భోజ్‌పూర్: బీహార్‌లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదయ్యింది. గుజరాత్ నుంచి భోజ్‌పూర్ వచ్చిన ఒక బాలునిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. శరీరమంతటా దద్దుర్లు, పొక్కులు వచ్చిన ఓ బాలుడిని భోజ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ బాధితునికి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత బాధిత బాలుడిని ఏసీఎంవో వైద్యులు డాక్టర్ కేఎన్ సిన్హా వద్దకు తరలించారు.
మంకీ పాక్స్ అనుమానిత బాధితుని గుర్తించినట్లు డాక్టర్ కెఎన్ సిన్హా తెలిపారు. బాధితుని రక్త నమూనాను మైక్రోబయాలజీ విభాగానికి పంపించామన్నారు. స్థానికంగా ఐసోలేషన్ ఏర్పాట్లు లేకపోవడంతో, బాధితుడిని పట్నాలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలుని శరీరంపై వారం రోజులుగా దద్దుర్లు ఉన్నాయి. అప్పుడప్పుడు బాధితుడు వణుకుతున్నాడు. ఆ బాలుడు ఆరు నెలలుగా గుజరాత్‌లో ఉన్నాడు. బాధితుడు ఉన్న ప్రాంతానికి కేరళ నుంచి కొందరు వచ్చారని బాలుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా బాలుని కుటుంబ సభ్యులలో ఎవరిలోనూ మంకీపాక్స్ లక్షణాలు కనిపించలేదు. బాధిత బాలునికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి
Comments
Please login to add a commentAdd a comment