న్యూఢిల్లీ : భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో h9n2బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది.
బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
భారత్‌లో ఇది రెండో కేసు
భారత్‌లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
రెండున్నరేళ్ల చిన్నారిలో
భారత్‌లో పర్యటించిన జూన్7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
బర్డ్‌ఫ్లూ లక్షణాలు
డబ్ల్యూహెచ్‌ఓ మేరకు..బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.
బర్డ్‌ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బర్డ్‌ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్‌లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment