బెంగళూరు: భారత్‌లో చైనాకు చెందిన కొత్త వైరస్ హెచ్‌ఎంపీవీ వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారిలో వైరస్ లక్షణాలు వైద్యులు గుర్తించారు.
చైనా (China)లో హెచ్‌ఎంపీవీ (HMPV)వైరస్ కలకలం సృష్టిస్తోన్న వేళ భారత్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.
🚨 India reports first case of HMPV virus; an 8-month-old baby tests positive in Bengaluru. pic.twitter.com/M5y9QJsYwP
— Mohit khemariya 🗿 (@Mohitkhemariya_) January 6, 2025
ఏమిటీ హెచ్‌ఎంపీవీ?
- హెచ్‌ఎంపీవీ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.
- దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.
- వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.
- ఇన్‌ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
- ఇది ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
- దీనివల్ల నిమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.
- చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
- వ్యాప్తి ఇలా..
- దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో వ్యాప్తి చెందుతుంది.
- వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వల్ల వ్యాపిస్తుంది.
- వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం కారణం.
నివారణ ఇలా..
- తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.
- చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.
- ఇన్‌ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి.
- దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.
- వైరస్ సోకినవారు బయట తిరగకూడదు.
Comments
Please login to add a commentAdd a comment