Bhojpur
-
Monkeypox Virus: గుజరాత్ బాలునికి మంకీపాక్స్?
భోజ్పూర్: బీహార్లో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదయ్యింది. గుజరాత్ నుంచి భోజ్పూర్ వచ్చిన ఒక బాలునిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. శరీరమంతటా దద్దుర్లు, పొక్కులు వచ్చిన ఓ బాలుడిని భోజ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ బాధితునికి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత బాధిత బాలుడిని ఏసీఎంవో వైద్యులు డాక్టర్ కేఎన్ సిన్హా వద్దకు తరలించారు.మంకీ పాక్స్ అనుమానిత బాధితుని గుర్తించినట్లు డాక్టర్ కెఎన్ సిన్హా తెలిపారు. బాధితుని రక్త నమూనాను మైక్రోబయాలజీ విభాగానికి పంపించామన్నారు. స్థానికంగా ఐసోలేషన్ ఏర్పాట్లు లేకపోవడంతో, బాధితుడిని పట్నాలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాలుని శరీరంపై వారం రోజులుగా దద్దుర్లు ఉన్నాయి. అప్పుడప్పుడు బాధితుడు వణుకుతున్నాడు. ఆ బాలుడు ఆరు నెలలుగా గుజరాత్లో ఉన్నాడు. బాధితుడు ఉన్న ప్రాంతానికి కేరళ నుంచి కొందరు వచ్చారని బాలుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా బాలుని కుటుంబ సభ్యులలో ఎవరిలోనూ మంకీపాక్స్ లక్షణాలు కనిపించలేదు. బాధిత బాలునికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: వందేభారత్ రైళ్ల కొనుగోలుకు పలు దేశాల ఆసక్తి -
153కు బిహార్ వరద మృతులు
న్యూఢిల్లీ: బిహార్ వరదల్లో శనివారం మరో నలుగురు మృతువాత పడడంతో మొత్తం మృతుల సంఖ్య 153కు చేరింది. భోజ్పూర్, బెగుసరాయ్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 12 పంచాయతీ ప్రాంతాలు ముంపులో చిక్కుకోవడంతో మొత్తం 12 జిల్లాల్లో 34.69 లక్షల మంది వరద బారిన పడ్డారు. గంగా, సోనే, పున్పున్, బుర్హీ గండక్, ఘాఘ్రా, కోసి, ఇతర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో వరద తీవ్ర రూపం దాల్చడంతో శనివారం ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇంతవరకూ మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇక ఉత్తర్ప్రదేశ్లో పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో 987 గ్రామాల్లో 8.7 లక్షల మంది ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా ఎత్తై పర్వత ప్రాంతాల్లో ఈ సీజన్లో మొదటి సారి మంచు కురిసింది.