
యూనివర్సిటీ క్యాంపస్: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీలోని వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్‌లో వైద్యులు బుధవారం అరుదైన ఆపరేషన్ చేసి కుక్క చిన్న ప్రేవుల్లో ఇరుకున్న మాస్క్‌ను తొలగించారు. తిరుపతి చింతలచేను ప్రాంతంలో 6 నెలల వయసున్న మగకుక్క 4 రోజుల నుంచి వాంతి చేసుకుంటూ అనారోగ్యంతో ఉండడంతో వీసీసీకి తీసుకొచ్చారు.
చదవండి: Vijayawada: శిశువు మృతిపై బంధువుల ఆందోళన
ఎక్స్‌రే తీసిన అనంతరం డాక్టర్ భారతి, డాక్టర్ రఘునాథ్, డాక్టర్ ఎన్,ధనలక్ష్మి శస్త్రచికిత్స చేసి మాస్కును తొలగించారు. ప్రజలు వినియోగించిన మాస్కులను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్లే మూగజీవాలు ఇలాంటి సమస్యల్లో చిక్కుకుంటున్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.