bird flue
-
భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ
న్యూఢిల్లీ : భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో h9n2బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది. బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్‌లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.భారత్‌లో ఇది రెండో కేసుభారత్లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రెండున్నరేళ్ల చిన్నారిలో భారత్‌లో పర్యటించిన జూన్7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. బర్డ్‌ఫ్లూ లక్షణాలు డబ్ల్యూహెచ్ఓ మేరకు..బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. బర్డ్‌ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బర్డ్‌ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. -
బర్డ్ ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో కోళ్లు మృతి
సాక్షి, ముంబై: మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలను, అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగా షాహాపూర్‌లోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చనిపోయిన కోళ్లకు సంబంధించిన నమూనాలను పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. ఇదిలా ఉండగా.. H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే అక్కడ కోళ్లు చనిపోయినట్టు థానే జడ్పీ సీఈవో డా. బహుసాహెబ్ దంగ్డే తెలిపారు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కట్టడి కోసం అధికారులు రంగంలోకి దిగారు. సదరు పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లతో సహా.. ఆ కోళ్ల ఫారమ్‌కు కిలోమీటర్ పరిధిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లోని దాదాపు 25,000 కోళ్లను చంపేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే, బర్డ్ ఫ్లూ వెలుగులోకి రావడంతో థానే సరిహద్దు జిల్లాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ పౌల్ట్రీ ఫామ్‌ల్లోని కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్‌ల నిర్వాహకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దాదాపుగా ప్రతీ ఏటా దేశంలో ఏదో ఒక చోట బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, బర్డ్ ఫ్లూ కారణంగా గతేడాది జూలైలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ బాలుడు(12) చనిపోయాడు. -
దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం
చండీగఢ్: దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదయ్యింది. హరియాణాలో 11 ఏళ్ల బాలుడు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్‌తో బాధపడుతూ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బర్డ్ ఫ్లూతో మృతి చెందిన తొలి కేసు ఇదేనన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బంది అందరు ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం అనేది చాలా రేర్‌గా జరుగుతుందని.. కానీ ఒక్కసారి దాని బారిన పడితే మరణాల రేటు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. బర్డ్ ఫ్లూ సోకిన వారిలో మరణాల రేటు 60శాతంగా ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో హరియాణాతో సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇక హరియాణాలో నిపుణులు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా వైరస్ సబ్ టైప్ హెచ్5ఎన్8(H5N8)ని గుర్తించారు. ఈ జాతి మనుషులకు సోకుతుందని తెలిపారు. ఢిల్లీ, కేరళ, రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్రల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ సంక్రమణ వ్యాప్తిని ఎదుర్కోవటానికి దేశవ్యాప్తంగా పక్షులను చంపడం జరిగింది. జనవరిలో ఢిల్లీ ఎర్రకోట నుంచి సేకరించిన పక్షుల నమూనాలు ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఖాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. ఫిబ్రవరిలో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ నుంచి సేకరించిన మరిన్ని నమూనాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలాయి. మార్చిలో ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా తిరిగి కనిపించింది. మహారాష్ట్రలోని అమరావతి, నందూర్బార్ జిల్లాల్లో 261 పౌల్ట్రీ పక్షులు చనిపోయాయి. ఏప్రిల్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగ్ డ్యామ్ సరస్సులో 100 వలస పక్షులు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ సంక్రమణ భయం మళ్లీ పెరిగింది. -
జాగ్రత్త.. పావురాలతో సెల్ఫీలొద్దు!
సాక్షి, హైదరాబాద్: నగరం లక్షల పావురాలకు ఆవాసం. రోజూ కొన్ని వేల మంది వీటికి తిండి గింజలు వేస్తుంటారు. 500 ప్రాంతాల్లో ప్రత్యేకంగా తిండి గింజలు వేసే కేంద్రాలున్నాయి. చాలా మందికి ఇలా తిండి గింజలు వేసి.. వాటితో సెల్ఫీ దిగడం అలవాటు. కొద్ది రోజుల వరకు ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో పక్షి ప్రేమికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించనప్పటికీ ఆ వ్యాధి ఉన్న ప్రాంతం నుంచి వచ్చే పక్షుల వల్ల వైరస్ ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల పాటు జనం జాగ్రత్తతో ఉండాలని చెబుతున్నారు. పావురాల గుంపులోకి వెళ్లొద్దు.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వృద్ధి చెందుతున్న పావురాలతో సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. హైదరాబాద్ సహా సమీప ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో పావురాలున్నాయి. వలస పక్షుల ద్వారా ఈ పావురాలకు బర్డ్‌ఫ్లూ సోకి.. వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. పావురాలకు నిత్యం తిండి గింజలు వేయడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదే అయినా.. కొందరు పావురాల గుంపుల్లోకి వెళ్లి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆ సమయంలో పావురాలు ఒక్కసారిగా ఎగిరితే వాటి రెక్కల నుంచి పెద్దమొత్తంలో దుమ్ము కణాలు గాలిలో కలుస్తుంటాయి. ఒకవేళ బర్డ్‌ఫ్లూ సోకిన పావురాలు వాటిల్లో ఉంటే ఆ దుమ్ము ద్వారా వైరస్ మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిత్యం ఫిర్యాదులు.. ప్రస్తుతం ఎక్కడైనా పక్షి చనిపోతే ప్రజలు బర్డ్ ఫ్లూ అనుమానంతో భయపడుతున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పశుసంవర్థక శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీకి, పక్షుల స్వచ్ఛంద సంస్థలకు ఫిర్యాదులు వస్తున్నాయి. తమ ఇంటి సమీపంలో చెట్టుపై నుంచి పక్షి పడి చనిపోయిందని, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటూ మాకు నిత్యం పది వరకు ఫోన్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు. - సంజీవ్ వర్మ, యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ అప్రమత్తత అవసరం.. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లో పావురాలు పది లక్షలకు చేరువవుతున్నాయి. ఈ విషయంలోనే జనంలో అప్రమత్తత అవసరం. పావురాల గుంపులకు చేరువగా వెళ్లొద్దు. పక్షులు ఎక్కువగా వాలే చెట్ల కింద అధిక సమయం ఉండకపోవడం మంచిది. వాటి రెట్టలు కూడా వైరస్‌ను ప్రబలేలా చేస్తాయి. - వాసుదేవరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, పక్షి విభాగం అధిపతి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం -
10 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి
సాక్షి, న్యూఢిల్లీ: బర్డ్ ఫ్లూ ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కాగా, సోమవారం ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోనూ ఈ వ్యాధిని గుర్తించారు. రాజస్తాన్‌లోని టోంక్, కరౌలి, భిల్వారా, గుజరాత్‌లోని వల్సాద్, వడోదర, సూరత్ జిల్లాల్లో కాకులు, వలస పక్షలు, అడవి పక్షులు బర్డ్ ఫ్లూతో మరణించినట్లు కేంద్రం నిర్ధారించింది. ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లో కూడా కాకులు మరణించినట్లు తెలిపింది. తూర్పు ఢిల్లీలోని సంజయ్ లేక్ ప్రాంతంలో కాకులు, బాతుల మరణానికి బర్డ్‌ఫ్లూ కారణమని తేల్చింది. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. అలాగే ముంబై, థానే, దపోలి, బీడ్ ప్రాంతాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూసినట్లు కేంద్రం వెల్లడించింది. బర్డ్ ఫ్లూపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడాన్ని నిరోధించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. నీటి వనరులు, పక్షుల మార్కెట్లు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్ట్రీ ఫామ్‌ల చుట్టూ నిఘా పెంచాలని, మరణించిన పక్షులను పారవేయడంలో సరైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. దేశంలో బర్డ్‌ఫ్లూ కేసులు ఉన్నప్పటికీ పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని, మార్కెట్లను మూసివేయొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం అన్ని రాష్ట్రాలకు సూచించారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి పక్షులు, పశువుల నుంచి మనుషులకు సోకుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుచేశారు. -
అయ్యలారా అమ్మలారా ఒక్కసారి ఇటు వచ్చిపోండి!
ఇప్పుడొస్తున్న కొత్త ట్రెండ్ యానిమల్ స్కానర్స్. మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను పసిగట్టడంలో శునకాల ప్రతిభ మనకు తెలియందేమీ కాదు. ఆ తరువాత వాటి నైపుణ్యం మలేరియా, క్యాన్సర్, పార్కిన్సన్స్ను గుర్తించే వరకు విస్తరించింది. తాజా కబురు ఏమిటంటే శిక్షణ పొందిన శునకరాజాలు కరోనా వైరస్‌ను గుర్తిస్తున్నాయి. పసిగట్టడంలో కచ్చితత్వం 92 నుంచి 99 శాతం వరకు ఉంటుందట. పొంచి ఉన్న కరోనా వైరస్‌ను పసిగట్టడానికి చిలీ, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్ విమానాశ్రయాల్లో శునకాలను మోహరిస్తున్నారు. మరోవైపు చూస్తే... క్యాన్సర్ సెల్స్‌ను పావురాలు చక్కగా గుర్తించగలుగుతున్నాయని ‘సైంటిఫిక్ అమెరికన్’ తెలియజేసింది. అమెరికా సైంటిస్టులు బర్డ్‌ఫ్లూను గుర్తించడంలో ఎలుకలకు శిక్షణ ఇస్తే శబ్భాష్ అనిపించుకున్నాయట! -
బర్డ్ ఫ్లూ...కలకలం
సాక్షి, యలహంక: కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి ఉందని నిర్ధారణ కావడంతో కర్ణాటకలో కొన్నిచోట్ల కోడి మాంసం విక్రయించే దుకాణాలు మూతపడ్డాయి. ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుందన్న భయంతో ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. బ్యాటరాయణపుర పరిధిలో ఇప్పటికే కోడి మాంసం అంగళ్లను మూసివేశారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కోళ్లలో కొన్ని మృతిచెందడంతో వాటిని పరీక్షించగా విషయం బయటపడింది. దాసరహళ్లిలోని కేజీఎన్ కోడి మాంసం విక్రయించే అంగడిలో తమిళనాడు నుంచి తీసుకొచ్చిన 15 నాటు కోళ్లలో నాలుగు చనిపోయాయి. వాటిని హెబ్బాళ్లోని పసువుల ఆస్పత్రికి పరీక్షలకోసం తరలింగా అక్కడి నుంచి భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపారు. అక్కడ పరిశీలించిన వైద్యులు కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి (హెచ్ 5 ఎన్ 1) సోకిందని నిర్ధారించారు. విషయం తెలిసిన అధికారులు దాసరహళ్లి చుట్టు పక్కల రెండు కిలోమీటర్ల పరిధిలోని కోడి మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయించారు. బర్డ్ ఫ్లూ సోకిందేమోనని మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోళ్లు చనిపోతే విధిగా పరీక్షలు చేయించాలని దుకాణ నిర్వాహకులను కోరుతున్నారు. -
మన కోడిగుడ్లు, కోడి పిల్లలపై నిషేధం!
న్యూడిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ ఉధృతంపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. తమ దేశంలోకి భారత్ కు చెందిన కోడి పిల్లలు, గుడ్ల దిగుమతిపై తాత్కాలికంగా బ్యాన్ విధించి పౌల్ట్రీ పరిశ్రమకు షాకిచ్చింది. అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా బాగా ప్రబలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ జనవరి 2 భారత పౌల్ట్రీ ఎగుమతిదారులకు సమాచారం అందించింది. సౌదీ అరేబియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, నీరు, వ్యవసాయ శాఖ లైవ్ బర్డ్స్ ఎగుమతులపై తాత్కాలిక నిషేధానికి నిర్ణయించినట్టు తెలిపింది. భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న సౌదీ నిర్ణయంతో పౌల్ట్రీ పరిశ్రమలో ఆందోళన మొదలైంది. మిగతా దేశాలు సౌదీని అనుసరిస్తే ఎలా అనే భయం పట్టుకుంది. అయితే 1 శాతంగా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై దీని ప్రభావం పెద్దగా ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అత్యంత హానికరమైన వైరస్ ఇండియాలో ఉందని ప్రకటిస్తే తమ ఎగుమతులను నిలిపివేస్తామని గోద్రెజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ యాదవ్ చెప్పారు. మన దేశంలో తక్కువ వ్యాధికారక ఇన్ఫ్లుఎంజా మాత్రమే ఉందని, ఇది కొన్నిసార్లు ఉధృతమవుతుందని వివరించారు. మరోవైపు సౌదీకి బ్రెజిల్ అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే మన పౌల్ట్రీ ఉత్పత్తులు ఖరీదు ఎక్కువ. అలాగే మొక్కజొన్న, ఇతర పక్షి ఫీడ్ లాంటి ముడిసరుకు లు బ్రెజిల్ ,అమెరికాలతో పోలిస్తే చౌక ధరల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో తాత్కాలిక నిషేధం భారతదేశం పౌల్ట్రీ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు,రమేష్ ఖత్రి తెలిపారు. అందుకే దేశంలో బర్డ్ ఫ్లూ ఫ్రీ జోన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫలితంగా సురక్షితమైన పౌల్ట్రీ ఉత్పత్తులు రవాణాను రక్షించాలని ఆయన కోరారు.