Manufacturing Unit
-
భారత్ తయారీ రంగం డీలా
భారత్ తయారీ రంగం(manufacturing sector) డిసెంబర్లో డీలా పడింది. హెచ్ఎస్బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డిసెంబర్లో 56.4కు పడిపోయింది. గడచిన 12 నెలల్లో ఇంత తక్కువ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. కొత్త బిజినెస్ ఆర్డర్లు, ఉత్పత్తిలో మందగమనం(slowdown) కనిపించిందని ఈ మేరకు వెలువడిన సర్వే పేర్కొంది. అయితే సూచీ 50పైన ఉంటే దీన్ని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. అంతకంటే తక్కువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీర్ఘకాలికంగా తయారీ సూచీ 54.1గా ఉండడం గమనార్హం. 2025లో ఉత్పత్తిలో భారీ పెరుగుదల నమోదవుతుందన్న విశ్వాసంలో తయారీదారులు ఉన్నట్లు సర్వే పేర్కొంది.ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులుపేఇన్స్టాకార్డ్ కార్యకలాపాల విస్తరణఫిన్టెక్ కంపెనీ పేఇన్‌స్టాకార్డ్ తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాలన్ని ప్రారంభించింది. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ (BIAC) ఇండియా పార్ట్నర్, పేఇన్‌స్టాకార్డ్ ఛైర్మన్ పచ్చిపాల దొరస్వామి, వ్యవస్థాపక సీఈవో సాయికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్యను 100కు పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సాయికృష్ణ తెలిపారు. తక్కువ లావాదేవీ వ్యయాలతో బిల్లులు, అద్దెలు, ఫీజులు మొదలైనవి చెల్లించేందుకు అనువైన సాధనంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1,00,000 మంది పైగా యూజర్లకు చేరువైనట్లు వివరించారు. -
రూ.9000 కోట్ల పెట్టుబడి.. 5000 ఉద్యోగాలు: టాటా మోటార్స్
టాటా మోటార్స్ తమిళనాడులోని రాణిపేటలో సరికొత్త తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదుపాయంలో టాటా మోటార్స్, జేఎల్ఆర్ రెండింటికీ వాహనాలను తయారు చేస్తుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. శంకుస్థాపన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టాటాకు చెందిన సీనియర్ ప్రతినిధులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.2024 మార్చిలో టాటా మోటార్స్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. కంపెనీ నిర్మించనున్న కొత్త ప్లాంట్‌లో ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం రూ.9,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. నిర్మాణం పూర్తయిన తరువాత రాష్ట్రంలో సుమారు 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్, లగ్జరీ వాహనాలతో సహా మా తర్వాతి తరం కార్లు, ఎస్‌యూవీలకు త్వరలో పూర్తికానున్న ప్లాంట్ నిలయంగా మారుతుంది. తమిళనాడు ప్రగతిశీల విధానాలతో ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా ఉంది. అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇక్కడ నుండి విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ.. వివిధ స్థాయిల్లో మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.I can proudly say that Tamil Nadu leads India in both automobile production and #EV manufacturing.With a 35% share of the nation’s total automobile output and 40% of all EVs sold, we are pivotal in shaping India’s mobility future.@TataMotors, along with industry giants like… pic.twitter.com/pdZ47rcel8— M.K.Stalin (@mkstalin) September 28, 2024 -
భారత్‌లో సిస్కో తొలి ప్లాంట్
చెన్నై: డిజిటల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలో ఉన్న యూఎస్ దిగ్గజం సిస్కో తాజాగా భారత్‌లో తొలి ప్లాంటును ప్రారంభించింది. చెన్నైలోని ఈ కేంద్రంలో రూటింగ్, స్విచింగ్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ ఫెసిలిటీ ద్వారా తమిళనాడులో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు అభిస్తాయని కంపెనీ ప్రకటించింది.ఎగుమతులతో కలుపుకుని ఏటా 1.3 బిలియన్ డాలర్ల ఆదాయ నమోదుకు అవకాశం ఉందని వెల్లడించింది. చెన్నైలో తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి, విస్తరణకు ఫ్లెక్స్‌తో సిస్కో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ప్రారంభంలో సిస్కో నెట్వర్క్ కన్వర్జెన్స్ సిస్టమ్–540 సిరీస్ రూటర్ల తయారీపై దృష్టి పెడుతుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతరాదిత్య సింధియా చేతుల మీదుగా ప్లాంటు ప్రారంభం అయింది. -
రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!
స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే మాడ్యుళ్ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ సంస్థ యోచిస్తోంది. తమిళనాడులో ప్రారంభించాలనుకుంటున్న ఈ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఒక బిలియన్ డాలర్లు(రూ.8,357 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని దేశీయంగా వాడడంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన యూనిట్ అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ చేసిన డిస్ప్లే మాడ్యూల్స్‌ను దిగుమతి చేసుకునే బదులుగా స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేయవచ్చు. దాంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, తయారీలో ఫాక్స్‌కాన్‌కు విలువ జోడిస్తుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్‌లో దాదాపు 5 శాతం రెవెన్యూ ఉత్పత్తి అయితే, డిస్ప్లే అసెంబ్లింగ్‌లో అదనంగా మరో 2-3 శాతం రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?ఫాక్స్‌కాన్ భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా అసెంబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్యలు సాగుతున్నాయి. డిస్ప్లే మాడ్యూళ్లలో ప్రధానంగా 60-65% విడిభాగాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణ కొరియా 20-25% సరఫరా చేస్తోంది. స్థానికంగా డిస్ప్లే అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైతే దిగుమతులు తగ్గి స్థానిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉన్న బీజింగ్ కంపెనీ లెనోవో.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో ఏఐ సర్వర్ల తయారీ చేపట్టనుంది. వీటిని పుదుచ్చేరి ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు.ఏటా 50,000 యూనిట్ల ఎంటర్ప్రైస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్స్, 2,400 యూనిట్ల హై ఎండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ) తయారు చేయనున్నట్టు లెనోవో ఇండియా ఎండీ శేలేంద్ర కటియాల్ తెలిపారు. వీటిలో 60 శాతంపైగా సరుకును ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతి చేస్తారు.అలాగే సంస్థకు నాల్గవ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భవిష్యత్తులో అన్ని ప్రధాన సర్వర్ డిజైన్, డెవలప్మెంట్స్, కొత్త సాంకేతిక కార్యక్రమాలను ఈ ల్యాబ్‌లో నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇటువంటి సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 18 ఉన్నాయి. -
హెజ్బొల్లా క్షిపణి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
మస్యాఫ్: సిరియాలోని హెజ్బొల్లా క్షిపణి తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు దాడి చేశాయి. లెబనాన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉన్న మస్యాఫ్ నగర సమీపంలో సోమవారం చేపట్టిన ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. దాడి చిత్రాలను అమెరికా మీడియా బయట పెట్టడంతో వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలోని ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. వైమానిక దళానికి చెందిన ఎలైట్ షాల్డాగ్ యూనిట్ బలగాలు హెలికాప్టర్ల నుంచి దిగి, ఇరాన్ నిర్మించిన కేంద్రంలో పేలుడు పదార్థాలను అమర్చాయి. ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెజ్బొల్లాకు క్షిపణుల సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అపరేషన్పై ముందుగానే అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. -
SEMICON India 2024: ప్రపంచమంతా ఇండియా చిప్‌లు
గ్రేటర్ నోయిడా: దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం నోయిడాలో ‘సెమీకాన్–2024’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ 150 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీకండక్టర్ రంగం లబ్ధి పొందుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ పరికరాలు వంద శాతం ఇక్కడే తయారు కావాలన్నది తమ ధ్యేయమన్నారు. 85 వేల మందికి శిక్షణ భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో చిప్‌లకు డిమాండ్ తగ్గినా, భారత్‌లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో భారత్‌లో తయారైన చిప్ ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85 వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీరిలో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్అండ్డీ నిపుణులు ఉంటారని వెల్లడించారు. ప్రపచంలో ఎక్కడా కనిపించని 3డీ పవర్(త్రి–డైమెన్షనల్ పవర్) ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. -
తయారీ కేంద్రంగా భారత్!.. చెప్పడం సాహసమే
వారానికి 72 గంటల పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చైనాను భారత్ అధిగమిస్తుందని పలువురు నిపుణులు చెబుతుంటే.. తయారీ రంగంలో ఇండియా చైనాని దాటాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాలని 'ఈఎల్‌సీఐఏ టెక్ సమ్మిట్ 2024'లో పేర్కొన్నారు.ఇండియా సామర్థ్యం మీద సందేహంగా ఉంది. ఇప్పటికే చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ డిపోలలోని దాదాపు 90 శాతం వస్తువులు చైనాలో తయారైనవే ఉన్నాయి. అవన్నీ భారత్ జీడీపీకి ఆరు రెట్లు. కాబట్టి ఈ సమయంలో మన దేశం చైనాను అధిగమిస్తుందని చెప్పడం సాహసమనే చెప్పాలి అని నారాయణ మూర్తి అన్నారు.ఐటీ రంగ ఎగుమతుల్లో భారత్ వృద్ధి సాధిస్తుండగా.. తయారీ రంగం మాత్రం దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతు వంటి వాటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమని నారాయణ మూర్తి అన్నారు. ఇది మెరుగుపడాలంటే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచారం లోపాలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేయాలి, అప్పుడే తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు. -
ఖండాంతరాలు దాటిన ఇండియన్ కంపెనీ.. బ్రెజిల్లో కొత్త ప్లాంట్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' బ్రెజిల్లో కొత్త ప్లాంట్ ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయంతో కంపెనీ సంవత్సరానికి 20,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే వంద దేశాల్లో కంపెనీ తన వాహనాలను విక్రయిస్తోంది. ఈ కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి మరిన్ని దేశాలకు బజాజ్ వాహనాలు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్లకు విస్తరించనున్నట్లు సమాచారం. ఇందులో కేవలం వాహనాలు మాత్రమే కాకుండా వాహనాలకు కావలసిన విడి భాగాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రారంభంలో కంపెనీ బజాజ్ డామినర్ బైకులను మాత్రమే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి చేసిన డామినార్ బైకులు లాటిన్ అమెరికన్ మార్కెట్లలో విక్రయించనున్నారు. కంపెనీ సొంత ప్లాంట్ ఏర్పాటు చేయడంతో.. ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కస్టమర్లకు త్వరితగతిన వాహనాలను డెలివరీ చేయవచ్చని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో బ్రెజిల్లో మోటార్‌సైకిల్ అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డేటా ప్రకారం, 2024లో దక్షిణ అమెరికా మోటార్‌సైకిల్ మార్కెట్ భారీగా పుంజుకుంది. భారతదేశంలో కూడా బజాజ్ ఆటో అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్లడించింది. -
లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేశరాజధాని సియోల్ దగ్గర్లోని హవాసియాంగ్ సిటీలో ఎరీసెల్ కంపెనీకి చెందిన లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది. సోమవారం ఉదయం 10.30గంటలపుడు 102 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో అక్కడి కొన్ని బ్యాటరీలు పేలాయి. దీంతో రెండో అంతస్తుల్లో మంటలంటుకుని ఫ్యాక్టరీలో దావానంలా వ్యాపించాయి. దీంతో 22 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో 18 మంది చైనా కార్మికులు ఉన్నారు. తయారైన బ్యాటరీలను తనిఖీచేసి ప్యాక్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే పేలుడుకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒకరి జాడ తెలీడంలేదు. ఘటనాస్థలిని ప్రధాని హాన్ డ్యూక్ సో సందర్శించారు. -
సెమీకండక్టర్స్ తయారీలోకి జోహో
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో తాజాగా సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కంపెనీ ప్రోత్సాహకాలు కోరుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జోహో ప్రతిపాదనను ఐటీ శాఖ కమిటీ పరిశీలిస్తోందని, వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టతనివ్వాలని కంపెనీని కోరిందని వివరించాయి. జోహో ఇప్పటికే టెక్నాలజీ భాగస్వామిని కూడా ఎంచుకున్నట్లు తెలిపాయి. 1996లో ఏర్పాటైన జోహో .. గత ఆర్థిక సంవత్సరం 1 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసింది. తమిళనాడులో చిప్ డిజైన్ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు మార్చిలో వెల్లడించిన నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్, సీజీ పవర్ తదితర సంస్థలకు కేంద్రం ఫిబ్రవరిలో గ్రీన్ సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్ 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. -
ఆంధ్రప్రదేశ్‌కు టెస్లా!?
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ నెలకొల్పాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెస్లా యాజమాన్యానికి ఇప్పటికే రెండు ఈ-మెయిల్స్ పంపామని, స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టెస్లా కంపెనీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని తెలియజేసింది. ఒకవేళ టెస్లా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా సహకారం అందించనున్నట్లు భరోసా ఇచ్చింది. అనంతపురం జిల్లాలో.. “రాష్ట్రాన్ని సందర్శించి, వారి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించాలని టెస్లాను ఆహ్వానించాం. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని, వారు తమ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కావాల్సిన చోట భూమిని ఇస్తామని చెప్పాం. చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో ఉన్నందున అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ సమీపంలో భూములను ప్రతిపాదించాం. ఇది బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అలాగే చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండాలనుకుంటే నాయుడుపేట, శ్రీ సిటీ సమీపంలో భూములు పరిశీలించవచ్చు" అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉటంకించింది. ఎన్నికల తర్వాత.. టెస్లా బృందం రాష్ట్రానికి వచ్చి వారి అవసరాలకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే వారికి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ పార్టీల నుంచి భూమిని కొనుగోలు చేసైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారి వివరించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెస్లా బృందాలు ఆంధ్రప్రదేశ్‌కి వస్తాయన్నారు. ప్లాంట్ నిర్మాణానికి 2,500 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. మస్క్ ప్రధానిని కలుస్తున్నప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్చల ఫలితం బయటకు రాదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, 2021, 2022 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించింది. ఇప్పుడు మరోసారి మస్క్ భారతదేశ పర్యటన గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
మనల్నీ మోసుకెళ్తుంది!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో.. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత.. 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్‌లోకి, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీని ఇస్రో చేపట్టింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఎన్జీఎల్వీ రాకెట్‌లోని అన్ని దశలను విడివిడిగా ప్రయోగించి.. పరీక్షించనుంది. 2028 నాటికల్లా మొదటి టెస్ట్ వెహికల్‌ను, దాని సామర్థ్యాన్ని పరీక్షించి.. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎన్జీఎల్వీ రాకెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు.. ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► రాకెట్ వెడల్పు 5 మీటర్లు ► దశల్లోనే రాకెట్ ప్రయోగం ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► ఇది ఫాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030–35 నాటికి మానవ సహిత అంతరిక్షయానం, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. షార్‌లో మూడో లాంచ్‌ప్యాడ్ షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎన్జీఎల్వీ కోసం మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో గుర్తించింది. ఇప్పటికే శ్రీహరికోటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. భవిష్యత్‌లో మ్యాన్ ఆన్ ద మూన్ ప్రయోగంతో పాటు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి.. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయో గాలు, చంద్రయాన్–4లో చంద్రుడి మీదకు రోబోను పంపించే ప్రయత్నాలు వంటి ప్రయోగాల కోసం మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమైంది. -
పండ్లకు కవర్ల కవచం
సాక్షి, అమరావతి: మామిడి, జామ, దానిమ్మ, యాపిల్, సీతాఫలంతోపాటు ప్యాషన్, డ్రాగన్ ఫ్రూట్స్ వంటివాటికి కవర్లు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. పండ్ల నాణ్యతను పెంచి రైతులకు అధిక ధరను అందిస్తున్నాయి. ప్రస్తుతం కవర్లు తొడగని బంగినపల్లి మామిడి పండ్లు టన్నుకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతుండగా... కవర్లు కట్టిన పండ్లకు రూ.80 వేల నుంచి రూ.1.10లక్షలు వరకు ధర పలుకుతోంది. కవర్లు తొడిగిన ఇతర పండ్లకు సైతం 30శాతం అదనపు ధర లభిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యాన పంటల నాణ్యతను పెంచడం ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలన్న సంకల్పంతో పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులకు హెక్టారుకు రూ.28వేలు చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రూ.1.80 కోట్లు సబ్సిడీ సొమ్మును రైతులకు ఇచ్చింది. దీంతో యాపిల్, దానిమ్మ, ద్రాక్షతోపాటు అన్ని రకాల పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులు ముందుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా సగటున 10కోట్ల కవర్లు దిగుమతి చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉద్యానపంటలు సాగుచేసే రైతులే 3కోట్లకుపైగా కవర్లు వినియోగిస్తున్నారు. తెగుళ్లు.. చీడపీడలకు చెక్ సాధారణంగా పిందె, కాయ మీద వర్షం లేదా మంచు పడితే వాటిని శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, తామర (త్రిప్స్), పెంకు పురుగులు దాడి చేస్తుంటాయి. వీటి నివారణ కోసం 10 నుంచి 15సార్లు మందుల పిచికారీ కోసం పంటను బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడి, గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పండ్లకు కవర్లను అమర్చటం వల్ల తెగుళ్లు, చీడపీడలకు చెక్ పెట్టగలుగుతున్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా.. అమర్చేందుకు మరో రూపాయి ఖర్చవుతోంది. 10 నుంచి 15 ఏళ్ల వయసుగల తోటలకు 60 నుంచి 70శాతం, ముదురు తోటల్లో 30 నుంచి 40శాతం కాయలకు కవర్లు కట్టగలుగుతున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న బంగినపల్లితోపాటు రసాలు, సువర్ణరేఖ తదితర మామిడి రకాలకు కవర్లను అమరుస్తున్నారు. రాయలసీమలో దానిమ్మ, జామ, డ్రాగన్ ఫ్రూట్, గోదావరి జిల్లాల్లో సీతాఫలం పండ్లకు కవర్లు కడుతున్నారు. నిమ్మకాయ సైజులోకి వచ్చిన తర్వాత కవర్లు కట్టి కనీసం 40 రోజులపాటు ఉంచితే కాయపై మచ్చలు ఏర్పడవు. వర్షం నీరు కాయకు తాకకుండా కిందికి జారిపోతుంది. ఈదురు గాలులవేళ కాయ రాలడం కూడా ఉండదు. 90 శాతం చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. కాయల సైజు కూడా కనీసం 20–25 శాతం పెరుగుతుంది. నాణ్యంగా, ఆకర్షణీయంగా మంచి రంగుకొస్తాయి. తొలి కవర్ల తయారీ యూనిట్ ఏపీలోనే.. కవర్లు కట్టే విధానం ఏపీలో శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు 12 రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్రంలో 2వేల టన్నుల పండ్లకు కవర్లు కడుతున్నారు. రానున్న ఐదారేళ్లలో కనీసం లక్ష టన్నులకు కవర్లు కట్టించాలన్న సంకల్పంతో ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. నాలుగేళ్లుగా తైవాన్, చైనా నుంచి కవర్లను దిగుమతి చేసుకుంటుండగా.. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ రూ.10కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ కంపెనీని ఏర్పాటు చేసింది. విదేశాల్లో మంచి డిమాండ్ కవర్లు కట్టిన కాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మా కంపెనీ ఏటా 50 టన్నుల వరకు యూరప్, యూకే, యూఎస్ఏ దేశాలకు ఎగుమతి చేస్తోంది. డిమాండ్‌కు తగినట్లుగా కవర్లు కట్టిన కాయలు దొరకడం లేదు. – ఉండవల్లి రాజు, యజమాని, మధురమ్స్ లిమిటెడ్ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం ఉద్యాన పంటలకు మంచి ధర లభించేందుకు ఫ్రూట్ కవర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ యూనిట్ ఆగిరిపల్లిలో ఏర్పాటుచేశాం. గతేడాది ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభించాం. రోజుకు 2.50లక్షల కవర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కనీసం లక్ష టన్నుల పండ్లకు కవర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. – శరణాల అప్పారావు, ఎండీ, ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ -
రయ్.. రయ్..
సాక్షి, అమరావతి: ఎటువంటి ప్రచార ఆర్భాటం, ఒప్పందాలు, శంకుస్థాపనలు వంటి భారీ కార్యక్రమాలు లేకుండా కోవిడ్ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించిన జపాన్‌కు చెందిన ఒక భారీ మల్టీ నేషనల్ కంపెనీ విస్తరణ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపు.. అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) పేరుతో రూ.3,079 కోట్ల భారీ పెట్టుబడితో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో రూ.1,750 కోట్ల వ్యయంతో హాఫ్ హైవే టైర్లు (భారీ యంత్ర పరికరాలకు వినియోగించే టైర్లు) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2019 నవంబర్‌లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) 2020 నవంబర్‌లో ఆమోదం తెలిపారు. వెనువెంటనే అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ భూమి కేటాయించడంతో నిర్మాణ పనులు ప్రారంభించింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన వెంటనే కరోనా సంక్షోభం తలెత్తినా, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో తొలి దశ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. 2022 జూలైలో తొలి టైరును ఉత్పత్తి చేసింది. ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 ఆగస్టు 16న వాణిజ్యపరంగా ప్రారంభించారు. రోజుకు 132 టన్నుల రబ్బరును వినియోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన టైర్లను 120కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఫ్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్సీ సెగ్మెంట్), పెద్ద బయాస్ టైర్లు (అగ్రి మరియు కాన్స్), రేడియల్ టైర్లు (అగ్రి), రేడియల్ (ఓటీఆర్), బయాస్ టైర్, ఓటీఆర్ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్ టైర్లు వంటివి తయారవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తరణ ప్రభుత్వ ప్రోత్సాహం బాగుండటంతో యకహోమా గ్రూపు ప్యాసింజర్ వాహనాల టైర్లను తయారు చేసే యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించింది. సుమారు రూ.680 కోట్ల పెట్టుబడితో ప్యాసింజర్ కారు టైర్ల తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశీయ ప్యాసింజర్ కార్లకు డిమాండ్ భారీగా పెరగడంతో దానికి తగ్గట్టుగా ఏటా 17 లక్షల టైర్ల తయారీ సామర్థ్యంతో విస్తరణ పనులు మొదలు పెట్టింది. ఈ యూనిట్‌ను 2024 చివరి త్రైమాసికానికి అందుబాటులోకి తీసుకు రావాలని యకహోమా గ్రూపు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం 28 లక్షల టైర్లుగా ఉన్న ఏటీసీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 45 లక్షల టైర్లకు చేరుకోనుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూనిట్లో 22 అంగుళాల వరకు ఉండే టైర్లను ఉత్పత్తి చేస్తారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, 2022లో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందని, ఇదే రకమైన వృద్ధి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని యకహోమా అంచనా వేస్తోంది. 2007లో 7 లక్షల టైర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇండియాలో అడుగుపెట్టిన ఈ గ్రూపు వేగంగా విస్తరిస్తోంది. ఇండియాలో ఇప్పటికే రెండు యూనిట్లు.. తిరువన్వేలి, దహేజ్ల్లో ఉండగా, మూడవ యూనిట్‌ను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ పూర్తి స్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే 2,300 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 75 శాతం మంది స్థానికులకే ఉపాధి కల్పించనున్నారు. ఇందుకోసం స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసుకొని శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 1000 మందికిపైగా పని చేస్తుండగా, విస్తరణకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ మద్దతు ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు అందించింది. ఏపీఐఐసీ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు పూర్తిగా సహకరించారు. నిర్దేశించుకున్న గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. – ప్రహ్లాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఏటీసీ టైర్స్ యకహోమా ఉద్యోగి కావడం ఆనందంగా ఉంది జపాన్‌కు చెందిన యకహోమా ఆఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఉద్యోగిగా ఉండటం పట్ల చాలా ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్లో నేను ఏటీసీ టైర్స్‌లో ఉద్యోగం పొందాను. యకహోమా కుటుంబ సభ్యుడిగా సొంత రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. – లాబాల పవన్ కళ్యాణ్, టైర్ బిల్డింగ్–ప్రొడక్షన్, ఏటీసీ టైర్స్ -
2025 కల్లా గిగా ఫ్యాక్టరీ: అమర రాజా బ్యాటరీస్
ముంబై: ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ 2025 ఆఖరు కల్లా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇలాంటి వాటికి అధునాతన టెక్నాలజీ, భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని సంస్థ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల తెలిపారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) నిర్వహించిన ఇండియా బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. తొలి విడత 24 నెలల్లోగానే పూర్తి కాగలదని, దాన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం (2025) ముగిసేలోగా ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని విజయానంద్ పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో గిగా ఫ్యాక్టరీకి కంపెనీ గతేడాది మేలో శంకుస్థాపన చేసింది. ఈ ప్యాక్టరీలో లిథియం సెల్, బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయనుంది. -
భారత్‌లో టెస్లా.. ఎలాన్ మస్క్‌కి షాకిచ్చిన గుజరాత్ మంత్రి!
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి గుజరాత్ పరిశ్రమల శాఖ మంత్రి భారీ షాకిచ్చారు. గుజరాత్లో ఇతర ఆటోమొబైల్ సంస్థలకు కల్పించిన సౌకర్యాలనే టెస్లాకు ఇస్తామని అన్నారు. అంతే తప్పా టెస్లాకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వబోమని స్పస్టం చేశారు. గుజరాత్లో జనవరి 10-12 వరకు ‘వైబ్రంట్ గుజరాత్ 2014’ సమ్మిట్ జరగనుంది. ఈ తరుణంలో వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు ఎలన్ మస్క్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై మంత్రి బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ పై విధంగా స్పందించారు. ఈ సదస్సులో టెస్లా యూనిట్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే భారత్ తమకు ప్రత్యేక మినహాంపులిస్తే కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని గతంలో ఎలాన్ మస్క్ అన్నారు. తాజా, బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యాఖ్యలపై మస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని మరింత ఆసక్తికరంగా మారింది. కాగా, గుజరాత్లో ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ తయారీ యూనిట్లు ఉన్నాయి. తాజా టెస్లా రాకతో గుజారాత్‌తో పాటు ఆటోమొబైల్ రంగ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలోని సనంద్, ధోలెరా, బెచరాజీ ప్రాంతాల్లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. దేశీయంగా కార్ల విక్రయానికి, విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా గుజరాత్ రాష్ట్రంలోనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టెస్లా కార్లపై దిగుమతి సుంకాలు 15-20 శాతం తగ్గిస్తారని గత నెలలో కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. -
మారుమూల గ్రామ రైతు కొడుకు 'శాస్త్రవేత్తగా'..
భద్రాద్రి: ఓ రైతు కొడుకు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉండే బెంగళూరులోని సెంట్రల్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(సీఎంటీఐ)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లావుడ్యా ఆనంద్ ఈ ఘనత సాధించాడు. ఆనంద్ తల్లిద్రండులు లావుడ్యా ఈర్య, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా పెద్ద కుమారుడు ఆనంద్ శాస్త్రవేత్తగా ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు శాస్త్రవేత్తగా ఎంపికైన నేపథ్యంలో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విద్యాభ్యాసం.. గ్రామానికి చెందిన ఈర్యా, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు ఆనంద్ ఒకటి నుంచి 5 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. చైన్నెలో బీఈ (ఈఈఈ) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు హైదరాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకొని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ (కంట్రోల్ సిస్టమ్స్ విభాగం)లో సీటు సంపాధించాడు. ఎంటెక్ పూర్తయిన అనంతరం 2019 నుంచి 2021 వరకు కరోనా ప్రభావంతో విద్యాభ్యాసానికి కొంచెం బ్రేక్ పడింది. రాజీ లేకుండా శ్రమించి.. కరోనా సమయంలో దొరికిన విరామాన్ని ఆనంద్ వృథాగా వదిలేయకుండా శ్రమించాడు. వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా తొలిసారిగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ (బీఈఎల్)లో ట్రెయినీ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. నెల పాటు ఇక్కడ ట్రెయినీ ఇంజనీర్‌గా పనిచేసిన అనంతరం హైదరాబాద్‌లోని డీఆర్డీఓ – రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ‘రీసెర్చ్ ఫెలో’గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సీఎంటీఐలో శాస్త్రవేత్త కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అతను రాత పరీక్ష, మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికై నట్లు అపాయిమెంట్ లెటర్ రావడంతో తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇవి చదవండి: తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ -
‘చైనాకి యాపిల్ మరో భారీ షాక్!’
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీపై ఆధారపడడం ఏమాత్రం ఇష్టం లేని యాపిల్ భారత్‌లో మరో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటా గ్రూప్ నెలకొల్పనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కర్ణాటక కేంద్రంగా భారత్‌లో ఐఫోన్లను తయారు చేసే విస్ట్రాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటా గ్రూప్ 125 మిలియన్ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తమిళనాడు హోసుర్ కేంద్రంగా టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా రెండో ఐఫోన్ తయారీ యూనిట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలిపింది. ఈ ఫ్యాక్టరీలో టాటా గ్రూప్ కనీసం 20 లైన్లో ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని, తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుందని బ్లూంబెర్గ్ నివేదికలో పేర్కొంది. ఇక ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ 12 నెలల నుంచి 18 నెలల లోపల అందుబాటులోకి రానుందని అంచనా. చైనాకు భారీ షాక్ టెక్ దిగ్గజం యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫలితంగా చైనా కాకుండా మిగిలిన దేశాలైన భారత్, థాయిలాండ్, మలేషియాలలో ఐఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన టాటా కంపెనీ ఐఫోన్లు తయారు చేసుకునేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే భారత్‌లోని కర్ణాటక కేంద్రంగా ఐఫోన్లను మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తున్న విస్ట్రాన్ కార్పొరేషన్‌ను టాటా కొనుగోలు చేసేలా పావులు కదిపింది. ఈ తరుణంలో విస్ట్రాన్ కాకుండా.. టాటానే సొంతంగా ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేలా యాపిల్.. టాటా గ్రూప్‌ను ప్రొత్సహించింది. ఆ చర్చలు చివరి దశకు రావడం.. దేశీయంగా టాటా మరో ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని బ్లూమ్‌బర్గ్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం! -
ఎల్రక్టానిక్స్ తయారీ 4 రెట్లు అప్..
-
దక్షిణాదిలో తయారీ ప్లాంటు యోచనలో డాబర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ డాబర్ దక్షిణాదిలో కొత్తగా ఫ్యాక్టరీ నెలకొల్పే యోచనలో ఉంది. ఏడాదిలోపే దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. దక్షిణాదిలో తమ వ్యాపారం గడిచిన 5–6 ఏళ్లలో రెట్టింపయ్యిందని, ప్రస్తుతం మొత్తం దేశీ విక్రయాల్లో 20 శాతం వాటా ఉంటోందని ఆయన చెప్పారు. దక్షిణాది మార్కెట్లో విప్రో తదితర ఎఫ్‌ఎంసీజ తయారీ సంస్థలు ఫుడ్ సెగ్మెంట్లోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తాము కూడా ఇక్కడి మార్కెట్ కోసం కస్టమైజ్డ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మల్హోత్రా చెప్పారు. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వార్షికంగా దాదాపు రూ. 350–450 కోట్ల మేర పెట్టుబడి ప్రణాళికలున్న డాబర్ ఇండియా.. అటు అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోను తమ తయారీ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. డాబర్‌కు సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియే తదితర దేశాల్లోనూ ప్లాంట్లు ఉన్నాయి. -
ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.3,200 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వా హనాల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తాజా గా రూ.3,200 కోట్ల నిధులను అందుకుంది. టెమసెక్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపార విస్తరణకు, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి వద్ద లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఈ నిధులను వెచి్చంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం.. అలాగే గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా చేసుకుంది. ‘ఆటోమొబైల్స్ రంగంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ యుగానికి ముగింపు పలకడమే మా లక్ష్యం. అంతర్జాతీయంగా ఈవీ హబ్‌గా మారే దిశగా భారత ప్రయాణంలో కంపెనీ నెలకొల్పుతున్న గిగాఫ్యాక్టరీ పెద్ద ముందడుగు. ఈవీలు, సెల్ విభాగంలో ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్థిర మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లడానికి తయారీని పరుగులు పెట్టిస్తున్నాం’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. -
పార్టీ ఏదైనా..జెండా తయారయ్యేది అక్కడే
-
కేసియో వాచీల తయారీ ఇక భారత్‌లోనూ..
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం కేసియో భారత్‌లో తమ వాచీల తయారీపై దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నుంచి దేశీయంగా ఉత్పత్తి ప్రారంభం కాగలదని కేసియో ఇండియా ఎండీ హిడెకి ఇమాయ్ తెలిపారు. స్థానిక భాగస్వామితో కలిసి పని చేస్తున్నామని, ప్రస్తుతం నాణ్యతపరమైన మదింపు జరుగుతోందని ఆయన చెప్పారు. 2023 ఆఖరు నాటికి మేడిన్ ఇండియా శ్రేణి వాచీలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హిడెకి వివరించారు. అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో తమ వ్యాపార వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాబోయే అయిదేళ్లలో భారత విభాగం అత్యధిక వృద్ధి సాధించగలదని హిడెకి ధీమా వ్యక్తం చేశారు. కేసియోకి చెందిన జీ–షాక్, వింటేజ్ కలెక్షన్, ఎన్‌టైసర్ తదితర బ్రాండ్స్ వాచీల ధరలు రూ. 1,500 నుంచి రూ. 3 లక్షల వరకు ఉన్నాయి. -
హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Honor Comeback: హానర్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మళ్లీ భారత్ మార్కెట్లోకి రానున్నాయి. చైనా స్మార్ట్ డివైజెస్ సంస్థ హానర్ నుంచి లైసెన్సు పొందిన హానర్‌టెక్ కంపెనీ వీటిని సెపె్టంబర్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. హానర్‌టెక్ సీఈవో మాధవ్ సేథ్ ఈ విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి 4-5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు, తద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు. హానర్‌టెక్ పూర్తిగా భారత సంస్థ అని, హానర్ నుంచి తీసుకున్న లైసెన్సుతో ఇక్కడే తయారీ నుంచి అమ్మకాల కార్యకలాపాలు నిర్వహించనున్నామని సేథ్ చెప్పారు. చైనా టెలికం దిగ్గజం హువావే అప్పట్లో హానర్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2020లో మరో చైనా సంస్థకు దాన్ని విక్రయించింది. మరోవైపు, రియల్‌మి అంతర్జాతీయ వ్యాపారానికి సారథ్యం వహిస్తున్న సేథ్ ఇటీవలే దాన్నుంచి తప్పుకున్నారు. వ్యాపారవేత్త సీపీ ఖండేల్వాల్కి చెందిన పీఎస్ఏవీ గ్లోబల్‌తో కలిసి హానర్టెక్ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశారు. -
40 సెకన్లకు ఓ కారు తయారీ.. ఎక్కడో తెలుసా?
ప్రపంచ మార్కెట్లో టెస్లా సంస్థకు చెందిన వాహనాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కంపెనీ త్వరలో భారతదేశంలో కూడా అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే చైనాలోని షాంఘైలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో 40 సెకన్లకు ఒక ఈవీ తయారవుతుందని తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో ప్రతి 40 సెకన్లకు ఒక ఏకక్ట్రిక్ కారు తయారవుతుందని, దీనికి సంబంధించిన ఒక ట్విటర్ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో కంపెనీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రొడక్టివిటీ వంటి వాటికి సంబంధించినవి చూడవచ్చు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి టెస్లా కంపెనీకి అమెరికాలో ఒక మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా బయట చైనాలో మాత్రమే ఫ్యాక్టరీ ఉన్నట్లు సమాచారం. ఇక్కడ సంస్థ కేవలం రెండు మోడల్స్‌ని మాత్రమే తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండూ కూడా చౌకైన కార్లుగా పరిగణిస్తారు. ఇప్పటికే కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ అనేక సార్లు సిబ్బందిని చాలా సార్లు మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. #Didyouknow that at #Shanghai's #Tesla Gigafactory, they can produce a #car in less than 40 seconds? 🤔Curious to see how they achieve such speed? Let's dive into the working environment!@Tesla @Tesla_Asia pic.twitter.com/FWXe7TxGYq — Shanghai Let's meet (@ShLetsMeet) July 25, 2023 -
రూ. 8,200 కోట్లతో మేఘా ఈవీ ప్లాంటు! బీవైడీతో కలిసి ఏర్పాటు యోచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ ఫెసిలిటీని స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే ప్లాంటుకు కావాల్సిన స్థలం, ఇతర సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఈఐఎల్, బీవైడీ సంప్రదించనున్నాయి. ప్రతిపాదిత ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ప్లాంటు కోసం ఇరు సంస్థలు కలిసి సుమారు రూ.8,200 కోట్లు వెచ్చించనున్నాయి. మేఘా అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే బీవైడీ సాంకేతిక భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్‌లను తయారు చేస్తోంది. అలాగే తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్‌ల తయారీకై 150 ఎకరాల స్థలాన్ని ఒలెక్ట్రా కొనుగోలు చేసింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్) అత్యాధునిక రీతిలో ఏటా 10,000 ఈ–బస్‌లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ఎలక్ట్రిక్ టిప్పర్ల తయారీలోకి సైతం ఒలెక్ట్రా ఎంట్రీ ఇచ్చింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలనూ పరిచయం చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇది కూడా చదవండి: Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం -
ఈవీలపై రూ.30,000 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేమ్ సబ్సిడీ నిలిపివేతతో ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ కంపెనీలు కార్యకలాపాల పునరుద్ధరణ, కొనసాగడానికి రూ.3,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) ప్రభుత్వాన్ని కోరింది. సొసైటీ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి కంపెనీలకు రూ.1,200 కోట్లకుపైగా సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని లేఖలో ప్రస్తావించింది. 18 నెలలుగా ఈ మొత్తాల కోసం పరిశ్రమ ఎదురు చూస్తోందని గుర్తుచేసింది. ఆర్థిక ఒత్తిడి నుండి కంపెనీలు చాలా వరకు బయటకు రాలేవని సొసైటీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ‘ఒకవేళ బకాయిలు చెల్లించిన తర్వాత వచ్చే ఒకట్రెండేళ్లు కంపెనీలు నిలదొక్కుకోవడానికి పునరావాస నిధి ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలి. సబ్సిడీ పథకం పతనం కారణంగా కార్యకలాపాలతోపాటు విక్రయాలు నిలిచిపోయాయి. కస్టమర్లు బుకింగ్స్‌ను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. డీలర్‌షిప్‌లపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది’ అని లేఖలో వెల్లడించారు. పెట్టుబడులకు విముఖత కోల్పోయిన పనిదినాలు, అవకాశాల నష్టం, మార్కెట్ వాటా క్షీణత, పరిశ్రమ ఇమేజ్ దెబ్బతినడం.. సమిష్టిగా ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయిక అంచనా ప్రకారం పరిశ్రమకు రూ.30,000 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని గిల్ తన లేఖలో ప్రస్తావించారు. ‘తయారీ సంస్థలకు వ్యతిరేకంగా తరచుగా జరుగుతున్న వ్యతిరేక చర్యల కారణంగా ఈ రంగంపై పెట్టుబడిదారులు తీవ్ర విముఖత చూపుతున్నారు. బ్యాంకులు కూడా నిజానికి రుణాన్ని విస్తరించడానికి ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించలేనందున బ్యాంకులు అనుషంగిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. పునరావాస నిధి గ్రాంట్ లేదా రుణదాతలకు గ్యారెంటీ మెకానిజమ్‌గా పని చేసే సబ్వెన్షన్ పథకం రూపంలో ఉండాలి. -
రూ.500 కోట్లతో వోల్టాస్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిఫ్రిజిరేటర్లు, ఏసీల తయారీలో ఉన్న వోల్టాస్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూమ్ ఏసీల తయారీ కోసం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో కేంద్రాన్ని స్థాపించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. టాటా గ్రూప్ కంపెనీ అయిన వోల్టాస్‌కు ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఒకటి, గుజరాత్లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో సుమారు 1500 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారతీయులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా టెస్లా కార్ల తయారీ సంస్థను ఏర్పాటు చేసేలా ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటామని తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎలాన్ మస్క్‌ను న్యూయార్క్ టైమ్స్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ థోరాల్డ్ బార్కర్ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. అందుకు మస్క్ ‘ఓ అబ్సల్యూట్లీ’ అంటూ సుమఖత వ్యక్తం చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా భారత్‌లో టెస్లా కార్ల తయారీపై నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. భారత్‌లో టెస్లా ప్రతినిధుల పర్యటన కొద్ది రోజుల క్రితం టెస్లా సీనియర్ ఉన్నతోద్యోగులు భారత్‌లో పర్యటించనున్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని, ఈ సందర్భంగా టెస్లా కార్ల తయారీలో ఉపయోగించే విడిభాగాల గురించి చర్చిస్తారని బ్లూంబెర్గ్ నివేదించింది. ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తుందా? కాగా, భారత్‌లో పర్యటించే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ విభాగంలో నిపుణులు(సీ- సూట్ ఎగ్జిక్యూటీవ్)లు, మేనేజర్లు ఉన్నారని బ్లూంబెర్గ్ పేర్కొంది. అయితే టెస్లా ప్రతినిధులు విదేశాల నుంచి భారత్‌కు దిగుమతయ్యే కార్లపై విధించే ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని మోదీని కోరనున్నారని హైలెట్ చేసింది. చదవండి👉రికార్డ్ల రారాజు.. ఎలాన్ మస్క్ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్ -
పారిశ్రామికోత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి మార్చిలో మందగించింది. విద్యుత్, తయారీ రంగాల పేలవ పనితీరుతో అయిదు నెలల కనిష్టానికి పడిపోయి.. 1.1%గా నమోదైంది. చివరిసారిగా 2022 అక్టోబర్‌లో అత్యంత తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. అప్పట్లో ఐఐపీ 4.1% క్షీణించింది. గతేడాది మార్చిలో ఇది 2.2% కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) డేటా ప్రకారం ... ► విద్యుదుత్పత్తి రంగం 6.1 శాతం వృద్ధి నుండి 1.6 శాతం క్షీణత నమోదు చేసింది. ► తయారీ రంగం వృద్ధి 1.4 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది. ► మైనింగ్ రంగం ఉత్పత్తి 3.9 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 2.4 శాతం నుంచి 8.1 శాతానికి ఎగిసింది. ► ప్రైమరీ గూడ్స్ వృద్ధి గత మార్చిలో 5.7% ఉండగా ప్రస్తుతం 3.3%గా నమోదైంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 3.1 శాతం నుంచి మైనస్ 8.4 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ తాజాగా మైనస్ 3.1%కి చేరింది. ► ఇన్ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల వృద్ధి 5.4 శాతంగా ఉంది. గత మార్చిలో ఇది 6.7 శాతం. ► 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 11.4%. -
దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ
న్యూఢిల్లీ: లిథియం అయాన్ సెల్ తయారీలో దేశంలో తొలి ప్లాంటు బెంగళూరు సమీపంలో ప్రారంభం అయింది. బ్యాటరీ టెక్నాలజీ స్టార్టప్ లాగ్9 మెటీరియల్స్ దీనిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం తొలి దశ సామర్థ్యం 50 మెగావాట్ అవర్. ‘దేశీయ మార్కెట్ కోసం సెల్స్‌ను భారత్‌లో రూపొందించాం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు ఇక్కడి వాతావరణ పరిస్థితులు, కస్టమర్లకు అనువుగా ఉంటాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయం చేస్తూ భారత్‌ను స్వావలంబన చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాం’ అని లాగ్9 కో–ఫౌండర్, సీఈవో అక్షయ్ సింఘాల్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ బ్యాటరీలు 3,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించారు. 20కిపైగా నగరాల్లో విస్తరించినట్టు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
టెక్నో కొత్త పెయింట్స్ ప్లాంట్స్.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యరో: పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ రూ. 46 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ఈ ఏడాదే నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద ఇవి రానున్నాయి. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్ తయారు చేస్తారు. తొలి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్ టన్నులని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాం. 2023లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విస్తరిస్తాం. విక్రయ కేంద్రాల్లో కలర్ బ్యాంక్స్ పరిచయం చేస్తాం. వీటితో వినియోగదారు కోరుకున్న రంగును వెంటనే అందించవచ్చు. 2022–23లో 100 శాతం వృద్ధి సాధించాం’ అని వివరించారు. -
హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్నాటకలోని నర్సాపుర ప్లాంటులో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు వెల్లడించింది. ఈ ఫెసిలిటీ నుంచి తొలి రెండు ఎలక్ట్రిక్ మోడళ్లు 2023–24లో రోడ్డెక్కనున్నాయి. మధ్యస్థాయి మోడల్‌తోపాటు వాహనం నుంచి వేరు చేయగలిగే బ్యాటరీతో సైతం ఈవీ రానుంది. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) 2030 నాటికి 10 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. బ్యాటరీ, మోటార్, పీసీ యూ వంటి కీలక విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సు షి ఒగటా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6,000 కంపెనీ టచ్ పాయింట్లలో చార్జింగ్ సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఫిల్లింగ్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, ఇతర ప్రాంతాల్లో సైతం బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నారు. రెండు కొత్త మోడళ్లు.. గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంటులో స్కూటర్ల తయారీకై కొత్త లైన్‌ను జోడించనున్నట్టు ఒగటా వెల్లడించారు. తద్వారా అదనంగా 6 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం తోడవుతుందని చెప్పారు. నర్సాపుర ప్లాంటు నుంచి యాక్టివా స్కూటర్ల తయారీని గుజరాత్ ప్లాంటుకు బదిలీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా 160 సీసీ బైక్, 125 సీసీ స్కూటర్‌ను మూడు నెలల్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. పండగల సీజన్ నాటికి 350 సీసీ బైక్ ఒకటి రానుంది. (జోస్ అలుకాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాధవన్) కాగా, భారత్‌లో కంపెనీకి ఉన్న నాలుగు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 52 లక్షల యూనిట్లు. 2022–23లో హెచ్ఎంఎస్ఐ దేశీయంగా 40 లక్షల పైచిలుకు ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం కంపెనీ 18 మోడళ్లను 38 దేశాలకు ఎగుమతి చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 మోడళ్లను 58 దేశాలకు చేర్చాలన్నది సంస్థ ఆలోచన. అంతర్జాతీయంగా 2040 నాటికి ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ మోడళ్ల విక్రయాలు 100 శాతానికి చేర్చాలన్నది హోండా ధ్యేయం. -
లోకేష్ మెషీన్స్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఎన్సీ మెషీన్స్, వాహన విడిభాగాల తయారీలో ఉన్న లోకేష్ మెషీన్స్ రక్షణ, అంతరిక్ష రంగ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలోకి కాలకల్ వద్ద 11 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.100 కోట్ల వ్యయం చేయనుంది. 4–6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ కోసం నూతన కేంద్రంలో చిన్న, మధ్యతరహా ఆయుధాలను తయారు చేస్తాం. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 800 మందికి ఉపాధి లభిస్తుంది. రెండవ దశలో మరో రూ.150 కోట్లు వెచ్చిస్తాం. ప్రతిపాదిత ఫెసిలిటీ పక్కన 3 ఎకరాల్లో వెండార్ పార్క్ ఏర్పాటు చేస్తాం. విడిభాగాల తయారీలో ఉన్న 8 యూనిట్లు ఈ పార్క్‌లో వచ్చే అవకాశం ఉంది. లోకేష్ మెషీన్స్ ఆర్డర్ బుక్ రూ.250 కోట్లుంది. 2021–22లో రూ.201 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–30 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. మేడ్చల్ కేంద్రంలో కంపెనీ కొత్త విభాగాన్ని లోకేష్ మెషీన్స్ ఎండీ ఎం.లోకేశ్వర రావు సమక్షంలో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. -
తోలు పరిశ్రమల జాడేదీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు. లెదర్ ఉత్పత్తులకు అవకాశం మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్‌క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌ఎల్‌ఐపీసీ (తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో లెదర్ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది. నిధులు విడుదలవక.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు. కబ్జాలకు గురవుతున్న భూములు పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి. – కొలుగూరి విజయ్‌కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
చైనాను వద్దనుకొని భారత్‌కు వచ్చేస్తోంది?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థ చైనాను విడిచేసేందుకు సిద్ధమైంది. భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ సంస్థ సుమారు 700 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా-చైనా మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పై బెలూన్ కూల్చేవేతతో అమెరికాపై చైనా మండిపడుతుంటే .. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యాకు సాయం చేస్తే చైనాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా రెడీ అవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వివాదం తమ వ్యాపారానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని పలు దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. అందుకే చైనాలో ఉండి వ్యాపారం చేయడం ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. చైనాలో ఉంటే అన్నీ ఆటంకాలే ఈ తరుణంలో చైనాలో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు దిగ్గజ కంపెనీలు డ్రాగన్ కంట్రీని విడిచి పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వరల్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థగా ఫాక్స్‌గాన్‌కు పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. చైనాలో పరిస్థితులు, ఇతర దేశాలతో వైరం కారణంగా ఆ సంస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడమే గాక.. భారీగా నష్టాల్ని మూటగట్టుకుంటుంది. అందుకే చైనా నుంచి మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను భారత్‌కు తరలించాలని చూస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఎయిర్ పోర్ట్ సమీప ప్రాంతంలో 300 ఎకరాల్లో ఐఫోన్ విడి భాగాల తయారీ యూనిట్‌ను నెలకొల్పే యోచనలో ఉందంటూ ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. లక్షమందికి ఉపాధి యాపిల్‌తో పాటు ఇతర అమెరికన్ బ్రాండ్లు చైనాకు గుడ్‌బై చెప్పి ప్రత్యామ్నాయంగా ఉన్న భారత్‌తో పాటు ఏసియన్ కంట్రీ వియాత్నంలలో తన కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక భారత్‌లో ఫాక్స్‌కాన్ నెలకొల్పబోయే తయారీ యూనిట్ కారణంగా లక్ష మంది ఉపాధి కలగనుంది. ప్రస్తుతం ఆ సంస్థ చైనా నగరం జెంగ్జౌ ఫాక్స్‌కాన్‌కు చెందిన ఐఫోన్ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా..ప్రత్యేక సందర్భంగాల్లో తయారీని పెంచేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకుంటుంది. పునరాలోచనలో యాపిల్ ప్రస్తుతం వైరస్ విజృంభణతో కోవిడ్-19 ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. దీంతో జెంగ్ జౌ ఫాక్స్‌కాన్ ప్లాంట్ తయారీలో ఉద్యోగులు సెలవులో ఉండగా.. చైనాలో ఐఫోన్లను తయారు చేసే విషయంలో యాపిల్ పునఃపరిశీలిస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.యాపిల్ నిర్ణయానికి కొనసాగింపుగానే ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఎంత వీలైతే అంత తొందరుగా భారత్‌లో ప్లాంట్ నెలకొల్పనున్నట్లు సమాచారం. కాగా, ఫాక్సాకాన్ను చైనా నుంచి భారత్‌కు తరలించే విషయంలో ఇప్పటి వరకు ఆ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. ఫాక్సాకాన్, యాపిల్ తోపాటు ఇటు కర్ణాటక ప్రభుత్వం సైతం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల తయారీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
భారత్‌లో రెనో–నిస్సాన్ రూ. 5,300 కోట్ల పెట్టుబడులు
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో–నిస్సాన్ భారత్‌లో సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,300 కోట్లు) ఇన్వెస్ట్ చేయను న్నాయి. రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఆరు కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. అలాగే చెన్నైలోని తమ ప్లాంటును కూడా అప్‌గ్రేడ్ చేయనున్నాయి. నిస్సాన్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా ఈ విషయాలు తెలిపారు. రెనో ఇండియా కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని నోడల్ ఏజెన్సీ గైడెన్స్ బ్యూరో ఎండీ విష్ణు వేణుగోపాల్, గుప్తా ఇచ్చిపుచ్చుకున్నారు. రెనో–నిస్సాన్ అనేది ఫ్రాన్స్‌కి చెందిన రెనో, జపాన్‌కి చెందిన నిస్సాన్ కంపెనీల జాయింట్ వెంచర్. కొత్తగా వచ్చే వాహనాల్లో నాలుగు ఎస్‌యూవీలు ఉంటాయి. వీటిలో మొదటిది 2025 నాటికి మార్కెట్లోకి రానుందని గుప్తా చెప్పారు. దేశీయంగా ప్రవేశపెట్టే ఆరు వాహనాల్లో నిస్సాన్, రెనోవి చెరో మూడు వాహనాలు ఉంటాయి. తాజా పెట్టుబడులతో కొత్తగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని గుప్తా ఈ సందర్భంగా వివరించారు. పునర్వ్యవస్థీకరణ.. జాయింట్ వెంచర్లో సమాన వాటాదార్లుగా ఉండేలా రెండు సంస్థలు భారత్‌లో తమ తయారీ, ఆర్అండ్డీ విభాగాల్లో పెట్టుబడుల స్వరూపంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. దీని ప్రకారం జేవీలో నిస్సాన్ వాటా 70 శాతం నుంచి 51 శాతానికి తగ్గనుండగా రెనో వాటా 30 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. తమ చెన్నై తయారీ కేంద్రాన్ని 2045 నాటికల్లా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌తో నడిచేలా తీర్చిదిద్దనున్నట్లు గుప్తా వివరించారు. భారత మార్కెట్‌కు రెనో, నిస్సాన్ కట్టుబడి ఉన్నాయని నిస్సాన్ రీజియన్ చైర్పర్సన్ (ఆఫ్రికా తదితర ప్రాంతాలు) గిలోమ్ తెలిపారు. -
దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ప్రారంభించిన మోదీ..
బెంగళూరు: కర్ణాటక తుమకూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. PM Shri @narendramodi dedicates HAL helicopter factory to the nation in Tumakuru, Karnataka. pic.twitter.com/dqAZMsJXnI — BJP (@BJP4India) February 6, 2023 మోదీ శంకుస్థాపన చేసిన హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దది. 615 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో మొదటగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(తేలికపాటి హెలికాప్టర్లు) మాత్రమే తయారు చేస్తారు. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. మూడు టన్నుల బరువుండే ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను అత్యంత సులభంగా నడపవచ్చు. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం నుంచి తొలుత ఏడాదికి 30 హెలికాప్టర్లు ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ఏడాదికి 60, 90 హెలికాప్టర్లను తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ కేంద్రం నుంచి 3-15 టన్నుల బరువుగల 1000 హెలికాప్టర్లను తయారు చేయాలని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 20 ఏళ్లలో రూ.4లక్షల కోట్ల వ్యాపారం చేయాలని భావిస్తోంది. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
రాణి వెడలె.. బై బై బోయింగ్ 747
విమానయాన చరిత్రలో మహరాణిగా వెలుగొందిన బోయింగ్ 747 విమానం కథ కంచికి చేరింది. 50 ఏళ్లకు పైగా అద్భుతమైన సేవలతో అలరించిన ఈ విమానాల తయారీని బోయింగ్ నిలిపేసింది. చిట్టచివరి విమానం డెలివరీ కూడా తాజాగా జరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 పై చిలుకు బోయింగ్ 747లు సేవలందిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా మూలకు పడ్డ అనంతరం ఈ ముచ్చటైన మోడల్ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి జారుకుంటుంది... 1968, సెప్టెంబర్ 30 అమెరికాలోని వాషింగ్టన్ ఎవెరెట్టెలో కంపెనీ ప్లాంట్ బోయింగ్ 747 మొట్టమొదటి విమానం రాచఠీవితో నిల్చొని ఉంది. భారీ రెక్కలతో ఇంద్రభవనంలా మెరిసిపోతున్న ఆ విమానాన్ని చూడానికి వేలాది మంది అక్కడికి తరలివచ్చారు. అంత పెద్ద విమానాన్ని అప్పటివరకు చూసి ఎరుగని జనం దానినో అద్భుతంలా చూడసాగారు. భవనం లాంటి విమానం అసలు గాల్లో ఎలా ఎగరగలదని చర్చించుకోవడం మొదలు పెట్టారు. అప్పట్నుంచి ఈ విమానం అంతర్జాతీయ ప్రయాణ రూపురేఖల్ని మార్చేసింది. అందుకే బోయింగ్ 747ని క్వీన్ ఆఫ్ స్కైస్ అని పిలుస్తారు. 2023, ఫిబ్రవరి 1 55 సంవత్సరాల తర్వాత.. సరిగ్గా అదే స్థలం ఆకాశానికి రాణిలాంటి బోయింగ్ 747కి సిబ్బంది ఘనమైన వీడ్కోలు పలికారు. చిట్టచివరి విమానాన్ని గురువారం అట్లాస్ ఎయిర్‌లైన్స్ సంస్థకు అందజేశారు. ప్రయాణికుల విమానంగా మొదలైన దాని ప్రస్థానం కార్గో విమానంగా ముగిసింది. వీటి తయారీ నిలిపివేస్తున్నట్టు 2020లోనే కంపెనీ ప్రకటించింది. వేలాది మంది ఉద్యోగులతో పాటు ఔత్సాహికులు ఈ వీడ్కోలు కార్యక్రమానికి తరలి వచ్చారు. అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన విమానాన్ని మళ్లీ చూడలేమని బాధాతప్త హృదయంతో చర్చించుకున్నారు. విమానమే ఒక ఇంద్రభవనం విమాన ప్రయాణాల చరిత్రలో బోయింగ్‌కి ముందు, బోయింగ్ తర్వాత అని స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. గంటల తరబడి కూర్చొని దేశ విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణాలు బోయింగ్ రాకతో అత్యంత సౌకర్యవంతంగా మారాయి. సువిశాలంగా ఉండే బోయింగ్ 747 ఎదుట ఇతర విమానాలు ఒక మరుగుజ్జుగా మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బోయింగ్ విమానం ప్రపంచాన్ని కుదించింది. కళ్లు చెదిరే సదుపాయాలతో వీవీఐపీ ప్రయాణికులు మోజు పడేలా 747 విమానాలు రూపుదిద్దుకున్నాయి. బార్లు, డైనింగ్ హాళ్లు, మూవీ స్క్రీన్లు, లగ్జరీ ఇంటీరియర్లు, లాంజ్‌లు, లివింగ్ రూమ్‌లు ఒకటేమిటి ఇదసలువిమానమా, గాల్లో ఎగిరే ఇంద్రభవనమా అని అందరూ అవాక్కయ్యారు. తయారీ నిలిపివేత ఎందుకు? అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. బోయింగ్ విమానానికయ్యే ఇంధనం ఖర్చు చాలా ఎక్కువ. 2007లో ఏ380 ఎయిర్ బస్ వచ్చిన దాకా బోయింగ్ 747 ప్రభ వెలిగిపోతూనే ఉంది. చమురు రేట్లు ఆకాశాన్నంటుతూ ఉండడంతో బోయింగ్ 747 కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్ సంస్థలు కరువయ్యాయి. యూరప్‌కి చెందిన ప్రత్యర్థి కంపెనీ ఎయిర్‌బస్ తక్కువ చమురు ఖర్చుతో విమానాలు రూపొందించడంతో బోయింగ్ డిమాండ్ పడిపోయింది. ఏ ఎయిర్‌లైన్స్ కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దీంతో 2020లో బోయింగ్ 747 విమానాల తయారీ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రత్యామ్నాయం ఏంటి ? జంబో జెట్లతో చమురు ధరాభారం ఎక్కువగానే ఉన్నా అత్యంత పెద్ద విమానాన్ని రూపొందించడానికి బోయింగ్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. రెండు ఇంజిన్లు ఉండే 776ఎక్స్ అని పిలిచే ఈ సరికొత్త జంబో జెట్ 2020లోనే మార్కెట్లోకి రావాల్సి ఉండేది. కానీ కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాలు పడడంతో విమానాల తయారీ ఆలస్యమవుతోంది. 2025 నాటికి ఈ సరికొత్త విమానాలు తేవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొట్ట మొదటి విమానం ఇలా..! బోయింగ్ 747 కంటే ముందు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన 707 బోయింగ్ విమానం చాలా ఇరుగ్గా ఉండేది. సీట్ల మధ్య రాకపోకలు సాగించడానికి ఒక్కటే మార్గం ఉండేది. దీంతో విమాన ప్రయాణాలపై ప్రజలకి ఒక రకమైన వ్యతిరేకత నెలకొంది. బోయింగ్ 747 రెండు అంతస్తులుతో, నడిచి వెళ్లడానికి రెండు మార్గాలతో అత్యంత సువిశాలంగా ఉండేది. బోయింగ్ 707 విమానం 200 మంది కంటే తక్కువ మంది ప్రయాణికులతో ఏకబిగిన 3 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే, 400 మంది ప్రయాణికుల్ని మోసుకువెళుతూ బోయింగ్ 747 ఏకబిగిన 5వేల నాటికన్ మైళ్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ► మొట్టమొదటి విమానాన్ని పాన్ యామ్ సంస్థ జనవరి 15, 1970లో కొనుగోలు చేసింది. తొలిసారి నిర్మించిన 747 విమానం 225 అడుగుల పొడవు ఉంది. దాని తోకభాగం ఆరు అంతస్తుల భవనం ఎంత పొడవు ఉంటుందో అంత ఉండేది. ► జంబో జెట్‌కి చమురు ఖర్చు ఎక్కువ కావడంతో డిజైన్ రూపొందించినప్పుడే కార్గో అవసరాలకు మార్చుకునే విధంగా రూపొందించారు. 3,400 బ్యాగేజ్‌లను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. అదే ఈ విమానాలను ఇన్నాళ్లూ కాపాడుతూ వచ్చింది. ► 1990లో తొలిసారిగా బోయింగ్ 747–200 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంగా మార్చారు. ► ఇప్పటివరకు 1,574 విమానాలను తయారు చేశారు. ఇప్పటికీ 500 విమానాలు వాడుకలో ఉన్నాయి. ► ప్రయాణికుల, రవాణాతో పాటు అవసరమైనప్పుడు అంతరిక్షం నుంచి రాకపోకలకి అనుగుణంగా ఈ విమానాన్ని ఆధునీకరించారు. ► ఎయిర్ ఇండియా కూడా ఈ విమానాలను కొనుగోలు చేసి విస్తృతంగా వినియోగించింది. 1971లో తొలి విమానాన్ని కొనుగోలు చేసింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
వేగంగా ‘సెంచురీ ప్యానల్స్’ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యానల్స్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు కావడంతో సెంచురీ ఫ్లై సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021, డిసెంబర్ 24న భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్ తొలి దశ పనులను 2024 డిసెంబర్ నాటికి పూర్తిచేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత తమిళనాడులో ఈ యూనిట్‌ను నెలకొల్పాలని భావించామని, కానీ ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తుండటంతో గోపవరం వద్ద ఏర్పాటుచేస్తున్నట్లు సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా శంకుస్థాపన సమయంలో ప్రకటించారు. తొలుత రూ.600 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయాలని భావించామని, కానీ ఇప్పుడు రూ.1,600 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గోపవరం వద్ద ఈ యూనిట్ ఏర్పాటు వల్ల కలప ఆధారిత అనుబంధ పరిశ్రమలు మరిన్ని వస్తాయని, తద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: మరోసారి అలజడికి టీడీపీ నేతల యత్నం -
రూ.450 కోట్లతో ఉత్పత్తి యూనిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో జపాన్ సంస్థ భారీ పెట్టుబడితో రానుంది. జపాన్‌కు చెందిన ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ, సొల్యూషన్స్ సంస్థ డైఫుకు (ఈఅఐఊ్ఖఓ్ఖ) తెలంగాణలో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ యూనిట్ మొదటి దశ విస్తరణకు రూ.250 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో ఏర్పాటు చేసే ఈ తయారీ యూనిట్‌ను 18 నెలల్లో ప్రారంభించనుంది. దీని ద్వారా సుమారు 800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో డైఫుకు సంస్థ తరఫున భారతీయ అనుబంధ సంస్థ వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ భారత్‌లో విస్తృతమైన దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తయారీ రంగానికి కేంద్రంగా ఉన్న చైనా అవతల తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ తరుణంలో భారతదేశం ఈ అవకాశాన్ని జార విడవకుండా అందిపుచ్చుకోవాలని కోరారు. భారతదేశానికి చెందిన పెట్టుబడిదారులు సైతం ఇండియా కోసం మాత్రమే కాకుండా ప్రపంచానికి సరిపడా తమ ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రాథమికస్థాయి తయారీపైనే కాకుండా హైటెక్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోనూ ముందుకు పోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణలో తమ తయారీ సంస్థలను ఏర్పాటు చేసిన, చేయనున్న కంపెనీలు బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలతో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు. 800 మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి డైఫుకు అనుబంధ భారతీయ సంస్థ వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ జపాన్ సాంకేతిక సహకారంతో భారత్‌లో తమ సంస్థ ఉత్పత్తులను తయారు చేయాలనే లక్ష్యంతో పరిశ్రమల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, ఆటోమేటివ్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ స్థానికంగా ఉత్పత్తి అయి వినియోగంలోకి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ జోరు
కరోనా మహమ్మారి తదుపరి ప్రపంచ కెమికల్ దిగ్గజాలు సరఫరాల చైన్‌ను పునర్వ్యవస్థీకరించే సన్నాహాలు ప్రారంభించాయి. తద్వారా చైనాయేతర దేశాల కంపెనీలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు సామర్థ్య విస్తరణను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు మరింత మెరుగైన పనితీరు చూపే వీలున్నట్లు పలువురు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. దేశీయంగా టాప్ పొజిషన్లో ఉన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు కొంతకాలంగా విస్తరణ కార్యకలాపాలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రొడక్టుల లభ్యత పెరగనుంది. మరోవైపు కోవిడ్–19 తదుపరి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, ఆర్థిక వ్యవస్థలు పురోగమన పథం పట్టడం వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్ పరిశ్రమ సైతం చేరనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి పలు గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. రిస్కులను తగ్గించుకునే వ్యూహాలు దీనికి కారణంకాగా.. ఇందుకు అనుగుణంగా భారత్ వంటి దేశాలవైపు చూస్తున్నా యి. ఇదే సమయంలో పలు అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనూ డిమాండుపై అంచనాలతో దేశీ కంపెనీలు తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ రావడం మరిన్ని అవకాశాలకు దారిచూపనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి స్పెషాలిటీ కెమికల్స్‌కు పెరగనున్న డిమాండును అందుకునే బాటలో దేశీ పరిశ్రమ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. చైనాకు చెక్ కోవిడ్–19 సవాళ్ల తదుపరి ఏడాది కాలంగా స్పెషాలిటీ కెమికల్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఓవైపు చైనాకు ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా ఇతర దేశాల కంపెనీలపై గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు దృష్టిసారిస్తుంటే.. మరోపక్క యూరోపియన్ కెమికల్ దిగ్గజాలు భారత్ మార్కెట్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు ప్రధానంగా యూరోప్‌లో తయారీ వ్యయ, ప్రయాసలతో కూడుకోవడం ప్ర భావం చూపుతోంది. భారత్ నుంచి చౌకగా ప్రొడక్టులను ఔట్సోర్సింగ్ చేసుకునేందుకు వీలుండటం ఇందుకు సహకరిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. నిజానికి ఈ రంగంలో దేశీయంగా పలు కంపెనీలు ప్రొడక్టులను భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఇకముందు ఔట్సోర్సింగ్ మరింత పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త మాలిక్యూల్స్.. కొద్ది రోజులుగా స్పెషాలిటీ కెమికల్ తయారీ ముడివ్యయాలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికితోడు ఇంధన వ్యయాలూ దిగివస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా కొత్త మాలిక్యూల్స్, ప్రాసెస్‌పై కొన్ని కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతేకాకుండా సొంతంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, దిగుమతి ప్రొడక్టులకు ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తద్వారా గ్లోబల్ దిగ్గజాల నుంచి దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులను పొందడంపై కన్నేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. షేర్లపై ఎఫెక్ట్ పటిష్ట అమ్మకాలు సాధిస్తున్న స్పెషాలిటీ కెమికల్ కంపెనీల స్టాక్స్ గత కొన్నేళ్లుగా లాభాలతో దూసుకెళ్లడంతో ఇటీవల కొంతమేర దిద్దుబాటును చవిచూస్తున్నాయి. గత 5–7 ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే పలు దిగ్గజాల షేర్లు రెటింపునకుపైగా బలపడ్డాయి. అయితే కొద్ది నెలలుగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక మందగమన భయాలు వంటి ప్రతికూలతలతో వెనకడుగు వేస్తున్నాయి. 52 వారాల గరిష్టాలతో పోలిస్తే ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రైట్, ఆర్తి ఇండస్ట్రీస్, ఆల్కిల్ అమైన్ కెమికల్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ తదితర షేర్లు 20–40 శాతం మధ్య పతనమయ్యాయి. అయినప్పటికీ ఐదేళ్ల సగటు ధరలతో చూస్తే ప్రీమియంలోనే ట్రేడవుతున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ ఆర్జనలపట్ల ఆశావహ అంచనాలు సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఇటీవల త్రైమాసిక ఫలితాలలో పీఐ ఇండస్ట్రీస్ ఆదాయం జంప్‌చేయగా.. రిఫ్రిజిరెంట్ గ్యాస్ ధరలతో గుజరాత్ ఫ్లోరో, ఎస్ఆర్ఎఫ్ లబ్ది పొందే వీలుంది. ఎఫ్ఎంసీజీ రంగం ద్వారా గలాక్సీ, ఫైన్ ఆర్గానిక్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. ఇక దీపక్, ఆర్తి, జూబిలెంట్ కొంతమేర మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ప్రొడక్టుల ద్వారా పనితీరు మెరుగుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. యాజమాన్యాలు రెడీ దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ భారీఎత్తున పెరుగుతోంది. అయినప్పటికీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, దీపక్ నైట్రైట్ తదితరాలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చని అంచనా. ఇక ఆర్తి ఇండస్ట్రీస్, నోసిల్, వినతీ ఆర్గానిక్స్, గలాక్సీ సర్ఫక్టాంట్స్, టాటా కెమికల్స్, అనుపమ్ రసాయన్ తదితర దిగ్గజాల యాజమాన్యాలు గ్లోబల్ సరఫరా చైన్ల పునర్వ్యవస్థీకరణతో భారీగా లబ్ది పొందే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. వెరసి ఈ రంగంలోని పలు దిగ్గజాలు భవిష్యత్‌లో పటిష్ట పనితీరును ప్రదర్శించే అవకాశముంది. -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యూనికార్న్ జెట్వెర్క్ చేతికి అమెరికా కంపెనీ
న్యూఢిల్లీ: యూనికార్న్ (స్టార్టప్) కంపెనీ జెట్వెర్క్ మ్యానుఫాక్చరింగ్.. అమెరికాకు చెందిన యూనిమాక్ట్స్ ను 39 మిలియన్ డాలర్లు (సుమారు రూ.320 కోట్లు) పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొనుగోలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని తెలిపింది. ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు! జెట్వెర్క్ కంపెనీ గత ఆరు నెలల్లో నాలుగో కంపెనీని కొనుగోలు చేస్తుండడం గమనించాలి. తాజా డీల్ మాత్రం తొలి విదేశీ కొనుగోలు అవుతుంది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేకు సంబంధించి సరఫరా వ్యవస్థలో భాగమైన కంపెనీలను జెట్వెర్క్ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది. ఇండస్ట్రియల్, కన్జ్యూమర్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ విధానంలో తయారు చేసి అందించడం జెట్వెర్క్ చేసే పని. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) -
వీడియో కాన్ఫరెన్స్‌లోనే.. ఎలాన్ మస్క్‌కు బంపరాఫర్
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బంపరాఫర్ తగిలింది. ప్రపంచ దేశాల్లో భారీ ఎత్తున గిగా ఫ్యాక్టరీలను స్థాపించేలా ఆయన కలలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా..తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే మస్క్‌కు జాక్ పాట్ తగిలింది. తమ దేశంలో గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పాలని సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆఫర్ ఇచ్చారు. ఇండోనేషియా ప్రావిన్స్ బాలీలో నవంబర్ 13, 14 రెండు రోజుల పాటు బీ20 సమ్మిట్ ఇండోనేషియా 2022 పేరుతో వాణిజ్య సదస్సు జరిగింది. ఆ సదస్సులో యోల్‌తో ఎలాన్ మస్క్ భేటీ, ఆ భేటీలో గిగా ఫ్యాక్టరీ గురించి వివరించాల్సి ఉంది. కానీ ట్విటర్ కొనుగోలుతో తీరిక లేకుండా వ్యాపార వ్యవహారాల్లో మునిగి తేలారు. అయితే బుధవారం సౌత్ కొరియా కాలమానం ప్రకారం..ఉదయం 10 గంటలకు యోల్‌తో మస్క్ వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘గ్లోబల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్‌పై’ వారిరువురూ చర్చించుకున్నారు. మస్క్‌కు ఆఫర్ అనంతరం..తాము వచ్చే ఏడాది తాము ఏషియన్ కంట్రీస్‌లో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయని మస్క్ వెల్లడించారు. ఇప్పటికే యూఎస్,జర్మనీ, అమెరికా దేశాల్లో మొత్తం ఐదు గిగా ఫ్యాకర్టీలు ఉండగా..2023 నాటికి మరో ఫ్యాక్టరీ నిర్మించేలా ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్థల అన్వేషణలో ఉన్నట్లు చెప్పారు. మస్క్ గిగా ఫ్యాక్టరీ ప్రణాళికల్ని విన్న యోల్..తమ దేశంలో టెస్లా కార్ల విడిభాగాల తయారీ ప్లాంటును (గిగా ఫ్యాక్టరీ) ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ మాట్లాడుతూ..కొరియాను అగ్రశ్రేణి పెట్టుబడిదారులలో ఒక దేశంగా పరిగణిస్తున్నామని, వర్క్ ఫోర్స్, టెక్నాలజీ, ప్రొడక్షన్ చేసే అనుకులమైన వాతావరణం వంటి పెట్టుబడి పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మస్క్ వ్యాఖ్యలు..భారీ లాభాల్లో షేర్లు అంతేకాదు కొరియన్ కంపెనీలతో సప్లయ్ చైన్ సహకారం గణనీయంగా విస్తరిస్తుందని, వచ్చే ఏడాది కొరియన్ కంపెనీల నుంచి విడిభాగాల కొనుగోళ్లు 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాఖ్యల తర్వాత, సౌత్ కొరియా ఆటోమొబైల్, ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీల షేర్లు లాభాల్లో పరుగులు తీశాయి. తిరస్కరించిన దేశాలు ఈ గిగా ఫ్యాక్టరీ ఏర్పాట్ల విషయంలో ఎలాన్ మస్క్ తీరును భారత్, రష్యా దేశాలు తప్పు బట్టాయి. ముఖ్యంగా రష్యాతో సంప్రదింపులు జరిపి నెలల గడుస్తున్నా.. తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని మాట దాటేశారు. భారత్ విషయంలోనూ అదే జరిగింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కాలుష్యాన్ని వెలువరించవు కాబట్టి దిగుమతి సుంకాన్ని తగ్గించాలంటూ భారత్‌ని కోరారు. దీనికి ప్రతిగా ఇండియాలో ఫ్యాక్టరీ నెలకొల్పితే సుంకాల తగ్గింపు అంశం పరిశీలిస్తామంటూ భారత అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆ రెండు దేశాల్లో గిగా ఫ్యాక్టరీ నిర్మాణాల విషయంలో అడ్డంకులు ఏర్పాడ్డాయి. కానీ తాజాగా సౌత్ కొరియా మస్క్‌ను ఆహ్వానించడం టెస్లాకు శుభ పరిణామమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మస్క్ ఇక్కడ కొద్ది రోజుల క్రితం ఎలాన్ మస్క్ ట్విటర్‌ని కొనుగులో చేశారు. అనంతరం ఆ సంస్థపై దృష్టిసారించారు. మస్క్ లైట్ తీసుకుంటే టెస్లాకు నష్టం వాటిల్లే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆ సంస్థ పెట్టుబడిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా అదే సమయంలో టెస్లా షేర్లు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. వెరసీ ఈ బిలియనీర్ ఏడాదిలో 100.5 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అమెరికావ్యాప్తంగా 3.21లక్షల కార్లను రీకాల్ చేసింది. కార్ల టెయిల్ లైట్ల సమస్యలపై వినియోగదారుల నుంచి నిత్యం కంపెనీకి ఫిర్యాదులు వస్తున్నాయి. అక్టోబర్ చివరిలో విదేశీ మార్కెట్లలో విక్రయించిన అనేక కార్లలో టెయిల్ లైట్లు సరిగా పని చేయడం లేదని కంపెనీకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ తరుణంలో ఎలాన్ మస్క్‌కు తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో టెస్లాకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఇన్వెస్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
హోసూరులో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్
న్యూఢిల్లీ: దేశంలో యాపి ల్ ఐఫోన్ల తయారీకి సంబంధించి అతిపెద్ద ప్లాంట్ కర్ణాటకలోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా 60వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ వివరాలను కేంద్ర టెలికం, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఐఫోన్ల తయారీపై రాంచీ, హజారీబాగ్‌కు చెందిన ఆరువేల మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. -
గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్‌బస్ సీ-295 తయారీ
న్యూఢిల్లీ: ఆర్మీ కోసం ఎయిర్‌బస్ సీ-295 ట్రాన్స్పోర్ట్ విమానాలను దేశంలో తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఎయిర్‌బస్ సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ.22,000 కోట్లతో వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ‘సైనిక ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రైవేట్ కంపెనీ భారత్‌లో తయారు చేయనున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు. ఈ విమానాలను పౌర రవాణాకు సైతం ఉపయోగిస్తాం.’ అని తెలిపారు రక్షణ శాఖ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్ 30న ఆదివారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. యూరప్ వెలుపల సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని అజయ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు.. గుజరాత్ ఎన్నికల వేళ వేలాది ఉద్యోగులు కల్పించే భారీ ప్రాజెక్టును ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత వాయుసేనలోని పాత ఏవీఆర్‌ఓ-748 ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో ఎయిర్‌బస్‌కు చెందిన సీ-295 విమానాలను ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలను అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21వేల కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా నాలుగేళ్లలో 16 విమానాలను ‘ఫ్లై అవే’ కండీషన్లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాలను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారీ, అసెంబ్లింగ్ చేపడుతుంది. ఈ ఒప్పందానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ గత వారమే ఆమోదం తెలిపింది. ఇదీ చదవండి: దెయ్యంలాంటి రూపంతో ఫేమస్.. అసలు ముఖం మాత్రం ఇది! -
హెటిరో చేతికి జాన్సన్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ హెటిరో తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ఇంజెక్టేబుల్స్ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసినట్టు సోమవారం ప్రకటించింది. డీల్ విలువ రూ.130 కోట్లు. హైదరాబాద్ సమీపంలోని పెంజెర్ల వద్ద 55.27 ఎకరాల్లో ఈ ప్లాంటు విస్తరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెటిరో ఫ్లాగ్షిప్ స్టెరైల్ ఫార్మాస్యూటికల్, బయోలాజిక్స్ తయారీ యూనిట్‌గా ఇది నిలవనుంది. ఈ కేంద్రంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాల ఆధునీకరణకు, మెరుగుపరచడానికి, బయోలాజిక్స్, స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీని విస్తరించడానికి సుమారు రూ.600 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉన్నట్టు హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఫెసిలిటీ ద్వారా బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, మాలిక్యులర్ బయోసైన్సెస్, ఇంజనీరింగ్, అనుబంధ విభాగాల్లో నూతనంగా 2,000 ఉద్యోగాలను జోడించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ డీల్‌కు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా పీడబ్ల్యూసీ వ్యవహరించింది. -
దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో తొలిసారిగా 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్‌ను హైదరాబాద్‌కు చెందిన రేడియంట్ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్ ప్రారంభించింది. ఇందుకో సం నూతన అసెంబ్లింగ్ లైన్‌ను ఇక్కడి ఫ్యాబ్ సిటీలో కంపెనీకి చెందిన ప్లాంటులో ఏర్పాటు చేసింది. లాయిడ్ బ్రాండ్ కోసం 75 అంగుళాల గూగుల్ టీవీ తయారీని ప్రారంభించినట్టు రేడియంట్ అప్లయాన్సెస్ ఎండీ రమీందర్ సింగ్ సోయిన్ ఈ సందర్భంగా తెలిపారు. రిసోల్యూ ట్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ఎలక్ట్రానిక్స్ తయారీలో 25 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్లకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తయారు చేసి సరఫరా చేస్తోంది. -
చిప్ తయారీలో ముద్ర వేయగలమా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌తోపాటు ఓ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్, సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ‘వేదాంత’ గ్రూపు ప్రకటించింది. రెండు కారణాల వల్ల ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మొదటిది వీటి ఏర్పాటుకు ఏకంగా ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతూండటం. ఇక రెండోది, ఈ ప్లాంట్ ముందు నుంచి సూచిస్తూ వచ్చిన మహారాష్ట్రలో కాకుండా గుజరాత్లో ఏర్పాటు కానుండటం! ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. వేదాంత గ్రూపు భాగస్వామిగా తైవాన్‌కు చెందిన హోన్ హై టెక్నాలజీ(ఫాక్స్‌కాన్) గ్రూపు వ్యవహరిస్తూండటం. సెమీకండక్టర్ల తయారీకి తైవాన్ పెట్టింది పేరన్నది తెలిసిన విషయమే. కోవిడ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చిప్‌లకు కొరత ఏర్పడటం కనువిప్పు లాంటి దని చెప్పాలి. ఒకరిద్దరు తయారీదారులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవని రుజువు చేసిందీ మహమ్మారి. ఈ కాలంలో సెమీకండక్టర్ చిప్‌లు కార్లు మొదలుకొని వాషింగ్ మెషీన్ల వరకూ అన్నింటిలో చేరి పోతున్నాయి. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో చాలామంది తయారీ దారులు తైవాన్‌లోని ఫ్యాబ్‌లపై (చిప్ తయారీ కేంద్రాలను ఫ్యాబ్లని పిలుస్తారు) ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించారు. అందుకే ఈ మార్కెట్లో సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సము పార్జించుకోవడం భారత్‌కు ఎంతైనా అవసరం. ఈ ఏడాది అమెరికా ‘చిప్స్’ పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా మైక్రోప్రాసెసర్లు లేదా చిప్‌లు తయారు చేసే లేదా పరిశోధనలు చేసే అమెరికన్ కంపెనీలకు దాదాపు 5,200 కోట్ల డాలర్ల ప్రోత్సాహకాలు అందించనున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. దక్షిణ కొరియా దేశీ సంస్థలకు సబ్సిడీలతో కలుపుకొని సుమారు 45,000 కోట్ల డాలర్లతో సెమీ కండక్టర్ల తయారీకి భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. మన దేశంలో ‘సెమీ కండక్టర్ మిషన్’లో భాగంగా సుమారు 76 వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు చిప్స్, డిస్ప్లే ఫ్యాబ్స్‌కు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. ప్రైవేట్ సంస్థలకు ప్రాజెక్టుకయ్యే ఖర్చులో దాదాపు 50 శాతం సబ్సిడీగా అందిస్తున్నారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించిన పునాదులు 1974లో పంజాబ్‌లో పడ్డాయని చెప్పాలి. సెమీ కండక్టర్ల డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్లలో మన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఇందుకోసం విదేశీ సాయం తీసుకోవాలని తొలినాళ్లలో నిర్ణయించింది. ‘సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్’ (ఎస్సీఎల్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన తరువాత 1976లో నిపుణుల బృందం మొహాలీ, మద్రాస్‌లలో ఒకచోట ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచిం చింది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మద్రాస్ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సిఫారసు చేసింది. అయితే అప్పటి పంజాబ్ ముఖ్య మంత్రి జైల్‌సింగ్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఈ కాంప్లెక్స్ మొహాలీలో ఏర్పాటయ్యేలా చేసుకున్నారు. ఈ కేంద్రంలో అత్యధిక నైపుణ్యం ఉన్న వారి అవసరం ఎక్కువగా ఉంటుందనీ, దీని వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలేవీ పెరగవన్న విషయాన్ని జైల్ సింగ్‌కు వివరించాల్సిందిగా ఇందిరాగాంధీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అధికారి అశోక్ పార్థసారథిని పురమాయించారు. అయినాసరే మొహాలీలోనే ఆ కాంప్లెక్స్ ఏర్పాటు కావాలని జైల్‌సింగ్ పట్టు పట్టడంతో భారత్‌లో తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం 1978లో మొహాలీలో ఏర్పాటైంది. అప్పట్లో ఈ ఫ్యాబ్‌కు రూ.15 కోట్లు ఖర్చు అయ్యింది. 1983లో అమెరికన్ మైక్రోసిస్టమ్స్ నుంచి పొందిన టెక్నా లజీ ఆధారంగా ఈ ఫ్యాబ్లో చిప్‌ల తయారీ మొదలైంది. ఎస్సీఎల్ ఏర్పాటయ్యే సమయానికి కొంచెం అటూయిటుగానే దేశంలో సెమీ కండక్టర్ డిజైనింగ్ కార్యకలాపాలు కూడా మొదల య్యాయి. చిప్ డిజైనింగ్‌లో అమెరికాలో పెద్ద పేరు సంపాదించిన ఐఐటీ – కాన్పూర్ పూర్వ విద్యార్థి ప్రభాకర్ గోయెల్ ఈ దిశగా చొరవ తీసుకున్నారు. ప్రభాకర్ మొదలుపెట్టిన ‘గేట్‌వే డిజైన్ ఆటోమేషన్’ సంస్థ చిప్‌లను పరీక్షించేందుకు వెరిలాగ్ పేరుతో టెస్టింగ్ టూల్‌ను తయారు చేసింది. వెరిలాగ్కు జపాన్, తైవాన్‌లలోని చిప్ తయారీ దారుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో ప్రభాకర్ గోయెల్ సంస్థ లక్షల డాలర్లు ఆర్జించగలిగింది. వెరిలాగ్ రూపకల్పన కొంత శ్రమతో కూడిన వ్యవహారం కావడంతో ప్రభాకర్ ఈ ప్రక్రియను భారత్‌లో చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలోని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లో 1985లో కొంతమంది ఇంజినీర్లతో ఓ చిన్న యూనిట్‌ను మొదలుపెట్టారు. నాలుగేళ్ల తరువాత అమెరికాకు చెందిన కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రభాకర్ కంపెనీని కొనేసింది. ఈ రకంగా కాడెన్స్ సంస్థ భారత్‌లోనూ కాలుపెట్టిందని చెప్పాలి. సెమీ కండక్టర్ డిజైనింగ్ రంగంలోనే ఉన్న ఇంకో రెండు కంపెనీలు టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్ కూడా ఈ సమయంలోనే దేశంలో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఆ తరువాత పదేళ్ల కాలంలోనే ఇంటెల్ లాంటివాటితో కలుపుకొని ప్రపంచంలోని 25 సెమీకండక్టర్ డిజైనింగ్ కంపెనీల్లో 17 భారత్‌లో కేంద్రాలను తెరి చాయి. ఫలితంగా సెమీకండక్టర్ డిజైనింగ్ రంగంలో భారత్ ఓ బలీయమైన శక్తిగా మారింది. మైక్రోప్రాసెసర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు అమెరికా, యూరప్ కంపెనీలు భారతీయ ఇంజినీర్ల డిజైనింగ్ నైపు ణ్యాన్నీ, తైవాన్‌లోని తయారీ కేంద్రాలనూ ఉపయోగించుకోవడం మొదలైంది. ఇంకోవైపు ఎస్సీఎల్ ఈ పోటీలో వెనుకబడి పోయింది. తయారీ టెక్నాలజీని ఆధునికీకరించే ప్రయత్నంలో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ఒకటి చోటు చేసుకోవడం... పునర్నిర్మాణానికి చాలా సమయం పట్టడంతో కంపెనీ మళ్లీ కోలుకోలేకపోయింది. కాకపోతే సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై విదేశాలు నిషేధాలు విధించిన సమ యంలో అంతరిక్ష, రక్షణ రంగాల అవసరాలను తీర్చేందుకు మాత్రం ఉపయోగపడింది. తాజాగా ఎస్‌సీఎల్‌ను వాణిజ్యస్థాయి ఫ్యాబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ కండక్టర్ రంగంలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అవసరమైన మేరకు పెట్టుబడులు పెట్టలేకపోవడం, స్థానికంగా మైక్రోప్రాసెసర్లకు డిమాండ్ తక్కువగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడం వంటివి మచ్చుకు కొన్ని. సెమీ కండక్టర్ రంగంలో టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది. వేదాంత సంస్థ ఏర్పాటు చేయదలచుకున్న ఫ్యాబ్లో 28 నానోమీటర్ల టెక్నాలజీ నోడ్లను తయారు చేసేందుకు నిర్ణయించారు. కంప్యూటర్లకు గుండె వంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రాఫిక్ ప్రాసెసర్లు, నెట్వర్కింగ్ చిప్స్, స్మార్ట్‌ఫోన్స్, కార్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లలో ఉపయోగించే మైక్రోప్రాసెసర్లను ఇక్కడ తయారు చేయవచ్చు. అయితే తైవాన్‌లో ప్రస్తుతం ఇంతకంటే చాలా సూక్ష్మమైన స్థాయిలో టెక్నాలజీ నోడ్లను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇవెంత సూక్ష్మమైన వంటే... కేవలం మూడు నానోమీటర్ల సైజున్నవన్నమాట! మొహాలీలో ఏర్పాటైన ఎస్‌సీఎల్‌లో ఐదు మైక్రాన్ల (5,000 నానో మీటర్లు) సైజున్న ట్రాన్సిస్టర్ల తయారీ చేపట్టారు. ఈ సైజును 1.2 మైక్రాన్లకు(1,200 నానోమీటర్లు) తగ్గించేందుకు జరిగిన ప్రయత్నం లోనే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా అంత ర్జాతీయ సంస్థలు 0.8 మైక్రాన్ల సైజులో మాత్రమే ట్రాన్సిస్టర్ల తయా రీలో ఉండేవి. పదేళ్లలోపు ఎస్సీఎల్ ఈ అంతరాన్ని సొంతంగానే తగ్గించుకుని ఉండేది. విదేశీ టెక్నాలజీలను ఆపోశన పట్టడంలో భారతీయులు నైపుణ్యం కలవారన్నది తెలిసిందే. ఎప్పటి కప్పుడు మారిపోతూండే ఈ సెమీ కండక్టర్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్ రంగంలో మనదైన ముద్ర వేయాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోవడం ఎంతైనా అవసరం. ఇందుకు పరిశోధనలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైతే వేదాంత ప్రతిపాది స్తున్న జాయింట్ వెంచర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై మాట విప్పడం లేదు. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఉంటుందా, లేదా అన్నది కూడా అస్పష్టం. భారత్ మరోసారి సెమీ కండక్టర్ రంగంలో లభిస్తున్న గొప్ప అవకాశాన్ని కోల్పోదనే ఆశిద్దాం! వ్యాసకర్త: దినేశ్ సి. శర్మ, వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన
-
హరియాణాలో మారుతీ సుజుకీ ప్లాంట్
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ హరియాణాలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ కేంద్రం కోసం తొలి దశలో రూ.11,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. హరియాణా స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సోనిపట్ జిల్లాలో ఐఎంటీ ఖర్ఖోడ వద్ద 800 ఎకరాలను మారుతీ సుజుకీ కోసం కేటాయించింది. సామర్థ్యం పెంపునకు మరిన్ని తయారీ యూనిట్లను ఇక్కడ నెలకొల్పేందుకు సరిపడ స్థలం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది. తొలి దశ 2025 నాటికి పూర్తి కానుంది. తొలుత ఏటా 2.5 లక్షల యూనిట్ల కార్లను తయారు చేయగల సామర్థ్యంతో ఇది రానుంది. హర్యానా, గుజరాత్లో ఉన్న ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22 లక్షల యూనిట్లు. చదవండి: ధన్యవాదాలు.. కానీ మేము ఆ పని ఇక్కడ చేయలేం.. -
ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్స్ అతి పెద్ద కర్మాగారం తెలంగాణలో
ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్స్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)లో దిగ్గజ కంపెనీ ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్స్ (పీ అండ్ జీ)కి ఇండియాలో అతి పెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి తెలంగాణ వేదికగా మారింది. ఈ సంస్థకు చెందిన ప్లాంట్‌ను ఇటీవల విస్తరించారు. దీంతో ఇండియాలోనే పీ అండ్ జీకి అతి పెద్ద సెంటర్‌గా తెలంగాణ నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ఈ సంస్థకు ప్లాంట్ ఉంది. ఇటీవల లిక్విడ్ డిటర్జెంట్ తయారీ కోసం ఈ ప్లాంటును విస్తరించారు. దీంతో 170 ఎకరాల్లోక సువిశాల కర్మాగారంగా పీ అండ్ జీ అవతరితంచింది. నూతనంగా నిర్మించిన డిటర్జెంట్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ మే 2న ఆవిష్కరించారు. పీ అండ్ జీ నుంచి ఏరియల్, టైడ్ వంటి డిటర్జెంట్ లిక్విడ్స్, పౌడర్లు మార్కెట్లో ఉన్నాయి. 2014లో పీ అండ్ జీ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయగా తాజాగా రూ.200 కోట్లతో దాన్ని మరింతగా విస్తరించింది. ఈ సిటీలో రేడియంట్ ఫ్యాక్టరీ నగర శివారల్లో ఈ సిటీలో రేడియంట్ సంస్థ తమ ఫ్యాక్టరీని విస్తరించింది. వంద కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విస్తరణ పనులు చేపడుతోంది. దీని వల్ల కొత్తగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ విస్తరణతో ఫ్యాక్టరీ తయారీ సామర్థ్యం ఏడాదికి నాలుగున్నర లక్షల టీవీ సెట్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో దేశంలో తయారయ్యే టీవీల్లో నాలుగో వంతు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి కానున్నాయి. చదవండి: ట్రూజెట్‌లో విన్‌ఎయిర్‌కు మెజారిటీ వాటాలు -
Telangana: రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ వస్తోంది. ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్స్ తయారీ దిగ్గజ కంపెనీ ‘డ్రిల్మెక్ ఎస్పీఏ’ హైదరాబాద్‌లో 200 మిలియన్ యూఎస్ డాలర్ల (రూ.1,500 కోట్ల) భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ శాఖతో డ్రిల్మెక్ సంస్థ సోమవారం ఇక్కడ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. డ్రిల్మెక్ ఎస్పీఏ సీఈఓ సిమోన్ ట్రెవిసాని, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. రిగ్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి డ్రిల్మెక్ ఎస్పీఏ స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ప్రారంభించనుంది. ఆయిల్ రిగ్‌లు, అనుబంధ పరికరాల తయారీకి డ్రిల్మెక్ రాష్ట్రంలో అంతర్జాతీయ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇటలీలోని పోడెన్‌జానో పీసీ కేంద్రంగా రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న డ్రిల్మెక్ను 2020లో మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగోలు చేసింది. డ్రిల్మెక్ 200 మిలియన్ యూఎస్ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను కలిగి ఉంది. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం, పనితీరు నచ్చి.. డ్రిల్మెక్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 600 డ్రిల్లింగ్ రిగ్‌లను సరఫరా చేసింది. రిగ్‌ల రూపకల్పనలో అనేక వినూత్న డిజైన్లను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను పొందింది. చమురు, ఇంధనం వెలికితీసే హైటెక్ రిగ్‌లను ఇప్పటికే తమ సంస్థ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిందని ఎంఈఐఎల్ పేర్కొంది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో చమురు వెలికితీసేందుకు అవసరమైన అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్‌ల తయారీ, వర్క్ ఓవర్ రిగ్‌ల రూపకల్పన, తయారీ, సరఫరాలో గ్లోబల్ లీడర్‌గా ఉందని చెప్పింది. డ్రిల్లింగ్ రిగ్లకు అవసరమైన విడిభాగాల తయారీలో కూడా ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో పరిశ్రమలకు స్నేహపూర్వక వాతావరణం, ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు నచ్చి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నట్టు డ్రిల్మెక్ ఎస్పీఏ సీఈఓ సిమోన్ ట్రెవిసాని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ హైడ్రోజన్ ఇంధన ప్రాజెక్టును భారత్‌లోకి తీసుకొస్తావని ప్రకటించారు. తమ వద్ద 1 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని, హైదరాబాద్ యూనిట్‌తో సరఫరా వేగం పెరుగుతుందని డ్రిల్మెక్ ఇంటర్నేషనల్ సీఈఓ ఉమా మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నాణ్యమైన మానవ వనరులను తయారు చేస్తామన్నారు. 5 ఖండాల్లో.. 30కి పైగా దేశాల్లో డ్రిల్మెక్ డ్రిల్మెక్ ఎస్పీఏ ఇటలీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ హైడ్రో కార్బన్ సంస్థ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాండ్ డ్రిల్లింగ్, వర్కోవర్ రిగ్స్, ఇతర డ్రిల్లింగ్ ఉపకరణాలను తయారు చేస్తుంది. 5 ఖండాల్లో విస్తరించి 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సంప్రదాయ డ్రిల్లింగ్ రిగ్గులైన స్వింగ్ లిఫ్ట్/స్లింగ్ షాట్, మొబైల్ రిగ్స్, ఆటోమేటిక్ రిగ్స్, హైడ్రాలిక్, హెచ్‌హెచ్ సిరీస్, స్ట్రైకర్–800 వంటి సంప్రదాయేతర ప్లే రిగ్స్ తయారీలో మేటి. వీటిని ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ క్షేత్రాల్లో వాడతారు. భూ ఉపరితలం నుండి 6 వేల మీటర్ల వరకు సులువుగా.. అతి శీతల, అత్యుష్ణోగ్రతల్లో కూడా సమర్థంగా పని చేసే రిగ్స్‌ను తయారు చేసే కంపెనీగా గుర్తింపు పొందింది. -
భారత్‌కు రానున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..!
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిప్సెట్ మేకర్ ఇంటెల్ భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ...సెమికండక్టర్స్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు తయారీని కూడా పెంచే సెమీకండక్టర్లపై ఇటీవల కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్ ఆధారిత చిప్సెట్ దిగ్గజం ఒక ప్రకటనను చేసింది. వెల్ కమ్ టూ ఇండియా..! దేశీయంగా సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణకు, దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ ట్విటర్లో అభినందించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీకి భారత్ ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రభుత్వానికి, అశ్విని వైష్ణవ్ కు అభినందనలు. సరఫరా చైన్ లో భాగమైన.. నైపుణ్యం, డిజైన్, తయారీ, టెస్ట్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ ఇలా అన్ని అంశాల కలయికల ప్రణాళికలు చూసి సంతోషిస్తున్నామని రణధీర్ ఠాకూర్ ట్వీట్లో వెల్లడించారు. దీనికి జవాబుగా ‘ఇంటెల్-వెల్ కమ్ టు ఇండియా’ అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. చైనా, తైవాన్లపైనే ఆధారం..! చిప్స్ తయారీ విషయంలో భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చైనా, తైవాన్ దేశాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు కాలేదు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఊపందుకున్నాయి. వీటికి చేయూతగా చిప్స్ తయారీ కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. భారత్ గ్లోబల్ హబ్‌గా.. చిప్ తయారీలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది. అందులో భాగంగా గత వారం దిగ్గజ చిప్ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్ల పథకాన్ని ఆమోదించింది. దీంతో భారత్‌లో సెమీకండక్టర్, డిస్ప్లే తయారీని పెంచడానికి ఊతమిచ్చినట్లూ ఉంటుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వావలంబన సాధించడం, భారీ పెట్టుబడులు తీసుకురావడం, లక్ష మందికి పరోక్ష ఉపాధితో పాటు 35,000 ప్రత్యేక ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ భారీ ప్రణాళిక కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిందని, కాంపౌండ్ సెమీకండక్టర్ యూనిట్లు, డిజైన్, ప్యాకేజింగ్ కంపెనీలు వచ్చే 3-4 నెలల్లో ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు వైష్ణవ్ తెలిపారు. Intel - welcome to India. https://t.co/1Wy90HfAjy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 28, 2021 చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్..! వచ్చే మూడేళ్లలో..! -
ఏకే–203 రైఫిళ్ల తయారీ అమేథీలో
న్యూఢిల్లీ: అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను భారత్‌లో తయారుచేసేందుకు మార్గం సుగమం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలోని కోర్వాలో రైఫిళ్లను తయారుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మనిర్భర్ సాధించడానికి తాజా నిర్ణయం బాటలుపరుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5వేలకోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్లను అక్కడ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు. ‘ ఈ కొత్త ప్రాజెక్టు కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు దశాబ్దాల క్రితం నుంచి భారత సాయుధ బలగాల కోసం వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ అధునాతన ఏకే–203 రైఫిళ్లను తెచ్చారు. ఈ తేలికైన 7.62 ్ఠ 39 మిల్లీమీటర్ల కాలిబర్ రైఫిల్ 300 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించగలదు. ఈ నెల ఆరున రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది. చాలా సంవత్సరాల క్రితమే ఈ ఒప్పందంపై రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, రైఫిళ్ల సాంకేతికత రష్యా నుంచి భారత్‌కు బదిలీచేసే అంశం కొలిక్కి రాలేదు. ఇంతకాలానికి ఇది సాధ్యమైంది. పుతిన్ పర్యటనలో పలు ఒప్పందాలు.. సోమవారం ఢిల్లీకి రానున్న పుతిన్ సమక్షంలో భారత్ రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంథనం, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం సాయంత్రం 5.30గంటలకు కీలక వ్యూహాత్మక అంశాలపై మోదీ, పుతిన్ చర్చించనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 భేటీల్లో తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తత, తాలిబాన్ పాలనలో అఫ్గాన్ నుంచి భారత్‌కు పెరగనున్న ఉగ్ర ముప్పు అంశాలూ చర్చించనున్నారు. రెండు ఇంజన్ల కమోవ్–226టీ తేలికపాటి 200 హెలికాప్టర్ల సంయుక్త తయారీ అంశం ఓ కొలిక్కిరానుంది. వచ్చే మూడేళ్లలో ఇరుదేశాల పెట్టుబడుల ఒప్పందాలు 50బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంపైనా దృష్టిపెట్టనున్నారు. -
ఈవీ తయారీలోకి ఫాక్స్‌కాన్.. భారత్‌లో కూడా!
Taiwan Foxconn EV India: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్, క్రేజ్ పెరుగుతున్న తరుణంలో పలు కంపెనీలు ఆటోమొబైల్ రంగం వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ఈవీ తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. తైవాన్ టెక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మేరకు బుధవారం ఫాక్స్‌కాన్ చైర్మన్ లీయూ యంగ్ వే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జర్మన్ ఆటోమేకర్స్ పరోక్ష సహకారంతో ఈ వాహనాల ఉత్పత్తిని మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు సోమవారం మూడు కార్ల నమునాను సైతం లీయూ, తైపీలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రదర్శించారు. భారత దేశంతో పాటు యూరప్, లాటిన్ అమెరికా ఖండాల్లో ఈవీ వాహనాల తయారీని చేయనున్నట్లు ప్రకటించారాయన. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా డెవలప్ చేస్తున్న ‘ఇ సెడాన్’ మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు, ఐదు సీట్లు కలిగిన ‘మోడల్ ఇ’ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే జర్మన్ టెక్నాలజీ నేపథ్యంలో తమ తొలి ప్రాధాన్యం యూరప్‌గానే ఉంటుందన్న లీయూ, ఆ తర్వాతి ప్రాధాన్యం మాత్రం భారత్‌లోనేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తైవాన్‌కు చెందిన హోన్ హాయ్ ప్రెసిషన్ కంపెనీ.. ఎలక్ట్రిక్ గూడ్స్ తయారీలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ట్యూచెంగ్ కేంద్రంగా అంతర్జాతీయంగా 13 లక్షల ఉద్యోగులతో భారీ మార్కెట్‌ను విస్తరించుకుంది. అంతేకాదు తైవాన్‌లో యాపిల్ ప్రొడక్టులకు సప్లయర్‌గా ఉంది. క్లిక్ చేయండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి గుడ్‌న్యూస్ -
బతుకు చిత్రం :పాదరక్షల తయారీ పరిశ్రమల్లో వేలాదిమందికి ఉపాధి
-
టెస్లా గిగా ఫ్యాక్టరీ.. మాట మార్చిన ఎలన్ మస్క్
Elon Musk On Tesla Giga Factory: టెస్లా యజమాని ఎలన్ మస్క్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గిగా ఫ్యాక్టరీ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. గిగా ఫ్యాక్టరీ చుట్టూ వివాదం ఎలన్ మస్క్ భవిష్యత్తు టెక్నాలజీ ఆధారంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో దిట్ట, వ్యాపార వ్యూహాలను అమలు చేయడంలో మొనగాడు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉంటారాయన. కార్ల తయారీకి సంబంధించి మెగా ఫ్యాక్టరీలను మరింత ముందుకు తీసుకెళ్లి గిగా ఫ్యాక్టరీ అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసిన వ్యక్తి ఎలన్ మస్క్. ఇప్పుడా గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తారనే అంశం చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. నాలుగో ఫ్యాక్టరీ ఎక్కడ టెస్లా కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి అమెరికాలో టెక్సాస్, జర్మనీలోని బెర్లిన్‌లో రెండు గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మూడో ఫ్యాక్టరీని ఫ్యాక్టరీని చైనాలోని షాంగైలో కడతామంటూ ప్రకటించారు. ఇదే సమయంలో రష్యా ప్రభుత్వంతోనూ ఎలన్ మస్క్ చర్చలు ప్రారంభించారు. ఈ సంప్రదింపులు సానుకూలంగా జరిగాయని, త్వరలో టెస్లా గిగా ఫ్యాక్టరీ రష్యాలోని కోరోలెవ్లో నిర్మించబోతున్నారంటూ అక్కడి అధికారులు ప్రకటించారు. మాట మార్చారు రష్యాలో టెస్లా గిగా ఫ్యాక్టరీ ప్రకటన వెలువడి నెలలు గడుస్తోన్న పనులు ఇంకా ప్రారంభం కావకపోవడంతో ఓ రష్యన్ ఇదే విషయంపై ఎలన్ మస్క్‌ను ప్రశ్నించాడు. దీనికి ఎలన్ మస్క్ స్పందిస్తూ నాలుగో గిగా ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. Tesla has not yet decided on a fourth Gigafactory location — Elon Musk (@elonmusk) September 20, 2021 ఇండియాతో అదే తీరు ఇండియా విషయంలో సైతం ఎలన్ మస్క్ ఇదే తరహా వ్యవహర శైలిని కనబరిచారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కాలుష్యాన్ని వెలువరించవు కాబట్టి దిగుమతి సుంకాన్ని తగ్గించాలంటూ భారత్‌ని కోరారు. దీనికి ప్రతిగా ఇండియాలో ఫ్యాక్టరీ నెలకొల్పితే సుంకాల తగ్గింపు అంశం పరిశీలిస్తామంటూ భారత అధికారులు తేల్చి చెప్పారు. తేల్చి చెప్పారు దిగుమతి పన్నులు తగ్గిస్తే ముందుగా విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేస్తామని, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా నుంచి సంకేతాలు అందాయి. అయితే ఎలన్ మస్క్ వ్యవహార శైలిపై అంచనా ఉన్నా భారత అధికారులు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టత ఇస్తేనే పన్నుల తగ్గింపు అంశం పరిశీలిస్తామని కుండ బద్దలు కొట్టారు. ఇండియా కోసమేనా అమెరికా,యూరప్ మార్కెట్ల కోసం ప్రస్తుతం ఉన్న గిగా ఫ్యాక్టరీల సామర్థ్యం పెంచే యోచనలో టెస్లా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నాలుగో ఫ్యాక్టరీ విషయంలో రష్యాను కాదనుకోవడానికి కారణాలను ఎలన్ మస్క్ వివరించ లేదు. ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్ అయిన ఇండియాలో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకే రష్యాను పక్కన పెడుతున్నారా ? అనే వాదనలు సైతం తెర మీదకు వచ్చింది ఇప్పుడు. చదవండి : tesla car: కార్ల అమ్మకాల్లో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్, భారత్‌లో ఎప్పుడో !? -
భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్, చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్ మోటార్ కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! లాభాలకంటే నష్టాలే ఎక్కువ..! 2021 నాల్గవ త్రైమాసికం నాటికి గుజరాత్‌లోని సనంద్‌లో వాహనాల తయారీని, 2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎమ్ మోటార్స్ తరువాత భారత్ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్ నిలిచింది. 2017లో జనరల్ మోటార్స్ భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను ఫోర్డ్ చవిచూసింది. భారత్‌లో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్న పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం కంపెనీలో పనిచేసే 4 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. కోవిడ్ -19 లాక్డౌన్, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జులై నాటికి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20 శాతం యూనిట్లను మాత్రమే ఆపరేట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ ఇప్పటివరకు భారత్‌లో సుమారు రెండు బిలియన్ డాలర్లపైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉండగా, సంవత్సరానికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ భారత్‌లో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
ఆసియన్ గ్రానిటో రైట్స్ ఇష్యూ సెప్టెంబరు 23 నుంచి
న్యూఢిల్లీ: టైల్స్ తయారీలో ఉన్న ఆసియన్ గ్రానిటో రూ.224.65 కోట్ల రైట్స్ ఇష్యూ సెపె్టంబరు 23న ప్రారంభం కానుంది. అక్టోబరు 7న ముగియనుంది. ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.100గా నిర్ణయించారు. ఇష్యూ తదనంతరం మొత్తం షేర్లు 3.42 కోట్ల నుంచి 5.67 కోట్లకు చేరతాయి. రుణాల చెల్లింపులకు, వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2–3 ఏళ్లలో రుణ రహిత కంపెనీగా నిలవాలన్నది ఆసియన్ గ్రానిటో లక్ష్యం. -
తిరుపతిలో లెనోవో ట్యాబ్లెట్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు టెక్నాలజీ కంపెనీ లెనోవో తెలిపింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్లు, నోట్‌బుక్స్, స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి సామర్థ్యం అధికం చేసినట్టు లెనోవో ఇండియా ఎండీ శైలేంద్ర కత్యాల్ వివరించారు. ‘వింగ్‌టెక్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ట్యాబ్లెట్ పీసీల తయారీని ప్రారంభించాం. సాధారణ కస్టమర్లు, విద్యార్థులతోపాటు రిటైల్, తయారీ, ఆరోగ్య సేవల రంగానికి అవసరమైన ట్యాబ్లెట్లను ఇక్కడ రూపొందిస్తున్నాం. పుదుచ్చేరిలోని పీసీల తయారీ ప్లాంటులో మూడవ లైన్ ఏర్పాటు చేశాం. డిక్సన్ టెక్నాలజీస్ సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో మోటరోలా బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నాం. భారత్‌తోసహా పలు దేశాల్లోని 30కిపైగా ప్లాంట్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 180 మార్కెట్లలో విక్రయిస్తోంది’ అని తెలిపారు. -
దక్షిణ తెలంగాణలో ప్లాంటు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: భూసార పరిరక్షణలో నానో యూరియా కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ కలోల్‌లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణ నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని, ఈ దిశగా ఇఫ్కో యోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, నానో యూరియా వినియోగంతో భూసార పరిరక్షణతో పాటు తక్కువ వినియోగంతో అధిక దిగుబడులు సాధించే వీలుందన్నారు. మంత్రితో పాటు జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ ఉన్నతాధికారి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేశ్ రాలియా తదితరులున్నారు. విస్తృతంగా వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు రాష్ట్రంలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ దిశగా అధ్యయనం కోసం అత్యధిక పరిశ్రమలు ఉన్న గుజరాత్లో పర్యటించి పరిశ్రమలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శనివారం గుజరాత్‌లోని సబర్‌కాంఠ జిల్లాలో పరిశ్రమలను బృందం సందర్శించింది. ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీఎం కె.చంద్రశేఖరరావు సూచనల మేరకు జిల్లాల వారీగా పంట ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
‘సోలార్’ కేరాఫ్ హైదరాబాద్
దక్షిణ భారత దేశంలో సోలార్ పవర్ ఉత్పత్తికి హైదరాబాద్ కీలక కేంద్రం కానుంది. నగరానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ భారీ ఎత్తున సోలార్ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయనుంది. దీనికి సంబంధించిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. 1.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ సెల్, మ్యాడ్యుల్ తయారీ పరిశ్రమని 2021 జులై 19న హైదరాబాద్ నగరంలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ప్రారంభించబోతుంది. రూ. 483 కోట్ల వ్యయంతో ఈ తయారీ యూనిట్‌ను నెలకొల్పారు. ఇందులో 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగావాట్ల మాడ్యుల్స్ తయారీ సామర్థ్యంతో కంపెనీ పని చేయనుంది. అధునాతన మల్టీక్రిస్టలీన్, మోనో పీఈఆర్సీ టెక్నాలజీని ఈ యూనిట్లో ఉపయోగించనున్నారు. రాబోయే రోజుల్లో మరో రూ. 1200 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సోలార్ మాడ్యుల్ తయారీ యూనిట్‌ని విస్తరిస్తామని ప్రీమియర్ ఎనర్జీస్ తెలిపింది. విస్తరణ తర్వాత సంస్థ సోలార్ మాడ్యుల్ తయారీ సామర్థ్యం 3 గిగావాట్లకు చేరుకుంటుందని ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ చిరంజీవ్ సలూజా తెలిపారు. ఈ ఆర్థిక సంవ్సతరానికి రూ.1500 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతకు ముందు ఏడాది కంపెనీ రెవెన్యూ రూ. 850 కోట్లగా నమోదు అయ్యిందని ఆయన అన్నారు. -
హైదరాబాద్‌లో త్రీడీ ఉత్పత్తుల తయారీ
సాక్షి, హైదరాబాద్: అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఏఎంఎస్ఐ).. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖతో కలసి హైదరాబాద్‌లో జాతీయ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ (ఎన్సీఏఎం)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంప్యూటర్ ఆధారిత డిజైన్ల ఆధారంగా భారీ స్థాయిలో వాణిజ్య పరంగా త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులను తయారు చేయడాన్ని అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (ఏఎం)గా వ్యవహరి స్తున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే ఈ సెంటర్ ద్వారా జాతీయ స్థాయిలో అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ ప్రణాళికను అమలు చేస్తారు. రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం ఇటీవల అడిటివ్ మాన్యుఫాక్చరింగ్‌కు సంబంధించి వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో స్టార్టప్‌లు, శిక్షణ సంస్థలు, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు 40కి పైగా పాల్గొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏఎం పరిశ్రమను తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక, వ్యూహంపై ఇందులో చర్చించారు. దేశీయంగా ఏఎం పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశీయ మార్కెట్ విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, ఏఎం రంగం అభివృద్ధికి భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఎన్సీఏఎం పనిచేస్తుందని వర్క్ షాప్ అభిప్రాయపడింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు అవసరమైన మౌలిక వసతులను హైదరాబాద్‌లో ఎన్సీఏ ఎంలో ఏర్పాటు చేస్తారు. అడిక్టివ్ మాన్యుఫాక్చరింగ్‌కు సంబంధించి ఆవిష్కరణ, పరిశోధన వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. చదవండి: కేసీఆర్ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం చైన్ కట్ చేయకుంటే జూన్‌లో మళ్లీ విజృంభణ -
భారత్‌కు ‘హార్లే’ గుడ్‌బై!
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ విషయమై అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్‌ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్‌లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్‌లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్‌లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్ వివరణ ఇచ్చింది. అయితే, భారత్‌లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు. పునర్ నిర్మాణంలో భాగమే ‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్‌వైర్’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్ తన ప్రకటనలో వివరించింది. భారత్ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది. ట్రంప్ ఒత్తిడి.. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్ కూడా చేశారు. ఎంట్రీ.. ఎగ్జిట్ ► 2007 ఏప్రిల్‌లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్‌లు భారత మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. ► 2009 ఆగస్ట్‌లో హార్లే డేవిడ్సన్ ఇండియా కార్యకలాపాలు మొదలు ► 2010 జూలైలో మొదటి డీలర్షిప్ నియామకం, విక్రయాలు మొదలు ► 2011లో హరియాణాలోని ప్లాంట్‌లో బైక్‌ల అసెంబ్లింగ్ మొదలు ► విక్రయిస్తున్న మోడళ్లు: 11 ► ప్లాట్‌ఫామ్‌లు: 6 (స్పోర్ట్‌స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్) ► 2020 సెప్టెంబర్‌లో వైదొలగాలని నిర్ణయం -
టెలివిజన్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు మరికాస్త సమయం కావాలని గతేడాది పరిశ్రమ కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 దాకా కస్టమ్స్ సుంకం నుంచి కేంద్రం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి. ఈ గడువు తీరిపోతుండటంతో అక్టోబర్ 1 నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, సుంకం విధింపుతో టీవీల ధరలు దాదాపు 4 శాతం దాకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 32 అంగుళాల టీవీల రేట్లు రూ. 600 మేర, 42 అంగుళాల టీవీ రేటు రూ. 1,200–1,500 దాకా పెరుగుతాయని పేర్కొన్నాయి. అయితే, ఓపెన్ సెల్ ప్రాథమిక ధరను బట్టి చూస్తే దిగుమతి సుంకం భారం రూ. 150–250కి మించదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఓపెన్ సెల్ వంటి కీలకమైన ఉత్పత్తులను ఎల్లకాలం దిగుమతి చేసుకుంటూ ఉంటే దేశీయంగా టీవీల తయారీ రంగం ఎదగలేదని పేర్కొన్నాయి. ఇలాంటి వాటిని దేశీయంగా తయారు చేయడానికి సుంకం విధింపు తోడ్పడగలదని వివరించాయి. -
బైక్ లవర్స్ కు షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా హై-ఎండ్ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం దిశగా యోచిస్తోంది. కుర్రకారు డ్రీమ్ బైక్ అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాలనుంచి నిష్ర్కమించాలని భావిస్తోంది. భవిష్యత్తు డిమాండ్ పై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుందని తాజా వార్తల ద్వారా తెలుస్తోంది. హర్యానాలోని బావాల్ వద్ద తన ప్లాంట్ ను త్వరలోనే మూసివేయనుంది. ఈ మేరకు ఔట్సోర్సింగ్ ఒప్పందం నిమిత్తం కొంతమంది వాహన తయారీదారులను సంప్రదించినట్లు సమాచారం. గత నెలలో రెండవ త్రైమాసిక ఫలితాల సందర్భంగా హార్లే-డేవిడ్సన్ ఈ సంకేతాలు అందించింది. భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా లాభాలు లేని అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 2009 లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ 10 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి బైక్‌లతో దేశీయ కస్టమర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించింది. అంతేకాదు కొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా కొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో అటు దేశీయంగా ఇటు, అంతర్జాతీయంగా ఆటో మొబైల్ రంగం ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. విక్రయాలు దాదాపు శూన్యం కావడంతో స్పేర్ పార్ట్స్ ని కూడా విక్రయించుకోలేని స్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలోనే హార్లే డేవిడ్సన్ ఇండియాలో గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించింది. 2018 లో విక్రయించిన 3,413 యూనిట్లతో పోలిస్తే 2019 లో 22 శాతం తగ్గి 2,676 యూనిట్లకు చేరుకోగా, 2020 ఏప్రిల్- జూన్ మధ్య కేవలం 100 బైక్‌లను మాత్రమే విక్రయించినట్టు కంపెనీ తాజా నివేదికలో తెలిపింది. మార్కెట్ పరంగా తమకు భారత్ అత్యంత చెత్త మార్కెట్ అని పేర్కొంది. అయితే తాజా ఊహాగానాలపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది. హార్లే-డేవిడ్సన్ నిష్క్రమణ అంచనాలు నిజమైతే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి భారతదేశంలో కార్యకలాపాలను మూసివేసిన రెండవ వాహన తయారీదారుగా హార్లే-డేవిడ్సన్. 2017 లో జనరల్ మోటార్స్ గుజరాత్ ప్లాంట్ ను విక్రయించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో పెట్టుబడుల జోరు..!
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈస్టర్ పిల్మ్ టెక్ అనే పాలిస్టర్ తయారీ సంస్థ రూ.1,350 కోట్లతో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వర్గాలు సొమవారం తెలిపాయి. ఈ తయారీ సంస్థ స్థాపనతో ప్రత్యక్షంగా 800 మందికి ఉపాధి లభించనుంది. ప్యాకేజింగ్ విభాగంలో రాష్ట్రానికి 30 నుంచి 40 శాతం ఉత్పత్తే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. మొదటి దశలో(2022 సంవత్సరం చివరి నాటికి) రూ.50 0కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఈస్టర్ పిల్మ్ టెక్ భావిస్తోంది. ఈస్టర్ సంస్థ ఇంజనీరింగ్, ప్లాస్టిక్ తదితర రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రస్తుతం 56 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఉత్తరఖండ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో తయారు ప్లాంట్లను నెలకొల్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సరళీకృత పెట్టుబడుల విధానం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చదవండి: శంకర్ పల్లికి భారీగా పెట్టుబడులు -
కరువు సీమలో కరెంటు బస్సు
కరువు జిల్లా ‘అనంత’ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలక్ట్రికల్ బస్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ‘వీర వాహన’తో ఒప్పందం చేసుకుంది. సోమందేపల్లి సమీపంలో అధికారులు ఇప్పటికే 124 ఎకరాలు సేకరించగా.. కంపెనీ ప్రతినిధులు పనులు ప్రారంభించారు. రూ.1000 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో 13 వేల ఉద్యోగాలు దక్కుతాయని భావిస్తున్నారు. సాక్షి, అనంతపురం : ‘కియా’ కార్ల యూనిట్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ‘అనంత’లో మరో భారీ వాహనాల కంపెనీ ఏర్పాటు కాబోతోంది. కరువు జిల్లా ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను జిల్లాలో నెలకొల్పుతున్నారు. కియా మోటార్స్ తరహాలోనే జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల యూనిట్ నెలకొల్పేందుకు వీర వాహన కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని సైతం చేసుకుంది. రూ.1000 కోట్ల పెట్టుబడి వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1000 కోట్లతో జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఒప్పందాలు కూడా పూర్తి కాగా... జిల్లా అధికారులు సోమందేపల్లి మండల సమీపంలోని గుడిపల్లి గ్రామంలో 124 ఎకరాల భూమిని కేటాయించారు. ఏటా 3 వేల బస్సుల తయారీ లక్ష్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న వీర వాహన్ కంపెనీ ప్రతినిధులు తమకు కేటాయించిన భూమిలో పనులను సైతం ప్రారంభించారు. వచ్చే రెండేళ్లలోపు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాకుండా అనుబంధ కంపెనీలు సైతం ఇక్కడే నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో భూములను కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. (7వ తేదీలోపు 17 వేల పోస్టుల భర్తీ) 13 వేల మందికి ఉపాధి వీర వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి... మొత్తంగా 13 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. మొన్న ‘కియా’...తాజాగా ‘వీర వాహన’ ఇలా అంతర్జాతీయంగా పేరుగాంచిన వాహనాల తయారీ సంస్థలు జిల్లాకు రావడంతో పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అగ్రిమెంట్ పూర్తి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీర వాహన కంపెనీకి సోమందేపల్లి మండల సమీపంలో 124 ఎకరాల భూమిని కేటాయించాం. ఇప్పటికే సేల్ అగ్రిమెంట్‌ను సైతం పూర్తి చేశాం. కంపెనీ ప్రతినిధులు ప్రస్తుతం యూనిట్‌ను నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టారు. మరో రెండేళ్లలోపే యూనిట్లో బస్సుల తయారీ ప్రారంభమవుతుంది. – పద్మావతి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, హిందూపురం -
వెల్స్పన్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం చందనవెళ్లి గ్రామంలో వెల్స్పన్ ఫ్లోరింగ్ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. శనివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెందిన కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం. ఈ కంపెనీ రూ. 2వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా స్ధానిక యువతకు ఉద్యోగవకాశాలు కల్పించబడతాయి. ఈ పారిశ్రామిక క్లస్టర్లో మరో నాలుగు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. 3600 ఎకరాల్లో ఇక్కడ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చందనవెళ్లి పారిశ్రామిక పార్క్‌కి అవసరమైన మౌలిక వసతులు, రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ చొరవతో షాబాద్ మండలం చందనవెళ్లిలో ఇంత పెద్ద సంస్థ ఏర్పాటు అయ్యింది. ఇక్కడి ప్రజలు కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ భవిష్యత్తు ఆశదీపంగా కనిపిస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతూ నేడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ ఎక్కడికెళ్లినా తెలంగాణకు పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అందరూ దీనిని మన కంపెనీ గా భావించాలి. పారిశ్రామిక అభివృద్ధితో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. (కరుణించిన కేసీఆర్) రూ.2వేల కోట్ల పెట్టుబడులతో సంస్థ ఏర్పాటు చేయటం, రానున్న కాలంలో మరిన్ని సంస్థలు రానుండటంతో వచ్చే 5 ఏళ్ల కాలంలో షాబాద్ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోనూ అతి పెద్ద ఫార్మా సిటీ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది' అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు కాలే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఎల్సీ మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి,డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి , జీవన్ రెడ్డి, బాల్క సుమన్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు బాల మల్లు, నాగేందర్ గౌడ్, కలెక్టర్ అమయ్ కుమార్, కంపెనీ సీఈఓ గోయెంక్ పాల్గొన్నారు. -
వెల్స్పన్ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
‘అట్లాస్’ మళ్లీ వస్తుందా..?
న్యూఢిల్లీ: అట్లాస్ సైకిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్దాలుగా లక్షలాది భారతీయుల కుటుంబాలకు సైకిళ్లను అందించిన ఈ కంపెనీ ఇప్పుడు నిధుల్లేక అల్లాడిపోతోంది. కార్యకలాపాల నిర్వహణకు చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి ఏర్పడడంతో దేశ రాజధాని సమీపంలోని సాహిదాబాద్లో ఉన్న చివరి ప్లాంట్‌ను కూడా అట్లాస్ సైకిల్స్ మూసివేసింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం అయిన జూన్ 3నే కంపెనీ ప్లాంట్ మూతపడడం యాదృచ్ఛికం. అయితే, ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని కంపెనీ సీఈవో ఎన్పీ సింగ్ రాణా ప్రకటించారు. తాము అనుకున్నట్టుగా కంపెనీ వద్ద మిగులు భూమిని విక్రయించి రూ.50 కోట్లు సమీకరించగలిగితే.. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అట్లాస్ సైకిల్స్ సాహిదాబాద్ ప్లాంట్‌లో 431 మంది కార్మికులు పనిచేస్తుండగా.. ఇప్పుడు వారు ఉపాధి కోల్పోయారు. నష్టాల వల్లే..: అట్లాస్ సైకిల్స్‌ను నష్టాలే ముంచేశాయి. 2014 నుంచి ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో 2014 డిసెంబర్లో మలన్పూర్ ప్లాంట్‌కు కంపెనీ తాళాలు వేసేసింది. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో నష్టాలు మరింత అధికమయ్యాయి. ఫలితంగా 2018 ఫిబ్రవరిలో హరియాణాలోని సోనిపట్ ప్లాంట్‌ను కూడా కంపెనీ మూసేసింది. సోనిపట్ ప్లాంట్ కంపెనీకి మొదటిది. 1951లో దీన్ని జానకిదాస్ కపూర్ ప్రారంభించారు. 1965 నాటికి అట్లాస్ సైకిల్స్ దేశంలోనే అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీగా అవతరించింది. విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా 40 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే ప్రముఖ సైకిళ్ల కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకుంది. 1982లో ఏషియన్ గేమ్స్‌కు సైకిళ్లను సరఫరా చేసింది. తిరిగి వస్తాం..: కంపెనీ సీఈవో రాణా మాత్రం ప్లాంట్ మూసివేత తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ‘‘ప్లాంట్‌ను మూసివేయలేదు. దీనిపై ఎంతో తప్పుడు సమాచారం నెలకొని ఉంది. ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తాం. ఉద్యోగులను కూడా తొలగించలేదు. తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశామంతే. మిగులు భూమి విక్రయానికి అనుమతించాల్సిందిగా ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేసుకున్నాం. అనుమతి వచ్చిన వెంటనే భూ విక్రయాన్ని చేపట్టి, నిధులు అందిన వెంటనే ప్లాంట్‌ను తిరిగి తెరుస్తాం. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ సమస్య లేదు. 70 ఏళ్ల బ్రాండ్ మాది. తిరిగి నిలదొక్కుకుంటాం’’ అని రాణా వివరించారు. -
ఎస్‌హెచ్‌జీలకు మాస్కుల తయారీ కాంట్రాక్టు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసుల రక్షణకు పెద్ద ఎత్తున మాస్కుల తయారీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అప్పగించింది. మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆదివారం, సోమవారం పలు దఫాలుగా మున్సిపల్ కమిషనర్లు, మెప్మా మిషన్ కో–ఆర్డినేటర్లతో మాస్కుల తయారీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ని బంధనలకు లోబడి సామాజిక దూరం పాటించడంలో భాగంగా కొత్త టెక్నాలజీని (జూమ్ యాప్) ఉపయోగించి అధికారులు వారి ఇంటి నుంచే మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ వెబ్ కెమెరా ద్వారా దాదాపు 300 మంది అధికారులతో (కమిషనర్లు, మెప్మా అధికారులు) డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సంఘాల మహిళలు ఇంటి వద్దే తమ వద్ద ఉన్న కుట్టు మెషీన్ల ద్వా రా యుద్ధ ప్రాతిపదికన 3 లక్షల మాస్క్ ల తయారీకి ఆదేశించారు. ఒక మాస్క్ తయారీకి అయ్యే ఖర్చును కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.14 చొప్పున కొనుగోలు చేసేందుకు మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ పరిపాలన అనుమతులు ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వహించే మున్సిపల్, పోలీసు, వీధి విక్రయదారులు తప్పక మాస్క్ ధరించాలని ఆదేశించారు. -
టెక్నో పెయింట్స్ మరింత కలర్‌ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టివ్ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్లు సీవీఎల్ఎన్ మూర్తి, సత్యనారాయణ రెడ్డి, సీఈవో కె.అనిల్‌తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డీలర్ నెట్వర్క్ ద్వారా రిటైల్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇప్పటికే 30 కోట్ల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ప్రాజెక్టులకు రంగులు అందించామని పేర్కొన్నారు. రూ.250 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని వెల్లడించారు. రెండింతలకు సామర్థ్యం..: ప్రస్తుతం టెక్నో పెయింట్స్‌కు అయిదు ప్లాంట్లున్నాయి. వీటన్నిటి వార్షిక సామర్థ్యం 42,000 మెట్రిక్ టన్నులు. ఆరవ ప్లాంటును హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నెలకొల్పుతున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంటు కోసం రూ.25 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏడాదిలో సిద్ధం కానున్న కొత్త ప్లాంటుతో సామర్థ్యం రెండింతలకు చేరుతుంది. నూతనంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2018–19లో రూ.62 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90 కోట్లు ఆశిస్తున్నాం. రెండేళ్లలో రూ.250 కోట్ల టర్నోవర్ లక్ష్యం. ఆఫ్రికాలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాదితోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సేవలు అందిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని వివరించారు. -
వడోదరలోని గ్యాస్ కర్మాగారంలో పేలుడు
వడోదర: గుజరాత్ వడోదర జిల్లాలోని ఓ మెడికల్ గ్యాస్ తయారీ కర్మాగారంలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో పద్రా తహసీల్ గవాసద్ గ్రామంలోని ఎయిమ్స్ ఇండస్ట్రీస్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. సిలిండర్లలో గ్యాస్ నింపే సమయంలో ఈ పేలుడు సంభవించిందని వడోదర రూరల్ ఎస్పీ సుధీర్ చెప్పారు. -
పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా గురువారం నిర్వహించిన ‘గ్రాండ్ ఓపెనింగ్’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది. ప్లాంట్ పరిశీలించిన సీఎం.. కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకుని అక్కడి నుంచి కియా ప్లాంటు వద్దకు వచ్చారు. ప్లాంటులో కార్ల తయారీ యూనిట్‌కు సంబంధించిన అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి మంచి సహకారం: కియా గ్లోబల్ సీఈవో హన్ తమ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని కియా సంస్థ గ్లోబల్ సీఈవో హన్ ఊ పాక్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రపంచస్థాయి కార్ల తయారీ యూనిట్ల సరసన నిలుస్తుందన్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల కార్లను విక్రయించాలనేది తమ లక్ష్యమని, అనంతపురం యూనిట్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న ‘కియా కార్నివల్’ కారును భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు నెలల్లో 40,649 కార్ల విక్రయం కియా ప్లాంటులో తయారైన సెల్టోస్ కారుకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని హన్ తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 6,046 బుకింగ్స్ వచ్చాయన్నారు. గత నాలుగు నెలల్లోనే 40,649 కార్లను విక్రయించినట్లు తెలిపారు. కొరియా సంస్థలకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని భారత్‌లో కొరియా రాయబారి బోంగో కిల్‌షిన్ చెప్పారు. కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్యున్ షిమ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కియా కార్ల గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న కియా సంస్థ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన కియా ప్రతినిధులు -
ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్ ట్రాకర్స్ తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్... ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి చెప్పారు. సేల్స్ డైరెక్టర్ పి.ఆర్.రాజారామ్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్ 140 ప్రమాణాలు గల జీపీఎస్ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400–500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. హైదరాబాద్ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పరికరాలకు భారీ డిమాండ్..: నవంబర్ 26 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ల వాడకం తప్పనిసరి చేశారు. 25,000 వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కోణార్క్ తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఐఎస్ 140 ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ మాదే. ఏపీలో ఉన్న డిమాండ్ కంపెనీకి కలిసొస్తుంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటికి 2 లక్షల పైగా పరికరాల్ని విక్రయించాం. ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాకర్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచాం. ఏప్రిల్–సెప్టెంబర్‌లో 70,000 యూనిట్లు విక్రయించాం. ఏపీ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని కోణార్క్ వివరించారు. -
టెక్నో పెయింట్స్ మరో తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ రంగంలోని హైదరాబాదీ కంపెనీ ఫార్చూన్ పెయింట్స్ (టెక్నో పెయింట్స్) మరో తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్లాంట్, ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫార్చూన్ గ్రూప్ ఎండీ ఆకూరి శ్రీనివాస రెడ్డి చెప్పారు. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తామని, ఇందులో 50 మంది ఉద్యోగులుంటారని తెలియజేశారు. ఏపీఎస్ రీసెర్చ్ అండ్ మీడియా ఇంటర్నేషనల్ సంస్థ 2019వ సంవత్సరానికి ఫార్చూన్ పెయింట్స్‌కు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ విభాగంలో క్వాలిటీ మ్యానుఫాక్చరింగ్ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 20 వేల మెట్రిక్ టన్నులు.. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో రెండు, గుంటూరులోని నడికుడిలో మరో తయారీ కేంద్రం ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20 వేల మెట్రిక్ టన్నులు. ‘‘ఇప్పటివరకు రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాల నుంచి ముడి సరుకులను దిగుమతి చేసుకొని, పెయింట్స్, సొల్యూషన్స్‌ను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రానైట్ టెక్స్చర్, మార్బుల్ ఫినిష్ పెయింటింగ్‌ల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాం’’ అని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రూ.100 కోట్ల టర్నోవర్..: ఫార్చూన్ గ్రూప్‌నకు ఫార్చూన్ పెయింట్స్, ఫినెట్రీ యూపీవీసీ, ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, టెక్నో ట్రేడర్స్ కంపెనీలున్నాయి. తమ గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్ నమోదు చేసిందని, దీన్లో పెయింట్ల విభాగానిది రూ.70 కోట్లని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ‘‘మా ఆదాయంలో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి 50 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 600కు పైగా ప్రాజెక్ట్‌లకు పెయింటింగ్‌ను పూర్తి చేశాం. మై హోమ్, అపర్ణా, శోభ, పూర్వాంకర వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ మా క్లయింట్లే. ఇటీవలే అమరావతిలో కార్యాలయాన్ని ప్రారంభించాం’’ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఏప్రిల్‌లో సేవలు పేలవం: నికాయ్
న్యూఢిల్లీ: సేవల రంగం ఏప్రిల్‌లో నీరసించింది. ఇండెక్స్ 51గా నమోదయినట్లు నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ తెలియజేసింది. సూచీ ఈ స్థాయికి కిందకు రావడం ఏడు నెలల్లో ఇదే తొలిసారి. కొత్త వ్యాపారాల్లో స్వల్ప పెరుగుదల, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి తాజాగా సేవల రంగం సూచీపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నికాయ్సూచీ 50 పైన కొనసాగితే దానిని వృద్ధిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన సేవల రంగం వరుసగా 11 నెలల నుంచీ 50 పైనే కొనసాగుతోంది. తయారీ కూడా నెమ్మదే...! భారత తయారీ రంగం వృద్ధి ఏప్రిల్‌లో నెమ్మదిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనిశ్చితి ప్రభావం ఏప్రిల్‌లో తయారీ రంగంపై కనిపించింది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 51.8గా నమోదయ్యింది. మార్చిలో ఇది 52.6 పాయింట్లు. ఆగస్టు తరువాత ఇంత తక్కువ స్థాయికి (51.8) సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50పైన పాయింట్లు కొనసాగడం ఇది వరుసగా 21వ నెల. సేవలు, తయారీ రెండూ కలిపినా నిరాశే.. కాగా సేవలు, తయారీ రంగం రెండూ కలిసిన నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా నిరాశగానే ఉంది. మార్చిలో 52.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ ఏప్రిల్‌లో 51.7కు తగ్గింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్ 3 నుంచి 6వ తేదీ మధ్య జరుగనున్న నేపథ్యంలో ఈ తాజా గణాంకాలు వెలువడ్డాయి. -
28వేల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ జియోనీ హరియాణాలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈమేరకు హరియాణా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడతగా రూ.500 కోట్ల పెట్టుబడితో దాదాపు 50 ఎకరాల్లో తయారీ యూనిట్‌ను ఫరీదాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రానున్న మూడేళ్లలో దాదాపు 28వేల మంది ఉపాధి కల్పించనున్నట్టు జియోనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం తమకు అత్యంత ముఖ్యమైన మార్కెట్ గా భావిస్తున్నామని ఇక్కడ విశేషమైన వృద్ధి ఉందని జియోనీ మొబైల్ చైర్మన్ లియు లిరాంగ్ చెప్పారు. 30 మిలియన్ యూనిట్లుప్రస్తుత వార్షిక సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. తాజా నూతన తయారీ కేంద్రం నుంచి నెలకు రూ.6 లక్షల మొబైళ్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాన్నారు. భవిష్యత్‌లో దీన్ని ఎగుమతి కేంద్రంగా కూడా ఉపయోగించనున్నట్లు జియోని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా ఇనీషియేటివ్ లో భాగంగా తమ సొంత తయారీ యూనిట్లపై దృష్టిపెట్టినట్టు జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ వోరా తెలిపారు. కాగా 2013 లో భారత మార్కెట్లో ప్రవేశించిన జియోని 2015 చివరి నాటికి రూ 3,250 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్టు మార్కెట్ వర్గాల విశ్లేషణ. మరోవైపు ఈ సంవత్సరం చివరినాటికి మూడు రెట్లు టర్నోవర్ పై కంపెనీ దృష్టిపెట్టింది. జియోనీకి తమిళనాడు, నోయిడాలో రెండు యూనిట్లు ఉన్నాయి. -
నకిలీ డిటర్జెంట్ తయారీ కేంద్రంపై దాడులు
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డిటర్జెంట్, తేనె, నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. సర్ఫ్ఎక్సెల్ పేరుతో నకిలీ డిటర్జెంట్ తయారీ చేస్తున్నట్టు హిందూస్థాన్ యూనీలీవర్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నాగార్జుననగర్‌లో ఓ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. శ్రీనివాస్, సాగర్ అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష విలువజేసే నకిలీ డిటర్జెంట్, రూ.5 లక్షల విలువ జేసే నకిలీ నెయ్యి, తేనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
మళ్ళీ దేశీయ మార్కెట్లోకి థామ్సన్ బ్రాండ్
తొలుత ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా ఎల్ఈడీ టీవీల అమ్మకాలు - రూ. 300 కోట్లతో హైదరాబాద్‌లో తయారీ యూనిట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుమారు పదేళ్ల విరామం అనంతరం థామ్సన్ బ్రాండ్ దేశీయ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలో రూ. 300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం థామ్సన్ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే విధంగా రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్‌తో కంపెనీ ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ యూనిట్ నుంచి తయారైన ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు మంగళవారం మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. వచ్చే మూడేళ్లలో ఈ యూనిట్‌పై రూ. 300 కోట్ల పెట్టుబడితో పాటు, మార్కెటింగ్ కోసం రూ. 50 కోట్లు వ్యయం చేయనున్నట్లు రిసెల్యూట్ ఎలక్ట్రానిక్స్ సీఈవో ఎ.గోపాలకృష్ణ తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మూడు మోడల్స్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ రేటు కంటే 10 నుంచి 12 శాతం తక్కువ ధరకే వీటిని అందించనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరునెలల్లో టీవీల తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఏసీలను తయారు చేసి విక్రయించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడాదిలోగా 500 స్టోర్లను, ఆ తర్వాత 1,000 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏటా 10 శాతం వృద్ధితో ప్రస్తుతం రూ. 80,000 కోట్లుగా ఉన్న దేశీయ ఎలక్ట్రానిక్ కన్సూమర్ మార్కెట్లో మూడేళ్లలో 5 శాతం వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు తెలిపారు. ఈ మార్కెట్ పరిమాణం 2020 నాటికి రూ. 1.25 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కృష్ణ తెలిపారు. మొదటి ఏడాది రూ. 200 కోట్ల అమ్మకాలను జరుపుతామన్న ధీమా ను ఆయన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో అనుబంధ కంపెనీ థామ్సన్ ఇండియా పేరుతో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినా వ్యూహాత్మక వ్యాపార నిర్ణయంలో భాగంగా 2005లో వెనక్కి వెళ్ళినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ హబ్‌గా హైదరాబాద్ తమ ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘మేకిన్ తెలంగాణ’కు మంచి స్పందన లభిస్తోందని తారకరామారావు తెలిపారు. ఇప్పటికే పలు మొబైల్ కంపెనీలు తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయని, ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీ థామ్సన్ కూడా ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ. 350 కోట్లు వ్యయం చేయడం ద్వారా నేరుగా 500 మందికి పరోక్షంగా మూడు రెట్ల మందికి ఉపాధి లభించనుందన్నారు. అంతర్జాతీయ కంపెనీల రాకతో హైదరాబాద్ ఎలక్ట్రానిక్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. -
స్పెషల్ ఎడిషన్: తెలంగాణలో సెల్కాన్ మొబైల్ అసెంబ్లింగ్
-
తెలంగాణలో సెల్కాన్ మొబైల్ అసెంబ్లింగ్