![Pakistan Government made Strategy to Deal with Monkeypox Virus](/styles/webp/s3/article_images/2024/08/18/min-keay-pox.jpg.webp?itok=U0Y1TIBD)
పాకిస్తాన్‌లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదైన నేపధ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రజలు మంకీపాక్స్ విషయంలో ఆందోళన చెందవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
పాక్ ప్రధాని ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఒక మంకీపాక్స్ వ్యాధి కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలు, ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారందరికీ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే, దేశంలోకి ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వారికి దూరంగా ఉండాలని హెల్త్ కోఆర్డినేటర్ అహ్మద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి 10 నుంచి 15 రోజులు పడుతుందన్నారు. బాధితుడిని క్వారంటైన్‌లో ఉంచడం మంచిదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment