ఇది ఏటా చలికాలంలో చిన్న పిల్లలు, వృద్ధుల్లో సీజనల్ వైరల్ అనారోగ్యంగా కొనసాగుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులకు మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. – జీసీ ఖిల్నానీ, ఢిల్లీ ఎయిమ్స్ పల్మనరీ విభాగం మాజీ హెడ్అతిగా భయాందోళన అనవసరంహెచ్ఎంపీవీ వైరస్ గురించి అతిగా భయాందోళనకు గురికావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అయితే బయటికి వెళ్లినప్పుడు, గుంపుల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటిదాకా వెల్లడైన అంశాల మేరకు ఈ వైరస్ చాలా స్వల్ప లక్షణాలు కలిగి ఉంటుంది. సాధారణ జలుబు మాదిరిగా ముక్కు కారడం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, శ్వాస తీసుకునేప్పుడు ఈల వేసినట్టు శబ్దాలు రావడం, శరీరంపై దద్దుర్లు రావడం వంటి వాటి ద్వారా దీనిని గుర్తించవచ్చు. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రిమహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రిహెచ్ఎంపీవీపై నిపుణుల కమిటీ⇒ నియమించిన వైద్య, ఆరోగ్య శాఖ⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసూ లేదు⇒ ఎలాంటి భయాందోళనలు వద్దుసాక్షి, అమరావతి: చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్, బెంగళూరుల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ప్రకటించింది. కేరళలోనూ వైరస్ కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రిక్స్, పల్మనాలజిస్ట్, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ అధికారులతో ఈ అంశంపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసులు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు 10, వీఆర్డీఎల్ ల్యాబ్‌లు 9 సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి టెస్టులకు కావాల్సిన కిట్లు, యాంటీవైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలన్నారు. డీఎంఈ, డీహెచ్, సెకండరీ హెల్త్ ఇలా అన్ని విభాగాల అధిపతులు హెచ్ఎంపీవీ లక్షణాలకు సంబంధించిన కేసుల నమోదును క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు సూచించారు. వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. అప్రమత్తంగా ఉండండి: సీఎంహెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి, వెళ్లే వారిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ఆదేశించారు. -
‘ఈ వైరస్ ఇప్పటిది కాదు.. 2001లోనే కనుగొన్నారు’
హైదరాబాద్: హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్‌పై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha). హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నాటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదుతువున్నట్లు తెలుస్తోందని, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎలా ఉందనే పరిస్థితిని సమీక్షిస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్‌గా కో-ఆర్డినేట్ చేసుకుంటున్నారని, ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదర్కొనేందుకు ప్రభ/త్వం వైద్య పరంగా సంసిద్ధంగా ఉందన్నారు.డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా నిరాధార తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని హెచ్చరించారు దామోదర.కాగా, భారత్‌లో HMPV ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది. కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు.ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
హెచ్ఎంపీవీ వైరస్..జేపీ నడ్డా కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. భయపడాల్సిన పనిలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనస్తున్నామని జేపీనడ్డా తెలిపారు. ఈ మేరకు సోమవారం(జనవరి6) ఆయన మీడియాతో మాట్లాడారు.‘హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదు.2001 సంవత్సరంలోనే దీన్ని కనుగొన్నారు. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుంది. శీతాకాలం ప్రారంభంలో ఇది బాగా వ్యాపిస్తుంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై పరిశోధన చేస్తోంది.భారత్‌లో శ్వాసకోశ సంబంధ సమస్యల తీవ్రత లేదు. ఈ వైరస్‌పై డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో జాయింట్ గ్రూప్ సమీక్ష నిర్వహించింది.సమస్య ఎదుర్కోవడానికి యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది.ఇదీ చదవండి: హలో.. హెచ్ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త -
హలో.. హెచ్ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త
బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్ఎమ్పీవీదేశంలో హెచ్‌ఎమ్‌పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ రాగా, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్‌కు వైరస్ అటాక్.. కుప్పకూలిన సూచీలు
చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) భారత్‌లోకి అడుగుపెట్టింది. ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులను ఒకటి కర్ణాటకలో, మరొకటి గుజరాత్లో భారత ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్త విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 వారంలో మొదటి ట్రేడింగ్ సెషన్‌ను భారీ నష్టాలతో ముగించాయి. కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కో సూచీ 1 శాతానికి పైగా పడిపోయింది. 30 షేర్ల సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు లేదా 1.59 శాతం పతనమై 77,964.99 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 79,532.67 నుంచి 77,781.62 రేంజ్లో ట్రేడవుతోంది.సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 388.70 పాయింట్లు లేదా 1.62 శాతం తగ్గి 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం నాడు 24,089.95 గరిష్ట స్థాయిని నమోదు చేయగా, రోజు కనిష్ట స్థాయి 23,551.90గా ఉంది.నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 43 స్టాక్‌లు నష్టాలను చవిచూశాయి. ట్రెంట్, టాటా స్టీల్, బీపీసీఎల్, ఎన్టిపిసి, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.60 శాతం వరకు నష్టపోయిన టాప్ లూజర్స్. మరోవైపు అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ 1.94 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిసిన 7 షేర్లలో ఉన్నాయి.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్, ఇండియా VIX, 15.58 శాతం క్షీణించి 15.65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 2.70 శాతం, 3.20 శాతం చొప్పున క్షీణించడంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్‌మార్క్‌లను ప్రతిబింబించాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి, నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ అత్యంత దారుణంగా దెబ్బతింది. 4 శాతం నష్టపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు పడిపోయింది.ఉదయం ఇలా..దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం ఉదయం ప్రారంభంలో లాభాల్లో ట్రేడయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడయింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(డిసెంబర్ 10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్ లో చైనా వైరస్.. HMPV కలకలం
-
దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు..
బెంగళూరు : చైనాలో పుట్టిన కరోనా వైరస్ తరహాలో హెచ్ఎంపీవీ (hmpv) వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా, భారత్‌లో మూడు వైరస్ కేసులు నమోదుయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బాపిస్ట్ ఆస్పత్రిలోని 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఒకరికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ (icmr) నిర్ధారించింది.వైరస్ కేసుల నమోదుపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు (dinesh gundu rao) స్పందించారు. భారత్‌లో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని నివేదికలు వెలువడ్డాయి.ఆ రెండు కేసుల్లో ఒక కేసుపై స్పష్టత లేదు. రిపోర్ట్లు సైతం అలాగే ఉన్నాయి. హెచ్ఎంవీపీ అనేది ఇప్పటికే ఉన్న వైరస్. ఇది గత కొనేళ్లుగా వ్యాపిస్తోంది. ఏటా కొంత మంది దీని బారిన పడుతున్నారు. ఇది కొత్త వైరస్ కాదు. ఇక తాజాగా వైరస్ వ్యాప్తి చెందిన చిన్నారి విదేశాల నుంచి ఇక్కడి వచ్చిన దాఖలాలు లేవు. చైనా, మలేషియా, మరే ఇతర దేశంతో సంబంధం లేదు.చైనా నుంచి వచ్చిన రిపోర్ట్లు చిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, మా వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవు. ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు. After the detection of two hMPV cases in #Karnataka, state Health Minister @dineshgrao said that the report has come out that this is the first case of HMPV in India, which is inaccurate. HMPV is an existing virus that has been circulating for years, and a certain percentage of… pic.twitter.com/1RwELP6hga— South First (@TheSouthfirst) January 6, 2025 -
కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ను మరువక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడది భారత్‌నూ తాకింది. తాజాగా కొత్తవైరస్ ఎంపీహెచ్‌వీకి చెందిన రెండు కేసులు కర్నాటకలో బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఈనెల 13 నుంచి జరగబోయే కుంభమేళాకు ఈ వైరస్ ముప్పు పొంచివుందనే వార్తలు వినిపిస్తున్నాయి.చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్‌ను హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్(Human metapneumo virus)(హెచ్ఎంపీవీ) అని పిలుస్తారు. చైనాలోని పలు ఆసుపత్రులు ఈ వైరస్ బారిన పడినవారితో నిండిపోయాయి. ఈ వైరస్ సంక్రమణ గత 10 రోజుల్లో 600 రెట్లు పెరిగింది. తాజాగా భారత్‌లో ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో లక్షలాదిమంది తరలివచ్చే కుంభమేళాపై ఈ వైరస్ ముప్పు పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే చైనా నుంచి భారత్ వచ్చే వారిపై నిషేధం విధించాలని ఇప్పటికే సాధువులు విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే విమానాలను తక్షణమే నిషేధించాలని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరోవైపు కుంభమేళాకు వచ్చే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఈ ముప్పును విస్మరించలేమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఈ నేపధ్యంలోనే కుంభమేళాలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు 100 పడకల ఆసుపత్రి(100 bed hospital)ని సిద్ధం చేశారు. వైద్యులు, ఇతర సిబ్బందిని రౌండ్ ది క్లాక్ ఆస్పత్రులలో ఉండేలా చూస్తున్నారు.హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ముందుగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అన్ని వయసుల వారికీ వ్యాపిస్తుంది. అయితే దీని ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2019 నవంబర్‌లో కరోనా వైరస్ పుట్టినప్పుడు, అది ప్రపంచమంతటా పెను సంక్షోభాన్ని సృష్టిస్తుందని ఎవరూ గ్రహించలేదు. నాడు ఈ వైరస్‌ను దాచేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చైనా(China) కుట్ర ప్రపంచానికి తెలిసిపోయింది. 2019 జనవరిలో తొలిసారిగా కరోనా భారతదేశానికి వచ్చింది. తరువాత వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆ ఏడాది మార్చిలో దేశంలో లాక్డౌన్ విధించారు. తాజాగా హెచ్ఎంపీవీ వ్యాప్తి దరిమిలా యూపీలోని అలహాబాద్ మెడికల్ అసోసియేషన్.. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్ అవసరమని ప్రభుత్వానికి సూచించింది.ఇది కూడా చదవండి: అధిక ప్లాట్పారంలున్న రైల్వే స్టేషన్లివే.. చర్లపల్లి స్థానం ఎక్కడ? -
బెంగళూరులో ఇద్దరి చిన్నారులకు పాజిటివ్..!
-
HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు!
హ్యూమన్మెటాప్ న్యుమో వైరస్(HMPV) భయం లేదు.. ఆందోళన లేదు అనుకుంటూ ఉండగానే మాయదారి వైరస్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది.ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ క్రమంగా ఇండియాతోపలు పలు దేశాల్లోతన ఉనికిని చాటుకుంటోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. అలా ప్రకటించారో లేదో ఇలా హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. ఈవైరస్ బారిన శిశువుకు వైద్యం చేస్తుండగానే మరో చిన్నారికి కూడా ఇలా మూడు కేసులు నమోదు కావడంతో దేశంలో అందోళన మొదలైంది. కొత్తది కాదు మనదేశంలో విస్తరించకుండా ఉండాలేంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. HMPV వైరస్ కొత్తతేదీ కాదు. న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన మెటాప్న్యూమోవైరస్ ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే జలుబుకు కారణమవుతుంది. శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు..శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్, ఫ్లూ లాంటిదే అంటున్నారు వైద్యులు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.టీకా లేదుఅయితే ప్రస్తుతానికి దీనికి టీకా అందుబాటులో లేదు కనుక కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్, శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్‌బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం.ఎలా వ్యాపిస్తుందిHMPV సోకిన వ్యక్తిదగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్-కలుషితమైన వాతావరణాలకు గురికావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది.మాస్కే మంత్రం!మాస్క్ కచ్చితంగా ధరించాలిచేతులను శుభ్రంగా కడుక్కోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి.పదే పదే కళ్ళు, ముక్కు , నోటిని తాకడం మానువాలి. అనారోగ్యంగా అనిపిస్తే లేదా దగ్గు, గొంతు నొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, చికిత్స తీసుకోవాలి.వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండాలిడోర్ నాబ్‌లు, లైట్ స్విచ్‌లు , స్మార్ట్ఫోన్లు వంటి కలుషితమైన ఉపరితలాలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి.అనారోగ్యం సంకేతాలను చూపించే వ్యక్తుల నుండి సురక్షితమైన దూరం పాటించాలి.ఈ వైరస్ ఎక్కువగా, పిల్లలు, వృద్ధుల్లో కనిపిస్తోంది కనుక వీరి పట్ల మిగిలిన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి.వేడి నీటిని తాగుతూ, ఆహార పదార్థాలను వేడి వేడిగా తింటూ ఉండాలి.బయటి ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.హెచ్ఎంపీవీ లక్షణాలుదగ్గు, జ్వరం. జలుబు,గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడంఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)గా మారవచ్చు.నోట్: జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అందోళన పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలున్నవారు ఐసోలేషన్‌గా ఉంటే ఇంకా మంచిది. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మాస్క్, హ్యాండ్ వాష్, స్వీయ శుభ్రత పాటించాలి. -
ఎంటర్ ది డ్రాగన్ HMPV వైరస్.. ఇండియాకి మొదలైన దడ
-
భారత్‌లో హెచ్ఎంపీవీ కలకలం
న్యూఢిల్లీ/చెన్నై/సాక్షి బెంగళూరు: చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) భారత్‌లోనూ అడుగు పెట్టింది. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఐదు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్లో ఒకరు, కర్నాటకలో ఇద్దరు నెలల చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. తమిళనాడులో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీసే ఈ వైరస్ చైనాలో భారీగా మరణాలకు కారణమవుతున్నట్టు వస్తున్న వార్తలు, కరోనా తాలూకు అనుభవాల నేపథ్యంలో భారత్‌లోనూ తొలిసారి హెచ్ఎంపీవీ కేసులు నమోదవడం కలకలం రేపింది. అయితే ఆందోళన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. హెచ్ఎంపీవీ ప్రాణాంతకమేమీ కాదని తెలిపింది. ‘‘శ్వాస ద్వారా గాలిలో వ్యాపించే హెచ్ఎంపీవీ అన్ని వయసుల వారినీ ప్రభావితం చేయగలదు. అలాగని భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం మూమూలు శ్వాస సంబంధిత సమస్యేనని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు. పైగా హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కూడా కాదు. దీన్ని 2001లోనే తొలిసారి గుర్తించారు. అప్పటినుంచీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తరచూ కనిపిస్తూనే ఉంది’’ అని వివరించింది. ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘‘చైనాలో పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికైతే దేశంలో ఎక్కడా అదనపు హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడలేదు. శ్వాస సంబంధిత కేసుల్లో అసాధారణ పెరుగుదల కూడా నమోదవలేదు’’ అని స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్టు మంత్రి ప్రకటించారు. ‘‘హెచ్ఎంపీవీకి సంబంధించి అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితి తదితరాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నివేదిక కోరాం. తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలను త్వరలో మనతో పంచుకోనుంది’’ అని ఒక ప్రకటనలో వివరించారు. ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని తమిళనాడు, కర్నాటక, గుజరాత్ ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలను గురించి ప్రజలను హెచ్చరిస్తున్నాయి. కర్నాటక ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాసు్కలు ధరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కర్నాటకలో ఎనిమిది నెలల బాబు, మూడు నెలల పాప హెచ్ఎంపీవీ బారిన పడ్డారు. శ్వాసకోశ సమస్యలతో వారిద్దరినీ ఇటీవల బెంగళూరులోని బాప్టిస్టు ఆస్పత్రిలో చేర్చారు. ఐసీఎంఆర్‌లో శాంపిల్స్‌ను పరీక్షించిన మీదట వారికి హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. పాప ఇప్పటికే చికిత్స పొంది డిశ్చార్జి కాగా బాబు కోలుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వారి కుటుంబీకుల్లో ఎవరూ ఇటీవలి కాలంలో విదేశీ ప్రయాణాలు చేయలేదని వివరించింది. ఈ నేపథ్యంలో మాస్క్ధారణతో పాటు కరోనా నాటి ప్రొటోకాల్స్‌ను తిరిగి తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కర్నాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు హుటాహుటిన సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గుజరాత్లో కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రెండు నెలల బాబుకు హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. రాజస్తాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఆ బాబు డిసెంబర్ 24 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమస్య తీవ్రత దృష్ట్యా బాలున్ని వెంటిలేటర్‌పై ఉంచామని, ఇప్పుడు కోలుకుంటున్నాడని వైద్యాధికారులు తెలిపారు. తమిళనాట కూడా సోమవారమే చెన్నైలో ఒకటి, సేలంలో మరొకటి హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూశాయి. బాధితుల పరిస్థితి మెరుగ్గానే ఉందని, వారిని నిరంతర పర్యవేక్షణలో ఉంచామని ఆరోగ్య శాఖ తెలిపింది. The Indian Council of Medical Research (ICMR) has detected two cases of Human Metapneumovirus (HMPV) in Karnataka. Both cases were identified through routine surveillance for multiple respiratory viral pathogens, as part of ICMR's ongoing efforts to monitor respiratory illnesses… pic.twitter.com/PtKYmgztKb— ANI (@ANI) January 6, 2025ప్రమాదకారి కాదుహెచ్ఎంపీవీ. ప్రస్తుతం దేశమంతటినీ ఆందోళనకు గురిచేస్తున్న వైరస్. కానీ కరోనా మాదిరిగా ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎంపీవీ ఇతర సాదాసీదా శ్వాసకోశ వైరస్ల వంటిది మాత్రమేనని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీలో జన్యు పరివర్తనాలు జరిగాయని డబ్ల్యూహెచ్ఓ చెప్పడమే తప్ప నిర్ధారణ కాలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనాలా ఇది మహమ్మారిగా మారే ప్రమాదమేమీ లేదని వివరించింది. హెచ్ఎంపీవీని తొలిగా 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే... → దగ్గు, తుమ్ము వంటివాటి ద్వారా హెచ్ఎంపీవీ వ్యాపిస్తుంది. శ్వాసనాళంలో ఎగువ, దిగువ భాగాలను ప్రభావితం చేస్తుంది. → జలుబు, ముక్కు కారడం, దగ్గుతో పాటు కొన్నిసార్లు ముఖంపైనా, ఒళ్లంతా ఎర్రని దద్దుర్లు, కొద్దిపాటి జ్వరం రావచ్చు. ఇది శ్వాస ఇబ్బందులకు, నిమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయడం అరుదే. → హెచ్ఎంపీవీని ఆరీ్టపీసీఆర్ ద్వారా నిర్ధారించవచ్చు. ఇది వారంలోపే తగ్గిపోతుంది. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం ఎక్కువ.→ మాస్క్ ధరించడం, చేతులను సబ్బుతో బాగా కడుక్కోవడం వంటివి పాటించాలి.→ హెచ్ఎంపీవీకి ఇప్పటికైతే వ్యాక్సీన్, కచి్చతమైన చికిత్స లేవు. -
China HMPV Virus: భారత్‌లో తొలి కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు: భారత్‌లో చైనాకు చెందిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారిలో వైరస్ లక్షణాలు వైద్యులు గుర్తించారు. చైనా (China)లో హెచ్ఎంపీవీ (HMPV)వైరస్ కలకలం సృష్టిస్తోన్న వేళ భారత్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.🚨 India reports first case of HMPV virus; an 8-month-old baby tests positive in Bengaluru. pic.twitter.com/M5y9QJsYwP— Mohit khemariya 🗿 (@Mohitkhemariya_) January 6, 2025ఏమిటీ హెచ్ఎంపీవీ?హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.ఇన్ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల నిమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.వ్యాప్తి ఇలా..దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో వ్యాప్తి చెందుతుంది.వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వల్ల వ్యాపిస్తుంది.వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం కారణం.నివారణ ఇలా..తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి.దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.వైరస్ సోకినవారు బయట తిరగకూడదు. -
హెచ్ఎంపీవీపై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: చైనాలో గుర్తించిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) పట్ల రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇప్పటివరకూ దేశం, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి కేసులు వెలుగుచూడలేదని వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ వైరస్ కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని తెలిపింది. చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. వైరస్ సోకిన వ్యక్తుల నోటి నుంచి వెలువడే తుంపర్లు, ఇతరులతో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని పేర్కొంది. ఇక వైరస్ సోకిన 3–10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని తెలిపింది. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వారికి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్సలేదని.. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదని, ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ థెరపీ చేపడతారని ఆరోగ్యశాఖ ఆ ప్రకటనలో వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.వైరస్ లక్షణాలుదగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలుంటాయి. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు» 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా చేసుకోవాలి.» తుమ్మినా, దగ్గినా నోరు, ముక్కుకు రుమాలును అడ్డుపెట్టుకోవాలి. » రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. » తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవడంతో పాటు, నిద్రపోవాలి.» వైరస్ లక్షణాలు కన్పించిన వెంటనే క్వారంటైన్లో ఉండాలి. » లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదు. -
అబ్బే వణికేది చలికి కాదు!
-
అప్పుడు కరోనా.. ఇప్పుడు HMPV.. మనకు ముప్పు ఉందా?
-
చైనాలో వైరస్ విజృంభణ.. కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన
ఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం ఇంకా ఎవరూ మర్చిపోనేలేదు. నాటి మరణాలు, పరిస్థితులు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి. ఇంతోనే చైనాలో మరో వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతోంది. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) సమావేశం నిర్వహించారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి భారత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వైరస్ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.ఇదే సమయంలో చైనా పరిస్థితులను డబ్ల్యూహెచ్‌వో(WHO) కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు స్పష్టం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్ఎంపీవీ వైరస్ టెస్టింగ్ లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది.ఇక, చైనాలో వైరస్ కారణంగా భారత్‌లో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధుల అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే, మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు.. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపింది. కాగా, చైనాలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, ఆసుపత్రులన్నీ పేషంట్స్‌తో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Chinese hospitals experiencing a surge in Human Metapneumovirus (HMPV) infections. Reports and online posts indicate widespread transmission, with some claiming hospitals and crematories are overwhelmed pic.twitter.com/1FDyQuGr2X— News Rated (@NewsRated) January 4, 2025 -
‘హెచ్ఎంపీవీ’పై అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్: చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలకు శనివారం పలు సూచనలు చేసింది. హెచ్ఎంపీవీ గురించి ఆందోళన చెందకుండా, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) సూచించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీచేసింది. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు బయటపడితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, రాం కోఠి, పేట్ల బురుజు వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. అదే సమయంలో అనారోగ్యంతో ఉన్నవారు కరోనా సమయంలో వ్యవహరించిన విధంగానే మాసు్కలు, చేతి రుమాలుతో జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య సంచాలకుడు బి.రవీందర్ నాయక్ సూచించారు. ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలు, చేయకూడని పనులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.హెచ్ఎంపీవీ కూడా ఇతర శ్వాసకోశ వైరస్‌లలాగే శీతాకాలంలో ప్రధానంగా యువకులు, వృద్ధులలో సాధారణ జలుపు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో హెచ్ఎంపీవీ కేసులేవీ నమోదు కాలేదని చెప్పారు. అయితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ప్రస్తుత డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎంపీవీ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పనులు.. » దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్, మాస్్కతో కప్పుకోవాలి. » చేతులను తరచుగా సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో కడగాలి. » రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి ఒక మూరెడు పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండాలి. » మీకు జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి. » పుష్కలంగా నీరు తాగాలి. పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. » అంటువ్యాధులను తగ్గించడానికి తగినంత గాలి వీచే ప్రదేశాలలో ఉండాలి. » అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఇతరులను కలవకుండా ఉండాలి. » కంటినిండా నిద్రపోవాలి.చేయకూడనివి.. » ఇతరులతో కరచాలనం చేయకండి. » ఒకటే టిష్యూ పేపర్, చేతి రుమాలును పదేపదే వాడకండి. » అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సన్నిహితంగా మెలగొద్దు. » కళ్లు, ముక్కు, నోటిని తరచూ తాకవద్దు. » బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకండి. » వైద్యుడిని సంప్రదించకుండా ఔషధాలు వాడకూడదు. -
హెచ్ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: HMPV (హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్) వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెచ్ఎంపీవీ సోకితే జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యారోగ్య హెచ్చరించింది.హెచ్ఎంపీవి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని.. జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీకరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో ఉపయోగించిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అనారోగ్య సమస్యలతో రద్దీ ప్రాంతాలకు వెళ్లడంవల్ల ఇతరులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని.. జన సామర్త్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగితే HMPV వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావించే డ్రాగన్ దేశం చైనాలో మరో ప్రాణాంతక వైరస్ భయందోళన సృష్టిస్తోంది. హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్(HMPV) పంజా విసురుతోంది. వందలాది మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారియి. గత ఏడాది ఏప్రిల్ నుంచే హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి.హెచ్ఎంపీవీని చైనా ప్రభుత్వం ఇంకా మహమ్మారిగా గుర్తించలేదు.ఇటీవల చలికాలం ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోందని, ఎక్కువగా పిల్లలు, వృద్ధులు దీని బారినపడుతున్నారని, నిత్యం వందలాది కేసులు బయటపడుతున్నాయని స్థానిక మీడియా చెబుతోంది. బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయని, పెద్ద సంఖ్యలో మరణాలు సైతం సంభవిస్తున్నాయని చైనా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కరోనా లాంటి వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఇండియాలో కూడా ఇవి వ్యాపించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ స్పందించింది.ఇండియాలో ఆందోళన అవసరం లేదుహ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించాయి. చలికాలంలో తలెత్తే శ్వాస సంబంధిత అనారోగ్యానికి తగిన చికిత్స, సదుపాయాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయని గోయల్ చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవీ చదవండి: చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలుమహారాణిలా పీవీ సింధు : బ్యాడ్మింటన్-ప్రేరేపిత డిజైనర్ లెహంగా విశేషాలు -
చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలు
China HMPV : కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం తాలూకు గుర్తులు ఇంకా సమసి పోనేలేదు. ఇంతోనే చైనాలో మరో వైరస్ విజృంభణ ఆందోళన రేపుతోంది. కరోనా బీభత్సం జరిగిన ఐదేళ్ల తరువాత చైనాలో HMPV వేగంగా విస్తరిస్తోంది. ఈవైరస్ సోకిన రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయని, శ్మశాన వాటికల్లో స్థలంకూడా లేదంటూ , సోషల్ మీడియా వస్తున్న వీడియోలు, నివేదికలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోనే ప్రభావం అధికంగా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు ఇన్ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 లాంటివి వైరస్లు చైనాలో వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలుహెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్‌బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం. -
హెచ్ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా!
చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. 👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్‌లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.ఏమిటీ హెచ్ఎంపీవీ వైరస్?హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్.. ఆర్ఎన్ఏ వైరస్. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ లక్షణాలు, చికిత్సకరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.ఇక హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్ డాటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది.