హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం సూచన
మహారాష్ట్రలో బయటపడిన రెండు అనుమానాస్పద కేసులు
న్యూఢిల్లీ: శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధులపై ఓ కన్నేసి ఉంచాలని, హ్యూమన్ మెటా న్యుమోవైరస్(హెచ్‌ఎంపీవీ) వ్యాప్తిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దేశంలో ఇప్పటికే హెచ్‌ఎంపీవీ సంబంధిత ఐదు కేసులు బయటపడగా, మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రెండు హెచ్‌ఎంపీవీ అనుమానిత కేసులను వైద్యులు గుర్తించారు. సోమవారం కర్ణాటక, తమిళనాడు, గుజరా త్‌లలో ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తోందని, ఎలాంటి భయాందోళనలకు ప్రజలు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా భరోసా ఇచ్చారు.
చైనాలో ఒక్కసారిగా హెచ్‌ఎంపీవీ కేసులు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం చూస్తే ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్‌నెస్(ఐఎల్‌ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్(ఎస్‌ఏఆర్‌ఐ) సహా అన్ని రకాల శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపించలేదని ఆమె వివరించారు. అదీకాకుండా, ప్రపంచ దేశాల్లో 2021 నుంచే ఈ వ్యాధి ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రస్తుత శ్వాసకోశ సంబంధ వ్యాధుల్లో నమోదైన పెరుగుదలపై ఆమె మాట్లాడుతూ.. ఏటా ఈ సీజన్‌లో ఇలా కేసులు పెరగడం మామూ లేనన్నారు. అయితే, శ్వాస సంబంధమైన అన్ని రకాల వ్యాధుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆమె రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులను కోరారు.
నాగ్‌పూర్‌లో రెండు అనుమానాస్పద కేసులు..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హెచ్‌ఎంపీవీ అనుమానాస్పద కేసులు రెండింటిని గుర్తించారు. 7, 14 ఏళ్ల బాధితులిద్దరికీ స్థానిక ప్రైవేట్ ఆస్ప త్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో చికిత్స చేసి, ఇంటికి పంపించివేశారు. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. అనుమానితుల నుంచి సేకరించిన నమూ నాలను నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని జిల్లా కలెక్టర్ విపిన్ ఇటంకర్ చెప్పారు. హెచ్‌ఎంపీవీ కేసులంటూ వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. నాగ్‌పూర్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు లేవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment