నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా | US court orders China to pay 24 billion Dollars | Sakshi
Sakshi News home page

నీవల్లే కరోనా!.. చైనాకు అమెరికా కోర్టు జరిమానా

Published Mon, Mar 10 2025 7:03 AM | Last Updated on Mon, Mar 10 2025 7:03 AM

US court orders China to pay 24 billion Dollars

వాషింగ్టన్‌: డ్రాగన్‌ కంట్రీ చైనాకు అమెరికా భారీ షాకిచ్చింది. కోవిడ్‌ మహమ్మారిని కప్పిపుచ్చడంతోపాటు, పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌(పీపీఈ)పై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు చైనాకు 24 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. 

కాగా, కోవిడ్‌ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సోరిలో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, తదితర సంస్థలను బాధ్యులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. విచారణ ముగించిన జడ్జి స్టీఫెన్‌ కోవిడ్‌ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి 24 మిలియన్‌ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 

ఇదే సమయంలో చైనా చర్యల ఫలితంగా మిస్సోరికి పన్నుల రూపంలో 8 బిలియన్‌ డాలర్ల నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు గాను మరో 122 మిలియన్‌ డాలర్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచి్చందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కోవిడ్‌కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సోరి అటార్నీ జనరల్‌ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. మిసోరిలోని చైనా ఆస్తులను స్వా«దీనం చేసుకుని, నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. మిసోరి కోర్టు తీర్పుపై వాషింగ్టన్‌లో చైనా ఎంబసీ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ‘ఈ తీర్పును మేం పట్టించుకోం. ఎలాంటి ప్రాతిపదిక లేని కేసు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న తీర్పు’అని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement