
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే 2,60,000 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని పేర్కొంది. ఈ కేసుల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా దేశాల నుంచేనని తెలిపింది. అదేవిధంగా, మే 10వ తేదీ తర్వాత ఒక్క రోజులోనే అత్యధికంగా 7,360 మంది కోవిడ్‌తో చనిపోయారని పేర్కొంది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 1.45 కోట్లు కాగా, మరణాలు 6.06 లక్షలని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment