తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (ఎంపాక్స్) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది.
కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు.
అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
చదవండి : మంకీపాక్స్ వైరస్ లక్షణాలు
Comments
Please login to add a commentAdd a comment