మంకీపాక్స్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలకు వైరస్ వేగంగా వ్యాప్తి చేందుతుండటంతో మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా(ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితి) ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ మంకీపాక్స్ వ్యాధిని అసాధరణ పరిస్థితిగా పేర్కొంది. కాగా 2009 నుంచి డబ్ల్యూహెచ్‌వో ఏడుసార్లు ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని డిక్లేర్ చేసింది. చివరిసారిగా 2020లో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రకటించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ ప్రస్తుతం భారత్‌ను భయపెడుతోంది. దాదాపు 70 దేశాలకు మంకీపాక్స్ విసర్తించింది. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో మూడు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం గమనార్హం. 16 దేశల్లోని మనషుల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ విస్తరించింది. జంతువుల నుంచి వ్యాప్తి చెందే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: Monkeypox: దేశంలో మూడుకి చేరిన మంకీపాక్స్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment