హెటిరో చేతికి జాన్సన్‌ ప్లాంటు | Hetero acquires Johnson and Johnson manufacturing plant | Sakshi
Sakshi News home page

హెటిరో చేతికి జాన్సన్‌ ప్లాంటు

Published Tue, Oct 18 2022 1:23 AM | Last Updated on Tue, Oct 18 2022 1:23 AM

Hetero acquires Johnson and Johnson manufacturing plant - Sakshi

హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ సంస్థ హెటిరో తాజాగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన ఇంజెక్టేబుల్స్‌ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసినట్టు సోమవారం ప్రకటించింది. డీల్‌ విలువ రూ.130 కోట్లు. హైదరాబాద్‌ సమీపంలోని పెంజెర్ల వద్ద 55.27 ఎకరాల్లో ఈ ప్లాంటు విస్తరించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెటిరో ఫ్లాగ్‌షిప్‌ స్టెరైల్‌ ఫార్మాస్యూటికల్, బయోలాజిక్స్‌ తయారీ యూనిట్‌గా ఇది నిలవనుంది.

ఈ కేంద్రంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాల ఆధునీకరణకు, మెరుగుపరచడానికి, బయోలాజిక్స్, స్టెరైల్‌ ఫార్మాస్యూటికల్‌ ఉత్పత్తుల తయారీని విస్తరించడానికి సుమారు రూ.600 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉన్నట్టు హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఫెసిలిటీ ద్వారా బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, మాలిక్యులర్‌ బయోసైన్సెస్, ఇంజనీరింగ్, అనుబంధ విభాగాల్లో నూతనంగా 2,000 ఉద్యోగాలను జోడించాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ డీల్‌కు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా పీడబ్ల్యూసీ వ్యవహరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement