న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి మార్చిలో మందగించింది. విద్యుత్, తయారీ రంగాల పేలవ పనితీరుతో అయిదు నెలల కనిష్టానికి పడిపోయి.. 1.1%గా నమోదైంది. చివరిసారిగా 2022 అక్టోబర్‌లో అత్యంత తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. అప్పట్లో ఐఐపీ 4.1% క్షీణించింది. గతేడాది మార్చిలో ఇది 2.2% కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) డేటా ప్రకారం ...
► విద్యుదుత్పత్తి రంగం 6.1 శాతం వృద్ధి నుండి 1.6 శాతం క్షీణత నమోదు చేసింది.
► తయారీ రంగం వృద్ధి 1.4 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది.
► మైనింగ్ రంగం ఉత్పత్తి 3.9 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది.
► క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 2.4 శాతం నుంచి 8.1 శాతానికి ఎగిసింది.
► ప్రైమరీ గూడ్స్ వృద్ధి గత మార్చిలో 5.7% ఉండగా ప్రస్తుతం 3.3%గా నమోదైంది.
► కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 3.1 శాతం నుంచి మైనస్ 8.4 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ తాజాగా మైనస్ 3.1%కి చేరింది.
► ఇన్‌ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల వృద్ధి 5.4 శాతంగా ఉంది. గత మార్చిలో ఇది 6.7 శాతం.
► 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 11.4%.
పారిశ్రామికోత్పత్తి డౌన్
Published Sat, May 13 2023 4:40 AM | Last Updated on Sat, May 13 2023 4:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment