virus
-
చైనాలో మరో మహమ్మారి!
-
Red Alert: బర్డ్ ఫ్లూ దెబ్బకి లక్షలాది కోళ్లు బలి
-
కోళ్లకు అంతు చిక్కని వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!
సాక్షి,హైదరాబాద్ : ముక్క ముట్టందే ముద్ద దిగడం లేదా? అయితే తస్మాత్ జాగ్రత్త. అంతుచిక్కని వైరస్‌తో కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కోళ్లకు అంతు చిక్కని వైరస్ ప్రభలింది. ఫలితంగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. కోళ్లకు సోకుతున్న అంతుచిక్కిన వైరస్ పట్ల అప్రత్తంగా ఉండాలని రాష్ట్రాల్ని అలెర్ట్ చేసింది.ఈ తరుణంలో కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పశు సంవర్థక శాఖ అప్రమత్తమైంది. పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అనారోగ్యంతో వైరస్ సోకిన కోళ్ళను దూరంగా పూడ్చిపెట్టలని సూచించింది. వైరస్ సోకిన కోళ్ళ తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామంలో ఆదివారం అంతుచిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి చెందాయి. ఇప్పటికే తిర్మలాపూర్, బీర్కూర్ మండలంలోని చించోలి, కిస్టాపూర్ ఫారాల్లో 6వేలకు పైగా బాయిలర్ కోళ్లు మృతి చెందడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మరొకరిని బలిగొన్న పూణె వైరస్
పూణే: మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ (గ్విలియన్-బారే సిండ్రోమ్) మరొకరి ప్రాణాన్ని బలిగొంది. రాష్ట్రంలో జీబీఎస్ వైరస్ కారణంగా రెండవ మరణం నమోదయ్యింది. పూణేకు చెందిన ఒక మహిళ జీబీఎస్ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వ్యాప్తి చెందుతోందనడానికి ఉదాహరణగా నిలిచింది.గతంలో ఈ వైరస్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పూణేలో ఇప్పటివరకు 127 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పూణేలోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు కూడా మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానిత జీబీఎస్(Guillain-Barré syndrome) కేసుల సంఖ్య 127కి చేరింది. ఈ వైరస్‌తో బాధపడుతున్న 13 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇదే వైరస్‌తో షోలాపూర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పూణేలో అతనికి ఇన్ఫెక్షన్ సోకింది.షోలాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కాళ్ల నొప్పులు, విరేచనాలతో బాధపడుతున్న ఒక బాధితుడిని జనవరి 18న ఆసుపత్రిలో చేర్చించారు. అతను వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.జీబీఎస్ అనేది ఒక అరుదైన వ్యాధి. దీని బారినపడితే శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా జీబీఎస్‌కి కారణమవుతాయని వైద్యులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి -
భారత్‌లో మంకీపాక్స్ కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు : భారత్‌లో తాజాగా మరో మంకీ పాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి భారత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.జనవరి 17న బాధితుడు దుబాయ్ నుంచి భారత్‌లోని కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరానికి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే అతడి శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సదరు ఆస్పత్రి వైద్యులు బాధితుడి లక్షణాలపై అనుమానం రావడంతో కర్ణాటక (karnataka) వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందించారు.అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ బాధితుడి రక్త నమోనాలను సేకరించారు. వాటిని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌లో బాధితుడికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం బాధితుడు, అతని కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్ వార్డ్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మంకీపాక్స్ నమోదు కావడంపై వైద్యులు స్పందించారు. కోవిడ్-19తో పోలిస్తే మంకీపాక్స్ ప్రమాద తీవ్రత చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్‌పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితుణ్ని ఎవరు ఆలింగనం చేసుకున్నారో.. వారందరిని ఐసోలేషన్ వార్డ్‌కు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. -
అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి చిరుతలు
-
3 వైరస్ల ముప్పు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్ పాతదే అయినప్పటికీ అది సోకితే వచ్చే వ్యాధుల ప్రభావం పిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఈ ఏడాది మొదటివారంలో ఈ సంస్థ అధ్యయనం చేసింది. చైనాతోపాటు, భారత్‌లో వైరస్ వ్యాప్తి గురించి వివరిస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీల వ్యాప్తి కూడా పెరిగినట్లు వెల్లడించింది.పాతవే.. అయినా జాగ్రత్త ముఖ్యం..మనదేశంలో హెచ్ఎంపీవీ 2015 – 2017 మధ్య కాలంలో వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లలోపు వయ సున్న ప్రతి లక్ష మందిలో సగటున 220 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. 60–74 ఏళ్ల మధ్య వయస్కుల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. 80 ఏళ్లకు పైబడిన వారిలో రెట్టింపు స్థాయిలో ఉంది. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.వీరిలో ఆస్పత్రిలో చేరిన వారి రేటు 5% ఉండగా, మరణాల రేటు ఒకశాతం ఉంది. హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లుయెంజా, ఆర్‌ఎస్‌వీలు యువకుల్లో పెద్దగా ప్రభావం చూపవని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. నాలుగేళ్లలోపు చిన్నారులు, 60 సంవత్సరాలు పైబడినవారిలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని వెల్లడించింది. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వారిలో వైరస్‌ను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉందని పేర్కొంది.న్యుమోనియా ప్రమాదం..హెచ్ఎంపీవీ, ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వీ వైరస్లు సోకినప్పుడు అత్యధికుల్లో రోగ నిరోధక శక్తి క్రియాశీలమై వైరస్‌ను జయిస్తున్నారు. అయితే, ఇన్‌పేషెంట్ కేటగిరీ రోగుల్లో ఇన్ఫ్లుయెంజా బారిన పడిన వారు 30 శాతం ఉండగా, హెచ్ఎంపీవీతో 6.2 శాతం, ఎడినో వైరస్‌తో 3.7 శాతం, రినో వైరస్‌తో 4.9 శాతం ఆసుపత్రుల పాలవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. శ్వాస, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్న వారికి ఈ వైరస్లు హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా దగ్గు, జలుబు ఉన్న వారిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుందని, అది క్రమంగా న్యుమోనియాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.జాగ్రత్తలు పాటించాలిచిన్న పిల్లల్లో, వృద్ధుల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో బయ టి వ్యక్తులతో ఎక్కువగా కలువొద్దు. కోవిడ్– 19 సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించ డంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. దీంతో వాటికి సంబంధించిన యాంటిబాడీస్ క్షీణించాయి. ఇప్పుడు వైరస్ వ్యాప్తితో సమస్యలు వస్తు న్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నవారు వైద్యడి సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసు కోవడం మంచిదే. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ హెచ్ఓడీ, గాంధీ మెడికల్ కాలేజీ -
ఆకలితోనే.. జనావాసాల్లోకి చిరుతలు
నల్లమల అటవీ అంతర్భాగంలో ఉన్న ప్రధాన శైవాలయ పట్టణాలైన శ్రీశైలం, మహానందిలో తరచూ చిరుత పులులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం పాతాళగంగ మార్గంలో ఒక అర్చకుడి ఇంట్లో రాత్రి పూట చిరుత తిరుగాడటం ఆందోళన రేకెత్తించింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. చిరుతలు అడవులలో అత్యంత ఇష్టపడే ఆహార జంతువు అడవి పంది, దాని పిల్లలు. ఒక ఈతకు పదికి పైగా పిల్లలను ఈనే అడవి పందుల సంఖ్య నియంత్రణలో ఉంచడానికి ప్రకృతి చేసిన ఏర్పాటే చిరుత ఆహారపు అలవాటు. శ్రీశైలం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటి సంఖ్య హఠాత్తుగా తగ్గిపోయింది. దీంతో తరువాతి ఆహార ప్రాధాన్యత అయిన ఊరకుక్కల కోసం చిరుతలు శ్రీశైలం, సున్నిపెంటల వైపు రాసాగాయి. మరోపక్క శ్రీశైలం ఆలయ పట్టణంలో కుక్కల సంఖ్య పెరగడంతో ఆలయం అధికారులు వాటిని పట్టి, దూరంగా వదలి పెట్టారు. కుక్కలూ లభించకపోవడంతో చిరుత పులులు పెంపుడు కుక్కల కోసం ఇళ్లలోకి వస్తున్నాయి. – ఆత్మకూరు రూరల్అడవి పందులకేమైంది? నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో అడవి పందులు హఠాత్తుగా చనిపోవడం మొదలైంది. అడవిలో పందుల మృత కళేబరాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండడంతో ఎన్ఎస్టీఆర్ వన్యప్రాణి వైద్య నిపుణులు వాటికి పోస్ట్‌మార్టం చేశారు. కొన్ని శాంపిళ్లు ల్యాబ్‌లో పరిశీలించగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ఏఎస్ఎఫ్వీ) కారణమని తేలింది. శ్రీశైలం ఆలయ పట్టణానికి ఆనుకుని ఉండే సున్నిపెంట గ్రామంలో ఉన్న పెంపుడు పందుల ఫారాల నుంచి ఈ వైరస్ అడవి పందులకు సోకినట్లు తేలింది. బెంగళూరు వంటి నగరాల నుంచి పెంపకానికి తెచి్చన సీమ పందులలో ఉన్న ఏఎస్ఎఫ్ వైరస్ తొలుత వారి ఫారాలు, సమీపంలో ఉన్న ఊర పందులకు సోకింది. అవి అడవిలో ఆహారానికి వెళ్లినప్పుడు అడవి పందులకు సోకినట్లు చెబుతున్నారు.ఏమిటీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఏఎఫ్ఎస్వీ అన్నది ఆస్ఫరి్వరిడే కుటుంబానికి చెందిన ఒక పెద్ద డబుల్ స్టాండర్డ్ డీఎన్ఏ వైరస్. ఉప సహారా ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఈ వైరస్ పేలు, పందులు, బుష్పిగ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన పందులు అంతర్గత రక్తస్రావంతో (ఇంటర్నల్ బ్లీడింగ్) కూడిన జ్వరంతో మరణిస్తాయి. ఇది మానవులకు సోకదు.వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట 2003 డిసెంబర్ చివర్లో ఇది బయటపడింది. వెంటనే పశు సంవర్ధకశాఖ రంగంలోకి దిగింది. ప్రభుత్వం శ్రీశైలానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో మెడికల్ ఎమర్జెన్సీ విధించింది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (యానిమల్ హజ్బెండరీ) దృష్టికి కూడా వెళ్లింది. దీంతో శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు, చిన్నారుట్ల, నెక్కంటి, పాలుట్ల, పెచ్చెర్వు, తుమ్మలబయలు వంటి గిరిజన ప్రాంతాలను వైరస్ ఇన్ఫెక్టెడ్ ఏరియాగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న పందుల ఫారాలను తొలగించారు. ఊర పందులను దూరప్రాంతాలకు తరలించారు. చనిపోయిన అడవి పందుల కళేబరాలను తగలబెట్టడం ద్వారా వైరస్ విస్తరించకుండా చేయగలిగారు. దీంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. సంవత్సర కాలంగా చిరుత పులులు ఎక్కువగా జనవాసాల్లోకి వస్తుండటంతో ఇప్పుడు ఈ వైరస్ విషయం బయటకు వచి్చంది.ఆహారం కోసమే చిరుతలు ఊర్లోకి.. చిరుతలు అడవి పంది పిల్లలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌తో అవి ఎక్కువగా చనిపోవడంతో రెండో ప్రాధాన్యత అయిన కుక్కల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ క్రమంలోని శ్రీశైలం, సున్నిపెంటలోకి తరచూ వస్తున్నాయి. – వి.సాయిబాబా, డిప్యూటి డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగాం అడవి పందులు పెద్ద సంఖ్యలో చనిపోవడానికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ కారణమని ఉన్నతాధికారులతో కలిసి చేసిన పరిశోధనలలో తేలింది. జనావాసాల్లో ఉన్న పందులలో కూడా మరణాలు కనిపించడంతో ఇది పూర్తిగా వాటివల్లే విస్తరించిందని స్పష్టమైంది. అన్నిరకాల చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తిని నియంత్రించ గలిగాం. ఈ వైరస్ గాలిలో మూడు సంవత్సరాల వరకు జీవించ గలుగుతుంది. ఆ తర్వాత వాతావరణంలో వేడికి చనిపోతుంది. – డాక్టర్ జుబేర్, వన్యప్రాణి వైద్య నిపుణులు, ఆత్మకూరు -
కొత్త వైరస్ వచ్చేసింది.. మాస్క్ ఈజ్ బ్యాక్ (ఫొటోలు)
-
భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్
-
భారత్‌లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు
న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ(HMPV)కేసులతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నప్పటికీ ఈ కేసుల సంఖ్య భారత్‌లో క్రమేపీ పెరగడం మాత్రం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్కరోజే నాలుగు కేసులు నమోదు కాగా, నేటి(మంగళవారం) ఉదయానికి ఆ సంఖ్య డబుల్ అయ్యింది. తాజాగా మరో నాలుగు కేసులు చేరడంతో అమ్మో హెచ్ఎంపీవీ ఏం చేస్తుందనే భయం మాత్రం జనాల గుండెల్లో భయం పుట్టిస్తోంది.తాజాగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో మరో రెండు కేసులు నమోదు కావడంతో ఈ కేసుల సంఖ్య భారత్‌లో ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాగా, అది ఇప్పుడు మహారాష్ట్రకు పాకడంతో కాస్త కలవరం ఎక్కువైంది.హెచ్ఎంపీవీపై కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలుజనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలి.వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలిబహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..హెచ్ఎంపీవీ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. గత యాభై, ఆరవై ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా(Corona Virus) తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు..మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని అంటున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.కేసుల నమోదుతో ఆందోళనచైనా(China)లో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.మహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రి -
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే..
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటా నిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇప్పుడు భారత్‌ను తాకింది. కరోనాను మరచిపోకముందే హెచ్ఎంపీవీ కేసులు భారత్‌లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్‌కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్‌లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు ఆ వైరస్ల కట్టడికి పలు చర్యలు చేపట్టాయి.ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్‌లున్నాయి. ఈ వైరస్లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే..రోటా వైరస్రోటా వైరస్‌ను చైల్డ్ కిల్లర్ వైరస్(Child killer virus) అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.స్మాల్ పాక్స్దీనిని మశూచి అని అంటారు. ప్రపంచంలోని ఇతర వైరస్‌లకు మించి 30 నుండి 50 కోట్ల మంది మరణాలకు ఇది కారణంగా నిలిచింది. ఈ వైరస్ పునరుత్పత్తి సంఖ్య 3.5 నుండి 6 మధ్య ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మూడు నుంచి ఆరుగురికి తిరిగి వైరస్ సోకుతుంది. ఈ వైరస్ మరణాల రేటు(Mortality rate) 90 శాతం. అయితే టీకా ద్వారా, ఈ వైరస్‌ను సమూలంగా నిర్మూలించారు.తట్టుదీనిని మీజిల్స్ అని కూడా అంటారు. ఇది గత 150 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. గతంలో ఈ వ్యాధి ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందిని బలితీసుకుంది. అయితే ఈ వైరస్‌ను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించారు. మీజిల్స్ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఈ వైరస్ 18 మందికి సోకే అవకాశముంది.డెంగ్యూదోమల వల్ల డెంగ్యూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతోంది. వారిలో 20 వేల మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.ఎల్లో ఫీవర్(Yellow fever)ఈ వైరస్ సోకిన బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బాధితుని ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది 7 నుండి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటి వరకూ ఎల్లోఫీవర్ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 30 వేల మంది మృతిచెందారు.ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఫ్లూ కారణంగా మరణిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని బలితీసుకుంది.రేబిస్పురాతన కాలం నుండి రాబిస్‌ను ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది మరణిస్తున్నారు. రేబిస్ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో సంభవిస్తున్నాయి.హెపటైటిస్-బీ అండ్ సీహెపటైటిస్ బీ వల్ల ఏటా 7 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచింది. ఈ వైరస్ తొలుత శరీరంలోని కాలేయంపై దాడి చేస్తుంది. దీనికి తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది హెపటైటిస్ సీ కారణంగా మరణిస్తున్నారు.ఎబోలా- మార్బర్గ్ వైరస్ఎబోలా- మార్బర్గ్ వైరస్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లుగా గుర్తించారు. ఈ వైరస్ల నియంత్రణకు ఇంకా చికిత్స గానీ, వ్యాక్సిన్‌ను గానీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈ వైరస్ల మరణాల రేటు 90 శాతం వరకు ఉంది. ఈ రెండు వైరస్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటి బారిన పడిన బాధితుడు రక్తస్రావ జ్వరం, అవయవ వైఫల్యం లాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.హెచ్ఐవీ, ఎయిడ్స్నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి వైరస్‌తో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం గత 30 ఏళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారు.ఇది కూడా చదవండి: ‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే -
హలో.. హెచ్ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త
బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్ఎమ్పీవీదేశంలో హెచ్‌ఎమ్‌పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ రాగా, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్‌కు వైరస్ అటాక్.. కుప్పకూలిన సూచీలు
చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) భారత్‌లోకి అడుగుపెట్టింది. ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులను ఒకటి కర్ణాటకలో, మరొకటి గుజరాత్లో భారత ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్త విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 వారంలో మొదటి ట్రేడింగ్ సెషన్‌ను భారీ నష్టాలతో ముగించాయి. కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కో సూచీ 1 శాతానికి పైగా పడిపోయింది. 30 షేర్ల సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు లేదా 1.59 శాతం పతనమై 77,964.99 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 79,532.67 నుంచి 77,781.62 రేంజ్లో ట్రేడవుతోంది.సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 388.70 పాయింట్లు లేదా 1.62 శాతం తగ్గి 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం నాడు 24,089.95 గరిష్ట స్థాయిని నమోదు చేయగా, రోజు కనిష్ట స్థాయి 23,551.90గా ఉంది.నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 43 స్టాక్‌లు నష్టాలను చవిచూశాయి. ట్రెంట్, టాటా స్టీల్, బీపీసీఎల్, ఎన్టిపిసి, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.60 శాతం వరకు నష్టపోయిన టాప్ లూజర్స్. మరోవైపు అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ 1.94 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిసిన 7 షేర్లలో ఉన్నాయి.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్, ఇండియా VIX, 15.58 శాతం క్షీణించి 15.65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 2.70 శాతం, 3.20 శాతం చొప్పున క్షీణించడంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్‌మార్క్‌లను ప్రతిబింబించాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి, నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ అత్యంత దారుణంగా దెబ్బతింది. 4 శాతం నష్టపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు పడిపోయింది.ఉదయం ఇలా..దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం ఉదయం ప్రారంభంలో లాభాల్లో ట్రేడయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడయింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(డిసెంబర్ 10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దేశంలో మూడు HMPV కేసులు.. అయినా భయం వద్దు..
బెంగళూరు : చైనాలో పుట్టిన కరోనా వైరస్ తరహాలో హెచ్ఎంపీవీ (hmpv) వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా, భారత్‌లో మూడు వైరస్ కేసులు నమోదుయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు బాపిస్ట్ ఆస్పత్రిలోని 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఒకరికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ (icmr) నిర్ధారించింది.వైరస్ కేసుల నమోదుపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు (dinesh gundu rao) స్పందించారు. భారత్‌లో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని నివేదికలు వెలువడ్డాయి.ఆ రెండు కేసుల్లో ఒక కేసుపై స్పష్టత లేదు. రిపోర్ట్లు సైతం అలాగే ఉన్నాయి. హెచ్ఎంవీపీ అనేది ఇప్పటికే ఉన్న వైరస్. ఇది గత కొనేళ్లుగా వ్యాపిస్తోంది. ఏటా కొంత మంది దీని బారిన పడుతున్నారు. ఇది కొత్త వైరస్ కాదు. ఇక తాజాగా వైరస్ వ్యాప్తి చెందిన చిన్నారి విదేశాల నుంచి ఇక్కడి వచ్చిన దాఖలాలు లేవు. చైనా, మలేషియా, మరే ఇతర దేశంతో సంబంధం లేదు.చైనా నుంచి వచ్చిన రిపోర్ట్లు చిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, మా వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవు. ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు. After the detection of two hMPV cases in #Karnataka, state Health Minister @dineshgrao said that the report has come out that this is the first case of HMPV in India, which is inaccurate. HMPV is an existing virus that has been circulating for years, and a certain percentage of… pic.twitter.com/1RwELP6hga— South First (@TheSouthfirst) January 6, 2025 -
కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ను మరువక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడది భారత్‌నూ తాకింది. తాజాగా కొత్తవైరస్ ఎంపీహెచ్‌వీకి చెందిన రెండు కేసులు కర్నాటకలో బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఈనెల 13 నుంచి జరగబోయే కుంభమేళాకు ఈ వైరస్ ముప్పు పొంచివుందనే వార్తలు వినిపిస్తున్నాయి.చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్‌ను హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్(Human metapneumo virus)(హెచ్ఎంపీవీ) అని పిలుస్తారు. చైనాలోని పలు ఆసుపత్రులు ఈ వైరస్ బారిన పడినవారితో నిండిపోయాయి. ఈ వైరస్ సంక్రమణ గత 10 రోజుల్లో 600 రెట్లు పెరిగింది. తాజాగా భారత్‌లో ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో లక్షలాదిమంది తరలివచ్చే కుంభమేళాపై ఈ వైరస్ ముప్పు పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే చైనా నుంచి భారత్ వచ్చే వారిపై నిషేధం విధించాలని ఇప్పటికే సాధువులు విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే విమానాలను తక్షణమే నిషేధించాలని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరోవైపు కుంభమేళాకు వచ్చే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఈ ముప్పును విస్మరించలేమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఈ నేపధ్యంలోనే కుంభమేళాలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు 100 పడకల ఆసుపత్రి(100 bed hospital)ని సిద్ధం చేశారు. వైద్యులు, ఇతర సిబ్బందిని రౌండ్ ది క్లాక్ ఆస్పత్రులలో ఉండేలా చూస్తున్నారు.హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ముందుగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అన్ని వయసుల వారికీ వ్యాపిస్తుంది. అయితే దీని ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2019 నవంబర్‌లో కరోనా వైరస్ పుట్టినప్పుడు, అది ప్రపంచమంతటా పెను సంక్షోభాన్ని సృష్టిస్తుందని ఎవరూ గ్రహించలేదు. నాడు ఈ వైరస్‌ను దాచేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చైనా(China) కుట్ర ప్రపంచానికి తెలిసిపోయింది. 2019 జనవరిలో తొలిసారిగా కరోనా భారతదేశానికి వచ్చింది. తరువాత వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆ ఏడాది మార్చిలో దేశంలో లాక్డౌన్ విధించారు. తాజాగా హెచ్ఎంపీవీ వ్యాప్తి దరిమిలా యూపీలోని అలహాబాద్ మెడికల్ అసోసియేషన్.. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్ అవసరమని ప్రభుత్వానికి సూచించింది.ఇది కూడా చదవండి: అధిక ప్లాట్పారంలున్న రైల్వే స్టేషన్లివే.. చర్లపల్లి స్థానం ఎక్కడ? -
ఎంటర్ ది డ్రాగన్ HMPV వైరస్.. ఇండియాకి మొదలైన దడ
-
భారత్‌లో హెచ్ఎంపీవీ కలకలం
న్యూఢిల్లీ/చెన్నై/సాక్షి బెంగళూరు: చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) భారత్‌లోనూ అడుగు పెట్టింది. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఐదు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్లో ఒకరు, కర్నాటకలో ఇద్దరు నెలల చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. తమిళనాడులో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీసే ఈ వైరస్ చైనాలో భారీగా మరణాలకు కారణమవుతున్నట్టు వస్తున్న వార్తలు, కరోనా తాలూకు అనుభవాల నేపథ్యంలో భారత్‌లోనూ తొలిసారి హెచ్ఎంపీవీ కేసులు నమోదవడం కలకలం రేపింది. అయితే ఆందోళన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. హెచ్ఎంపీవీ ప్రాణాంతకమేమీ కాదని తెలిపింది. ‘‘శ్వాస ద్వారా గాలిలో వ్యాపించే హెచ్ఎంపీవీ అన్ని వయసుల వారినీ ప్రభావితం చేయగలదు. అలాగని భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది కేవలం మూమూలు శ్వాస సంబంధిత సమస్యేనని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే నిర్ధారించారు. పైగా హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కూడా కాదు. దీన్ని 2001లోనే తొలిసారి గుర్తించారు. అప్పటినుంచీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తరచూ కనిపిస్తూనే ఉంది’’ అని వివరించింది. ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘‘చైనాలో పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికైతే దేశంలో ఎక్కడా అదనపు హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడలేదు. శ్వాస సంబంధిత కేసుల్లో అసాధారణ పెరుగుదల కూడా నమోదవలేదు’’ అని స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్టు మంత్రి ప్రకటించారు. ‘‘హెచ్ఎంపీవీకి సంబంధించి అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితి తదితరాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నివేదిక కోరాం. తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలను త్వరలో మనతో పంచుకోనుంది’’ అని ఒక ప్రకటనలో వివరించారు. ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని తమిళనాడు, కర్నాటక, గుజరాత్ ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్రమత్తమయ్యాయి. తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలను గురించి ప్రజలను హెచ్చరిస్తున్నాయి. కర్నాటక ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాసు్కలు ధరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కర్నాటకలో ఎనిమిది నెలల బాబు, మూడు నెలల పాప హెచ్ఎంపీవీ బారిన పడ్డారు. శ్వాసకోశ సమస్యలతో వారిద్దరినీ ఇటీవల బెంగళూరులోని బాప్టిస్టు ఆస్పత్రిలో చేర్చారు. ఐసీఎంఆర్‌లో శాంపిల్స్‌ను పరీక్షించిన మీదట వారికి హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. పాప ఇప్పటికే చికిత్స పొంది డిశ్చార్జి కాగా బాబు కోలుకుంటున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వారి కుటుంబీకుల్లో ఎవరూ ఇటీవలి కాలంలో విదేశీ ప్రయాణాలు చేయలేదని వివరించింది. ఈ నేపథ్యంలో మాస్క్ధారణతో పాటు కరోనా నాటి ప్రొటోకాల్స్‌ను తిరిగి తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కర్నాటక ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు హుటాహుటిన సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గుజరాత్లో కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రెండు నెలల బాబుకు హెచ్ఎంపీవీ సోకినట్టు నిర్ధారణ అయింది. రాజస్తాన్‌లోని దుంగార్పూర్కు చెందిన ఆ బాబు డిసెంబర్ 24 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమస్య తీవ్రత దృష్ట్యా బాలున్ని వెంటిలేటర్‌పై ఉంచామని, ఇప్పుడు కోలుకుంటున్నాడని వైద్యాధికారులు తెలిపారు. తమిళనాట కూడా సోమవారమే చెన్నైలో ఒకటి, సేలంలో మరొకటి హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూశాయి. బాధితుల పరిస్థితి మెరుగ్గానే ఉందని, వారిని నిరంతర పర్యవేక్షణలో ఉంచామని ఆరోగ్య శాఖ తెలిపింది. The Indian Council of Medical Research (ICMR) has detected two cases of Human Metapneumovirus (HMPV) in Karnataka. Both cases were identified through routine surveillance for multiple respiratory viral pathogens, as part of ICMR's ongoing efforts to monitor respiratory illnesses… pic.twitter.com/PtKYmgztKb— ANI (@ANI) January 6, 2025ప్రమాదకారి కాదుహెచ్ఎంపీవీ. ప్రస్తుతం దేశమంతటినీ ఆందోళనకు గురిచేస్తున్న వైరస్. కానీ కరోనా మాదిరిగా ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎంపీవీ ఇతర సాదాసీదా శ్వాసకోశ వైరస్ల వంటిది మాత్రమేనని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీలో జన్యు పరివర్తనాలు జరిగాయని డబ్ల్యూహెచ్ఓ చెప్పడమే తప్ప నిర్ధారణ కాలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనాలా ఇది మహమ్మారిగా మారే ప్రమాదమేమీ లేదని వివరించింది. హెచ్ఎంపీవీని తొలిగా 2001లో నెదర్లాండ్స్‌లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే... → దగ్గు, తుమ్ము వంటివాటి ద్వారా హెచ్ఎంపీవీ వ్యాపిస్తుంది. శ్వాసనాళంలో ఎగువ, దిగువ భాగాలను ప్రభావితం చేస్తుంది. → జలుబు, ముక్కు కారడం, దగ్గుతో పాటు కొన్నిసార్లు ముఖంపైనా, ఒళ్లంతా ఎర్రని దద్దుర్లు, కొద్దిపాటి జ్వరం రావచ్చు. ఇది శ్వాస ఇబ్బందులకు, నిమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయడం అరుదే. → హెచ్ఎంపీవీని ఆరీ్టపీసీఆర్ ద్వారా నిర్ధారించవచ్చు. ఇది వారంలోపే తగ్గిపోతుంది. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం ఎక్కువ.→ మాస్క్ ధరించడం, చేతులను సబ్బుతో బాగా కడుక్కోవడం వంటివి పాటించాలి.→ హెచ్ఎంపీవీకి ఇప్పటికైతే వ్యాక్సీన్, కచి్చతమైన చికిత్స లేవు. -
China HMPV Virus: భారత్‌లో తొలి కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు: భారత్‌లో చైనాకు చెందిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన ఎనిమిది నెలల చిన్నారిలో వైరస్ లక్షణాలు వైద్యులు గుర్తించారు. చైనా (China)లో హెచ్ఎంపీవీ (HMPV)వైరస్ కలకలం సృష్టిస్తోన్న వేళ భారత్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వెల్లడించింది. అయితే దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.🚨 India reports first case of HMPV virus; an 8-month-old baby tests positive in Bengaluru. pic.twitter.com/M5y9QJsYwP— Mohit khemariya 🗿 (@Mohitkhemariya_) January 6, 2025ఏమిటీ హెచ్ఎంపీవీ?హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులను పోలి ఉంటాయి.దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటివి ఉంటాయి.వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది.ఇన్ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.ఇది ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల నిమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.వ్యాప్తి ఇలా..దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో వ్యాప్తి చెందుతుంది.వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వల్ల వ్యాపిస్తుంది.వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్లను తాకడం కారణం.నివారణ ఇలా..తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.ఇన్ఫెక్షన్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి.జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్కు ధరించాలి.దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.వైరస్ సోకినవారు బయట తిరగకూడదు. -
హెచ్ఎంపీవీపై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: చైనాలో గుర్తించిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) పట్ల రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇప్పటివరకూ దేశం, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి కేసులు వెలుగుచూడలేదని వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ వైరస్ కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని తెలిపింది. చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. వైరస్ సోకిన వ్యక్తుల నోటి నుంచి వెలువడే తుంపర్లు, ఇతరులతో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని పేర్కొంది. ఇక వైరస్ సోకిన 3–10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని తెలిపింది. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వారికి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్సలేదని.. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదని, ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ థెరపీ చేపడతారని ఆరోగ్యశాఖ ఆ ప్రకటనలో వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.వైరస్ లక్షణాలుదగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలుంటాయి. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు» 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా చేసుకోవాలి.» తుమ్మినా, దగ్గినా నోరు, ముక్కుకు రుమాలును అడ్డుపెట్టుకోవాలి. » రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. » తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవడంతో పాటు, నిద్రపోవాలి.» వైరస్ లక్షణాలు కన్పించిన వెంటనే క్వారంటైన్లో ఉండాలి. » లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదు. -
అప్పుడు కరోనా.. ఇప్పుడు HMPV.. మనకు ముప్పు ఉందా?
-
హెచ్ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: HMPV (హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్) వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెచ్ఎంపీవీ సోకితే జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యారోగ్య హెచ్చరించింది.హెచ్ఎంపీవి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని.. జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీకరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో ఉపయోగించిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అనారోగ్య సమస్యలతో రద్దీ ప్రాంతాలకు వెళ్లడంవల్ల ఇతరులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని.. జన సామర్త్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగితే HMPV వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
చైనాలో కొత్త వైరస్
-
అమెరికాలో విజృంభిస్తున్న వైరస్ అధికారుల వార్నింగ్ బెల్స్
అమెరికాలో నోరో వైరస్ విజృంభిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో 91 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం, నోరో వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబరు మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా, డిసెంబర్ తొలివారంలో ఈ సంఖ్య 91 కి పెరిగింది. వాంతులు , విరేచనాలకు కారణమయ్యే అంటువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులలో ఆందోళన మొదలైంది.నోరో వైరస్ అంటే ఏమిటి?నోరోవైరస్. దీన్నే కడుపు ఫ్లూ లేదా కడుపు బగ్ అని పిలుస్తారు. జీర్ణకోశానికి సోకే ఈ వ్యాధి వాంతులు, విరేచనాలు కలిగించి రోగులను డీహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడేస్తుంది. వాంతులు , విరేచనాలతో మొదలై కడుపు లేదా ప్రేగులలో మంటకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అంటారు. చాలా మంది వ్యక్తులు 1-3 రోజుల్లో కోలుకుంటారు. కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచీ ఇది నేరుగా సోకే అవకాశముంది.లక్షణాలు వైరస్ సోకిన సాధారణంగా 12 -48 గంటల తర్వాత కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి బాడీ నొప్పులు ఉంటాయి. మూత్రం సరిగారాకపోవడం, నోరు పొడిబారడం, కళ్లు తిరగడం, అసాధారణమైన నిద్ర లేదా గందరగోళం లాంటి లక్షణాలుంటాయి. వైరస్ సోకిన రెండు రోజులపాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది.నోరో వైరస్ ప్రధానంగా జీర్ణ కోశాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణాశయం, తర్వాత కొనసాగింపుగా ఉండే పేగులపై అటాక్ చేస్తుంది. అందుకే ఇది సోకగానే కడుపులో మంట, వాంతి వచ్చేట్టు, కడుపులో తిప్పినట్టూ అవుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్‌ల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. నివారణ, చికిత్సనోరోవైరస్ అంటువ్యాధి కనుక ఈ వైరస్ వ్యాప్తికి పరిశుభ్రంగా ఉండటమే పెద్ద చికిత్స. ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్స్ కరోనా వైరస్‌ను చంపినట్టు నోరో వైరస్‌ను చంపలేవు. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. క్లోరినేట్ చేసిన నీటిని వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి.పండ్లు, కూరగాయలను కడగాలి. బట్టలను కూడా వేడి నీటితో ఉతకడం మంచిది. కాచి చల్లార్చిన నీటినే తాగడానికి వినియోగించాలి.హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఇంట్లోనే ఉండి, విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి IV ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది వ్యక్తులు తదుపరి చికిత్స తీసుకోవలసిన అవసరం లేకుండా కొన్ని రోజుల వ్యవధిలో కోలుకుంటారు. -
నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోన్న జికా వైరస్
-
మరో మహమ్మారి.. 15 మందిని కబళించిన ‘బ్లీడింగ్ ఐ’
కరోనా మహమ్మారి తరువాత ప్రపంచంలో వ్యాధుల భయం మరింతగా పెరిగింది. ప్రస్తుతం మార్బర్గ్, ఎంపాక్స్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 17 దేశాలను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. మార్బర్గ్ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికా దేశమైన రువాండాలో ఈ వైరస్ కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారు. కొన్నివందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారినపడి, ప్రాణాలతో పోరాడుతున్నారు.తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో..ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బ్లీడింగ్ వైరస్ అనేది 50శాతం మరణాల రేటుతో తీవ్రమైన వ్యాధుల కేటగిరీలో ఉంది. ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తూ, ప్రపంచదేశాలను వణికిస్తోంది. మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని ‘బ్లీడింగ్ ఐ’ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఇతర వైరస్ల వ్యాప్తితో పోరాడుతున్న ఆఫ్రికా దేశాలను ఈ కొత్త వైరస్ ఇప్పుడు చుట్టుముట్టింది.లక్షణాలివే..బ్లీడింగ్ ఐ వైరస్ సోకినప్పుడు తొలి లక్షణాలు రెండు నుండి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ముందుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన అలసట, శరీర నొప్పులు, కండరాల నొప్పులు బాధిస్తాయి. తరువాత అతిసారం, వికారం, వాంతులు, దురద, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీటి తరువాత ముక్కు, పంటిచిగుళ్ళు, కళ్ళు, నోరు, చెవుల నుండి రక్తస్రావం అవుతుంది. అలాగే వాంతులు, మలంలో రక్తం, అంతర్గత రక్తస్రావం, వృషణాల వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. తరువాత బ్లీడింగ్ ఐ వైరస్ బాధితునికి ప్రాణాంతకంగా మారుతుంది.కరోనా కంటే ప్రమాదకరంప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులలో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలలో గబ్బిలాలు నివసిస్తాయి. ఇవి ఈ వైరస్‌కు ప్రధాన కారకంగా గుర్తించారు. కరోనా కంటే మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైనదని పలు నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి సోకిన గబ్బిలాల ద్వారా లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ వైరస్‌కు ఎటువంటి మందులు లేవు. నివారణ చర్యలే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు -
వైరస్ల పనిపట్టే కృత్రిమ ప్రోటీన్.. పరిశోధకుల కీలక విజయం
పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్‌పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్‌యూ సైంటిస్టులు హెచ్ఎస్పీ70 అనే మానవ ప్రోటీన్‌ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్ఎస్పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్ఎస్పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది. వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్‌యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్‌ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్ఎస్పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్‌లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది. హీట్షాక్ ప్రోటీన్ హీట్షాక్ ప్రోటీన్‌కి పొట్టిరూపమే హెచ్ఎస్పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్ఎస్పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్‌లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్ఎస్పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్‌యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్‌లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్ఎస్పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్ఎస్పీను నిలువరించడం ద్వారా వైరస్ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.‘‘హెచ్ఎస్పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్‌ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్‌లపై దాడిచేస్తాయి. కానీ వైరస్‌లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది. -
ప్రాణాలు తీస్తున్న బ్లీడింగ్ ఐ
కిగలీ(రువాండా): రక్తనాళాలను ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణమయ్యే ప్రమాదకర మార్బర్గ్ వైరస్ రువాండా దేశంలో ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల మందికి ఇప్పటికే ఈ వైరస్సోకి ఉంటుందని రువాండా అధికారులు భావిస్తున్నారు. విపరీతమైన జ్వరం, రక్తధారలకు కారణమవడంతో ఈ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’వైరస్‌గానూ పిలుస్తారు. మార్బర్గ్ వైరస్ సోకితే 88 శాతం వరకు మరణం సంభవించే అవకాశం ఉంది. ఫలాలను తినే గబ్బిలాల్లో మార్బర్గ్ వైరస్ సహజంగా ఉంటుంది. ఇది ఎబోలా జాతికి చెందిన వైరస్. ఓరోపైచ్ జ్వరం, ఎంపాక్స్‌కు కారణమయ్యే వైరస్ల వ్యాప్తితో బాధపడుతున్న 17 ఆఫ్రికా దేశాల్లో తాజాగా ప్రయాణికుల రాకపోకలపై ప్రభుత్వాలు అడ్వైజరీని విడుదలచేశాయి. బ్లీడింగ్ ఐ వైరస్కూ దాదాపు ఎబోలా వైరస్ లక్షణాలే ఉంటాయి. బ్లీడింగ్ ఐ వైరస్ సోకితే గొంతు నొప్పి, జ్వరం, చలి, తలనొప్పి, దగ్గు, కండరాల నొప్పి, దద్దర్లు వస్తాయి. కొన్ని సార్లు ఛాతి నొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బరువు తగ్గడం, రక్తవిరేచనాలు ఉంటాయని క్లెవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధనలో తేలింది. మార్బర్గ్ వైరస్‌కు స్పష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు. ముందస్తు వ్యాక్సిన్లు లేవు. వైరల్ జ్వరం మాదిరిగా చికిత్సావిధానాలనే ప్రస్తుతం అవలంభిస్తున్నారు. -
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్.. 17 దేశాల్లో మార్బర్గ్ వైరస్ ఆనవాళ్లు
కిగాలీ : విదేశాలకు రాకపోకలు నిర్వహించే ప్రయాణికులకు ముఖ్యగమనిక. తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో మార్బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి 15 మంది మరణించారు. వందల మందికి సోకింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో )..ఈ వైరస్ కూడా ఇతర వైరస్‌లా ప్రపంచమంతా విస్తరించకముందే నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 17 దేశాల్లోని ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయనే అంచనాలతో డబ్ల్యూహెచ్‌వో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఆయా దేశాల్ని అప్రమత్తం చేసింది. మార్బర్గ్ వైరస్ అంటేమార్బర్గ్ వైరస్ అంటే ఎబోలా కుటుంబానికి చెందిన ఒక రకమైన హెమరేజిక్ ఫీవర్ వైరస్‌నే. అడవుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గబ్బిలాలలో ఈ వైరస్ ఎక్కువగా ఆవాసం ఉంటుంది. ఈ వైరస్ మనుషుల్లో కనిపించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో ఈ వైరస్ పలు మార్లు వ్యాపించింది. తాజాగా, మరోసారి ఈ వైరస్ ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. It's 21 days with no active cases on the 42-day countdown to declaration of end of #Marburg outbreak. @WHO & partners continue to support ongoing 🇷🇼 govt efforts in the Marburg response, with focus on surveillance, IPC, recovered pt (survivor) program & continuity of services. pic.twitter.com/4aaziYd01p— WHO Rwanda (@WHORwanda) November 30, 2024 -
‘హ్యాండ్ ఫుట్ మౌత్’తో చిన్నారులు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నారులను సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గు, డెంగీ, మలేరియా వంటివి అల్లాడిస్తున్నాయి. ఇప్పుడు వాటికి తోడు హ్యాండ్ ఫుట్ మౌత్ అనే వ్యాధి పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాక్సీకీ అనే వైరస్ ద్వారా నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారుల వరకు ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. చేతులు, కాళ్లు, నోటి మీద దద్దుర్లు, పొక్కులు, పుండ్లు వంటి వాటితో ఇబ్బంది పెడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ వైరస్ ఔట్ బ్రేక్ ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని చిన్నపిల్లల ఆస్పత్రులకు రోజూ కనీసం నాలుగు కేసులు ఇలాంటివి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇవీ వ్యాధి లక్షణాలు..» వ్యాధి సోకిన పిల్లల్లో చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో ర్యాషస్, పుండ్లు, పొక్కులు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితోపాటు కొందరిలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, నోటిలో మంట ఉంటుంది. » ఒకటి, రెండు రోజులకు కురుపులు మోకాళ్లు, మోచేతులు, పిరుదులపై కూడా కనిపిస్తాయి. » ర్యాషస్, పుండ్లు, పొక్కుల వల్ల దురద, మంటతోపాటు ఆహారం తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతారు. » వైద్యులను సంప్రదించి మందులు వాడితే నాలుగు, ఐదు రోజుల్లో వ్యాధి అదుపులోకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారం రోజులపాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి.» వ్యాధిగ్రస్తుల మలం, లాలాజలం, దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్లలోని వైరస్ నోటి ద్వారా కడుపులోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేక అలాగే పాఠశాలలకు పంపుతుండటంతో వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. లక్షణాలు ఉన్న పిల్లలను బయటకు పంపొద్దుహ్యాండ్ ఫుట్ మౌత్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అయినప్పటికీ తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా ఉండాలి. నోటి తుంపర్ల ద్వారా వ్యాధి ఇతరులకు సోకుతుంది. వ్యాధి లక్షణాలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపకుండా, వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. జ్వరం, దగ్గు, జలుబు తగ్గడానికి పారాసెటమాల్ వంటి సాధారణ మందులు సరిపోతాయి. పొక్కులు, పుండ్లు మానడానికి ఆయింట్మెంట్స్ వాడాలి. చాలా అరుదుగా నిమోనియా పాంక్రియాటైటిస్, మెదడువాపు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా లక్షల్లో ఒకరికి వస్తుంది. – డాక్టర్ బి.రమేశ్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, చిన్నపిల్లల విభాగం, గుంటూరు జీజీహెచ్ -
Monkeypox Virus: గుజరాత్ బాలునికి మంకీపాక్స్?
భోజ్‌పూర్: బీహార్‌లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదయ్యింది. గుజరాత్ నుంచి భోజ్‌పూర్ వచ్చిన ఒక బాలునిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. శరీరమంతటా దద్దుర్లు, పొక్కులు వచ్చిన ఓ బాలుడిని భోజ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ బాధితునికి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత బాధిత బాలుడిని ఏసీఎంవో వైద్యులు డాక్టర్ కేఎన్ సిన్హా వద్దకు తరలించారు.మంకీ పాక్స్ అనుమానిత బాధితుని గుర్తించినట్లు డాక్టర్ కెఎన్ సిన్హా తెలిపారు. బాధితుని రక్త నమూనాను మైక్రోబయాలజీ విభాగానికి పంపించామన్నారు. స్థానికంగా ఐసోలేషన్ ఏర్పాట్లు లేకపోవడంతో, బాధితుడిని పట్నాలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలుని శరీరంపై వారం రోజులుగా దద్దుర్లు ఉన్నాయి. అప్పుడప్పుడు బాధితుడు వణుకుతున్నాడు. ఆ బాలుడు ఆరు నెలలుగా గుజరాత్లో ఉన్నాడు. బాధితుడు ఉన్న ప్రాంతానికి కేరళ నుంచి కొందరు వచ్చారని బాలుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా బాలుని కుటుంబ సభ్యులలో ఎవరిలోనూ మంకీపాక్స్ లక్షణాలు కనిపించలేదు. బాధిత బాలునికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి -
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు -
ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్1’ వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1బీ పాజిటివ్ కేసు భారత్‌లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1బీ వైరస్‌ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్ 1బీ వేరియంట్ కేసులు విజృంభించడతో ఆగస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కోలుకున్న ‘క్లేడ్2’ రోగి క్లేడ్2 వేరియంట్‌తో ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే. -
పాక్‌లో ప్రాణాంతక వైరస్.. భారత్‌కూ ముప్పు?
పాకిస్తాన్‌ను ఇప్పుడు మరోవైరస్ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్ఎఫ్(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది. దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ బారినపడిన 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతోంది. ప్రస్తుతం ఆ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలిపిన వివరాల ప్రకారం, ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ నివారించడం చాలాకష్టం. చికిత్స కూడా అంతసులభమేమీ కాదు. ఐ బ్లీడింగ్ వైరస్ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. టిక్ (పేలు తరహాలోని పరాన్న జీవి) కాటు ద్వారా ఈ వైరస్ వృద్ధి చెందుతుంది. సీసీహెచ్ఎఫ్ వైరస్ తల్లి నుండి గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. సీసీహెచ్ఎఫ్ వైరస్ సోకినప్పుడు బాధితునిలో తేలికపాటి లక్షలాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. మనుషులకు ఈ వైరస్ సోకినప్పుడు అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతుల రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.సీసీహెచ్ఎఫ్ అనేది ప్రాణాంతక వ్యాధి. దీని నివారణకు ఇంకా ఎటువంటి చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ అందుబాటులోకి రాలేదు. వైద్యులు బాధితులను క్వారంటైన్లో ఉంచి, వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. సీసీహెచ్ఎఫ్ సోకినవారిలో 50 శాతం మంది మృతి చెందుతున్నారు. ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం, వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. -
మాయరోగం... మరోసారి!
అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాల్సొచ్చింది. భారత్ సైతం ఎయిర్‌పోర్ట్‌లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట. మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్‌కూ జనం భయపడుతున్నది అందుకే!ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్‌పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు. ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్‌కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది. అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్‌లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం. సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది. అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి. టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్! -
పాకిస్తాన్లో మంకీపాక్స్ వ్యాప్తి.. అప్రమత్తమైన ప్రభుత్వం
పాకిస్తాన్లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదైన నేపధ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రజలు మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.పాక్ ప్రధాని ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఒక మంకీపాక్స్ వ్యాధి కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలు, ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారందరికీ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే, దేశంలోకి ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వారికి దూరంగా ఉండాలని హెల్త్ కోఆర్డినేటర్ అహ్మద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి 10 నుంచి 15 రోజులు పడుతుందన్నారు. బాధితుడిని క్వారంటైన్లో ఉంచడం మంచిదని సూచించారు. -
‘చండీపురా’కు 16 మంది బలి.. 50 కేసులు నమోదు
గుజరాత్‌ను చండీపురా వైరస్ వణికిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ తెలిపారు. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.రాష్ట్రంలోని హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హృషికేష్ పటేల్ తెలిపారు. చండీపురా వైరస్‌కు సంబంధించిన మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చాయని, రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయన్నారు. దీని బారినపడి 16 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో చండీపురా వైరస్ పరిస్థితులను సమీక్షించారు. ఈ అంటువ్యాధి నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వైరస్ నివారణకు జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి వెంటనే చికిత్స అందించాలని ఆయన కోరారు. -
ప్రాణాంతక చండీపురా వైరస్ : అసలేంటీ వైరస్, లక్షణాలు
వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తాజాగా గుజరాత్, రాజస్థాన్‌లలో ‘చండీపురా’ వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్కారణంగా చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుజరాత్ లోని ఆరావళి సబర్ కాంతా జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు చిన్నారులు మృతిచెందారు. చండీపురా వైరస్ ఎంత ప్రమాదకరమైనది? లక్షణాలేంటి? దీని బారినుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.చండీపురా వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లవాడు సకాలంలో చికిత్స పొందకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.చండీపురా వైరస్ లక్షణాలు సాధారణం ఫ్లూతో సమానంగా ఉంటాయి లక్షణాలు. దీంతో మామూలుగా జ్వరమే అనుకోవడంతో ప్రమాదం పెరుగుతోంది. చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. అధిక జ్వరం, జ్వరం వేగంగా పెరగడం. వాంతులు, విరేచనాలు , తలనొప్పి, ఒక్కోసారి తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.చండీపురా వైరస్ అంటే ఏమిటి?చండీపురా వ్యాధి అనేది ఫ్లూ నుండి మెదడు జ్వరం వరకు తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్. ఈ వైరస్ తొలి కేసులు 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనిపించింది. అందుకే దీనికి చండీపురా అని పేరు పెట్టారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన RNA వైరస్. ఇది కీటకాలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.ఏ వయస్సు పిల్లలకు ప్రమాదంచండీపురా వైరస్ ఎక్కువగా 9 నెలల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ పిల్లలపై దాడి చేసినప్పుడు, సోకిన పిల్లలకి హై ఫీవర్, జ్వరం, విరేచనాలు, వాంతులు, బ్రెయిన్ ఫీవర్ ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. కనుక అప్రమత్తత చాలా అవసరం. చండీపురా వైరస్‌ను ఎలా నివారించాలి?దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది కనుగ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆహారం విషయంలో జ్రాగ్రత్త వహించాలి. చండీపురా వైరస్‌ను నివారించడానికి, దోమలు, ఈగలు , కీటకాలను నివారించడం ముఖ్యం. పిల్లలకు రాత్రిపూట పూర్తిగా కప్పే దుస్తులు ధరించేలా జాగ్రత్తపడాలి. దోమ తెరలు వాడాలి. దోమల నివారణ మందు వాడండి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు , తలుపులు మూసి ఉంచాలి. -
Chandipura Virus: గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రమాదకర వైరస్ కలకలం
అంత్యంత ప్రమాదకర చాందిపురా వైరస్ ఇప్పుడు గుజరాత్‌ను దాటి రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో చాందిపురా వైరస్ కేసులు నమోదైన దరిమిలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వారా బ్లాక్‌లోని రెండు గ్రామాలలో చాందిపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖేర్వాడా బ్లాక్‌లోని నల్ఫాలా, అఖివాడ గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ వైరస్ బారినపడి హిమ్మత్‌నగర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు గ్రామాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి కోసం గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఈ వైరస్ బారినపడిన చిన్నారులలో ఒకరు మృతి చెందారని తాజా సమాచారం.మీడియాకు అందిన వివరాల ప్రకారం గుజరాత్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఈ వైరస్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపింది. చాందిపురా వైరస్ దోమలు, పురుగులు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
పాక్‌లో కాంగో వైరస్ కలకలం
పాకిస్తాన్లో కాంగో వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా క్వెట్టాలో మరో కేసు నమోదైంది. 32 ఏళ్ల ఫాతిమా జిన్నా.. కాంగో వైరస్ బారిన పడి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఏఆర్వై న్యూస్ పాకిస్తాన్లో వ్యాప్తిచెందుతున్న కాంగో వైరస్ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్లో 13 కాంగో వైరస్ కేసులు నమోదయ్యాయి. పెషావర్‌లో కాంగో వైరస్ బారిన పడిన 18 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. అయితే అతనితో పరిచయం కలిగినవారికి వైరస్ సోకిందీ లేనిదీ తెలియరాలేదు. ఈ వ్యాధి టిక్-బర్న్ నైరో వైరస్ వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ పశువులు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు తదితర జంతువుల ద్వారా వ్యాపిస్తుంది.కాంగో వైరస్ లక్షణాలివే..జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడం, మెడ నొప్పి, వెన్నునొప్పి, కళ్లు మండటం, ఫోటోఫోబియా, వికారం, వాంతులు, అతిసారం, కడుపు నొప్పి, గొంతు నొప్పి మొదలైనవి కాంగో వైరస్ లక్షణాలు. -
భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ
న్యూఢిల్లీ : భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో h9n2బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది. బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.భారత్‌లో ఇది రెండో కేసుభారత్లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రెండున్నరేళ్ల చిన్నారిలో భారత్‌లో పర్యటించిన జూన్7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. బర్డ్‌ఫ్లూ లక్షణాలు డబ్ల్యూహెచ్ఓ మేరకు..బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. బర్డ్‌ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బర్డ్‌ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. -
చైనా ల్యాబ్‌లో మరో ప్రాణాంతక వైరస్?
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు రోజుల్లోనే చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తులు ఈ వైరస్ సృష్టించారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలు, ప్రమాదాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తోంది. ఈ అధ్యయన నివేదిక సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితమయ్యింది.ఎబోలా వైరస్‌ను ఉపయోగించి సృష్టించిన ఈ కొత్త వైరస్‌పై సాగిస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశ్యం వివిధ వ్యాధులను నివారించడం, లక్షణాలను పరిశోధించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్నే చూపుతుంది. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుండి గ్లైకోప్రొటీన్ (జీపీ)ని స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ (వీఎస్వీ)ని ఉపయోగించింది.ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు సిరియన్ హామ్స్టర్స్ (జంతు జాతులు) సమూహంపై పరీక్షించారు. వీటిలో ఐదు మగ, ఐదు ఆడ జాతులున్నాయి. ఈ జంతువులకు ఈ వైరస్‌ను ఇంజెక్ట్ చేయగా, వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాయి. మూడు రోజుల్లో అవన్నీ మృతి చెందాయి. ఈ వైరస్ ఇంజక్ట్ చేయగానే కొన్ని జంతువుల కళ్లు దెబ్బతిన్నాయి. ఆప్టిక్ నరాలలోపై తీవ్రమైన ప్రభావం కనిపించింది. కాగా 2014- 2016 మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందింది. దీనివల్ల వేలాది మంది మృత్యువాత పడ్డారు. Scientists in China have engineered a virus using parts of the deadly Ebola to study the disease and its symptoms. A study detailing the experiment at Hebei Medical University has been published in Science Direct. Researchers noted...#China #ChinaSciencehttps://t.co/VoHWxriE2a— chinaspotlight (@chinaspotlight1) May 25, 2024 -
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
తిరువనంతపురం: కేరళలో వెస్ట్ నైల్ వైరస్( (డబ్ల్యూఎన్వీ) కేసులు మళ్లీ వెలుగు చూశాయి. మొత్తం 10 కేసులు తాజాగా నమోదయ్యాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఐదు చొప్పున కేసులు రికార్డయ్యాయి. వెస్ట్ నైల్ వైరస్ సోకిన 10 మందిలో 9 మంది ఇప్పటికే కోలుకోగా ఒక్క వ్యక్తి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల సంభవించిన ఇద్దరి వ్యక్తుల మరణాలకు కూడా వెస్ట్ నైల్ వైరస్ కారణమన్న అనుమానాలున్నాయి. ఇది నిజమా కాదా అన్నది తేల్చడానికి సాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.ఎన్సెఫలైటిస్ ఫ్లావి వైరస్ రకానికి చెందిన వెస్ట్ నైల్ వైరస్ దోమల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందదు. ఈ వైరస్ పది మందిలో ఇద్దరికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2019,2022 కేరళలో వెస్ట్ నైల్ వైరస్ సోకి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. -
విజృంభిస్తున్న ‘మంప్స్’
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో గవద బిళ్లల వ్యాధి విజృంభిస్తోంది. ఒకరినుంచి ఇంకొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండు నెలలుగా జిల్లావ్యాప్తంగా చాలామంది ఈ వ్యాధి బారిన పడి మంచం పడుతున్నారు. పిల్లలు నొప్పిని భరించలేక విలవిల్లాడుతుండడంతో తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మంప్స్ వైరస్ చిన్నారులను ఇబ్బందిపెడుతోంది. గవద బిళ్లల సమస్యతో పిల్లలు మంచం పడుతున్నారు. చెవుల కింద, దవడ భాగాల్లో వాపు రావడంతోపాటు తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, కీళ్లల్లో వాపు, నోరు తడారిపోవడం, ఆకలి మందగించడం, జ్వరం తదితర లక్షణాలతో పిల్లలు బాధపడుతున్నారు. చిన్న పిల్లలకు గవద బిళ్లల సమస్య ఎదురైనపుడు వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సమస్య చెప్పుకోలేక ఏడుస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, లేకపోతే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇలా వ్యాపిస్తుంది.. గవద బిళ్లల సమస్యతో బాధపడుతున్న వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు, మాట్లాడినపుడు వైరస్ గాలిలో ప్రయాణించి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా 15 ఏళ్లలోపు పిల్లలలో ఈ సమస్య కనిపిస్తుంది. స్కూళ్లకు వెళ్లే చిన్న పిల్లల్లో ఒకరికి సమస్య ఎదురైతే తెలియకుండానే ఒకరి ద్వారా అందరికీ వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. భయపడొద్దు.. తేలికగా తీసుకోవద్దు గవద బిళ్లలుగా పేర్కొనే మంప్స్ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తలనొప్పి, నీరసించిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో ఒక చిన్నారిలో సమస్యను గమనిస్తే మిగతావారికీ వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. ఇలాంటి సమయంలో మిగతా పిల్లలనుంచి దూరంగా ఉంచాలి. ఈ వ్యాధికి భయపడొద్దు.. అలాగని తేలికగానూ తీసుకోవద్దు. వైరస్ బారిన పడినపుడు వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి. వైద్యుల సూచనలకు అనుగుణంగా మందులు వాడడంతో పాటు శక్తినిచ్చే ద్రవాహారాన్ని అందిస్తే త్వరగానే వ్యాధి తగ్గిపోతుంది. – నరేందర్‌రావు, పిల్లల వైద్యులు, కామారెడ్డి ఆస్పత్రులకు క్యూ.. గవద బిళ్లలు సమస్యతో చిన్నపిల్లల ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా పదుల సంఖ్యలో గవద బిళ్లలు సమస్యతో వస్తున్నవారే కనిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో వందలాది మందికి వైరస్ సోకింది. కొన్ని కుటుంబాల్లో పిల్లల ద్వారా పెద్ద వాళ్లకు సైతం వైరస్ వ్యాప్తి చెందింది. గవద బిళ్లలు సోకిన వారు వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంప్స్ వైరస్‌తో బాధపడుతున్న పిల్లలను బడికి పంపకుండా ఇంట్లోనే ఏకాంతంగా ఉంచాలని, ఇంట్లో తయారుచేసిన తేలికపాటి ఆహారాన్ని అందించాలని పేర్కొంటున్నారు. తగినంత మంచినీరు, పండ్ల రసాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. -
చైనాలో కొత్తవైరస్ టెన్షన్.. ఆస్పత్రుల్లో పిల్లలు (ఫొటోలు)
-
చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్లు.. మహమ్మారులుగా మారనున్నాయా?
ప్రపంచాన్ని 2019లో తాకిన కరోనా వైరస్ భయం అందరినీ నేటికీ వెంటాడుతూనే ఉంది. అ తరువాత కరోనా వైరస్ ఆల్పా, బీటా, ఓమిక్రాన్.. ఇలా పలు రూపాలను మార్చుకుని జనంపై దాడి చేస్తూనే వస్తోంది. కరోనా వైరస్ తొలిసారిగా చైనా నగరమైన ఊహాన్‌లో బయటపడింది. అనంతరం నెమ్మదిగా ప్రపంచం అంతటా విస్తరించింది. కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కూడా కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇదిలావుండగా చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్‌లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్‌లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో ఈ వైరస్‌లను గుర్తించారు. ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వైరస్లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళనను సూచిస్తున్నాయి. కాగా భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలను సిద్ధం చేసే దిశగా పరిశోధకులు ఈ ఆవిష్కరణలు సాగిస్తున్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 700 ఎలుకల నమూనాలను సేకరించారు. వీటిలో ఎనిమిది కొత్త వైరస్ లను కనుగొన్నారు. ఇందులో ఒకటి సార్స్-కోవ్-2, కోవిడ్-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారు. గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ నూతన వైరస్‌లకు సంబంధించి అందించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నర్‌లో ప్రచురించారు. కాగా ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్నిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వైరోలాజికా సినికా అనేది చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్‌కి చెందినది. శాస్త్రవేత్తలు 201-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన పరిశోధనల్లో వాటిలోని వైరస్లు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కూడా చదవండి: యద్ధానికి ముందే హమాస్‌కు ఇరాన్ శిక్షణ: ఇజ్రాయెల్ ఆరోపణ -
ప్రమాదకర అంటువ్యాధి.. 15 రోజుల్లో ఏడు చిరుత కూనలు మృతి
బెంగళూరు: కర్ణాటకలో చిరుత పిల్లల మరణాలు కలకలం రేపుతున్నాయి. తీవ్రమైన అంటువ్యాధి సోకి బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్‌లో ఏడు చిరుత కూనలు మృతిచెందాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి ‘ఫీలైన్ పాన్ల్యూకోపెనియా బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే 8 పిల్లలు మరణించినట్లు పార్క్ అధికారులు మంగళవారం వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. ఆగస్టు 22న తొలిసారి ఈ వైరస్ బయటపడినట్లు తెలిపారు. 15 రోజుల్లోనే ఎనిమిది చిరుత పిల్లలకు వైరస్ సోకి చనిపోయినట్లు పేర్కొన్నారు. సఫారీ ప్రాంతంలో తొమ్మిది కూనలను వదిలిపెట్టగా వాటిలో నాలుగు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రెస్క్యూ సెంటర్లో ఉండే మరో మూడింటికి కూడా అంటువ్యాధి సోకి చికిత్స పొందుతూ మరణించాయన్నారు. మరణించిన ఏడు పిల్ల చిరుతల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల లోపు ఉంటుందని పేర్కొన్నారు. అన్నీ కూనలకు వ్యాక్సినేషన్ చేయించినప్పటికీ వైరస్ సోకి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. చదవండి: జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం అయితే ప్రస్తుతం వైరస్‌లో నియంత్రణలో ఉందని.. గత 15 రోజులలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, వెటర్నటీ డాక్టర్లో చర్చలు జరిపి వైరస్ కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని చెప్పారు. అలాగే జంతు ప్రదర్శనశాలలో పరిశుభ్రత చర్యలు చేపట్టామని రెస్క్యూ సెంటర్ పూర్తిగా శానిటైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫీలైన్ పాన్ల్యూకోపెనియా అనే అంటువ్యాధి పిల్లి జాతికి చెందిన పార్వేవైరస్ వల్ల కలుగుతుందని.. ఈ వైరస్ ప్రభావం కూనలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీని బారిన పడితే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. తీవ్రమైన విరేచనాలు, వాంతులు డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయని చివరికి మరణానికి దారితీస్తుందన్నారు. ఇది వేగంగా వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన నాలుగైదు రోజుల్లో జంతువు చనిపోతుందని తెలిపారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రాడార్ నుంచి తప్పించుకోకుండా.. జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొదటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్‌వో లేదా ఏఎన్ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రజల అంగీకారం మేరకు బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజిని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవసరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, పీహెచ్‌సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వో, ఏఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు. నిఫా వైరస్‌పై అప్రమత్తం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
నిఫా అలర్ట్
యశవంతపుర: కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో నిఫా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో కేరళను ఆనుకుని ఉండే దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కేరళ కల్లికోట ప్రాంతంలో నిఫా వల్ల మరణాలు సంభవించడంతో అక్కడ కంటైన్మెంట్ చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలపై నియంత్రణ ఉంది. అక్కడి మలప్పురం, కణ్ణూరు, వయనాడు, కాసరగోడు జిల్లాల పరిధిలో నివారణ చర్యలు చేపట్టారు. కాసరగోడు జిల్లాకు– దక్షిణ కన్నడ మధ్య నిత్యం ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. అలాగే కేరళ నుంచి మడికెరి, మైసూరు, మంగళూరుకు పనుల మీద వస్తుంటారు. దీంతో నిఫా వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. గబ్బిలం కరిచిన పండ్లను తినరాదని అధికారులు ప్రకటించారు. సుళ్య తాలూకాలో ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వరంతో వస్తున్న వ్యక్తులకు చికిత్సలు చేసి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు నిఫా కేసులు దక్షిణ కన్నడ జిల్లాలో నమోదు కాలేదు. నిఫా వైరస్ కలిగిన గబ్బిలాలు కొరికిన పండ్లు, ఆహారాన్ని తిన్నవారికి ఆ వైరస్ సోకే అవకాశముంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, వాంతులు దీని లక్షణాలు. బాధితులు వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఈ గబ్బిలాలు కొరకడం వల్ల పందుల్లోనూ నిఫా వైరస్ కనిపించింది. ఈ రెండు జంతువులకు దూరంగా ఉండడం ఉత్తమం. బాధితుల దగ్గు, తుమ్ము, లాలాజలం నుంచి ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది. -
మరో కోవిడ్.. అడినో వైరస్
కర్ణాటక: వాతావరణంలో మార్పులు.. తీవ్రమైన ఎండలు, మబ్బులతో కూడుకున్న పరిస్థితి, అప్పుడప్పుడు వర్షం రావడం అనేవి బాలల ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. దీంతో రాష్ట్రంలో అంటురోగాల భయం నెలకొంది. ప్రధానంగా అడినో వైరస్ చిన్నపిల్లలను బాధపెడుతోంది. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ఈ జబ్బుతో చికిత్స పొందుతున్న చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. బెంగళూరు ఇందిరాగాంధీ చిన్నపిల్లల ఆసుపత్రిలో వివిధ రకాల జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లల్లో 20 శాతం మంది అడినో వైరస్ బాధితులు ఉన్నారు. బాలలకే అధిక ముప్పు: వైద్యులు ► అడినో వైరస్‌తో పాటు శ్వాసకోశ సమస్యలు, డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లలను చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని ఇందిరాగాంధీ చిన్నపిల్లలు ఆసుపత్రి డాక్టర్ నిజగుణ తెలిపారు. ► అడినోవైరస్ జబ్బుకు కచ్చితమైన చికిత్స లేదు, దీంతో రోగ లక్షణాలు ఆధారంగా వైద్యం అందిస్తున్నాం, పెద్దవారి కంటే బాలలు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నట్లు కేసీ.జనరల్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ లక్ష్మీపతి తెలిపారు. అడినో వైరస్ రోగ లక్షణాలు ► అడినో వైరస్ కళ్లు, శ్వాసకోశ, మూత్రనాళం, నాడీ వ్యవస్థలోకి చొరబడుతుంది. ► జలుబు లేదా జ్వరం ప్రారంభ లక్షణాలు. గొంతు గరగర, నొప్పి, తరువాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలైన బ్రాంకై టిస్, న్యూమోనియాకు దారితీయవచ్చు. ► అలాగే కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలవుతాయి. సరైన చికిత్స అందకపోతే మెదడు, వెన్నుముక దెబ్బతినే ప్రమాదముంది. ► అడినోవైరస్ రోగుల్లో వాంతులు, విరేచనాల వల్ల దేహం నిర్జలీకరణమౌతుంది. దీంతో ద్రవ ఆహారం, పండ్ల రసం, నీరు అందించాలి. ► డాక్టర్ల సూచనతో ముక్కు స్ప్రే, చుక్కలు వాడితే శ్వాస బాగా ఆడుతుంది. వేడి, తాజా ఆహారం అందించాలి, రోగితో పాటు కుటుంబ సభ్యులు పరిశుభ్రత పాటించాలి. కోవిడ్ తరహా నియంత్రణ చర్యలు ► కోవిడ్ నియంత్రణ చర్యలనే అడినో వైరస్ విషయంలోనూ పాటించాలి ► రోగ లక్షణాలు కనబడిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి ► వైరస్ నుంచి కాపాడుకోవడానికి మాస్కు ధరించాలి ► చేతులను తరచూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి ► తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వస్త్రం అడ్డు పెట్టుకోవాలి ఈ వైరస్.. ఇట్టే వ్యాపిస్తుంది ► అడినో వైరస్ అనేది నెమ్మదిగా తీవ్ర దశకు చేరుకుని ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే రోగం. అంటే అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు అస్తమాతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి మీద అడినో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ► డే కేర్ సెంటర్లు, పాఠశాలల్లో పిల్లలు గుంపులుగా చేరే చోట్ల ఈ వైరస్ అధికంగా ప్రబలుతుందని వైద్యనిపుణులు తెలిపారు. బాధితుడు దగ్గినప్పుడు, లేదా చీదినప్పుడు వైరస్ గాలిలో చేరి ఇతరులకు సోకుతుంది. ► తుమ్మిన తుంపర ప్రదేశాలలో పడినప్పుడు వాటిని తాకిన వ్యక్తులు చేతుల ద్వారా కళ్లు, ముక్కు, నోటిలోకి వైరస్ చేరుతుంది. -
కళ్లల్లో కలవరం
అనంతపురం: జిల్లాలో కళ్లకలక (కంజంక్టివైటిస్) వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఈ వైరస్ క్రమంగా జిల్లాలో కూడా పుంజుకుంటోంది. అంటువ్యాధిగా చెప్పుకునే ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతోంది. కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. వైరస్ నివారణకు జిల్లా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లాలో 2,532 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3,76,847 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో మోడల్, కేజీబీవీ, వసతిగృహాల్లో విద్యార్థులు కళ్లకలక వైరస్‌బారిన పడుతున్నారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు వైరస్ సోకిన విద్యార్థులందరినీ వెంటనే ఇళ్లకు పంపించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 కమ్యూనిటీ వైద్యశాలలు, 3 ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ ఏడు వేల మంది దాకా ఓపీ సేవలు పొందుతున్నారు. వారం రోజుల నుంచి పలు ఆస్పత్రుల్లో కళ్లకలక కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యాధితో పెద్దగా ముప్పు లేకపోయినా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కళ్లకలక వ్యాప్తి ఇలా.. కంటి గుడ్డు చుట్టూ తెల్లని పొర రెప్పల వెనుక ఉండే పొరను కంజైటెవా అంటారు. దుమ్మూ ధూళి, వేడి నీళ్లు, అధిక గాలి ఆ పొరలను తాకితే తీవ్ర ప్రభావానికి గురవుతాయి. సున్నితమైన ప్రాంతాలు కావడంతో వేగంగా ఇన్ఫెక్షన్ బారిన పడతారు. కళ్లు ఎర్రగా మారుతాయి. ఒక కంటికి గానీ, రెండు కళ్లకూ గానీ ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కణజాలంలో చేరిన బ్యాక్టీరియా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. జాగ్రత్తలు.. ● కంటిని ఎక్కువ సార్లు నలపకూడదు. మెత్తని గుడ్డతో నెమ్మదిగా తుడవాలి. తరచూ నీటితో శుభ్రం చేసుకోవాలి. ● బయట తిరగకపోవడం మంచిది. ● వైరస్ బారినపడిన వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి ● ఐదు రోజుల నుండి వారం రోజుల్లోపు కళ్లకలక తగ్గిపోతుంది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వైద్యుల సలహా, సూచనలు పాటించాలి. రాయదుర్గం మోడల్ స్కూల్లో 6 నుంచి ఇంటర్ వరకు 630 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 16 మందికి పైగా కళ్లకలక వైరస్ బారినపడ్డారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారందరినీ ఇళ్లకు పంపారు. 9 నుంచి ఇంటర్ వరకు గల వసతి గృహంలో 45 మంది విద్యార్థులుంటే ఇద్దరికి కళ్లకలక లక్షణాలు కనిపించాయి. రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో 4 రోజుల క్రితం కళ్లకలక వైరస్‌తో బాధపడుతున్న ఐదుగురు చికిత్స కోసం వచ్చారు. తాజాగా ఆ సంఖ్య 25కు చేరుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరింత ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలిసింది. మెడికల్‌షాపుల్లోనూ కళ్లకలక మందుల విక్రయం పెరిగింది. జిల్లాలో కళ్లకలక బాధితులు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడునన్ని మందులు అందుబాటులో ఉంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉచితంగా డ్రాప్స్, మందులను పంపిణీ చేసేలా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. -
కండ్లకలక వస్తే అలా మాత్రం చేయకండి, కంటిచూపు పోతుంది
కండ్లకలక.. దీన్నే పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలే వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే ప్రజలకు కండ్లకలక ఇప్పుడు మరో సమస్యగా మారింది. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. కండ్లకలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లను చూసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కంటిలో చిన్న నలక పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలక వచ్చిన రోగి నుంచి ఈజీగా ఎనిమిది మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది.ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. వ్యాధి నయం కావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కండ్లకలక లక్షణాలు కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. కంటి నుంచి కంటిన్యూగా నీరు కారుతుంది, కంటిరెప్పలు ఉబ్బిపోతాయి. సరిగా చూడలేకపోవడం, లైట్ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం దీని లక్షణాలు కండ్లకలక వస్తే జ్వరం, తేలిపాటి గొంతునొప్పి కూడా బాధిస్తుంది. కండ్లకలక వస్తే ఏం చేయాలి? కండ్లకలక సోకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్ వాడొచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వాడాలి. కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించాలి. కండ్లకలక వస్తే ఇలా అస్సలు చేయొద్దు కండ్లకలక చిన్న సమస్యే అని సొంత వైద్యం చేసుకోవద్దు కళ్లను తరచూ తాకొద్దు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతంది ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పడు జనంలోకి తిరగడం వంటివి చేయొద్దు సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం. కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 #Conjuctivitis#HealthForAll#SwasthaBharat pic.twitter.com/1r7hp7II4D — Ministry of Health (@MoHFW_INDIA) August 2, 2023 వాళ్లను చూస్తే కండ్లకలక వస్తుందా? కండ్లకలక వచ్చినవారిని నేరుగా చూస్తే ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకుతుందా? అంటే అది ఒట్టి అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. వైరల్ కన్జక్టివిటిస్ ఉన్న వాళ్లను చూస్తే ఇది వ్యాపించదు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుంది. కండ్లకలక వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను తాకడం, ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి అంటుకుంటుంది. అలాగే వాళ్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల నుంచి కూడా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకానీ కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంత మాత్రాన్నే వ్యాధి సోకే అవకాశమే లేదు. ఇక సన్ గ్లాసెస్ లేదా ముదురు కళ్లద్దాలు ధరించడం వల్ల కండ్లకలక ఇతరులకు వ్యాపించదు అనే సందేహం చాలామందికి వెంటాడుతుంది. కానీ ఇందులో నిజం లేదు. కళ్లద్దాలు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధిని నిరోధించే ఛాన్స్ లేదు. ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
తెలుగు రాష్ట్రల్లో భారీగా పరుగుతున్న కళ్లకలక కేసులు
-
కలవరం రేపుతోన్న కళ్లకలక.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా జ్వరాలు సోకుతుండగా తాజాగా కళ్ల కలక.. కలవరం రేపుతోంది. దీనిని పింక్ ‘ఐ’ అని కూడా అంటున్నారు. సాధారణ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. జలుబు కారకమైన వైరస్‌తో కూడా కలక వస్తుందని వారు తెలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా మందే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకు కారణమవుతోందని, ఇది కళ్లను ప్రభావితం చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎలా వస్తుంది? బ్యాక్టీరియా, కెమికల్స్, వైరస్ ద్వారా వస్తుంది. ఒకరిద్వారా ఒకరికి విస్తరిస్తుంది. లక్షణాలు.. ♦ కన్ను ఎర్రగా మారుతుంది ♦ కంటి నుంచి నీరు కారుతుంది ♦ కంటి రెప్పలు వాపు, ఉబ్బుతాయి. ♦ నిద్రించినప్పుడు కంటి రెప్పలు అంటుకుంటాయి. ♦ కంటి నుంచి పూసి రావడం ♦ కంటి నొప్పి దురద, మంట వస్తుంది. చికిత్స... యాంటీ బయోటిక్ ‘ఐ’ డ్రాప్స్, లుబ్రికాటింగ్ ‘ఐ’ డ్రాప్స్ వేసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన పరిసరాలలో (ఆఫీస్‌లు, స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, ఇంటిలో) ఎవరికైనా కండ్ల కలక ఉండే వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు (టవల్స్, సబ్బులు ఇతర వస్తువులు) తాకడం, వాడడం చేయొద్దు. తప్పని పరిస్థితుల్లో తాకితే తరచూ చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక వస్తే తప్పని సరిగా కళ్లద్దాలు ఉపయోగించాలి. ♦ కండ్ల కలక చాలా సాధారణ కంటి జబ్బు. అయినా మొదట్లోనే దీనిని నివారించుకోవాలి. పెద్దగా ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. అయినా జాగ్రత్తలు పాటించాలి. ♦ కళ్లను మంచి నీటితో శుభ్రం చేస్తే అరికట్టొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి కంటి వైద్యులను సంప్రదించాలి. జాగ్రత్తలు తీసుకోవడంతో తగ్గింది.. వారం క్రితం చాలా మంది విద్యార్థినులకు కండ్ల కలక వచ్చింది. కంటి వైద్యుల సలహా మేరకు ‘ఐ‘ డ్రాప్స్ వేశాం. పిల్లలను దూరంగా ఉంచాం. దాదాపుగా అందరికీ తగ్గుతోంది. జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కసూ్తర్బా ఆందోళన చెందొద్దు కంటి కలక వచ్చిన వారు ఆందోళన చెందొద్దు. పరిశుభ్రత పాటించాలి. సొంత వైద్యం చేయకుండా కంటి వైద్యులను సంప్రదించాలి. కంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతాపగిరి ప్రసాద్, ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ జాగ్రత్తలు పాటించాలి గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో వాతావరణంలో మురుగు, కాలుష్య కారకాలు పెరిగిపోవడం వల్ల వస్తుంది. ప్రస్తుతం అనేక జిల్లాలలో ప్రజలు కండ్ల కలకతో బాధపడుతున్నారు. కండ్లకలక సమస్యకు మందులు వాడకపోయినా కొందరికి తగ్గుతుంది. అయితే ఇది ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. – డాక్టర్ చీర్ల శ్రీకాంత్, పీహెచ్సీ వెంకటాపురం 100 మందికి పైగా ప్రజలకు కండ్ల కలక .. వెంకటాపురం(ఎం) మండలంలోని 9 సబ్‌సెంటర్ల పరిధిలో సుమారు 100 మందికి పైగా ప్రజలు కండ్ల కలక లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. వైద్య సిబ్బంది కూడా ఎప్పటికపుడు గ్రామాల్లో పర్యటిస్తూ కండ్ల కలక వచ్చిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
కళ్ల..కలకలం
బనశంకరి: రాష్ట్రంలో కళ్లకలక (మద్రాస్ ఐ వైరస్) జబ్బు కలకలం సృష్టిస్తోంది. ఆస్పత్రుల్లో ఈ జబ్బు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కంజక్టివైటీస్ అని పిలిచే మద్రాస్–ఐ, లేదా కంటి వైరస్ వ్యాధులు ఎంతో చికాకు కలిగిస్తాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉండటం, లేదా చలి వాతావరణంలో పుట్టుకు వచ్చే వైరస్లు కంటిపై ప్రభావం చూపిస్తాయి. దీనికి తోడు నగరంలో విపరీతమైన రద్దీలో నలుగురైదుగురు బాధితులు సంచరించినా వైరస్ సులభంగా ఇతరులకు వ్యాపిస్తోంది. కొన్నిరోజులుగా వానలు, తడి వాతావరణం వైరస్‌కు దోహదం చేసింది. కేసులు రోజురోజుకు హెచ్చుమీరుతున్నందున జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ముందుజాగ్రత్త చర్యలు ► స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి ► ఆరోగ్యవంతమైన వ్యక్తి వైరస్ సోకిన వ్యక్తి కంటిని నేరుగా చూడరాదు, బాధితులకు దూరంగా ఉండాలి. ► వైరస్ సోకిన వ్యక్తి వినియోగించిన టవల్, ఇతరవస్తువులను వాడరాదు ► అప్పుడప్పుడు సబ్బు నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి ► వైరస్ సోకిన వ్యక్తులకు జలుబు, జ్వరం, దగ్గు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలి కళ్లకలక లక్షణాలు ♦ కళ్లు ఎర్రగా మారడం, నీరుకారడం ♦ కంటి నొప్పి – వెలుతురు చూడలేకపోవడం దృష్టి మందగించడం ♦ కంటి రెండురెప్పలు వాచిపోయి ఉబ్బెత్తుగా మారడం వైద్యులను సంప్రదించండి ♦ బాధితులు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ♦ స్వచ్ఛమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి ♦ పౌష్టికాహారం తీసుకోవాలి ♦ వీలైనంతగా ఇంట్లో విశ్రాంతిగా ఉండాలి బెంగళూరు మల్లేశ్వరం మార్కెట్లో జనరద్దీ, దీనివల్ల వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది -
కామారెడ్డి జిల్లాలో వ్యాపిస్తున్న కండ్లకలక వైరస్
-
చిలీని వణికిస్తున్న వింత వైరస్! అల్లాడుతున్న జనం, లక్షణాలివే
శాంటియాగో: గిలాన్ బరే (జీబీఎస్) అని పిలిచే అరుదైన సిండ్రోమ్ ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఏమిటీ జీబీ సిండ్రోమ్? ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తే నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగే అత్యంత అరుదైన (ఆటో ఇమ్యూన్) సిండ్రోమ్ ఇది. నరాలపై ఈ దాడి చివరికి ఒంట్లోని కండరాల వ్యవస్థ మొత్తాన్నీ పూర్తిగా నిర్విర్యం చేస్తుంది. దాంతో విపరీతమైన నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్లక్షణాలు వేధిస్తాయి. ఇది సాధారణంగా కాళ్లలో మొదలై నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్లంతా ఆక్రమిస్తుంది. జీబీఎస్ బాగా ముదిరితే పక్షావాతానికి కూడా దారి తీస్తుందని జిన్ హువా వార్తా సంస్థ పేర్కొంది. పెద్దవాళ్లకు, ముఖ్యంగా మగవాళ్లకు ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే అన్ని వయసులవారికీ దీనితో రిస్కే! కరోనాతోనూ వస్తుంది...! జీబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుందన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. తరచూ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా కాంపిలోబాక్టర్ జెజునీ బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు మాత్రం తేలింది. అయితే ఇన్ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్ బర్తో పాటు కోవిడ్ వైరస్ కూడా జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం పుష్కలంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం కలవరానికి గురి చేస్తోంది! గుర్తించడమెలా? ప్రధానంగా రోగ లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా జీబీఎస్ ఉనికి బయట పడుతుంది. ముఖ్యంగా స్పైనల్ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటివి దీన్ని కచి్చతంగా పట్టిస్తాయి. ఇవీ లక్షణాలు... జీబీఎస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరొలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే, మెషీన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సి కూడా రావచ్చు! ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుకుంటాడు! నరాలు బాగా దెబ్బ తింటాయి గనుక నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మం లోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ సలుపుతుంటుంది. ఇతర లక్షణాలు ♦ చూపు తగ్గడం, కంటి కండరాలు దెబ్బ తినడం..మాట్లాడటం, నమలడం, మింగడం కష్టంగా మారడం ♦ చేతులు, అరికాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్టు విపరీతమైన బాధ ♦ విపరీతమైన ఒళ్లు నొప్పులు, ముఖ్యంగా రాత్రిపూట ♦ శారీరక, మానసిక సమన్వయ లోపం, నిలకడలేమి ♦ హృదయస్పందన, రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడం ♦ జీర్ణాశయ, పిత్తాశయ సంబంధిత సమస్యలు చికిత్స ఉందా? జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిత్థంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ). నరాలపై దాడికి దిగకుండా రోగ నిరోధక శక్తిని ఇది నియంత్రిస్తుంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా..
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్లు రావొచ్చని ఇద్దరు ఎంటమాలజిస్టులు తనతో చెప్పారని.. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దాలని నిర్ణయించామని చెప్పారు. బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు భారీగా పెంచామని.. 2014లో రూ.2,100 కోట్లు కేటాయించగా, 2023–24 నాటికి ఏకంగా రూ.12,365 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను 17 వేల నుంచి 50 వేలకు పెంచామని, అలాగే 50 వేల ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా 2 వేల పడకలతో మరో బ్లాక్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అది వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యత! ‘‘మన రాష్ట్రంలో మిడతల బెడద లేదు. కానీ మిడతల దండు హరియాణాలోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆదిలాబాద్ సరిహద్దు దాకా వచ్చాయి. ఆ సమయంలో కేంద్రం ఇద్దరు ఎంటామాలజిస్టులను పంపింది. అయితే మహారాష్ట్రలోనే మిడతలను మట్టుపెట్టడంతో మన వరకు రాలేదు. తర్వాత ఆ ఇద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిశారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ మిడతల సమస్యకు పరిష్కారం కనుక్కోలేరా? అని నేను ప్రశ్నించాను. మనిషి 4 లక్షల ఏళ్ల క్రితం పుడితే.. మిడతలు, బ్యాక్టీరియాలు అంతకన్నా ముందు 8 లక్షల ఏళ్ల క్రితమే పుట్టాయి. వాటికి వ్యతిరేకంగా మనిషి చర్యలు చేపడితే ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే మిడతలను చంపలేమని, పూర్తిగా నిర్మూలించలేమని ఎంటమాలజిస్టులు వివరించారు. కరోనా కూడా అలాంటిదేనని, భవిష్యత్తులో దానిని మించిన వైరస్లు రావొచ్చని నాతో అన్నారు. వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. నష్టం తక్కువగా ఉంటుందని, లేకుంటే నష్టాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు. వైద్యారోగ్య శాఖ ప్రాధాన్యతను దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మానవ జీవనం ఉన్నంత కాలం వైద్యం కూడా కొనసాగుతూనే ఉంటుంది. భారీగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు నిమ్స్ ఆస్పత్రి భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం దేశ వైద్యారోగ్య రంగంలోనే చారిత్రక సందర్భం. కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందించాం. పుట్టే బిడ్డలు ఒడ్డూ పొడుగు బాగుండాలంటే వాళ్లు గర్భంలో ఎదిగే కాలంలో ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఒకసారి స్టంటింగ్ సమస్య ఏర్పడితే.. మళ్లీ ఎదుగుదల చూడాలంటే వంద సంవత్సరాల కాలం పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్తున్నవే న్యూట్రిషన్ కిట్లు. గాంధీ ఆస్పత్రి సేవలు అమోఘం కరోనా కాలంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ గొప్పగా పనిచేసింది. ఆ సమయంలో రోగులకు ధైర్యంగా సేవలు అందించిన గాంధీ ఆస్పత్రి వైద్యులను అభినందిస్తున్నా. అయితే ఎంత చేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుంచి విమర్శలు వస్తుంటాయి. నిరుపేదలు వైద్యం కోసం వస్తే.. బెడ్లు అందుబాటులో లేనప్పుడు వైద్యులు ఉదార హృదయంతో ఒక అరగంట ఎక్కువ పనిచేసైనా, కింద బెడ్డు వేసి అయినా వైద్యం అందిస్తారు. కానీ ఆస్పత్రిలో బెడ్లు లేవని, పేషెంట్లను కింద పడుకోబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుకోవాలి. సేవలు మరింత పెరగాలి వైద్యారోగ్య రంగంలో చాలా మార్పులు రావాలి. ఆస్పత్రుల నిర్మాణాలే కాదు.. ఆస్పత్రుల్లో సేవలు కూడా పెరగాలి. ఈ రోజు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, ఇంకా ఎంత ముందుకు పోవాల్సి ఉంది? జరగాల్సిన కొత్త ఆవిష్కరణలు ఏంటి? చేపట్టాల్సిన చర్యలేమిటన్న ప్రణాళికల కోసం సమయం కేటాయించాలి. ప్రజల బాగు కోసం ఇంకా ఏం చేయాలనే తపన వైద్యాధికారులకు ఉండాలి. అపవాదులను తొలగించుకొని రాష్ట్రంలో వైద్యశాఖనే నంబర్ వన్ అని పేరొచ్చేలా కృషి చేయాలి. భారీగా ఆస్పత్రుల నిర్మాణం రాష్ట్రంలో గొప్పగా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వరంగల్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఒకప్పుడు నిమ్స్‌లో 900 పడకలుంటే.. తెలంగాణ వచ్చాక 1,500 పడకలకు పెంచాం. మరో 2 వేల పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ కింద నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అద్భుతమైన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సేవలు అందుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం నిమ్స్ కార్యక్రమం సందర్భంగా.. హైదరాబాద్‌లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కూడా సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తన చేతుల మీదుగా ఆరుగురికి న్యూట్రిషన్ కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు నాగ్‌పూర్‌కు కేసీఆర్ – బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగ్‌పూర్‌కు చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. హైదరాబాద్ బయట మూడో కార్యాలయం.. నాగ్‌పూర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ వెలుపల మూడో కార్యాలయం కానుంది. ఇప్పటికే ఢిల్లీలోని వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర శాశ్వత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఏపీలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఓ అద్దె భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తాజాగా నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. త్వరలో ఔరంగాబాద్, పుణేలోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. -
గాలిలోని వైరస్‌లనూ ఖతం చేస్తుంది.. ధర ఎంతంటే?
ఇటీవలి కాలంలో రకరకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోలో కనిపిస్తున్నది వాటికి పూర్తి భిన్నమైన ఎయిర్‌ప్యూరిఫైయర్. ఇది గాలిలోని దుమ్ము, ధూళితో పాటు ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులను పూర్తిగా ఖతం చేసేస్తుంది. హాంకాంగ్‌కి చెందిన ‘హోమ్ప్యూర్’ కంపెనీ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని రూపొందించింది. ఇది ఆరు దశలలో తన పరిసరాల్లోని గాలిని శుభ్రపరుస్తుందని, కోవిడ్ వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా ఇట్టే ఖతం చేసేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఇందులోని ప్రీఫిల్టర్, ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్, హైప్రెషర్ ప్రాసెసర్లు సమ్మిళితంగా పనిచేస్తూ, గాలిలోని 0.1 మైక్రాన్ల పరిమాణంలోని సూక్షా్మతి సూక్ష్మమైన కణాలను కూడా తొలగిస్తాయని చెబుతున్నారు. దీని ధర 820 డాలర్లు (రూ. 67,767) మాత్రమే! -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 రోజులు స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే!
భారత్‌లో మెల్లమెల్లగా హెచ్3ఎన్2 వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్ ఎఫెక్ట్ తాజాగా పుదుచ్చేరికి తాకింది. ఈ నేపథ్యంలో పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. సీజనల్ ఇన్ఫ్లుఎంజా H3N2 వైరస్ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారనే నివేదికల నేపథ్యంలో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని పుదేచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా కేసులు అకస్మాత్తుగా పెరగుతూ ఆందోళన కలిగిస్తోంది. గత వారం ప్రారంభంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2 మార్చి 5 మధ్య భారత్‌లో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 23 ఏళ్ల వైద్య విద్యార్థి H3N2 వైరస్‌తో మరణించగా.. గుజరాత్‌లోని వడోదరలో ఈ వైరస్ కారణంగా మొదటి మరణం నమోదైంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. హెచ్3ఎన్2 వైరస్ పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తోంది కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్‌లను మళ్లీ అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంట పాటించడంతో పాటు మహమ్మారి సమయంలో అనుసరించిన నియమాలను మళ్లీ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. చదవండి: ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా.. -
మహారాష్ట్రలో దడపుట్టిస్తున్న H3N2.. తొలి మరణం.. పెరుగుతున్న కేసులు
ముంబై: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 దడపుట్టిస్తోంది. రోజురోజుకు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ వైరస్ సోకి అహ్మద్ నగర్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. మార్చి 14న చనిపోయిన అతనికి హెచ్3ఎన్2తో పాటు కోవిడ్ కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే విద్యార్థి మృతికి గల ప్రధాన కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇతను ఇన్ఫ్లూయెంజాతో చనిపోయినట్లు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ అదే జరిగితే మహారాష్ట్రలో ఇదే తొలి హెచ్3ఎన్2 మరణం అవుతుంది. పుదుచ్చేరిలో స్కూల్స్ బంద్.. పుదుచ్చేరిలో కూడా హెచ్3ఎన్2 వైరస్ పంజా విసురుతోంది. దీంతో పాఠశాలలను మార్చి 16 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఏ నమస్సివాయం బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా హెచ్3ఎన్2 క్రమంగా విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆస్పత్రులతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక బృందాలతో పాటు, ఔషధాలను సమకూర్చుతోంది. ఎల్ఎన్జేపీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూ.. కరోనా, ఇన్ఫ్లూయెంజాతో పాటు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరగడం కూడా ఆందోళన కల్గిస్తోంది. ఇంటిగ్రేటేడ్ డిసీజ్ సర్వైవలెన్స్ ప్రోగ్రాం గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 28 నాటికి 955 హెచ్1ఎన్1(స్వైన్ ఫ్లూ) కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తమిళనాడులో 545, మహారాష్ట్రలో 170, గుజరాత్లో 170, కేరళలో 42, పంజాబ్‌లో 28 కేసులు వెలుగుచూశాయి. మరోవైపు కోవిడ్, ఇన్‌ఫ్లూయెంజా కేసులు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. చదవండి: ఓ వైపు కరోనా.. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా.. మాస్కులు ధరించకపోతే అంతే! -
H3N2 Influenza: గుజరాత్లో తొలి హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా మరణం..
గాంధీనగర్: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా ఉపరకం H3N2 కేసులతోపాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. తాజాగా గుజరాత్లో హెచ్3ఎన్2 తొలి మరణం సంభవించింది. ఈ వైరస్‌కు గురైన 58 ఏళ్ల మహిళ వడోదరలోని ఎస్ఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్ అధికారులు మంగళవారం వెల్లడించారు. దీంతో హెచ్3ఎన్2 కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 7కు పెరిగింది. ఈ వైరస్‌కు గురై తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాకు 82 ఏళ్ల వ్యక్తి ఇన్ఫ్లుయెంజా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా జనవరి 2 నుంచి మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర వైద్యాఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే దేశంలో వైరస్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఈ నెలఖరు నాటికి కేసులు తగ్గుముఖం పట్టనున్నట్లు అంచనా వేసింది. మరోవైపు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నందున దేశంలో మాస్క్‌ల వాడకం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ప్రజలు సొంత మెడికేషన్ తీసుకోరాదని, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడవద్దని ఐసీఎంఆర్ ఇటీవల హెచ్చరించింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ నాన్ హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా అని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో పేర్కొంది. దగ్గు, ముక్కు కారడం(జలుబు), వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పి వంటి సాధారణ లక్షణాలుగా పేర్కొంది. -
దడ పుట్టిస్తున్న కొత్త వైరస్..కోవిడ్-19, H3N2 మధ్య తేడాలివే..
న్యూఢిల్లీ: జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవి కోవిడ్ లక్షణాలు కావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఇది కరోనా కాదు. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ అని చెబుతున్నారు. మరి రెండింటి లక్షణాలు ఒకేలా ఉన్నప్పుడు మీకు సోకింది కోవిడా? లేక ఇన్‌ఫ్లూయెంజానా? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా ఒక వైరస్ ఉపరకం. దీని వల్ల ఫ్లూ బారినపడి ఆస్పత్రితో చేరాల్సిన అవసరం ఇతర స్ట్రెయిన్లతో పోల్చితే అధికంగా ఉంటుంది. ఈ ఇన్‌ఫ్లూయెంజా సోకినవారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, సైనస్, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అయితే ఈ ఫ్లూ బారినపడినవారిలో దగ్గు మాత్రం త్వరగా పోదు. దగ్గు పూర్తిగా తగ్గాలంటే రెండు నుంచి మూడు వారాల వరకు పడుతుంది. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలుగు రోజుల్లోనే తెలిసిపోతాయి. హెచ్3ఎన్2 బారినపడివారిలో లక్షణాలు కన్పించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్‌ఫ్లూయెంజా బారినపడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందిచాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఐసీఎంఆర్ వివరాల ప్రకారం హెచ్3ఎన్2 సోకి ఆస్పత్రిలో చేరినవారిలో 92 శాతం మందికి జ్వరం, 86 శాతం మందికి దగ్గు, 27 శాతం మందికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కన్పించాయి. చాలా అరుదుగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వచ్చింది. కోవిడ్-19 ఇలా.. మరోవైపు కోవిడ్-19 సోకివారిలో కూడా దాదాపు ఇవే లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు ఒక్కోసారి బయటపడవు. ఒకటి నుంచి 14 రోజుల వరకు ఇవి ఉండొచ్చు. అయితే లక్షణాలు కన్పించకపోయినా.. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే కోవిడ్ సోకిన వారిలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మీకు సోకింది కోవిడా, ఫ్లూనా అని కచ్చితంగా నిర్ధరించుకోవాలంటే కరోనా టెస్టు తప్పకుండా చేయించుకోవాల్సిందేని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా బారిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా, ఫ్లూ చికిత్సకు ఉపయోగించే మందులు పూర్తిగా వేరని కూడా స్పష్టం చేసింది. చదవండి: అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్.. లక్షణాలివే..! -
అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ సూచించారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. బెంగాల్లో అడెనోవైరస్ బారినపడి ఇప్పటివరకు 19 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 13 మంది చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలున్నాయని మమత చెప్పారు. పిల్లలలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ జ్వరం ఉంటే తక్షణమే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం వివరాల ప్రకారం అడెనోవైరస్ ఫ్లూ లాంటిదే. ఇది సోకిన చిన్నారులు సాధారణ జ్వరం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల శ్వాసకోశ వ్యవస్థపై ఈవైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. అడెనోవైరస్ అన్ని వయస్కుల పిల్లలకు సోకుతుంది. అయితే ఎక్కువగా నవజాత శిశువులు, 10 ఏళ్లుపైబడిన పిల్లలు దీని బారినపడుతున్నారు. అడెనోవైరస్ లక్షణాలు ► జ్వరం ► జలుబు ► దగ్గు ► గొంతులో నొప్పి ► కళ్లు గులాబీ రంగులోకి మారడం ► న్యుమోనియా ► శ్వాసనాళాల వాపు ► జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న, శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అడెనోవైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోయాయి. దీంతో అన్ని జిల్లాల వైద్య అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమాకూర్చాలని ఆదేశించింది. చదవండి: వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక.. -
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్
-
కలకలం రేపుతున్న కొత్త వ్యాధి.. నీటితో జాగ్రత్త.. సోకితే బతకడం కష్టమే!
ఇప్పటికే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడు ఆ వైరస్ దెబ్బ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. అయితే అక్కడక్కడ వెలుగుచూస్తున్న కొత్త వైరస్లు, ఇన్ఫెక్షన్లు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఫ్లోరిడాలో ఓ వ్యక్తి మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్లోరిడాలోని షార్లెట్ కౌంటీలో ఒక వ్యక్తి తన ముక్కును పంపు నీటితో కడుక్కోవడంతో వైరస్ సోకి మరణించినట్లుగా ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. అరుదైన వ్యాధి.. సోకితే కష్టమే! బ్రెయిన్ తినే అమీబా అయిన నేగ్లేరియా ఫౌలెరీ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ధృవీకరించింది. ఇది నీటి ద్వారా మనుషులకు సోకుతుందని, ఈ క్రమంలో ప్రజలు వైరస్ బారినపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. సీడీసీ ప్రకారం, నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వెచ్చని మంచినీటిలో నివసించే ఒక అమీబా (ఏకకణ జీవి). ఇదొక అరుదైన ఇన్ఫెక్షన్. కలుషితమైన నీరు ద్వారా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది. ఈ అమీబా సోకితే మెదడుని తినేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ (అమీబా) ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది. అక్కడ అది జీవి మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది, ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే హానికరమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దీని సంక్రమణ ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణాలు తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మానసిక సమతుల్యత దెబ్బతినడం వంటివి కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే కోమాకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 154 మందిలో బయటపడింది కేవలం నలుగురు ఈ వ్యాధి బారిన పడిన వారిలో 97 శాతం మంది మరణించారని, 1962-2021 మధ్య కాలంలో యూఎస్‌లో 154 మందిలో కేవలం నలుగురు రోగులు మాత్రమే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారని రికార్డులు చెబుతున్నాయి. షార్లెట్ కౌంటీ నివాసితులందరూ నీటిని ఉపయోగించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని మరిగించి ఆ తర్వాత ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు. చదవండి: టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్! -
అరుదైన వైరస్ బారిన పడిన బుల్లితెర నటి
ఇటీవల చాలా మంది అనారోగ్యానికి గురైన వార్తలు చూస్తున్నాం. గతంలో సమంత, మమత మోహన్ దాస్, హంసా నందిని ఇలా చాలానే హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బుల్లితెర నటికి అరుదైన వైరస్ సోకినట్లు తెలిసింది. ఈ వైరస్ సోకిన వారు చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల తన భర్త, పిల్లలతో కలిసి శ్రీలంక టూర్ వెళ్లింది బాలీవుడ్ బుల్లితెర నటి దేబినా బోనర్జీ. శ్రీలంక నుంచి తిరిగొచ్చాక వైద్య పరీక్షల్లో ఆమెకు ఇన్ఫ్లుఎంజా బి వైరస్ సోకినట్లు తేలింది. ఈ వైరస్ బారిన పడినవారు చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా రోజులుగా సాధారణ జలుబు అని భావించి దానిని పట్టించుకోలేదు. కానీ జలుబు, జ్వరం తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. దీంతో ఆ పరీక్షల్లో ఇన్ఫ్లుఎంజా బి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే నటి ప్రస్తుతం కోలుకుంటున్నారని.. అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. దేబినా బోనర్జీ 2008లో వచ్చిన రామాయణంలో సీత పాత్ర పోషించింది. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌తో కలిసి నంజుండి చిత్రంలో నటించింది. ఆమె మొదటి టెలివిజన్ పాత్ర తమిళ టీవీ సీరియల్ మాయావి. ఆమె చిడియా ఘర్, అనేక రియాల్టీ షోలలో మయూరిగా కూడా కనిపించింది. -
బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి.. హెపటైటిస్-బీకి వ్యాక్సిన్ ఉంది.. కానీ,
హెపాటో లేదా హెపాటిక్ అని పిలిచే ఈ గ్రీకు పదానికి కాలేయం అని అర్థం. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. కాస్త తొలగించినా... తిరిగి పెరిగేలా... పూర్తిగా పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాల్లో అతి పెద్దదైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజితమై ఉండే కాలేయం దాదాపు కిలోన్నర వరకు బరువుంటుంది. దానికి వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. విష పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దాన్ని ‘హెపటైటిస్’ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్లు... ఏ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిల్లో బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి. రక్తమార్పిడి, అరక్షిత శృంగారం వల్ల, అలాగే తల్లి నుంచి బిడ్డకు...ఇవి సోకే ప్రమాదం ఎక్కువ. హెపటైటిస్–బి వైరస్ సోకకుండా వ్యాక్సిన్ ఉంది. కానీ... హెపటైటిస్–సి కు వ్యాక్సిన్ లేదు. అప్పటికే హెపటైటిస్–బి ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందర పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఉంటే ఏ వయసువారైనా వేయించుకోవచ్చు. ఆకలి తగ్గడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటువైద్యం వంటి సొంతవైద్యాలు చేసుకోకుండా... కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్ఫెక్షన్స్, ఫ్యాటీ లివర్, లివర్ యాబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి కాలేయ వ్యాధులున్నప్పుడు... హెపటైటిస్ బి, సి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకితే... వాటి ప్రభావంతో కొన్నేళ్ల తర్వాత కాలేయం గాయపడినట్లుగా లేదా గట్టిగా మారడం (సిర్రోసిస్), అటు తర్వాత కాలేయ క్యాన్సర్‌కు దారితీయడం ఎక్కువమందిలో జరుగు తుంది. కాలేయంలోనే మొదలయ్యే హెపాటో సెల్యులార్ కార్సినోమా అనే క్యాన్సర్... దేహంలో ఇతర ్రపాంతాల్లో క్యాన్సర్ వచ్చి అది కాలేయానికి పాకే మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్, లంగ్ క్యాన్సర్... ఇలాంటి ఏ క్యాన్సర్ అయినా కాలేయానికి పాకే ప్రమాదం ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు. కాలేయ క్యాన్సర్ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించకపోవడం వల్ల ఇతర సమస్యలుగా ΄÷రబడే అవకాశం ఎక్కువ. కడుపునొప్పి, బరువుతగ్గడం, కామెర్లు, ΄÷ట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్ క్యాన్సర్ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా... హెపటైటిస్ బి, సి వైరస్లు పాజిటివ్ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా... రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్, క్యాల్షియం, కొలెస్ట్రాల్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ (ఏఎఫ్‌పీ)ను రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, డాక్టర్ సలహా మేరకు ట్రిపుల్ ఫేజ్ సీటీ, ఎమ్మారై, పీఈటీ స్కాన్లు చేయించాలి. లివర్ బయాప్సీ చేయించడం వల్ల క్యాన్సర్, దాని స్టేజ్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే గడ్డ (కణితి) సైజు రెట్టింపు అయితే... మరికొందరిలో ఏడాది పైగా తీసుకోవచ్చు. కణితిని చిన్న సైజులో ఉన్నప్పుడే గుర్తించినా... లివర్ సిర్రోసిస్‌కు గురికావడం వల్ల చాలామందిలో సర్జరీ కుదరకపోవచ్చు. ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైటేషన్ (టీఏసీఈ), రేడియో అబ్లేషన్,ప్రోటాన్ బీమ్ థెరపీ, క్రయో అబ్లేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వంటి అనేక పద్ధతుల్లో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. గడ్డ చిన్నగా ఉండి, మిగతా కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురికాకుండా ఉంటే సర్జరీయే సరైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉంటే... కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడంతో పాటు, గతంలో ఎప్పుడైనా ఇతర క్యాన్సర్స్‌కు గురయి, చికిత్స తీసకున్నా ఎప్పటికప్పుడు కాలేయానికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా మంచిది. చాలామందిలో హెపటైటిస్–బి పాజిటివ్ ఉన్నా, ఏళ్లతరబడి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా ఆరోగ్యకరంగానే ఉండవచ్చు. కానీ వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే పరీక్షలు చేయించుకోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లయితే పుట్టిన బిడ్డకు వెంటనే 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ (హెచ్‌బీఐజీ) ఇప్పించడం మంచిది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నట్లు అనుమానం ఉన్నా, వాళ్ల రక్తం... శరీరంలో ప్రవేశించినట్లు అనుమానం ఉన్నా ముందుజాగ్రత్త చర్యగా ఆ సంఘటన జరిగిన 14 గంటలలోపే హెచ్‌బీఐజీ ఇంజెక్షన్ తీసుకుంటే హెపటైటిస్–బి పాజిటివ్ కాకుండా కాపాడుకోవచ్చు. - Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421 -
మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్! ఇప్పటికే 9 మంది మృతి.. లక్షణాలివే!
లండన్: మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్ వచ్చిపడింది. మార్బర్గ్ వైరస్ డిసీస్ (ఎంవీడీ)గా పిలిచే దీని తాలూకు తొలి కేసు గత వారంలో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్ గినియాలో నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే నిర్ధారించింది కూడా. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఆయాసం, రక్తపు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పుల వంటివి దీని లక్షణాలు. ఈ వ్యాధి తొలిసారిగా 1967లో నమోదైంది. ఎబోలాను పోలి ఉండే ఈ ప్రాణాంతక వైరస్‌కు ఇప్పటిదాకా చికిత్సేమీ లేదు! గినియాలోని కీటెం ప్రావిన్స్‌లో దీని బారిన పడి అప్పుడే 9 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘వారందరిలోనూ గుర్తు తెలియని హెమరేజ్ జ్వరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ముందు జాగ్రత్తగా మార్బర్గ్ సోకినట్టు అనుమానమున్న 200పై చిలుకు మందిని క్వారెంటైన్ చేశారు’’ అని వెల్లడించింది. దాంతో పొరుగునున్న కామెరూన్ సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత పెంచింది. ఏమిటీ వ్యాధి? ఎంవీడీ రక్తస్రావంతో కూడిన తీవ్ర జ్వరానికి దారి తీస్తుంది. దీనిబారిన పడ్డవారిలో ఏకంగా 88 శాతం మంది మృత్యువాత పడుతున్నారు! 1967లో జర్మనీ, సెర్బియాల్లో ఎంవీడీ ప్రబలింది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్ ద్వారా ఇది సోకినట్టు అప్పట్లో తేల్చారు. గబ్బిలాల వంటివాటికి ఆవాసమైన గుహలు, గనుల్లో చాలాకాలం పాటు గడిపితే ఈ వైరస్ సోకుతుంది. పైగా ఇది అంటువ్యాధి కూడా. ఒకరి నుంచి మరొకరికి సులువుగా, అతి వేగంగా సోకుతుంది. తలనొప్పి, జ్వరం, ఆయాసంతో మొదలై మూడో నాటికల్లా పొత్తి కడుపు నొప్పి, విరేచనాల దాకా వెళ్తుంది. వారం రోజులకు రక్తపు వాంతులు మొదలవుతాయి. కళ్లన్నీ లోపలికి పోయి, మనిషి పీక్కుపోయి అచ్చు దెయ్యాన్ని తలపిస్తాడు. కేంద్ర నాడీవ్యవస్థ పనితీరు కూడా బాగా మందగిస్తుంది. చికిత్స లేదు దీనికి ఇప్పటిదాకా మందు గానీ, వ్యాక్సీన్ గానీ అందుబాటులో లేవు. పలు వ్యాక్సీన్లు ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. ఇదమిత్థంగా చికిత్స కూడా లేదనే చెప్పాలి. అసలు తొలి దశలో ఎంవీడీని గుర్తించడం కూడా చాలా కష్టం. -
Aston University: వైరస్‌కు ప్రతి సృష్టి!
లండన్: మానవ చరిత్రలో తొలిసారిగా వైరస్‌కు కంప్యూటర్ సాయంతో యథాతథంగా ప్రతి సృష్టి చేశారు! గతంలోనూ ఇలాంటివి జరిగినా జీవపరంగా, 3డి నిర్మాణపరంగా, జన్యుపరంగా ఓ వైరస్‌ను అచ్చుగుద్దినట్టుగా పునర్నిర్మించడం ఇదే తొలిసారట! బ్రిటన్‌లోని ఆస్టన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ద్మిత్రీ నెరుక్ ఈ ఘనత సాధించారు! అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు వాడినా కూడా ఈ పరిశోధనకు ఏకంగా మూడేళ్లు పట్టిందట! ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైరస్ నిర్మాణాలను క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ, కంప్యుటేషనల్ మోడలింగ్ సాయంతో పరిశీలించారు. ‘‘ఇంతకాలం పాటు వైరస్ల పూర్తి జన్యు నిర్మాణక్రమం అందుబాటులో లేని కారణంగా వాటి తాలూకు జీవక్రియలపై మనకు సంపూర్ణ అవగాహన లేదు. తాజా అధ్యయనం ఈ విషయంలో దారి చూపగలదు’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘అంతేగాక ఈ పరిశోధన వల్ల యాంటీబయాటిక్స్‌కు మెరుగైన, సమర్థమైన ప్రత్యామ్నాయాల దిశగా కొత్త దారి దొరుకుతుంది. యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా సమస్యకూ పరిష్కారం లభిస్తుంది’’ అని వారంటున్నారు. ఈ అధ్యయనం ఫారడే డిస్కషన్స్ జర్నల్‌లో పబ్లిషైంది. -
వైరస్‌లను భోంచేస్తుంది
వాషింగ్టన్: వైరస్లు. ఈ పేరంటేనే మనకు హడల్. కరోనా వంటి పలు రకాల వైరస్లు మనకే గాక ఇతర జీవ జాతులకూ ప్రాణాంతకాలు కూడా. అలాంటి వైరస్‌లనే లంచ్‌లోకి నమిలి మింగేసే ఒక వింత జీవి ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నీళ్లలో తమ పరిధిలో ఉన్న నానా రకాల క్లోరో వైరస్‌లనూ అదీ ఇదీ అని లేకుండా ఇది భారీ సంఖ్యలో తినేస్తుందట! ఈ సూక్ష్మ జీవిని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా–లింకన్స్ పరిశోధకులు తొలిసారిగా కనిపెట్టారు. దీన్ని స్వచ్ఛమైన నీటిని కలుషితం చేసే హాల్టేరియా అనే సూక్ష్మజీవుల్లో ఓ జాతికి చెందినదిగా గుర్తించారు. ఇది మరో భోజనంతో పని లేకుండా కేవలం వైరస్‌లను మాత్రమే తిని సుష్టుగా పెరుగుతుందని, తమ సంతతినీ వృద్ధి చేసుకుంటోందని వారి పరిశోధనల్లో తేలడం విశేషం. పరిశోధనలో భాగంగా ఓ మంచినీటి కొలను నుంచి నీటిని సేకరించారు. అందులోకి క్లోరో వైరస్‌లను వదిలారు. కొంతకాలానికి వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతుండటం వారిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో మరో రకం సూక్ష్మజీవులు పరిమాణంలో మామూలు కంటే ఏకంగా 15 రెట్లు పెరిగిపోతున్న వైనమూ కంటబడింది. వాటిని హాల్టేరియాగా గుర్తించారు. తినడానికి మరేమీ అందుబాటులో లేకపోవడంతో అవి హాయిగా క్లోరో వైరస్‌లనే తిని అరాయించుకుని అంతలా పెరిగాయట! ఈ పరిశోధన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడెమీ సైన్సెస్’లో పబ్లిషైంది. దీని ఫలితాలు ఆహారచక్రం గురించిన మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తాయని పరిశోధన బృందానికి చెందిన డాక్టర్ డిలాంగ్ అంటున్నారు. -
మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా?
మాస్కో: ప్రమాదకరమైన జాంబీ వైరస్. రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఓ సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల నడుమ గడ్డకట్టిన స్థితిలో నిద్రాణంగా పడి ఉంది. దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే లక్షణమున్న ఈ వైరస్ కరోనాను మించిన పెను ఆరోగ్య విపత్తుకు దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇలాంటి దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్‌లను శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నిత్యం సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో కూడా మంచు పలకలు వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. దాంతో ఇంతకాలంగా వాటి కింద నిద్రాణంగా ఉన్న ఇలాంటి ప్రమాదకర వైరస్‌లెన్నో ఒళ్లు విరుచుకుని మానవాళిపైకి వచ్చి పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందమే 2013లో ఇలాగే 30 వేల ఏళ్ల నాటి వైరస్‌లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ పండోరా వైరస్ ఎడొమాగా పేర్కొనే జాంబీ వైరస్‌ను కనిపెట్టిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. -
గుర్తు తెలియని వైరస్ సోకడంతో ఇంగ్లాండ్ క్రికెటర్లకు అస్వస్థత
-
వార్నింగ్: ఆ వైరస్ కొత్త వెర్షన్‌తో వచ్చింది, ఇలా చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్. డ్రినిక్ ఆండ్రాయిడ్ ట్రోజన్ కొత్త వెర్షన్ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్ అనేది పాత మాల్వేర్. ఈ వైరస్ మీ ఫోన్ స్క్రీన్ రికార్డింగ్‌లతో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకులకు సంబంధించి పిన్, సీవీవీ నంబర్లను తస్కరిస్తుంది. ఇప్పటికే 18 భారతీయ బ్యాంకులు ఈ వైరస్ భారిన పడినట్లు సమాచారం. ఈ మాల్వేర్ పట్ల అప్రమత్తం ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. వార్నింగ్: పాత వైరస్, కొత్త వెర్షన్.. ఏపీకే(APK) ఫైల్‌తో ఎస్ఎంఎస్(SMS) పంపడం ద్వారా యూజర్లను డ్రినిక్ లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇది iAssist అనే యాప్‌తో వచ్చింది. భారత్ ఆదాయపు పన్ను శాఖ అధికారిక పన్ను నిర్వహణ టూల్ మాదిరిగానే పనిచేస్తుంది. ఆదాయపు పన్ను రీఫండ్ల పేరుతో వినియోగదారలు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది. 2016 లో వార్తల్లో నిలిచిన ఈ వైరస్ కొంత కాలం గ్యాప్ తీసుకుని ఆధునిక టెక్నాలజీ సామర్థ్యంతో అదే మాల్వేర్ లేటస్ట్ వెర్షన్ మళ్లీ దాడికి సిద్ధమైంది. భారత్‌లో యూజర్లను, 18 నిర్దిష్ట భారతీయ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఈ బ్యాంకులలో, ఎస్బీఐ (SBI) వినియోగదారులను డ్రినిక్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, కొన్ని ఆఫ్షన్స్‌తో అనుమతులు మంజూరు చేయమంటుంది. అలా అనుమతించిన యూజర్ల ఫోన్లలో ఎస్ఎంఎస్లను పొందడం, చదవడం, పంపడం, కాల్ లాగ్‌ను చదవడం, ఔట్ స్టోరేజీ చదవడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారుకు తెలియకుండానే నిర్దిష్ట విధులను నిర్వహించే అవకాశాన్ని పొందుతుంది. యాప్ నావిగేషన్, రికార్డ్ స్క్రీన్, కీ ప్రెస్‌లను క్యాప్చర్ చేయగలదు. యాప్ అన్ని అనుమతులతో పాటు దానికి కావలసిన ఫంక్షన్లకు యాక్సెస్‌ను పొందగానే వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంది. జాగ్రత్త అవసరం థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి లేదా SMS ద్వారా ఏదైనా యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర (Google Play Store) లేదా యాపిల్ (Apple) యాప్ స్టోర్‌లో యాప్‌లను చెక్ చేయాలి. వాస్తవానికి ప్రాథమిక విధులను నిర్వహించేందుకు అన్ని యాప్‌లకు అనుమతి అవసరం లేదు. కానీ తెలియని యాప్‌కు ఎస్ఎంస్, కాల్స్‌కు సంబంధించిన అనుమతులను ఇవ్వకపోవడం ఉత్తమం. చదవండి: NammaYatri దూకుడు: ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ -
బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి!
టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాటు ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పాటు బ్యాంకులు కూడా ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లోన్లోనూ వారి సేవలను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. ప్రస్తుతం లాక్డౌన్ నుంచి దుకాణాల్లో చెల్లింపులు, ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు అన్నీ డిజిటల్ రూపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా హ్యకర్లు బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించారు. మొబైల్ ఫోన్లకు వివిధ రకాలుగా మెసేజ్‌లు పంపుతున్నారు. కస్టమర్లు కూడా అవి వైరస్ లింకులని తెలియక క్లిక్ చేసి వారి ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. చివరికి ఖాతాలు ఖాళీ అయ్యాక లోబదిబోమంటున్నారు. బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యం.. జర జాగ్రత్త గురూ తాజాగా బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ‘సోవా’ (SOVA) అనే వైరస్ లింకులను మెసేజ్ రూపంలో ఫోన్లకు పంపుతున్నారు. అది క్లిక్ చేయగానే బ్యాంకింగ్ యాప్‌ల పాస్వర్డ్, లాగిన్ వివరాలతో పాటు పాస్వర్డ్ కూడా నేరగాళ్లకు చేరుతోంది. ఈ విషయంపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పలు బ్యాంకులు హెచ్చరికలు జారీ చేశాయి. సోవా వైరస్ పలు రకాలుగా బ్యాంకింగ్, పేమెంట్ లావాదేవీలను గుర్తించడంతో పాటు క్రిప్టోకరెన్సీ వాలెట్లనూ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు బయటపడింది. బ్యాంకులు ఏమంటున్నాయంటే.. అనధికారిక వెబ్సైట్లలో ఉండే ఏ లింక్‌పై కూడా క్లిక్ చేయడం మంచిది కాదని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎస్బిఐ, యాక్సిస్, వంటి బ్యాంకింగ్ యాప్‌లు కూడా కేవలం అఫిషియల్ ప్లే స్టోర్, అధికారిక వైబ్సైట్ల నుంచి మాత్రమే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వెబ్సైట్ల నుంచి ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నా, లేదా డౌన్లోడ్ చేసుకుని ఉన్న ప్రమాదమేనని, అలాంటి యాప్‌లను వెంటనే డెలీట్ చేయడం ఉత్తమమని చెప్తున్నాయి. ఎలా పని చేస్తుంది ఈ వైరస్.. ఎస్బీఐ(SBI) తెలిపిన సమాచారం ప్రకారం.. సోవా(SOVA) అనేది ఒక ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్. ఇది బ్యాంకు యాప్స్‌లోకి వెళ్లి కస్టమర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తుంది. అంతేకాకుండా యూజర్ల పర్సనల్ క్రెడెన్షియల్స్ అయిన లాగిన్, పాస్వర్డ్ వంటి ముఖ్యవివరాలను కూడా గ్రహించి వారి అకౌంట్లలోకి యాక్సెస్ పొందుతుంది. ఒకసారి ఈ వైరస్ ప్రవేశిస్తే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తుంది. అందుకే ముందుగానే ఈ వైరస్‌ని మొబైల్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవడం ఉత్తమం. చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
Khosta-2: గబ్బిలాల నుంచి మానవాళికి కొత్త వైరస్!
కరోనాకి ముందు.. కరోనా తర్వాత అన్నచందాన తయారు అయ్యింది మనిషి పరిస్థితి. కొత్త కొత్త వైరస్లు, వ్యాధుల పేర్లు వినాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు గబ్బిలాల నుంచే మానవాళికి మరో ముప్పు పొంచి ఉందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఖోస్టా-2.. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న వైరస్ పేరు. ఇది రష్యా గబ్బిలాలో 2020లోనే గుర్తించామని, అది ఆ సమయంలో అది మనుషులకు అంతగా ప్రమాదం కలిగిస్తుందని అనుకోలేదని సైంటిస్టులు చెప్తున్నారు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం.. ఇప్పుడు ఇది మనిషి కణజాలంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని, వైరస్ గనుక మనుషులకు వ్యాపిస్తే.. విజృంభణ, ముప్పు రెండూ తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జర్నల్ పీఎల్ఓఎస్లో పబ్లిష్ చేశారు. కరోనా కంటే డేంజర్! Khosta-2.. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ అని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనిషి కణాలకు ఇన్ఫెక్షన్ సోకించడంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్లకు ఈ వైరస్ నిరోధకతను కలిగి ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు. అంటే.. కరోనా వైరస్ నుంచి ఉపశమనం కోసం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్పైనా తీవ్ర ప్రభావం కూడా చూపెడుతుందని వెల్లడించారు. ఖోస్టా-2 అంటే.. ఖోస్టా-2.. సార్స్-కోవ్-2కి చెందిన వైరస్. ఇది కూడా కరోనావైరస్లోనే ఉపవర్గానికి చెందిన వైరస్సే. టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఖోస్టా-1 అనేది మనుషులకు సోకదు. కానీ, ఖోస్టా-2 మాత్రం మనుషుల్లో ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్న వాళ్లు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు దీని బారి నుంచి తప్పించుకోలేరు. Omicron వేరియంట్ లాగా.. ఈ వైరస్‌లో తీవ్రమైన వ్యాధిని కలిగించే జన్యువులు లేవని పరిశోధకులు అంటున్నారు. కానీ SARS-CoV-2 జన్యువులతో కలిస్తే అది చివరికి మారే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం నిర్వహించిన మైకేల్ లెట్కో. గబ్బిలాలతో పాటు పాంగోలిన్స్, రకూన్ డాగ్స్, పామ్ సివెట్స్ జీవుల ద్వారా ఖోస్టా-2 వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ వైరస్ విజృంభణపై, వ్యాక్సినేషన్ తయారీపై ఒక అంచనాకి రాలేమని ఆయన అంటున్నారు లెట్కో. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత వ్యాక్సిన్లు మానవ కణజాలంపై ప్రభావం చూపెడుతున్న.. నిర్దిష్ట వైరస్ల కోసం రూపొందించబడుతున్నాయని, అన్ని సార్బెకోవైరస్ల నుంచి రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనే నమ్మకం సన్నగిల్లుతోందని అని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: ఈ దోమలు.. మలేరియాను అడ్డుకుంటున్నాయోచ్! -
ఎదురీదుతున్న వనామీ.. భారీ వర్షాలతో వైరస్ల ముప్పు
భీమవరం అర్బన్: ఈ ఏడాది వనామీ రొయ్య గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జూన్ నెల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రొయ్యల పెంపకం రైతుకు కత్తిమీద సాములా మారింది. చెరువులలో వనామీ రొయ్య పిల్లలు వదిలిన 15 రోజుల నుంచి నెల రోజుల లోపే వైట్ స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకి చనిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, కాళ్ల, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, ఆచంట, పాలకోడేరు తదితర మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్యల పెంపకం చేస్తున్నారు. ఏడాదికి జిల్లా నుంచి 2 లక్షలకు పైగా టన్నులు చైనా, సింగపూర్, దక్షిణకొరియా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతవుతున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని మత్స్యశాఖ అధికారుల అంచనా. వనామీ రొయ్యలు 2 నుంచి 3 నెలలు మధ్య పట్టుబడికి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఈ రొయ్యలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిక వర్షాలతో వైరస్ల ముప్పు జూన్ నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వనామీ రొయ్యల పిల్లలకు వైట్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు సోకడంతో నెల రోజులు లోపే మృత్యువాత పడుతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి చేపలు పెంచుతున్నారు. (క్లిక్ చేయండి: అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!) భారీగా పెరిగిన రొయ్య ధరలు గత మూడు నెలలుగా జిల్లాలో పట్టుబడికి వచ్చిన కౌంట్ రొయ్యలు తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రొయ్యలకు ఆర్డర్లు రావడంతో రొయ్య ధరకు రెక్కలు వచ్చాయి. 100 కౌంట్ రూ.280, 90 కౌంట్ రూ.290, 80 కౌంట్ రూ.310, 70 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ. 340, 50 కౌంట్ రూ.360, 45 కౌంట్ రూ.370, 40 కౌంట్ రూ.400, 30 కౌంట్ రూ. 450, 25 కౌంట్ రూ.540 ధర పలుకుతుంది. రొయ్యల వ్యాపారస్తులు దూరం, టన్నుల మేరకు ధరలు మారుతున్నారు. వర్షాలతో రొయ్యకు వైరస్ అధిక వర్షాల కారణంగా వనామీ రొయ్యకు వైట్‌స్పాట్, విబ్రియో వైరస్లు సోకడంతో సీడ్ దశలోనే మృత్యువాత పడుతున్నాయి. కౌంట్‌కు వచ్చిన రొయ్యలు పట్టుబడులు లేకపోవడంతో రొయ్యల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, ఏడీ, మత్స్యశాఖ, భీమవరం ధరలు ఒకేలా ఉండేలా చూడాలి రొయ్యలకు వేసే 25 కేజీల మేత రూ.2500 అయింది. ఎండాకాలంలో రొయ్యల ధరలు అమాంతం తగ్గిస్తున్నారు. అన్ సీజన్లో రొయ్యల ధరలు పెంచుతున్నారు. వనామీ పెంపకంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. సన్న, చిన్నకారు రైతులు చేపల పెంపకం చేస్తున్నారు. ఎప్పుడూ రొయ్యల ధరలు ఒకేలా ఉండేలా చూసి రైతులను ఆదుకోవాలి. – జడ్డు రమేష్ కుమార్, రైతు, గూట్లపాడురేవు -
వార్నింగ్: షార్క్‌బాట్ వచ్చేసింది.. మీ స్మార్ట్ఫోన్లలో ఆ యాప్స్‌ని డెలీట్ చేయండి!
గత దశబ్ద కాలంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే దీని వల్ల బోలెడు లాభాలు ఉన్నా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు కూడా ఉంటాయని సైబర్ నిపుణులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లో మాల్వేర్ షార్క్‌బాట్ (SharkBot Malware) అనే వైరస్ ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇది యాంటీవైరస్, క్లీనర్ వంటి యాప్‌ల రూపంలో ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తే ఇక అంతే.. అల్బెర్టో సెగురా అనే మాల్వేర్ విశ్లేషకుడు ఆండ్రాయిడ్ యూజర్లను అప్రమత్తం చేసేందుకు తన ట్విట్టర్లో ఈ డేంజరెస్ సాఫ్ట్వేర్ గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ప్రధానంగా ఇది మిస్టర్ ఫోన్ క్లీనర్( Mister Phone Cleaner), కైల్హావీ మొబైల్ సెక్యూరిటీ ( Kylhavy Mobile Security) యాప్‌ల రూపంలో దాగి ఉంటుంది. ముఖ్యంగా యూజర్ల బ్యాంకింగ్, క్రిప్టో సంబంధిత యాప్‌లను ప్రభావితం చేస్తుందన్నారు. అంతేకాకుండా అకౌంట్స్ నుంచి కుకీలను దొంగిలించగలదని చెప్పారు. ఈ మాల్వేర్ షార్క్‌బాట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, డివైజ్‌లోని 'ఫింగర్‌ప్రింట్‌తో లాగిన్' ఫీచర్‌ని పని చేయకుండా చేస్తుంది. దీంతో యూజర్ తప్పకుండా తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు పాస్వర్డ్, యూజర్ డీటైల్స్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. షార్క్‌బాట్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా అధిగమించగలదు. చివరికి ఈ మాల్వేర్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ టెక్నిక్ ఉపయోగించి యూజర్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభిస్తుంది. కనుక ఆ రెండు యాప్‌లు డౌన్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గణాంకాల ప్రకారం, మిస్టర్ ఫోన్ క్లీనర్ యాప్‌ని ఇంతవరకు 50,000 పైగా డౌన్లోడ్ నమోదు కాగా, Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, ఈ యాప్ 10,000 కంటే ఎక్కువ డౌన్లోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
వైరస్ల విరుగుడుకు ప్రత్యేక ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనా వంటి మహ మ్మారులను నియంత్రించేందుకు... వైరస్‌లకు విరుగుడుగా పనిచేయగల మందులను గుర్తించేందుకు యాంటీ వైరల్ మిషన్ పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మందులుగా ఉపయోగపడగల రసాయన పరమాణువుల బ్యాంక్ (మోల్ బ్యాంక్) వైరస్‌లను నాశనం చేసేందుకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలుసుకొనేందుకు ఈ మిషన్ ఉపకరించనుందని తెలిపారు. అయితే గుర్తించిన మందులను పరీక్షించేందుకు బీఎస్ఎల్–3 స్థాయి పరిశోధనశాల అవసరమవుతుందని, దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే పదవీబాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తన ప్రాథమ్యాలను వివరించారు. కొత్త రసాయనాలు దోమల్ని చంపేస్తాయి.. డెంగీ, జీకా వంటి వైరల్ వ్యాధులు ప్రబలేందుకు కారణ మైన దోమలను నియంత్రించేందుకు ఇప్పటికే వినూత్న రసాయనాలను గుర్తించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న రిపెల్లెంట్ల రసాయనాల గాఢత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. తాము గుర్తించిన కొత్త రసాయనాలు సహజసిద్ధమైన వాటిని పోలి ఉన్నందున ప్రమాదం తక్కువని... పైగా ఇవి దోమలను నిరోధించడమే కాకుండా చంపేస్తాయన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలతో కలసి ఈ రసాయనాలను పరీక్షించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధులకు కొత్త మందులు కనుక్కునేందుకు సిలికాన్ స్విచ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. యువ శాస్త్రవేత్తలూ కష్టే ఫలి... సమాజ హితానికి సైన్స్ ఎంతో ఉపయోగపడుతున్నందున శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాజానికి మేలు జరిగేలా చూడాలని శ్రీనివాసరెడ్డి కోరారు. యువ శాస్త్రవేత్తలు కష్టే ఫలి సిద్ధాంతాన్ని గుర్తించాలన్నారు. అవార్డులు అనేవి కష్టానికి దక్కే ప్రయోజనాలు మాత్రమే అన్నారు. ప్రాజెక్టు అసిస్టెంట్ నుంచి ఐఐసీటీ డైరెక్టర్ దాకా.. నల్లగొండ జిల్లా శోభనాద్రిపురానికి చెందిన సాధార ణ రైతు కుటుంబంలో పుట్టిన డాక్టర్ డి.శ్రీనివాసరె డ్డి దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఐఐసీటీ డైరెక్టర్ స్థానాన్ని చేపట్టడం ఒక విశేషమైతే..జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లకు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఐఐసీటీకే ఆయన డైరెక్టర్‌గా రావడం గమనార్హం. సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా... ‘రైతు కుటుంబంలో పుట్టిన నేను టెన్త్ వరకు రామన్నపేటలో, ఇంటర్ సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో, బీఎస్సీ (బీజెడ్సీ) సర్దార్ పటేల్ కాలేజీలో చేశా. ఖర్చులకు అవసరమైన డబ్బు సంపాదన కోసం వార్తాపత్రికల పంపిణీ, హోం ట్యూషన్లు, కట్టెల మండీలో పని చేశా. ఆ దశలోనే ఓ సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా. నిజాం కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ తర్వాత పీహెచ్డీ చేద్దామనుకున్నా ఫెలోషిప్ లేక ఐఐసీటీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా చేరా. కొంతకాలానికి సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పాసై ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా వద్ద పీహెచ్డీ (సెంట్రల్ యూనివర్సిటీ) చేశా. షికాగో, కాన్సస్ యూనివర్సిటీల్లో చదువుకున్నాక భారత్‌కు తిరిగి వచ్చి పలు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశా. ఆపై విద్యాబోధన వైపు మళ్లా. 2010లో పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో చేరా. 2020లో జమ్మూలోని ఐఐఐఎంకు డైరెక్టర్‌గా ఎంపికయ్యా’ అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. -
హైదరాబాద్ లో మంకీపాక్స్ కలకలం..?
-
Viruses Alert: ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ నిర్ధారణ!
వాషింగ్టన్: ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న క్రమంలోనే మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మంకీపాక్స్‌ను సైతం ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం మంకీపాక్స్ ఇతర పద్ధతుల్లోనూ ఇతరులకు సోకుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఒకే వ్యక్తిలో కరోనా వైరస్, మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది. అమెరికాకు చెందిన వ్యక్తిలో రెండు వైరస్‌లను శనివారం గుర్తించారు. ఇలా ఒకే వ్యక్తిలో రెండు వైరస్లు గుర్తించటం తొలిసారిగా అగ్రరాజ్యం అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్ కు జూన్‌లో కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వీపు, కాళ్లు, చేతులు, మెడపై ఎర్రటి బొబ్బలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా అది మంకీపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ‘నాకు మంకీపాక్స్, కరోనా వైరస్ రెండూ ఉన్నాయని వైద్యులు కచ్చితంగా చెప్పారు.’ అని ఓ ఛానల్‌కు తెలిపారు మిట్కో థాంప్సన్. ఇన్‌ఫ్లూయెంజా కేసుగా మారిందని, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవటం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇద్దరు పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ఈ వైరస్ సన్నిహితంగా మెలిగిన వారికి సోకుతుంది. ఫ్లూ, శరీరంపై బొబ్బల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్ వేగంగా విజృభిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. జులై 19న అత్యధికంగా ఒక్క రోజే 1.7 లక్షల కేసులు వచ్చాయి. -
మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన
మంకీపాక్స్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలకు వైరస్ వేగంగా వ్యాప్తి చేందుతుండటంతో మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా(ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితి) ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ మంకీపాక్స్ వ్యాధిని అసాధరణ పరిస్థితిగా పేర్కొంది. కాగా 2009 నుంచి డబ్ల్యూహెచ్‌వో ఏడుసార్లు ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని డిక్లేర్ చేసింది. చివరిసారిగా 2020లో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రకటించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ ప్రస్తుతం భారత్‌ను భయపెడుతోంది. దాదాపు 70 దేశాలకు మంకీపాక్స్ విసర్తించింది. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో మూడు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం గమనార్హం. 16 దేశల్లోని మనషుల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ విస్తరించింది. జంతువుల నుంచి వ్యాప్తి చెందే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Monkeypox: దేశంలో మూడుకి చేరిన మంకీపాక్స్ కేసులు -
భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. కేరళలో రెండో కేసు..
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన కన్నూర్ జిల్లాకు చెందిన 31 వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం వెల్లడించారు. వైరస్ సోకిన వ్యక్తి ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచామని, కొందని నమూనాలను టెస్ట్‌లకు పంపినట్లు పేర్కొన్నారు. కాగా భారత్‌లో మంకీపాక్స్ తొలికేసు కూడా కేరళలోనే నమోదైన విషయం తెలిసిందే. "The 31-year-old man from Kannur is currently undergoing treatment at Pariyaram Medical College. The patient's health condition is reported to be satisfactory. Those in close contact with him have been put under surveillance," says Kerala Health Minister Veena George (File Pic) pic.twitter.com/4G7q0s3bq8 — ANI (@ANI) July 18, 2022 దేశంలో మంకీపాక్స్ వెలుగుచూసిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. మరోవైపు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండే దిశగా కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అయిదు జిల్లాలకు (తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్టా, అలప్పుజా, కొట్టాయం) ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రయాణించిన విమానంలో చాలామంది ప్రయాణికులు ఈ ప్రాంతానికి చెందినవారే. ఆ ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లక్షణాలు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ ప్రస్తుతం భారత్‌ను భయపెడుతోంది. యూరప్ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రాణాంతక వైరస్ భారత్‌లోనూ అలజడి సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ మంకీపాక్స్ భారత్ సహా 50 దేశాలకు విస్తరించింది. దీని కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. జంతువుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. -
పంది గుండె మార్పిడి చేయించుకున్న రోగి చనిపోవడానికి కారణం అదే...
Animal virus detected in patient: ఇటీవలే పందిగుండె అమర్చిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతను ఎందువల్ల చనిపోయాడు కారణాలేంటి అనే దానిపై వైద్యులు పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పంది గుండెని అమర్చి ప్రపంచ చరిత్రోలోనే ఒక సంచలనాత్మక ప్రయోగానికి నాంది పలికారు. ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. ఇది వైద్యశాస్రంలోనే ఒక సరికొత్త అధ్యయనం అని అందరూ ఆనందించేలోపే ఆ వ్యక్తి సర్జరీ జరిగిన రెండు నెలల్లోనే చనిపోయాడు. వైద్యులు కూడా అతన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందని పరిశోధనలు చేస్తున్న వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈమేరకు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మాట్లాడుతూ... పంది గుండె లోపన వైరల్ డీఎన్ఏ ఉంది. పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయాం. జంతువుల నుంచి మనుషులను అవయవాలను అమర్చినప్పుడూ కొత్త ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని వైరస్లు చాలా గుప్తంగా ఉంటాయి. సర్జరీకి ముందు బెన్నెట్ మానవ గుండె మార్పిడికీ అనర్హుడని, పైగా అతనికి వ్యాధి నిరోధక శక్తి తక్కువని తెలిసే జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చాం. పైగా ఆ వైరస్ భారిన పడకుండా ఉండేలా అతని అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించాం. మా బృందం దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది. అంతేకాదు ఆ పంది అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించేలా పెంచే ప్రత్యేక సదుపాయంలో ఉంది. బెన్నెట్‌కి యాంటీ వైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను అందించాం. అని అన్నారు. బెన్నెట్ సర్జరీ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్త చర్యగా వైరల్ ఇన్ఫెక్టకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఐతే పంది గుండే ఉబ్బిపోయి ద్రవంతో నిడిపోయి పనిచేయడం మానేసిందన్నారు. కానీ ఈ పంది వైరస్ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో స్పష్టం చేయలేదు. (చదవండి: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత) -
కొత్తగా 256 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 25,341 మందికి కరోనా పరీక్షలు చేయగా, 256 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.86 లక్షలకు చేరుకుంది. తాజాగా 767 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 7.77 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 4,109 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం 5,135 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. -
ఊహకందని విషయమిది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం యాక్టివ్‌గా వైరస్?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని రెండేళ్లుగా అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు మనం ఊహిస్తున్న, అంచనా వేస్తున్న దానికన్నా మరింత ఎక్కువ కాలం మనుషుల శరీరంలో వైరస్ యాక్టివ్‌గా ఉంటుందని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. పాజిటివ్‌గా తేలిన 14 రోజుల తర్వాత కూడా చాలా మంది యాక్టివ్ వైరస్‌ను వెదజల్లే అవకాశముందని, కొందరిలో 7 నెలలకు పైగానే యాక్టివ్‌గా ఉండొచ్చని వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రాంటియర్స్ ఇన్ మెడిసిన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన పాస్చర్ ఇన్స్టిట్యూట్, ది యూనివర్సిటీ ఆఫ్ సావ్పౌలో (యూఎస్పీ), బ్రెజిల్‌లోని ఆస్వాల్డో క్రజ్ ఫౌండేషన్, ఇతర అంతర్జాతయ శాస్త్రవేత్తల బృందం కలిసి ఈ పరిశోధన చేశాయి. ఒక్కొక్కరిలో ఒక్కోలా..! బ్రెజిల్‌లోని కొందరు కరోనా పేషెంట్లకు పరిశోధకులు వరుస పరీక్షలు చేశారు. నెగెటివ్ వచ్చే దాకా రెండు, మూడుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళలో 70 రోజులకు మించి వైరస్‌ను గుర్తించినట్టు వెల్లడించారు. దీన్ని బట్టి వైరస్ సోకిన వారిలో 8 శాతం మంది 2 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు కరోనాను వ్యాప్తి చేసే అవకాశాలున్నాయని వాళ్లు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత చివరి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని అంటున్నారు. 38 ఏళ్ల ఓ వ్యక్తిలో 20 రోజులు స్వల్ప లక్షణాలే కనిపించినా అతని శరీర వ్యవస్థల్లో 232 రోజుల పాటు వైరస్ కొనసాగినట్టు, మ్యుటెషన్లు జరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాకు ఆ వ్యక్తి క్రమం తప్పకుండా చికిత్స తీసుకోకుండా, మాస్క్ ధరించకుండా, వ్యక్తుల మధ్య దూరం పాటించకుండా ఉండి ఉంటే ఆ 7 నెలల్లో ఎంతో మందికి వైరస్ వ్యాప్తి చెందించి ఉండేవాడని చెప్పారు. 14 రోజుల తర్వాత కూడా.. కరోనా వచ్చాక 14 రోజుల తర్వాత కూడా ప్రజలు ‘యాక్టివ్ వైరస్’ను కలిగి ఉండి ఇతరులకు వ్యాప్తి చెందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన పౌలా మినోప్రియో వెల్లడించారు. అందువల్ల కరోనా సోకిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మరిన్ని మ్యుటేషన్లు, కొత్త వేరియెంట్లు వచ్చే అవకాశాలపై కన్నేసి ఉంచొచ్చని అంటున్నారు. పేషెంట్‌కు నెగెటివ్ రావడానికి నెల రోజులు పడుతుందని, కొన్ని కేసుల్లో 71 రోజుల నుంచి 232 రోజుల వరకు ఉండొచ్చని అధ్యయనం చెబుతోందన్నారు. ఐతే ఇలా వ్యాప్తి జరిగి అందరిలో యాంటీబాడీస్ ఏర్పడే అవకాశముందని కొందరు అంటున్నారు. -
మొన్న డెల్టా, ఒమిక్రాన్.. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఫ్లురోనా.. అసలు దీని కథేంటి?
కరోనా రావడమేమో గానీ అది ప్రజలకు చాలా కొత్త పదాలు నేర్పింది. ఉదాహరణకు... స్ట్రెయిన్, వేరియంట్, డెల్టా, ఒమిక్రాన్... లాంటివి. తాజాగా ఇప్పుడు ‘ఫ్లురోనా’ అనే సరికొత్త పదం కూడా మంచి ట్రెండింగ్‌లో ఉంది. అదేదో మనమూ తెలుసుకుందాం రండి. ఇజ్రాయెల్‌లో ఇద్దరు గర్భిణులకు అటు ‘కరోనా’తో పాటు ఇటు ఇన్ఫ్లుయెంజాగా పిలిచే ‘ఫ్లూ’ లక్షణాలు కనిపించడంతో మొట్టమొదటిసారిగా ‘ఫ్లురోనా’ అనే పదం పుట్టింది. తొలుత ఇజ్రాయెల్‌లో, ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్, ఫిలిప్పిన్స్, హంగరీలలోనూ ఈ తరహా కేసులు రావడం మొదలైంది. సాధారణ కరోనా లక్షణాలైన రుచీ, వాసనలు కోల్పోవడంతో పాటు ‘ఫ్లూ’లో విస్తృతంగా కనిపించే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను గమనించిన డాక్టర్లు... ఈ కొత్త వ్యాధిని ‘ఫ్లురోనా’గా పిలవడం మొదలుపెట్టారు. చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు అన్నట్టు సమస్య పాతదా, కొత్తదా? ‘ఫ్లురోనా’ కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ... ఈ సమస్య పాతదా, కొత్తదా అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. ఎందుకంటే 2020 ఫిబ్రవరిలో ఇలాంటి లక్షణాలతోనే ఓ వ్యక్తి న్యూయార్క్ హాస్పిటల్లో చేరినట్టు ‘ద అట్లాంటిక్’ అనే జర్నల్ వెల్లడించింది. ఈ వ్యక్తిని పరీక్షించినప్పుడు తొలుత అతడికి ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉందనీ, కొన్ని వారాల తర్వాత మళ్లీ పరీక్షించినప్పుడు ఈసారి కరోనా కూడా ఉందని తేలింది. దాంతో వారాల వ్యవధిలో అతడి కుటుంబ సభ్యులందరినీ పరీక్షించగా వారందరికీ ఇటు ‘కరోనా’ అటు ‘ఇన్ఫ్లుయెంజా’... ఈ రెండు వైరస్‌లూ ఉన్నట్లు తేలింది. తాజాగా యూఎస్‌లోని హ్యూస్టన్‌లో క్రిస్మస్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కొందరికి కరోనా, ఇన్ఫ్లుయెంజా... రెండూ ఉన్నట్లు తెలియవచ్చింది. ఓ కేస్ స్టడీలా ‘అలెక్ జెర్లీన్’ అనే విద్యార్థిని పరీక్షించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. ఇదేమీ కొత్త కాదు... ఇలా రెండు రెండు సమస్యలు ఉండటం కొత్త విషయమేమీ కాదంటున్నారు ఫిలిప్పిన్స్ వైద్య పరిశోధకులు. ఆ దేశానికి చెందిన నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఎడ్సెల్ సల్వానా మాట్లాడుతూ... గతంలోనూ ఇలాంటి కొన్ని కేసులు చూశామనీ... చైనాకు చెందిన ఒక రోగిలో కోవిడ్–19, ఇన్ఫ్లుయెంజా, నిమోనియాను కలిగించే స్ట్రెప్టోకోకస్ లాంటి అనేక సమస్యలను తాము చూసిన దాఖలాలున్నాయంటూ వివరించారు. చదవండి: కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల.. 300 భవనాలకు సీల్ ఇక బ్రెజిల్లో సైతం ఓ పక్క ‘ఒమిక్రాన్’ కేసులు రావడం మొదలు కాగానే... ఇలాంటి ఫ్లురోనా కేసులు కనిపిస్తున్నాయంటూ అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. తమ దేశంలోనూ ఇప్పటి వరకు అధికారికంగా కనీసం ‘ఆరు’ ఫ్లురోనా కేసులు కనిపించాయని, ఇంకా 17 కేసులను క్షుణ్ణంగా విశ్లేషించాల్సి ఉందంటూ... రియో డి జెనీరో మున్సిపల్ హెల్త్ సెక్రటరీ అయిన డేనియల్ సోరాంజ్ పేర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు... ‘ఫ్లురోనా’ అనే ఓ కొత్త పదం నేర్చుకోవడానికి మాత్రమే మనం పరిమితం కాలేదు. ఇలాంటివే ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు డెల్టా వేరియెంట్‌నూ, ఒమిక్రాన్‌ను కలిపి ‘డెల్‌మైక్రాన్’ అని కూడా అంటున్నారు. (ఇదేమీ కొత్త వేరియెంట్ కాదు. కేవలం లక్షణాల ఆధారగానే). ఇక లక్షణాలను బట్టి ఇప్పటివరకూ ఈ ‘మహమ్మారి’ని ‘ప్యాండమిక్’ అంటూ నిపుణులు పిలుస్తూ వచ్చారు కదా. ఇప్పుడు... రెండ్రెండు జల్బులు కలిసి వచ్చే ఈ ‘ఫ్లూరోనా’ను కొందరు ‘ట్విన్–డమిక్’ అంటూ చమత్కారపూరితంగా పిలుస్తుండటం ఓ కొసమెరుపుగా చెప్పవచ్చు. -
కోవిడ్ అంటే కరోనా కాదు మనిషి పేరు అని తెలుసా!!
2020కి ముందు వరకు కరోనా అనేది మార్కెట్లో లభించే ఒక బీర్ పేరు. కరోనాని మనం కోవిడ్ అని కూడా వ్యవహరిస్తున్నాం. అయితే ఈ కోవిడ్ అనే పేరును మనుషులు పెట్టుకుంటారని, పైగా ఆ పేరుతో ఒక మనిషి ఉన్నాడని కూడా మనం ఊహించి ఉండం. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) అసలు విషయంలోకెళ్లితే.....హోలిడిఫై అనే ఆన్లైన్ టూర్ ట్రావెల్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడి పేరు కోవిడ్ కపూర్. అయితే ఎప్పుడైతే ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడించడం మెదలైందో అప్పటి నుంచి ఈ కోవిడ్ కపూర్‌కి తన పేరుతో సమస్యలు మొదలయ్యాయి. దీంతో ట్విట్టర్లో అతను "నా పేరు కోవిడ్ నేను వైరస్ కాదు" అని పెట్టుకున్నాడు. ఇటీవల అతను విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని ఆశ్చర్యపోవడమే కాక రకరకాలు జోక్‌లు వేసుకుంటున్నారు. దీంతో ఇక తాను భవిష్యత్తులో విదేశాలకు వెళ్లినపుడల్లా తన పేరు తనకి ఒక ఎంటెర్టైన్మంట్ మారి పర్యాటన మొత్తం సరదా సరదాగా సాగిపోతుందని అంటున్నాడు. అయితే తన పేరుకి అర్థం "పండితుడు" లేదా "ప్రావీణ్యం ఉన్న వ్యక్తి" అని హనుమాన్ చాలీసాలో ఉంటుందని వివరించాడు. అఖరికి అతని పుట్టిన రోజుకి తన స్నేహితులు కేక్‌ని ఆర్డర్ చేశారు. పాపం ఆ కేకు మీద కోవిడ్(kovid) అని కాకుండా covid అని బేకరి వాళ్లు తప్పుగా రాశారని చెప్పాడు. దీంతో మిస్టర్ కపూర్ కొన్ని సామాజిక మాధ్యమాల్లో కబీర్ కపూర్ అనే పేరుని కూడా మార్చుకున్నాడు. ఎవరైన ఒక్కసారో రెండోసార్లో మనపై జోక్‌లు వేస్తే సహించగలం. ఇలా ప్రతిసారి అందరూ మూకుమ్మడిగా వ్యంగ్యంగా జోక్‌లు వేస్తుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదా.! (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!) Now that you mention it.... pic.twitter.com/90FutdBcnF — Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022 For my 30th bday, my friends ordered a cake - and Amintiri automatically assumed that it's some kinda joke, and it should be spelled with a C not a K. 🎂 pic.twitter.com/3jrySteSbC — Kovid Kapoor (@kovidkapoor) January 5, 2022 -
ఇజ్రాయేల్‌లో కొత్తరకం వైరస్
-
న్యూ ఇయర్ ఉత్సాహంపై ఒమిక్రాన్ నీడ
వెల్లింగ్టన్: నూతన సంవత్సరం అన్నీ శుభాలు తెస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వేడుకలు జరుపుకోవడం పరిపాటి. కానీ ఈ దఫా న్యూ ఇయర్ వేడుకలపై ఒమిక్రాన్ భయాలు ప్రభావం చూపుతున్నాయి. అందుకే వరుసగా రెండో ఏడాది కొత్త సంవత్సర వేడుకలు పలు ప్రాంతాల్లో భారీగా జరగడం లేదు. అయితే నూతన ఏడాది కరోనాకు ఫుల్స్టాప్ పడుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఒమిక్రాన్ చెలరేగుతుండడంతో ముందు జాగ్రత్తగా అనేక దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంతంతమాత్రంగా జరిగాయి. జపాన్‌లో వేడుకలకు బదులు కుటుంబాలతో గడపాలని నిర్ణయించుకున్నారు. మాస్కులు ధరించి ఆలయాలను దర్శించారు. దక్షిణ కొరియాలో బెల్ రింగింగ్ పండుగను వరుసగా రెండో సంవత్సరం రద్దు చేశారు. అనేక బీచ్‌లు, టూరిజం ప్రాంతాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు స్తబ్దుగా సాగాయి. దేశంలో ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి జరగలేదు. కానీ ముందు జాగ్రత్తగా ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. ఆస్ట్రేలియాలో కేసులు పెరుగుతున్నా కొన్ని ప్రాంతాల్లో వేడుకలు భారీగా జరిగాయి. కానీ అధిక శాతం ప్రదేశాల్లో జనం తక్కువ సంఖ్యలో కనిపించారు. కరోనాకు ముందు వేడుకలకు సిడ్నీలో సుమారు పదిలక్షల మంది చేరేవారు. ఇప్పుడు కొద్ది మందే వచ్చారు. ఇండోనేసియాలో ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. చాలా చోట్ల నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. వేడుకలపై వియత్నాం నిషేధం విధించింది. హాంకాంగ్‌లో నిర్వహించే సంగీత విభావరిలో కేవలం 3,000 మందే పాల్గొనే వీలుంది. చైనాలో పలు ప్రాంతాల్లో వేడుకలను నిషేధిం చారు. దేవాలయాల్లో నూతన సంవత్సరాది వేడుకలను నిలిపివేశారు. థాయ్‌లాండ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్క డ వేడుకలపై ఎలాంటి నిషేధం లేదు. అయితే కరోనా నిబంధనలు కొనసాగుతున్నాయి. ఫిలిప్పీన్స్‌లో సంవత్సరాది ఉత్సాహంపై ఇటీవలి తుపాను నీళ్లు జల్లింది. దీంతో చాలామంది వేడుకలకు దూరంగా ఉన్నారు. యూరప్, యూఎస్‌ల్లో కేసులు పెరుగుతున్న వేళ పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. -
రెండో ప్రమాద హెచ్చరిక.. మూడో వేవ్ వచ్చేసింది.. ఆ 4 వారాలే కీలకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని చెప్పారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకమైనవన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికీ హానికలిగే అవకాశాలున్నాయన్నారు. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 10 వేల కేసులొచ్చాయని, ఇప్పుడు కొద్దికాలంలోనే అత్యధిక స్థాయికి వెళ్లి రోజుకు 30 వేల కేసుల దాకా రికార్డయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే అంతే త్వరగా వైరస్ తీవ్రత తగ్గిపోయి కేసులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని, ఒమిక్రాన్‌తో వచ్చే 6 నెలల్లో కోవిడ్ నుంచి విముక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 90% మందిలో లక్షణాల్లేకున్నా... కరోనా వైరస్ కంటే కూడా దాని వల్ల ఏర్పడ్డ భయమే బాధితుల ప్రాణాలు పోయేందుకు కారణమైందని, ఫస్ట్‌వేవ్‌లో భయంతోనే చాలా మంది చనిపోయారని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం సుమారు 90 శాతం మందిలో ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా, వారు ఇతరులకు వ్యాప్తి చేస్తారు కాబట్టి అందరూ కోవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలన్నారు. మిగతా 10 శాతం మందిలో లక్షణాలు కనిపించినా వారిలో స్వల్ప సంఖ్యలోనే సీరియస్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఒకవేళ కేసులు లక్షల్లో పెరిగితే ఒక శాతం మంది సీరియస్ అయినా ఆసుపత్రులు, వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సరఫరా చేసే కిట్లతో నయం చేసుకోవచ్చన్నారు. జీహెచ్ఎంసీలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. పాజిటివ్ కేసులన్నిటినీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించలేమని, 25 సీటీ విలువ కంటే తక్కువగా ఉన్న వారి నమూనాలను ఈ పరీక్షలకు పంపిస్తామని ఒక ప్రశ్నకు శ్రీనివాసరావు బదులిచ్చారు. కొత్త వేరియెంట్ ఏదైనా నిషేధాజ్ఞలు, ఆంక్షలు, రాత్రి కర్ఫ్యూలు, సినిమా హాళ్ల మూసివేత అవసరం లేదని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. జనవరి తొలివారంలో టీనేజర్లకు టీకాలు షురూ... వచ్చే నెల మొదటి వారంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకాలు ఇస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడ్డ వారు, ఇతర వర్గాల వారికి ‘ప్రికాషనరీ డోస్‌లు’ఇవ్వబోతున్నట్టు చెప్పారు. టీకాలకు సంబంధించి రాష్ట్రంలో తగిన నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఒక్కడోస్ కూడా తీసుకోని వారు, రెండో డోస్ జాప్యం చేసిన వారు వెంటనే టీకాలు తీసుకొని ముప్పు నుంచి తమను తాము కాపాడుకోవాలన్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, డెల్టా, ఒమిక్రాన్ పేర్లు ఏవైనా పాజిటివ్ కేసులు అన్నింటిని కోవిడ్గానే చూడాలని ఆయన స్పష్టం చేశారు. వేరియెంట్ ఏదైనా డయాగ్నిస్టిక్ టూల్స్, చికిత్సపరంగా ఎలాంటి మార్పులేదన్నారు. ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన మందులు అందుబాటులోకి వచ్చాయని ఇప్పటికే మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌పై ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే దాని వినియోగానికి అనుమతి లభించొచ్చని ఆయన వివరించారు. మొత్తం 135 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, దేశంలో 19 శాతం పెరుగుదల నమోదైందన్నారు. ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ఆరురెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారని, కొన్ని పరిశోధనల ప్రకారం 30 రెట్ల వరకు పెరగొచ్చునని అంటున్నారని తెలిపారు. 100% కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న లబ్ధిదారుల శాతం, 67% రెండో డోస్ టీకా తీసుకున్న వారి శాతం, 0.6% ప్రస్తుతం తెలంగాణలో పాజిటివిటీ రేట్ లక్షల కేసులొచ్చినా.. ► లక్షలాదిగా కేసులు పెరిగినా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఆసుపత్రి పడకలు, తగినంత ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇళ్లలోనే వేడుకలు నయం ► న్యూఇయర్, సంక్రాంతి నేపథ్యంలో కోవిడ్ తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. అందువల్ల కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుకలు జరుపుకుంటే మంచిది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు, పబ్బులు, పార్టీలకు వెళ్లే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోనూ మాస్క్... ► గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తున్నందున దాన్ని అడ్డుకొనేందుకు ప్రజలు ఇంటా, బయట మాస్క్‌లు ధరించాలి. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడరాదు. ఇళ్లలోనూ తలుపులు, కిటికిలు తెరిచి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి. -
ఓ మంచి వైరస్‌ను పట్టేశారు: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Congratulate Leena Nair: ఓవైపు కరోనా వేరియెంట్ల విజృంభణ కొనసాగుతుండగా.. మరోవైపు వరుసబెట్టి టాప్ కంపెనీల సీఈవోలు బాధ్యతల నుంచి వైదొలుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో వర్చువల్ స్పేస్‌కు భవిష్యత్తు ఉండడం, ట్యాక్స్ చెల్లింపుల నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే వాళ్లంతా వీడుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా భారతీయురాలు లీనా నాయర్ బాధ్యతలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదే విషయంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. ‘మొత్తానికి సిలికాన్ వ్యాలీలో మాత్రమే కాదు.. ప్యారిస్ గల్లీలో కూడా భారతీయ సీఈవో అనే మంచి వైరస్‌ను పట్టేశారు. శెభాష్ లీనా.. మమ్మల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేయండి’ అంటూ లీనా నాయర్‌ను అభినందిస్తూనే ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. So it’s not just Silicon Valley but also Fashion Alley that’s catching the ‘good virus’ of Indian CEOs. Bravo Leena! Keep making us proud. https://t.co/CN54EtMdVs — anand mahindra (@anandmahindra) December 17, 2021 లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్(52) ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా నాయర్ ప్రస్తుతం యూనిలీవర్ సంస్థలో చీఫ్ హుమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన యూనిలీవర్ గ్రూపులో ఈ స్థాయికి చేరుకున్న మొదటి భారతీయురాలు మాత్రమే కాదు.. ఆసియన్ మహిళ కూడా లీనా నాయర్ కావడం భారత్‌కు గర్వకారణం. ఇక ఇంతకు ముందు పరాగ్ ట్విటర్ సీఈవోగా ఎంపికైన సమయంలో ఐరీష్ బిలియనీర్, స్ట్రైప్ కో ఫౌండర్ ప్యాట్రిక్ కొలిసన్ చేసిన సెటైరిక్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘ఇది మరో రకమైన ప్యాండెమిక్. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్ సీఈవో వైరస్. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు’ అంటూ దీటుగా ఆనంద్ మహీంద్రా బదులిచ్చిన విషయం తెలిసిందే. లీనా నాయర్ నేపథ్యం.. ఆసక్తికర విషయాలు -
నిశ్శబ్ద మహమ్మారి
కోవిడ్ మహమ్మారి సృష్టించే కల్లోలం మనందరికీ తెలుసు కానీ, చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘నిశ్శబ్ద మహమ్మారి’ గురించి తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే. ఏటా 70 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ మహమ్మారి పేరు ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’. బాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు వంటి వివిధ వ్యాధికారక సూక్ష్మక్రిములను సంహరించే బ్రహ్మాస్త్రాల వంటివి యాంటీమైక్రోబియల్ ఔషధాలు. యాంటీబయోటిక్స్ వంటి అతిముఖ్యమైన ఈ ఔషధాలను తొలుత కనుగొని 80 ఏళ్లు దాటింది. సాంక్రమిక వ్యాధుల నుంచి, తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని, జంతువులను, మొక్కలను కాపాడటంలో ఈ ఔషధాలు అద్భుత పాత్రను పోషిస్తున్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, కేన్సర్ చికిత్సలను ఇవి కీలక మలుపు తిప్పాయి. అయితే, కాలక్రమంలో ఈ ఔషధాలకు కూడా కొన్ని సూక్ష్మక్రిములు లొంగకుండా మొండికేస్తున్నాయి. రోగుల ప్రాణరక్షణలో చివరి ప్రయత్నంగా చేసే చికిత్సల్లో అవకాశాలు కుంచించుకు పోతున్నాయి. దీన్నే ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’ బెడద అని పిలుస్తున్నాం. ఎ.ఎం.ఆర్. వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90% మంది ఆసియా, ఆఫ్రికా దేశాల వాసులే. ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కోటి మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్య కారణాలు బ్రహ్మాస్త్రాల్లాంటి యాంటీమైక్రోబియల్ ఔషధాలను దుర్వినియోగం చేయటం, మోతాదులకు మించి వాడటం వల్ల ఎ.ఎం.ఆర్. మహమ్మారి విజృంభిస్తోంది. మనుషులకు, పశువులకు అందించే వైద్య చికిత్సల్లో.. పాడి పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, రొయ్యలు, చేపలు వంటి ఆహారోత్పత్తులను అందించే పశుపక్ష్యాదుల పెంపకంలో.. పంటలు, పండ్ల తోటల సాగులో యాంటీమైక్రోబియల్ రసాయనిక మందులను విచ్చలవిడిగా వాడటం ఎ.ఎం.ఆర్. విజృంభణకు ముఖ్య కారణాలు. అంతేకాదు.. కర్మాగారాలు, వ్యవసాయ/ పశుపోషణ క్షేత్రాలు, జనావాసాలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, వ్యర్థ జలాలతో ఏర్పడుతున్న కాలుష్యం కూడా ఎ.ఎం.ఆర్. మహమ్మారి పెరుగుదలకు కారణమవుతోంది. కోవిడ్ కాలంలో యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం పెచ్చుమీరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. చైతన్య వారోత్సవాలు ఎ.ఎం.ఆర్. సమస్యపై ప్రచారోద్యమం ద్వారా ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, పశువైద్య నిపుణులు, విధాన నిర్ణేతలకు ఈ సమస్యపై చైతన్యం కలిగించడానికి నవంబర్ 18–24 వరకు ప్రతి ఏటా ‘వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ పేరిట వారోత్సవాలు జరుపుకొంటున్నాం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు భారత్ ఎ.ఎం.ఆర్. నియంత్రణ కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక (2017–21) చేపట్టింది. మూలికా వైద్యంతో సత్ఫలితాలు పశుపోషణలో సంప్రదాయ మూలికా చికిత్సలను ప్రాచుర్యంలోకి తేవటం ద్వారా 80% యాంటీబయోటిక్స్ వాడకాన్ని జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తగ్గించగలిగింది. రైతులు తమ ఇంటి పరసరాల్లో దొరికే ఔషధ మొక్కలతోనే పొదుగు వాపు వంటి తీవ్ర జబ్బుల్ని కూడా పూర్తిగా అరికట్టవచ్చని రుజువైందని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా అంటున్నారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్త డా. చౌహన్ క్యు పద్ధతులు అనుసరిస్తే రసాయన రహిత, దుర్గంధ రహిత కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. ఆక్వా సాగులోనూ యాంటీ బయోటిక్స్ తదితర రసాయనాల వాడకాన్ని తగ్గించటం అవశ్యం. ఆహార పంటలు, ఉద్యాన తోటల సాగులో రసాయనాల అవసరాన్ని దశలవారీగా తగ్గించుకునే మార్గాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ చైతన్యంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పూనుకోవాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (ఈ నెల 24 వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా..) -
Joker: ఈ యాప్స్ యమడేంజర్! సీక్రెట్‌గా డేటాను..
Joker Malware Strikes Again on Android Apps: ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం సురక్షితమేనా? చాలామందికి ఈ విషయంలో అనుమానాలు ఉంటాయి. అయితే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ (యాప్స్)లోనూ కోడ్ రూపంలో డివైజ్‌ల మీద వైరస్ దాడి చేసే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో యాప్స్ డౌన్లోడ్ చేసేప్పుడు కొన్ని కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే జోకర్ లాంటి మాల్వేర్.. డివైజ్‌లోని డాటా మొత్తాన్ని గుంజేస్తుంటుంది మరి! 2017 నుంచి తన జోరు చూపిస్తున్న ‘జోకర్’ మాల్వేర్ విషయంలో గూగుల్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. కోడింగ్ బలంగా లేని యాప్స్ ద్వారా అది ప్రభావం చూపెడుతూనే వస్తోంది. తాజాగా 14 ఆండ్రాయిడ్ యాప్స్‌లో జోకర్‌ను గుర్తించినట్లు కాస్పర్‌స్కై అనలిస్ట్ తాన్య షిష్కోవా చెబుతున్నారు. డాటాను తస్కరించే ఈ మాల్వేర్ .. యాప్స్‌లో కోడింగ్ మార్చేయడం ద్వారా తన పని చేసుకుంటూ పోతుందని, తద్వారా కాంటాక్ట్ లిస్ట్, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఓటీపీల తస్కరణ, ఎస్సెమ్మెస్‌లను రీడ్ చేయడం చేస్తోందని షిష్కోవా చెబుతున్నారు. కోడ్‌లో దాగి ఉండే ఈ మాల్వేర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే రిస్క్ కూడా ఎక్కువేనని ఆండ్రాయిడ్ యూజర్లను షిష్కోవా హెచ్చరిస్తోంది. సూపర్ క్లిక్ వీపీఎన్, వాల్యూమ్ బూస్టింగ్ హియరింగ్ ఎయిడ్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ బబుల్ ఎఫెక్ట్స్, ప్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ ఆన్ కాల్, ఈజీ పీడీఎఫ్ స్కానర్, స్మార్ట్‌ఫోన్ రిమోట్, హలోవీన్ కలరింగ్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డు, వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వెలైజర్, సూపర్ హీరో ఎఫెక్ట్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ వాల్ పేపర్, డాజిలింగ్ కీబోర్డ్, ఎమోజీవన్ కీబోర్డు, నౌ క్యూఆర్ స్కాన్.. ఈ యాప్స్‌ను తక్షణమే అన్ఇన్స్టాల్ చేయడం మంచిదని షిష్కోవా చెబుతోంది. VIDEO: జోకర్ ఏం చేస్తాడో చూడండి -
కేరళలో కొత్త వైరస్ కలకలం.. ఆందోళనలో అధికారులు
తిరువనంతపురం: ఇప్పటికే కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే తాజాగా కేరళలో మరో వైరస్ కేసు నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరం పెడుతోంది. తాజాగా వాయనాడ్ జిల్లాలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వివరాల ప్రకారం.. వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు అరుదైన నోరోవైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. జంతువుల ద్వారా సంక్రమించే నోరో వైరస్, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేశారు. ‘సరైన నివారణ, చికిత్సతో నోరో వైరస్ వ్యాధి త్వరగా నయమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాధి, దాని నివారణ మార్గాల గురించి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆ వెటర్నరీ కళాశాల విద్యార్థుల డేటాను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు. వెటర్నరీ కళాశాల అధికారులు మాట్లాడుతూ.. క్యాంపస్ వెలుపల హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులలో మొదట ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించడంతో ఈ ఘటన వెలుగలోకి వచ్చింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన ఆ ప్రాంత ఆరోగ్య అధికారుల సమావేశం నిర్వహించి వాయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం వైద్య అధికారులు మాట్లాడుతూ..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. -
సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!
ఫ్లూబోట్ మాల్వేర్ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు సంక్రమిస్తుంది. ఇప్పుడు వినియోగదారుల పరికరాల్లోకి ప్రవేశించడానికి మాల్వేర్ ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. ఒక నెల క్రితం భద్రతా సంస్థ ట్రెండ్ మైక్రో, న్యూజీలాండ్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్ వేర్ మరో కొత్త పద్దతిలో తిరిగి వచ్చినట్లు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. మొబైల్ యూజర్లను ఆకర్షించడం కోసం పార్శిల్ పేరుతో ఓ టెక్ట్స్ మెసేజ్ వస్తోంది. యూజర్లు లింక్ పై క్లిక్ చేసిన తర్వాత వారికి మరో పెద్ద సందేశం వస్తుంది. మీ మొబైల్/కంప్యూటరుకి ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్వేర్ సోకినట్లు ఒక హెచ్చరిక చేస్తుంది. వాస్తవానికి, ఇది గూగుల్ క్రోమ్ ప్రమాదకరమైన సేఫ్ బ్రౌజింగ్ సందేశాన్ని తెలిపే రెడ్ హెచ్చరిక స్క్రీన్'తో పోలి ఉంటుంది. "ఫ్లూబోట్ మాల్వేర్ తొలగించడం కోసం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండి" అని సందేశం రూపంలో ఇక్కడ క్లిక్ చేయండి చూపిస్తుంది. ఫ్లూబోట్ మాల్ వేర్ మాల్వేర్ తొలగించడం కోసం నిజమైన సెక్యూరిటీ అప్డేట్ చేయడానికి బదులుగా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఫ్లూబోట్ వైరస్ డౌన్ లోడ్ చేస్తారు. సెక్యూరిటీ అప్ డేట్ పేరుతో మీ మొబైల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఈ-మెయిల్, ట్విట్టర్ ఈ డేటా మొత్తాన్ని మాల్వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి ఫ్లూబోట్ అందిస్తుంది. అలాగే, మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ ద్వారా ఇతర వ్యక్తులకు పంపుతుంది. (చదవండి: డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేశారా..?) We’ve broken down some details on the FluBot text scam currently infecting Android phones. Please share this with your friends and family and help us stop the spread. https://t.co/zoz8G9o8i0 — CERT NZ (@CERTNZ) October 1, 2021 ఫ్లూబాట్ నుంచి రక్షణ ఇలా.. ఇంతటి ఇబ్బందికరమైన ఫ్లూబాట్ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం మీ స్క్రీన్ పై వచ్చే పాప్ అప్ క్లిక్ చేయవద్దు. ఏ ఇతర లింక్స్ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ లింక్స్ ఓపెన్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. -
యూకేలో మరో కొత్త వైరస్, ఇప్పటికే 154 మంది బాధితులు
లండన్: ఏ ముహూర్తాన కరోనా వైరస్ పురుడు పోసుకుందో.. అప్పటి నుంచి ఏదో ఒక వైరస్ ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించగా, మరో వైరస్ వెలుగులోకి వచ్చి వణుకు పుట్టిస్తోంది. తాజాగా యూకేలో నోరో వైరస్ వెలుగులోకి రావడమే గాక అతి తక్కువ సమయంలోనే గణనీయంగా దీని బారిన పడ్డ బాధితుల సంఖ్య పెరిగినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఇ) తెలిపింది. గత ఐదు వారాల్లో 154 మంది నోరో వైరస్ బారిన పడటంతో దీనిపై ప్రజలకు అప్రమత్తత అవసరమని హెచ్చరికలు జారీ చేసింది. ఇది వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉందని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. నోరో వైరస్ ప్రధాన లక్షణాలుగా.. కడుపు నొప్పి, డయేరియా, వాంతులు, జ్వరం ఉంటుందని, ముఖ్యంగా కడుపుపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. మరింత ఆందోళన కలిగించే అంశమేమంటే, ముఖ్యంగా నర్సరీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పీహెచ్ఈ తెలిపింది. సీడీసీ ప్రకారం.. ఈ వైరస్ సంక్రమణ..వైరస్ సోకిన వ్యక్తి ద్వారా, కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు, మూడు రోజులు ఉంటాయని పేర్కొంది. ప్రత్యేకంగా దీనికంటూ ఎటువంటి మందు లేదని అంటున్నారు. వాంతులు, విరోచనాలు వల్ల మన శరీరం కోల్పోయిన ద్రవాన్ని భర్తీ చేయడానికి పుష్కలంగా ద్రవాలను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మరో అరుదైన వైరస్, 20 ఏళ్ల తరువాత మళ్లీ ప్రత్యక్షం
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో ఇప్పటికీ ప్రపంచం అల్లాడుతోంటే అమెరికాలో తాజాగా అరుదైన మంకీ పాక్స్ వైరస్ కేసును గుర్తించారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలిసారి అమెరికాలోని టెక్సాస్‌లో మంకీ పాక్స్ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం తెలిపింది. అమెరికా నివాసి అయిన బాధితుడు కొన్ని రోజుల క్రితం నైజీరియా వెళ్లి తిరిగి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం డల్లాస్‌లో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ రోగితో సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో లాగోస్, నైజీరియా, అట్లాంటా, డల్లాస్ మధ్య రెండు విమానాల ప్రయాణికులను, ఇతరులపై దృష్టిపెట్టింది మరోవైపు స్మాల్ పాక్స్ వైరస్‌కి చెందినదిగా భావిస్తున్న ఈ మంకీపాక్స్ వల్ల ఆందోళన అవసరం లేదని, సాధారణ ప్రజలకు పెద్దగా ముప్పు ఉండదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. తుంపర్ల వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నప్పటికీ కరోనా కారణంగా మాస్కులు ధరిస్తున్న నేపథ్యంలో పెద్దగా వ్యాపించకపోవచ్చని సీడీసీ వెల్లడించింది. అమెరికాలో తొలిసారిగా 2003లో 47 మందికి ఈ వైరస్ సోకింది. మిడ్‌వెస్ట్‌లోని పెంపుడు జంతువుల ప్రేరీ కుక్కలు, దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ ఎలుకల ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం మంకీపాక్స్ వైరస్ మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన వైరల్ వ్యాధి. ఫ్లూతో మొదలై, లింఫ్ నోడ్స్లో వాపు, శరీరంపై భారీగా దద్దుర్లు రావడం జరుగుతుంది. రెండు నుండి నాలుగు వారాల వరకు లక్షణాలు ఉంటాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం మంకీపాక్స్ కేవలం ఒకశాతం మందిలో ప్రాణాంతకమని తేలింది. -
బీ అలర్ట్..! ఈ యాప్‌లు డిలీట్ చేసి ‘జోకర్’ని తరిమేయండి
జోకర్ మాల్వేర్ మళ్లీ వచ్చేసింది. ఈ మాల్వేర్ ఒక్కసారి మన ఫోన్లోకి వచ్చిదంటే అంతే సంగతులు..! మీ ఫోన్లో నిక్షిప్తమైన విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేకాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్ మాల్వేర్ తొలిసారిగా 2017 గూగుల్ ప్లేస్టోర్‌లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. దేశంలో ఇప్పటికే ఏడు లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్స్ జోకర్ మాల్వేర్తో లింకులు ఉన్న యాప్స్ (సురక్షితం కానీ) ను డౌన్లోడ్ చేసుకున్నారని, వాళ్లలో చాలామంది ఆర్థిక లావాదేవీలు ప్రమాదం అంచున ఉన్నాయని మహరాష్ట్ర పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. తాజాగా సైబర్ సెక్యూరిటీ ఫ్రిమ్ క్విక్ హీల్ టెక్నాలజీస్ జోకర్ వైరస్ మాల్వేర్ ఉన్న ఎనిమిది యాప్‌లను గుర్తించింది. వీటిని వెంటనే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచి ఆన్ఇన్స్టాల్ చేయమని సూచించింది. జోకర్ మాల్వేర్కు గురైన యాప్స్ ఇవే... 1. ఆక్జిలారీ మెస్‌జ్ యాప్ 2. ఫాస్ట్ మ్యాజిక్ ఎస్ఎమ్ఎస్ 3. ఫ్రీ క్యామ్ స్కానర్ 4. సూపర్ మెసేజ్ 5. ఏలిమేంట్ స్కానర్ 6. గో మెసేజ్స్ 7. ట్రావెల్ వాల్‌పేపర్ 8. సూపర్ ఎస్ఎమ్ఎస్ జోకర్ వైరస్ మాల్వేర్: జోకర్ అనేది ఒక మొండి మాల్వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేయడంలో దిట్ట. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్వర్డ్లు, పేమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది. ఒకవేళ ట్రాన్స్జాక్షన్ అయినట్లు యూజర్‌కు మెసేజ్ వచ్చినా.. అప్పటికే ఆలస్యం జరిగిపోయి ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి, యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి
న్యూఢిల్లీ: చాలా సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రముఖ బార్కోడ్ స్కానర్ యాప్ ను వెంటనే ఆన్ ఇన్స్టాల్ చేయండి లేకపోతే హ్యాకింగ్ భారీన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ యాప్ లో వైరస్ ప్రవేశించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఈ వైరస్ వేగంగా ఇతర మొబైల్స్ లోకి వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. దాంతో వెంటనే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను తొలిగించినట్లు పేర్కొంది. దీనిని ఇప్పటికే ఒక కోటికి మందికి పైగా దీనిని డౌన్ లోడ్ చేసుకొని వాడుతున్నారు. ఈ యాప్ ను ఓపెన్ చేసినప్పుడు క్రాష్ అవ్వడంతో పాటు చాలా రకాల ప్రకటనలు(యాడ్స్) వస్తున్నాయని కొందరు వినియోగదారులు గుర్తించారు. ఈ సమస్య గురుంచి తెలుసుకున్న వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్న వారు వెంటనే దీనిని అన్ఇన్స్టాల్ కోరింది. ఈ యాప్ ను లావాబర్డ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మీ ఫోన్లో దీనిని కనుగొనలేకపోతే AppCheckerని డౌన్లోడ్ చేసి 'బార్కోడ్ స్కానర్' ను చెక్ చేయండి. బార్కోడ్ స్కానర్ ఒక సాధారణ యాప్, గత సంవత్సరం డిసెంబర్ 4న తీసుకొచ్చిన అప్డేట్ తర్వాత ఫోన్లలోకి వైరస్ వచ్చినట్లు తెలుస్తుంది. చదవండి: ఓటు వేసి రియల్మీ నార్జో30 గెలుచుకోండి ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్ -
చైనాలో మళ్లీ లాక్డౌన్!
చైనా: కరోనా మహమ్మారి మరోసారి చైనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. 2019లో వూహాన్ నగరంలో వైరస్ వ్యాపించిన తర్వాత పెద్ద ఎత్తున చైనా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లో భారీగా టెస్టింగులతో పాటు లాక్డౌన్లు విధించడంతో వైరస్ వ్యాప్తిని చాలా వరకు నియంత్రించారు. తాజాగా మళ్లీ చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. చైనా రాజధాని బీజింగ్‌కు దక్షిణంగా ఉన్న రెండు నగరాలలో లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆ నగర రహదారులను మూసివేయడంతో పాటు రవాణా సౌకర్యాలను నిలిపివేసింది.(చదవండి: మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో గత వారంలో 127 కొత్త కోవిడ్-19కేసులు, అదనంగా 183 అసింప్టోమాటిక్ ఇన్ఫెక్షన్లు కనిపించాయి. 2019 తర్వాత చైనాలో ఇన్ని కేసులు ఒకేసారి వెలుగుచూడటం ఇదే తోలిసారి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు హెబై ప్రావిన్స్‌లోని షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో లాక్డౌన్ విధించారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని ఆదేశించారు. హెబీ ప్రావిన్స్‌లోని నివాసితులు బీజింగ్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల, ఆహార ప్యాకేజింగ్ ద్వారా చైనాలోకి ఈ ప్రవేశించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. -
ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్
చైనాలో దిగ్గజ కంపెనీ జియోనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైనాలోని ఒక న్యాయస్థానం జియోనీ ఫోన్లతో సంబంధం ఉన్న ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. డిసెంబర్ 2018 మరియు అక్టోబర్ 2019 మధ్య ఒక యాప్ ద్వారా 20 మిలియన్లకు పైగా జియోనీ ఫోన్లలలో ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టిన ట్రోజన్ హార్స్ వైరస్ తో దెబ్బతిన్నాయని కోర్టు కనుగొంది. “స్టోరీ లాక్ స్క్రీన్” ప్రత్యేక యాప్ వినియోగదారుల నుండి అయాచిత ప్రకటనలు మరియు ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా లాభాల సాధనంగా ఉపయోగబడిందని నివేదిక పేర్కొంది. (చదవండి: ఐఫోన్13 కెమెరా ఫీచర్లు వైరల్) “స్టోరీ లాక్ స్క్రీన్” యాప్ యొక్క అప్డేట్ ద్వారా వినియోగదారుల ఫోన్లలో ట్రోజన్ హార్స్ ప్రోగ్రామ్‌ను అమర్చడానికి షెన్జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు కోర్టు తెలిపింది. నివేదిక తెలిపినట్లుగా, "పుల్ పద్ధతి"ని ఉపయోగించి వినియోగదారుకు తెలియకుండా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్లలో అప్డేట్ చేసారని కోర్టు పేర్కొంది. దీని కోసం జియోనీ 40 లక్షల డాలర్లు ముడుపులు ఇచ్చుకుంది. 2018లో మొదటిసారిగా వారు ఈ వైరస్‌ను ఫోన్లలో ఇన్స్టాల్ చేయడం ప్రారంభించారు. 2019 అక్టోబర్ వరకు ఇలాగే కొనసాగించారు. ఈ పద్దతిలో 21.75 మిలియన్ స్మార్ట్ఫోన్లను ప్రభావితం చేయడంతో ద్వారా.. కంపెనీ సుమారు 4.2 మిలియన్లు అర్జించినట్లు తేలింది. మొబైల్ పరికరాలను చట్టవిరుద్ధంగా నియంత్రించినందుకు న్యాయస్థానం.. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వారికి 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల జరిమానా విధించింది. -
కోవిడ్-19 : వైరస్ సోకిన కణాల ఫోటోలివే..
న్యూయార్క్ : కరోనా వైరస్ సోకిన శ్వాసకోశ కణాల ఫోటోలను శాస్త్రవేత్తలు ప్రచురించారు. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించిందీ ఈ చిత్రాల్లో గుర్తించారు. శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుందనేది సులభంగా అర్ధమయ్యేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు. మావన శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్ కణాలు శరీరమంతటా వ్యాపించడంతో పాటు ఇతరులకూ సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ర్టాన్ మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. తిరిగి రంగులద్దిన ఈ చిత్రాలు శ్వాసకోశ నాళాల్లో వైరస్‌కు గురైన వెంట్రుకల మాదిరి ఉన్న కణాలను చూపుతున్నాయి. ఈ కణాలు శ్లేష్మంతో పాటు వైరస్‌లను ఊపిరితిత్తుల నుంచి ఇతర భాగాలకు వ్యాపింపచేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. అధిక శక్తితో కూడిన మాగ్నిఫికేషన్ వాడుతూ మానవ శ్వాసకోశంలో తయారైన కోవిడ్-19 నిర్మాణం, తీవ్రతను పరిశోధకులు వెల్లడించారు. అతిథేయ కణాల్లో శ్వాసకోశ ఉపరితలాలపై పూర్తిగా గూడుకట్టుకుని ఉన్న వైరస్ కణాలివని పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్రమణను అడ్డుకునేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని ఈ చిత్రాల ద్వారా విస్పష్టంగా వెల్లడవుతోందని పరిశోధకులు స్పష్టం చేశారు. -
కణుతులకు ఇంటి వైద్యం!
కొద్ది నెలలుగా పశువులకు అక్కడక్కడా లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్.ఎస్.డి.) సోకుతూ రైతులను బెంబేలెత్తిస్తోంది. ఇది క్యాప్రిపాక్స్ అనే వైరస్ కారణంగా సోకుతోంది. దోమలు, పిడుదులు, ఇతర కీటకాల ద్వారా బలహీనంగా ఉన్న పవువులకు సోకుతుంది. కలుషిత దాణా, నీరుతో పాటు.. సరిగ్గా శుభ్రం చేయిన పరికరాలతో భారీ స్థాయిలో వాక్సిన్లు వేయడం, కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా ఈ అంటు వ్యాధి ప్రబలుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) పేర్కొంది. పశువు వంటిపైన అనేక భాగాల్లో బొబ్బలు, కణుతుల మాదిరిగా రావటం దీని ప్రధాన లక్షణం. కుంకుడు గింజ నుంచి చిన్న నిమ్మకాయ అంతటి కణుతులు వస్తాయి. వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల్లో జ్వరం, దురదలు, ముక్కులు, కళ్ల నుంచి స్రావాలు కారటం కనిపిస్తాయి. కనుగుడ్లు ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవటంతో పశువు నీరసిస్తుంది. తగిన చికిత్స అందకపోతే కణుతులు పగిలి పశువును బాధిస్తాయి. మందలలో 10–20 శాతం పశువులకు ఇది సోకుతున్నట్లు గుర్తించారు. అయితే, ఈ వైరస్ బారిన పడిన పశువుల్లో తగిన చికిత్స లభించని పక్షంలో 2 నుంచి 4 శాతం చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. పశువుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకదని నిపుణులు చెబుతున్నారు. ఇది పాడి పశువులకు ఈ వైరస్ సోకితే పాల దిగుబడి తగ్గిపోతుంది. అయితే, దూడలకు ఎక్కువగా సోకుతుంది. సాధారణంగా పశువైద్యులు ఈ వ్యాధి వచ్చిన పశువులకు ఇంజక్షన్లు, యాంటిబయోటిక్స్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే, కేవలం ఇంటి వైద్యంతోనే ఈ వైరస్ వ్యాధిని 4–5 రోజుల్లో సంపూర్ణంగా నయం చేయవచ్చని, పశు మరణాల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని పశు వైద్య నిపుణులు డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు(99122 92229) తెలిపారు. ఔషధ మొక్కల ఆకులతో చేసిన కషాయం, పైపూత లేపనంతో లంపీ స్కిన్ డిసీజ్‌ను పారదోలవచ్చని ఘంటాపథంగా చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన గోసేవకుడు రవికి చెందిన గిర్ ఆవుకు ఈ వైరస్ సోకి వంటిపైన కణుతులు వచ్చాయి. డా. సాయి బుచ్చారావు సూచన మేరకు.. ఔషధ మొక్కలతో తయారు చేసిన ద్రావణం ఆవుకు తాగించి, ఔషధ మొక్కల ఆకులు నూరి ఆవు శరీరానికి పూయటంతో నాలుగైదు రోజుల్లో ఈ జబ్బు నుంచి ఆవు పూర్తిగా కోలుకుందని రవి (90007 00020) తెలిపారు. ఈ ఫలితం చూసి తొలుత ఇంజక్షన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారని అన్నారు. తనతోపాటు ఇతర రైతులు కూడా ఈ చికిత్సతో మంచి ఫలితాలు సాధించారన్నారు. కషాయం తయారు చేసే విధానం 100 గ్రాములు వేప ఆకులు, 100 గ్రాములు తులసి ఆకులు, 100 గ్రాములు పసుపు, 50 గ్రాములు మిరియాలను అర లీటరు (500 ఎం.ఎల్.) నీటిలో వేసి మరిగించాలి. రెండు పొంగులు వస్తే చాలు. ఇలా తయారు చేసిన 200 గ్రాముల కషాయాన్ని పశువుకు తాగించాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 నుంచి 5 రోజులు తాగించాలి. పైపూత మందు తయారు చేసే విధానం కలబంద ఆకుల గుజ్జు, పసుపు, గోరింటాకులను కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్దను పశువు వంటికి లేపనంగా పట్టించాలి. శరీరం అంతా రాస్తే మంచిది. ఒకవేళ వీలుకాకపోతే కణుతులు తేలిన ప్రాంతాల్లో రాసినా పర్వాలేదు. ఈ లేపనం పూయక ముందు 2 శాతం (వంద లీటర్ల నీటికి 2 కిలోల ఉప్పు) ఉప్పు ద్రావణంతో పశువును శుభ్రంగా కడగాలి. ఖర్చు లేకుండా రైతులు ఈ చికిత్స ద్వారా లంపీ స్కిన్ డిసీజ్ బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. -
కొత్త రకమైన వైరస్ విజృంభిస్తోంది..!
వనపర్తి/మదనాపురం: జిల్లా వ్యాప్తంగా మూగజీవాలను కొత్త రకమైన వైరస్ వెంటాడుతోంది. కేవలం తెల్ల పశువులకే సోకుతున్న ఈ వైరస్ లంపి స్కిన్‌గా ఇటీవలె పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ధారించారు. ఇదివరకే ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలో పర్యటించి నమూనాలు సేకరించి ఇది కౌ ఫాక్స్ వైరస్ లాంటిదేనని, కానీ రాష్ట్రంలో కొత్తగా బయటపడినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు వెల్లడించారు. వైరస్ సోకిన పశువుల్లో దద్దుర్ల తీవ్రత ఎక్కువగా ఉంటే తప్పా మరణాలు సంభవించవని ప్రకటించారు. ఇటీవల మదనాపురం మండలం అజ్జకోలులో వారం రోజుల్లో రూ.లక్షలు విలువ చేసే ఏడు పశువులు మృతి చెందటం, మరో మూడు పశువులు గత పదిహేను గంటలుగా మృత్యువుతో పోరాడటం చర్చనీయాంశంగా మారింది. అయితే, అజ్జకోలులోని బాధిత రైతులు మా పశువులు వైరస్ వలన చనిపోలేదని, పశువైద్యులు ఇచ్చిన అధిక మోతాదు మందుల వల్లనే చనిపోయాయని ఆరోపించడం గమనార్హం. లాక్‌డౌన్‌కు ముందు నుంచే.. జిల్లాలోని పెబ్బేర్, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, మదనాపురం, కొత్తకోట, పాన్‌గల్ తదితర ప్రాంతాల్లో ఈ వైరస్ భారిన పశువులు పడినట్లు వైద్యాధికారుల నివేదిక ద్వారా వెల్లడవుతోంది. ఇప్పటి వరకు లంపి స్కిన్ వైరస్ భారిన జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 పశువులు పడినట్లు అధికారులు వెల్లడించారు. కౌ ఫాక్స్ తరహాలోని ఈ వైరస్ సోకిన పశువుల్లో వంటిపై దద్దుర్లు, గొంతువాపు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయంపై ఇదివరకే జిల్లా పశుసంవర్ధకశాఖఅధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పశువుల నుంచి రక్తం, మలమూత్రాల శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేసి లంపి స్కిన్ వైరస్ అని నిర్ధారించారు. ఒక దాని నుంచి మరో దానికి వ్యాప్తి.. తాజాగా జిల్లాలోని మదనాపురం మండలం అజ్జకొల్లులో రాజవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలరాజు రైతులకు చెందిన పశువుల్లో కొన్నింటికీ లంపీ స్కిన్ వైరస్ సోకింది. దీంతో కొత్తకోట పశువైద్యాధికారి డాక్టర్ విజయ్‌కుమార్ పెన్సిలిన్తో పాటు ఐసోప్లడ్ ఇంజక్షన్, గ్లూకోజ్ ఇచ్చాడు. అనంతరం మూడు రోజుల అనంతరం మొత్తం ఆరు పశువులతోపాటు ఒక కోడె సైతం మృతిచెందాయి. మరికొన్ని మృత్యువుతో పోరాడుతుండగా.. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కొత్తకోట పశువైద్యుడు విజయ్‌కుమార్ అజ్జకొల్లుకు చేరుకొని వాటికి చికిత్స అందించారు. రాష్ట్ర బృందం పరిశీలన పశువుల మృతి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ వెటర్నరి అండ్ బయోలాజికల్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేవేందర్‌రావు, డాక్టర్ యం. కళ్యాణి వారి బృందంతో కలిసి శుక్రవారం అజ్జకొల్లును సందర్శించి మృత్యువుతో పోరాడుతున్న పశువులను పరిశీలించారు. వాటి నుంచి మలమూత్రం, రక్తంతో పాటు లాలాజలం నమూనాలను సేకరించారు. అలాగే, మృతి చెందిన పశువుకు పోస్టుమార్టం నిర్వహించి కొన్ని నమూనాలను సేకరించారు. వీటిని హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షించి పశువులు మృతి చెందటానికి గల కారణం వైరస్.. లేక హై డోస్ మెడిసిన్ ఇవ్వటం వలనా అనే విషయం వెల్లడిస్తామన్నారు. ఈ వైరస్‌కు మందు లేదు జిల్లాలో చాలా ప్రాంతాల్లో పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకింది. ఈ వైరస్‌కు మందు లేదు. ఉన్న మెడిసిన్ వాడుతూ.. పశువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడా అదే విధంగా మా వైద్యులు ప్రయత్నం చేశారు. రాష్ట్ర స్థాయి బృందం వైరస్ భారిన పడిన పశువుల నమూనాలు సేకరించారు. ల్యాబ్‌లో పరీక్షించి మృతికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తారు. – డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, వనపర్తి మా పశువులకు నయం అయ్యింది గత కొన్ని రోజుల క్రితం నాకు ఉన్న పదహారు పశువులకు గొంతు వాపు, వల్లు దుదు ర్లు వస్తే.. అజ్జకోలు స బ్ సెంటర్లో ఉండే సి బ్బంది దృష్టికి తీసుకువెళ్లా. మెరిక్వీన్, అస్రోప్లడ్ అనే మందు రాసిచ్చారు. కొని వా డితే తగ్గింది. మరీ మా గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు, మరో వ్యక్తి పశువులకు ఎందుకు మృతి చెందాయో తెలియదు. నా పశువులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయి. – సంజీవకుంట వెంకటేష్, అజ్జకోలు -
కరోనా వైరస్ మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది?
కరోనా అంటే అలాగ.. కరోనా అంటే ఇలాగ. మాస్కు వేసుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి.. దగ్గొస్తది.. తుమ్మొస్తది. ఇలా కోవిడ్–19 గురించి ఎవరైనా అడిగితే చాలు. గడగడా చెప్పేస్తాం. మరి అదే కోవిడ్–19 మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది అని అడిగితే.. అదీ.. అదీ.. అంటూ నీళ్లు నమిలేవాళ్లే ఎక్కువ. ఇక అలా నమలాల్సిన పని లేదు. ఏం చేస్తుంది అని ఎవరైనా అడిగారు అనుకోండి. ఇదిగో ఇలా చేస్తుంది అని చెప్పేయండి. అలా చెప్పాలంటే.. ఓసారి దీనిపై లుక్కేసుకోండి మరి.. -
72 గంటలపాటు పార్శిల్స్ తాకొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ల బారిన పడకుండా ఉండాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెప్పించుకునే అన్లైన్ ప్యాకేజీలను 72 గంటలపాటు తెరవకుండా ఉండాలని బాత్, బిస్టల్, సౌతాంప్టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ విజంభించిన రోజుల్లో ఈ సూచనలను పాటించడం సత్ఫలితాలను ఇచ్చిందని వారు చెబుతున్నారు. (మూడు విడతలుగా లాక్డౌన్ ఎత్తివేత) ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్‌పైన కరోన వైరస్ 72 గంటలు, రాగిపై ఎనిమిది గంటలు, కార్డ్‌బోర్డ్‌పై నాలుగు గంటలపాటు బతికి ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుక్కోవడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు ఎక్కువగా ప్యాకేజీల కోసం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తుండడంతో పరిశోధకులు ఈ 72 గంటల సూచనను తీసుకొచ్చినట్లున్నారు. ఈ సూచనను తప్పకుండా పాటించాల్సిందిగా ప్రజలకు బ్రిటీష్ ప్రభుత్వ వెబ్సైట్ పిలుపునిచ్చింది. వాస్తవానికి ఇది అన్ని దేశాల ప్రజలకు వర్తిస్తుంది. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు) -
మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్!
సాక్షి, హైదరాబాద్ : ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకుంటే కరోనా లాంటి వైరస్లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలతో పాటు కొత్త కొత్త వ్యాధులు ఇవన్ని కూడా పర్యావరణానికి మనం చేస్తున్న హాని వల్లేనని గ్రహించాలని సూచించారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్లు సోకడం ముమ్మరమవుతుందనేది మహ్మమ్మారి కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ఈ సందర్బంగా తెలిపారు. (భూమాతకు కృతజ్ఞతలు తెలుపుదాం: మోదీ) మానవ తప్పిదాల వల్లే వైరస్లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైరస్‌లను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పర్యావరణ విధ్వంసంతోనే గతంలో మెర్స్, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ, ఎబోలా లాంటి వ్యాధులు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందేనని, ఇప్పుడు కొత్తగా కరోనా.. ఇలా మానవులను వరుస పెట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్లకు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆరోగ్యంపై ప్రభావం చూపి మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. (పుడమి తల్లికి ప్రణామం) భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేదని మంత్రి అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచడాన్ని ఉద్యమంలాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ‘చెట్టు అంటే కలప కాదు, అదొక జీవ వ్యవస్థ అని గ్రహించాలి. మానవ జాతిని ఇన్ని కోట్ల సంవత్సారాలు సంరక్షిస్తున్నది అడవులతో కూడిన జీవ వ్యవస్థని గుర్తించాలి. అందుకే ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షించండి, కొత్తగా మొక్కలను నాటండి’ అని మంత్రి అల్లోల పిలుపునిచ్చారు. (వరమా.. శాపమా!) -
వైరస్ వార్!
-
మరో నలుగురు వైద్య సిబ్బంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లో కరోనా బారిన పడిన వారికి అవిశ్రాంతంగా వైద్య సేవలు అందిస్తున్న మరో నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 54 మంది వైద్య సిబ్బంది మరణించారు. క్రోయ్‌డాన్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌గా పని చేస్తున్న 57 ఏళ్ల క్రిషన్ అరోరా కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు ‘ది సౌత్ వెస్ట్ లండన్ క్లినికల్ కమిషనింగ్ గ్రూప్’ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. (వుహాన్ వైరాలజీ సంస్థలో 1500 వైరస్లు..!) ఎడిన్బర్గ్ రాయల్ ఇన్‌ఫార్మరీలో పదవీ విరమణ చేయకుండా ఏ అండ్ ఈ వర్కర్‌గా పని చేస్తున్న 73 ఏళ్ల జాన్ మర్ఫీ వైరస్ బారిన పడి శుక్రవారం మరణించారు. ఆమెను సహచరులంతా ‘మా మర్ఫీ’ అంటూ ఆత్మీయంగా పిలిచే వారు. ఆమె దాదాపు 30 ఏళ్ల పాటు ఆస్పత్రికి సేవలందించారు. ముందుగా ఆసుపత్రిలో స్వీపర్‌గా చేరి ఆమె ‘క్లినికల్ సపోర్టింగ్ వర్కర్’గా పదోన్నతి పొందారు. మిడిల్స్‌బ్రోగ్‌లోని జేమ్స్‌కుక్ యూనివర్శిటీ ఆస్పత్రిలో పని చేస్తున్న పట్రిపియా క్రోహ్రస్ట్ అనే హెల్త్ వర్కర్ మంగళవారం చనిపోయారు. నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో ఆ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. (కరోనా మళ్లీ మళ్లీ రావచ్చు: డబ్ల్యూహెచ్ఓ) ఉత్తర లండన్‌లో 26 ఏళ్ల సోంజా కేగాన్ అనే హెల్త్ వర్కర్ కరోనా బారిన పడి శుక్రవారం మరణించారు. ఆమెకు ఓ చిన్న పాప ఉంది. ఆమె ఎన్ఫీల్డ్లోని ఎలిజబెత్ లాడ్జ్ కేర్‌లో పని చేస్తున్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతూ అకాల మృత్యువు పాలైన డాక్టర్ కిషన్ అరోరా నుంచి సోంజా కేగాన్ వరకు నలుగురు వృత్తిపరంగా అంకిత భావం కలిగిన వారే కాకుండా దయార్ద్ర హృదయులంటూ వారికి వారి మిత్రులు ఘనంగా నివాళులర్పించారు. వారిని వీరులుగా అభివర్ణించారు. (ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్‌కు ఏమైంది?) -
ఎంజీ మోటార్స్ కార్లలో కరోనా నియంత్రణ సాంకేతికత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ తన కార్లలోని క్యాబిన్ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు క్యాబిన్ స్టెరిలైజేషన్ టెక్నాలజీ పేటెండ్ పొందిన సింగపూర్‌కు చెందిన మెడ్‌క్లిన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. హెక్టార్, జెడ్ఎస్ ఈవీ కార్లలో ఏర్పాటుకు పరిశోధనలు జరుగుతున్నాయని కంపెనీ ఇండియా ఎండీ అండ్ ప్రెసిడెంట్ రాజీవ్ చాబా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కస్టమర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా కార్ల ఉపరితల భాగాలను వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవటం అత్యవసరమన్నారు. -
ముప్పేట దాడిలో విలవిల!
వందేళ్ల నాడు పుట్టిన స్పానిష్ వైరస్ దెబ్బకు మన దేశంలో 1.25 కోట్ల మంది చనిపోయారని బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా చెబుతోంది. ఆ సంఖ్య గరిష్టంగా 1.75 కోట్ల వరకు ఉందని అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ వెల్లడించారు. మహమ్మారి ధాటికి బలైనవారి సంఖ్యలో ఇంతటి వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి కారణం హైదరాబాద్ స్టేట్ పరిధిలో చనిపోయినవారి వివరాలను నాటి నిజాం ప్రభుత్వం తొక్కిపెట్టడం.. ఇలాగే మరికొన్ని సంస్థానాలు కూడా చేశాయి. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వేసిన లెక్కలు తక్కువగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: కోట్ల మందిని పొట్టన పెట్టుకుంటున్న వైరస్ ఓవైపు.. అప్పటికే కరువు విలయతాండవం చేస్తుండటంతో ఆకలి చావులు మరోవైపు.. రుతుపవనాలు బాగా ఆలస్యమై సాగును దెబ్బతీసిన కలసిరాని కాలం మరోవైపు.. ఇదీ అసలైన ముప్పేట దాడి అంటే. 1920.. సరిగ్గా వందేళ్ల కింద ఇదీ మన పరిస్థితి. ఇప్పుడు కరోనా వైరస్ పంజా విసిరినా.. దాని బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు మనకు ఊరటనిస్తోంది. త్వరలోనే దాని బారి నుంచి మనం బయటపడతామనే ధీమాతో పాటు ఒక్క పేద కుటుంబం కూడా పస్తులుండని పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ నాటి పరి స్థితి ఎంత భయానకంగా ఉండేదో ఓ సారి తెలుసుకుందాం.. ఇటు అంటు వ్యాధి.. అటు ఆకలి చావులు ఏడో నిజాం.. నాడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. హైదరాబాద్ నగరంలో అన్ని హంగులు ఉండాలని తాపత్రయపడి ఆధునికతకు ఆద్యుడయ్యాడు. కానీ ప్రజల సంక్షేమం అంతగా పట్టదన్న చరిత్రకారుల మాటలు నిజం చేసేలా వందేళ్ల నాటి పరిస్థితులు నిలిచాయి. 1918 నుంచి రెండేళ్ల పాటు స్పానిష్ వైరస్ ధాటికి జనం పిట్టల్లా రాలిపోయారు. అప్పటికే దక్కన్ పీఠభూమిపై ఆకలి కేకలు మిన్నంటాయి. 1890 నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. తరచూ ఏర్పడుతున్న కరువులో ఆకలి చావులు తీవ్రమయ్యాయి. దీనికి తోడు మూసీ వరదలు, గత్తర ప్రబలడం.. వెరసి అంతా గందరగోళంగా ఉంది. అదే సమయంలో మరోసారి కరువు పంజా విసిరింది. జనం తిండి లేక చనిపోతున్నతరుణంలో స్పానిష్ వైరస్ విరుచుకుపడింది. ఇటు ఆకలి చావులు, అటు అంటువ్యాధి మృతులు వెరసి.. దక్కన్ పీఠభూమి శవాల దిబ్బగా మారింది. అక్కడితో ప్రకృతి కడుపు మంట తీరలేదు. వైరస్ ప్రభావం తగ్గుతోందనుకుంటున్న తరుణంలో అదే సమయంలో రుతు పవనాలు ఆలస్యంగా రావటంతో కాలం కలసిరాలేదు. దీంతో ఏకంగా 20 శాతానికంటే ఎక్కువ మేర దిగుబడులు తగ్గిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా కనిపించింది. దీనివల్ల ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. రెండేళ్ల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. మృతుల వివరాలు వెలుగు చూడనివ్వని నిజాం ఆకలి చావులు, అంటువ్యాధి మృతులు హైదరాబాద్ సంస్థానంలో అధికంగా నమోదయ్యాయి. కానీ ఈ మృతుల వివరాలు బయటి ప్రపంచానికి నిజాం తెలియనివ్వలేదు. స్పానిష్ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారిలో 43 శాతం భారతీయులే కావటంతో ఇక్కడి మృతుల సంఖ్యపై యావత్తు ప్రపంచం దృష్టిపెట్టింది. చనిపోయిన వారి వివరాలను సేకరించే బాధ్యతను నాటి బ్రిటిష్ పాలకులు కొందరు నిపుణులకు అప్పగించారు. వారు దేశవ్యాప్తంగా వివరాలు సమీకరించారు. కానీ నిజాం మాత్రం తన పరిధిలో చనిపోయిన వారి లెక్కలు ఇచ్చేందుకు నిరాకరించాడు. అపర కుబేరుడిగా, హైదరాబాద్ సంస్థానాన్ని ఆధునిక ప్రాంతంగా, అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పేరు గడించాలన్నది ఆయన ఆరాటం. ఆ పాలనకు ఈ మృతుల లెక్కలు మచ్చలా మిగిలిపోతాయని భయపడ్డట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే బ్రిటిష్ పాలకులు వేసుకున్న లెక్కలు చాలా తక్కువగా ఉన్నాయని అమెరికా కోడై కూసింది. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియాలో ఇప్పటికీ ఈ‘తప్పుడు’ లెక్కలే ఉన్నాయి. ఈ మరణాలపై తదుపరి ఇతర పరిశోధకులు వెలువరించిన పుస్తకాల్లో లెక్కలు ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం. అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ చూపిన లెక్కల్లోని గరిష్ట మొత్తం అంత ఎక్కువగా ఉండటానికీ ఇదే కారణం. ఉచిత భోజనాలు పెట్టాల్సిందే అంటు రోగం, కరువుకాటకాలతో అతలాకుతలమైన సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సిందే. కానీ నిజాం ఆ పని చేపట్టలేదని తెలుస్తోంది. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఆకలితో ఎంతోమంది అలమటిస్తూ తనువు చాలిస్తున్నా.. ఆయన ఖజానా నుంచి వారికి సాయం చేయలేదని చెబుతారు. విషయం తెలిసి ఈ ప్రాంత బ్రిటిష్ రెసిడెంట్ జోక్యం చేసుకుని నిజాంకు ఆదేశాలు జారీ చేయటంతో అప్పుడు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయించే చర్యలు ప్రారంభించారని చెబుతారు. అంటువ్యాధులకు చికిత్స కోసం వైద్య వసతి కొంత వరకు మెరుగ్గానే ఉన్నా.. పేదలను ఆదుకునే చర్యలు మాత్రం లేవనేది వారి మాట. -
సోషల్ వైరస్
-
నల్లాల ద్వారా కరోనా రాదు..
సాక్షి, హైదరాబాద్: ‘తాగునీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుంది. ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీటిని తాగొద్దు. ఇతర పనులకు కూడా వినియోగించుకోవద్దు.’ఇజ్రాయెల్ నుంచి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పు డు ప్రచారమిది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుపట్టింది. నీటి పైపుల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ తాగునీటి విషయంలో ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్‌లో నమోదవుతున్న కరోనా బాధితుల సంఖ్యకు, తాగునీటికి సంబంధం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిఖ్ లాజరెవిచ్ వెల్లడించారు. కేవలం మనిషిని ఇంకో మనిషి తాకడం ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుందే తప్ప.. గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటిది కాదన్నారు. కనీసం మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం పాటించడం, ముఖ భాగాలను తాకకపోవడం వల్లే కరోనా వైరస్‌ను నియంత్రిస్తాయని, అందరూ ఈ భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు వ్యక్తిగత, పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలంది. -
ఒక టీస్పూన్ లాలాజలంలో ఎంత వైరసో తెలుసా?
అంటుకుంటే వదలదు...అక్షరాలా.. యాభై వేల కోట్లు! కోవిడ్ బాధితుడి ఒక టీస్పూన్ లాలాజలంలో ఉండే కరోనా వైరస్ల సంఖ్య ఇది. ఒక్క దగ్గు లేదా తుమ్ము చాలు.. ఈ వేల కోట్ల వైరస్లలో కొన్ని తుంపర్లతో కలిసి పరిసరాల్లోకి చేరిపోయేందుకు.. ఆ క్షణంలో ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నా సరే.. కొంచెం అటుఇటుగా 32,456 వైరస్లు నోరు, గొంతు పైపొరల్లోకి చేరిపోతాయి. ఆ సెకను నుంచి శరీరంలో వైరస్లు ఇబ్బడిముబ్బడి కావడం మొదలవుతుంది. ఆ తరువాత ఒక్కో దశలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే..కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఇంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటున్నాయో ఇట్టే అర్థమైపోతుంది. సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) బాధితుడు ఒక్కసారి తుమ్మినా, దగ్గినా కోటానుకోట్ల వైరస్లు పరిసరాల్లోని ఉపరితలాలపై చేరిపోతాయి. చేతిని అడ్డం పెట్టుకుని ఉంటే ఆ చేతులతో తాకిన ప్రతిచోటా వైరస్ ఉండిపోతుంది. ఉపరితలాన్ని బట్టి ఈ వైరస్ రెండు గంటల నుంచి మూడు రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఇటీవలే అమెరికాలో జరిగిన పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. అంటే.. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా.. మనుషులకు మీటర్ ఎడంగానే ఉంటున్నా కొంచెం కష్టమైనా సరే.. బలవంతంగా చేతులను ముఖానికి తాకకుండా జాగ్రత్త పడుతున్నా కూడా వైరస్ బారిన పడే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయన్నమాట. ఒక్కసారి ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తరువాత వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది? ఎంత చేటు తెస్తుందన్నది చూస్తే... (కరోనా వ్యాప్తి: మాస్క్.. మాఫియా..!) తుమ్మినా... దగ్గినా..మాట్లాడినా డేంజరే... కరోనా వైరస్ బాధితుడు ఒక్క మాట మాట్లాడితే చాలు.. అతడి గొంతు నుంచి పైకి వచ్చే గాలి ద్వారా వైరస్‌లతో కూడిన చిన్నచిన్న తుంపరలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని వైరస్లు ఇతరులు తినే ఆహారంపై చేరిపోవచ్చు. మరికొన్ని వేళ్లమధ్యలో ఉండిపోవచ్చు. మరికొన్ని ముక్కు ద్వారా సైనస్‌లోకి చేరి మళ్లీ గొంతులో స్థిరపడిపోవచ్చు. ఈ దశలో ఒక్క షేక్‌హ్యాండ్ ఇచ్చినా సరే.. అవతలి వ్యక్తి చేతులపై కనీసం 43,654 వైరస్లు పోగుపడతాయని, షేక్‌హ్యాండ్ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 3,12,405కు చేరుతుందని అంచనా. ఇప్పుడు గొంతులో మిగిలిపోయిన వైరస్ల సంగతి చూద్దాం. కొన్ని వైరస్లు లాలాజలపు చుక్కలతో కలిసి ఊపిరితిత్తుల్లోని ఒక కొమ్మపై చేరిపోతాయి. వెచ్చగా, తడిగా ఉండే కణజాలంపై ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ వైరస్లు ఎంత సూక్ష్మస్థాయిలో ఉంటాయంటే.. మన వెంట్రుకను ఫుట్‌బాల్ మైదానం అంత సైజుకు పెంచితే వైరస్ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే ఉండేంత! (జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?) -
కేఫ్.. ఎలా సేఫ్!
సాక్షి, హైదరాబాద్: నలుగురు ఓ చోట చేరితే కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రబలే ప్రమాదం ఉన్నందున వీలైనంత మేరకు గుమికూడే పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వం వెల్లడించింది. అన్నీ బంద్ చేయించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు జనానికి ఆహ్వానం పలికే కేఫ్‌లు మాత్రం ఇప్పుడూ అదే పంథాను అనుసరిస్తూ బెదరగొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల ఇప్పటికీ అవి కిటకిటలాడుతూనే ఉన్నాయి. సమోసాలు తింటూ చాయ్ బిస్కెట్లు లాగించే వారితో కేఫ్‌లు నిండుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతనగరం పరిధిలో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. (హైదరాబాద్ : కరోనా భయంతో సిటీజనుల్లో అలజడి) ఓ వైపు కరోనా వైరస్ భయపెడుతుండటంతో వీలైనంత వరకు జనసమూహం లేకుండా చేయటం ద్వారా వైరస్ మన ప్రాంతంలో విస్తరించకుండా చూడాలన్న తాపత్రయం కనిపిస్తుండగా, కేఫ్‌ల నిర్వాహకులు మాత్రం దాన్ని పట్టించుకుంటున్నట్టు కనిపించటం లేదు. చాలావాటిని మూసేయించిన సర్కారు జనం సరుకులు కొనేందుకు వీలుగా మాల్స్, ఇతర దుకాణాలకు మాత్రం అనుమతించింది. ఇవి నిత్యావసరాలకు సంబంధించినవి కావటంతో వాటిని మూసివేయించటం సరికాదని ప్రభుత్వం భావించింది. కానీ ఏ రకంగానూ అత్యవసరం, నిత్యావసరం జాబితాలోకి రానప్పటికీ కేఫ్‌లు మాత్రం యథాప్రకారం తెరిచే ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 23 వేల వరకు కేఫ్‌లున్నాయి. ఇవన్నీ ఇప్పుడు కోవిడ్ భయం ఇసుమంతైనా లేకుండా దర్జాగా జనంతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గతంతో పోలిస్తే రద్దీ తగ్గినా, చాలా ప్రాంతాల్లో ఎప్పటిలాగేనే కేఫ్‌లు కిటకిటలాడుతున్నాయి. (కనికా కపూర్‌కు కరోనా) ఇవి ప్రమాదకరం కావా... 1. గ్లాసులు శుభ్రం చేస్తారా.. కొన్ని పెద్ద కేఫ్‌లలో ఎప్పుడు చూసినా వందమందికి తగ్గకుండా కనిపిస్తారు. చిన్నవాటిల్లో ఆ సంఖ్య పది నుంచి 20 మంది వరకు ఉంటుంది. కేఫ్ అనగానే ముందుగా కనిపించేది చాయ్. నిత్యం వందల కప్పుల చాయ్ ఖర్చవుతుంటుంది. చాయ్‌కి ముందుగా వేళ్లు నీటిలో మునిగేలా బాయ్ మంచినీటి గ్లాసులు తెచ్చిపెడతాడు. ఈ గ్లాసులను సరిగా శుభ్రం చేయరన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితిలో ఇది ప్రమాదంగా పరిణమిస్తుందన్న భయం వ్యక్తమవుతోంది. 2. ఆ వదిలేసిన బిస్కెట్లు, సమోసాలే కేఫ్‌లలో బిస్కెట్లు, సమోసాలు అనగానే ప్లేట్లో కొన్నింటిని తెచ్చి పెడతారు. అందులో మనం తినగా మిగిలిన వాటిని తిరిగి తీసుకెళ్లి ఇతరులకు అందిస్తారు. చిన్న నిర్లక్ష్యం ఉన్నా వైరస్ విస్తరించే తరుణంలో ఇది ప్రమాదకరమే కదా..! 3. ఒకరికొకరు తగిలేలా.. ఒక టేబుల్ చుట్టూ నలుగురైదుగురు కూ ర్చుంటారు. ఎక్కువగా వారంతా ఒకరినొకరు తగిలేలా కూర్చుంటారు. ఇది ప్రస్తుత పరిస్థితిలో ప్రమాదకరం. 4. ఒక సిగరెట్.. ముగ్గురు మిత్రులు.. ఒక సిగరెట్ వెలిగించి సరదాగా దాన్ని ఇద్దరు ముగ్గురు మిత్రులు కాల్చే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇందుకు ఎక్కువగా కేఫ్‌లే వేదికవుతాయి. చాయ్ తాగి ఓ సిగరెట్ వెలిగించి తలో రెండు పఫ్‌లు లాగించి వెళ్లిపోతుంటారు. ఈ ఎంగిలి కూడా ప్రమాదకరమే. కేఫ్‌లో పోగయ్యే అవకాశం లేకుంటే ఇది కూడా కొంతమేర తగ్గుతుంది. -
వైరస్‌ను జయించిన మిరప వంగడాలు
మిరప.. ఉద్యాన పంటల్లో ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో సాగవుతుంటే, ఇందులో 20–22 శాతం ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 40 శాతంతో గుంటూరు జిల్లా అగ్రభాగాన నిలుస్తోంది. మిరపకు వెరస్ల బెడద అధికమన్న సంగతి తెలిసిందే. జెమిని వైరస్ / బొబ్బర తెగులు అనే పేర్లతో వ్యవహరిస్తున్న వైరస్ కొన్నేళ్లుగా మిర్చి రైతులను బెంబేలెత్తిస్తోంది. వైరస్ ఆశించిన చేలో పంటపై రైతు ఆశలు వదిలేసుకోవాల్సిందే. లేదా నిత్యం పంటచేలోనే ఉంటూ రకరకాల మందుల పిచికారీతో నిరంతరం యుద్ధమే చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ను తట్టుకొనే 3 మిర్చి వంగడాలను గుంటూరులోని లాం ఉద్యాన పరిశోధన కేంద్రం రూపొందించటం విశేషం. ఈ కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరిప్రసాదరావు, సీనియర్ శాస్తవేత్త డాక్టర్ సి.వెంకటరమణ సారధ్యంలో జెమిని వైరస్/ బొబ్బర తెగులును తట్టుకోగలిగిన మిరప రకాలు ఎల్సీఏ–657, ఎల్సీఏ–680, ఎల్సీఏ–684లను రూపొందించారు. చిరుసంచుల రూపంలో రైతులకు అందజేసి 2019–20 సీజనులో సాగు చేయించారు. చేబ్రోలు మండలం శలపాడులోని దొడ్డపనేని సాంబశివరావు చేలో పండించిన ఈ మూడు రకాలపై ఇటీవల క్షేత్రప్రదర్శన నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సరల్ చిరంజీవ్ చౌరది, విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.మిరప సాగులో హైబ్రిడ్ విత్తనాలు స్వైరవిహారం చేస్తున్న ఈ కాలంలో విడుదలైన నూతన సూటి రకం వంగడాలు రైతులకు మేలుచేస్తాయని శాస్త్రవేత్తలు, రైతులు అంటున్నారు. విత్తనాలను ప్రతి ఏటా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా.. రైతు పండించిన పంట నుంచి సేకరించిన విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. – బి.ఎల్.నారాయణ,సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా ఎల్సీఏ–657 మొక్కలు ఎత్తుగా, దృఢమైన కాండంతో 3–4 బాగా నిటారుగా ఉండే కొమ్మలతో పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుతో మందంగా అనిపిస్తాయి. కాయలు ముదురు ఆకుపచ్చ రంగుతో మంచి నిగారింపుతో ఉంటాయి. ఎండుకాయలు మంచి ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో, ఎక్కువ కారంగా ఉంటాయి. జెమిని వైరస్/ బొబ్బర/ మిరప ఆకుముడుత వైరస్‌ను తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని కూడా తట్టుకోగలదు. ఎల్సీఏ–680 ఈ రకం మిర్చి మొక్కలు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి. ఆకులు ఎక్కువగా ఉండి, కాయలన్నీ ఆకులతో కప్పబడినట్టుగా ఉంటాయి. కాయలు లావుగా ఉండి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. పచ్చి మిరప సాగుకు అనువైన రకం. ఎండుకాయ మంచి రంగుతో నిగారింపుతో, మధ్యస్థ కారంగా ఉంటుంది. జెమిని వైరస్/ బొబ్బర/ మిరప ఆకుముడత వైరస్‌ను తట్టుకుంటుంది. ఎల్సీఏ–684 ఈ రకం మిరప మొక్కలు ఎక్కువ కొమ్మలతో ఒక మోస్తరు గుబురుగా కనిపిస్తాయి. కాయలు ఆకుపచ్చ రంగులో సన్నగా 9–10 సెం.మీ పొడవుగా ఉంటాయి. పచ్చికాయలు పక్వతకు వచ్చినపుడు మెరూన్ రంగులో ఉన్నా తర్వాత ఆకర్షణీయమైన ఎరుపు రంగుకు మారతాయి. ఎండుకాయలో ముడతలు స్వల్పంగా ఉండి, ఎక్కువ కారంగా ఉంటాయి. జెమిని వైరస్/ బొబ్బర/ ఆకుముడత వైరస్‌ను తట్టుకునే రకం. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి జెమిని వైరస్ / బొబ్బర తెగులును నూరు శాతం తట్టుకొని, ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడిని సాధించే మిరప రకాలు రూపొందించడానికి నాలుగైదేళ్లుగా మేం చేసిన కృషి ఫలితంచింది. ఈ వంగడాలు మా పరిశోధన స్థానంలో 20–25 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేశాయి. రాబోయే సీజన్లో వీటిని సాగు చేయాలని భావించే రైతులు లాం ఫారంలో తమను సంప్రదిస్తే.. చిరుసంచుల రూపంలో రైతుకు 25 గ్రాముల విత్తనాలను ఇస్తాం.– డా. సి.వెంకట రమణ, సీనియర్ శాస్తవేత్త,ఉద్యాన పరిశోధన కేంద్రం,లాం ఫారం, గుంటూరు -
కరోనా వైరస్‌తో మృతులు లక్షల్లో ఉండొచ్చు
చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేసిన కరోనా (కోవిడ్–19) వైరస్ వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ఏఎన్‌యూ) హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రపంచ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భయానకంగా మారిన కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కనిష్టంగా 15 లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనం హెచ్చరించింది. పర్యవసానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కనిష్టంగా లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లుతుందని అధ్యయనంలో తేలినట్టు పేర్కొంది. కోవిడ్ వైరస్ బారిన పడిన ప్రతి దేశం తమ జీడీపీలో దాదాపు ఎనిమది శాతం నష్టపోతుందని హెచ్చరించింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల స్టాక్ ఎక్స్ఛేంజీలు కుప్పకూలాయి. (50 బిలియన్ డాలర్ల ఎగుమతులకు ‘కోవిడ్’ దెబ్బ! ) చైనా తర్వాత బ్రిటన్, అమెరికా దేశాల్లో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ తరఫున అధ్యయనం జరిపిన వార్విక్ మ్యాక్‌కిబ్బన్, రోషన్ ఫెర్నాండో తెలిపారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో మడతి చెందిన వారి సంఖ్య 3.4 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చైనాలో వుహాన్‌లో గత డిసెంబర్ 31వ తేదీన మొదటి వైరస్ కేసు నమోదైన విషయం తెల్సిందే. (హృదయాలను కదిలిస్తున్న ఫొటో) చైనా, భారత్ దేశాల్లో ప్రజలు కోవిడ్ బారినపడి లక్షల్లో మరణిస్తారని, ఒక్క అమెరికాలోనే కనిష్టంగా 2.30 లక్షల మందికి పైగా మరణిస్తారని ఆ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగే బ్రిటన్‌లో 64 వేల మంది, జర్మనీలో 79 వేల మంది, ఫ్రాన్స్‌లో 60 వేల మంది మరణించే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇప్పటికే వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్న దక్షిణ కొరియా, ఇటలీ దేశాల్లో కూడా మృతుల సంఖ్య లక్షల్లో ఉంటుందని వారంటున్నారు. పర్యవసానంగా బ్రిటన్ జీడీపీ 1.5 శాతం, అమెరికా జీడీపీ రెండు శాతం పడిపోతుందని, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడొచ్చని హెచ్చరించింది. అదే గరిష్టంగా నష్టాలను అంచనా వేసినట్లయితే ఒక్క చైనాలో అత్యధికంగా ఆ తర్వాత స్థానంలో అమెరికాలో లక్షల్లో మత్యువాత పడే ప్రమాదం ఉందని వారు తెలిపారు. బ్రిటన్‌లో 2,90 కోట్ల మంది, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో కూడా భారీ సంఖ్యలో మరణించే అవకాశం ఉందన్నారు. ఒకో పరిస్థితుల్లో ఒకో రకమైన నష్టం వాటిల్లగలదని యూనివర్సిటీ మూడు రకాల ప్రమాదాలను అంచనా వేసినట్టు నివేదిక తెలియజేసింది. (వేయి రోగాల పుట్టరా ఈ అరచేయి..) క్యూఎస్ (క్వాకరెల్లీ సైమండ్స్) ప్రపంచ యూనివర్శిటీ ర్యాకింగ్‌ల ప్రకారం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ ఆస్ట్రేలియాలో మొదటి శ్రేణిలో ఉంది. 2017, 2018 సంవత్సరాల్లో ప్రపంచ టాప్ 20 ల్లో ఒకటి. 2019 సంవత్సరానికి 24 వ ర్యాంకు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల ప్రకారం ఈ యూనివర్శిటీకి ఆస్ట్రేలియాలో రెండో ర్యాంక్, ప్రపంచంలో 49వ ర్యాంక్. ముఖ్యంగా పరిశోధనాంశాల్లో ఈ యూనివర్శిటీకి మంచి పేరు ఉంది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ తరఫున కరోనా వైరస్ ప్రభావంపై పరిశోధనలు జరిపిన వార్‌మక్ మ్యాక్‌కిబ్బిన్ అదే యూనివర్శిటీలోని ‘సెంటర్ ఫర్ మాక్రో ఎకనామిక్ అనాలసిస్’కు డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆయనకు పరిశోధనలో సహకరించిన రోషన్ ఫెర్నాండో అదే విభాగంలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థి. (కోవిడ్‌కు కూడా ఎబోలా మందే!) ఇలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు చేపట్టిన నివారణ చర్యలు, వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసే చర్యల నేపథ్యంలో పెద్ద ప్రమాదమేమీ ఉండదని అనేక మంది నిపుణులు ఇప్పటికే చూసించిన విషయం తెలిసిందే. తాజాగా చెబుతున్న అస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ అధ్యయన నివేదిక కేవలం ఆయా గణాంకాల ఆధారంగానే ఊహాజనితంగానో ఉందని అనేక మంది కొట్టిపారేస్తున్నారు కూడా. -
కరోనాను జయించి బయటకు వచ్చారు..
ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. అక్కడి స్థాన కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్చి కూడా అయ్యారు. ఆయన ఈ వైరస్ బారిన పడిందీ మరెక్కడో కాదు. వైరస్ బట్టబయలైన చైనాలోని హుబీ రాష్ట్రం, వుహాన్ నగరంలో. ఆ శతాధిక వృద్ధుడి సర్ నేమ్‌ను దాయ్‌గా ఆయన చికిత్స పొందిన ఆస్పత్రి ఇంచార్జి లీ లాయ్ పేర్కొన్నారు. ఆయన తన 101వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే ఆస్పత్రి పాలయ్యారు. దాయ్ విడుదలైనప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని లీ లాయ్ చెప్పారు. ఇంటి వద్ద తన 92 ఏళ్ల భార్య నిరీక్షిస్తుందని, తాను త్వరగా ఇంటకి వెళ్లి ఆమె బాగాగులు చూసుకోవాలని చెబుతుండేవారని డాక్టర్ తెలిపారు. (వేయి రోగాల పుట్టరా ఈ అరచేయి..) అంతకుముందు ఆదివారం 98 ఏళ్ల వృద్ధుడు హు హానియింగ్ కూడా కరోనా వైరస్‌ను జయించి ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఆయనతోపాటు హు హానియింగ్ 54 ఏళ్ల కూతురు కూడా సురక్షితంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన వారిద్దరి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండిందని, అయినా వారిద్దరు చావును జయించి బయటకు వచ్చారని వైద్యులు తెలిపారు. ఆ వృద్ధుడికి వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. చైనాలో ఇప్పటి వరకు 95,700 మంది కోవిడ్ బారిన పడగా, వారిలో 41,600 మంది డిశ్చార్జి అయ్యారు. గత రెండు, మూడు రోజులుగా చైనాలో కొత్త వైరస్ కేసులు గణనీయంగా తగ్గాయని చైనా వైద్యాధికారులు తెలిపారు. (కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని) చదవండి: శుభ్రతే కోవిడ్-19కు మందు -
అలా పెరిగే కోళ్లతో డేంజర్
సాక్షి, న్యూఢిల్లీ : కోళ్ల పరిశ్రమలో లాభాపేక్ష కొక్కరొకో! అంటోంది. స్వల్ప కాల వ్యవధిలో అధిక లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొందరు కోళ్ల పెంపకం దారులు పెడదారులు తొక్కుతున్నారు. జన్యుపరమైన ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా 50, 60 రోజుల్లో పెరగాల్సిన కోడి పిల్లలను 35 రోజుల్లో పెరిగేలా చేస్తున్నారు. పర్యవసానంగా కోళ్ల కాళ్లు, గుండె, ఊపిరితిత్తులు తగిన రీతిలో ఎదగకుండా దెబ్బతింటున్నాయి. వీటివల్ల కోళ్లలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరణం సంభవించకపోయిన కోళ్ల కాళ్లల్లో కురుపులు వస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా అనవసరంగా కోళ్లను వేగంగా పెరగనిచ్చి వాటిని కొంత చౌక ధరలకు విక్రయిస్తుండడం వల్ల వాటినే కొనుగోలు చేసేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు ప్రాధాన్యతనిస్తున్నాయని, ప్రస్తుతం లండన్ మార్కెట్లో ఇదే జరుగుతోందని ‘రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ (ఆర్ఎస్పీసీఏ)’ వెల్లడించింది. ‘వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్’, ‘ఫామ్ యానిమల్ వెల్ఫేర్ ఫోరమ్’లతో కలిసి అతి వేగంగా పెంచుతున్న మూడు రకాల కోళ్ల బ్రీడింగ్‌పై ఆర్ఎస్పీసీఏ అధ్యయనం జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1950లో కోడి పిల్లలు కోతకొచ్చే కోళ్లుగా ఎదిగేందుకు 70 రోజులు పట్టగా ప్రస్తుతం 35 రోజుల్లో ఆ స్థాయికి జన్యు ఇంజెక్షన్ల ద్వారా పెంచేసి విక్రయిస్తున్నారని ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలాంటి కోళ్ల కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ తామిచ్చిన పిలుపునకు కెఎఫ్సీ, మార్క్స్ అండ్ స్పెన్సర్, వెయిట్రోస్ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలా అతి వేగంగా పెంచుతున్న కోళ్లు అనారోగ్యం బారిన పడి చనిపోయే అవకాశం సాధారణంకన్నా రెట్టింపు ఉంటోందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయంలో ఈ అధ్యయనం జరగలేదని, ఇలా వేగంగా పెంచడం వల్ల కోళ్లు ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తోందన్న విషయంలోనే ఈ అధ్యయనం కొనసాగిందని అధ్యయన సంస్థ పేర్కొంది. ఇలా జన్యుపరంగా వేగంగా పెంచిన కోళ్లు అనారోగ్యం, అనవసరమైన బాధతోని అర్ధాయుషు మాత్రమే బతుకుతున్నాయని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ బ్రిటన్ చీఫ్ జేమ్స్ మాక్కోల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కన్నబిడ్డను చూడకుండానే..
సాక్షి, హైదరాబాద్: నవమాసాలు మోసి, బిడ్డను కని.. అమ్మతనాన్ని ఆనందించకుండానే ఆ తల్లి కన్నుమూసింది. మరోపక్క పుట్టిన బిడ్డ కనీసం ముర్రుపాలకూ నోచుకోలేదు. తల్లి స్పర్శకు నోచుకోక ఆస్పత్రి ఎన్ఐసీయూలో ప్రస్తుతం ఆ శిశువు క్షేమంగా ఉన్నా.. తల్లిని కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. కరీంనగర్‌కు చెందిన గర్భిణి షహనాజ్ (24) తీవ్ర జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతుండటంతో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. స్వైన్‌ఫ్లూగా అనుమానించిన వైద్యులు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆమెను బంధువులు వెంటిలేటర్ సాయంతో ఈ నెల 18న రాత్రి పొద్దుపోయాక గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఆమెకు నెలలు నిండటం, పరిస్థితి విషమంగా ఉండటంతో 19వ తేదీన సిజేరియన్ చేశారు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు పరీక్షలు నిర్వహించగా, ఫ్లూ నెగటివ్ రావడంతో బిడ్డను ఇదే ఆస్పత్రి పీడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూకు తరలించారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండటంతో తల్లిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఫ్లూ బారి నుంచి కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. పరిస్థితి విషమించి షహనాజ్ సోమవారం కన్నుమూసింది. బిడ్డను కళ్లారా చూడకుండానే మృతి చెందడం, తల్లిపాల కోసం బిడ్డ గుక్కపట్టి ఏడవటం కలచివేసింది. విజృంభిస్తోన్న వైరస్ చలికాలంలో విజృంభించే హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూకారక వైరస్.. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా విస్తరిస్తోంది. జనవరి నుంచి రాష్ట్రంలో 148 కేసులు నమోదు కాగా, వీరిలో హైదరాబాద్ జిల్లావాసులే యాభై మందికిపైగా ఉన్నారు. బాధితుల్లో ఇప్పటికే ఒకరు మృతిచెందగా, తాజాగా బాలింత మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గాలి ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం గాంధీలో మౌలాలికి చెందిన బాలిక (11)తో పాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో నలుగురు ఫ్లూ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్తే మందు.. – డాక్టర్ శ్రీధర్, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి – సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించగానే స్వైన్‌ఫ్లూగా అనుమానించాల్సిన పనిలేదు. – రోగ నిరోధకశక్తి తక్కువుండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ బారినపడే అవకాశాలు ఎక్కువ. – స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువ వేధిస్తే వైద్యులను సంప్రదించాలి. – వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఇది నేర్పించాలి. – స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. -
కరోనా వైరస్‌కు ‘వితిన్ డేస్’
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రస్తుత కరోనా వైరస్‌కు ‘వితిన్ డేస్ (రోజుల్లోనే)’ అని పేరు పెట్టాలని వైరస్ వర్గీకరణకు సంబంధించిన శాస్త్రవేత్తల అంతర్జాతీయ కమిటీ సూచించింది. ప్రాంతాలు, లేదా జంతువుల పేర్లు వచ్చేలా ఈ వైరస్‌కు నామకరణం చేయాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తల కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వైరస్‌కు తాత్కాలికంగా ‘2019–ఎన్సీవవీ’ అని పేరు పెట్టిన విషయం తెల్సిందే. (కరోనా వైరస్ మృతుల సంఖ్య వేలల్లోనా!) గతంలో కరోనా వైరస్ రకాలకు ‘సార్స్, మెర్స్’ అని పేర్లు పెట్టారు. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం కనుక కిరీటి ఆకృతిలో ఉన్న వైరస్‌ను కరోనా వైరస్ అని పిలుస్తూ వస్తున్నారు. వాటిలో పలు రకాలు ఉండడం వల్ల వాటిని గుర్తించడం కోసం పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత వైరస్‌కు చైనా కరోనా వైరస్ అని, వుహాన్ కరోనా వైరస్ అని, స్నేక్ ఫ్లూ’ అని రకరకాల పేర్లతో ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. పత్రికల్లో, మాగజైన్లలో, సోషల్ మీడియాలో వచ్చిన ఇలాంటి పేర్లన్నింటిని పరిశీలించిన అనంతరం ‘వితిన్ డేస్’ అని పేరు పెడితే బాగుంటుందని వైరస్ల వర్గీకరణల అంతర్జాతీయ కమిటీ (ఐసీటీవీ) అభిప్రాయపడింది. ఇంతకుముందు వైరస్‌లకు ‘సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ను క్లుప్తీకరించి సార్స్‌గా, ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ను క్లుప్తీకరించి మెర్స్గా పిలిచారు. (కరోనా విశ్వరూపం) అయితే మెర్స్తోపాటు స్పానిష్ ఫ్లూ, లైమ్ డిసీస్, జపనీస్ ఎన్సిఫలటీస్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంకీ ఫాక్స్ లాంటి పేర్లు జంతువులను, ప్రాంతాలను సూచిస్తున్నాయని, అలాంటి పేర్లు పెట్టడం సముచితం కాదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ‘వితిన్ డేస్’ అని కొత్త రకమైన పేరు పెట్టారు. కొన్ని రోజుల్లోనే ఇది వేగంగా విస్తరించి ప్రాణాంతకం అవుతుంది కనుక ఈ పేరు పెట్టి ఉండవచ్చు. (కరోనా వైరస్: విస్కీతో విరుగుడు!) అన్నోన్, డెత్, ఫాటల్, ఎపిడెమిక్ లాంటి భయాందోళనలు రేకెత్తించే పేర్లు కూడా పెట్టరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన మార్గదర్శకాల్లో సూచించింది. అన్య ప్రభావాలకు దారితీసే ఓ జాతి, సంస్కృతి, ఆహార పదార్థాల పేర్లు కూడా పెట్టరాదని పేర్కొంది. తప్పుడు పేరు వల్ల కలిగే అనర్థాల గురించి బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్రిస్టల్ వాట్సన్ వివరిస్తూ ‘స్వైన్(పంది) ఫ్లూ’ వాస్తవానికి మనుషులకు వచ్చిందని, పందులకు రాలేదని, అలా పేరు పెట్టడం వల్ల పందుల నుంచి వస్తుందని భ్రమ పడి ఈజిప్టు అధికారులు 80 వేల పందులను అన్యాయంగా చంపేశారని చెప్పారు. (కరోనా ఎఫెక్ట్ : రూ 8000 కోట్ల నష్టం) సాధారణంగా వైరస్‌లకు పేరు పెడతారు తప్ప, వాటి ద్వారా వచ్చే జబ్బులకు పేరు పెట్టరు. చాలా రకాలైన వైరస్ల వల్ల ‘నిమోనియా’ను పోలిన లక్షణాలుగానీ, నిమోనియాగానీ వస్తుంది. ఇలా చాలా రకాల వైరస్ వల్ల మానవుల శరీరంలో ఒకేరకమైన మార్పులు సంభవిస్తాయి కనుక అలాంటి జబ్బులకు పేరు పెట్టడం కష్టం కావచ్చు. అయితే వైరస్లపేరుతోనే జబ్బులను కూడా పిలవడం సాధారణమైంది. (కరోనా కేసులు 20,522) -
కోరలు చాచిన కరోనా
-
80కి చేరిన కరోనా మృతుల సంఖ్య
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. మరోవైపు సుమారు 3000మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 300మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా సర్కార్ పేర్కొంది. చైనాలోని వూహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకు శరవేగంగా వ్యాపిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. (కరోనా ప్రకంపనలు: హెల్ప్‌లైన్) మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు వారాల్లోపు ఇక్కడ 1000 పడకలతో మరో ఆసుపత్రిని కడతామని ప్రభుత్వం చెబుతోంది. (కరోనా వైరస్‌తో 6.5 కోట్ల మందికి ముప్పు!) -
వ్యాధులు ‘అంటు’కుంటున్నాయి..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే రోగికి ప్రస్తుతమున్న జబ్బుకు తోడు మరికొన్ని తోడవుతున్నాయి. వారి పక్కనున్న వారికి కూడా ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అంతేకాదు వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బందికి కూడా ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. 2018లో కేరళలో నిఫా వైరస్ సోకిన రోగికి వైద్య సేవలు అందించిన నర్సు ఇన్ఫెక్షన్కు గురై మృతిచెందింది. అలాగే హైదరాబాద్‌లో ఒక ప్రభుత్వ పెద్దాసుపత్రిలో గతంలో ఒక ఎయిడ్స్ రోగికి ఇచ్చిన ఇంజెక్షన్ పొరపాటున గుచ్చుకోవడంతో నర్సుకు కూడా ఎయిడ్స్ సోకింది. కొన్నాళ్ల చికిత్స అనంతరం ఆమె ఈ నెల 5న చనిపోయింది. రోగులకు చికిత్స అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వారికి, సందర్శకులకు కూడా ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఇన్ఫెక్షన్లు, ఇతరత్రా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు వ్యవస్థలు, కమిటీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా ఇన్ఫెక్షన్ల నివారణ, నియంత్రణకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లల ఆసుపత్రుల్లో అధికం.. మన దేశంలో ఆసుపత్రులకు వచ్చే వారిలో 10 శాతం మంది జీవితంలో ఒక్కసారైనా ఇన్ఫెక్షన్కు గురై ఉంటారని అంచనా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 7 శాతంగా ఉంది. ఇన్ఫెక్షన్లు ప్రధానంగా రక్తం, మూత్రం ద్వారా కలుగుతాయి. న్యూమోనియా, జీర్ణకోశ వ్యాధుల్లోనూ సంభవిస్తాయి. కొన్ని రకాల శస్త్రచికిత్సలలో ఆపరేషన్ చేసిన 30 రోజుల తర్వాత కూడా ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో ప్రస్తావించింది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు ఆపరేషన్ చేసిన ఏడాదిలోపు ఎప్పుడైనా సోకే ప్రమాదముంది. వాటిని శస్త్రచికిత్స అనంతర అంటు వ్యాధులుగా పరిగణిస్తారు. జీర్ణకోశ అంటు వ్యాధులు ప్రధానంగా పిల్లల ఆసుపత్రుల్లో లేదా పిల్లల వార్డుల్లో కనిపిస్తాయి. కలుషితమైన వాతావరణం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, చేతులు సరిగా కడుక్కోకపోవడం వంటి కారణాల వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. బ్యాక్టీరియా కారణంగా పిల్లలకు ఒక్కోసారి తీవ్రమైన విరేచనాలు అవుతాయి. వైద్యం చేయించుకునేందుకు వచ్చే వృద్ధులకు కూడా ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. డయాబెటిస్, కేన్సర్ వంటి రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారికి త్వరగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. సరైన వెంటిలేషన్ లేకపోవడం, అపరిశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్లు అధికంగా సోకుతున్నాయి. ఐసీయూ వార్డులు సక్రమంగా లేకపోతే వెంటిలేటర్లపై ఉండే రోగులకు త్వరగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. పరికరాలు సరిగా లేకపోవడం, హెల్త్ ప్రొటోకాల్‌ను పాటించకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. ఇన్ఫెక్షన్ల నియంత్రణకు మార్గదర్శకాలు.. ►ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలి. ►రోగులుండే పడకల మధ్య స్థలం ఒకట్రెండు మీటర్ల దూరం ఉండాలి. రోగిని ఆసుపత్రుల్లో చేర్చే ముందు గదిని శుభ్రం చేయాలి. అంతకుముందు ఉన్న రోగి ఉపయోగించిన అన్ని వస్తువులను తీసివేయాలి. బెడ్ షీట్లు ఉతికినవి వాడాలి. ►చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ►సురక్షితమైన ఇంజెక్షన్లను మాత్రమే వాడాలి. ►ప్రతి వైద్య పరీక్షకు ముందు శుభ్రమైన చేతి తొడుగులు వాడాలి. ►కత్తెరలు, స్ట్రెచర్లు, నీడిల్స్ తదితరమైనవి అత్యంత శుభ్రంగా ఉంచాలి. ►రోగులను చూసేందుకు వచ్చే సందర్శకులపై ఆంక్షలు తప్పనిసరి. ఆసుపత్రుల్లో వారి కదలికను పరిమితం చేయాలి. సందర్శకులు ఆసుపత్రి పడకలపై కూర్చోవడం, పడకలపై పడుకోవడం, కాళ్లు పెట్టడం వంటివి చేయకూడదు. ►సందర్శకులు రోగి గదిలోకి వెళ్లేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో గౌను, మాస్క్ ధరించాలి. ►సందర్శకుల సంచులు, ఇతర వస్తువులను రోగి ప్రాంతం వెలుపల ఉంచాలి. ►వార్డ్ నర్సింగ్ సిబ్బంది, సంబంధిత వైద్యులు రోగి బంధువులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు తెలియజేయాలి. ►12 ఏళ్లలోపు పిల్లలను రోగి దగ్గరకు అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే రోగిని తాకడానికి ముందు, తర్వాత చేతి పరిశుభ్రత పాటించాలి. ►రోగితో కేవలం ఒక సహాయకునికి మాత్రమే అనుమతి ఉండాలి. ►మొబైల్ ఫోన్ల వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబటి రోగులు మొబైల్ ఫోన్లను వాడకూడదు. ►సందర్శకుల్లో ఎవరికైనా జలుబు, దగ్గు, దద్దుర్లు లేదా మరేదైనా ఇన్ఫెక్షన్ ఉంటే రోగి దగ్గరకు రానీయకూడదు. ►రోగుల మరుగుదొడ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. సందర్శకులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ►ప్రతి వార్డు, ఐసీయూలు, ఇతరత్రా రోగులుం డే ప్రదేశాలను ఇన్ఫెక్షన్ నియంత్రణ కమిటీ సందర్శించాలి. -
మరో కొత్త వైరస్...చైనాలో టెన్షన్!
వుహాన్‌లోని ఒక సముద్ర, అటవీ ఆహార మార్కెట్లో జంతువుల నుంచి ఓ వైరస్ చైనాలో మనుషులకు సోకింది. ఇప్పటివరకూ మనుషులకు సోకే కారనోవైరస్‌లు ఆరుమాత్రమే ఉన్నాయి.. ఇప్పుడీ కొత్త వైరస్ ఏడోదిగా వచ్చి చేరింది. మరి ఆ వైరస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
కరొనా వైరస్ కలకలం
చెన్నై,టీ.నగర్: చైనాలో కరొనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. కరొనా అనే క్రిమి ద్వారా అక్కడి ప్రజలకు అంటువ్యాధులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ వైరస్‌ను అరికట్టేందుకు అనేక దేశాలు నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది. చైనాకు వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, మాంసం ఆరగించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. చైనాకు వెళ్లేవారు, అక్కడ జలుబు, దగ్గులతో బాధపడేవారి వద్దకు వెళ్లవద్దని తెలిపింది. చైనాకు వెళ్లివచ్చే వారు, లేదా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఢిల్లీ, కోల్కటా, ముంబై, చెన్నై, కోవై వంటి విమానాశ్రయాలలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది. కోవై విమానాశ్రయంలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిగురించి కోవై ఆరోగ్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ కోవై విమానాశ్రయంలో వైద్యబృందం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు ఈ వ్యాధితో ఎవరూ రాలేదని వెల్లడిచారు. -
డెంగీని దూరం పెట్టే దోమలు!
డెంగీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది దోమే. ఈ దోమలు గనక డెంగీ కారక వైరస్‌ను తమ శరీరంలోకి రానివ్వకపోతే వ్యాధన్నదే లేదు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్త ఒమర్ అక్బరీ ఓ విన్నూతమైన ప్రయత్నం చేశారు. డెంగీ వైరస్‌ను దూరంగా పెట్టేలా దోమలను డిజైన్ చేశారు. అంటే ఈ దోమలతో డెంగీ అస్సలు వ్యాపించదన్నమాట. పీఎల్ఓఎస్ పాథోజెన్స్ జర్నల్‌లో పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. నాలుగు వెరైటీల డెంగీ వైరస్‌లను దూరంగా పెట్టేలా కొత్త రకం దోమలును డిజైన్ చేశారు. డెంగీని వ్యాప్తి చేసే ఆడ దోమల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేశారు. దీంతో ఆడదోమ రక్తం పీల్చుకోగానే ఈ యాంటీబాడీ పనిచేయడం మొదలవుతుంది. ఈ రకమైన దోమల సాయంతో అన్ని దోమజాతుల్లోనూ ఈ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేయవచ్చునని ఒమర్ అక్బరీ తెలిపారు. మనిషి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టి అవి వ్యాధులను అడ్డుకునేలా చేయడం ఈ పరిశోధన తాలూకూ విశేషం. దోమల ద్వారా వచ్చే ఇతర వ్యాధులను కూడా ఈ పద్ధతితో అడ్డుకోవచ్చునని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఉష్ణమండల ప్రాంతాల్లో డెంగీ సమస్య కొన్ని లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. ఆసియా, లాటిన్ అమెరికాల్లో ఈ వ్యాధి కారణంగా చాలామంది పసిపిల్లలు మరణిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోగా.. లక్షణాలను నియంత్రిస్తూ వేచి ఉండటమే ప్రస్తుతం ఆచరిస్తున్న పద్ధతి. -
చైనా నుంచి ప్రమాదకరమైన వైరస్
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ఇప్పుడు చైనాలోని వుహాన్ నగరాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 40 మంది నిమోనియా బారిన పడగా, వారిలో ఒకరు మరణించారు. ఇటీవల అదే నగరాన్ని సందర్శించిన జపాన్‌కు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ మేరకు జపాన్ అధికారులు బుధవారం నాడు ధ్రువీకరించగా, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వారం క్రితం థాయ్‌లాండ్‌లో ఓ యువతి ఈ వైరస్ బారిన పడడం, ఇప్పుడు జపాన్ యువకుడికి కూడా అదే వైరస్ సోకినట్లు తెలియడంతో ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని అనుమానించారు. ఆ తర్వాత మనుషుల నుంచే మనషులకు వస్తుందని తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. సెలవుల్లో థాయ్‌లాండ్‌కు వెళ్లిన ఓ చైనా యువతికి ఈ వైరస్ సోకినట్లు తెలియగానే, ఆమె అక్కడి ఆస్పత్రిలోని ఓ ప్రత్యేక వార్డులో చేర్పించారు. ఇటీవల చైనాను సందర్శించి వచ్చిన 15 మంది హాంకాంగ్ యువకులకు ఈ వైరస్ సోకిందో, లేదో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
చలికాలంలో ఇంటిపంటల రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. ► జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ► ఆచ్ఛాదన (మల్చింగ్): కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ► ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర ‡పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి.? సేంద్రియ ఇంటిపంటల సాగుపై సికింద్రాబాద్ తార్నాక (రోడ్డు నంబర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర)లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో కనీసం 10 మంది కోరితే వారాంతంలో శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, విత్తనాలు, వర్మీకంపోస్టు లభిస్తాయి. వివరాలకు.. డా. గడ్డం రాజశేఖర్ – 83329 45368 ∙సిఎస్ఎ కార్యాలయంపై టెర్రస్ గార్డెన్లో డా. రాజశేఖర్ ∙ఎల్లో స్టిక్కీ ట్రాప్ -
అన్ని ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు!
వాషింగ్టన్: అన్ని రకాల ఫ్లూ వైరస్‌లను నిరోధించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు. దాని పేరు 1జీ01. 2017లో ఫ్లూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఒక రోగి శరీరంలో దీనిని గుర్తించారు. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించగా ఈ యాంటీ బయాటిక్ మనుషుల్లో సోకే ఫ్లూ వైరస్లు సహా 12 రకాల వైరస్‌లను నిరోధించింది. మొదట ఎలుకలకు ఫ్లూ వైరస్లు ఎక్కించి 3 రోజుల తర్వాత యాంటీ బయాటిక్ ఇవ్వగా అది సమర్థంగా పని చేసింది. తాజా పరిశోధనల దృష్ట్యా భవిష్యత్తులో అన్ని రకాల ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు తయారు చేస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
ఫ్లూకి విరుగుడు!
మొన్నటివరకూ ఫ్లూ అంటే.. ఒక మందుబిళ్లతో తగ్గిపోయే సమస్య! నిన్నటికి వచ్చేసరికి.. కొన్ని పరీక్షలు, ఒకట్రెండు ఇంజెక్షన్లు కూడా తోడైతేగానీ.. ఉపశమనం ఉండేది కాదు.. మరి నేడు... స్వైన్ ఫ్లూ లేదా హెచ్ఐఎన్1 కావచ్చు... ఫ్లూ పేరు చెబితే చాలు.. మనిషి హడలెత్తిపోయే పరిస్థితి! ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త మోసుకొచ్చారు. ఒకట్రెండు కాదు.. ఏకంగా పన్నెండు రకాల ఫ్లూ వైరస్‌లను దీటుగా ఎదుర్కోగల మందును తయారు చేశారు! ప్రాణాంతక వ్యాధులెన్నింటికో మందులు కనుక్కున్న మానవమేధ... జలుబు విషయానికి వచ్చేసరికి మాత్రం ఇప్పటికీ ఏ పరిష్కారమూ కనుక్కోలేకపోయింది. లక్షణాలను అదుపులో ఉంచడం, నొప్పి తగ్గేందుకు మాత్రలు వేసుకోవడం మాత్రమే మనం చేయగలం. శరీరంలో జలుబుకు కారణమైన వైరస్ కొంతకాలం తరువాత తనంతట తానే ప్రభావం చూపడం మానేస్తే నయమైనట్టు లెక్క. అయితే కాలంతో పాటు జలుబు కారక వైరస్ల తీరూ మారిపోవడంతో సమస్య కాస్తా జటిలమవుతోంది. పక్షులకు మాత్రమే సోకే వైరస్ మనిషికి సోకి బర్డ్‌ఫ్లూ, పందుల వైరస్‌తో స్వైన్‌ఫ్లూ... కొద్దిపాటి మార్పులున్న ఇతర వైరస్‌లతో రకరకాల ఫ్లూ జ్వరాలు మనిషిని చుట్టుముడుతున్నాయి. అందుకే వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రోగనిరోధక ప్రొటీన్‌తో చెక్! మన శరీర రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ ప్రొటీన్ ‘1జీ01’వైరస్‌కు యాంటీబాడీగా పనిచేస్తుందని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ను అందించినప్పుడు ఫ్లూ కారక వైరస్లు శరీరం మొత్తం వ్యాపించడం ఆగిపోవడమే కాకుండా.. తమ నకళ్లను తయారు చేసుకోలేకపోయాయి కూడా. ఎలుకలపై జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వేర్వేరు ఫ్లూ వైరస్‌లను నిరోధించగలిగే సార్వత్రిక వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా సంక్లిష్టమైన ఫ్లూ కేసులకు సమర్థమైన చికిత్స అందించేందుకూ వీలవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అలీ ఎల్బెడీ తెలిపారు. ఇంజెక్షన్ లేదా.. ముక్కుల్లోకి పిచికారీ చేసుకోగల మందు రూపంలో ఈ ప్రొటీన్‌ను ఉపయోగించవచ్చునని చెప్పారు. హెచ్1ఎన్1, హెచ్3ఎన్2లతో పాటు ఇన్‌ఫ్లూయెంజా బి రకం వైరస్‌లను నిరోధించగల టీకా లేదంటే.. ఆయా సీజన్లలో ఎక్కువ ప్రభావం చూపే నాలుగు రకాల వైరస్‌లను అడ్డుకునే క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌ను తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచవచ్చునని వివరించారు. క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌లో ఏటా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘1జీ01’ప్రొటీన్‌తో కూడిన వ్యాక్సిన్ మాత్రం 12 రకాల వైరస్‌ను ఎదుర్కోగలదని వివరించారు. 2017లో ఫ్లూతో బాధపడుతున్న ఓ రోగి రక్తం నుంచి తాము ఈ ప్రొటీన్‌ను వేరు చేశామని, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల ఉపరితలంపై ఉండే ప్రొటీన్‌ను ఇది సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించడంతో దీనిపై తమ ఆసక్తి పెరిగిందని చెప్పారు. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కలేదు.. మామూలుగా ఏ యాంటీబాడీ అయినా.. ఏదో ఒకరకం వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలదు. కానీ 1జీ01 పన్నెండు రకాల వైరస్‌లను ఎలా ఎదుర్కొంటోందో శాస్త్రవేత్తలకూ అంతు చిక్కడం లేదు. వైరస్ సోకిన మూడు రోజులకు ప్రొటీన్‌ను అందించినప్పటికీ అది సమర్థంగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్లూ కోసం వాడే టామీ ఫ్లూ మాత్రను లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. వైరస్ ఉపరితలంపై కనిపించే మరో ప్రొటీన్ న్యూరామినిడేస్పై దాడి చేయడం ద్వారా 1జీ01 వైరస్ నకళ్లను రూపొందించకుండా నిరోధిస్తుందని భావిస్తున్నట్లు డాక్టర్ అలీ తెలిపారు. సార్వత్రిక వ్యాక్సిన్ తయారీ కీలకమైన సమయంలో 1జీ01ను గుర్తించామని, వైరస్ ఎక్కడ దాడి చేస్తుందో తెలుసు కాబట్టి సమర్థంగా వాడుకునేందుకు అవకాశాలు ఎక్కువని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరస్!
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా వందేళ్ల క్రితం అంటే, 1919లో ‘స్పానిష్ ఫ్లూ’ మూడొంతుల ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దాదాపు ఐదు కోట్ల మంది మరణించారు. అలాంటి వైరస్ ఇప్పుడు ప్రపంచానికి సోకితే కనీసం ఎనిమది కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. ఒకప్పుడు మెల్లగా విస్తరించిన ఈ ఫ్లూ, ఓ దేశానికి చెందిన ప్రజలు, మరో దేశానికి నిరంతరంగా ప్రయాణిస్తున్న నేటి వేగవంతమైన యుగంలో కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. అదే గనుక జరిగితే అపార జన నష్టంతోపాటు దేశ దేశాల జాతీయ భద్రత అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ నాయకత్వంలోని ‘గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డ్’ సభ్యుల బందం ఈ హెచ్చరికలను చేసింది. ఈ మేరకు ‘ఏ వరల్డ్ ఎట్ రిస్క్’ శీర్షికతో రూపొందించిన ఓ నివేదికను బుధవారం అమెరికాలో విడుదల చేసింది. ‘ఎబోలా’ లాంటి వైరస్లు వేగంగా సోకుతున్న నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫ్లూలు ప్రపంచానికి సోకే ప్రమాదం ఉందని, అలాంటి వైరస్‌లను ఇప్పటి నుంచి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ –జనరల్, నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ గో ఆర్లెం బ్రుండట్లాండ్ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది. ఏ వైరస్ ఏ ప్రాంతాన్నీ, ఏ దేశాన్ని సోకే అవకాశం ఉందో కూడా ప్రపంచ పటంపై మార్కు చేసి చూపించింది. 1918లో స్పానిష్ ఫ్లూ అమెరికాలో విస్తరించినప్పుడు చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న రెడ్‌క్రాస్ కార్యకర్తలు అంటే నిఫా వైరస్ ఏ దేశాన్ని చుట్టు ముడుతుందో, కలరా ఏ దేశాన్ని చికెన్ గున్యా, డెంగ్యూలాంటి వైరస్లు ఏయే దేశాలు చుట్టుముడుతాయో మ్యాప్‌లో సూచించింది. వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో కూడా సూచించింది. ఇంతకుముందు విడుదలు చేసిన తమ నివేదికను దేశాధినేతలు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అరకొరగానే అమలు చేసినందువల్లనే ఈ రోజు మళ్లీ ఒక నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని బోర్డు వివరించింది. ఎబోలా, జికా, నిపా వైరస్‌లతోపాటు వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ, ప్లేగ్, హ్యూమన్ మంకీపాక్స్‌ల గురించి హెచ్చరికలు చేసింది. -
గున్యాతో కీళ్ల నొప్పులెలా..?
వాషింగ్టన్ : గున్యా జ్వరం వచ్చినప్పుడు భరించరాని స్థాయిలో కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కీళ్ల నొప్పులకు, గున్యా వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. సాధారణంగా గున్యా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ అనే జాతి దోమల కారణంగా గున్యా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌లో జన్యు పదార్థం సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ వైరస్ సోకినప్పుడు వెంటనే జ్వరం, వణుకు, తలనొప్పి, వాంతులు, తల తిరగడం, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఎలాంటి మందులు ఇప్పటివరకు కనుక్కోలేదు. అయితే వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డెబోరా లెన్స్హౌ అనే పరిశోధకురాలు.. ఈ వ్యాధి కారణంగా కీళ్ల నొప్పులు రావడానికి దారితీసే ప్రక్రియను గుర్తించారు. దీంతో ఈ వ్యాధికి మందులు కనుగొనేందుకు మార్గం సుగమమైందంటున్నారు. అయితే ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా కీళ్ల నొప్పులు ఉండటానికి కారణాలను తెలుసుకునేందుకు లెన్స్హౌ ఈ వైరస్ సోకిన కణాలను శాశ్వతంగా మార్క్ చేసే సరికొత్త విధానాన్ని రూపొందించారు. -
పావురాల ముట్టడి
శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగర సంస్కృతిలో భాగమైన శాంతి కపోతాలు... ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నా యి! ఆహ్లాదం కోసమో లేక పుణ్యం వస్తుందనో నగరవాసులు పెంచుకునే పావురాలు వారికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి!! ప్రస్తుతం కేరళను వణికిస్తున్న ప్రాణాంతక నిఫా వైరస్ తరహా ఉపద్రవం భవిష్యత్తులో పావురాల వల్ల వచ్చే ప్రమా దం పొంచి ఉందని వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించింది. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని పేర్కొంది. ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని అధ్యయనం తేల్చి చెప్పింది. నగరంలో భారీగా పావురాలు... డాక్టర్ వాసుదేవ రావు హైదరాబాద్‌లో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం హైదరాబాద్‌లో తొలిసారి అధ్యయనం జరుపుతోంది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వాసుదేవరావు హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఆయన ఆధ్వర్యంలోని బృందం అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయన ప్రాథమిక వివరాలను 2017లో ‘సాక్షి’ తొలిసారి ప్రజల ముందుకు తెచ్చింది. అయితే ఈ రెండేళ్లలో పావురాల సంఖ్య లక్ష వరకు పెరిగిందని, వాటి సంఖ్యను వెంటనే నియంత్రించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉందని వాసుదేవరావు సూచిస్తున్నారు. లేదంటే నిఫా వైరస్ కలకలంతో కేరళవాసులు ఎలా భయపడుతున్నారో హైదరాబాద్వాలసులు పావురాలను చూసి వణికిపోవాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరలో తమ అధ్యయనాన్ని ముగించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అధ్యయనం తుది అంకంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ సాయంతో ప్రత్యేక వివరాలను సేకరించనున్నారు. విదేశాల్లో నిషేధం... మన దగ్గర ప్రాథమిక వివరాలే కరువు... సెంట్రల్ లండన్‌లో పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వేయడాన్ని నిషేధించారు. 2003లోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ సెంట్రల్ లండన్ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో దాణా వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి తాజాగా ఆయా ప్రాంతాల్లో నిషేధాన్ని విధించటమే కాకుండా గట్టిగా అమలుకు నిర్ణయించింది. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పావురాలకు దాణా వేస్తే 500 పౌండ్ల జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. సింగపూర్ లాంటి నగరాలు కూడా జరిమానా హెచ్చరికలతో ప్రజలను కట్టడి చేస్తున్నాయి. దాణా వేస్తుండటం వల్లే పావురాల సంఖ్య భారీగా పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటోందని గుర్తించిన పలు అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ ప్రధాన నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు దాణా వేయడంపై నిషేధం విధిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పావురాలకు విచ్చలవిడిగా దాణా వేస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. పావురాల విసర్జితాలతో ప్రాణహాని ఇలా... పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీన్ని సాధారణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి ఉండటం, కొద్దిరోజులకే అది పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు పేర్కొన్నారు. అయితే అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తించడం లేదని, వాటిని ఇంకా పెంచుతూనే ఉన్నారని ఆయన చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలను దాటే పరిస్థితి ఉన్నందున ఇప్పుడు మేల్కొనకుంటే యావత్ హైదరాబాద్ జబ్బు పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పెద్దలకూ వ్యాక్సిన్లు
వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా చాలా తక్కువ ధరతో అంటే చాలా చవకగా, దాదాపు పూర్తి సురక్షితంగా చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. ప్రస్తుతం ఈ నెల చివరి తేదీ వరకు వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ అనే వారోత్సవాలు నిర్వహితమవుతున్నాయి. ప్రతీ ఏడాదీ ఏప్రిల్ చివరి వారం... అంటే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఇలా జరుపుతారు. అనేక వ్యాధులను నివారించడం కోసం వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసమే ఈ వారోత్సవాలను (వీక్‌ను) రూపొందించారు. సాధారణంగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకు అనే అనుకుంటుంటారు. అయితే పెద్దవాళ్లకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి శక్తియుక్తులను మళ్లీ బలోపేతం చేసేందుకు వాటిల్లో కొన్నింటిని 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని వ్యాక్సిన్ల వివరాలు, ప్రయోజనాల గురించి అవగాహన కోసం వాటి గురించి సంక్షిప్తంగా. పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్–ఏ అనే వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హెపటైటిస్–బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు. సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. మన దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి ఒకింత ఎక్కువే కాబట్టి... దీన్ని నివారించడానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకొని, ఆర్నెల్ల తర్వాత మరో విడత కూడా తీసుకోవాలి. హెపటైటిస్–బి వ్యాక్సిన్ : హెపటైటిస్–బి వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇది కూడా వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆ తర్వాత మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులంతా దీన్ని తీసుకోవడం మంచిది. వారిసెల్లా వ్యాక్సిన్ : వ్యారిసెల్లా జోస్టర్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ మనం సాధారణంగా ‘చికెన్‌పాక్స్’ అని పిలిచే వ్యాధిని కలిగిస్తుంది. వారిసెల్లా వ్యాక్సిన్ పెద్దవారిలో చికెన్ పాక్స్నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్ ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు. అలాగే గర్భవతులు కూడా తీసుకోకూడదు. హెర్పిస్ జోస్టర్ వ్యాధి : హెర్పిస్ జోస్టర్ అనే వైరస్‌తో మొదట చికెన్‌పాక్స్ వస్తుంది. ఆ తర్వాత అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. జోస్టర్ హెర్పిస్ వైరస్ సోకిన వారిలో 60 ఏళ్ల వయసు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ.హెర్పిస్ జోస్టర్ వ్యాధికి మంచి నివారణ జోస్టర్ వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా (అంటే 100 శాతం) వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ అయితే లేదుగానీ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వారి జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు. ‘ద షింగిల్స్ ప్రివెన్షన్ స్టడీ’ అనే అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. అలాగే పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా 67శాతం తగ్గుతుంది. అందుకే 50 ఏళ్లు దాటాక జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునేవారు ఇది తీసుకునే ముందర 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు వాటిని వాడకపోవడం మంచిది. నిమోకోకల్ వ్యాక్సిన్ : వయసు పైబడిన వారిలో స్ట్రెప్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియా కారణంగా నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) : ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసకరైడ్ వ్యాక్సిన్’తో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి దీన్ని ఒక నిమోనియాకే నివారణగా అనుకోవడం కంటే... మెనింజైటిస్, బ్యాక్టిరిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్)లకు నివారణ ఔషధంగా పరిగణించవచ్చు. అయితే దీని వల్ల కూడా నూరు శాతం నివారితమవుతుందన్న గ్యారంటీ ఉండదు. అయితే దీనివల్ల చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గుతాయి. కాంప్లికేషన్లను కూడా చాలా వరకు నివారించవచ్చు.అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి.అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇది మాటిమాటికీ తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత కూడా మరోసారి తీసుకోవాలి ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ : ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే తర్వాతి దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే జలుబు వైరస్‌కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవైౖయెదేళ్లు ఏళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టాటస్‌లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది. ఒక సూచన : గుడ్డు వల్ల అలర్జీ ఉన్నవారు రీకాంబినెంట్ వ్యాక్సిన్ తీసుకోవాలి.డిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్‌ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. దాంతో అది బూస్టర్ డోస్‌లా పనిచేసి వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది. మరికొన్ని వ్యాక్సిన్లు : ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, అయితే దాన్ని కొన్ని పరిమితులకు లోబడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేగాక జపనిస్ ఎన్కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు అక్కడికి వెళ్లే 15రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద వయసులో వ్యాక్సిన్లు ఎందుకు? ప్రతి ఏడాదీ చాలా మంది కొన్ని వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే వీటిలో చాలావరకు నివారించగలిగేవే. మన వయసు పెరుగుతున్నకొద్దీ, మన వృత్తిని బట్టీ, ఆరోగ్యపరిస్థితి, దేహతత్వాన్ని బట్టి కొన్ని జబ్బుల్లో రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ నివారించడం కోసం వ్యాక్సిన్లతో వ్యాధులను నిరోధించడం చాలా తేలిక. కొన్ని ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లే చోట్ల కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఆ ప్రాంతాలకు వెళ్తున్నవారు అక్కడ వ్యాప్తిలో ఉండే వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే లైఫ్‌స్టైల్ ఆధారంగా కూడా కొన్ని వ్యాక్సిన్లు అవసరం. దాదాపు 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, కాస్త బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నవారికి, 65 ఏళ్ల వయసు దాటాక మరికొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. అలాంటి వారిలో ఈ వాక్సిన్లతో ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. యుక్తవయసు దాటాక, పెద్ద వయసులో ప్రవేశించే ప్రతివారూ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి వారికి రక్షణ కలగడంతో పాటు... ఆ వ్యాధులు ఇతరులకు వ్యాపించకుండా కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి ఒకసారి వ్యాధి బారిన పడితే హాస్పిటల్లో పెట్టాల్సిన ఖర్చుతో పోలిస్తే... వ్యాక్సిన్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. ఇంటిని పోషించే యజమాని జబ్బు పడితే ఆ ప్రభావం ఇంటి మొత్తం మీద ఉంటుంది. పైగా ఉత్పాదకత కోసం వెచ్చించాల్సిన ఎన్నో విలువైన పనిదినాలను కూడా రక్షించుకొని, వాటిని సమర్థంగా పనులకోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం, జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందించడం కోసం ఉపయోగించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్‌పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ యువతులు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోస్ ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ఇంటర్నల్ మెడిసిన్ ఇన్ఫెక్షియస్డిసీజెస్,స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
నేతలకు షేక్‌హ్యాండ్‌ఇవ్వకపోవడమే మంచిది...
సాక్షి, హైదరాబాద్: ఓవైపు వేసవి, ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తుంటే మరోవైపు రాజధానిలో స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్‌పై కలకలం రేగుతోంది. సాధారణంగా చలి వాతావరణంలో బలపడే ఈ వైరస్ భగ్గుమంటున్న ఎండల్లోనూ విజృంభిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందడమే కాకుండా మరింత బలపడుతోంది. అసలే ఎన్నికల సీజన్.. నగరంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు రోజంతా ప్రచారంలో బిజీగా తిరుతుంటారు. సభలు, సమావేశాలు, ర్యాలీల పేరుతో ఎక్కువ సమయం జన సమూహంలోనే గడుపుతుంటారు. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వైరస్ వాతావరణంలోకి ప్రవేశించి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఈ విషయంలో సాధారణ ప్రజలే కాకుండా రాజకీయ పార్టీల అభ్యర్థులు సైతం ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జనబాహుళ్యంలోకి వెళ్లే సమయంలో ముక్కుకు మాస్క్ ధరించడం, బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది కేవలం రెండు మాసాల్లోనే 573 కేసులు నమోదు కాగా, వారిలో 29 మంది మృతి చెందారు. ఒక్క నగరంలోని గాంధీ జనరల్ ఆస్పత్రిలోనే ఈ ఏడాది ఇప్పటివరకు 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 14 మంది మృతి చెందడం గమనార్హం. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం గాంధీ జనరల్ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వైరస్ బారినపడిన ఏడుగురికి చికిత్స అందిస్తుండగా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో మరో నలుగురికి సైతం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఒకరికి సోకితే అందరినీ చుట్టేస్తుంది... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జనసమూహంలో ఎక్కువగా తిరుగుతుంటారు. నేతల్లో చాలా మంది బీపీ, షుగర్‌తో బాధపడుతుంటారు. వారిలో కొంత మందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు ఉదయం నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి వరకు జనం మధ్యే గడుపాల్సి వస్తుంది. బరిలో నిలిచిన అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యులంతా జనసమూహంలో ఎక్కువసేపు గడపాల్సి వస్తుంది. స్వైన్‌ఫ్లూ కారక వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి వైరస్ సోకిందంటే చాలు అందరికీ చుట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో ఏ వైరస్ సోకిందో గుర్తించడం కూడా కష్టమే. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101–102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వేంటనే వైద్యులను సంప్రదించాలి. షేక్‌హ్యాండ్‌ఇవ్వకపోవడమే మంచిది... నేతలు షేక్‌హ్యాండ్ ఇవ్వడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం. దుమ్ము, ధూళి రూపంలో రకరకాల ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సాధ్యమైనంత వరకు బయట తిరిగే సమయంలో ముక్కుకు మాస్క్ ధరించాలి. బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.– డాక్టర్ రాజన్న,చిన్న పిల్లల వైద్య నిపుణుడు ♦ ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 573 కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు. ♦ నగరంలోని గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 14 మంది మృతి చెందారు. ♦ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఏడుగురికి, వైరస్ సోకిందని భావిస్తున్న మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. -
నగరంలో స్వైన్‌ఫ్లూ విజృంభణ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్లో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు చలితీవ్రత వల్ల ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం గాంధీ జనరల్ ఆస్పత్రిలో సిద్దిపేటజిల్లా కొండపాకకు చెందిన వ్యక్తి(39), ఉప్పల్ సౌత్ స్వరూప్‌నగర్‌కు చెందిన మహిళ(28), అల్వాల్‌లోని ఇంద్రానగర్‌కు చెందిన మహిళ(43)లకు పాజిటివ్ కేసులు గురువారం నమోదు కాగా, మరో నలుగురు ఫ్లూ అనుమానితులు చికిత్స పొందు తున్నారు. ఉస్మానియాలో పాతబస్తీకి చెందిన మహిళ(64), వ్యక్తి(48), యువకుడు(34), వృద్ధుడు(60), మహిళ(45)లకు కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే గతేడాది గాంధీలో 72 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 18 మంది మృత్యువాత పడ్డారు. 54 మంది చికిత్స తర్వాత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఉస్మానియాలో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో అత్యధిక శాతం మహిళలే ఉండటం గమనార్హం. ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందే.. సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. నిజానికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు,గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ బారిన పడే అవకాశాలు ఎక్కువ. సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి.ముఖ్యంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రపరచుకోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. మూడు రోజులు కంటే ఎక్కువ పై లక్షణాలు వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధి లక్షణాలను ముందే గుర్తించటం ద్వారా పూర్తిగా నివారించే అవకాశం ఉంది. స్వైన్‌ఫ్లూ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ శ్రీధర్, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి -
రక్షణ మీరే!
మన కుటుంబం ఎప్పుడూ దాడులకు గురవుతూనే ఉంటుంది. బ్యాక్టీరియాలూ, వైరస్లు, మాన్సూన్ మార్పులూ, వ్యాధులతో ఎటాక్ మీద ఎటాక్ మీద ఎటాక్ జరుగుతూనే ఉంటుంది. రాబోయే 2019లో కుటుంబానికి రక్షణ మీరే. కుటుంబాన్ని ఆరోగ్యంగా కొత్త ఏడాదిలోకి తీసుకెళ్లడానికి మీ కోసం ఈ సూచనలు. చాలా రకాల జబ్బుల్ని చిన్న చిన్న నివారణ మార్గాలతోనే రాకుండా చేసుకోవచ్చు. జబ్బు కంటే నివారణ ఎప్పుడూ మంచిదే కదా! ఇక్కడ కొన్ని సాధారణ జబ్బులకు నివారణ మార్గాలు... ఆర్థరైటిస్ నివారణకు... ఆర్థరైటిస్ సమస్యను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అవి... బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజులు 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే వ్యాయాయం చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్‌ను తగ్గించచాలి. (దానికి బదులు వేగంగా నడవడం, ఈదడం మంచిది). కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. కిడ్నీల్లోని రాళ్ల నివారణ... ∙సమ్మర్లో మనం తాగే నీళ్లు పెరిగినా ఒంట్లో నీళ్లు తగ్గుతాయి. ఈ పరిస్థితి వల్ల ఏర్పడే అనర్థాల్లో ప్రధానమైనది మూత్రపిండాల్లో రాళ్లు. ఈ పరిస్థితిని నివారించడానికి నీటిని ఎక్కువగా తాగాలి. మనం సగటున రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ∙ఆహారంలో ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి. ∙రాళ్లు వచ్చేందుకు కారణమయ్యే ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ∙క్యాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ∙ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. దాంతో క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ. అందుకే ఆల్కహాల్ చాలా పరిమితంగా తీసుకోవాలి. మానేస్తే ఇంకా మంచిది. ∙కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు. గౌట్ బొటనవేలు బిగుసుకుపోయినట్లు కావడం, కీళ్ల మధ్య రాయిలా మారడంతో కనిపించే వ్యాధి గౌట్. గతంలో మాంసాహారం తీసుకునే సంపన్న వర్గాల్లో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు మారిన ఆహార అలవాట్ల వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మాంసాహారం, మద్యంలో పూరిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పోషకాల్లాగానే ఇవి కూడా శారీరక కార్యకలాపాల్లో పాలుపంచుకుని కణంలోకి పూర్తిగా శిథిలమైపోవాలి. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే రక్తంలోకి కొన్ని వ్యర్థాలు విడుదల అవుతాయి. అందులో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. కొందరిలో యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యన చేరి రాయి (క్రిస్టల్)లా గట్టిగా మారిపోయి కీలును దెబ్బతీస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి వస్తుంది. అలా కీళ్లలో తీవ్రమైన బాధ కలిగిస్తుంది ఈ గౌట్. గౌట్ నివారణ కోసం ఆహార నియమాలు... ∙మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్ మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. ∙ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ∙స్వీట్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఆలూ (పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ∙పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని విరివిగా తీసుకోవాలి. తలనొప్పి నివారణ కోసం... తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. కంప్యూటర్ వర్క్ చేసే వారు కంటికి ఒత్తిడి కలగకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించాలి. ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ అవాలి. కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు. ∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు... అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్లు చేస్తూ కంటిని ఒత్తిడికి గురి చేసేవారు మన పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం. ∙పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ∙నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. ∙పడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి. ∙ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి. ∙కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం మానేయాలి. కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలు అవాయిడ్ చేయడం అవసరం. ∙ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి చేయడం సరికాదు. ∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు. ∙రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని తలనొప్పులను నివారించవచ్చు. జలుబు సాధారణ జలుబును కలగజేసే వైరస్ జన్యుస్వరూపం వెంటవెంటనే మారిపోతుంటుంది కాబట్టి దీని నివారణకు మందు రూపొందించడం సాధ్యం కాదు. అయితే దీనివల్ల ఎలాంటి ముప్పూ లేకపోయినా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీని నివారణ అవసరం. మిగతా వైరల్ రోగాలలాగే జలుబుకి ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను అనుసరించి మందులు వాడాలి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలవకూడదు. పారాసిటమాల్ వంటి జ్వరం తగ్గించే మందులు వాడాలి. ∙ఈ వ్యాధి సంక్రమించినవారు సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు దూరంగా ఉండాలి. ∙జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. గమనిక: మిజిల్స్, మంప్స్, రూబెల్లా, పోలియో లాంటివి కూడా వైరస్ల వల్ల వచ్చే జబ్బులే. అయితే వీటికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టీకాతోనే వాటి పూర్తిస్థాయి నివారణ సాధ్యం. క్యాన్సర్ నివారణ... సింపుల్ మార్గాలు! క్యాన్సర్ అంటేనే చాలా మంది వణికిపోతుంటారు. కానీ అంతగా భయపెట్టే వ్యాధికి కూడా కొన్ని నివారణలు ఉంటాయి. ముదురు రంగు (డార్క్) చాక్లెట్లు: కోకో ఎక్కువగా ఉండే ముదురు రంగు చాక్లెట్లు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. వీటిలోని పెంటామెర్ అనే ఫ్లేవనాయిడ్స్‌కు క్యాన్సర్‌ను హరించే గుణం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తీసుకోకపోవడం: పిజ్జాలు, బర్గర్లు, పఫ్‌ల వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పాటు చక్కెర ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌ను తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు వీలుగా వాడే నూనెల వంటి పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువ. అదే సంప్రదాయ వంటకాలతోక్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ∙కార్సినోజెన్స్‌కు దూరంగా ఉండటం: కార్సినోజెన్ అంటే క్యాన్సర్‌ను కలిగించేది అని అర్థం. సిగరెట్ పొగలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు (కార్సినోజెన్స్) చాలా ఎక్కువ. అలాగే మద్యం ఎక్కువ మోతాదుల్లో తీసుకోవడం కూడా దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఇక పొగాకు, గుట్కా వంటివి కూడా క్యాన్సర్ కారణాలని స్పష్టంగా తెలుసు. వాటికి దూరంగా ఉండటం తప్పనిసరి. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అది కార్సినోజెన్ అవుతుందని గుర్తించాలి. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ వాడకూడదు. ∙వ్యాయామం చేయడం: శరీరానికి కదలికలు లేకుండా ఉండే జీవనశైలి క్యాన్సర్‌కు కారణాల్లో చాలా ప్రధానమైనది. వ్యాయామం మనలోని వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. అందుకే వ్యాయామాన్ని తప్పనిసరిగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల మనలో కొన్ని ఆరోగ్యకరమైన ఎంజైములు, రసాయనాలు ఊరి అవి మనలో వ్యాధినిరోధకశక్తిని మరింత శక్తిమంతం చేస్తాయి. ∙కంటి నిండా నిద్ర: అలసిన అన్ని కండరాలూ పూర్తి శక్తిని పుంజుకోవాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. క్రమం తప్పకుండా ఒకేవేళకు పడుకుని ఒకేవేళకు లేచే మంచి అలవాటు, కంటికి నిండైన నిద్ర... మనలోని అంతర్గత ఎంజైములు స్రవించే ‘ఎండోక్రైన్ వ్యవస్థ’ను మరింత ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మన ఆరోగ్యకరమైన ఎండోక్రైన్ వ్యవస్థ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాంతో అన్ని రకాల క్యాన్సర్లు దూరంగా ఉంటాయి. ∙వెల్లుల్లి: ఘాటైన వాసన వచ్చే వెల్లుల్లిలో క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. వెల్లుల్లి మన రోగనిరోధక వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. అందుకే వెల్లుల్లితో తీసుకోదగిన ప్రతి వంటపదార్థంలోనూ వాటిని బాగా వాడేలా చూసుకోండి. ప్రధానంగా అది జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక (ముఖ్యంగా పొట్ట, పెద్దపేగు) క్యాన్సర్లను నివారిస్తుంది. ∙బ్రకోలీ: ఇప్పుడు మన సూపర్మార్కెట్లలో దొరికే బ్రకోలీ అనే ఆకుకూర కూడా క్యాన్సర్ల నివారణకు బాగా తోడ్పడుతుంది. అందుకే దాన్ని సూపర్‌ఫుడ్ అని అభివర్ణిస్తుంటారు. అయితే దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో వండితే అందులోని క్యాన్సర్‌తో పోరాడే ఫ్లేవనాయిడ్స్ నశిస్తాయి. అందుకే దీన్ని ఉడికించి తినడం లేదా వీలైతే కొత్తిమీరలా పచ్చిగా తినడం కూడా చాలా మేలు చేస్తుంది. ∙తాజాపండ్లు: దానిమ్మ, నేరేడు వంటి పండ్లను తినడం క్యాన్సర్లను నిరోధిస్తుంది. ఏ సీజన్లో లభ్యమయ్యే పండ్లను ఆయా సీజన్లలో తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరిగి క్యాన్సర్లను నివారిస్తుంది. ∙మధ్యధరా తీరవాసుల జీవనశైలి: యూరప్‌లోని మధ్యధరా తీరవాసుల జీవనశైలి ప్రపంచంలోనే చాలా చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిగా పేరొందింది. మధ్యధరా తీరంలో ఉండే దేశాలన్నింటినీ కలిపి ‘ప్రపంచపు పండ్లబుట్ట’గా చెబుతారు. మధ్యధరా సముద్రపు చుట్టుపక్కల ఉండే అన్ని దేశవాసులు తమ ఆహారంలో పండ్లను చాలా ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఆ ప్రాంతానికా పేరు. పళ్లతో పాటు వాళ్లు ఆకుకూరలు, చేపలు, ఆలివ్ ఆయిల్, పొట్టుతో ఉండే ధాన్యాలు, బీన్స్ వంటి లెగ్యూమ్స్, నట్స్ వంటివి వాళ్ల ఆహారంలో ఎక్కువ. ఈ తరహా ఆహారపు అలవాట్లు ఉండి, పొగాకు వాడకానికి దూరంగా ఉంటే చాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 60 శాతం పడిపోతాయని చెబుతున్నారు ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్ లొరెంజో కోహెన్. ∙బరువు తగ్గించుకోవడం: ప్రపంచవ్యాప్తంగా సంభవించే క్యాన్సర్ మరణాల్లో అత్యధికం బరువు ఎక్కువగా ఉండేవారిలోనే అన్నది నిజం. మహిళలు బరువు పెరుగుతున్నకొద్దీ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ పెరుగుదలకు దారితీస్తుంది. ఈస్ట్రోజెన్ పెరగడం రొమ్ముక్యాన్సర్, యుటిరైన్ క్యాన్సర్‌కు దోహదం చేస్తుంది. అందుకే తమ బరువును అదుపులో ఉంచేలా ప్రతిఒక్కరూ వ్యాయామాలు చేయడం అవసరం. ∙నోరు పరీక్షించుకుంటూ ఉండటం: ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్ చేత నోటిని పరీక్షింపజేసుకుంటూ ఉండటం అవసరం. ∙మహిళలు సొంతంగా రొమ్ము పరీక్షించుకుంటూ ఉండటం: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. కాబట్టి ప్రతిసారీ రుతుస్రావం ముందర తామే సొంతంగా రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. వాటిల్లో తేడాలేమైనా ఉంటే గమనించే ఈ పరీక్షను సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్‌బీఈ) అంటారు. రొమ్ముల్లో గడ్డలుగానీ, నొప్పి లేదా సలపరంగానీ, నిపుల్ లోపలకు ముడుచుకుపోయినట్లుండటం గానీ లేదా నిపుల్ నుంచి ఏమైనా స్రావాలు వస్తుంటే మాత్రం వెంటనే వైద్యనిపుణులను కలవాలి. ∙హెపటైటిస్–బి వ్యాధి ఆ తర్వాతి కాలంలో కాలేయ క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఎక్కువ. అయితే అదృష్టవశాత్తు దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జీవితాంతం ఆ వ్యాధి నుంచి రక్షణ దొరుకుతుంది. ∙మహిళల్లో హెచ్‌పీవీ వైరస్ వల్ల గర్భాశయముఖద్వార క్యాన్సర్ (సర్విక్స్ క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువ. క్యాన్సర్లలో దీనికి టీకా అందుబాటులో ఉంది. వైవాహిక సంబంధాల్లోకి వెళ్లని ప్రతి మహిళా ఈ వ్యాక్సిన్‌ను తీసుకుంటే అది సర్విక్స్ క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ ∙వుంచి సవుతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి విటమిన్–డి అందేలా జాగ్రత్తపడాలి. ∙కొవ#్వ పదార్థాలు (యానివుల్ఫ్యాట్, నెయ్యి) వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ∙బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి పోషకాలు శరీరానికి అందేలా క్యారెట్, టమోటా వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ∙పొగతాగడానికి, వుద్యపానానికి దూరంగా ఉండాలి. మలబద్దకం నివారణ ∙పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముడిబియ్యం (దంపుడు బియ్యం), ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకునే వారిలో మలబద్దకం సమస్య చాలా తక్కువ. బియ్యం తవుడు, గోధుమ తవుడులలో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి మిగతా ఆహార పదార్థాలతో కలిపి రోజూ మూడు టీ స్పూన్ల తవుడు తీసుకుంటుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు. ∙ప్రతిరోజూ రాత్రి రెండు చెంచాల మెంతులను నమలకుండా మింగాలి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మృదు విరేచనకారిగా పని చేస్తుంది. ∙బొప్పాయి, బత్తాయి, నారింజ, పనస... మొదలైన పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ∙వ్యాయామం కూడ మలబద్దకం నివారణకు తోడ్పడుతుంది. అన్ని కండరాల్లాగే పేగుకండరాలకూ చురుకుదనం సమకూరి మలబద్దకం నివారణ జరుగుతుంది. -
స్వైన్‌ఫ్లూ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ విశాఖ వాసులను కలవర పెడుతోంది. ఇటు జిల్లా, అటు నగరంలోనూ అలజడి రేపుతోంది. శీతాకాలంలోనే విజృంభించే స్వైన్‌ఫ్లూ మండుటెండల్లోనూ ప్రతాపం చూపింది. ఇప్పుడు చలికాలం మొదలవుతుండడంతో ఈ వైరస్ ఎంతలా అదుపుతప్పుతుందోనన్న ఆందో ళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది జిల్లాలో స్వైన్‌ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉంది. గతేడాది 40 మంది స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. జనవరి నుంచి ఇప్పటిదాకా (ఈ పదకొండు నెలల్లో నే) 64 మంది ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరారు. మార్చిలో ఒకరు, అక్టోబర్‌లో 42, నవంబరు 24 వరకు 21 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. వీరిలో నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే వీరు మధుమేహం, గుండెజబ్బు, కిడ్నీ, నరాల సంబంధ వ్యాధులతో మరణించారని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ముగ్గురు, ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల (చెస్ట్) ఆస్పత్రిలో మరొక రు స్వైన్‌ఫ్లూతో చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విశాఖ ప్రభావిత ప్రాంతం విశాఖపట్నం స్వైన్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతం. నగరానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ వైరస్‌తో ఇక్కడకు రావడం, నగరానికి చెందిన వారు ఆ ప్రదేశాలకు వెళ్లడం ద్వారా వైరస్ సోకడం వంటివి కారణాల వల్ల ఇది వ్యాప్తి చెందుతోంది. విశాఖ సమీపంలో సింహాచలం, నగరంలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాలకు దూరప్రాంతాల నుంచి భక్తులు, అలాగే ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు వస్తుంటారు. దీంతో స్థానికులతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తమైన యంత్రాంగం స్వైన్‌ఫ్లూ నియంత్రణకు జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ చర్యలు చేపట్టింది. జిల్లా, నగర వ్యాప్తంగా 12 స్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. విమానాశ్రయం, విశాఖ రైల్వే స్టేషన్ (ప్లాట్‌ఫాం –1, 8), సింహాచలం కొండపైన, దిగువన, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్ల ద్వారా శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేయిస్తున్నారు. కేజీహెచ్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారి కోసం కేజీహెచ్‌లో 10 పడకలు, పది వెంటిలేటర్లు, చెస్ట్ ఆస్పత్రిలో ఆరు పడకలు, రెండు వెంటిలేటర్లను అందుబాటులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి జలుబు, దగ్గు, గొంతునొప్పి, విపరీతమైన జ్వరం, కళ్లు మంటలు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమూహాలు, విందులు, వినోదాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలి. బయట తిరిగే వారు ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి. చెస్ట్ ఆస్పత్రి, కేజీహెచ్, జిల్లాలోని నర్సీపట్నం, పాడేరు, అరకు, అనకాపల్లి ఏరియా ఆస్పత్రుల్లోను, అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్సీల్లోనూ స్వైన్‌ఫ్లూ నిరోధక మందులను అందుబాటులో ఉంచాం. వీటిని ఉచితంగానే ఇస్తున్నాం. స్వైన్‌ఫ్లూ మందుల కొరత లేదు. – ఎస్.తిరుపతిరావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి -
కేన్సర్‌కు కృత్రిమ వైరస్ విరుగుడు!
శరీరంలోని కేన్సర్ కణాలన్నింటినీ టకటక నమిలి మింగేస్తే...? పనిలోపనిగా వాటిపక్కన ఉండే హానికారక ఫైబ్రోబ్లాస్ట్‌ల నాశనమూ జరిగిపోతే? ఈ అద్భుతం సాకారమవుతోంది అంటున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. తాము సృష్టించిన కృత్రిమ వైరస్ అటు కేన్సర్ కణాలతోపాటు అవి రోగనిరోధక వ్యవస్థకు చిక్కకుండా చేసే ఫైబ్రోబ్లాస్ట్‌లను కూడా నాశనం చేస్తుందని వీరు తెలిపారు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ వైరస్ ఇప్పటికే కొన్ని క్లినికల్ ట్రయల్స్‌లో వాడుతూండటం! ఎనాడినోటుసిరీవ్ అని పిలుస్తున్న ఈ వైరస్ కేవలం కేన్సర్ కణాలపై మాత్రమే దాడిచేయడం ఇంకో ముఖ్యమైన అంశం. కేన్సర్ కణాలు టి–సెల్ ఎంగేజర్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా ఈ వైరస్ కొన్ని సంకేతాలు పంపుతుంది. ఈ టి–సెల్ ఎంగేజర్ ఒకవైపు ఫైబ్రోబ్లాస్ట్‌లను ఇంకోవైపు రోగ నిరోధక వ్యవస్థకు చెందిన టి–కణాలతోనూ అతుక్కుంటుంది. దీంతో టి–కణాలు ఫైబ్రోబ్లాస్ట్‌లను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తాయి. అంతేకాకుండా టి–సెల్ ఎంగేజర్ ప్రొటీన్ కేన్సర్ కణితి లోపల ఉండే రోగ నిరోధక వ్యవస్థ కణాలను కూడా చైతన్యవంతం చేస్తుందని ఫలితంగా అవి కూడా కేన్సర్ కణాలను మట్టుబెట్టడంలో మునిగిపోతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జాషువా ఫ్రీడ్‌మ్యాన్ తెలిపారు. ఎలుకలతోపాటు పరిశోధనశాలలో మానవ కేన్సర్ కణాలపై జరిపిన ప్రయోగాల్లో ఈ కొత్త పద్ధతి మంచి ఫలితాలివ్వడం గమనార్హం. -
డెంగ్యూకు కంగు
జ్వరం వస్తే వచ్చే బెంగ వేరు కానీ డెంగ్యూ జ్వరం అనగానే వచ్చే భయం వేరు. ఇటీవల విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు చూసి చాలామంది ఆందోళన చెందుతున్నారు. దీని గురించి అవగాహన కంటే అపోహలు ఎక్కువ.డెంగ్యూకు కంగు తినిపించేలావిషయాలు తెలుసుకోవడం కోసం ఈ సమగ్ర కథనం. డెంగ్యూ అంటే ఏమిటి? డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వ్యాపించే ఒక వైరల్ జ్వరం. ఈ వైరస్‌ను ‘ఎడిస్ ఎజిపై్ట’ అనే దోమ వ్యాప్తి చేస్తుంది. టైగర్ మస్కిటో అని కూడా దీనిని పిలుస్తారు. చాలా సందర్భాల్లో డెంగ్యూ జ్వరం మిగతా అన్ని జ్వరాల్లాగే తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) తరహాది. అయితే కొంతమందిలో ప్లేట్లెట్స్ ప్రమాదకర స్థాయి కంటే కిందికి పడిపోతాయి. మరికొందరి అంతర్గత అవయవాల్లోకి రక్తస్రావమయ్యే పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రోగిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించడం అవసరమవుతుంది. అలాంటి సమయంలో తప్ప మిగతా అన్ని వేళల్లోనూ ఇది అనుకున్నంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే అపోహలు, దురభిప్రాయాలతో కలిగే ఆందోళన తగ్గిపోతుంది. డెంగ్యూలో రకాలు : ఇటీవల డెంగ్యూలో రకాలను పునర్నిర్వచించారు. ఆ విభజనను అనుసరించి డెంగ్యూలో మూడు రకాలు ఉన్నాయి. అవి... 1. ఎలాంటి హెచ్చరికలు చూపకుండా వచ్చే సాధారణ డెంగ్యూ (డెంగ్యూ వితవుట్ వార్నింగ్ సైన్స్) 2.కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగ్యూ (డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్) 3.తీవ్రమైన డెంగ్యూ (సివియర్ డెంగ్యూ) లక్షణాలు : ∙హెచ్చరికలు చూపకుండా వచ్చే సాధారణ డెంగ్యూ (డెంగ్యూ వితవుట్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ తరహా డెంగ్యూ వచ్చిన వారు డెంగ్యూ విస్తృతంగా వస్తున్న (ఎండెమిక్) ప్రాంతాలలో నివసిస్తున్న వారై ఉంటారు. ఇలాంటి వారిలో జ్వరం, వికారం/వాంతులు, సాధారణంగా కనిపించే ఒంటినొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్), ఒంటి మీద ర్యాష్ వంటి బయటి లక్షణాలు కనిపిస్తాయి. టార్నికేట్ అనే పరీక్ష చేస్తారు. దీంతో పాటు సాధారణ రక్తపరీక్ష చేసినప్పుడు డెంగ్యూ వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తుంది. ∙కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగ్యూ (డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ కేసుల్లో పైన పేర్కొన్న లక్షణాలన్నింటితో పాటు పొట్టలో నొప్పి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం, పొట్టలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం అవుతుండటం, రోగి అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికీ ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙తీవ్రమైన డెంగ్యూ (సివియర్ డెంగ్యూ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా రోగి తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా రోగి స్పృహకోల్పోవడం లేదా పాక్షికంగానే స్పృహలో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతర్గత అవయవాలు తమ విధులు నిర్వహించడంలో విఫలం అవుతాయి. అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే కండిషన్ ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు మరింత అధునాతనమైన నిర్ధారణ పరీ„ ఇప్పుడు అత్యంత అధునాతమైన వ్యాధి నిర్థారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పత్తికి తోడ్పడే ఎముకలోని భాగమైన బోన్‌మ్యారో పనితీరు కూడా ఈ పరీక్షతో తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటి చికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఆ మేరకు ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్‌మ్యారోలో లోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. డెంగ్యూకు గురైన ప్రతి పేషెంట్‌కీ ప్లేట్లెట్ల మార్పిడి అవసరం ఉండదు. కొన్ని మందులు డెంగ్యూ రోగులకు ప్రమాదం సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. ఇది మరింత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్లేట్లెట్లు లక్ష కంటే తగ్గినప్పుడు ప్రతిరోజూ పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే పరీక్ష చేయించుకోవాలి. జ్వరం తగ్గాక ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి పెరిగాక, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతాయి. అయితే ప్లేట్లెట్ల సంఖ్య 20,000 కంటే తగ్గితే మాత్రం హాస్పిటల్లో చేరడం అవసరం. నివారణ ఎంతో మేలు... అన్ని వ్యాధుల లాగే డెంగ్యూ విషయంలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగ్యూ వచ్చేందుకు దోహదపడే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే కుడుతుంటుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి. వీలైతే వారంలో ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. ∙ఇంట్లోని మూలల్లో చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశాల్లో ఎడిస్ ఎజిపై్ట అవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అయితే అదే సమయంలో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించుకోవడానికి తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకోవడం చాలా మంచిది. ∙ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. ∙ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లనూ కవర్ చేసే పైజామాలు, సాక్స్ వేసుకుంటే మంచిది. ∙ఎడిస్ ఎజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ∙దోమలను దూరంగా తరిమివేసే మస్కిటోరిపల్లెంట్స్ వాడటం మేలు. పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్ 3535... కంపోజిషన్లోని ఈ మూడింటిలో ఏది ఉన్నా ఆ రిపల్లెంట్స్ వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. అయితే ముఖం మీద స్ప్రే చేసుకునే సమయంలో ఇవి కళ్ల దగ్గర స్ప్రే కాకుండా జాగ్రత్త పడాలి. చికిత్స డెంగ్యూ అనేది వైరస్ కాబట్టి దీనికి నిర్దిష్టమైన మందులు లేవు. కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందు నుంచే నోటిద్వారా లవణాలతో కూడిన ద్రవాహారం (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్– ఓఆర్ఎస్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి షాక్‌లోకి వెళుతుంటే అప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్íపీ (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల నుంచి 15 వేలు అంతకంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. వాటిని ఎప్పుడు ఎక్కించాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగ్యూ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణుల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. వ్యాక్సిన్ ఉంది... అయితే ఇప్పుడు డెంగ్యూకు టీకా (వ్యాక్సినేషన్) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు ఈ టీకాను గతంలో డెంగ్యూ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి డెంగ్యూ రావడం చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని నివారించేందుకు ఈ టీకా తోడ్పడుతుంది. అంటే అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం అయి రోగి ∙సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ∙డెంగ్యూ నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. ∙డెంగ్యూ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్థారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువే కాబట్టి అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. మరింత ప్రమాదకరమైన ఇతర లక్షణాలు ∙ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన నిరంతర రక్తస్రావం అనే ప్రమాదకరమైన లక్షణమే కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇతర లక్షణాలూ కనిపిస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒంట్లో నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్). అంతేకాదు... కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. హార్ట్‌బీటింగ్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంది. మన వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టం) డ్యామేజ్ అయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ∙గుండె స్పందనలు (హార్ట్‌బీట్) 60 కంటే తక్కువకు పడిపోవడం అన్నది చాలా ప్రమాదకరమైన సూచన. రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్‌లో ఉంచాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. సాధారణ డెంగ్యూ నివారణకు దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. నిర్ధారణ పరీక్షలు మొదటి సారి కంటే... తర్వాతి వాటితోనే మరింత డేంజర్ సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగ్యూ కంటే... ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగ్యూని సంక్రమింపజేసే వైరస్‌లో నాలుగు రకాలున్నాయి. అదే రకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకో రకమైన డెంగ్యూ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. అందుకే మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే యాంటీబయాటిక్స్ వద్దు చాలా మంది గ్రామీణ డాక్టర్లు డెంగ్యూ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగ్యూ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గి్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ల సలహా తీసుకున్నాకే వాడాలి. ప్రమాదకర పరిస్థితులకు ముందస్తు సంకేతాలివి... ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చిగుర్ల్లలోంచి కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మలేరియాకీ... డెంగ్యూకూ తేడా ఇది... మలేరియా, డెంగ్యూ... ఈ రెండూ దోమలతోనే వచ్చే జ్వరాలే అయినా మలేరియా అన్నది ఆడ అనాఫిలస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. అదే డెంగ్యూ అన్నది ఎడిస్ (టైగర్) దోమ కారణంగా వస్తుంది.రెండింట్లోనూ కనిపించే సాధారణ లక్షణం జ్వరం. అయితే మలేరియాలోని రకాలను బట్టి జ్వరం అన్నది నిర్దిష్టంగా ఒక నిర్ణీత సమయానికి ప్రతిరోజూ వస్తూ తగ్గుతూ ఉంటుంది. కానీ డెంగ్యూ సోకిన వ్యక్తిలో జ్వరం ఎప్పుడైనా రావచ్చు. డెంగ్యూ వచ్చిన వారిలో వచ్చే నొప్పి ఎముకలు విరిగినంత తీవ్రంగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పాప ఎక్కువగా నిద్ర పోతోంది?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి కూడా లేవడం లేదు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటితో ఎలాంటి గుణం కనిపించలేదు. పాప ఇలా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. ఉజ్వల, కొత్తగూడెం పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. కానీ ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు: పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్‌లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు ∙స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ ప్రభావపూర్వకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. బాబుకు ఉన్న కళ్ల సమస్య ఏమిటి? మా బాబుకి పదకొండేళ్లు. చాలా ఆరోగ్యంగా, మంచి చురుగ్గా ఉంటాడు. అయితే బాబుకి రెండు కళ్లలోని కనుగుడ్లు గబగబా కదులుతుంటాయి. ఇతరత్రా ఇబ్బంది లేకపోయినా చదవడంలో కాస్త సమస్యగానే ఉంది. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – డి. సూర్యారావు, టెక్కలి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. మీ ఉత్తరంలో బాబు సమస్యకి సంబంధించి చాలా వివరాలు తెలపలేదు. అందుకే ఖచ్చితమైన కారణం నిర్ధారణ చేయడం సాధ్యం కావడం లేదు. మీరు చెబుతున్న కొద్దిపాటి సమాచారాన్ని బట్టి చూస్తే మీ వాడికి నిస్టాగ్మస్ లేదా ఆప్సోక్లోనస్ అనే సమస్యలు ఉండి ఉండవచ్చుననిపిస్తోంది. ముందుగా నిస్టాగ్మస్కు సంబంధించిన వివరాలలోకి వెళ్తే... ఇదొక వ్యాధి కాదు. బాబులోని రుగ్మతకు సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్ ఉన్న వారి కళ్లు రిథమిక్‌గా కదులుతూ (రిథమిక్ ఆసిలేషన్ మూవ్మెంట్స్) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. ఈ సమస్య పుట్టుక నుంచీ ఉండవచ్చు లేదా మధ్యలోనైనా ఇది రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైౖటిస్), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి. ఇక ఆప్సోక్లోనస్ విషయానికి వస్తే... కళ్లు నాన్ రిథమిక్‌గా, అనేక డైరెక్షన్స్‌లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతో (ఆజిటేటెడ్గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి మొదటి సూచిక అయిండవచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్ స్కాన్ కూడా చేయించడం మంచిది. ఒకవేళ కంటి సమస్య ఉన్నట్లు నిర్థారణ అయితే (అది ముఖ్యంగా కంటి కండరాలకు సంబంధించిన సమస్య అయినప్పుడు) కొన్ని రకాల శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. మీవాడి సమస్యకు కారణం ఏమిటనేది తెలుసుకుంటేనే ఇదమిత్థంగా పరిష్కారం చెప్పడం వీలవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణులని కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు మాటిమాటికీ జ్వరం... ఎందుకిలా? మా బాబు వయసు రెండేళ్లు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. తగ్గినా మళ్లీ తిరగబెడుతోంది. మందులు వాడినంత సేపే గుణం కనిపించి ఆ తర్వాత మళ్లీ ఒళ్లు వెచ్చబడుతోంది. వాడికి ఇలా మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – వి. రంగారావు, ఒంగోలు పిల్లలు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం మామూలే. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం అనే లక్షణం కనిపించవచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... యూరినరీ ట్రాక్ట్‌కు సంబంధించిన సమస్య ఉందేమో చూడాలి. కాబట్టి ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో ఏమీ కనిపించకపోతే దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు – మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం హానికరం. కాబట్టి మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
‘మృగరాజు రక్షణకు వెయ్యికోట్లు ఇవ్వండి’
అహ్మదాబాద్ : అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న గుజరాత్ గిర్ మృగరాజుల రక్షణకు తక్షణమే వెయ్యి కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అలాగే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ, పర్యవేక్షణ లోపంతోనే సింహాలు మృతి చెందాయని ఆరోపించారు. గిర్ అటవీ సమీపంలోని అక్రమ రిసార్ట్స్‌లను వెంటనే తొలిగించాలని, గుజరాత్ సింహాల రక్షణ కోసం వెయ్యికోట్ల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గుజరాత్ సింహాలకు పులులకిచ్చే ప్రాధాన్యతనే ఇస్తూ.. టైగర్ ప్రాజెక్ట్‌లా.. లయన్స్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. (చదవండి: మృగరాజుకు వైరస్ సోకిందా?) మోదీకి ఓ గుజరాతీగా.. గిర్ సింహాలు గుజరాత్ ఆత్మగౌరవమనే విషయం తెలుసన్నారు. వాటి రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్‌ను తెప్పించాలని, సింహాల కోసం వెటర్నరీ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్‌తో దాదాపు 15 రోజుల్లోనే 23 సింహాలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: వైరస్‌తోనే గిర్ సింహాల మృతి) చదవండి: మృగరాజుకు ఎంత కష్టం! -
మృగరాజుకు వైరస్ సోకిందా?
అహ్మదాబాద్ : గత 20 రోజుల్లో 21 సింహాలు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మృతిచెందిన 20 సింహాలు గుజరాత్, అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్ అడువిలోనివే కావడం చర్చనీయాంశమైంది. ఇక అధికారులు మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్తో సింహాలు మృత్యువాత పడ్డాయని చెబుతున్నారు. అటవిశాఖ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12 నుంచి 19 మధ్య మొత్తం 11 సింహాలు మృతి చెందాయన్నారు. ఇందులో 7 అడవిలోనే మృతి చెందగా.. మరో నాలుగు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాయని తెలిపారు. 20 నుంచి 30 మంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సింహాలకు ట్రీట్మెంట్ అందజేశామన్నారు. చికిత్స సమయంలోనే మరో 10 సింహాలు మృత్యువాత పడ్డాయని, ఇది గిరి అడవుల్లోనే తీవ్ర విషాదం నింపిందన్నారు. వైరస్ వల్లనే సింహాలు మృతి చెందాయని, అది ఏం వైరసో ఇంకా నిర్దారణ కాలేదన్నారు. కేవలం ఈ ప్రాంతంలోనే సింహాలు మృతి చెందాయని స్పష్టం చేశారు. వీటిలో ఆరు సింహాలు మాత్రం ప్రొటోజోవా అనే వైరస్‌తో మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. మృతి చెందిన సింహాల నుంచి సాంపుల్స్ తీసుకున్నామని, వాటిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) పుణె పరిశీలిస్తుందన్నారు. ‘సింహాల మరణాల సంఖ్య 21కు చేరింది. ఏడు సింహాలు చికిత్స పొందుతూ మృతి చెందాయి. వైరస్ వల్ల మృతి చెందాయని గుర్తించాం. ఏ వైరసో కనుక్కోవడానికి కొంత సమయం పడుతోంది.’ అని జునగాద్ విల్డ్‌లైఫ్ సర్కిల్ ఛీఫ్ డీటీ వసవాడ మీడియాకుతెలిపారు. ఇక సింహాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాటికి సంబంధించిన ప్రత్యేకమైన మెడిసిన్స్, వ్యాక్సిన్స్‌ను అమెరికా నుంచి తీసుకురావాలని కూడా నిర్ణయించింది. 2015 లెక్కల ప్రకారం 523 సింహాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 600కు పెరిగందని అటవీ శాఖ పేర్కొంది. చదవండి: 11 సింహాలు మృత్యువాత -
హెచ్ఐవీకి కొత్త చికిత్స...
యాంటీ రెట్రోవైరల్ మందుల పుణ్యమా అని ఇప్పుడు హెచ్ఐవీతో జీవితాన్ని పొడిగించుకోవడం సాధ్యమవుతోంది. అయితే ఈ మందులు వైరస్‌ను పూర్తిగా చంపలేవు. మందులు వేసుకోవడం మానేస్తే.. లేదా మరచిపోయినా చాలు.. మళ్లీ విజంభిస్తుంది. ఈ నేపథ్యంలో రాక్ఫెల్లర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు హెచ్ఐవీపై చేసిన కొన్ని ప్రయోగాలు విజయవంతం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. హెచ్ఐవీ యాంటీబాడీలు రెండింటిని ఒక్కసారి వాడటం ద్వారా వైరస్‌ను కొన్ని నెలలపాటు నిద్రాణంగా ఉంచవచ్చునని వీరు అంటున్నారు. బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (బీనాబ్స్) అని పిలుస్తున్న ఈ సరికొత్త మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు కొన్ని నెలలకు ఒకసారి మాత్రలేసుకుంటే సరిపోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ సి. నాసెన్వీగ్ అంటున్నారు. పరిశోధన వివరాలు నేచర్, నేచర్ మెడిసిన్ జర్నల్స్ తాజా సంచికల్లో ప్రచురితమయ్యాయి. ఈ కొత్త యాంటీబాడీలు సహజసిద్ధమైనవని.. హెచ్ఐవీ వైరస్ పైభాగంలో ఉండే ప్రొటీన్లపై దాడి చేయడం ద్వారా పనిచేస్తాయని వివరించారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రెండు యాంటీబాడీలు శరీరపు సహజ రోగ నిరోధక వ్యవస్థలు ఉపయోగించుకోవడం విశేషమన్నారు. తొలిదశ ప్రయోగాల్లో రెండు యాంటీబాడీల మందును ఆరువారాల వ్యవధిలో మూడుసార్లు ఇస్తే.. 21 నుంచి 30 వారాలపాటు వైరస్‌ను అదుపులో ఉంచగలిగిందని చెప్పారు. -
వెండితెరకు వైరస్
ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో నిఫా వైరస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని. అందర్నీ గడగడలాడించిన ఈ భయంకరమైన వైరస్‌ని బేస్ చేసుకొని మలయాళ దర్శకుడు ఆషిక్ అబు ఓ చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. ‘వైరస్’ పేరుతో తెరకెక్కబోయే ఈ రియలిస్టిక్ డ్రామాలో భారీ తారాగణం కనిపించబోతున్నారు. రేవతి, రీమా కళ్లింగల్, పార్వతీ, టావినో థామస్, రమ్యా నంబీసన్, చెంబు వినోద్ వంటి నటీనటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో రియలిస్టిక్ సంఘటనలతో తెరకెక్కించిన ‘టేకాఫ్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరి.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. -
స్మార్ట్‌లో.. ర్యాట్...!!
విశాఖసిటీ: మీ స్మార్ట్ ఫోన్లోకి ఎలుక దూరింది. అది.. వైర్లు కొరికే ఎలుక కాదు. మీ గాడ్జెట్‌ను సైబర్ నేరగాడి ఆధీనంలోకి తీసుకెళ్లిపోయే వైరస్. లింక్ వచ్చిందా.. యాప్ డౌన్లోడ్ చేశామా అన్నది ముఖ్యం కాదు. ఆ యాప్ ఎంత వరకూ కరెక్ట్.. అది మంచి కంపెనీ తయారు చేసిందా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మరి చిపోయిన వారందరికీ ఈ ర్యాట్ ఓ హెచ్చరిక. తెల్లారింది మొదలు.. నిద్ర పోయే వరకూ ప్రతి పని కోసం స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన యాప్‌లనే వినియోగిస్తున్నారు. నూటికి 80 మందికి యాప్స్‌తోనే తెల్లారుతోంది. మెసేజ్ నుంచి మనీ ట్రాన్సాక్షన్ వరకూ.. పెన్ను నుంచి ఫ్లయిట్ టికెట్స్ వరకూ తమకు కావాల్సిన అన్ని పనులకు దాదాపు యాప్స్‌నే వాడుతున్నారు. ఇలాంటి వారిని దోచుకునేందుకు ఇప్పుడు సైబర్‌నేరగాళ్లు యాప్స్‌నే ఎరగా వేస్తున్నారు. ఫలానా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పాయింట్లు వస్తాయని, ఫ్రీ షాపింగ్ కూపన్లు అంటూ ఓ మెసేజ్‌ను ఫోన్‌కు పంపిస్తారు. వీటితో అవసరం ఉన్నా లేకున్నా ఉచితం కదా అని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా గుర్తించిన ఈ తరహా ఆందోళనకర అంశాన్ని ‘రిమోట్ అడ్మినిస్ట్రేషన్ ట్రౌజన్ అని పిలుస్తున్నారు. షార్ట్ కట్లో ర్యాట్ అన్నమాట. వివిధ రకాల యాప్స్ మాటున నేరగాళ్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను గాడ్జెట్స్లోకి చొప్పించి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ తరహా మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అన్నింటికీ యాప్స్ వినియోగమే.. ఇటీవల స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో యాప్స్ వాడకం కూడా అలాగేపెరిగింది. నిద్ర లేవడం నుంచి ఉష్ణోగ్రత తెలుసుకోవడం, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ఇలా.. ఒక్కో ఫోన్లో కనిష్టంగా 10 వరకు అప్లికేషన్లు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో పెరుగుతున్న ఈ ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకోవడం కోసం సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తొలుత ఈ నేరగాళ్లు దేశ వ్యాప్తంగా ఉన్న మొబైల్ నెంబర్ల డేటాను సేకరిస్తున్నారు. దీనికోసం వారు కష్టపడకుండానే ఆన్లైన్లో కొంత మొత్తం చెల్లించి తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ నెంబర్లు తమ చేతికి వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతోంది. ర్యాట్‌తో ఓటీపీ సైతం స్వాహా... మన ఫోన్‌కు వచ్చే ఓటీపీని కూడా ఇక్కడ సైబర్ నేరగాళ్లు సంగ్రహించేస్తారు. ఇందుకు వారు ముందు పంపే యాప్ ద్వారానే ఏర్పా?ట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే వారికి వెళ్లిపోతుంది. కార్డుల వివరాలు వారివద్ద అప్ప?టికే సిద్ధంగా ఉంటాయి. కనుక ఓటీపీ రాగానే వారు తేలిగ్గా లావాదేవీ పూర్తి చేసేస్తున్నారు. ఇలానే సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే దోపిడీలకు తెగబడుతున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను మాత్రం సైబర్ నేరస్థులు అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో మొబైల్స్ వినియోగదారులు నిద్రలో ఉంటారని, ఈ నేపథ్యంలోనే అతడి ఫోన్‌ను అతని ప్రమేయం లేకుండానే ఓటీపీ వచ్చిన విషయమే గుర్తించరని వివరిస్తున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి అక్రమ లావాదేవీలు చేసే సైబర్ నేరస్థులు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, ఆన్లైన్లో ఖరీదు చేసి బోగస్ చిరునామాల్లో తీసుకుంటున్నట్టు గుర్తించారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా వారిని పట్టుకోవడం దాదాపు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు, వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న మెసేజ్‌తో ప్రారంభమై.. తాము ఉచితంగా అందిస్తున్న యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ నేరగాళ్ల తొలుత బల్క్ ఎస్సెమ్మెస్‌లు అనేకమందికి పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు ఎవరైనా అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే చాలు.. సదరు యాప్ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. యాప్‌తోపాటే నేరగాళ్లు పంపించే ‘ట్రోజన్’ కూడా అదే గాడ్జెట్‌లోకి డౌన్లోడ్ అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి మన ఫోన్ సైబర్ క్రైమ్ నేరస్థుడి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఏదైనా జరగరాని నష్టం జరిగితే తప్ప.. ఫోన్ సైబర్ నేరగాడి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న స్మార్ట్ మొబైల్‌ను నియంత్రిస్తూ తనకు అవసరమైన విధంగా వాడుకుంటారు. అందుకే ఈ వైరస్‌ను ‘రిమోట్ అడ్మినిస్ట్రేషన్ ట్రౌజన్ అని పిలుస్తుంటారు. మన ప్రమేయం లేకుండానే.. నేరగాళ్ల ఆధీనంలోకి ఫోన్ వెళ్లిపోవడంతో మనం ఫోన్లో చేసే ప్రతి చర్యను అతడు కూడా పర్యవేక్షించగలడు. కాల్స్, డేటా వినియోగం, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు.. ఇలా మొబైల్లో ఉన్న మొత్తం సమాచారం దాని ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను సైతం సైబర్ నేరస్థుడు ఈ ర్యాట్ చొప్పించడం ద్వారా తమ నియంత్రణలోకి తీసుకోగలడు. ఎస్సెమ్మెస్‌లతో పాటు ఇటీవల సినిమా టిక్కెట్ల నుంచి చాలా రకాల బిల్లుల చెల్లింపులను కూడా ఆన్లైన్లో అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారానే చేసేస్తున్నారు. ఇలాంటి క్రయవిక్రయాల కోసం మొబైల్ వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతో పాటు లావాదేవీలకు సంబంధించిన ఓటీపీ సైతం అదే ఫోన్‌కి వస్తుంది. ఎవరైనా డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా ఓటీపీ నమోదు చేయందే లావాదేవీ పూర్తికాదు. అందుకే.. సైబర్ నేరగాడు తెలివిగా ర్యాట్‌ను ఫోన్లోకి యాప్స్ ద్వారా పంపించి సమాచారం లాగేస్తున్నాడు. -
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్ క్యాన్సర్ వల్ల ఏటా 72,825 మంది మృత్యువు బారిన పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే...? గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. కారణాలేమిటి? సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభా జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే వారిలో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. ఒకవేళ అలా నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని. నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. హెచ్‌పీవీ వ్యాక్సిన్ అంటే..? శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ను తయారు చేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్నూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఆర్నెల్ల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
ఆ వైరస్‌తో మనకు మేలే!
వయసుతో పాటు మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతూంటుంది. వృద్ధులకు వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు టక్కున వచ్చేందుకు కారణం ఇదే. ఈ సమస్యను అధిగమించేందుకు అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఓ విచిత్రమైన ఫలితాలిచ్చాయి. వ్యాధులకు కారణమవుతాయని మనం ఇప్పటివరకూ భయపడుతూన్న వైరస్‌లలోనే ఒకటి మన రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయగలదని వీరు గుర్తించారు. సైటో మెగలో వైరస్ అని పిలుస్తున్న ఈ వైరస్ సగం మంది మనుషులకు చిన్నప్పుడే సోకుతుంది. చికిత్స ఏదీ లేకపోవడం వల్ల పెద్దవాళ్లలోనూ కనిపిస్తూంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి ఈ వైరస్‌తో పోరాడుతూ ఉంటుందని, ఫలితంగా ఇతర వైరస్‌లకు త్వరగా లొంగిపోతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే సైటో మెగలో వైరస్‌ను ఎలుకలకు ఎక్కించి, అదే సమయంలో లిస్టీరియా వైరస్‌ను చేర్చినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ మరింత సమర్థంగా లిస్టీరియాను ఎదుర్కొందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ స్మితీ తెలిపారు. మరిన్ని పరిశోధనలు చేసి∙చూడగా, సైటో మెగలో వైరస్ రోగ నిరోధక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.