ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' బ్రెజిల్‌లో కొత్త ప్లాంట్ ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయంతో కంపెనీ సంవత్సరానికి 20,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే వంద దేశాల్లో కంపెనీ తన వాహనాలను విక్రయిస్తోంది. ఈ కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి మరిన్ని దేశాలకు బజాజ్ వాహనాలు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.
కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్లకు విస్తరించనున్నట్లు సమాచారం. ఇందులో కేవలం వాహనాలు మాత్రమే కాకుండా వాహనాలకు కావలసిన విడి భాగాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రారంభంలో కంపెనీ బజాజ్ డామినర్ బైకులను మాత్రమే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి చేసిన డామినార్ బైకులు లాటిన్ అమెరికన్ మార్కెట్‌లలో విక్రయించనున్నారు. కంపెనీ సొంత ప్లాంట్ ఏర్పాటు చేయడంతో.. ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కస్టమర్లకు త్వరితగతిన వాహనాలను డెలివరీ చేయవచ్చని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో బ్రెజిల్‌లో మోటార్‌సైకిల్ అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డేటా ప్రకారం, 2024లో దక్షిణ అమెరికా మోటార్‌సైకిల్ మార్కెట్ భారీగా పుంజుకుంది. భారతదేశంలో కూడా బజాజ్ ఆటో అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment