బెంగళూరు:దేశంలో అక్కడక్కడా హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.కర్ణాటకలో సోమవారం(జనవరి6) ఒక్కరోజే రెండు కేసులు నమోదవడంతో అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ స్పందించింది.హెచ్‌ఎంపీవీ వైరస్‌ను అంత తేలిగ్గా తీసుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది.
కొత్త వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావద్దని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ చెప్పారని,కానీ, వైరస్ ప్రభావం గురించి ఏం తెలియనప్పుడు దానిని తేలికగా తీసుకోవద్దన్నారు.ఈ వైరస్ ఛైనాలో బీభత్సం సృష్టిస్తోందని,అక్కడి చిన్నారులు ఆస్పత్రుల పాలయ్యారన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసిందని ప్రతిపక్షనేత అశోక గుర్తుచేశారు.
హెచ్‌ఎంపీవీ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.హెచ్‌ఎంపీవీ ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత,ఐసీయూ బెడ్ల వంటి సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు.
భయపడాల్సిన పనిలేదన్న జేపీ నడ్డా..
కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం గమనార్హం.
ఈ వైరస్‌ను 2001లోనే గుర్తించారని చాలా ఏళ్లుగా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని నడ్డా తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు.
ఇదీ చదవండి: భారత్‌లో పెరుగుతున్న హెచ్‌ఎంపీవీ కేసులు
Comments
Please login to add a commentAdd a comment