కరోనా కట్టడికి తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉండటంతో ఈ సమయంలో హైదరాబాద్ నగర రహదారులు కిక్కిరిపోతున్నాయి. మరోవైపు కరోనా నుంచి రక్షణ కోసం రకరకాల మాస్క్‌లు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కాలుష్యం తగ్గడంతో హిమాలయ సానువులు స్పష్టంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.
1/8
తమిళనాడులోని కోయంబత్తూరులో కొత్తగా నిర్మించిన గుడిలో కరోనా దేవి మాతకు పూజలు చేస్తున్న భక్తులు
2/8
వనపర్తి జిల్లా అమరచింతలో లాక్‌డౌన్ ఉల్లంఘనులతో కరోనా నివారణపై వ్యాసం రాయిస్తున్న ఆత్మకూర్ సీఐ సీతయ్య
3/8
ఈ చిత్రాలను చూశారు? ఆంక్షల సడలింపు సమయంలో వాహనాల రద్దీ ఎంత హడలెత్తించేలా ఉందో! హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శుక్రవారం వందలాదిగా వాహనాలు రోడ్డెక్కిన చిత్రాలివి.
4/8
హిమాలయాల అందాలు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ వాసులను కూడా కనువిందు చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కాలుష్యం తగ్గడం, కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆకాశం నిర్మలంగా మారడంతో ఇది సాధ్యమైంది.
5/8
ఈ మాస్క్ చూస్తే భలే ఉంది కదూ.. సిద్దిపేటకు చెందిన డాక్టర్ ప్రణీత్ 3ఎం రెస్పిరేటర్ హాఫ్ ఫేస్ మాస్క్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మాస్క్‌లో ఉన్న ప్రత్యేకమైన ఫిల్టర్లు వైరస్ ప్రొటెక్షన్‌గా నిలుస్తాయని ప్రణీత్ పేర్కొన్నారు. మాస్క్ ఉపయోగించిన విధానాన్ని బట్టి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి ఫిల్టర్లు మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ధర మాత్రం రూ.6 వేలు ఉంటుందని చెప్పారు. నిత్యం రోగుల మధ్య ఉండాల్సి రావడంతో ఈ మాస్క్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
6/8
ఇజ్రాయెల్, పాలస్తీనా కాల్పుల విరమణ పాటించడంతో గాజాలో పాలస్తీనా, హమాస్ జెండాలను చేబూని సంతోషం వ్యక్తం చేస్తున్న బాలలు
7/8
థాయ్‌ల్యాండ్‌లోని చులాలంగ్‌కోర్న్ యూనివర్సిటీలోని వెటర్నరీ విభాగంలో మనుషుల చెమటలో కోవిడ్ జాడ కనిపెట్టేందుకు శునకాలకు తర్ఫీదు ఇస్తున్నారు. కొందరు వ్యక్తుల నుంచి సేకరించిన స్వేదంతో కూడిన కంటెయినర్లను వాసన చూస్తున్న లాబ్రెడార్ బాబీ.
8/8
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలో మాస్కులు, శానిటైజర్లు, వైద్య సామాగ్రిని పంపిణీ చేస్తున్న డీపీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment