![Corona Virus: Chinese pensioner aged 101 Recovers - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/6/century-old1.jpg.webp?itok=HM4s5eEy)
ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. అక్కడి స్థాన కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్చి కూడా అయ్యారు. ఆయన ఈ వైరస్ బారిన పడిందీ మరెక్కడో కాదు. వైరస్ బట్టబయలైన చైనాలోని హుబీ రాష్ట్రం, వుహాన్ నగరంలో. ఆ శతాధిక వృద్ధుడి సర్ నేమ్‌ను దాయ్‌గా ఆయన చికిత్స పొందిన ఆస్పత్రి ఇంచార్జి లీ లాయ్ పేర్కొన్నారు. ఆయన తన 101వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే ఆస్పత్రి పాలయ్యారు. దాయ్ విడుదలైనప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని లీ లాయ్ చెప్పారు. ఇంటి వద్ద తన 92 ఏళ్ల భార్య నిరీక్షిస్తుందని, తాను త్వరగా ఇంటకి వెళ్లి ఆమె బాగాగులు చూసుకోవాలని చెబుతుండేవారని డాక్టర్ తెలిపారు. (వేయి రోగాల పుట్టరా ఈ అరచేయి..)
అంతకుముందు ఆదివారం 98 ఏళ్ల వృద్ధుడు హు హానియింగ్ కూడా కరోనా వైరస్‌ను జయించి ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఆయనతోపాటు హు హానియింగ్ 54 ఏళ్ల కూతురు కూడా సురక్షితంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన వారిద్దరి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండిందని, అయినా వారిద్దరు చావును జయించి బయటకు వచ్చారని వైద్యులు తెలిపారు. ఆ వృద్ధుడికి వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. చైనాలో ఇప్పటి వరకు 95,700 మంది కోవిడ్ బారిన పడగా, వారిలో 41,600 మంది డిశ్చార్జి అయ్యారు. గత రెండు, మూడు రోజులుగా చైనాలో కొత్త వైరస్ కేసులు గణనీయంగా తగ్గాయని చైనా వైద్యాధికారులు తెలిపారు. (కోవిడ్ను జయించిన కేరళ విద్యార్థిని)
చదవండి: శుభ్రతే కోవిడ్-19కు మందు
Comments
Please login to add a commentAdd a comment