World Health Organisation (WHO)
-
వణికిస్తున్న మంకీపాక్స్‌కు చెక్.. వ్యాక్సిన్ విడుదల
జెనీవా: ప్రపంచదేశాలను ప్రస్తుతం మంకీపాక్స్ వణికిస్తోంది. ఆఫ్రికాతో పాటు వివిధ దేశాల్లో మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దవారిలో ఎంపాక్స్ నిరోధానికి రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.కాగా, పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ నుంచి రక్షించడానికి బవేరియన్ నార్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నందున వ్యాప్తిని అరికట్టడంలో ఇది సహాయపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు-డోస్ ఇంజెక్షన్‌గా ఇవ్వవచ్చని, వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎనిమిది వారాల వరకు ఉంచవచ్చని వెల్లడించింది. ఇక, తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.మరోవైపు.. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మొదటి డోస్‌లో 76 శాతం ప్రభావాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. తరువాత రెండో డోస్ 82 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అంటువ్యాధులను నివారించడానికి, వ్యాప్తిని ఆపడానికి, ప్రాణాలను రక్షించడానికి, వ్యాక్సిన్లు అత్యంత అవసరం అని అన్నారు. Kasama na sa prequalification list ng World Health Organization #WHO ang #mpox vaccine ng Denmark-based Bavarian Nordic.Ito ang kauna-unahang beses na inaprubahan ng ahensya ng #UN ang isang bakuna kontra mpox. #News5 | via Reuters pic.twitter.com/FoqBdJqxUm— News5 (@News5PH) September 13, 2024 ఇది కూడా చదవండి: గూఢచర్యం ఆరోపణలు..బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా -
ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి
సిడ్నీ: ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. కాంగోలో 450 మందిని పొట్టనబెట్టుకున్న ఈ వ్యాధి ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధ్య, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ విస్తరణ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది. యూరప్ దేశమైన స్వీడన్‌లోనూ ఒక ఎంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది! దీని వ్యాప్తిని అడ్డకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. ఎంపాక్స్‌లో క్లేడ్–2 కంటే క్లేడ్–1 ప్రమాదకరం. గత సెపె్టంబర్లో క్లేడ్–2బీ వేరియంట్ పుట్టుకొచి్చంది. ఎంపాక్స్ సోకితే ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, చేతులపై కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. బాధితులతో లైంగిక సంబంధాలు, దగ్గరగా వెళ్లడం, శ్వాస పీల్చడం వల్ల వైరస్ సోకుతుంది. ప్రతి 100 కేసుల్లో కనీసం నలుగురు మరణించే ప్రమాదముంది. ఎంపాక్స్ నియంత్రణకు వ్యాక్సిన్ వచి్చనా అది పరిమితంగానే లభిస్తోంది. కాంగో, బురుండి, కెన్యా, రువాండాలకు వ్యాపించింది. ఎంపాక్స్‌ను ఇంకా మహమ్మారిగా ప్రకటించలేదు. -
జేఎన్.1పై WHO కీలక ప్రకటన
జెనీవా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో.. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్‌తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ప్రకారం.. జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్‌తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది. జేఎన్.1 వేరియెంట్‌ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ ఇంతకు ముందే చెప్పింది. వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. మరింత ఆందోళన కలిగించేది అని అర్థం. అంటే.. ఆ వేరియెంట్‌కు త్వరగా వ్యాప్తి చెందడం, చికిత్సకు కష్టతరం కావడం, లక్షణాలు తీవ్రంగా ఉండడం ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా.. డెల్టా, ఒమిక్రాన్లాగా ఇది గ్రీకు భాష ద్వారా ఓ కొత్త పేరు పెట్టడానికి వీలుంటుంది. అయితే జేఎన్.1 ఈ కేటగిరీ కిందకే వచ్చినా.. ప్రాణాంతకమైంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు వేరియెంట్లను(ఆల్ఫా, బీటా, గామా, డెల్టా) వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్‌గా గుర్తించింది. తర్వాతి కాలంలో విజృంభిస్తున్న వేరియెంట్లను వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద డబ్ల్యూచ్వో మానిటరింగ్ చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: భారత్‌లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనం ఘెబ్రేయేసుస్ భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనియాడారు. జీ20 సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును ఇంతటి స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్యం విషయంలో భారత దేశం అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. నేనొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసం వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని చెబుతూ జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో మేము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు ఈరోజు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితుట్లకు తగట్టుగా స్పందించి సిద్దపడటం.. సురక్షితమైన, ప్రభావవంతమైన,నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
సురక్షిత తాగునీటిలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో నూటికి నూరు శాతం సురక్షితమైన తాగునీటిని అందించే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇది సాకారమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. జలజీవన్ మిషన్ అమలులో భారతదేశం పురోగతి సాధించిందని తెలిపింది. ఇంటింటికీ వంద శాతం సురక్షితమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, గోవా, హరియాణా, గుజరాత్, పంజాబ్ ఉన్నాయి. తెలంగాణలో 53.98 లక్షల ఇళ్లుంటే.. అందులో ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని నివేదిక వివరించింది. కాగా, ఈ రాష్ట్రాల కంటే నీటి స్వచ్ఛతలో మాత్రం తెలంగాణే నంబర్‌వన్ స్థానంలో ఉంది. మన రాష్ట్ర తాగునీటి స్వచ్ఛత 98.7 శాతంగా ఉంది. యూరప్‌లో కేవలం 62 శాతం ఇళ్లకే స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. కాగా, దేశంలో ఇప్పటివరకు సగటున 62.84 శాతం మందికి ఇంటింటికీ తాగునీటి వసతి ఉందని తెలిపింది. దేశంలో డయేరియా మరణాలు 6 లక్షలు.. దేశంలో డయేరియా, ఇన్ఫెక్షన్లు, మలేరియా, డెంగీ, శ్వాసకోశ సంబంధిత రోగాల వల్ల ప్రతీ ఏడాది లక్షకు 40–70 మంది వరకు మరణిస్తున్నారని డబ్లు్యహెచ్‌వో వేదిక వివరించింది. ఈ మరణాల్లో ఐదేళ్లలోపువారే 60 శాతం ఉంటారని పేర్కొంది. తాగునీరు సరిగా లేకపోవడం, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించకపోవడం, చేతి శుభ్రత పాటించకపోవడం వల్ల డయేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. 2019 లెక్కల ప్రకారం డయేరియాతో దేశవ్యాప్తంగా 6.07 లక్షల మంది చనిపోతున్నారు. అందులో తాగునీరు సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు 2,03,863 ఉన్నాయి. ఇందులో మహిళలే 1,23,964 మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 20,045 మంది ఉన్నారు. ఇక పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియాతో 2,44,287 మంది చనిపోతున్నారు. అందులో మహిళలు 1.48 లక్షల మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 24,020 మంది ఉన్నారు. ఇక చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు ఏడాదికి 1,59,015 ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వివరించింది. అందులో 96,694 మంది మహిళలుండగా, ఐదేళ్లలోపువారు 15,635 మంది ఉన్నారు. ఇదిలావుంటే 51,740 మంది చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారని ఆ వేదిక పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► పరిశుభ్రమైన నీరు, పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవడం, చేతి శుభ్రత పాటించకపోతే సాంక్రమిక వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు, మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఆసుపత్రుల్లోనూ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ► తాగునీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే జబ్బులు వస్తాయి. ► డయేరియా కారణంగా పిల్లలు బడికి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల పనితీరులోనూ మార్పులు వస్తాయి. ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి పెరుగుతుంది. ► చేతి శుభ్రత లేకపోతే కరోనా వంటి వైరస్లు వస్తాయి. తాగునీరు సరిగా లేకపోవడం వల్ల రక్తహీనత కూడా సంభవిస్తుంది. ► ప్రపంచంలో 56 శాతం జనాభాకు మాత్రమే ఇంటి వద్ద సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంది. ఆఫ్రికాలో 9 శాతం, యూరప్‌లో 62 శాతం మాత్రమే సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంది. ఇది దక్షిణాసియా దేశాల్లో 27 శాతమే ఉంది. ► వాగులు వంకల్లో నీటిని తాగే వారితో పోలిస్తే శుద్ధి చేసిన ఇంటి వద్దే అందుబాటులో ఉన్న నీటిని తాగడం వల్ల 52 శాతం డయేరియా కేసుల సంఖ్య తగ్గుతుంది. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీరు డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారానే ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించడం సాధ్యపడింది. ఇదే దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్వచ్ఛమైన నీటిని అందించే విషయంలో యూరప్ మన రాష్ట్రం కంటే వెనుకబడి ఉంది. తాగునీటి స్వచ్ఛతలో గెలంగాణ టాప్‌లో నిలవడం మనకు గర్వకారణం. -
కృత్రిమ తీపితో క్యాన్సర్!
వాషింగ్టన్: కూల్ డ్రింకులు తదితర బేవరేజెస్‌ల్లో నాన్ షుగర్ స్వీటెనర్(ఎన్ఎస్ఎస్)ల వాడకంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని వాడటం మానేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మే నెలలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సాధారణంగా వాడే కృత్రిమ స్వీటెనర్లలో ఒకటైన ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ప్రమాదం ఉన్నదంటూ తాజాగా పరిశోధనలో తేలడంతో దీని వినియోగంపై అమెరికాలో సమీక్ష మళ్లీ మొదలైందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. అత్యంత విరివిగా వాడే కృత్రిమ షుగర్ పదార్థం ఒకటి క్యాన్సర్‌కు కారకంగా మారే అవకాశం ఉందని వచ్చే నెలలో డబ్ల్యూహెచ్‌వో క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ ప్రకటించనుందంటూ రాయిటర్స్ తెలిపింది. ఆస్పర్టెమ్‌ను వాడొచ్చంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్‌డీఏ) 1981లోనే అనుమతులిచి్చంది. అయిదేళ్లకోసారి ఈ అనుమతిని సమీక్షిస్తూ వస్తోంది. భారత్ సహా 90కి పైగా దేశాల్లో అస్పర్టెమ్ వినియోగంలో ఉంది. ఆస్పర్టెమ్‌లో ఎలాంటి కేలరీలు ఉండవు. చక్కెర కంటే సుమారు 200 రెట్లు తీపిని ఇది కలిగిస్తుంది. ఆస్పర్టెమ్‌ను వినియోగించేందుకు 2009లో భారత ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతినిచి్చంది. ఆస్పర్టెమ్‌ను 95% కార్పొనేటెడ్ సాఫ్ట్ డ్రింకుల్లో స్వీటెనర్‌గా వాడుతున్నారు. బేవరేజెస్ మార్కెట్ షేర్లో అతిపెద్దదైన రెడీ టూ డ్రింక్ టీల్లో 90% వరకు వినియోగిస్తున్నారు. మిగతా స్వీటెనర్లతో పోలిస్తే ఆస్పర్టెమ్, అసెసల్ఫేమ్–కె అనే వాటి వాడకంతో క్యాన్సర్ ప్రమాదం కాస్త ఎక్కువేనంటూ గతేడాది ఫ్రాన్సులో చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
Operation Kaveri: సూడాన్‌ను వీడిన 278 మంది భారతీయులు
న్యూఢిల్లీ: హింస, అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ మొదలైంది. భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ నౌక తొలి విడతగా 278 భారతీయులతో మంగళవారం సూడాన్ పోర్టు నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ మేరకు ట్వీట్ చేశారు. వారిని భారత్ చేర్చేందుకు జెడ్డాలో రెండు విమానాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఆక్రమణలో సూడాన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ మరోవైపు.. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని నేషనల్ హెల్త్ ల్యాబ్ ఆక్రమణకు గురైందని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. వైరి పక్షాలైన ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)లో ఒకరు ఈ ల్యాబ్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. 12 రోజులుగా ఆగని ఆధిపత్య పోరుతో సామాన్యులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న వేళ ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూడాన్ ప్రతినిధి డాక్టర్ నీమా సయీద్ అబిడ్ అన్నారు. ల్యాబ్‌లో కలరా, మీజిల్స్, పోలియో తదితర వ్యాధికారక వైరస్లు, బ్యాక్టీరియాలున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ల్యాబ్‌కు అతి సమీపంలోనే ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ భీకర పోరు సాగిస్తున్నాయి. సూడాన్‌లోని మూడో వంతు అంటే 1.6 కోట్ల మందికి తక్షణం సాయం అవసరమని ఐరాస అంచనా వేసింది. -
H3N8 బర్డ్‌ఫ్లూతో ప్రపంచంలోనే తొలి మరణం..
బీజింగ్: అత్యంత అరుదైన H3N8 బర్డ్‌ఫ్లూ రకం వైరస్‌తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదైంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రానికి చెందిన 56 ఏళ్ల మహిళ ఈ బర్డ్‌ఫ్లూ కారణంగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఉపరకమైన హెచ్3ఎన్8 సోకిన మూడో వ్యక్తి ఈమే అని పేర్కొంది. ఈ మూడు కేసులు చైనాలో నమోదుకావడం గమనార్హం. గతేడాది ఇద్దరు ఈ వ్యాధి బారినపడగా.. ఇప్పుడు ఈ మహిళ దీని బారినపడి చనిపోయింది. హెచ్3ఎన్8 పక్షుల్లో సాధారణంగానే కన్పిస్తుందని, కానీ మనుషులకు ఇది వ్యాపించడం అత్యంత అరుదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ బర్డ్‌ఫ్లూ రకం మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశమే లేదని చెప్పింది. అందుకే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. చదవండి: North Korea: మరింత ‘అణు’ దూకుడు -
WHO: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..!
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారంలో సోడియం(ఉప్పు) మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. సోడియంను తగ్గించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్ఓ తొలిసారి ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష్యం దారితప్పిందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. కానీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, అకాల మరణాల ముప్పు అధికమవుతుంది. ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పులో సోడియం(సోడియం క్లోరైడ్) ప్రధానంగా లభిస్తుంది. అలాగే వంటల్లో వేసే మసాల్లాలో కూడా ఈ పోషకం ఎక్కువగానే ఉంటుంది. డబ్లూహెచ్ఓ గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు విధానాలను సరిగ్గా అమలు చేస్తే 2030 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం తొమ్మిది దేశాలు - బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడానికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువే కావడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అన్‌హెల్దీ డైట్లే కారణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. చాలా దేశాలు సోడియం తగ్గింపు విధానాలను అనుసరించలేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు గుండెపోటు, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు 'బెస్ట్ బైస్(Best Buys)'ని అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలకు సూచించింది. ఆహారంలో సోడియం కంటెంట్‌పై తమ బెంచ్‌మార్క్‌లను అమలు చేయాలని తయారీదారులకు పిలుపునిచ్చింది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు 1. తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను సంస్కరించాలి. భోజనంలో సోడియం పరిమాణానికి లక్ష్యాలను నిర్దేశించాలి. 2. ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, నర్సింగ్‌హోమ్‌లు వంటి ప్రభుత్వ సంస్థలలో ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వ ఆహార సేకరణ విధానాలను రూపొందించాలి. 3. సోడియం తక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజీ లేబులింగ్ తీసుకురావాలి. 4. ఉప్పు/సోడియం వినియోగాన్ని తగ్గించడానికి మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమసల్య బారినపడే ప్రమాదం ఉందని కూడా నివేదిక బహిర్గతం చేసింది. చదవండి: విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్.. టేకాఫ్ క్యాన్సిల్ -
Bird Flu: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
పారిస్: హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. కంబోడియాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. అన్ని దేశాలు బర్డ్‌ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో ఈ బాలిక ఫిబ్రవరి 16న తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరీక్షలు నిర్వహించగా బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 22న ప్రాణాలు కోల్పోయింది. అనంతరం బాలిక తండ్రి సహా ఆమెతో సన్నిహితంగా మెలిగిన 12 మంది నమూనాలను అధికారులు సేకరించారు. తండ్రికి కూడా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. అయితే అతనిలో ఎలాంటి లక్షణాలు లేవు. మిగతావారి నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. వీరి పరిస్థితిపై కంబోడియా అధికారులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ సంప్రదింపులు జరుపుతోంది. కోళ్లు, ఇతర పక్షుల్లో మాత్రమే కన్పించే బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషులకు అత్యంత అరుదుగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో మనుషులకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటేనే అది సోకే అవకాశముంది. అయితే బాలికకు, ఆమె తండ్రికి బర్డ్‌ఫ్లూ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు కోళ్లు, పక్షులతో సన్నిహితంగా మెలిగారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బాలిక నుంచే ఆమె తండ్రకి వైరస్ సోకిందా? అనే విషయంపై ఇప్పుడే ఎలాంటి అంచనాకు రాలేమని అధికారులు పేర్కొన్నారు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతన్నాయని, కొందరు మానవులకు కూడా ఈ వైరస్ వాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అన్ని దేశాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ వైరస్ సోకితే ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని హెచ్చరించింది. చదవండి: టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య -
60 ఏళ్లకు చేరువయ్యారా?.. అయితే రోజు ఎన్ని అడుగులు వేస్తే గుండెకు..
సాక్షి, అమరావతి: నడక నాలుగు విధాలుగా మేలు... అని తరచూ వైద్యులు చెబుతుంటారు. మంచి ఆరోగ్యం కోసం 18 ఏళ్లు పైబడిన వారు వారానికి కనీసం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదా వారానికి కనీసం 75 నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ చేయాలని డబ్ల్యూహెచ్‌వో కూడా సూచిస్తోంది. ముఖ్యంగా 60ఏళ్లు పైబడినవారు వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల ప్రమాదకర రోగాల నుంచి రక్షణ పొందవచ్చని పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. తాజాగా ఇదే విషయం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ పరిశోధకుల అధ్యయనంలోనూ వెల్లడైంది. 60 ఏళ్లు పైబడిన వారు రోజు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెకు మంచిదని నిర్ధారించింది. ఈ అధ్యయనంలో భాగంగా అమెరికా సహా 42 దేశాల్లో 18 ఏళ్లు పైబడిన 20,152 మంది డేటాను ఎనిమిది కోణాల్లో పరిశోధకులు విశ్లేషించారు. ఆరేళ్ల పాటు వీరు నడుస్తున్న దూరం, ఆయా వ్యక్తుల్లో కార్డియోవాసు్కలర్ డిసీజ్ (సీవీడీ), నాన్ ఫాటల్ కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అంశాలను బేరీజు వేశారు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడవచ్చని గుర్తించారు. రోజుకు రెండు వేల అడుగులు మాత్రమే నడిచే వారితో పోలిస్తే వీరిలో గుండెపోటుతోపాటు పక్షవాతం ముప్పు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతుందని తేల్చారు. వృద్ధులకే కాదు అన్ని వయసులవారు నడక, వ్యాయామం, జాగింగ్, ఇతర శారీరకశ్రమ కార్యకలాపాలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్పష్టంచేశారు. అయితే డబ్ల్యూహెచ్‌వో సూచించిన ప్రమాణాల మేరకు 41.3 శాతం మంది దేశంలో శారీరకశ్రమ చేయడం లేదని 2021లో ఒక సర్వేలో ఐసీఎంఆర్ తెలిపింది. అన్ని వయసుల వారికి ఉత్తమం నడక చక్కటి, సహజమైన వ్యాయామం వంటిది. రోజు వారి దినచర్యలో అన్ని వయసులవారు నడకను అలవాటుగా మార్చుకోవాలి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలో శారీరక శ్రమ చేయడం చాలా వరకూ తగ్గిపోయింది. దీనికితోడు ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, ఇతర జీవనశైలి జబ్బుల బారినపడుతున్నారు. వీటిని జయించి ఆరోగ్యంగా ఉండాలంటే నడక ఒక్కటే ఉత్తమ మార్గం. రోజు 30నిమిషాలు నడవడంవల్ల రక్తపోటు, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు అదుపులోకి వస్తాయి. 45ఏళ్లు పైబడినవారు, మధుమేహం, ఇతర సమస్యలు ఉన్నవారు కొత్తగా నడక, వ్యాయామం ప్రారంభిస్తున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకు వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. మధుమేహం సమస్య ఉన్నవారు ఇన్సులిన్ తీసుకుంటుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నడక, వ్యాయామం కొనసాగించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూల్ జీజీహెచ్ రోజు నడకతో ప్రయోజనాలు... ►రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తంలోని మలినాలు బయటకు పోతాయి. ►శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతాయి. ►మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులను అదుపులో ఉంటాయి. ►మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ►మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరిగి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. ►ఆత్మ విశ్వాసం, శారీరక సామర్థ్యం పుంజుకుంటాయి. -
భారత్‌కు చెందిన ఆ రెండు దగ్గు మందులు వాడకండి.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!
చిన్న పిల్లల కోసం భారత్‌లో తయారైన రెండు దగ్గు మందులు(సిరప్స్) వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్ మందుల్లో విషపూరితమైన ఇథిలీన్ ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ఈ క్రమంలో చిన్నారులకు ఈ సిరప్స్ ఇవ్వకూడదని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, గతేడాది డిసెంబర్లో ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారులు ఆకస్మికంగా మృతిచెందారు. వారికి మృతికి డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ దగ్గు మందులే కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. మారియన్ బయోటెక్ తయారుచేసిన దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. దీంతో, అప్రమత్తమైన ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం.. మందులను ల్యాబ్‌లో పరిశీలించగా వాటిలో విషపూరితాలు ఉన్నట్టు గుర్తించింది. దగ్గు మందులో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. అనంతరం, ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో దృష్టికి తీసుకువెళ్లింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్ బయోటెక్ విఫమైందని, సిరప్‌ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌తో సూచించింది. దీంతో, డబ్ల్యూహెచ్‌తో సైతం వీటిని వాడరాదంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో కూడా భారత్ చెందిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది పిల్లల మరణించారు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల వల్లే వారు మృతిచెందినట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీంతో, ఆ ముందులను కూడా వాడరాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. "Substandard": WHO Alert On 2 Indian Syrups After Uzbekistan Child Deaths https://t.co/SKxgzPbNy0 NDTV's Vedanta Agarwal reports pic.twitter.com/JMzxKEpZBE — NDTV (@ndtv) January 12, 2023 -
AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’
సాక్షి, అమరావతి: దేశంలో 66 శాతం మరణాలకు జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2019 గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ అవసరం. తరచూ పరీక్షలతోపాటు జబ్బు తీరు ఆధారంగా మందుల డోసు మారుస్తుండాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ట్రయల్ రన్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పోటెత్తుతున్న బీపీ రాష్ట్రంలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, ఇతర జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించేందుకు 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. 2,09,65,740 మందికి ఇప్పటివరకు పరీక్షలు చేశారు. వీరిలో 14.87 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ కాగా 33.84 లక్షల మంది హైరిస్క్ గ్రూప్‌లో ఉన్నట్లు తేలింది. ఇక 11.17 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించగా మరో 36 లక్షల మంది డయాబెటిస్ హైరిస్క్ గ్రూప్‌లో ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో డేటా మధుమేహం, రక్తపోటు ఉన్నట్లు నిర్ధారించిన వారి వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్‌తో అనుసంధానించి వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు బాధితుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 4,33,157 మంది రక్తపోటు బాధితులు ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్‌కు హాజరు కాగా 90 శాతం మందికిపైగా వ్యక్తుల్లో సమస్య అదుపులో ఉన్నట్లు తేలింది. 3.23 లక్షల మంది మధుమేహం బాధితులు క్లినిక్‌లకు హాజరు కాగా 78 శాతం మందిలో సమస్య అదుపులోకి వచ్చింది. క్యాన్సర్ రోగులకు సాంత్వన క్యాన్సర్ బాధితులకు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పలు రకాల వైద్య సేవలు గ్రామాల్లోనే లభిస్తున్నాయి. పీహెచ్సీ వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు ఆయా చోట్ల క్యాన్సర్ రోగుల ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ నోటి క్యాన్సర్ బాధితులు 2,959 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 757 మంది, గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 3,332 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు అందుకోవడం ఊరట కలిగిస్తోంది. వ్యయ ప్రయాసలు తొలిగాయి నాకు బీపీ ఉంది. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊరిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటైంది. ఇక్కడే బీపీ చెకప్ చేసి మందులు కూడా ఇస్తున్నారు. డాక్టర్ మా గ్రామానికే వస్తుండటంతో వ్యయ ప్రయాసలు తొలిగాయి. – ఏపూరి భాగ్యమ్మ, కామేపల్లి, పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా -
25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్ బేఫికర్.. మరోవైపు భారత్‌లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.8శాతంగా ఉంది. చదవండి: చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స -
చైనా.. ఇప్పటికైనా కరోనా అసలు లెక్కలు చెప్పు..!
బీజింగ్: చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెడ్డడం లేదు. వైరస్ బాధితులను ట్రాక్ చేయడం సాధ్యం కాదని కొద్దిరోజుల క్రితమే చేతులెత్తేసింది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలను చైనా దాస్తోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వాస్తవ గణాంకాలను చైనా వెల్లడించాలని, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయాలని కోరింది. వైరస్‌కు కట్టడిచేసేందుకు అవసరమైతే అంతర్జాతీయంగా సహకారం అందిస్తామని చెప్పింది. కోవిడ్ నిర్వహణకు వైద్య సామర్థ్యాన్ని పెంచుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చైనాకు సూచించింది. చైనా నుంచి వచ్చేవారికి ఫ్రాన్స్‌లో పరీక్షలు.. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడం కొనసాగిస్తామని ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్ని తెలిపారు. చైనా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ దీనిపై తాము రాజీపడబోమన్నారు. పరీక్షలు నిర్వహించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. చైనా నుంచి వచ్చే వారికి భారత్, అమెరికా సహా పలు దేశాలు కరోనా పరీక్షను తప్పనిసరి చేశాయి. దీనిపై డ్రాగన్ దేశం తీవ్రంగా స్పందించింది. ఇది వివక్షపూరిత చర్య అని వ్యాఖ్యానించింది. చదవండి: అతి చేష్టలు: ఉక్రెయిన్‌కు రష్యా న్యూఇయర్ విషెస్ -
కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!
జెనీవా: చైనాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభణతో వచ్చే మూడు నెలల్లో దేశ జనాభాలోని 60 శాతం మంది వైరస్‌బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు సూచించారు. వైరస్ బారినపడే అవకాశం ఉన్న వారికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వారాంతంలో నిర్వహించే మీడియో సమావేశంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కోవిడ్ విజృంభణతో చైనాలో తలెత్తుతున్న పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. వ్యాధి వ్యాప్తి తీవ్రత, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, ఐసీయూల అవసరం వంటి వివరాలు సమర్పించాలి. దేశవ్యాప్తంగా వైరస్ బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ మద్దతుగా నిలుస్తుంది. క్లినికల్ కేర్, ఆరోగ్య వ్యవస్థ భద్రతకు మా మద్దతు కొనసాగుతుంది.’ - డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ 2020 నుంచి కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తోంది చైనా. జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తోంది. అయితే, ప్రజాగ్రహంతో ఎలాంటి ప్రకటన చేయకుండానే డిసెంబర్ తొలినాళ్లలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది బీజింగ్ ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదీ చదవండి: Lockdown: కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ లాక్డౌన్ తప్పదా? ఇదిగో క్లారిటీ.. -
మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ
సాక్షి, విశాఖపట్నం: మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. జనాభా మాదిరిగానే మధుమేహ రోగుల్లోనూ చైనా, భారత్ పోటీ పడుతున్నాయి. చైనా 141 మిలియన్ల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 77 మిలియన్ల మధుమేహులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మన దేశంలో మధుమేహం బాధితుల సంఖ్య 2045 సంవత్సరం నాటికి 135 మిలియన్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. దీని బారినపడే వారిలో మహిళల (40 శాతం) కంటే పురుషులే (60 శాతం) అధికంగా ఉంటున్నారు. 2020లో దేశంలో 7 లక్షల మంది డయాబెటిస్తో చనిపోయారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలోకెల్లా కేరళ 19.8 శాతం మధుమేహ బాధితులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 13.6 శాతంతో ఛండీగఢ్, తమిళనాడు, 8.9 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 9 మందికి మధుమేహం ఉన్నట్టు లెక్క. మధుమేహ బాధితుల సంఖ్య పెరగడానికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయనే విషయాన్ని ఇదివరకే గుర్తించారు. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: చైనాలో కోవిడ్ విజృంభణ.. ఫోర్త్ వేవ్ వచ్చినా ప్రాణాంతకం కాదు! -
‘కోవిడ్-19’పై గుడ్‌న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ
జెనివా: కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త అందించింది. కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని 90 శాతం మందిలో కొంత మేర రోగనిరోధక శక్తి పెంపొందినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్‌కు గురికావటం లేక వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచంలోని 90 శాతం మందిలో కోవిడ్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది’ అని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. కోవిడ్-19 మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని, అయితే, వైరస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోల్ అధనోమ్. వైరస్‌పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. అంతకు ముందు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది. ఇదీ చదవండి: Viral Video: భయానక దృశ్యం.. చెరువులో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి -
Delhi air pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజులుగా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇక వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం ఉదయం 9 గంటలకు 358గా రికార్డయ్యింది. అంటే గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. నగరంలో ఏక్యూఐ గరిష్టంగా 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదయ్యింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం మంది పిల్లల్లో శ్వాస సమస్యలు ప్రపంచంలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1,650 నగరాల్లో సర్వే చేసి ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసింది. భారత్‌లో మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉంది. దేశంలో ప్రతిఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ఢిల్లీలో నివసించే పిల్లల్లో సగం మంది పిల్లలు (దాదాపు 20.2 లక్షల మంది) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం, రోడ్డుపై దుమ్మూ ధూళి, శిలాజ ఇంధనాల వినియోగం మితిమీరడం, తీవ్రమైన చలి.. వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కాలుష్య కల్లోలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. శీతాకాలంలో సమస్య మరింత ముదురుతోంది. ఏక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు అర్థం. ఈ ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌లో ఏక్యూఐ 272గా నమోదయ్యింది. 2019లో ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో ఏక్యూఐ 150గా రికార్డయ్యింది. నగరంలో మూడేళ్లలోనే కాలుష్య తీవ్రత భారీగా పెరగడం గమనార్హం. కరోనా ముందు కాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం 55 శాతానికి పైగానే పెరిగినట్లు స్పష్టమవుతోంది. గాలిలో కంటికి కనిపించని దూళి కణాల సంఖ్యను సూచించే ‘పీఎం 2.5’ కౌంట్ కూడా నగరంలో ‘అనారోగ్యకర’ స్థాయిలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాలను బట్టి తెలుస్తోంది. పీఎం 2.5 ఎక్కువగా ఉంటే మనుషుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పీఎం 2.5 స్థాయి 12 యూజీ–ఎం3 కంటే తక్కువగా ఉంటే ‘ఆరోగ్యకరం’గా గుర్తిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఇటీవల ఇది ఏకంగా 93.69 యూజీ–ఎం3గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. -
మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..!
మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్‌ను 'ఎంపాక్స్' అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. మరో ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును మాత్రమే ఉపయోగిస్తారు. డబ్ల్యూహెచ్ఓ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పేరు మార్పు ఎందుకు? ఈ ఏడాది మొదట్లో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైనప్పుడు దీనిపై కొందరు ఆన్లైన్లో జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక ఈ పేరుపై కొన్ని దేశాలు, వ్యక్తులు అభ్యంతరం తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. పేరు మార్చాలని ప్రతిపాదించారు. దీంతో నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం డబ్ల్యూహెచ్ఓ కొత్తపేరును ఖరారు చేసింది. చదవండి: 3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా.. -
కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్‌లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్ ఎక్స్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్), నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్‌లతో జాబితాను సవరించనున్నారు. ‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ! -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
WHO: ఆ భారత కంపెనీ సిరప్‌లను వాడొద్దు
జెనీవా: భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. ఈ మేరకు.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రెస్ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్‌కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్ వెల్లడించారు. "WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros — World Health Organization (WHO) (@WHO) October 5, 2022 మెయిడెన్ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్ సిరప్, Makoff బేబీ కాఫ్ సిరప్, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది. ల్యాబ్ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌తో సిరప్‌లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్‌వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్‌లను వాడటం మానేయాలని కోరింది. అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్ కంపెనీ స్థానికంగా(భారత్‌లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో, భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. -
ఉద్యోగుల్లో తరుముకొస్తున్న..మానసిక ముప్పు, భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్!
న్యూఢిల్లీ: ఉద్యోగుల మానసిక సమస్యలు సంస్థలపై పెద్ద భారాన్నే మోపుతున్నాయి. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్ డాలర్ల మేర (రూ.1.2 లక్షల కోట్లు). డెలాయిట్ తూచ్ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మానసిక అనారోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం, తక్కువ ఉత్పాదకత, వలసలు కలసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, సంస్థలపై దాని ప్రభావం ఏ మేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. పని ఒత్తిళ్లు ఎక్కువే.. పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, సామాజికంగానూ ఉద్యోగులపై చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటిమాదిరే విధులకు హాజరవుతున్నామని చెప్పగా.. 29 శాతం మంది కొంత సెలవు తీసుకోవడం చేస్తున్నట్టు చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్య అంశంగా సంస్థలు పరిగణించాలని.. మానసిక అనారోగ్యానికి మూల కారణాలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెట్టాలని డెలాయిట్ సూచించింది. -
99 శాతం మందికి కలుషిత గాలే గతి
న్యూఢిల్లీ: దేశ జనాభాలో అక్షరాలా 99 శాతం మంది కలుషిత గాలి పీలుస్తున్నారు. పీఎం 2.5 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణాలను మీరిన గాలే దిక్కవుతోంది. గ్రీన్‌పీస్ ఇండియా సంస్థ ‘డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై’ పేరిట శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► భారత్‌లో ప్రజలు పీలుస్తున్న గాలి డబ్ల్యూహెచ్ఓ వార్షిక సగటు గైడ్లైన్ కంటే ఐదు రెట్లు అధిక పీఎం 2.5 కణాలు కలిగి ఉంటున్నదే. ► దేశంలో 62 శాతం మంది గర్భిణులు అత్యంత కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 56 శాతం మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ► ఇండియాలో అత్యధిక కాలుష్య ప్రాంతం దేశ రాజధాని ప్రాంతం–ఢిల్లీ. ► కలుషిత గాలి వల్ల వయోవృద్ధులు, శిశువులు, గర్భిణులు అధికంగా ప్రభావితమవుతున్నారు. ► గాలి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రారంభించాలి. ► గాలి కాలుష్యం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాలి. ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేయాలి. దీనివల్ల వారు అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుంటుంది. ► ఇప్పుడున్న జాతీయ గాలి నాణ్యత ప్రమాణాల్లో వెంటనే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ► నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్సీఏపీ)ను మరింత పారదర్శకంగా, శక్తివంతంగా, సమగ్రంగా రూపొందించాలి. -
ఉప్పు ముప్పు.. నిమిషానికి ముగ్గురు మృతి, షాకింగ్ నిజాలు బయటకొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్: ఉప్పు వాడకం మితిమీరుతోంది. ఉప్పు దుష్ఫలితాల కారణంగా ప్రపంచంలో ప్రతీ నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అంటే ఏడాదికి 19 లక్షల మంది బలవుతున్నారు. ‘ఉప్పు వాడకం– దుష్పరిణామాలు–నియంత్రణ చర్యల’పై తాజా నివేదికలో ఈమేరకు వెల్లడించింది. ఒక మనిషి రోజుకు సగటున వివిధ రూపాల్లో 5 గ్రాములకంటే తక్కువ పరిమాణంలో ఉప్పు వాడాలి. అయితే ప్రపంచంలో పది గ్రాములు వాడుతుండగా, భారత్‌లో 11 గ్రాములు వాడుతున్నారు. 5 గ్రాముల్లోనే అయోడైజ్డ్ ఉప్పు కూడా ఉండాలి. ప్రపంచంలో 188 కోట్ల మంది అయోడిన్ లోపానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. దీనివల్ల ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, గొంతు దగ్గర వాపు ఉంటాయి. గర్భిణీకి అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. ఉప్పు అధికంగా తినడం వల్ల బీపీ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి వస్తాయి. ఇతరత్రా జీవనశైలి వ్యాధులూ వచ్చే ప్రమాదముంది. ఉప్పు నియంత్రణలో ప్రాథమిక దశలోనే.. ఉప్పు వాడకాన్ని నియంత్రించాలంటే నాలుగు దశల కార్యక్రమం అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మొదటి దశ విధాన నిర్ణయం, రెండోది స్వచ్ఛందంగా ముందుకు రావడం, మూడోది తప్పనిసరిగా అమలు చేయడం, నాలుగోది ప్రతీ ఆహార పదార్థంలో ఎంత ఉప్పు ఉందో తెలియజెప్పేలా ఆదేశాలు జారీ చేయడం. ఇందులో భారత్ కేవలం మొదటి దశకే పరిమితంకాగా, ప్రపంచంలో 41 దేశాల్లో పై నాలుగు దశల కార్యక్రమం అమలవుతోంది. చికెన్, సూప్స్, స్నాక్స్, బ్రెడ్, నిల్వ ఉంచిన చికెన్‌లో ఉప్పుకు పరిమితి పెట్టిన దేశాలు అర్జెంటీనా, బల్గేరియా, ఇరాన్, జోర్డాన్, ఇరాక్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, స్పెయిన్, పాలస్తీనా వంటి 41 దేశాలున్నాయి. వంద గ్రాముల ఆహారపదార్థాలకు ఎంత ఉప్పు వాడాలో ఒక ప్రామాణికాన్ని అమలు చేస్తున్నాయి. ఆదర్శమైన దేశాలు... కొన్ని దేశాలు ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో సగటు ఉప్పు వినియోగాన్ని 0.85 గ్రాములు తగ్గించాలన్న చట్టాన్ని తేవడంతో ఏడాదికి 7,400 మరణాలు తగ్గాయి. దక్షిణ కొరియాలో 2010–14 మధ్యలో ప్రతీ ఆహార పదార్థంలో ఉప్పును తగ్గించే చర్యలు చేపట్టగా.. ఆ ఐదేళ్లలోనే ఉప్పు వినియోగాన్ని 24 శాతం తగ్గించారు. దీంతో బీపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. థాయ్‌లాండ్‌లో ప్రపంచ సగటు కంటే ఎక్కువ వినియోగం ఉంది. దీంతో 25 శాతం మంది ప్రజలు బీపీ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 2025 నాటికి 30 శాతం ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్నమైన పద్ధతి తెచ్చింది. ప్రతీ పెద్ద వయస్సు వ్యక్తి 24 గంటల వ్యవధిలో ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్తున్నాడు? పరిమాణం ఎంత ఉంటుందన్న పరీక్షలు చేశారు. అలా బీపీని నియంత్రిస్తున్నారు. హైదరాబాద్‌లో 40 శాతం మందికి బీపీ... కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం హైదరాబాద్‌లో 40 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మహిళల్లో 26 శాతం, పురుషుల్లో 32 శాతం బీపీతో బాధపడుతున్నారు. పట్టణాల్లోనే బీపీ ఎక్కువగా ఉంది. లాన్సెట్ సర్వే ప్రకారం.. భారత్‌లో మరణాలకు ఐదు ప్రధాన కారణాల్లో బీపీ ఒకటని తేలింది. మిగిలినవి మధుమేహం, కాలుష్యం, పొగాకు వాడకం, పౌష్టికాహారం తీసుకోకపోవడం. ఉప్పు నియంత్రణకు డబ్ల్యూహెచ్ఓ చేసిన సిఫార్సులివీ... –దేశంలో సగటున ఎంత ఉప్పు వాడుతున్నారో పర్యవేక్షించాలి. –ప్యాకేజ్డ్ ఆహారపదార్థాల్లో ఉప్పు ఎంతుందో లేబుల్ మీద రాయాలి. –ప్రధానంగా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ప్రకటనలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అలా ప్రజల్లో ఉప్పు తగ్గించేలా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. –సాధారణంగా బ్రెడ్డు, ప్రాసెస్డ్ ధాన్యాలు, ప్రాసెస్డ్ మీట్, డెయిరీ పదార్థాల్లో నిల్వ కోసం ఉప్పు వాడతారు. దీన్ని తగ్గించాలి. 87 శాతం ఆహారంలో వేసుకోవడం వల్లే... అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు ఎక్కువగా వస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాల జబ్బులకు దారితీస్తుంది. జీవనశైలి జబ్బులను తగ్గించడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించడమే ఉత్తమ మార్గం. దక్షిణ భారతదేశంలో ప్రాసెస్డ్ చికెన్, పౌల్ట్రీల ద్వారా ఏడు శాతం ఉప్పు, పాల పదార్థాల ద్వారా 3 శాతం, ఆహార పదార్థాల్లో, పెరుగు వంటి వాటిల్లో వేసుకోవడం వల్ల 87 శాతం ఉప్పు వాడకం జరుగుతోంది. ఉప్పును అదనంగా వేసుకోవడంలో మహిళలు ముందున్నారు. బాగా చదువుకున్న వారే ఉప్పును ఎక్కువగా వినియోగిస్తున్నారు. –డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య -
సర్పగండం: 20 ఏళ్లలో 12 లక్షల మంది పాముకాట్లకు బలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు అంటే 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో మృతిచెందారని తెలిపింది. అంటే ఏటా సరాసరి 58 వేల మంది చనిపోయారని, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగానే ఈ లెక్కలు వేసినట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. కానీ కేంద్ర, రాష్ట్రాలు మాత్రం ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నాయని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017లో 1,068 మంది, 2018లో 1,060 మంది, 2018లో 885 మంది పాముకాటుతో చనిపోయారని.. కానీ కేంద్రం లెక్కిస్తున్న దానికన్నా పాముకాటు మృతుల సంఖ్య 60 రెట్లు అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొంది. విరుగుడుకు కొరత... దేశంలో కట్లపాము, తాచుపాము, రెండు రకాల రక్తపింజరల వల్ల ఎక్కువగా పాముకాట్లు, మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే నాలుగు కంపెనీలే ఆ నాలుగు రకాల పాముల విషానికి విరుగుడు (యాంటీవీనం) తయారు చేస్తున్నాయని, కానీ వాటి తయారీ ప్రక్రియలో నాణ్యత ఉండటం లేదని వ్యాఖ్యానించింది. దేశంలో ఏటా 15 లక్షల వయల్స్ యాంటీవీనం ఉత్పత్తి అవుతుండగా ఒక్కో పాముకాటు బాధితుడికి అవసరాన్ని బట్టి 10 నుంచి 20 వయల్స్ అవసరమవుతాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంటే ఏటా కేవలం లక్ష మంది పాముకాటు బాధితులకే విరుగుడు మందు అందుబాటులో ఉందని వివరించింది. ఒక అంచనా ప్రకారం దేశంలో ఏటా సరాసరి 10 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. కానీ లక్ష మంది బాధితులకు సరిపోయే వయల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బాధితులకు పూర్తిస్థాయిలో మందు దొరకడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. చదవండి: (ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి) జూన్–సెప్టెంబర్ మధ్యే 80% పాముకాట్లు... ►90% పాముకాట్లు కట్లపాము, తాచుపాము, రెండు రకాల రక్తపింజర వల్ల జరుగుతున్నాయి. ►పాముకాటు మరణాలకు 10 రెట్లు ఎక్కువగా బాధితులు అంగవైకల్యానికి గురువుతున్నారు. ►పాముకాటు కేసుల్లో 30% పూర్తిస్థాయిలో విషం మనిషి శరీరంలోకి వెళ్తోంది. ప్రపంచ సగటు కంటే ఇది ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్రామాల నుంచి సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సౌకర్యం లేకపోవడం, పాముకాటు వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే. ►పాము కాటేశాక పల్లెల్లో చాలా మంది పసర వైద్యం తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ►80% పాము కాట్లు జూన్–సెప్టెంబర్ మధ్యనే జరుగుతుంటాయి. వానాకాలం కావడం, రైతులు, కూలీలు పొలాలకు వెళ్తుండటమే దీనికి కారణం. ►14% పాముకాటు కేసుల్లో పాము కరిచిన జాడలు కనిపించడంలేదు. ►10–19 ఏళ్ల వయసు వారే ఎక్కువగా పాముకాటుకు గురవుతున్నారు. ►67% పాటుకాట్లు కాళ్లపైనే జరుగుతున్నాయి. ►40% పాముకాట్లు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్యలోనే చోటుచేసుకుంటున్నాయి. ►60% పాముకాట్లు ఇంట్లో లేదా ఇంటికి దగ్గరలో జరుగుతుంటాయి. 8% పాముకాట్లు మల విసర్జనకు వెళ్లినప్పుడు సంభవిస్తున్నాయి. 10% పాముకాట్లు నిద్రపోయే సమయంలో జరుగుతున్నాయి. ►పాముకాటు మరణాల్లో 90% గ్రామాల్లోనే సంభవిస్తున్నాయి. ►పాముకాటు మరణాల్లో 77% ఆసుపత్రి బయటే జరుగుతున్నాయి. ►దేశంలో సంభవించే మరణాల్లో 0.5% పాముకాటుతోనే జరుగుతున్నాయి. దోమతెరలతో రక్షణ పొందొచ్చు.. నేలపై పడుకున్నప్పుడు పాము కాటుకు గురైతే విషం సాధారణంకంటే 6 రెట్లు వేగంగా ఒంట్లోకి వ్యాపిస్తుంది. దోమతెరలు వాడితే పాముకాటు నుంచి బయటపడొచ్చు. అలాగే ఎలుకలు ఎక్కువగా తిరిగే ధాన్యం నిల్వ ఉంచిన గదులు, వంటింటి దగ్గర్లోనే పాములు వాటిని తినేందుకు వస్తుంటాయి కాబట్టి అక్కడ పడుకోవద్దు. ఇంటి చుట్టపక్కల వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
Monkeypox: మంకీపాక్స్ పేరు మార్చేయండి
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్త వైరస్ ఎఫెక్ట్‌తో చాలా దేశాలు అప్రమత్తం అయ్యాయి కూడా. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వారాంతంలో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు ఎయిర్‌పోర్ట్‌లలో టెస్టులు, లక్షణాలు కనిపిస్తే చికిత్స.. ట్రేసింగ్ చేపడుతున్నాయి. ఈ దరిమిలా డబ్ల్యూహెచ్‌వోకు ఓ అరుదైన విజ్ఞప్తి వచ్చింది. మంకీపాక్స్ వైరస్ పేరును అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని WHOకి విజ్ఞప్తులు అందుతున్నాయి. మంకీపాక్స్ అనే పేరునే ట్రీట్మెంట్లో ఉన్న రోగులు ఓ కళంకంగా భావించే అవకాశం ఉంది. పైగా ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలు జాతివివక్షగా భావించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి, వైరస్ పేరు మంకీపాక్స్ నుంచి మరోలా మార్చాలని ప్రపంచ ఆర్గోగ్య సంస్థకు న్యూయార్క్ సిటీ పబ్లిక్ హెల్త్ కమిషనర్ అశ్విన్ వాసన్ ఓ లేఖలో కోరారు. ‘‘బాధాకరమైన, జాత్యహంకార చరిత్రలో మంకీపాక్స్ వంటి పదజాలం రంగుల సంఘాల కోసం పాతుకుపోయింది’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రైమేట్స్ నుంచే మంకీపాక్స్ అనే పదం పుట్టలేదని, గతంలో కోవిడ్-19ను చైనీస్ వైరస్‌గా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించడం దుమారం రేపిన సంగతిని సైతం ఆయన లేఖలో ప్రస్తావించారు. మంకీపాక్స్ అనేది ఎవరికైనా సోకుతుందని, అయతే రేసిజం, ఎల్జీబీటీక్యూ(లైంగిక ధోరణి)తోనూ వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వాదన సైతం.. చికిత్సలకు అవాంతరంగా మారొచ్చని అశ్విన్ వాసన్ నొక్కి చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నిర్దారణ అయ్యాయి. చదవండి: కరోనా-మంకీపాక్స్ తేడాలు ఏంటో తెలుసా? -
బ‘కిల్స్’! సేఫ్టీ ఫీచర్స్ లేని వాహనాల దందా!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై జరిగే కారు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను తగ్గించడానికి ఆయా కంపెనీలు అనునిత్యం అధ్యయనాలు చేస్తున్నాయి. వీళ్లు ప్రవేశపెట్టిన సేఫ్టీ ఫీచర్స్‌కు ‘విరుగుడు’ తయారు చేసే వాళ్లూ ఎక్కువైపోతున్నాయి. కారు ప్రమాదాల తీవ్రత, మృతులను తగ్గించడానికి ఉపకరించే సీట్ బెల్డ్ అలారం ఆపే బకెల్స్ సైతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కార్ డెకార్స్ దుకాణాలతో పాటు ఆన్లైన్లో వీటిని విక్రయించేస్తున్నారు. ఫలితంగా సీట్ బెల్ట్ స్ఫూర్తి దెబ్బతింటోందని, భద్రతా చర్యలన్నీ వాహనచోదకుల కోసమే అన్నది గుర్తుపెట్టుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాణదాత సీట్‌బెల్ట్.. కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా.. హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఫలితంగా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. తేలికపాటి వాహనాల్లో ప్రయాణిస్తున్న వాళ్లు కచ్చితంగా సీట్‌బెల్ట్ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు. ప్రస్తుతం కేవలం కారు నడిపే వ్యక్తి మాత్రమే కచ్చితంగా సీటుబెల్ట్ ధరించేలా నిబంధనలు ఉన్నాయి. దీన్ని మిగిలిన వారికీ విస్తరించాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ఇలాగే అనేక ప్రమాదాల్లో ప్రయాణికులకు సీటుబెల్ట్ ప్రాణదాతగా నిలిచింది. అలారం వచ్చేలా టెక్నాలజీ.. ఇంతటి కీలకమైన సీట్‌బెల్ట్ కచ్చితంగా వాడేలా చేయడానికి కార్ల తయారీ కంపెనీలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తొలినాళ్లలో కేవలం డ్రైవర్, ఇప్పుడు అతడితో పాటు ముందు సీట్లో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దీన్ని ధరించకపోతే అలారం వచ్చేలా టెక్నాలజీ అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి అనేక మంది వాహనచోదకులు సీట్‌బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. ఇటీవల దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. దీన్ని సీట్‌బెల్ట్ బకెల్ స్లాట్‌లో ఉంచేస్తే చాలు... కనీసం వెనుక నుంచీ బెల్ట్ పెట్టుకోనక్కర్లేదు. ఈ బకెల్స్ను కార్ డెకార్స్ దుకాణాలు వివిధ రకాలైన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. ఆన్లైన్లో ఏ కంపెనీ కారు వినియోగిస్తుంటే ఆ కంపెనీ లోగోతో అమ్మే వర్తకులు పట్టుకు వచ్చాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం పెరిగిందని అధికారులే చెబుతున్నారు. వీటి ద్వారా అలారం మోగకుండా ఆపవచ్చు కానీ ప్రమాదం జరగకుండా కాదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సీట్‌బెల్ట్ అనేది వాహన చోదకుడి ప్రాణాలు రక్షిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ బకెల్స్ వినియోగంపై చర్యలకు యోచిస్తున్నామని చెబుతున్నారు. (చదవండి: బస్సులు పెంచుకుందాం.. ఆదాయం పంచుకుందాం!) -
మాయదారి రోగమే కానీ...
ఒకటింకా పూర్తిగా పోనే లేదు... మరొకటి పులి మీద పుట్రలా వచ్చి మీద పడింది. రెండున్నరేళ్ళుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా పూర్తిగా ఇంటిదారి పట్టకుండానే ఇప్పుడు మంకీపాక్స్ వంతు. 75కి పైగా దేశాల్లో 16 వేల మంకీపాక్స్ కేసులు బయటపడడంతో ఈ వ్యాధి అంతర్జాతీయ వార్త అయింది. మంకీపాక్స్ వైరస్ అంతర్జాతీయ స్థాయిలో కలవరపెడుతున్న అత్యవసర ప్రజారోగ్య పరిస్థితి అంటూ జూలై 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గరిష్ఠ స్థాయి హెచ్చరిక జారీ చేయడంతో కలకలం మొదలైంది. నిన్నమొన్నటి దాకా సురక్షితంగా ఉన్నామనుకున్న మన దేశంలోనూ కేరళలో మొదలై ఢిల్లీ వరకు గత పది రోజుల్లో మొత్తం 4 కేసులు బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో మరో అనుమానిత కేసుతో అప్రమత్తత అవసరమని అర్థమవుతోంది. 2009 నుంచి గత 14 ఏళ్ళలో జికా, ఎబోలా, పోలియో, స్వైన్‌ఫ్లూ, కోవిడ్ తదితర 7 సార్లే అంతర్జాతీయ అత్యవసర స్థితిని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. వాటిలో గత మూడేళ్ళలో వచ్చినవి – కోవిడ్, మంకీపాక్స్. హఠాత్తుగా తలెత్తి, అంతర్జాతీయ సరిహద్దులు దాటి, దేశాలన్నీ కలసి సమష్టి చర్యలు చేపట్టాల్సిన వ్యాధుల విషయంలోనే డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటిస్తుంటుంది. పెరుగుతున్న కేసులతో మంకీపాక్స్‌పై భారత ప్రభుత్వం సైతం ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిం చాల్సి వచ్చింది. నిజానికి, డబ్ల్యూహెచ్ఓ తాజా ప్రకటన కన్నా చాలా ముందే మన ప్రభుత్వం మేల్కొంది. మే నెలాఖరుకే ఇది సంక్షోభంగా పరిణమించవచ్చని భావించి, మంకీపాక్స్‌పై రాష్ట్రా లకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్క కేసొచ్చినా, వ్యాధి విస్ఫోటనంగానే భావించాలంది. కొంతకాలంగా అమెరికా, ఐరోపాలలో మంకీపాక్స్ విరివిగా కనిపిస్తోంది. ఆఫ్రికాలో ఈ వ్యాధి సాధారణమైనా, భారత్‌లో చాలా ఏళ్ళ తర్వాత ఈ వ్యాధి పొడసూపడంతో ఆగి, ఆలోచించాల్సి వస్తోంది. అయితే, కరోనాలా మంకీపాక్స్ శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెట్టదు. త్వరితగతిన వ్యాప్తి చెందదు. ప్రాణాంతకం కాదు కాబట్టి, అతిగా ఆందోళన పడాల్సిన పని లేదు. మంకీపాక్స్‌కు ఇప్పటి దాకా నిశ్చయమైన రోగనిరోధక చికిత్సంటూ లేకున్నా, మశూచికి ఇతర దేశాల్లో వాడిన 2వ, 3వ జనరేషన్ టీకాలు దీనికీ 85 శాతం మేర పనిచేస్తాయని ప్రస్తుతమున్న అవగాహన. కరోనా పుణ్యమా అని అత్యవసర స్థితిని ఎదుర్కోవడంలో వచ్చిన అనుభవంతో మన దేశం అడుగేయాలి. చికిత్స కన్నా నివారణే మిన్న గనక రోగుల క్వారంటైన్, సన్నిహిత కాంటాక్ట్‌ల ట్రేసింగ్, టెస్టింగ్, టీకాలు ముఖ్యం. ఈ వ్యాధి నిజంగానే ఓ విస్ఫోటనం కాకుండా చూసేందుకు అదే మార్గం. జంతువుల నుంచి వచ్చే ‘జూనోటిక్ వ్యాధుల’కు మంకీపాక్స్ ఉదాహరణ. ప్రధానంగా కోతులు, ఎలుకలు, ఉడుతల లాంటి జంతువులకు సన్నిహితంగా మెలగడంతో వ్యాపించే మంకీపాక్స్ వైరస్ సైతం మశూచి కారక వైరస్ల కుటుంబానికి చెందినదే. కరోనాలా భారీగా కేసులు రాకపోయినా, దానిలా ఇది ప్రాణాంతకం కాకపోయినా మంకీపాక్స్‌పై జాగ్రత్త తప్పదు. సాధారణంగా వ్యాధి ప్రబలిన విదేశాలకు వెళ్ళి వచ్చినవారిలో, మరో రోగికి సన్నిహితంగా మెలిగినవారిలోనే 14 నుంచి 21 రోజుల్లో మంకీపాక్స్ బయటపడుతోంది. నూటికి 99 కేసులు మగవారిలో, అదీ స్వలింగ సంపర్కుల్లోనే కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణమేదీ చేయకపోయినా ఢిల్లీలో ఒకరికి ఈ వ్యాధి రావడంతో రోగి ఎవరితో సన్నిహితంగా తిరిగారు, లైంగిక అభిరుచి ఏమిటనేది కీలకమైంది. మంకీపాక్స్ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్ఐవీ బాధితులు సహా కొన్ని వర్గాల వ్యక్తులకు కళంకం ఆపాదించే ముప్పుంది. పరోక్షంగా తమ లైంగిక అభిరుచులను బయటపెట్టి, తమపై ముద్ర వేస్తారనే భయం ఉంటుంది. కాబట్టి, నిఘా కేంద్రాలు, లైంగిక ఆరోగ్యశాలల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ర్యాండమ్ టెస్టింగ్ చేయాలి. ఎయిడ్స్‌పై రహస్య స్క్రీనింగ్ నిర్వహించిన అనుభవం మనకుంది గనక, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో)తోనే ఆ పని చేయించవచ్చు. ఆర్టీపీసీ ఆర్ కిట్లు, టీకాలు, చికిత్సా విధానాలను సర్కారు సత్వరం సిద్ధం చేయాలి. 1980లకే మనం దేశం నుంచి మశూచిని పారదోలాం. అలా దేశంలో నూటికి 70 మంది మశూచి టీకాలు వేయించుకోని వారే. దానికి వాడే మందులూ మన దగ్గర అందుబాటులో లేవు. గనక ముందుజాగ్రత్తగా విదేశాల నుంచి మందులు తెప్పించడం, టీకాల ఉత్పత్తిని ప్రోత్సహించడం అవసరం. డెన్మార్క్‌లోని పరిశోధనాశాలలో 1958లో కోతుల్లో మంకీపాక్స్‌ను కనుగొన్నారు. 1970లో నేటి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనుషుల్లో తొలిసారి ఇది బయటపడి, ఆఫ్రికా దేశాల్లో ప్రబలింది. ఇవాళ మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో సాధారణ జలుబు లాంటి ఎండెమిక్‌గా మారిందనేది చరిత్ర. కాబట్టి, ఆందోళన బదులు అంతర్జాతీయ సమాజం పరస్పర సహకారంతో, సమష్టి ప్రయత్నాలతో, వ్యాప్తిని అడ్డుకొనే పనిచేయాలి. ఇది మరో మహమ్మారిగా మారకుండా జాగ్రత్త పడాలనేదే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలోని సారాంశంగా గ్రహించాలి. ఇప్పటికే కరోనాతో జాగ్రత్తలు అలవాటయ్యాయి గనక ప్రభుత్వమూ ప్రజల్లో చైతన్యం పెంచాలి. రోగనిరోధక శక్తి తక్కువుండే చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకే మంకీపాక్స్ కొంత ప్రమాదకరం. లేదంటే 3 వారాల స్వీయ నిర్బంధం, తగిన ఉపశమన చికిత్సలతో నాలుగు వారాల్లో ఆరోగ్యవంతులు కావచ్చని గుర్తించాలి. వాట్సప్‌ల పుణ్యమా అని అసత్య సమాచారం ప్రబలే ప్రస్తుత పరిస్థితుల్లో చేయాల్సిందల్లా – భయపెట్టడం కాదు... అవగాహన కల్పించి అప్రమత్తం చేయడమే! -
సాక్షి కార్టూన్ 25-07-2022
దానికి వ్యాక్సిన్.. మా వల్ల కాదని కంపెనీలన్నీ చేతులెత్తేశాయ్ సార్! -
మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన
మంకీపాక్స్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలకు వైరస్ వేగంగా వ్యాప్తి చేందుతుండటంతో మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా(ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితి) ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ మంకీపాక్స్ వ్యాధిని అసాధరణ పరిస్థితిగా పేర్కొంది. కాగా 2009 నుంచి డబ్ల్యూహెచ్‌వో ఏడుసార్లు ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని డిక్లేర్ చేసింది. చివరిసారిగా 2020లో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రకటించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ ప్రస్తుతం భారత్‌ను భయపెడుతోంది. దాదాపు 70 దేశాలకు మంకీపాక్స్ విసర్తించింది. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న దేశంలో చాపకింద నీరులా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో మూడు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం గమనార్హం. 16 దేశల్లోని మనషుల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ విస్తరించింది. జంతువుల నుంచి వ్యాప్తి చెందే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Monkeypox: దేశంలో మూడుకి చేరిన మంకీపాక్స్ కేసులు -
Corona Virus: 110 దేశాల్లో వెల్లువలా కరోనా కేసులు
జెనీవా: కరోనా వైరస్.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు. కేవలం రూపం మాత్రమే మార్చుకుంటోంది అంతే. ప్రస్తుతం 110 దేశాల్లో కేసులు వెల్లువలా పెరిగిపోతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మహమ్మారి మారుతోంది కానీ అది ముగియలేదు. #COVID19 వైరస్‌ని ట్రాక్ చేయగల మా(డబ్ల్యూహెచ్‌వో) సామర్థ్యం ముప్పు అంచుకి చేరుకుంది. ఒమిక్రాన్, దాని నుంచి పుట్టుకొస్తున్న వేరియెంట్లను ట్రాక్ చేయడం, విశ్లేషించడం చాలా కష్టతరంగా మారుతోంది. కాబట్టి ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ ప్రకటించారు. బీఏ.4, బీఏ.5.. కేసులు వెల్లువలా పెరిగిపోతున్నాయ్. కానీ, కొత్త వేరియెంట్ల జాడను ట్రేస్ చేయలేకపోతున్నాం. వాటిలో ముప్పు కలిగించే వేరియెంట్లు లేకపోలేదు. దాదాపు 110 దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల గతంతో పోలిస్తే.. 20 శాతం అధికంగా పెరిగిపోయాయి. కేవలం డబ్ల్యూహెచ్‌వో పరిధిలోని ఆరు రీజియన్లలో మూడింటిలో మరణాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించడం ఒక్కటే రాబోయే ముప్పును తగ్గించగలదు. గత 18 నెలల నుంచి.. 12 బిలియన్ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ డోసుల ప్రక్రియ పూర్తైంది. కనీసం 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని.. తద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమో, జరగబోయే నష్ట తీవ్రతను తగ్గించడమో చేసుకోవచ్చని ప్రపంచ దేశాలకు పిలుపు చేయాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపు ఇచ్చింది. మరోవైపు భారత్‌లోనూ 14వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదు అవుతుండడం చూస్తున్నాం. -
మంకీపాక్స్ టెర్రర్.. ఒక్కరోజే 51 పాజిటివ్ కేసులు
కరోనా వేరియంట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంకీపాక్స్ రూపంలో మరో ఉపద్రవం తోడైంది. ఈ కొత్త వైరస్ మంకీపాక్స్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్‌ను మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. కాగా, ఫ్రాన్స్‌లో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది. మరోవైపు.. మంకీపాక్స్ సోకిన వారందరూ పురుషులే కావడం గమనార్హం. ఇక వీరి వయస్సు 22 నుంచి 63 ఏళ్ల మధ్యే ఉందని ఫ్రెంచ్ నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్ సోకిన వారిలో ఒక్కరే మాత్రమే చికిత్స పొంది కోలుకున్నారని సదరు ఏజెన్సీ తెలిపింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్ బారిన పడ్డారని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 21 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. కాగా, కొత్త వైరస్ మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్ బారినపడిన వారు రెండు నుండి నాలుగు వారాలలో కోలుకుంటారని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ఆయుధాలను నిషేధించాలన్న బైడెన్... కుదరదు అని చెప్పేసిన రిపబ్లికన్లు -
Monkeypox: మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు!
జెనీవా: మంకీపాక్స్ ముప్పుపై మరోసారి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉన్నా.. తక్కువ కేసులు నమోదు అవుతున్నా జాగ్రత్తలు మాత్రం పాటించాలని కోరింది. అదే టైంలో కరోనా తరహాలో మంకీపాక్స్ మహమ్మారిగా మారిపోయే అవకాశం తక్కువని స్పష్టత ఇచ్చింది. ఈ క్రమంలో త్వరలో జరగాల్సిన ఎల్జీబీటీక్యూ పరేడ్లను అడ్డుకోవాలని కొందరు పిలుపు ఇస్తుండగా.. ఆ అవసరం లేదని డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన చేసింది. యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మంకీపాక్స్ విజృంభణలో.. స్వలింగసంపర్కుల్లో వైరస్ వ్యాప్తిని గుర్తించారు ఎక్కువగా. దీంతో అసహజ లైంగిక కార్యకలాపాతోనే వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే.. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోయే ఎల్జీబీటీక్యూ ప్రైడ్ పరేడ్లపై ఆంక్షలు విధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. అయితే కేవలం స్వలింపసంపర్కులతోనే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వాదనను వైద్యనిపుణులు కొట్టిపారేస్తున్నారు. వైరస్ ఎవరికైనా సోకుతుందని మరోసారి స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్‌వో. వైరస్ సోకిన ఎవరి నుంచైనా సరే.. ఇన్ఫెక్షన్ మరొకరికి సోకుతుంది. కాబట్టి, ఎల్జీబీటీక్యూ ప్రైడ్ పరేడ్లను నిరభ్యరంతంగా నిర్వహించుకోవచ్చు, అది వాళ్ల హక్కు కూడా అని డబ్ల్యూహెచ్‌వో విభాగం ప్రకటన చేసింది. ఎల్జీబీటీక్యూ ప్రైడ్ పరేడ్లు.. జూన్ 26న న్యూయార్క్‌లో, జులై 23న బెర్లిన్‌తో పాటు చాలా చోట్ల నిర్వహించబోతున్నారు. మరోవైపు తాజాగా యూరప్‌లో మరో 70కిపైగా కొత్త కేసులు రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య 300కి చేరింది. -
WHO: మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందొచ్చు
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో సుమారు 200 మంకీపాక్స్ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ మహిళా ప్రతినిధి ఒకరు శుక్రవారం మంకీపాక్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో మంకీపాక్స్ కట్టడికి అవసరమైన సాయం అందజేస్తామని ఆమె పలు దేశాలకు హామీ ఇచ్చారు. అయితే.. కరోనా వైరస్‌లా మంకీపాక్స్ ప్రభావం చూపించే అవకాశాలు ఏమాత్రం లేవని ఆమె అన్నారు. మంకీపాక్స్ అంటువ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచదేశాలు తమ వద్ద పరిమితంగా టీకాల, ఔషధాలను పంచుకునేందుకు ఒక నిల్వ కేంద్రాన్ని రూపొందించుకోవాలని ప్రతిపాదించింది. -
Monkeypox: భారత్‌కు మంకీపాక్స్ ముప్పు
మంకీపాక్స్ వైరస్ ముప్పు భారత్‌కూ పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా. ఇప్పటికే ముంబైలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలైన మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూసేవి. బయటి దేశాల్లో బయటపడడం చాలా అరుదైన అంశం. అలాంటిది రెండు వారాల వ్యవధిలో 14 దేశాలకు విస్తరించడం అసాధారణమైన వ్యవహారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ అలర్ట్ అయ్యింది. తమిళనాడులో హైఅలెర్ట్ మంకీపాక్స్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలకు అనుగుణంగా.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సోమవారం జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు చేసింది. మంకీపాక్స్ అనుమానిత కేసుల్ని గుర్తిస్తే.. వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి తగు చికిత్స అందించాలని తెలిపింది. గత 21 రోజులుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్యంపై నిఘా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించింది తమిళనాడు సర్కార్. మంకీపాక్స్ అంటే.. స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ వైరస్ జాడ కనిపించింది. లక్షణాలివే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?: తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా, శారీరకంగా కలిసినా సోకుతుంది. చికిత్స ఎలా.. ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. మందులు వాడితే.. నాలుగైదు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. లేదంటే మరో మూడు వారాలు ఎక్కువ పట్టొచ్చు. ప్రతీ పది మందిలో ఒకరు మంకీపాక్స్‌తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. చదవండి: మంకీపాక్స్ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి! -
ASHA Workers: ఆశా వర్కర్లకు డబ్ల్యూహెచ్‌వో పురస్కారం
జెనీవా: భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని కొనియాడింది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం, స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందుండి నిబద్ధతతో పనిచేసిన ఆరు సంస్థలు, వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పురస్కారాలు ప్రకటించారు. ఈ సంస్థల్లో భారత ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న 10 లక్షల మంది ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్)లు కూడా ఉన్నారు. ఆశా వర్కర్లతో పాటు మరో ఐదింటికి అవార్డులు అందించింది డబ్ల్యూహెచ్‌వో. ఆశా కార్యకర్తలందరికీ అభినందనలు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో వారు ముందున్నారు. వారి అంకితభావం, సంకల్పం ప్రశంసనీయం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Delighted that the entire team of ASHA workers have been conferred the @WHO Director-General’s Global Health Leaders’ Award. Congratulations to all ASHA workers. They are at the forefront of ensuring a healthy India. Their dedication and determination is admirable. https://t.co/o8VO283JQL — Narendra Modi (@narendramodi) May 23, 2022 -
భారత్ ప్రతిష్టను దెబ్బతీసేయత్నం.. డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై మంత్రుల ఆగ్రహం
కెవాడియా(గుజరాత్): కోవిడ్ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చేసిన ప్రకటనపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన నిరాధారమని పేర్కొన్నారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించారు. గుజరాత్‌లోని కెవాడియాలో గురువారం ప్రారంభమైన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(సీసీహెచ్ఎఫ్డబ్ల్యూ) 14వ సదస్సు శనివారం ముగిసింది. సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. దేశంలో కరోనా సంబంధిత మరణాల విషయంలో ఎలాంటి దాపరికం లేదని తేల్చిచెప్పారు. అన్ని మరణాలను సమగ్ర, సమర్థ వ్యవస్థ ద్వారా, పారదర్శకతతో నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఇండియాలో కరోనా సంబంధిత మరణాలపై డబ్ల్యూహెచ్ఓ అంచనాలను ఖండిస్తూ సదస్సులో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. డబ్ల్యూహెచ్ఓ అంచనాలను భారత్ ఎంతమాత్రం అంగీకరించడం లేదని మాండవీయ ఉద్ఘాటించారు. లేదన్నారు. భారత్ అసంతృప్తిని డబ్ల్యూహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లాలని, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలని మాండవీయను కోరినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ చెప్పారు. చదవండి: (India: మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగులు) -
కోవిడ్ మరణాలు.. డబ్ల్యూహెచ్‌వో వర్సెస్ భారత్
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని తెలిపింది. అయితే సంస్థ ప్రకటనను భారత్ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ లెక్కల ప్రకారం ప్రపంచంలో జనవరి 2020 ఆరంభం నుంచి 2021 డిసెంబర్ చివరకు మరణించినవారి సంఖ్య 1.33– 1. 66 కోట్లు ఉంటుందని, సరాసరిన తీసుకుంటే ఈ సంఖ్య 1.49 కోట్లని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెబుతున్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వాలకు ఆరోగ్యవ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయన్నారు. ఈ లెక్కలో కరోనా సోకి చనిపోయినవారితో పాటు ఆరోగ్యవ్యవస్థ, సమాజంపై కరోనా ప్రభావం వల్ల మరణించినవారు కూడా ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ పరోక్ష మరణాలు దక్షిణాసియా, యూరప్, అమెరికాలో అధికమని సంస్థ తెలిపింది. భారత్‌లో ఈ లెక్క 47, 40,894 పైనే ఉంటుందని సంస్థ ప్రకటించింది. తమ గణాంకాలు భారత అధికారిక గణాంకాలతో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాల లెక్కింపు కోసం వాడిన పద్ధతులు సరైనవి కావని, ఈ లెక్కపై తమ అభ్యంతరాలను సంస్థకు తెలియజేస్తామని భారత ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో కేంద్రం వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్య 5, 23, 000 కు పైనే ఉంది. అంటే.. డబ్ల్యూహెచ్‌వో ఇస్తున్న గణాంకాలు అధికారిక గణాంకాల కంటే పది రెట్లు దాకా ఎక్కువన్నమాట. కరోనానే కారణం కాదు! భారత దేశంలో అధికారికంగా 2019లో 76.4 లక్షల మరణాలు(అన్నిరకాల మరణాలు) రికార్డు కాగా, 2020లో 6.2 శాతం పెరిగి 81.2 లక్షలకు చేరాయి. ఈ పెరుగుదలకు కేవలం కరోనా మాత్రమే కారణం కాదని నీతిఆయోగ్ సభ్యుడు పాల్ చెప్తున్నారు. ఇక మన అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2020లో భారత్‌లో లక్షన్నర కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కానీ ప్రపంచ కోవిడ్ మరణాల్లో.. మూడింట ఒకవంతు భారత్‌లో సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో సంస్థ గణాంకాలు చూపుతున్నాయి. -
మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..!
జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్ రిపబ్లిక ఆఫ్ కాంగోలో వైరస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు ‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చదవండి👉🏻 ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు -
కరోనా కొత్త మ్యూటెంట్.. ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
New Covid Variant XE: ఒక వేవ్ ముగిసిందని, ఒక వేరియెంట్ ప్రభావం తగ్గిపోయిందని అనుకునేలోపు.. కొత్త వేరియెంట్, మ్యూటెంట్ తెర మీదకు వస్తోంది. తాజాగా కొత్తగా బయట పడిన కరోనా మ్యూటెంట్ పేరు చెప్పేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ‘ఎక్స్ఈ’ గా పిలిచే ఈ కరోనా మ్యూటెంట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కొవిడ్-19 ఎక్స్ఈ Covid-19 XE.. మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియెంట్లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా భావిస్తున్నారు. అయితే.. స్టెల్త్ కరోనాతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో వ్యాపించే గుణం ఉందని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. కానీ, ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలగలిసిన రూపం. ఇదిలా ఉంటే.. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు. ప్రస్తుతానికి ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయట. అయితే ముందు ముందు పరిస్థితిని అంచనా వేయలేమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. ఇందులోనూ రకాలు! యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. మూడు రకాల రీకాంబినెంట్ స్ట్రెయిన్లు ఎక్స్ డీ, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. గతంలో వెలుగు చూసిన రెండు ఉప రకాలతో కలసిన స్వరూపాన్ని రీకాంబినెంట్ గా చెబుతారు. ఇందులో ఎక్స్ డీ అన్నది.. డెల్టా, బీఏ.1 కలసిన రకం. ఎక్స్ఎఫ్ అన్నది డెల్టా, బీఏ.1 కలసిన మరొక రూపం. -
వినబడట్లే! దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి లోపం
సాక్షి, హైదరాబాద్: దేశంలో వినికిడి సమస్య నానాటికీ పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 6.3 కోట్ల మందికి పైగా వినికిడి లోపంతో బాధపడుతున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వెల్లడించిన ప్రకారం.. ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాలో 291 మందికి తీవ్రమైన వినికిడి లోపం ఉంది. వీళ్లలో ఎక్కువ శాతం మంది 0–14 ఏళ్లలోపు వారే. దేశంలో ఏటా 27 వేల మంది పిల్లలు చెవిటి వారిగా పుడుతున్నారు. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడతారని అంచనా. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న డయాబెటిక్ బాధితుల్లో 70 శాతం మందికి గణనీయంగా వినికిడి లోపం ఉంది. శబ్ద కాలుష్యం, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వల్ల చెవుడు, వినికిడి లోపం బాధితులు పెరుగుతున్నారు. మార్చి 3న ‘వరల్డ్ హియరింగ్ డే’ సందర్భంగా వినికిడి లోపంపై కేంద్రం ఈ అంశాలను ప్రస్తావించింది. ప్రపంచ జనాభాలో 5 శాతం (43 కోట్లు) మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ప్రతి వెయ్యి జననాల్లో ఒకరు నుంచి ముగ్గురు వినికిడి లోపంతో పుడుతున్నారు. ప్రతి వెయ్యి మందిలో ఒకరిద్దరు బాల్యంలోనే శాశ్వత వినికిడి లోపంతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. -
కరోనా కేసులు ‘సున్నా’.. ఎక్కడో తెలుసా?
Zero Covid Cases Countries List: కరోనా వైరస్ మహమ్మారి.. ప్రపంచ దేశాలను గడగడలాడించింది. పలు దేశాల్లో కోవిడ్ విజృంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికి కొన్ని దేశాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వ్యాపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాని కొన్ని దేశాల జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసింది. కోవిడ్ కేసుల నమోదు సంఖ్య ‘జీరో’ ఉన్న దేశాల జాబితాలో పసిఫిక్, అట్లాంటిక్ సముద్రపు ద్వీప దేశాలు ఉండటం విశేషం. ఆ దేశాలు ఇవే.. టువాలు: ఈ దేశం మూడు దిబ్బ దీవులు, ఆరు పగడపు దీవుల సమూహం. అదే విధంగా కామన్వెల్త్ సభ్యదేశం కూడా. కరోనా మొదలైన నుంచి ఈ దేశం దేశసరిహద్దులు మూసివేసి.. నియంత్రణ చర్యలు చేపట్టింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం.. ప్రతి 100 మంది జనాభాకు దాదాపు 50 మంది టీకాలు వేయించుకున్నారు. టోకెలావ్: దక్షిణ పసిఫిక్ సముద్రంలోని చిన్న పగడపు దీవులున్న ఈ దేశంలో డబ్ల్యూహెచ్ఓ రిపోర్టుల ప్రకారం ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ దేశం న్యూజిలాండ్‌కు సమీపంలో ఉంది. టోకెలావ్ దేశం కేవలం 1500 జనాభా కలిగి ఉంది. సెయింట్ హెలెనా: దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని ద్వీపపు దేశం సెయింట్ హెలెనా. ఈ దేశంలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య ‘సున్నా’. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం.. ప్రతి వందమందిలో 58 మంది కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. పిట్కైర్న్ దీవులు: ఈ దీవులు పసిఫిక్ సముద్రంలో ఉన్నాయి. ఈ దీవుల్లో ప్రతి వంద మందిలో 74 మంది కోవిడ్ టీకా తీసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. నియు: దక్షిణ పసిఫిక్ సముద్రంలోని మరో ద్వీపపు దేశంలో కరోనా కేసుల నమోదు సంఖ్య ‘జీరో’. దేశంలోని ప్రతి వంద మందిలో 79 మందికి వ్యాక్సిన్ అందించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. నౌరు: ఈశాన్య ఆస్ట్రేలియాకు సమీపంలోని నౌరులో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దేశంలోని వందమందిలో 68 మంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపింది. మైక్రోనేషియా: చుక్, కోస్రే, పోహ్న్‌పే, యాప్ అనే నాలుగు రాష్ట్రాలను కలిగి ఉన్న ఈ దేశంలో కరోనా కేసుల నమోదు సంఖ్య ‘జీరో’గా డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రతి వంద మందిలో 38 మంది కోవిడ్ టీకా వేయించుకున్నారు. వీటితోపాటు తుర్క్మెనిస్తాన్, ఉత్తర కొరియా దేశంలో కరోనా వైరస్ నమోదు కేసుల సంఖ్య ‘సున్నా’ జాబితాలో డబ్ల్యూహెచ్ఓ చేర్చింది. అయితే ఈ రెండు దేశాల్లో కరోనా వైరస్‌కి సంబంధించిన అధికారిక సమాచారం బయటి ప్రపంచానికి తెలియకపోవటం గమనార్హం. -
ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదా.. ఈ విషయం తెలుసుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. రెండు లేదా ఒక డోసైనా వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే.. తీసుకున్న వారిలో 50 శాతం తక్కువగా లాంగ్ కోవిడ్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలపై కరోనా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రస్థాయికి కూడా చేరుకోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర నిపుణుల తాజా హెచ్చరికల నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. స్వల్ప లక్షణాలతో మైల్డ్‌గానే కరోనా సోకి తగ్గిపోయినా.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, పోస్ట్ కోవిడ్ చిక్కులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చునని మరికొన్ని అధ్యయనాలు ఇప్పటికే సూచించాయి. ఈ క్రమంలోనే టీకాలు తీసుకున్న వారిలో లాంగ్ కోవిడ్ సమస్యలు తక్కువగా ఉన్నట్టు, వ్యాక్సిన్లు తీసుకోని వారిని సమస్యలు వెంటాడుతున్నట్టు యునైటెడ్ కింగ్డమ్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకే హెచ్ఎస్ఏ) తేల్చింది. వివిధ సంస్థలు నిర్వహించిన దాదాపు 15 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించింది. టీకాలతో త్వరగా రికవరీ.. ఫైజర్, బయో ఎన్‌టెక్, ఆస్ట్రాజెనికా, మోడెర్నా రెండు వ్యాక్సిన్లు లేదా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా వేసుకున్న వారిలో, వ్యాక్సిన్ తీసుకోని వారికంటే 50 శాతం తక్కువగా లాంగ్ కోవిడ్ లక్షణాలు ఉంటున్నాయని యూకే హెచ్ఎస్ఏ పేర్కొంది. టీకాలు వేయించుకున్న వారు త్వరగా కోలుకుంటున్నట్టుగా కూడా వెల్లడించింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మంచి ప్రయోజనాలు కలుగుతున్నట్టుగా తేలిందని సంస్థకు చెందిన డాక్టర్ మేరి రామ్సే తెలిపారు. ‘కోవిడ్ సోకాక వ్యాక్సినేషన్ ద్వారా సీరియస్ లక్షణాల నుంచి రక్షణ లభిస్తుంది.దీర్ఘకాలిక ప్రభావాలు, లక్షణాలు కూడా తగ్గుతాయి. చాలామందికి లాంగ్‌కోవిడ్ లక్షణాలు తక్కువ కాలమే ఉండడమే కాకుండా త్వరలోనే పరిష్కారమౌతాయి. కొందరిలో మాత్రమే ఈ లక్షణాలు తీవ్రంగా మారి రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది..’ అని ఆమె చెప్పారు. కరోనా సోకాక నాలుగు వారాల తర్వాత కూడా అసాధారణ, అనూహ్య లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. యూకే హెచ్ఎస్ఏ పరిశీలన ప్రకారం.. - లాంగ్ కోవిడ్‌లో ఎక్కువగా అలసట, - ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కీళ్లు, కండరాల నొప్పులు, తదితరాలు కొనసాగుతుంటాయి. - యూకే జనాభాలో 2 శాతం మంది దాకా దీర్ఘకాలిక కరోనా లక్షణాలు, సమస్యలతో బాధపడుతున్నారు - వ్యాక్సిన్లు తీసుకున్న వారు 28 రోజుల పాటు కోవిడ్ లక్షణాలు కలిగి ఉన్నారు - పోస్ట్ కరోనా లక్షణాలపై టీకాలు బాగా పనిచేస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారిలో వీటి ప్రభావం అత్యధికం కాగా 19–35 ఏళ్ల మధ్యలోని వారిపై తక్కువగా ఉంది. -
ఒమిక్రాన్ ఎంత పని చేసిందంటే..
కరోనా వేరియేంట్లలో ప్రమాదకరం కాకపోయినా.. వేగంగా ఇన్ఫెక్షన్లతో వెల్లువలా కేసులు పెరగడానికి కారణమైంది ఒమిక్రాన్. కిందటి ఏడాది చివర్లో మొదలైన ఒమిక్రాన్ విజృంభణ.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో కేసుల తగ్గుముఖంతో సాధారణ ప్రజానీకానికి సడలింపులు, ఆంక్షల ఎత్తివేతతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్‌పై ఓ లెక్క అంటూ రిలీజ్ చేసింది డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ను నవంబర్ చివర్లో కరోనా వేరియెంట్‌గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయని WHO ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మరణాలు నమోదు అయ్యాయని తెలిపింది. విషాదానికి మించినది ఈ పరిణామం అని ఈ గణాంకాలపై వ్యాఖ్యానించారు ఆరోగ్య సంస్థ మేనేజర్ అబ్ది మహముద్. ప్రమాదకరమైన డెల్టా వేరియెంట్ తర్వాత ఒమిక్రాన్.. ప్రపంచంపై తన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రమాదకరమైంది కాకపోయినా.. త్వరగతిన వ్యాపిస్తూ కేసుల సంఖ్యను పెంచేసింది. కరోనా వేరియెంట్లు వచ్చి తగ్గిన పేషెంట్లపై మరికొంత కాలం ప్రభావం చూపిస్తుండగా.. ఒమిక్రాన్ మాత్రం సుదీర్ఘకాలం చూపించే అవకాశం ఉండడం గమనార్హం. కరోనా మొదలైనప్పటి నుంచి తీవ్రస్థాయిలో రేంజ్లో కేసులు వెల్లువెత్తడం ఒమిక్రాన్ వల్లే అయ్యింది. అనధికారికంగా ఈ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ, ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం మాత్రమే ఇది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కరోనాలో ఒమిక్రాన్ చివరి వేరియెంట్ కాకపోవచ్చని, ఒకవేళ తర్వాత వేరియెంట్ గనుక పుట్టుకొస్తే.. దాని తీవ్రత మరింత దారుణంగా ఉండబోతుందంటూ డబ్ల్యూహెచ్‌వో ఇదివరకే ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. COVID-19 డిసెంబర్ 2019 లో చైనాలో కరోనా వైరస్ పుట్టిందని ప్రకటించినప్పటి నుంచి.. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లమందికిపైగా కరోనా(వివిధ వేరియెంట్లు) బారినపడ్డారు. మొత్తం 57 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. ఇందులో భారత్ నుంచి మరణాలు ఐదు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా పది బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందాయి. -
ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర హెచ్చరిక.. అక్కడ సగం మందికి ఒమిక్రాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు డాక్టర్ హన్స్ క్లూజీ చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే యూరోప్‌లో 70 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, దీని ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో ఈ అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇన్ఫెక్షన్లు రెండింతలు అయినట్లు తెలుస్తోంది. యూరోప్‌లో 8 వారాల్లోగా సగం మందికి ఒమిక్రాన్ సోకుతుందని సియాటిల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ సంస్థ వెల్లడించినట్లు డాక్టర్ క్లూజీ తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. 2,46,780 కేసులతో యూకే తొలి స్థానంలో ఉండగా.. 66,563 కేసులతో డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్‌లో 4,868 ఒమిక్రాన్ కేసులున్నాయి. (చదవండి: వాసనతో ప్రమాదం పసిగట్టి గోల్డ్ మెడల్ అందుకున్న చిట్టి హీరో.. ఇక లేడు) -
ఒమిక్రాన్ మిగతా వాటిలా కాదు.. శ్వాస వ్యవస్థ పైభాగంలో ఎఫెక్ట్ ఉంటుంది: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వేరియంట్ బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్‌వో నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ తెలిపారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని వెల్లడించారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని పేర్కొన్నారు. (చదవండి: సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. వారంలో ఆ రోజు పూర్తిస్థాయి లాక్డౌన్) అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని.. హాస్పిటల్స్‌లో చేరే పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత వేరియంట్లు తీవ్రమైన న్యూమోనియాకు దారితీసి ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్ శ్వాస వ్యవస్థ పైభాగంలో ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని చెప్పారు. ఇది ఒకరమైన మంచి వార్తే అయినప్పటికీ, దానిని నిరూపించడానికి మాకు మరిన్ని అధ్యయనాలు అవసరమని డాక్టర్ అబ్దీ మహముద్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడినట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. (చదవండి: భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం ఆ రాష్ట్రంలోనే.. వెల్లడించిన కేంద్రం) -
మళ్ళీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి
-
కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ ఓకే
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కోవోవాక్స్ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ నుంచి సీరమ్ లైసెన్సులు పొంది దీన్ని రూపొందిస్తోంది. సంస్థ నిర్ణయం కరోనాపై పోరులో మరో మైలురాయిగా సీరమ్ సీఈఓ అధార్ పూనావాలా అభివర్ణించారు. వచ్చే ఆరు నెలల్లో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల అధార్ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రయిల్స్ దశలో ఉంది. ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. కొత్త టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసినట్లు సీరమ్ గత నెలలో వెల్లడించింది. నోవావాక్స్ రూపొందించిన NVX& CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు భిన్న సాంకేతికతతో నోవావాక్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. డీజీసీఐ తనిఖీల ఫలితాల ఆధారంగా నోవోవాక్స్ వాడేందుకు అత్యవసర అనుమతినిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే భారత్‌లో దీని అత్యవసర వినియోగానికి డీజీసీఐ నుంచి అనుమతులురావాల్సిఉంది. ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారికే భారత్‌లో కరోనా టీకాలు ఇస్తున్నారు . -
Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. రాత్రుళ్లు దుస్తులు తడిచిపోయేంతగా
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్‌తో తొలి మరణం కూడా నమోదైన నేపథ్యంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తే ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిని ఆందోళనకరమైన వేరియంట్‌గా గుర్తించింది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కాగా డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ తీవ్రత, లక్షణాలపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. అయితే, కొంతమంది వైద్య నిపుణులు మాత్రం ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే మరీ అంత ప్రమాదకరమైంది కాదని చెబుతున్నారు. అయితే, కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందుతుందో చెప్పడం కష్టమని, అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా బయటపడవచ్చని పేర్కొంటున్నారు. వేగంగా వ్యాపిస్తోంది! సార్స్-కోవ్-2 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత సులభంగా, వేగంగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. అయితే, డెల్టా రకంతో పోలిస్తే దీని లక్షణాలు భిన్నంగా ఉన్నాయని, ఇప్పటి వరకు అందించిన సమాచారం ప్రకారం పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదని తెలిపింది. మరోవైపు.. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలిసారి గుర్తించిన ఆ దేశ మెడికల్ అసోసియేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోట్జే సైతం దీని తీవ్రత తక్కువగానే ఉన్నట్లు పేర్కొనడం విశేషం. ఒళ్లు నొప్పులు ఉన్నాయా? అయితే దక్షిణాఫ్రికా హెల్త్ డిపార్టుమెంటుకు చెందిన డాక్టర్ ఉన్‌బెన్ పిల్లే మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల గురించి వివరించారు. ఒమిక్రాన్ రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుందని, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, రాత్రుళ్లు బాగా చెమట పట్టడం దీని లక్షణాలుగా చెప్పవచ్చన్నారు. వాసన కోల్పోవడం, ముక్కు కారడం వంటివి మాత్రం ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా కనిపించడం లేదన్నారు. అయితే కొంత మందిలో.. తీవ్రమైన తలనొప్పి, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కూడా కనిపించాయని మరో డాక్టర్ తెలిపారు. అయితే, తాను కూడా బాధితులకు రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట పట్టడం గమనించానని, దుస్తులు కూడా తడిసిపోతున్నట్లు చెప్పారు. ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు ►స్వల్ప జ్వరం ►తీవ్రమైన ఒళ్లు నొప్పులు ►అలసట ►రాత్రుళ్లు విపరీతంగా చెమటపట్టడం ►గొంతులో జీర వంటివి ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. జాగ్రత్తలు పాటించాల్సిందే అంతేగాక కోవిడ్ లక్షణాలైన పొడిదగ్గు, శ్వాసకోశ సమస్యలు, రక్తంలోని ఆక్సీజన్ లెవల్స్ పడిపోవడం వంటివి జరిగితే వెంటనే పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడాల్సిందిగా సూచిస్తున్నారు. అదే విధంగా తరచుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు. కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు, బూస్టర్ డోసులు వేయించుకోవాలని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. చదవండి: Omicron Variant: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ ఆంక్షలు -
పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: వైద్య సేవల కోసం తమ సొంతంగా ఖర్చు చేయాల్సి రావడంతో దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలోకి నెట్టివేయబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రజలు వైద్య సేవలు పొందే సామర్ధ్యంపై కోవిడ్ 19 ప్రభావం గురించి ఎత్తి చూపుతూ పై విధంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రెండు కొత్త నివేదికలను ప్రకటించింది. కోవిడ్ నుంచి కోలుకొని మరింత మెరుగ్గా నిర్మించుకునేందుకు ప్రయత్నించాలని అన్ని దేశాలను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అలాగే కొన్ని మార్గదర్శకాలను అందించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విషయంలో గత రెండు దశాబ్దాలుగా సాధించిన ప్రపంచ పురోగతిని కోవిడ్ మహమ్మారి ఆపే అవకాశం ఉందని పేర్కొంది. మహమ్మారికి ముందే తమ సొంత ఆరోగ్యం ఖర్చుల కారణంగా 50 కోట్ల ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారని పేర్కొంది. ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగిందని అంచనా వేస్తున్నాయి. పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నందున ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ బ్యాంక్ అందించిన నివేదికలు హెచ్చరించాయి. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! 2020లో కోవిడ్ ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగించిందని, అదే విధంగా 1930 తరువాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమైందని పేర్కొంది. దీని వలన ప్రజలు సంరక్షణ కోసం చెల్లించడం కష్టతరంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కోవిడ్‌కు ముందు దాదాపు బిలియన్‌మంది ప్రజలు(100కోట్లు) తమ సంపాదనలోని 10శాతం ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రపంచ బ్యాంకుకు చెందిన బువాన్ ఉరిబె వెల్లడించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీని వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. చదవండి: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవలపై ఖర్చు చేసే వ్యయాన్ని పెంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఉరిబె తెలిపారు. మహమ్మారికి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. తమ శక్తికి మించి ఆరోగ్య ఖర్చులు చేస్తున్న కుటుంబాలలో 90 శాతం వరకు ఇప్పటికే దారిద్య్ర రేఖ దిగువన ఉన్నాయని పేర్కొంది. ఇంకా ఏ మాత్రం సమయం లేదని, ప్రపంచ దేశాలన్ని ఆర్థిక పరిణామాలకు భయపకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేవలు పొందగలరని తమ పౌరులకు నమ్మకం కలిగించాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాంటి ప్రయత్నాలను వెంటనే ప్రారంభించి, వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దీనర్థం వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని, అలాగే ఇంటికి సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెంచాలన్నారు. మహమ్మారికి ముందు సాధించిన పురోగతి అంత బలంగా లేదని, ఈసారి భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులు ఇచ్చే షాక్‌లను తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలని పేర్కొన్నారు. యూనివర్సల్హెల్త్ కవరేజ్ దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్ధ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని కోరింది. WHO/@WorldBank report on progress towards #HealthForAll reveals that more than half a billion people were being pushed into poverty due to health care costs and disruption in health services even before the #COVID19 pandemic https://t.co/yCt340TG2d #UHCDay pic.twitter.com/hPDqBxbLTe — World Health Organization (WHO) (@WHO) December 12, 2021 -
గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్‌వేవ్ తప్పించుకోలేమా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం భారత్‌కు థర్ఢ్‌వేవ్ ముప్పు తప్పేలా లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య సంబంధ వ్యవస్థల్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కూడా ఒమిక్రాన్ వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: (Omicron Variant: సిరంజీలకు కొరత..!) ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై పని చేస్తాయా? అనే ప్రశ్నకు డాక్టర్ ఖేత్రపాల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌లో అనేక పరివర్తనాల దృష్ట్యా, ప్రస్తుత వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రతకు అడ్డుకట్టవేస్తూ.. మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని మాత్రమే భావించడం సహేతుకమని అన్నారు. టీకాలు వేసిన వారిలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నందున.. వ్యాక్సిన్లు ఇన్ఫెక్షన్కు గురికాకుండా అడ్డుకుంటాయే తప్ప అవి పూర్తిగా వ్యాధిని నిరోధించలేదని తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. బూస్టర్ డోస్‌ల ఆవశ్యకతపై చర్చిస్తూ.. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులు ప్రమాదంలో ఉండే అవకాశం ఉందని, వారికి టీకా అదనపు డోసును అందించాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పేర్కొన్నారు. చదవండి: (Omicron: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ..) కాగా.. ఆదివారం నాడు గంట వ్యవధిలోనే ఏపీ, చత్తీస్‌గఢ్, కర్ణాటకలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36కి పెరిగింది. దేశంలో అత్యధికంగా 17 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, తొమ్మిది కేసులతో రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది. గుజరాత్, కర్ణాటకలో ఇప్పటివరకు మూడు కేసులు నిర్ధారణ జరిగింది. ఢిల్లీలో రెండు, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. -
ఒమిక్రాన్ ‘తీవ్రత’పై స్పష్టత లేదు
ఐక్యరాజ్యసమితి/జెనీవా: కొత్త కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ వ్యాధి తీవ్రత ఎంతటి స్థాయిలో ఉంటుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచాన్ని చుట్టేసి జనజీవనాన్ని అతలాకుతలం చేసిన డెల్టా వేరియంట్ తరహాలో వేగంగా వ్యాప్తి చెందుతుందో లేదో అనే విషయాన్ని నిర్ధారించే సమాచారం తమ వద్ద లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ‘‘ప్రస్తుత సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్’ వేరియంట్‌గా గుర్తిస్తున్నాం. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో భిన్నమైన వ్యాధి లక్షణాలు ఉంటాయని రూఢీ చేసే సమాచారమూ మా వద్ద లేదు. దక్షిణాఫ్రికాలో సాధారణంగానే కేసులు పెరిగాయా? లేదంటే ఒమిక్రాన్ వల్లే పెరిగాయా? అనే దానిపై పరిశోధనలు పూర్తికాలేదు’ అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. సమష్టి పోరుకు సిద్దంకావాలి ఒమిక్రాన్ వంటి కొత్తకొత్త వైరస్ వేరియంట్లు ఉద్భవిస్తున్న ఈ తరుణంలో ‘అంతర్జాతీయ వేదిక’గా ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌పై ఉమ్మడి పోరుకు సిద్ధంకావాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. రాబోయే ఉపద్రవాలను పసిగట్టడం, ముందే సంసిద్ధమవడం, ధీటుగా ఆరోగ్య రంగాన్ని పటిష్టంచేయడం వంటి చర్యలతో మరో మహోత్పాతాన్ని ఆపాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసిస్ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. జెనీవాలో జరుగుతున్న ‘వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’లో ఆయన మాట్లాడారు. కోవిడ్‌పై ఉమ్మడి పోరాటానికి దేశాలన్నీ ఒక చట్టబద్ధ ఒప్పందం కుదుర్చుకో వాలని ఆయన సూచించారు. ఒప్పందం ద్వారా ప్రపంచం ఏకతాటి మీదకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఒమిక్రాన్ గుర్తుచేస్తోం దన్నారు. విదేశీయులకు ద్వారాలు మూసేసిన జపాన్ ఒమిక్రాన్ జపాన్‌లో ఇంకా వెలుగుచూడకపోయినా ఆ దేశం అప్రమత్తమైంది. మంగళవారం నుంచి ప్రపంచ దేశాల పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించబోమని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సోమవారం ప్రకటించారు. దేశ సరిహద్దుల వద్ద ఆంక్షలను పెంచారు. మరోవైపు, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య తాజాగా ఐదుకు పెరిగింది. బుధవారం నుంచి ప్రయాణ ఆంక్షలకు సడలించాలన్న నిర్ణయాన్ని మరో రెండు వారాలపాటు ఆస్ట్రేలియా వాయిదావేసుకుంది. డిసెంబర్ 15దాకా ప్రస్తుత ఆంక్షలే కొనసాగుతాయి. కాగా, పోర్చుగల్‌లో ఒమిక్రాన్ కేసులు పదమూడుకు పెరిగాయి. బ్రిటన్‌లో ఈ రకం కేసుల సంఖ్య తాజాగా తొమ్మిదికి చేరింది. ఇంగ్లండ్‌లో ఇప్పటికే మూడు కేసులుండగా సోమవారం స్కాట్లాండ్లో ఆరు కేసులొచ్చాయి. భారత్‌లో కనిపించని జాడలు భారత్‌లో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఒక్క కేసు కూడా నమోదుకాలేదని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. విదేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన వారి జీనోమ్ సీక్వెన్సింగ్‌పై పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఇటీవల విదేశాల నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఒక వ్యక్తి నుంచి సేకరించిన శాంపిల్.. డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉందని కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ సోమవారం చెప్పారు. 63 ఏళ్ల ఆ వృద్ధుడి శాంపిల్‌లో ఉన్నది ఒమిక్రానా? మరేదైనా వ్యాధి లక్షణాలా? అన్నది ఐసీఎంఆర్ అధికారులే బహిర్గతం చేస్తారని ఆయన అన్నారు. -
Omicron: పెను ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు
జెనివా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లనుందని.. దీని పరిణామలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్ ప్రభావం ఎంత తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సోమవారం ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేసింది. అవేంటంటే.. ►ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం అంతా వ్యాపించగలదు. కనుక అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు.. అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ►ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెను ముప్పు పొంచి ఉంది. దీని గురించి అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగడం అవసరం. ఒమిక్రాన్ అసాంఖ్యమైన స్పైక్ మ్యూటేషన్లు కలిగి ఉంది. ►రానున్న రోజుల్లో ఒమిక్రాన్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం రానుంది. దీన్ని పరిశోధించిన తర్వాత దీని గురించి మరింత సమాచారం అందుబాటులోకి వస్తుంది. ►రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడుతున్నారు. కనుక ప్రపంచ దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. చదవండి: ‘ఒమిక్రాన్’ వేరియెంట్ కథాకమామిషూ హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు -
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అక్కడ 5 లక్షల మరణాలు
WHO Warns Europe Covid-19 Situation : గత కొన్ని నెలలుగా మన దేశంలో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది. అయితే కొన్ని రోజుల క్రితమే పలు రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్‌కు చెందిన ఏవై.4.2 అనే కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్ డెల్టా కంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూరోప్ ప్రాంతంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. (చదవండి: థర్డ్ వేవ్ ముప్పు: 5 రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్) 2022, ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్ వల్ల మరో ఐదు లక్షల మంది మృత్యువాత పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ప్రస్తుతం యూరప్ రీజియన్ పరిధిలో 53 దేశాల్లో కరోనా వ్యాపించి ఉందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లుగే గురువారం మీడియాకు తెలిపారు. ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే, యూరప్ దేశాల్లో మరో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. (చదవండి: వెలుగులోకి మరో వైరస్: సోకిందంటే మరణమే) రష్యా, బ్రిటన్ తదితర దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో పలు యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో యూరోపియన్ యూనియన్ రీజియన్ పరిధిలో సెంట్రల్ ఆసియా పరిధిలోని పలు దేశాలతోపాటు మరో 53 ఈయూ దేశాలు వస్తాయి. మహమ్మరి ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. చదవండి: కరోనా లీక్ కాలేదనడం తొందరపాటే: టెడ్రోస్ -
కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
న్యూఢిల్లీ/జెనీవా: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్‌ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్(ఈయూఎల్)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్ఓ బుధవారం ప్రకటించింది. కోవాగ్జిన్‌కు ఈయూఎల్ హోదా కల్పించవచ్చంటూ డబ్ల్యూహెచ్ఓకు చెందిన స్వతంత్ర సాంకేతిక సలహా బృందం(టీఏజీ) ప్రతిపాదించడంతో టీకాకు మార్గం సుగమమైంది. గర్భిణులకు.. ఇప్పుడే చెప్పలేం కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినందుకు గాను డబ్ల్యూహెచ్ఓకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు, దేశ ప్రజల విశ్వాసానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ దీపావళి అని పేర్కొన్నారు. దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ భారత్‌కు అభినందనలు తెలియజేశారు. కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో కోవాగ్జిన్ చక్కగా పని చేస్తున్నట్లు సాంకేతిక సలహా బృందం గుర్తించింది. దీంతో ఎలాంటి రిస్కు లేదని తేల్చింది. 18 ఏళ్లు దాటిన వారంతా ఈ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ మరో ట్వీట్లో సూచించింది. నాలుగు వారాల వ్యవధితో రెండు డోసులు తీసుకోవాలని పేర్కొంది. అయితే, గర్భిణులకు కోవాగ్జిన్ ఇవ్వొచ్చా లేదా అనేది చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం సరిపోదని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న 14 రోజుల తర్వాత కోవాగ్జిన్ టీకా కరోనాపై దాదాపు 78 శాతం సమర్థతను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్‌ను నిల్వ చేయడం చాలా తేలిక అని, అందుకే తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలకు ఈ టీకా చక్కగా సరిపోతుందని వివరించింది. లక్షణాలు కనిపించే కరోనాపై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే రోమ్‌లో జి–20 సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయెసస్తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి రావడం విశేషం. కోవాగ్జిన్ షెల్ఫ్ లైఫ్ 12 నెలలు కోవాగ్జిన్ టీకా షెల్ఫ్ లైఫ్‌ను తయారీ తేదీ నుంచి 12 నెలల దాకా పొడిగించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అంగీకరించినట్లు భారత్ బయోటెక్ సంస్థ బుధవారం వెల్లడించింది. కోవాగ్జిన్ షెల్ఫ్‌లైఫ్ అనుమతి తొలుత ఆరు నెలలకే లభించింది. తర్వాత దీన్ని తొమ్మిది నెలలు పొడిగించారు. తాజాగా ఒక సంవత్సరం(12 నెలల) పొడిగించడం విశేషం. అంటే టీకాను తయారు చేసిన తర్వాత 12 నెలల్లోగా ఉపయోగించవచ్చు. (చదవండి: కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా) విదేశాలకు వెళ్లేవారికి ఇక్కట్లు తప్పినట్లేనా? భారత్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల ఊరట వ్యక్తమవుతోంది. భారత్‌లో ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది ఈ టీకా తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, కార్మికులు.. ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు. అయితే, కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరగడంతో విదేశాలకు వెళ్లేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. సొంత ఖర్చుతో కరోనా పరీక్ష చేయించుకొని నెగెటివ్ ఆర్టీ–పీసీఆర్ రిపోర్టు ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఆమోదం పొంది కరోనా టీకాను తీసుకోక తప్పలేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించిన కరోనా టీకాలను ప్రపంచంలో దాదాపు చాలా దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. అయితే అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం వారి సొంత ఔషధ నియంత్రణ సంస్థలు కూడా ఆమోదం తెలిపితేనే... ఏ టీకానైనా అనుమతిస్తారు. అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), యూరోప్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) అనుమతులను కోవాగ్జిన్ పొందాల్సి ఉంటుంది. తర్వాతే కోవాగ్జిన్ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లుగా అమెరికా, యూరోప్ దేశాలు పరిగణిస్తాయి. మిగతా దేశాల్లో మాత్రం ఈ టీకా తీసుకున్న భారతీయులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్లీ మరోసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పని ఉండదు. చదవండి: ‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’ -
100 కోట్ల టీకా డోసుల పంపిణీ
-
కోవిడ్–19 వ్యాక్సినేషన్లో మరో మైలురాయి
న్యూఢిల్లీ: కరోనా కొమ్ములు వంచడానికి చేస్తున్న పోరాటంలో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేసి ఘన కీర్తి సాధించింది. కరోనాపై పోరాటంలో రక్షణ కవచమైన భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఆరోగ్య, వైద్య సిబ్బందికి టీకా డోసులు ఇచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విడతల వారీగా, పక్కా ప్రణాళికతో ఒక్కో వయసు వారికి ఇస్తూ ముందుకు వెళ్లింది. అక్టోబర్ 21 నాటికి వంద టీకా డోసుల్ని పూర్తి చేసి చైనా తర్వాత శతకోటి డోసుల్ని పంపిణీ చేసిన రెండో దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసల్ని అందుకుంది. ఈ అపురూపమైన ఘట్టానికి గుర్తుగా దేశమంతటా మువ్వన్నెల వెలుగులు ప్రసరించాయి. దివ్యాంగురాలితో ముచ్చటించిన మోదీ వ్యాక్సినేషన్ కేంద్రానికి వీల్‌చైర్‌లో వచ్చిన అరుణ రాయ్ అనే దివ్యాంగురాలితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ అమ్మాయి హాబీలేమిటో అడిగి తెలుసుకున్నారు. అరుణ పాటలు పాడుతుందని తెలుసుకొని ఆమె చేత పాడించుకొని విన్నారు. అరుణ, ఆమె తల్లి కోరిక మేరకు వారితో కలిసి ఫోటోలు దిగారు. ప్రత్యేక గీతం విడుదల వంద కోట్ల డోసుల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. గాయకుడు కైలాష్ ఖేర్ ఆలపించిన ఈ గీతం ఆడియో విజువల్ ఫిల్మ్‌ని ఎర్రకోట వద్ద విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో 100 కోట్లు డోసులు పూర్తయినట్టుగా ప్రకటనలు ఇచ్చారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందిని అభినందిస్తూ అనౌన్స్మెంట్లు ఇచ్చారు. కొన్ని మొబైల్ సంస్థలు 100 కోట్ల డోసులు పూర్తయినట్టుగా కాలర్ ట్యూన్లు ఉంచాయి. మువ్వన్నెల వెలుగులు శత కోటి టీకా డోసులు అరుదైన చరిత్రను సాధించినందుకుగాను ఢిల్లీలోని కుతుబ్‌మినార్ నుంచి హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వరకు 100 వారసత్వ కట్టడాలను త్రివర్ణ శోభతో కాంతులు ప్రసరించేలా పురావస్తు శాఖ చర్యలు తీసుకుంది. ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమయూన్ టూంబ్, హంపి, ఖజురహోలతో పాటుగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, వరంగల్ రామప్ప ఆలయం వంటివి ఉన్నాయి. ఇక 1,400 కేజీల బరువైన ఖాదీ జాతీయ పతాకాన్ని ఎర్రకోట వద్ద ఆవిష్కరించారు. అభినందించిన డబ్ల్యూహెచ్ఓ: వంద కోట్ల మైలురాయి పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియాసస్ ప్రధాని మోదీని, శాస్త్రవేత్తల్ని, ఆరోగ్య సిబ్బంది, భారత ప్రజల్ని అభినందించారు. కోవిడ్ నుంచి రక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి, టీకా డోసుల సమాన పంపిణీకి తీసుకుంటున్న చర్యల్ని ఆయన కొనియాడారు. బలమైన రాజకీయ నాయకత్వం, ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి ఫీట్ సాధించడం అసాధ్యమని డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్, ఆగ్నేయాసియా డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. భారత్ చరిత్ర లిఖించింది: ప్రధాని వంద కోట్ల మార్క్‌ని దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. వైద్య , ఆరోగ్య సిబ్బందితో ప్రధాని మాట్లాడి వారిని అభినందించారు. లబ్ధిదారులతో కలిసి ముచ్చటించారు. ప్రధాని వెంట కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా ప్రధాని స్పందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ‘‘భారత్ చరిత్ర లిఖించింది. భారత శాస్త్ర, పారిశ్రామిక రంగాలతో పాటు 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తికి ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మహోన్నత యజ్ఞంలో పాలుపంచుకున్న మన వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందికి పేరు పేరునా కృతజ్ఞతలు. వంద కోట్ల డోసులు మనకి గర్వకారణం, రక్షణ కవచం’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ వందేళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని తరిమికొట్టే పటిష్టమైన రక్షణకవచం 100 కోట్ల డోసుల ద్వారా వచ్చిందని అన్నారు. ఈ ఘనత దేశంలోని ప్రతీ ఒక్కరికీ చెందుతుందని చెప్పారు. కరోనాపై పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న నీతి అయోగ్ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్యానెల్ చీఫ్ వీకే పాల్ కేవలం తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల డోసుల్ని ఇవ్వడం అరుదైన విషయమన్నారు. ఇంకా వయోజనుల్లో 25 శాతం మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని ఈ ఏడాది చివరి నాటికి అందరికీ సింగిల్ డోసు ఇవ్వడం లక్ష్యమని చెప్పారు. (చదవండి: Covid-19: భయం తగ్గింది.. మాస్కులేసుకోవడం మానేశారు) (చదవండి: "అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) చదవండి: కోవిడ్ జరిమానాలు కట్టిన వారు 40.33 లక్షలు -
కోవాగ్జిన్‌పై అదనపుసమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ
ఐక్యరాజ్యసవిుతి/జెనీవా: కోవిడ్–19 నియంత్రణ కోసం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ పేరిట టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకుంది. అయితే, అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో తొందరపడలేమని, కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం ఆశిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సోమవారం స్పష్టం చేసింది. కోవాగ్జిన్ టీకా భద్రత, ప్రభావశీలతను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉందని ట్విట్టర్లో తెలిపింది. -
టూర్ వెళ్లాలంటే పుట్టిన తేదీ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: కోవిడ్-19 మొదటి, రెండు డోసులు తీసుకోవడమే కాక కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో కూడా పుట్టిన తేదీ నమోదు చేసుకుంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) చీఫ్ డీఆర్ శర్మ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పుట్టిన తేదీకి ఒక ఫార్మాట్ (సంవత్సరం\ నెల\ తేదీ) విధానాన్ని కూడా సూచించింది. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు, దుకాణలు, కార్యాలయాలు నెమ్మదిగా తెరుచుకుని యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. (చదండి: సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కొడుకు.) ఈ కమంలో ప్రయాణికులు సురక్షితంగా ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా ప్రయాణించాలంటే ఈ విధమైన నిబంధనలే సురక్షితమని చెప్పారు. ఒకవేళ రెండు డోసులు వేయించుకున్నప్పటికీ పుట్టిన తేదీ నమోదు చేయించుకోకపోతే వెంటనే మీ పాస్‌పోర్ట్‌లో పుట్టిన తేదీలో ఎలా ఉందో అలా కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మార్పులు చేయించుకోవాలని డీఆర్ శర్మ సూచించారు. పుట్టిన సంవత్సరం ఆధారంగా సదరు వ్యక్తుల వయసు కూడా స్పష్టమవుతోందని తెలిపారు. ఎన్నో అభ్యంతర పరిణామాల మధ్య యూకే తయారు చేసిన కోవిషీల్డ్‌కి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోమ్: కంపెనీల కొత్త వ్యూహం) -
కోవాగ్జిన్‌పై అక్టోబర్ 6న డబ్ల్యూహెచ్ఓ భేటీ
హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వ్యాక్సిన్ల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇమ్యూనైజేషన్ (సేజ్) అక్టోబర్ 6న సమావేశం కానుంది. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సేజ్ ముసాయిదా ఎజెండాలో డబ్ల్యూహెచ్ఓ అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ ప్రతినిధులు పాల్గొని కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థత, సురక్షితత్వం, క్లినికల్ ట్రయల్స్ (1–3) వంటి వివరాలపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని సేజ్ ముసాయిదాలో తెలిపారు. 1,2,3 ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలను బట్టి వ్యాక్సిన్ ఎంతమేరకు రోగ నిరోధకతను అందివ్వగలదో పరిశీలించనున్నారు. చదవండి: డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: చైనా కోవిడ్‌ను మించి కంగారు! -
వెలుగులోకి మరో వైరస్: సోకిందంటే మరణమే
గినియా/కోనక్రీ: కరోనా మహమ్మారికి కళ్లెం వేయకముందే ప్రపంచం ముంగిట మరో కొత్త సమస్య ప్రవేశించింది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోకముందే మరో మహమ్మారి తరుముకొస్తుంది. ఇది కరోనా కన్న మరింత ప్రమాదకరం అని.. ఒక్కసారి ఈ వైరస్ సోకితే మరణమే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ వివరాలు.. పశ్చిమ ఆఫ్రికా గినియాలో మరో ప్రమాదకర వైరస్ వెలుగు చేసుంది. దీని పేరు మార్బర్గ్ అని.. ఇది గబ్బిలాల ద్వారా మనుషులకు సోకుతుందని.. దీనివల్ల మరణాల రేటు భారీగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆగస్టు 2న మరణించిన ఓ వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దక్షిణ గెక్‌కెడౌ ప్రిఫెక్చర్ ప్రాంతంలో తొలి మార్బర్గ్ కేసును గుర్తించినట్లు ఆఫ్రికా డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయెటి తెలిపారు. మార్బర్గ్ వైరస్ చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దానిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మత్షిడిసో పేర్కొన్నారు. గినియాలో ఎబోలా సెకండ్ వేవ్ ముగిసిందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన రెండు నెలలకే ఈ కొత్త వైరస్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మార్బర్గ్ సాధారణంగా రౌసెట్టస్ గబ్బిలాలకు ఆవాసాలుగా మారిన గుహలు, మైన్స్‌ల ద్వారా బహిర్గతమవుతుంది. ఈ వైరస్ వ్యాప్తిలో మరణాల రేటు 88 శాతంగా ఉంటుందన్నారు. ఏంటి మార్బర్గ్ వైరస్.. మార్బర్గ్ కూడా ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన వైరసే. దాని కన్నా ఇది మరింత ప్రమాదకారి. ఈ వైరస్ సోకిన వారు రక్తస్రావ జ్వరం బారిన పడతారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 1967లో జర్మనీ, బెల్గ్రేడ్, సెర్బియాలో ఒకేసారి రెండు అంటువ్యాధులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే మార్బర్గ్, ప్రాంక్ఫర్ట్ వ్యాధులను గుర్తించారు. ఉగాండ నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రీకన్ ఆకుపచ్చ కోతుల మీద పరిశోధన చేస్తున్న ల్యాబ్ నుంచి ఈ రెండు అంటువ్యాధులు బయటకు విడుదల అయ్యాయి. మార్బర్గ్ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావలు, అవయవాలు, ఇతర శరీర ద్రవాలు, వీటితో కలిసిన ఉపరితలాలు, ఇతర పదార్ధాల ద్వారా.. ఇది ఇతరులకు సోకుతుంది. వైరస్ పొదిగే కాలం రెండు నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. 2008 లో, ఉగాండాలోని రౌసెట్టస్ గబ్బిలాలు నివసించే గుహను సందర్శించిన ప్రయాణికులలో రెండు స్వతంత్ర కేసులు గుర్తించారు. మార్బర్గ్ వ్యాధి లక్షణాలు... మార్బర్గ్ వైరస్ బారిన పడిన వ్యక్తికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది. ఇవేకాక మూడవరోజు నుంచి తీవ్రమైన నీటి విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు ప్రారంభమవుతాయి. ఇవి ఒక వారం పాటు కొనసాగుతాయి. ఈ వ్యాధి సోకిన వారి కళ్లు లోపలికి పోయి.. ముఖంలో ఏ భావాలు కనిపించకుండా ఉండటమే కాక.. విపరీతమైన బద్ధకంగా ఉంటారు. ఇక మలేరియా, టైపాయిడ్, షిగెలోసిస్, మెనింజైటిస్ వంటి వాటిని గుర్తించినట్లు.. మార్బర్గ్ను గుర్తించడం కష్టమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు, సీరం న్యూట్రలైజేషన్ పరీక్షలు, సెల్ కల్చర్, ఆర్టీపీసీఆర్ ఉపయోగించి వైరస్ నిర్ధారణ చేయవచ్చిన తెలిపింది. -
మొత్తం కేసుల్లో 75% పైగా డెల్టా వేరియంట్‌వే
జెనీవా: భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే సహా ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు వారాలుగా పరీక్షించిన కోవిడ్–19 శాంపిళ్లలో పాజిటివ్‌గా తేలిన వాటిల్లో 75%పైగా డెల్టా వేరియంట్‌వేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చాలా దేశాలు కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీని విస్తృతం చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కేసుల్లో పెరుగుదల నమోదయిందని ఈనెల 20వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత వారంలో ఇండోనేసియాలో అత్యధికంగా 44% పెరుగుదలతో 3,50,273 కేసులు నమోదయ్యాయి. యూకేలో 41% పెరుగుదలతో 2,96,447 కేసులు, బ్రెజిల్ 14% పెరుగుదలతో 2,87,610 కొత్త కేసులు, భారత్‌లో 268,843 కొత్త కేసులతో 8 శాతం పెరుగుదల, అమెరికాలో 2,16,433 కొత్త కరోనా వైరస్ కేసులతో 68% పెరుగుదల నమోదైనట్లు వివరించింది. జీఐఎస్ఎయిడ్ సంస్థ జూలై 20వ తేదీన వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 2,40,000 శాంపిళ్లలో 2,20,000 శాంపిళ్లు డెల్టా వేరియంట్‌వేనని నిర్థారణ అయిందని తెలిపింది. రాబోయే నెలల్లో డెల్టా వేరియంట్ కేసులే అత్యధికంగా ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కాగా, భారత్‌లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్‌వే ఉంటున్నాయని కరోనా జన్యుక్రమాన్ని శోధించే వేదిక ఇన్సాకాగ్ వెల్లడించింది. -
డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం షాక్‌కు గురి చేసింది: చైనా
బీజింగ్: ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా చైనాలోనే జన్మించిందని.. డ్రాగన్ దేశం వుహాన్ ల్యాబ్‌లో మహమ్మారిని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. ఇక కరోనా గురించి హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విఫలమయ్యిందని.. చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో డబ్ల్యూహెచ్ఓ బృందం కరోనా మూలాల గురించి పరిశోధించేందుకు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకైందన్న కొనసాగుతున్న అనుమానాల నివృత్తికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోసారి విచారణకు సిద్ధమవడాన్ని చైనా పూర్తిగా వ్యతిరేకించింది. రెండోసారి విచారణకు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వూహాన్ నగరం, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తి చెందడానికి ముందు వూహాన్ ల్యాబ్‌లో ఉద్యోగులకు కరోనా సోకిందని వచ్చిన వార్తల్ని తోసి పుచ్చింది. కోవిడ్–19 పుట్టుకపై రెండో విడత వూహాన్ ల్యాబ్‌లో విచారణకు అనుమతినివ్వబోమని నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) ఉప మంత్రి జెంగ్ ఇక్సిన్ గురువారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. తమ దేశం ల్యాబ్ నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే వైరస్ లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారం తమని షాక్‌కి గురి చేస్తోందని జెండ్ అన్నారు. డబ్ల్యూహెచ్‌వో రెండోసారి విచారణకు సన్నాహాలు చేయడం సైన్స్‌ను అగౌరవపరిచేలా ఉందని ఆయన మండిపడ్డారు. శాస్త్రీయమైన ఆధారాలను అగౌరవ పరుస్తూ, రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి డబ్ల్యూహెచ్‌వో మరోసారి ల్యాబ్ థియరీపై విచారణ జరుపుతానని అంటోందని ఆరోపించారు. ఈ ఏడాది మొదట్లో డబ్ల్యూహెచ్‌వో అ«ధికారులు అందరూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లడానికి అంగీకరించామని, చైనాలో ఉండి వారంతా శాస్త్రవేత్తలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారని, ల్యాబ్ నుంచి వైరస్ లీకయినట్టు ఆధారాలు లభించలేదని గుర్తు చేశారు. -
కరోనా లీక్ కాలేదనడం తొందరపాటే: టెడ్రోస్
బెర్లిన్: ప్రాణాంతక కోవిడ్–19 విషయంలో ఇన్నాళ్లూ చైనాకు వెనకేసుకొచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడనోమ్ ఘెబ్రయెసుస్ ఇప్పుడు భిన్నంగా స్పందించారు. కరోనా మహమ్మారికి, ల్యాబ్ నుంచి లీక్ కావడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఎవరైనా కొట్టిపారేస్తే అది తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. కరోనా ఎక్కడ పుట్టిందన్న అంశంపై పరిశోధన సాగుతోందని చెప్పారు. కరోనా వైరస్ పుట్టుకను తేల్చే విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలని చైనా ప్రభుత్వానికి హితవు పలికారు. కరోనా పుట్టిన తొలినాళ్ల నాటి సమాచారాన్ని తాము కోరుతున్నామని చెప్పారు. చైనాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయినట్లు ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతున్నారని గుర్తుచేశారు. ‘‘నేను ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశా. ల్యాబ్‌లో సేవలందించా. స్వయంగా ఇమ్యునాలజిస్టును కూడా. ల్యాబ్‌ల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటివి సాధారణమే’’ అని టెడ్రోస్ పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం దశలో ప్రపంచం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
కరోనా థర్డ్‌వేవ్.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన
జెనివా: కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. పలు మార్పులకు లోనవుతూ.. మరింత ప్రమాదకరంగా తయారవుతూ.. ప్రపంచాన్ని వణికిస్తుంది. సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు వేల కొద్ది మరణాలు.. లక్షల్లో కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ ఇంకా ముగియకముందే.. థర్డ్ వేవ్ ముప్పు గురించి హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) థర్డ్ వేవ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా టెడ్రోస్ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టం కొద్ది ప్రపంచం ఇప్పుడు థర్డ్‌వేవ్ ప్రారంభ దశలో ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 111 దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతుంది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కోవిడ్ వేరియంట్‌గా ఉండటమేకాక త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని మేం భావిస్తున్నాం. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి, జన సంచారమే థర్డ వేవ్‌కు కారణం’’ అన్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తిని సామాజిక చైతన్యం, సమర్ధవంతమైన ప్రజారోగ్య చర్యల ద్వారా అడ్డుకోవాలని సూచించారు. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు రెండింటిలోనూ పెరుగుదల కనిపిస్తుందన్నారు. ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ, ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉందని, దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్త చేశారు. డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు రీజియన్లలో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతునే ఉన్నాయన్నారు. అలాగే పది వారాల పాటు తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు టెడ్రోస్. ప్రాణాలను రక్షించే వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రపంచంలో కొనసాగుతున్న దిగ్భ్రాంతికరమైన అసమానతను కోవిడ్ అత్యవసర కమిటీ గుర్తించిందని టెడ్రోస్ తెలిపారు. అయితే, వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేవని, అనుకూలమైన, స్థిరమైన విధానంతో దేశాలు ముందుకు వెళ్లాలని సూచించారు. భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించి.. ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. పలు దేశాలు ఇటువంటి చర్యలతోనే కోవిడ్-19ను అడ్డుకుంటున్నాయని టెడ్రోస్ గుర్తుచేశారు. -
హెచ్చరిక: డెల్టా వేరియంట్ చాలా డేంజర్
జెనీవా: కోవిడ్–19 వైరస్ డెల్టా వేరియంట్ దాదాపు 85 దేశాల్లో వ్యాపించిందని, ఇప్పటివరకు గుర్తించిన వేరియంట్ల కన్నా ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. ముఖ్యంగా టీకా తీసుకోని సమూహాల్లో దీన్ని వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రపంచ దేశాలతో పాటు తాము సైతం ఈ వేరియంట్‌పై ఆందోళనగా ఉన్నామన్నారు. కొన్ని దేశాల్లో కరోనా నిబంధనల సడలింపు కారణంగా ఈ వేరియంట్ వ్యాప్తి మరింత పెరగవచ్చన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే మరలా మృత్యు ఘంటికల మోత పెరుగుతుందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కరోనా వైరస్ వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. వైరస్లంటేనే మార్పులు తప్పనిసరని, కానీ వ్యాప్తిని అరికట్టడం ద్వారా కొత్త వేరియంట్ల పుట్టుకను అడ్డుకోవచ్చని తెలిపారు. డెల్టా వేరియంట్ మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా డేంజరని డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి డా. మారియా హెచ్చరించారు. పలు దేశాల్లో ఈ వేరియంట్ల కేసులు పెరుగుతున్నట్లు గమనిస్తున్నామన్నారు. పలు యూరప్ దేశాల్లో మొత్తంమీద కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో ప్రజలు గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయ ని, దీనివల్ల డెల్టావేరియంట్ వేగంగా వ్యాపించేందుకు దోహదం చేసినట్లవుతుందని ఆమె వివరించారు. చదవండి: (వ్యాక్సినేషన్ తర్వాతా.. 76% మందికి కరోనా) కొన్ని దేశాల్లో ఎక్కువమందికి టీకాలందినా, పూర్తి జనాభాకు ఇంకా టీకాలు వేయడం పూర్తికాలేదని గుర్తు చేశారు. డెల్టా వేరియంట్ సహా అన్ని రకాల వేరియంట్లను సమర్ధవంతంగా అడ్డుకోవడంలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని భరోసా ఇచ్చారు. టీకాలతో పాటు ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పక పాటించడమే ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమని గుర్తు చేశారు. భారీ గా గుమిగూడడం వల్ల భారీ ప్రమాదాలుంటాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం ఆల్ఫా వేరియంట్ 170 దేశాల్లో, బీటా వేరియంట్ 119 దేశాల్లో, గామా వేరియంట్ 71 దేశా ల్లో, డెల్టా వేరియంట్ 85 దేశాల్లో వ్యాపించాయి. చదవండి: (వణికిస్తున్న‘డెల్టా’.. అక్కడ మరోసారి పూర్తి లాక్డౌన్) -
కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు
సావో పాలో: భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ సరఫరా కోసం కుదిరిన ఒప్పందం బ్రెజిల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంట్లో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సీపీఐ) ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని ఆరోపణ. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ (అన్విసా)ల అనుమతి పొందని కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎందుకు ఒప్పందం చేసుకుందని, ఏ ప్రయోజనాలు ఆశించిందని ఆరోగ్యరంగ నిపుణులు, సెనేటర్లు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్లను నమ్మరు.. కోవాగ్జిన్‌పై అమితాసక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాగే బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో కోవిడ్–19ను తేలికగా తీసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మాస్కును ధరించకపోవడం... సామాజిక దూరా న్ని పాటించపోవడంతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణలో సరిగా వ్యవహరించకపోవడం వల్లే బ్రెజిల్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆగ్రహావేశాలు దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్నాయి. మూడు నాలుగు రోజుల కిందటే బ్రెజిల్లో కోవిడ్ మరణాలు ఐదు లక్షల మార్కును దాటేశాయి. వ్యాక్సిన్లను పెద్దగా విశ్వసించని బొల్సొనారో కోవాగ్జిన్‌తో ఒప్పందానికి మాత్రం అమితాసక్తి చూపించారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ‘వెంటనే జనవరి 8వ తేదీన భారత ప్రధాని మోదీతో బొల్సొనారో ఫోన్లో మాట్లాడారు. తమకు కోవాగ్జిన్ కావాలని అభ్యర్థించారు. కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రెపిసా మెడికామెంటోస్ ప్రతినిధులు జనవరి 6, 8వ తేదీల్లో ఢిల్లీలోనే ఉన్నట్లు తేలింది. బొల్సొనారోకు ప్రవర్తన కోవాగ్జిన్ కొనుగోలు ఒప్పందంలో తెరవెనుక ఏదో జరిగిం దనే అనుమానాలకు తావిస్తోంది’ అని సెనేట్ కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సెనేటర్ రాండోల్ఫ్ రోడ్రిగ్స్ శనివారం వ్యాఖ్యానించారు. ఒత్తిడి తెచ్చారు కోవాగ్జిన్ దిగుమతికి పూచీ ఇవ్వాల్సిందిగా తనపై అసాధారణ ఒత్తిడి వచ్చిందని బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. మాజీ ఆరోగ్యమంత్రి ఎడ్వర్డో పాజుయెలోకు సన్నిహితుడైన లెఫ్టినెంట్ కల్నల్ అలెక్స్ లియాల్ మారిన్హో ఈ మేరకు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశారని సదరు ఉన్నతాధికారి వెల్లడించారు. కోవాగ్జిన్ కొనుగోలులో ప్రెసిసా మెడికామెంటోస్ పాత్రపై సెనేట్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. కుంభకోణాల నిగ్గుతేలుస్తాం. ఏరకంగా చూసినా ఇది అసాధారణ సేకరణ ఒప్పందమే’ అని ప్యానెల్ ప్రతినిధి, సెనేటర్ రెనాన్ కాల్హీరోస్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రెసిసా మెడికామెంటోస్ మేనేజింగ్ పార్ట్నర్ ఫ్రాన్సిస్కో మాక్సిమియానోను బుధవా రం పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది. మాక్సిమియానో టెలికమ్యూనికేషన్ డేటా మొత్తం సమీకరించి ప్యానెల్‌కు అందుబాటులో ఉంచారు. సెనెటర్ల నుంచి ఆయన లోతైన ప్రశ్నలను ఎదుర్కొనబోతున్నారు. మాక్సిమియానో విచారణ మొత్తం టీవీల్లో ప్రత్యక్షప్రసారం కానుంది. గతకొద్ది రోజులుగా కోవాగ్జిన్ ఒప్పందంపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు సంబంధించిన అంశాలు బ్రెజిల్ టీవీ ఛానళ్లలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. ఏం జరిగింది? భారత్ బయోటెక్ ఉత్పత్తి అయిన కోవాగ్జిన్ 2 కోట్ల డోసులను (టెక్నాలజీని బదిలీ చేసే అంశం కూడా ఉంది) సరఫరా చేయడానికి 300 మిలియన్ డాలర్లు (రూ.2.230 కోట్లు) చెల్లించేలా బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్‌కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్ మధ్యవర్తిగా వ్యవహరించింది. దీనికిగాను ప్రెసిసా మెడికామెంటోస్‌కు ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముట్టాయనే పత్రాలు పార్లమెంటరీ ప్యానెల్ దగ్గర ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో సన్నిహిత గ్రూపులకు ఇందులో వాటా దక్కిందనే అనుమానాలున్నాయి. వీటిపైనే పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తు జరుపుతోంది. 2 కోట్ల వ్యాక్సిన్ కొనుగోలుకు 2,230 కోట్లతో ఒప్పందం చేసుకోగా... ఇందులో మూడోవంతు అంటే 734 కోట్ల రూపాయలు మధ్యవర్తి సంస్థకు దక్కడం పలు సందేహాలకు తావిస్తోంది. అయితే బ్రెజిల్ ఆరోగ్యశాఖ మాత్రం తామింకా ఎలాంటి చెల్లింపులు చేయలేదని చెబుతోంది. 2020 నవంబరులో బ్రెజిల్‌తో భారత్ బయోటెక్‌కు ఒప్పందం కుదిరింది. భారత సాంకేతిక ప్రగతిని ఇదొక నిదర్శనంగా పేర్కొన్నారు. కానీ ఎనిమిది నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా బ్రెజిల్లో ఒక్కరికీ కోవాగ్జిన్ ఇవ్వలేదు. ఎందుకంటే మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను సమర్పించలేదని, సరైన ఉ్పత్పత్తి ప్రమాణాలు లేవని అన్విసా మార్చి 31న కోవాగ్జిన్ వాడకానికి అనుమతి నిరాకరించింది. చివరకు ఈనెల 4వ తేదీన పలు కఠిన షరతులతో 40 లక్షల డోసుల కోవాగ్జిన్ దిగుమతికి అనుమతించింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి రాకముందే... పచ్చజెండా ఊపడం వెనుక బొల్సొనారో ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు. -
100 కోట్ల టీకాలు ఇచ్చాం: చైనా
బీజింగ్: తమ దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ చేసినట్లు చైనా ఆదివారం ప్రకటించింది. మార్చి ఆఖర్లో ప్రారంభించిన వ్యాక్సినేషన్ శనివారానికి 100 కోట్లకు చేరుకుందని జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. అయితే ఎంత మందికి వ్యాక్సినేషన్ చేశారన్న విషయాన్ని మాత్రం చైనా వెల్లడించలేదు. చైనాలో గతేడాది నుంచి దాదాపు 21 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నాయి. నాలుగింటికి అనుమతులు లభించాయి. అందులో సినోఫార్మ్, సినోవ్యాక్ అనే రెండు వ్యాక్సిన్లకు మాత్రమే అంతర్జాతీయ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు జారీ చేసింది. ఆ రెండు వ్యాక్సిన్లను చైనా పలు దేశాలకు పంపింది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి చైనాలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. 3 నుంచి 17 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్ చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు కూడా జారీ చేసింది. వీరికి వ్యాక్సినేషన్ చేసేందుకు పాలసీలను కూడా తయారు చేసే పనిలో చైనా ఉందని జిన్హువా న్యూస్ ఏజన్సీ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా కనీసం 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని ఎన్‌హెచ్‌సీ డిప్యూటీ హెడ్ తెలిపారు. -
మరో వేవ్ ముప్పు తప్పాలంటే ఇలా చేయాల్సిందే..
న్యూఢిల్లీ: కోవిడ్–19 మరో వేవ్ విరుచుకుపడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలని ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని, కరోనా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయాలని, వ్యాక్సినేషన్లో వేగం పెంచాలని పేర్కొంది. మాల్దీవులు, మయన్మార్‌లో ప్రమాదకరమైన కరోనా వేరియంట్లు విస్తరిస్తున్నాయని తెలియజేసింది. బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర దేశాల్లోనూ ఇలాంటి వేరింయంట్లు బెంబేలెత్తించాయని గుర్తుచేసింది. దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు, నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలను గాలికొదిలేశాయని, ఆంక్షలను సడలించాయని, జనం కూడా జాగ్రత్తలు మర్చిపోయారని, ఇలాంటి కారణాల వల్లే ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయని డబ్ల్యూ హెచ్‌వో స్పష్టం చేసింది. జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి టెస్టు, ట్రేస్, ఐసోలేట్ విషయంలో మన ప్రయత్నాలను నిరంతరం కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సామాజిక దూరం, చేతులు శుభ్రపర్చుకోవడం, మాస్కులు సక్రమంగా ధరించడం వంటి జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలంది. ప్రమాదకర కరోనా వేరియంట్ల ఉనికి ఉన్న ప్రాంతాల్లో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా రీజినల్ డైరెక్టర్ పూనమ్ క్షేత్రపాల్ సింగ్ చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కరోనా నియంత్రణ చర్యలు తప్పక పాటించాలని పేర్కొన్నారు. ఆగ్నేయ ఆసియాలో, భారత్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. పాజిటివ్ కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోందన్నారు. మహమ్మారి ఇంకా మన చుట్టుపక్కలే ఉందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు. వైరస్‌ను జయించామన్న అతివిశ్వాసం పనికిరాదన్నారు. -
Covaxin అనుమతులకై జూన్ 23న డబ్ల్యూహెచ్ఓతో భేటీ
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు కోసం భారత్ బయోటెక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అవసరమైన పత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. అనుమతుల విషయమై డబ్ల్యూహెచ్ఓతో ఈ నెల 23న సమావేశం కానున్నట్లు తెలిపింది. అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం అవసరమైన 90శాతం డాక్యుమెంట్లను గతంలోనే సమర్పించినట్లు కంపెనీ తెలిపింది. మిగతా పత్రాలను ఈ నెలలో అందజేయాల్సి ఉంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కోసం విదేశాంగ శాఖ భారత్ బయోటెక్‌తో సమన్వయం చేస్తోంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇక భారత్‌లో అత్యవసర వినియోగం పొందిన మూడు కోవిడ్ టీకాల్లో కోవాగ్జిన్ ఒకటి. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలో జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి టీకా వేసింది. ఇక మార్చిలో ప్రారంభించిన రెండో దశ టీకా క్యాక్రమంలో భాగాంగా 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వగా.. ఏప్రిల్ 1న మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. చదవండి: Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్ -
అమెరికా, భారత్, చైనాల వాటా 60%
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ అయిన సుమారు 200 కోట్ల కోవిడ్ టీకా డోసుల్లో భారత్, అమెరికా, చైనాల వాటాయే 60% వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. కోవిడ్ డోసుల పంపిణీలో 200 కోట్ల మైలురాయిని ఈ వారంలో అధిగమిస్తామని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ అడ్వైజర్ బ్రూస్ అయిల్వార్డ్ తెలిపారు. ప్రస్తుతం 212 దేశాల్లో టీకా పంపిణీ అవుతోందని ఆయన పేర్కొన్నారు. 200 కోట్ల డోసుల్లో 10 దేశాల వాటా 75% వరకు ఉందనీ, మొత్తం డోసుల్లో భారత్, అమెరికా, చైనాలు కలిపి 60% వరకు పంపిణీ చేశాయని ఆయన వెల్లడించారు. ఈ మూడు దేశాలు దేశీయంగానే టీకాలు సేకరించి, పంపిణీ చేశాయన్నారు. అన్ని దేశాలకు టీకాలను సమానంగా అందజేయాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన కోవాక్స్ కార్యక్రమం కింద 127 దేశాలకు ఇప్పటి వరకు 8 కోట్ల టీకా డోసులు అందజేశామన్నారు. టీకాల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చాలా దేశాలు ‘కోవాక్స్’సాయంతోనే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయని ఆయన చెప్పారు. అయితే, ప్రపంచ జనాభాలో 10% వరకు కలిగిన పేద దేశాలకు మొత్తం డోసుల్లో కేవలం 0.5% మాత్రమే అందడం విచారకరమని ఆయన అన్నారు. ప్రధానంగా, భారత్‌లో సెకండ్ వేవ్ కారణంగా కోవాక్స్ కింద సీరమ్ ఇన్స్టిట్యూట్ సరఫరా చేయాల్సిన టీకా డోసులు ఆగిపోయాయని చెప్పారు. వచ్చే రెండు నెలల్లో ఈ సమస్య పరిష్కారమై, కోవాక్స్ కింద పేద దేశాలకు ఇచ్చిన హామీ మేరకు 15 కోట్ల టీకా డోసులను సరఫరా చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రపంచ జనాభాలో కనీసం 30–40 శాతం మందికి టీకా అందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. భారత్‌లో మొత్తమ్మీద మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. -
Covid: అమెరికా నుంచే వ్యాప్తి.. చైనా సవాల్
బీజింగ్: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనా నుంచే ఈ వైరస్ వ్యాప్తి మొదలైందని.. డ్రాగన్ కావాలనే ఈ వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిందనే ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వూహాన్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో తాజాగా డ్రాగన్.. అమెరికాకు సవాల్ చేసింది. వైరస్ అగ్రరాజ్యం నుంచే వ్యాప్తి చెందిందని.. దీనిపై దర్యాప్తు చేయడానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణులను అమెరికాకు ఆహ్వానించాలని చైనా సవాలు చేసింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌తో సహా ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో కోవిడ్ ఆవిర్భవించినట్లు అనేక నివేదికలు ఉన్నాయి. వైరస్ విషయంలో మా దేశంపై చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి మేం డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తును స్వాగతించాం. ఇప్పుడు అమెరికా కూడా చైనా వంటి శాస్త్రీయ, సహకార వైఖరిని అవలంబించాలి. వైరస్ మూలాన్ని గుర్తించడంపై పరిశోధనలు చేయటానికి అమరికా, డబ్ల్యూహెచ్ఓ నిపుణులను తన దేశం ఆహ్వానించగలదని మేము ఆశిస్తున్నాము’’ అన్నారు. అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చైనాలో 2019 నవంబర్‌లో అనారోగ్యానికి గురైన తొమ్మిది మంది వైద్య రికార్డులను విడుదల చేయాలంటూ చేసిన డిమాండ్‌కు బదులుగా చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. వీలైనంత త్వరగా అమెరికా ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని, మహమ్మారిపై మానవజాతి విజయానికి తగిన కృషి చేయాలి అని వెన్సిన్ తెలిపారు. భవిష్యత్తులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులకు మెరుగ్గా స్పందించాలి అని ఆయన సూచించారు. తొలి కోవిడ్ కేసులు నివేదించడానికి ఒక నెల ముందు 2019 లో వుహాన్‌లోని ఒక చైనీస్ వైరాలజీ ప్రయోగశాలలో9 మంది పరిశోధకులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఫౌసీ వారి రికార్డులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు -
Bird Flu Strain H10N3: మనిషికి బర్డ్‌ఫ్లూ.. ఆందోళన అక్కర్లేదు!
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ మనిషికి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకడం.. ఆ కేసు కూడా చైనాలో నమోదు అయ్యిందన్న కథనాలతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఇది మరో మహమ్మారికి దారితీయబోతోందా?, అప్రమత్తం కావాల్సిన ఉందనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంతకి ఇప్పుడు వినిపించే ఆ బర్డ్ ఫ్లూ వైరస్ కారకం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. న్యూఢిల్లీ: తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్స్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి కేసు తాజాగా నమోదు అయ్యింది. జెన్జియాంగ్కు చెందిన 41 ఏళ్ల ఆ వ్యక్తి బర్డ్‌ఫ్లూ వైరస్‌లోని హెచ్10ఎన్3 స్ట్రెయిన్ బారినపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ కేసు వివరాల్ని ధృవీకరిస్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఇదే మొదటిసారి మనిషికి వైరస్ సోకడం అంటూ కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే మనుషులు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాల బారినపడడం చాలా సాధారణమైన విషయమని, హెచ్10ఎన్3 స్ట్రెయిన్‌తో పక్షులతో పాటు మనుషులకూ ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. గతంలో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా దేశంలో ఏడుగురు బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్8 స్ట్రెయిన్) బారినపడి కోలుకున్నారు. అలాగే పోయినేడాది డిసెంబర్లో చైనా హువాన్ ప్రావిన్స్‌లో ఓ బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్6 స్ట్రెయిన్) కేసు నమోదు అయ్యింది. ఇలా బర్డ్‌ఫ్లూ వైరస్ కారకాలతో ఇంతకు ముందు చాలానే కేసులు రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) భరోసా ఇస్తోంది. ఇక ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో హెచ్5ఎన్1 మాత్రం కొంచెం రిస్క్ ఉన్న బర్డ్‌ఫ్లూ వైరస్. దీని రిస్క్ రేటు 40 నుంచి 50 శాతం దాకా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల 1997లో 455 మంది ప్రపంచం మొత్తంగా చనిపోయారు. అలాగే హెచ్7ఎన్9 స్ట్రెయిన్ కూడా చాలా ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు. 2016-17 శీతాకాలం టైంలో చైనాలో ఈ స్ట్రెయిన్ వల్ల 300 మంది చనిపోయారు. కానీ, బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకడం చాలా చాలా అరుదుగా జరిగే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఎలా సోకుతుందంటే.. సాధారణంగా బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషికి సోకడం చాలా అరుదు. పక్షులు, కోళ్లు, ఇతరత్రా పక్షుల పెంపక పరిశ్రమల ద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ తరహాలోనే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలు (హెచ్10ఎన్3 స్ట్రెయిన్ సహా) తుంపర్ల ద్వారా మనుషులకు సోకుతాయి. అయితే వీటితో(కొన్ని స్ట్రెయిన్లను మినహాయిస్తే) మనుషులకు రిస్క్ రేటు తక్కువ. త్వరగా కోలుకుంటారు కూడా. అలాగే పక్షులకు కూడా రిస్క్ రేటు తక్కువే అయినప్పటికీ ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ తట్టుకోలేక చనిపోతుంటాయి. గతంలో రికార్డు అయిన మనుషులకు బర్డ్‌ఫ్లూ కేసులు కూడా ఫౌల్ట్రీతో దగ్గరి సంబంధాలు ఉన్నవే. ఆ టైంలో వాటికి దూరంగా ఉండడంతో పాటు చచ్చిన కోళ్లను మిగతా వాటి నుంచి త్వరగా వేరుచేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చని సూచిస్తున్నారు. అలాగే బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్లతో పక్షులకు జరిగే నష్టం కూడా చాలా అరుదని, కానీ, చాలామంది అప్రమత్తత పేరుతో వాటిని చంపుతుంటారని సైంటిస్టులు చెప్పారు. ఇక చైనాలో తాజాగా నమోదు అయిన కేసు కూడా ఈ కోవకే చెందుతుంది. ఇన్ఫెక్షన్కి గురైన పక్షుల ద్వారా ఆ వ్యక్తిని వైరస్ సోకి ఉంటుందని చైనా ఆరోగ్య కమిషన్ భావిస్తోంది. అంతేకాదు అతని వల్ల ఆ వైరస్ మరెవరికీ సోకలేదని నిర్ధారించింది కూడా. ప్రస్తుతం అతను కోలుకోవడంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి రెడీగా ఉన్నాడని డబ్ల్యూహెచ్‌వోకు ఒక రిపోర్ట్ కూడా సమర్పించింది చైనా. చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు వేరియెంట్లతో రిస్క్ ఛాన్స్! వైరస్ స్ట్రెయిన్లు వేరియంట్లను మార్పుకోవడం సాధారణం. కరోనా విషయంలో ఇది చూస్తున్నాం కూడా. అలాగే బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్స్ కూడా ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఎఫ్ఏవో ఎమర్జెన్సీ సెంటర్ సైంటిస్ట్ ఫిలిప్ క్లాయిస్ చెప్తున్నారు. గతంలో బర్డ్‌ఫ్లూ కేసుల్ని కొన్నింటిని ప్రస్తావించిన ఆయన.. మనుషుల నుంచి మనుషులకు ఆ వేరియెంట్ల వల్లే వ్యాపించిందన్న(అతికొద్ది ఇన్ఫెక్షన్ కేసులు) విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. ఇక ఫ్లూ వైరస్లు వేగంగా మ్యుటేంట్ కావడం, పక్షుల పెంపకం.. వలస పక్షుల వల్ల మనుషులకు రిస్క్ రేటు ఎక్కువగా ఉండొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న హెచ్10ఎన్3 వేరియెంట్ జెనెటిక్ సీక్వెన్స్ తెలిస్తేనే తప్ప.. రిస్క్ తీవ్రతపై ఓ స్పష్టత రాదని ఆయన అంటున్నారు. చదవండి: Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం
జెనీవా: భారత్‌లో మొట్టమొదటిసారిగా బయటపడిన బి.1.617 కోవిడ్–19 వేరియెంట్లో ఒక రకం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా అని పేరు పెట్టిన ఈ రకం జూన్ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వ్యాపించిందని తెలిపింది. ఈ రకం కరోనాతో ఆసియా దేశాలకు ఎలాంటి ముప్పు ఉందో ఊహించడానికే కష్టంగా ఉందని తన వారాంతపు నివేదికలో పేర్కొంది. కరోనాలో బి.1.617 వేరియంట్ తొలిసారిగా భారత్‌లో బయట పడింది. ఆ తర్వాత అది తన జన్యు స్వరూపాన్ని మార్చుకొని బి.1.617.1, బి.1.617.2, బి.1617.3... ఇలా మూడు రకాలుగా మారి వ్యాపించడం మొదలైంది. వీటిలో బి.1.617.2 రకం (దీనిని డెల్టా వేరియెంట్‌గా పిలుస్తున్నారు) అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని, ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన రెండు రకాలతో పెద్దగా ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ప్రమాదంలో ఆసియా దేశాలు భారత్‌లో బయటపడిన డెల్టా రకంతో ఆసియా దేశాలకు పెను ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్థులకు కూడా ఈ వైరస్ సోకుతూ ఉండడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితి నెలకొందని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ (యూఎన్‌హెచ్‌సీఆర్) అధికార ప్రతినిధి ఆండ్రేజ్ మహెకిక్ అన్నారు. ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలోపేతంగా లేకపోవడం, వ్యాక్సిన్ అన్ని దేశాలకు అందుబాటులో లేకపోవడంతో డెల్టా వైరస్ అత్యధిక దేశాలకు విస్తరిస్తోందని అన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా గత రెండు నెలల కాలంలోనే ప్రపంచ దేశాల్లో 3.8 కోట్ల కేసులు నమోదయ్యాయని, 5 లక్షలకు పైగా మరణాలు సంభవించాయన్నారు. అన్ని దేశాల్లోనూ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. -
భారత్‌లో బయటపడిన కోవిడ్ వేరియంట్లు.. కప్పా, డెల్టా
జెనీవా: భారత్‌లో తొలుత వెలుగుచూసిన కోవిడ్ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కప్పా, డెల్టా అనే పేర్లు పెట్టింది. గ్రీస్ అక్షరమాల ప్రకారం కరోనా వైరస్ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో పేరు పెడుతోంది. సార్స్‌కోవ్2 వేరియంట్లను గురించి ప్రజలు సులభంగా చర్చించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్ విభాగానికి చెందిన మరియా వాన్ కెర్ఖోవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఈ వేరియెంట్లను ‘ఇండియన్ వేరియెంట్లు’గా పేర్కొనడాన్ని భారత ప్రభుత్వం గట్టిగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఇండియన్ వేరియంట్ అని పేర్కొనవద్దని, రాయవద్దని మీడియా సంస్థలతో సహా అందరికీ సూచించింది. అనంతరం డబ్ల్యూహెచ్‌వో స్పందిస్తూ... తాము దేశాల పేర్లను కరోనా వేరియెంట్లకు పెట్టబోమని తెలిపింది. ఇన్నాళ్లూ సాంకేతిక నామంతోనే పిలుస్తున్న బి.1.617.1, బి.1.617.2లకు ఇప్పుడు కస్పా, డెల్టాలుగా పేర్లు పెట్టింది. -
WHO: పొగ తాగేవారు కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ
జెనివా: ధూమపానం(పొగ త్రాగేవారు) చేసేవారిలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్వో) స్పష్టం చేసింది. స్మోకింగ్‌ను వదిలేయాలని.. దీంతో కరోనా రిస్క్ తగ్గుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసన్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన ''క్విట్ టొబాకో క్యాంపెయిన్'' కార్యక్రమంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన క్విట్ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో అన్ని దేశాలు చేతులు కలపాలని కోరారు. దీనిపై ప్రజలకు అవసరమైన సమాచారం, సపోర్ట్, టూల్స్ అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో నేరుగా పనిచేస్తున్నట్లు టెడ్రోస్ పేర్కొన్నారు. చదవండి: చైనాలో దడపుట్టిస్తున్న కొత్తరకం స్రెయిన్ మరోముప్పు.. కరోనా హైబ్రిడ్ -
Coronavirus: వైరస్ పుట్టుక మిస్టరీయేనా?
కరోనా వైరస్ పుట్టిందెక్కడ? మరోసారి చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. చైనాలోని వూహాన్ జంతు వధశాల నుంచే అంటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తేల్చేసినా... అబ్బే కానేకాదు.. అదో కుట్ర అని అమెరికా అనడం తరువాయి.. వైరస్ జన్మ రహస్యం తేల్చాల్సిందే అని మళ్లీ తీర్మానాలు మొదలయ్యాయి. ఇంతకీ.. వైరస్‌ది సహజ జన్మమా... లేక టెస్ట్‌ట్యూబ్ జననమా? ప్రపంచానికి కరోనా వైరస్ పరిచయమై ఏడాదిన్నర కాలమవుతోంది. చైనాలోని వూహాన్లో మొదలైన మహమ్మారి ప్రస్థానం అతికొద్ది కాలంలో ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడమే కాకుండా.. లక్షల మంది ప్రాణాలను హరించిం ది. ఇంత జరిగినా.. ఈ సార్స్–కోవ్–2 వైరస్ పుట్టుక ఎక్కడ? ఎలా జరిగిందన్న ప్రశ్నలకు ఇప్పటివరకూ సంతృప్తికరమైన సమాధానం లేదు. గత ఏడాది మొదట్లోనే వూహాన్‌లోని ఓ పరిశోధనశాల నుంచి ఈ వైరస్ కాకతాళీయంగా బయటపడిందన్న వాదన ప్రచారంలోకి రావడం.. దీనిపై విచారణ జరపాలని అప్పటి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేయడం మనం చూసే ఉంటాం. తీవ్ర చర్చోపచర్చల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఒకటి వూహాన్‌కు వెళ్లి పరిశీలనలు జరిపింది. ఈ వైరస్ అడవి జంతువుల నుంచి.. జంతువధశాలల ద్వారా మనుషుల్లోకి ప్రవేశించి ఉండవచ్చునని, పరిశోధనశాలలో తయారయ్యే అవకాశాలు బాగా తక్కువని తెలిపింది. హమ్మయ్య.. ఒక వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకుంటూండగానే.. అమెరికా తాజా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఈ వైరస్ పుట్టుక తుట్టెను కదిపారు. మూడు నెలల కాలంలో ఈ అంశంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పరిశోధనశాల కుట్ర కోణం ఏమిటి? వూహాన్‌లోని ‘‘ద వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నుంచి ఈ వైరస్ యాదృచ్ఛికంగానో లేదా ఉద్దేశపూర్వకంగానో బయటపడిందన్నది మొదటి నుంచి వినిపిస్తున్న ఒక కథనం. ఈ ఇన్స్టిట్యూట్ చైనాలోనే అతిపెద్ద బయలాజికల్ రీసెర్చ్ సెంటర్ కావడం గమనార్హం. కరోనా వైరస్‌ను మొట్టమొదటిసారి గుర్తించిన హునాన్ జంతు వధశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ పరిశోధన కేంద్రం ఉంటుంది. పరిశోధనశాల నుంచి బయటపడ్డ వైరస్ ఈ వెట్మార్కెట్ (జంతువుల మల మూత్రాదులు నిండి ఉన్న సంత)లోని జంతువులకు చేరిందని ఈ కుట్రను నమ్మేవారు చెబుతారు. అడవి జంతువుల్లో ఉండే ఈ వైరస్‌ను వేరు చేసి మార్పుల్లేకుండా వ్యాప్తి చేశారని వీరు అంటున్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇది చైనీయులు కుట్రపూరితంగా తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారని ఆరోపణలు చేశారు. కరోనా వైరస్‌ను చైనా జీవాయుధంగా ఉపయోగించిందని ఇంకొందరు వాదించారు. తాజా ఆరోపణల వెనుక...? ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు వార్తా పత్రికలు ‘‘వూహాన్ పరిశోధన శాల కుట్ర’’కోణంలో పలు వార్తలు ప్రచురించడంతో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. వూహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్‌లో కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు అమెరికా నిఘా నివేదిక చెబుతున్నా ట్రంప్ ఆదేశించిన విచారణను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిలిపివేశారన్న ఆరోపణలతో కథనాలు రావడం గమనార్హం. అప్పట్లో కుట్ర కోణాన్ని కొట్టిపారేసిన బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథొనీ ఫాసీ లాంటి వారు కూడా ‘‘ఏమో.. కుట్ర జరిగిందేమో. పూర్తిస్థాయి విచారణ జరగాలి’’అనడం పరిస్థితిని మార్చేసింది. చైనా ఏమంటోంది? సహజంగానే.. ఠాట్! అమెరికా చెప్పేదంతా అబద్ధమని మొదట్నుంచీ వాదిస్తోంది. పరిశోధనశాల నుంచి తప్పించుకుందనడం తమపై బురద జల్లడమేనని అనడంతో ఆగిపోకుండా.. ఇతర దేశాల నుంచి ఆహారం ద్వారా తమ దేశంలోకి జొరబడి ఉండవచ్చీ మహమ్మారి అని ప్రత్యారోపణలు చేసింది కూడా. చైనాలోని ఓ మారుమూల గనిలో తాము 2015లోనే కరోనా వైరస్‌ను గుర్తించామని, ప్రొఫెసర్ షి ఝింగ్లీ గత వారమే ఓ పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారని చైనా ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఆ గనిలోని గబ్బిలాల్లో 8 రకాల కరోనా వైరస్లు గుర్తించామని, దీనికంటే పాంగోలిన్ అనే అడవి జంతువులోని కరోనా వైరస్‌లతో ప్రమాదం ఎక్కువని కూడా ఈ వ్యాసంలో ఉండటం గమనార్హం. ఏతావాతా చైనా చెప్పొచ్చేదేమిటంటే.. ఈ వైరస్ సహజసిద్ధంగానైనా వచ్చి ఉండాలి. లేదంటే ఆహార పదార్థాల ద్వారా ఇతర దేశాల నుంచి దిగుమతి అయి ఉండాలి అని!! చైనా అధికారిక మీడియా సైతం అమెరికాలో వైరస్ పుట్టుకపై పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని సంపాదకీయాల ద్వారా ప్రకటిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఈ వైరస్ సహజసిద్ధంగానే ఒక జంతువు నుంచి మరో జంతువు మాధ్యమంగా మనిషిలోకి వచ్చిందన్న గత ఏడాది సిద్ధాంతం కూడా ఇప్పుడు అంతగా పనిచేయడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా ఈ సిద్ధాంతాన్నే బలపరిచింది. అయితే, కోవిడ్–19 కారక కరోనా వైరస్‌ను పోలిన వైరస్ అటు గబ్బిలాల్లో, ఇటు ఇతర జంతువుల్లోనూ ఇప్పటివరకూ గుర్తించకపోవడం గమనార్హం. శాస్త్రవేత్తల మాట? కరోనా వైరస్ పుట్టుకపై శాస్త్రవేత్తల్లో ఏకాభిప్రాయమైతే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల నివేదిక అస్పష్టంగా ఉందని పలువురు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. నిపుణుల బృందం విచారణను చాలా తేలికగా తీసుకున్నట్లు కనిపిస్తోందని, ప్రమాదవశాత్తూ బయటపడిందా? సహజసిద్ధంగా మనుషుల్లోకి ప్రవేశించిందా తేల్చే సమాచారాన్ని సేకరించి ఉండాల్సిందని కొందరు శాస్త్రవేత్తలు సైన్స్ మ్యాగజైన్‌కు లేఖ రాశారు. కుట్ర కోణాన్ని క్షుణ్ణంగా విచారించాలని వీరు కోరుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసిస్ స్వయంగా సరికొత్త విచారణ జరగాలని కోరడం విశేషం. కరోనా మూలాలు తెలియాల్సిందే ప్రపంచ దేశాల డిమాండ్‌కు భారత్ మద్దతు న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సమగ్ర విచారణ జరపాలని అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్లకు భారత్ మద్దతు తెలిపింది. చైనాలో కరోనా వైరస్ ఎలా వచ్చిందో నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా సంస్థలను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు పలు దేశాలు కరోనా వైరస్ మూలాలపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ మూలాలపై మార్చిలో డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక వెలువరించినప్పటికీ.. దానిపై ప్రపంచదేశాలు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆ నివేదిక పేర్కొన్న అంశాలపై మరింత అధ్యయనం, వైరస్ మూలాలపై ఒక స్పష్టత అవసరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్ బాగ్చి తెలిపారు. – సాక్షి, హైదరాబాద్