ఇప్పుడొస్తున్న కొత్త ట్రెండ్ యానిమల్ స్కానర్స్. మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను పసిగట్టడంలో శునకాల ప్రతిభ మనకు తెలియందేమీ కాదు. ఆ తరువాత వాటి నైపుణ్యం మలేరియా, క్యాన్సర్, పార్కిన్‌సన్స్‌ను గుర్తించే వరకు విస్తరించింది. తాజా కబురు ఏమిటంటే శిక్షణ పొందిన శునకరాజాలు కరోనా వైరస్‌ను గుర్తిస్తున్నాయి. పసిగట్టడంలో కచ్చితత్వం 92 నుంచి 99 శాతం వరకు ఉంటుందట. పొంచి ఉన్న కరోనా వైరస్‌ను పసిగట్టడానికి చిలీ, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్ విమానాశ్రయాల్లో శునకాలను మోహరిస్తున్నారు. మరోవైపు చూస్తే... క్యాన్సర్ సెల్స్‌ను పావురాలు చక్కగా గుర్తించగలుగుతున్నాయని ‘సైంటిఫిక్ అమెరికన్’ తెలియజేసింది. అమెరికా సైంటిస్టులు బర్డ్‌ఫ్లూను గుర్తించడంలో ఎలుకలకు శిక్షణ ఇస్తే శబ్భాష్ అనిపించుకున్నాయట!
Comments
Please login to add a commentAdd a comment