brezil
-
త్వరలో భారత్-చైనాల మధ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభం?
బ్రెసిలియా : భారత్-చైనాల మధ్య శాంతియుత వాతావరణం నెలకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.భారత్-చైనాల మధ్య శాంతి కుదిరేలా భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యిల భేటీ జరిగింది. ఈ భేటీలో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలను పునరుద్ధరించడంతోపాటు కైలాష్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభంపై ఇరు దేశాలు చర్చించినట్లు సమాచారం.తూర్పు లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. ఈ సమావేశం శాంతి, ప్రశాంతత పరిరక్షణకు దోహదపడిందని మంత్రులు పేర్కొన్నారు.కాగా,2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఈ పరిస్థితుల వల్ల ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. వాటిని నివారించేందుకు భారత్-చైనా మధ్య అనేక చర్యలు జరిగాయి. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్
బీజింగ్ : చైనాకు బ్రెజిల్ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రణాళికకు బ్రెజిల్ అడ్డుకట్టవేసింది. చైనా చేపట్టిన బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టులో చేరకూడదని నిర్ణయించుకుంది. తద్వారా ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వని బ్రిక్స్ గ్రూపులోని రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ మీడియాతో మాట్లాడుతూ బ్రెజిల్ బీర్ఐలో చేరదని, అయితే ఇందుకు బదులుగా చైనా పెట్టుబడిదారులతో భాగస్వామిగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు. బ్రెజిల్ ఎటువంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా, చైనాతో తన సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటోందన్నారు.హాంకాంగ్‌కు చెందిన వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'లోని వార్తల ప్రకారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించిన చైనా ప్రణాళికకు బ్రెజిల్ మద్దతునివ్వడం లేదు. బ్రెజిల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారులు ఇటీవల చైనా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఇప్పటికే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్ఐ ప్రాజక్టు అంతర్జాతీయ చట్టాలు, సూత్రాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
భారత్‌కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే..
భారతదేశం ఇతర దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించాలని.. ప్రత్యామ్నాయ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే మనదేశంలో ఇథనాల్ ఉత్పత్తి పెంచడానికి సరైన టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. దీనికి బ్రెజిల్ కూడా సహకరించనుంది.ఇటీవల బ్రెజిల్‌లోని కుయాబాలో జరిగిన జీ20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికతను భారతదేశంలో పెంచడానికి బ్రెజిల్ కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్.. బ్రెజిల్ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కార్లోస్ ఫవారో ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన విషయాల మీద చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన ఒప్పందం నవంబర్‌లో జరిగే జీ20 నాయకుల సమావేశానికి ముందే ఖరారు అవుతుందని పెకొన్నారు.జూన్ 2024లో జరిగిన ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ISO) 63వ కౌన్సిల్ సమావేశంలో.. చెరకు సాగు, చక్కెర, ఇథనాల్ ఉత్పత్తుల మెరుగైన వినియోగంలో మరింత స్థిరమైన పద్ధతులను అవలంబించడానికి భారతదేశం సభ్య దేశాల నుంచి సహకారాన్ని కోరింది. ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తిలో యూఎస్ఏ, బ్రెజిల్ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో స్థానంలో ఉంది.ఇదీ చదవండి: బిజినెస్ లోన్ కావాలా?.. ముందుగా ఇవి తెలుసుకోండివినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశంలో ఇథనాల్ మిశ్రమం శాతం 2019-20లో 5 శాతం నుంచి 2022-23లో 12 శాతానికి పెరిగింది. ఈ సమయంలో ఇథనాల్ ఉత్పత్తి 173 కోట్ల లీటర్ల నుంచి 500 కోట్ల లీటర్ల పెరిగింది. కాగా ఇప్పుడు బ్రెజిల్ సహకారంతో ఇది మరింత ఎక్కువవుతుంది భావిస్తున్నారు. -
ఖండాంతరాలు దాటిన ఇండియన్ కంపెనీ.. బ్రెజిల్లో కొత్త ప్లాంట్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' బ్రెజిల్లో కొత్త ప్లాంట్ ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయంతో కంపెనీ సంవత్సరానికి 20,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే వంద దేశాల్లో కంపెనీ తన వాహనాలను విక్రయిస్తోంది. ఈ కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి మరిన్ని దేశాలకు బజాజ్ వాహనాలు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్లకు విస్తరించనున్నట్లు సమాచారం. ఇందులో కేవలం వాహనాలు మాత్రమే కాకుండా వాహనాలకు కావలసిన విడి భాగాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రారంభంలో కంపెనీ బజాజ్ డామినర్ బైకులను మాత్రమే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి చేసిన డామినార్ బైకులు లాటిన్ అమెరికన్ మార్కెట్లలో విక్రయించనున్నారు. కంపెనీ సొంత ప్లాంట్ ఏర్పాటు చేయడంతో.. ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కస్టమర్లకు త్వరితగతిన వాహనాలను డెలివరీ చేయవచ్చని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో బ్రెజిల్లో మోటార్‌సైకిల్ అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డేటా ప్రకారం, 2024లో దక్షిణ అమెరికా మోటార్‌సైకిల్ మార్కెట్ భారీగా పుంజుకుంది. భారతదేశంలో కూడా బజాజ్ ఆటో అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్లడించింది. -
బ్రెజిల్లో దూసుకెళ్తున్న బీవైడీ.. 5000 మందికి ఉద్యోగాలు!
చైనా కార్ల తయారీ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రెజిల్లో తన 100వ డీలర్షిప్ ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 250కి పెంచాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.బ్రెజిల్లో బీవైడీ 100వ డీలర్‌షిప్‌ను ఫ్లోరియానోపోలిస్ డౌన్టౌన్లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బ్రెజిల్లో బీవైడీ సేల్స్ నెట్వర్క్ కింద 39 డీలర్ గ్రూపులను కలిగి ఉంది. అంతే కాకుండా 100 స్టోర్లను, 135 అవుట్లెట్ల కలిగి ఉన్నట్లు సమాచారం.రాబోయే రోజుల్లో కంపెనీ బ్రెజిల్లో మరో 150 కొత్త స్టోర్లను నిర్మించనుంది. 2024 చివరి నాటికి 250 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలంటే.. నెలకు కనీసం 19 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రెజిల్లో తన ఉనికిని విస్తరిస్తూ.. విక్రయాల నెట్వర్క్ పెంచడానికి కంపెనీ యోచిస్తోంది.బీవైడీ కంపెనీ బ్రెజిల్లో అతి పెద్ద తయారీ సైట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ చాసిస్, కొత్త ఎనర్జీ ప్యాసింజర్ కార్ ప్రొడక్షన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మెటీరియల్ వంటి వాటిని తయారు చేస్తుంది. ఇక్కడ ఏడాదికి 1,50,000 యూనిట్ల కార్లను (ఎలక్ట్రిక్, హైబ్రిడ్) తయారు చేయనున్నట్లు, స్థానికంగా 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు సమాచారం.బీవైడీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఉత్పత్తి ఈ ఏడాది చివరి నుంచి లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇందులో బీవైడీ డాల్ఫిన్, సాంగ్ ప్లస్, యువాన్ ప్లస్, డాల్ఫిన్ మినీ వంటి కార్లను తయారు చేయనుంది. -
ఫేస్బుక్ సీఈవోలో ఈ టాలెంట్ కూడా ఉందా? రింగులో దిగితే..
టెక్ రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న మెటా 'సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) గురించి అందరికి తెలుసు. ఈయన కేవలం సాంకేతిక రంగంలో మాత్రమే కాకుండా యుద్ధ కలల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ బిలియనీర్ జాబితాలో ఒకరైన జుకర్‌బర్గ్ ఈ విజయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో గర్వంగా పంచుకున్నారు. ఇందులో అతని కోచ్ డేవ్ కామరిల్లోతో కలిసి కొత్త బెల్ట్ ప్రమోషన్లను జరుపుకున్నారు. ఇందులో 5వ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించిన డేవ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఒక గొప్ప కోచ్, మీ ట్రైనింగ్‌లో ఫైటింగ్ గురించి చాలా నేర్చుకున్నాను, బ్లూ బెల్ట్ సాధించే స్థాయికి ఎదగటం చాలా గౌరవంగా భావిస్తున్నా అని ఫోటోలను పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!) జుకర్‌బర్గ్ చేసిన పోస్టుకి డేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఆసక్తికి ధన్యవాదాలు, ట్రైనింగ్ సమయంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని గొప్పగా కొనియాడాడు. ఈ పోస్టుకి నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎలాన్ మస్క్ అండ్ మార్క్ మధ్య కేజ్ ఫైట్ జరుగుతుందనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
బ్రెజిల్ : గాల్లోనే తెరుచుకున్న విమానం డోర్లు
-
French Open 2023: 55 ఏళ్ల తర్వాత...
పారిస్: బ్రెజిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 55 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఆ దేశ క్రీడాకారిణికి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బీత్రిజ్ హదాద్ మాయ క్వార్టర్ ఫైనల్ చేరింది. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968లో) మొదలయ్యాక దివంగత మరియా బ్యూనో చివరిసారి బ్రెజిల్ తరఫున గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 1968లో మరియా బ్యూనో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు... యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరియా బ్యూనో ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గినా ఆ విజయాలన్నీ ఓపెన్ శకంకంటే ముందు వచ్చాయి. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ బీత్రిజ్ 3 గంటల 51 నిమిషాల్లో 6–7 (3/7), 6–3, 7–5తో సారా సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై, అమెరికా టీనేజర్ కోకో గాఫ్ 7–5, 6–2తో షిమెద్లోవా (స్లొవేకియా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
బ్రెజిల్ ఆర్మీ చీఫ్‌పై వేటు
బ్రసిలియా: జనవరి 8వ తేదీన బ్రెజిల్ పార్లమెంట్, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో బ్రెజిల్ ఆర్మీ చీఫ్ జనరల్ జులియో సీజర్ డి అర్రుడాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఆగ్నేయ మిలటరీ కమాండ్ హెడ్ జనరల్ టామ్స్ మిగుయెల్ రిబిరో పయివా శనివారం నియమితులయ్యారు. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులుగా భావిస్తున్న వారు పాల్పడిన దాడికి సైనిక బలగాల్లో కొందరు అనుకూలంగా ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలే జనరల్ జులియో కొంపముంచాయని భావిస్తున్నారు. అధ్యక్షుడు లులా డిసిల్వా ఈ పరిణామంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. -
కల చెదిరింది.. హృదయం ముక్కలైంది! గుండెకోత మిగిల్చారు.. అయినా!
ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫిపా ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ తమ ప్రయాణాన్ని క్వార్టర్ ఫైనల్లోనే ముగించింది. క్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రోయేషియా చేతిలో పరాజయం పాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆరోసారి ట్రోఫీను ముద్దాడాలని ఖాతర్ గడ్డపై అడుగుపెట్టిన సాంబా బృందం నిరాశతో ఇంటిముఖం పట్టింది. తమ ఆరాధ్య జట్టు ఓడిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. బ్రెజిల్ జట్టు స్టార్ ఆటగాడు నెయ్మర్ సైతం పొగిలి పొగిలి ఏడ్చాడు. మ్యాచ్ సాగిందిలా.. ఇరు జట్లు మ్యాచ్ నిర్దేశిత 90 నిమిషాల సమయం ముగిసే వరకు గోల్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ రిఫరీ ఇరు జట్లకు అదనపు సమయమిచ్చారు. అయితే అదనపు సమయంలో మొదటి అర్ధ భాగంలో నెయ్మర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో మెరిశాడు. అభిమానులలో గెలుపు ఆశలు రేకెత్తించాడు. పట్టలేని సంతోషం తో మైదానంలో పరుగులు తీసాడు. దీంతో 1-0 బ్రెజిల్‌కు లభించింది. అనంతరం రెండో అర్ధభాగం లో క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్వోనిక్ గోల్ చేసి స్కోర్లను 1-1 తేడాతో సమం చేశాడు. దీంతో అభిమానుల హృదయ స్పందనల వేగం మరింత హెచ్చింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు మ్యాచ్ రిఫరీ పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫెనాల్టీ షూటౌట్లో ఏం జరిగిందంటే? తొలి ప్రయత్నంలోనే క్రోయేషియా ఆటగాడు గోల్ కొట్టి తమ జట్టుకు అధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం బ్రెజిల్ తమ తొలి ప్రయత్నంలో గోల్ కొట్టడంలో విఫలమైంది. బ్రెజిల్ ఆటగాడు రోడ్రిగో కొట్టిన బంతిని క్రోయేషియా గోల్ కీపర్ లీవర్ కోచ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక రెండో ప్రయత్నంలోనూ క్రొయేషియా ఆటగాడు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించగా.. బ్రెజిల్ కూడా ఈ సారి గోల్ కొట్టడంలో సఫలమైంది. దీంతో స్కోర్ 2-1గా మారింది. ఇక మూడో ప్రయత్నంలోనూ క్రొయేషియా, బ్రెజిల్ ఇరు జట్లు గోల్స్ సాధించాయి. దీంతో స్కోర్ 3-2 అయింది. ఇక నాలుగో ప్రయత్నంలోనూ క్రొయేషియా గోల్ సాధించింది. దీంతో 4-2గా మారింది. స్టేడియం మొత్తం ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో బ్రెజిల్ తరపున గోల్ కొట్టేందుకు మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు. అయితే మార్కినో కొట్టిన షాట్ ఎడమైవైపున్న గోల్ బార్‌ను తాకడంతో బ్రెజిల్ ఓటమిపాలైంది. దీంతో సగటు బ్రెజిల్ అభిమాని గుండె పగిలింది. ఇక బ్రెజిల్‌పై అద్భుత విజయం సాధించిన క్రోయేషియా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఏదేమైనా ఆటలో గెలుపుఓటములు సహజమే! క్రొయేషియా గెలిచినా.. బ్రెజిల్ ఓడినా సాకర్ ప్రేమికులను ఈ మ్యాచ్ ఉత్కంఠతో మునివేళ్ళమీద నిలబెట్టిందనటంలో సందేహం లేదు. కావాల్సినంత వినోదం పంచడంతో పాటు కాసిన్ని భావోద్వేగాలను కూడా మూటగట్టింది. చదవండి: FIFA WC: షూటౌట్లో బ్రెజిల్ అవుట్.. సెమీఫైనల్లో క్రోయేషియా -
స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు బ్రెజిల్‌కు భారీ షాక్..
సెర్బియాతో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయానికి గురైన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్ ఈనెల 28న స్విట్జర్లాండ్‌తో జరిగే రెండో లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదని జట్టు వైద్యులు ప్రకటించారు. బ్రెజిల్ తరఫున 122 మ్యాచ్‌లు ఆడిన నెమార్ 75 గోల్స్ చేశాడు. మరో రెండు గోల్స్ చేస్తే బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా దిగ్గజం పీలే (77 గోల్స్) పేరిట ఉన్న రికార్డును అతను సమం చేస్తాడు. కాగా సెర్బియాతో తమ తొలి మ్యాచ్‌లో 2-0 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. బ్రెజిల్ యువ ఆటగాడు రిచర్లిసన్ రెండు గోల్స్‌తో తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఇక సెర్బియాను చిత్తు చేసిన బ్రెజిల్ గ్రూప్-జి నుంచి అగ్ర స్థానంలో నిలిచింది. చదవండి: FIFA WC 2022: ఆతిథ్య దేశానికి మరో ఓటమి.. ఇక ఇంటికే -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్‌లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్‌ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
Viral Video: వీడి అదృష్టం బాగుండి.. బతికి బట్ట కట్టాడు..!!
-
డెఫిలింపిక్స్‌లో మెరిసిన హైదరాబాద్ షూటర్..భారత్‌కు గోల్డ్‌మెడల్
విశ్వ వేదికపై తెలుగు తేజం ధనుష్ శ్రీకాంత్ మరోసారి తన గురితో అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో ఈ తెలంగాణ యువ షూటర్ భారత్‌కు బంగారు బోణీ అందించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన శౌర్య సైనీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లోనే కాంస్య పతకం దక్కించుకున్నాడు. గత ఏడాది ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో స్వర్ణం... 2019లో ఆసియా చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు గెలిచిన ధనుష్ శ్రీకాంత్ అదే జోరును డెఫిలింపిక్స్లోనూ కొనసాగించాడు. కాక్సియస్ డు సుల్ (బ్రెజిల్): భారీ బృందంతో బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత్ ఒకే రోజు మూడు పతకాలతో మెరిసింధి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన షూటింగ్, బ్యాడ్మింటన్ ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు సంపాదించారు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం... శౌర్య సైనీ కాంస్యం సాధించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో టీమిండియా బంగారు పతకం దక్కించుకుంది. జెర్లీన్, అభినవ్ శర్మ, ఆదిత్య యాదవ్, శ్రేయా సింగ్లా, రోహిత్ భాకెర్, హృతిక్ ఆనంద్‌లతో కూ డిన భారత్ ఫైనల్లో 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం భారత్ మూడు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. కొత్త ప్రపంచ రికార్డుతో... ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్ 247.5 పాయింట్లు స్కోరు చేశాడు. బధిరుల విభాగం ఫైనల్లో ఇది కొత్త ప్రపంచ రికార్డు కావడం విశేషం. గతంలో ఈ రికార్డు కొలిన్ ముల్లర్ (జర్మనీ; 243.2 పాయింట్లు) పేరిట ఉండేది. ఎలిమినేషన్ పద్ధతిలో 24 షాట్లపాటు జరిగిన ఫైనల్లో కొరియా షూటర్ కిమ్ వూ రిమ్ 246.6 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... శౌర్య సైనీ 224.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో ధనుష్ 623.3 పాయింట్లతో రెండో స్థానంలో, శౌర్య 622.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు లభించాయి. గగన్ నారంగ్ శిక్షణలో... భారత స్టార్ షూటర్, హైదరాబాద్‌కే చెందిన గగన్ నారంగ్‌కు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో ధనుష్ శ్రీకాంత్ ఐదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. బధిరుడైన శ్రీకాంత్‌కు గగన్ ప్రత్యేక పద్ధతిలో శిక్షణ ఇచ్చాడు. రైఫిల్‌ను ఎలా పట్టుకోవాలి... గురి ఎలా చూడాలి... షూట్ చేసేందుకు ఎలా నిలబడాలి... తదితర విషయాలను కాగితాలపై బొమ్మలు గీసి శ్రీకాంత్‌కు ఈ క్రీడలోని మెళకువలను నేర్పించాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లోనూ పతకాలు నెగ్గిన శ్రీకాంత్ ఆసియా జూనియర్ చాంపియన్ షిప్, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు పతకాలు అందించాడు. ఈ నెలలో అజర్బైజాన్లో జరిగే ప్రపంచకప్‌లో ధనుష్ శ్రీకాంత్ భారత సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించనున్నాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ ట్రిస్టన్ స్టబ్స్..? -
బధిరుల ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి భవాని
తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి భవాని కేడియా వచ్చే నెలలో బ్రెజిల్ వేదికగా జరిగే బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 2010 నుంచి టెన్నిస్ ఆడుతున్న భవాని ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భవాని 2019లో చెన్నైలో జరిగిన బధిరుల జాతీయ క్రీడల్లో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకాలను గెలుచుకుంది. బధిరుల ఒలింపిక్స్‌లో భవానితోపాటు షేక్ జాఫ్రీన్, పృథ్వీ శేఖర్, ధనంజయ్ దూబే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Tokyo Olympics: 13...13...16!
టోక్యో: స్కేట్ బోర్డింగ్... ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడ. స్కేట్‌బోర్డ్‌ను ఉపయోగించుకుంటూ జిమ్నాస్టిక్స్ తరహాలో పలు విన్యాసాలు ప్రదర్శించే వేదిక. కొన్నాళ్ల క్రితం వరకు వేల కోట్ల రూపాయల వ్యాపారంతో ముడిపడి కేవలం ఎంటర్టైన్మెంట్గానే గుర్తింపు పొందిన ఈ ఆట ఇప్పుడు క్రీడాంశంగా ఒలింపిక్స్ వరకు చేరింది. స్కేట్ బోర్డింగ్‌లో రెండు ఈవెంట్లు ఉంటాయి. ‘స్ట్రీట్’ విభాగంలో పోటీ జరిగే ‘కోర్స్’ కాస్త సాఫీగా, తక్కువ ప్రమాదకారిగా ఉంటుంది. అదే రెండో విభాగం ‘పార్క్’లో మాత్రం అంతా కఠినంగా సాగుతుంది. 3ప్లేయర్లు తమ సామర్థ్యాన్ని బట్టి భిన్నమైన విన్యాసాలు ప్రదర్శిస్తారు. వేగం, టైమింగ్, నిలకడతో ఎంత కష్టంతో కూడుకున్నదనేదానిపై ఆధారపడి జడ్జీలు పాయింట్లు ఇస్తారు. 18 ఏళ్ల లోపువారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఈ పోటీల ‘మహిళల’ విభాగం (స్ట్రీట్ ఈవెంట్)లో సోమవారం ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. స్వర్ణం సాధించిన నిషియా మొమిజి (జపాన్) వయసు 13 ఏళ్ల 330 రోజులుకాగా... రజతం గెలుచుకున్న రెసా లియన్ (బ్రెజిల్) వయసు 13 ఏళ్ల 203 రోజలు. కాంస్యం సాధించిన ఫునా నకయామా (జపాన్) వయసు 16 ఏళ్ల 39 రోజులు! కొత్త తరం ప్రతినిధులుగా ఈ ముగ్గురు స్కేట్ బోర్డింగ్‌లో మరికొందరు అమ్మాయిలు అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంత కాలం దీనిని ఆటగా పరిగణించకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడేందుకు అంగీకరించేవారు కాదని, ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఈ ముగ్గురు టీనేజర్ల ప్రదర్శనతో పరిస్థితిలో మార్పు వస్తుందన్న అమెరికా సీనియర్ స్కేటర్ మారియా డురాన్...తాజా ఫలితం తర్వాత ఒక్కరోజులో 500 మంది కొత్తగా అడ్మిషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనని వ్యాఖ్యానించింది. -
‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్
హైదరాబాద్: దేశీయ కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్‌తో 2 కోట్ల టీకా డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని బుధవారం బ్రెజిల్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఒప్పందంలో అవినీతి సహా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఇప్పటివరకు అడ్వాన్స్ పేమెంట్ ఏదీ తీసుకోలేదని భారత్ బయోటెక్ తెలిపింది. ఒప్పందం కుదుర్చుకునే విషయంలో.. తాము విజయవంతంగా టీకా డోసులను సరఫరా చేసిన పలు ఇతర దేశాలతో అనుసరించిన విధానాన్నే బ్రెజిల్‌తోనూ అనుసరించామని పేర్కొంది. దేశ కంప్ట్రోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ బయోటెక్‌తో కోవాగ్జిన్ టీకా కొనుగోలు ఒప్పందాన్ని జూన్ 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ వైద్య శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని వైద్య శాఖకు చెందిన ఇంటిగ్రిటీ డైరెక్టరేట్ కూడా సమీక్షించిందని, ఒప్పందానికి సంబంధించిన పరిపాలనపరమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఈ నిర్ణయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. బ్రెజిల్ నుంచి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులను తాము స్వీకరించలేదని, అలాగే, బ్రెజిల్‌కు ఇప్పటివరకు టీకాలను కూడా సరఫరా చేయలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ప్రెసికా మెడికామెంటోస్’సంస్థ ‘భారత్ బయోటెక్’కు బ్రెజిల్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్లో నియంత్రణ అనుమతులు, బీమా, లైసెన్స్, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ తదితర విషయాల్లో ఈ సంస్థ భారత్ బయోటెక్‌కు సహకరిస్తోంది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బ్రెజిల్ అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగానే ఒప్పందంపై తాత్కాలిక నిషేధం విధించామని కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ వాగ్నర్ రోస్రియొ తెలిపారు. ‘ఒప్పందానికి సంబంధించిన ఆడిట్‌పై వారం క్రితం ప్రాథమిక విచారణ ప్రారంభించాం. సాధ్యమైనంత త్వరగా విచారణ ముగిస్తాం’అన్నారు. ఒప్పందానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని, అయితే, విచారణ కొనసాగించాలన్న నిర్ణయం నేపథ్యంలో నిబంధనల మేరకు తాత్కాలిక నిషేధం విధించామని బ్రెజిల్ వైద్య మంత్రి మార్సెల్ క్వీరొగా వెల్లడించారు. బ్రెజిల్‌కు 15 డాలర్లకు ఒక డోసు చొప్పున అమ్మేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్ల మధ్య పలు ఇతర దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ‘డెల్టా’పై కొవాగ్జిన్ పనితీరు భేష్: ఎన్ఐహెచ్ డెల్టా వేరియంట్‌పై కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా ఆల్ఫా వేరియంట్‌పైనా ఈ టీకా చక్కగా పనిచేస్తోందని పేర్కొంది. ఎన్ఐహెచ్, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మధ్య పలు శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామ్యం ఉంది. కోవాగ్జిన్ రూపకల్పనలోనూ ఎన్ఐహెచ్ సహకరించింది. -
Covid Deaths: 30 లక్షలు దాటిన మరణాలు
రియో డీ జనీరో: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రపంచం మొత్తం మీద శనివారం నాటికి కరోనా కారణంగా 30 లక్షల మంది మరణించారు. ఈ వివరాలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అందించింది. ప్రత్యేకించి భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా మహమ్మారి తాజా పంజా విసురుతోంది. మొత్తం మరణాలు వెనెజులాలోని కరైకాస్ నగర జనాభాకు దాదాపు సమానం కావడం గమనార్హం. కొన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా మరణాలకు సంబంధించి పూర్తి వివరాలను బయటకు వెల్లడించడం లేదని భావిస్తున్నారు. అమెరికా, భారత్ వంటి దేశాల్లో టీకాలు భారీస్థాయిలో ఇస్తున్నా మరణాలూ భారీ సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 12 వేలకుపైగా మరణాలు, ఏడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలోనే ఇప్పటి వరకూ 5,60,000లకు పైగా మరణాలు సంభవించాయి. -
రెండో స్థానం: బ్రెజిల్‌ను దాటేసిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల విషయంలో బ్రెజిల్‌ను భారత్ అధిగమించింది. ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా కొనసాగుతోంది. ఇండియాలో తాజాగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదేతొలిసారి. ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో దేశవ్యాప్తంగా 904 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,70,179కు చేరింది. 10 రోజుల్లోనే కేసులు రెట్టింపు కొత్తగా నమోదైన కేసుల్లో 83.02 శాతం కేసులు కేవలం పది రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కరోనా జడలు విప్పుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 63,294 కేసులు రాగా, ఉత్తరప్రదేశ్‌లో 15,276 కేసులు, ఢిల్లీలో 10,774 కేసులు వచ్చాయి. దేశంలో ఏప్రిల్ 1న 72,330 కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 5న 1,03,558 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 12న 1,68,912 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఏప్రిల్ నెల ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. 5 రాష్ట్రాల్లో్ల 70.16 శాతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 12 లక్షల మార్కును దాటేశాయి. రికవరీ రేటు 90 శాతానికి పడిపోయింది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 8.8 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల్లో 70.16% వాటా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలదే. దేశంలో యాక్టివ్ కేసులు గత ఏడాది సెప్టెంబర్ 18న అత్యధికంగా 10,17,754 ఉండగా, అత్యల్పంగా ఫిబ్రవరి 12న 1,35,926 ఉన్నాయి. మరోవైపు రికవరీ రేటు 89.86 శాతానికి పడిపోయింది. ముంబైలో 3 జంబో కరోనా ఆసుపత్రులు మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రచండవేగంతో విస్తరిస్తోంది. బాధితులకోసం ముంబైలో మూడు జంబో ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 5 వారాల్లోగా వీటిని నెలకొల్పనున్నట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ చైర్మన్ ఇక్బాల్‌సింగ్ చాహల్ సోమవారం చెప్పారు. ఒక్కో ఆసుపత్రిలో 2వేల పడకలు, ఇందులో 200 ఐసీయూ పడకలు, 70 శాతం ఆక్సిజన్ పడకలు ఉంటాయని తెలిపారు. కొన్ని 4–స్టార్, 5–స్టార్ హోటళ్లను ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కరోనా పాజిటివ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఆసుపత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఐసీయూ పడకల సంఖ్య 2,466కు చేరిందన్నారు. 141 ఆసుపత్రుల్లో మొత్తం 19,151 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. 25.78 కోట్ల టెస్టులు దేశంలో కరోనా మహమ్మారి బారినపడి వారిలో ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 వరకు 25,78,06,986 నమూనాలను(శాంపిల్స్) పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. -
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్వర్క్ సిస్టమ్‌ను సంస్థ సమీక్షిస్తోంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్‌లోని ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ప్రభావం లేదు.. సైబర్ అటాక్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్ సర్వీసులను ఐసోలేట్ చేశామని బీఎస్ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముకేశ్ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఔషధ రంగంలో మార్కెట్ విలువ పరంగా భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ రెండవ స్థానంలో ఉంది. సంస్థ దేశంలో 17 తయారీ ప్లాంట్లు, ఆరు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆరు తయారీ ప్లాంట్లు, మూడు ఆర్అండ్డీ సెంటర్లు ఉన్నాయి. కాగా, గురువారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.46 శాతం (రూ.23.30) తగ్గి రూ.5,023.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.4,832.40కి చేరి తిరిగి పుంజుకుంది. సైబర్ సెక్యూరిటీకి కంపెనీల ప్రాధాన్యం: సిస్కో బెంగళూరు: కరోనా వైరస్ పరిణామాలతో వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మళ్లుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సిస్కో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి సమస్యలు ప్రారంభమైనప్పట్నుంచీ సైబర్ దాడులు జరగడం లేదా హెచ్చరికలు వచ్చిన ఉదంతాలు 25 శాతం పైగా పెరిగాయని సుమారు 73 శాతం దేశీ సంస్థలు వెల్లడించాయి. సుమారు మూడింట రెండొంతుల సంస్థలు (65 శాతం) రిమోట్ వర్కింగ్‌కు వీలుగా పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. ఐటీ రంగంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే 3,000 పైచిలుకు సంస్థలపై సిస్కో ఈ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ విధానం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయని, క్లౌడ్ సెక్యూరిటీపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సిస్కో ఇండియా డైరెక్టర్ రామన్ తెలిపారు. -
కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఇప్పటికీ భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో ఏ దేశ ప్రభుత్వ నాయకత్వం ప్రశంసనీయమైన ఫలితాలను సాధిస్తోంది ? ఏ దేశ నాయకత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చిత్తశుద్ధితో కషి చేస్తోంది? అన్న అంశం...పై గత రెండు, మూడు నెలలుగా మీడియా వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరగుతోంది. ఏ దేశాల్లో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉంది ? అందుకు కారణాలేమిటీ ? ఏ దేశాల్లో లాక్డౌన్లు ముందుగా లేదా సకాలంలో విధించారు? ఏ దేశాల ప్రజలు కరోనా కట్టడికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు ? అంశాలతోపాటు ఏ దేశాల్లో జనాభా ఎంత ? జన సాంద్రత ఎంత ? దేశాల మధ్యనున్న జీడీపీ సారూప్యతలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యం లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని నిపుణులు అధ్యయనం చేయగా అనూహ్యంగా, ఆశ్చర్యంగా మగ నాయకత్వమున్న దేశాల్లో కంటే మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. (మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?) వాటిల్లో కూడా జెసిండా ఆర్నర్డ్ నాయకత్వంలోని న్యూజిలాండ్, త్సాయి ఇంగ్ వెన్ అధ్యక్షులుగా ఉన్న తైవాన్, ఏంజెలా మెర్కెల్ నాయకత్వంలోని జర్మనీ దేశాలు కరోనా కట్టడిలో ముందుకు వెళుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఓ నిర్దిష్ట కాలం వరకు మహిళా నాయకత్వంలోని హాంకాంగ్‌లో 1,056 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో నలుగురు మరణించారు. దాదాపు అలాంటి బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగిన మగ నాయకత్వంలోని సింగపూర్‌లో 28, 794 కేసులు నమోదుకాగా, 22 మంది మరణించారు. అలాగే మహిళా నాయకత్వంలోని నార్వేలో నిర్దిష్ట కాలానికి 8,257 మంది కరోనా బారిన పడగా, 233 మంది మరణించారు. అదే పురుష నాయకత్వంలోని ఐర్లాండ్‌లో అదే కాలానికి 24,400 కరోనా కేసులు నమోదుకాగా, 1,547 మంది మరణించారు. (తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి!) అలాగే మహిళా నాయకత్వంలోని తైవాన్‌లో నిర్దిష్ట కాలానికి 440 కేసులు నమోదుకాగా, ఏడుగురు మరణించారు. అదే కాలానికి పురుష నాయకత్వంలోని దక్షిణ కొరియాలో 11,078 కరోనా కేసులు బయట పడగా, 263 మంది మరణించారు. అలాగే ఫ్రాన్స్, బ్రిటన్‌కన్నా జర్మనీ, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ కన్నా మహిళా నాయకత్వంలోని బంగ్లాదేశ్ మెరుగైన ఫలితాలను సాధించాయి. మహిళా నాయకత్వంలోని దేశాల్లోనే ప్రభుత్వ వాణి ప్రజలదాకా వెళుతోంది. ప్రజలు ప్రభుత్వ సూచనలను బాగా పాటిస్తున్నారు. లండన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లో హెడ్ ఆఫ్ స్కూల్‌గా పనిచేస్తోన్న ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉమా ఎస్. కంభంపాటి, యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న సుప్రియ గరికపాటి సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపారు. (పారదర్శకంగా వ్యవహరించాం: జిన్‌పింగ్) బ్రిటన్‌కన్నా లాక్‌డౌన్‌ను ప్రకటించడంలో న్యూజిలాండ్, జర్మనీ దేశాలు ముందున్నాయి. అందుకనే ఆ దేశాలు కరోనా కట్టడి విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. నాయకత్వంలో ఉన్న పురుషులతో పోలిస్తే నాయకత్వంలో ఉన్న స్త్రీలు రిస్క్ తీస్కోరన్నది చారిత్రక సత్యంగా చెబుతుంటారు. ఆర్థిక నష్టాలను పణంగా పెట్టి మహిళా నాయకులు రిస్క్ ఎలా తీసుకున్నారన్నది ఇక్కడ ప్రశ్న. ప్రజల ప్రాణాల విషయంలో వారు రిస్క్ తీసుకోదల్చుకోలేదన్నది ఇక్కడ సమాధానం. నాయకత్వంలో ఉన్న పురుషులు, ప్రజల ప్రాణాలకన్నా ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారుకనక, వారు ఆ విషయంలో రిస్క్ తీసుకోలేదు. పైగా నిర్లక్షంగా వ్యవహరించారు. ‘అదా ఓ చిన్న పాటి ఫ్లూ లేదా కొంచెం జలుబు’ అన్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో, కరోనా వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడానికి ఓ ఆస్ప్రతికి వెళ్లి ప్రతి రోగితో కరచాలనం చేసిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. -
24 గంటల్లో 2.6 లక్షల మందికి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే 2,60,000 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని పేర్కొంది. ఈ కేసుల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా దేశాల నుంచేనని తెలిపింది. అదేవిధంగా, మే 10వ తేదీ తర్వాత ఒక్క రోజులోనే అత్యధికంగా 7,360 మంది కోవిడ్‌తో చనిపోయారని పేర్కొంది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 1.45 కోట్లు కాగా, మరణాలు 6.06 లక్షలని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. -
కరోనా విశ్వరూపం!
జెనీవా: కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆదివారమే సుమారు 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించడమే ఇందుకు సూచిక. కేవలం 24 గంటల్లో బ్రెజిల్లో 54,771 కేసులు, అమెరికాలో 36,617కేసులు బయటపడటంతో వైరస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అన్ని దేశాలూ పరీక్షల సంఖ్యను పెంచడం వల్ల ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని, అదే సమయంలో వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కూడా తెలుస్తోందని తెలిపింది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 91లక్షలకు చేరుకోగా, మొత్తం దాదాపు 4లక్షల 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికాలో శనివారం ఐదువేల కొత్త కేసులు నమోదు కాగా, 46 మంది వైరస్‌కు బలయ్యారు. ఇదే సమయంలో లాక్డౌన్ నిబంధనలు కొన్నింటిని సడలిస్తూ అధ్యక్షుడు సిరిన్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. జర్మనీలోని మాంసం ప్యాకేజీ ఫ్యాక్టరీలో మొత్తంగా వేయికిపైగా కేసులు నమోదు కావడంతో 6500 మంది ఉద్యోగులు, వారి కుటుంబీకులనుక్వారంటైన్లో ఉండాల్సిందిగా స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. స్పెయిన్‌లో ఎమర్జెన్సీ ఎత్తివేత కోవిడ్ కారణంగా మూడు నెలల క్రితం విధించిన ఎమర్జెన్సీను స్పెయిన్ ఎత్తివేసింది. దీంతో మార్చి 14 తరువాత సుమారు 4.7 కోట్ల మంది స్పెయిన్ వాసులు ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రయాణాలు చేసే వీలేర్పడింది. బ్రిటన్‌తోపాటు 26 ఇతర యూరోపియన్ దేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ నిబంధనను రద్దు చేసింది. వైరస్ మరోసారి వచ్చిపడే అవకాశం లేకపోలేదని ప్రధాని శాంచెజ్ హెచ్చరించారు. -
బ్రెజిల్ బేజార్
కరోనాతో కొంపలేం మునిగిపోవని అనుకున్నారు అదో ఫ్లూ లాంటి జ్వరమేనని ప్రకటనలూ జారీ చేశారు లాక్డౌన్, భౌతికదూరం అవసరమే లేదన్నారు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా వైరస్ తీవ్రతను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. కోవిడ్ కేసులు 10 లక్షలు దాటిపోతే, మృతులు 50 వేలకు చేరువలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా తర్వాత కరోనా కోరల్లో చిక్కుకొని బ్రెజిల్ విలవిలలాడుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనోరా ఏకపక్ష ధోరణితో వైరస్‌ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన సావో పాలో గవర్నర్ జాయ్ డోరియా ‘దేశాన్ని పట్టిపీడిస్తున్నది కరోనా వైరస్ కాదు. బోల్సనోరా వైరస్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. లాక్డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బోల్సనోరా కొన్ని రాష్ట్రాల గవర్నర్లు అమలు చేసినా వారు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారంటూ వైరస్ తీవ్రతని తగ్గించి చూపించే ప్రయత్నాలు చేశారు. జూన్ మొదటి వారం నుంచి ప్రతీరోజూ సగటున రోజుకి 30వేల కొత్త కేసులతో మొత్తం కేసులు 10 లక్షలు దాటేశాయి. మృతుల సంఖ్య 50వేలకు చేరువలో ఉంది. అయినప్పటికీ అధ్యక్షుడు బోల్సనోరా వైరస్ కంటే లాక్డౌన్ అనేదే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనాల ప్రకారం ఇకనైనా బ్రెజిల్ ప్రభుత్వం పకడ్బందీగా కోవిడ్ కట్టడి చర్యలు చేపట్టకపోతే దేశ ప్రజలు అసహనంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. వైరస్ వ్యాప్తికి కారణాలివీ ► బ్రెజిల్లో ప్రతీ ఏటా ఫిబ్రవరిలో జరిగే కార్నివల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం. అప్పటికే దేశంలో కరోనా జాడలున్నప్పటికీ ఉత్స వాల్ని ఘనంగా జరుపుకున్నారు. భారీగా ప్రజలు గుమికూడి సంబరాలు చేసుకున్నారు. కార్నివాల్ జరిగిన మర్నాడే ఫిబ్రవరి 26న దేశంలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత నాలుగు వారాల్లోనే కేసుల సంఖ్య లక్షకి చేరుకుంది. ► కరోనా సంక్షోభ పరిస్థితిని తట్టుకునే వైద్య సదుపాయాలు దేశంలో లేవు. ఐసీయూలు, ఆక్సిజన్ సిలండర్లకు తీవ్ర కొరత నెలకొని ఉంది. కొన్నేళ్లుగా ఆరోగ్యరంగానికి కేటాయింపులు సరిగా జరగడం లేదు. దేశంలో ఏకంగా 40 వేల మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. ఆరోగ్య రంగంలో మరో లక్ష మందికి కరోనా సోకుతుందనే అంచనాలున్నాయి. వీటన్నింటితో ప్రభుత్వ ఆస్పత్రులే పడకేశాయి. బోల్సనోరా ధోరణితో విసిగిపోయి మూడు నెలల్లోనే ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేశారు. ► దేశంలో కోవిడ్ పరీక్షలు సరిగా జరగడం లేదు. కరోనా కట్టడికి అన్ని దేశాలు అనుసరిస్తున్న ప్రధాన సూత్రం ‘ట్రేస్, టెస్ట్, ట్రీట్’ను బ్రెజిల్ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రతీ లక్ష మందికి సగటున రోజుకు కేవలం 14 పరీక్షలు జరుగుతున్నాయి. ► దేశంలో నెలకొన్న భారీ ఆర్థిక అసమానతలు కరోనా కేసులను పెంచేస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా కరోనా విస్తరించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొనే స్థోమత కలిగిన వారు దేశ జనాభాలో 20 శాతం మాత్రమే ఉన్నారు. వారు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గణాంకాలన్నీ తప్పుడు తడకలు! బ్రెజిల్ కరోనా గణాంకాలన్నీ దాస్తోందన్న అనుమానాలున్నాయి. కోవిడ్ కేసుల్ని ట్రాక్ చేసే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధికారిక లెక్కల కంటే కేసులు 7 రెట్లు ఎక్కువగా నమోదై ఉండవచ్చునని చెబుతోంది. దీంతో జూన్ తొలివారంలో బ్రెజిల్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు అధికారిక గణాంకాలను విడుదల చేయడం మానేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ ఇవ్వడం ప్రారంభించింది. -
3.12 లక్షలకు చేరిన కరోనా మరణాలు
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కట్డడికి ఎన్ని చర్యలు చేపట్టినా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47.16 లక్షలు దాటింది. ఇక వైరస్ ఇప్పటితో వరకు 3.12 లక్షల మంది మృతి చెందారు. కరోనా బారినపడిన 18.10 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా చాలా దేశాలు వైరస్‌పై పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్లో ఇటీవల వైరస్ వ్యాప్తి ఎక్కువగా పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఇక రష్యాలోనూ వైరస్ వ్యాప్తి వేగం పెరిగింది. (కోవిడ్ వ్యాక్సిన్ ధర తక్కువే) అమెరికాలో 15,07,864 పాజిటివ్ కేసులు, 89,596 మంది మృతి స్పెయిన్‌లో 2,76,505 పాజిటివ్ కేసులు, 27,563 మంది మృతి రష్యాలో 2,72,043 పాజిటివ్ కేసులు, 2,537 మంది మృతి ఇంగ్లండ్‌లో 2,40,161 పాజిటివ్ కేసులు, 34,466 మంది మృతి బ్రెజిల్లో 2,33,142 పాజిటివ్ కేసులు, 15,633 మంది మృతి ఇటలీలో 2,24,760 పాజిటివ్ కేసులు, 31,763 మంది మృతి ఫ్రాన్స్‌లో 1,79,365 పాజిటివ్ కేసులు, 27,625 మంది మృతి జర్మనీలో 1,79,247 పాజిటివ్ కేసులు, 8,027 మంది మృతి టర్కీలో 1,48,067 పాజిటివ్ కేసులు, 4,096 మంది మృతి ఇరాన్లో 1,18,392 పాజిటివ్ కేసులు, 6,937 మంది మృతి భారత్‌లో 90, 927 పాజిటివ్ కేసులు, 2872 మంది మృతి చైనాలో 82,941 పాజిటివ్ కేసులు, 4,633 మంది మృతి కెనడాలో 75,864 పాజిటివ్ కేసులు, 5,679 మంది మృతి