బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్ మాదిరిగానే ఉన్నాయి.
నిబంధనలు ఇలా
జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.
బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.
ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.
పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్‌లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.
మెల్లగా విస్తరిస్తున్న హెచ్‌ఎమ్‌పీవీ
దేశంలో హెచ్‌ఎమ్‌పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది.
ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ రాగా, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండి
చిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్‌ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు
ఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్‌ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.
చైనాలో అధికం..
ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment