సాక్షి, హైదరాబాద్: HMPV (హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్) వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెచ్‌ఎంపీవీ సోకితే జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యారోగ్య హెచ్చరించింది.
హెచ్ఎంపీవి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని.. జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ
కరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో ఉపయోగించిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అనారోగ్య సమస్యలతో రద్దీ ప్రాంతాలకు వెళ్లడంవల్ల ఇతరులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని.. జన సామర్త్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగితే HMPV వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment