Index of Industrial Production
-
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్ 1.2 6.8 విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్ గూడ్స్ 6.1 10 కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0 కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9 ఇన్ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్ 2.5 3.3 ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8 -
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెలవారీగా చూస్తే సెపె్టంబర్లో మందగించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 10.3 శాతంగా ఉంది. గతేడాది సెపె్టంబర్లో ఐఐపీ 3.3 శాతంగా నమోదైంది. తాజాగా తయారీ, మైనింగ్ రంగాలు మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సమీక్షాకాలంలో ఐఐపీ 6 శాతానికి పరిమితమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం.. ► తయారీ రంగ వృద్ధి 4.5 శాతంగా (గత సెప్టెంబర్‌లో రెండు శాతం) నమోదైంది. ► విద్యుదుత్పత్తి వృద్ధి గత సెపె్టంబర్లో 11.6 %గా ఉండగా ఈసారి 9.9%కి పరిమితమైంది. ► మైనింగ్ ఉత్పత్తి గతేడాది సెపె్టంబర్లో మైనస్ 5.2 శాతంగా ఉండగా ఈ ఏడాది సెపె్టంబర్లో 11.5 శాతం పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ వృద్ధి 7.4 శాతంగా (గత సెపె్టంబర్లో 11.4 శాతం) నమోదైంది. కన్జూమర్ డ్యూరబుల్స్ వృద్ధి గత సెపె్టంబర్లో మైనస్ 5.5 శాతంగా ఉండగా ఈసారి ఒక్క శాతం మేర నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి మైనస్ 5.7 శాతం నుంచి 2.7 శాతానికి చేరింది. ► మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల వృద్ధి 7.5% గా ఉంది. గత సెపె్టంబర్లో ఇది 8.2 శాతం. -
పారిశ్రామికోత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి మార్చిలో మందగించింది. విద్యుత్, తయారీ రంగాల పేలవ పనితీరుతో అయిదు నెలల కనిష్టానికి పడిపోయి.. 1.1%గా నమోదైంది. చివరిసారిగా 2022 అక్టోబర్‌లో అత్యంత తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. అప్పట్లో ఐఐపీ 4.1% క్షీణించింది. గతేడాది మార్చిలో ఇది 2.2% కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) డేటా ప్రకారం ... ► విద్యుదుత్పత్తి రంగం 6.1 శాతం వృద్ధి నుండి 1.6 శాతం క్షీణత నమోదు చేసింది. ► తయారీ రంగం వృద్ధి 1.4 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది. ► మైనింగ్ రంగం ఉత్పత్తి 3.9 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 2.4 శాతం నుంచి 8.1 శాతానికి ఎగిసింది. ► ప్రైమరీ గూడ్స్ వృద్ధి గత మార్చిలో 5.7% ఉండగా ప్రస్తుతం 3.3%గా నమోదైంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 3.1 శాతం నుంచి మైనస్ 8.4 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ తాజాగా మైనస్ 3.1%కి చేరింది. ► ఇన్ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల వృద్ధి 5.4 శాతంగా ఉంది. గత మార్చిలో ఇది 6.7 శాతం. ► 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 11.4%. -
అనిశ్చితిలోనూ ఎకానమీ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు కూల్... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది. -
జనవరిలో మౌలిక రంగం ఊరట
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ జనవరిలో మంచి ఫలితా న్ని నమోదు చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు సమీక్షా నెల్లో 7.8 శాతంగా నమోదయ్యింది. 4 నెలల గరిష్ట స్థాయి ఇది. క్రూడ్ ఆయిల్ (1.1 శాతం క్షీణత) మినహా మిగిలిన ఏడు రంగాలూ వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. వీటిలో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్–జనవరి మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 49.27 శాతం. -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7% ఉంటే, సెప్టెంబర్‌లో 7.41%కి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7% క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1%. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9% క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16% నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20% నుంచి 5%కి పడిపోయింది. -
మళ్లీ పరిశ్రమలు మైనస్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం వెలువడిన గణాంకాలు నిరాశపరిచాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2021 జనవరిలో 1.6 శాతం క్షీణించింది. 2020 జనవరిలో ఐఐపీ 2.2 శాతం వృద్ధిలో ఉంది. ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 5.03 శాతానికి చేరింది. గడచిన మూడు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి 2–6 శాతం శ్రేణిలోనే ఉన్నప్పటికీ, మూడు నెలల గరిష్టానికి చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణంమే ప్రాతిపదిక కావడం గమనార్హం. తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవస్థలో డిమాండ్ పెంపునకు మరో విడత రెపో తగ్గింపునకు రిటైల్ ద్రవ్యోల్బణం ‘అడ్డంకిగా కొనసాగే’ అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ‘ద్రవ్యోల్బణం భయాలతో’ యథాతథ రేటును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతకు ఆహార ధరల పెరుగుదల కారణం కావడం మరో కీలకాంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... కీలక రంగాలు పేలవం ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.6 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో ఉత్పత్తి 2020 జనవరితో పోల్చితే, 2021 జనవరిలో 2 శాతం క్షీణించింది. 2020 ఇదే నెలలో ఈ విభాగంలో 1.8 శాతం వృద్ధి నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో క్షీణత భారీగా 9.6 శాతంగా నమోదయ్యింది. 2020 జనవరిలో ఈ క్షీణత 4.4 శాతంగానే ఉంది. ► కన్జూమర్, నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రెండు విభాగాలూ జనవరిలో క్షీణతను నమోదుచేసుకున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 0.2 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక సబ్బులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కాస్మెటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ (నాన్ డ్యూరబుల్స్) విభాగం ఏకంగా 6.8 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం గమనార్హం. 2020 జనవరిలోనూ ఈ రెండు విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. ► మైనింగ్: 3.7 శాతం మైనస్‌లో ఉంది. ► విద్యుత్: ఈ విభాగంలో మాత్రం 5.5 శాతం ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది. కరోనా నేపథ్యంలో... కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 1.56 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా (తొలి అంచనా 1 శాతం నుంచి ఎగువ దిశలో తాజా సవరణ), తిరిగి జనవరిలో క్షీణతలోకి జారిపోయింది. ఏప్రిల్–జనవరి మధ్య 12.2 శాతం క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జనవరి వరకూ చూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి 12.2 శాతంగా ఉంది. 2019–20 ఇదే కాలంలో కనీసం స్వల్పంగానైనా 0.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఆహార ధరలు పైపైకి... రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2021 ఫిబ్రవరిలో ఫుడ్ బాస్కెట్‌కి సంబంధించి ధరల స్పీడ్ 3.87 శాతంగా ఉంది (2020 ఇదే నెలతో పోల్చి). జనవరిలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 1.87 శాతంగా ఉంది. ఇందులో వేర్వేరుగా చూస్తే ఆయిల్, ఫ్యాట్స్ విభాగంలో ధరలు ఏకంగా 20.78 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 6.28 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 6.27 శాతం తగ్గాయి. జనవరిలో ఈ తగ్గుదల ఏకంగా 15.84 శాతం ఉండడం గమనార్హం. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.59 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 12.54 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 11.13 శాతం పెరిగాయి. ఇక ‘ప్యూయెల్ అండ్ లైట్’ విభాగంలో ద్రవ్యోల్బణం 3.53 శాతంగా నమోదయ్యింది. హెల్త్ కేటగిరీ ద్రవ్యోల్బణం 6.33 శాతంగా ఉంటే, రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ధరల స్పీడ్ 11.36 శాతంగా ఉంది. -
ఎకానమీ ప్రగతిబాట!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య, పరపతి విధానం కొనసాగింపునకు తగిన ఆర్థిక గణాంకాలు శుక్రవారం వెలువడ్డాయి. 2020 డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి ‘పాజిటివ్’లోకి మారింది. ఒక శాతం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగం కొంత మెరుగవడం దీనికి ప్రధాన కారణమని తాజా గణాంకాలు తెలిపాయి. ఇక ఆర్బీఐ తన పాలసీ విధానానికి ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతంగా నమోదయ్యింది. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6% –2% శ్రేణిలో (ప్లస్ లేదా మైనస్ 2తో 4 శాతంగా) ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు ఇలా... మైనింగ్ మినహా అన్నీ మెరుగే... ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ రంగం 2020 డిసెంబర్లో 1.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 5.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2019 డిసెంబర్లో ఈ రంగం 0.1 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యం త్రాల ఉత్పత్తికి సూచికగా ఉండే ఈ విభాగంలో వృద్ధి 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. 2020 డిసెంబర్లో 18.3 శాతం క్షీణత నెలకొంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: దీర్ఘకాలం మన్నే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 4.9 శాతంగా నమోదయ్యింది. 2019 డిసెంబర్లో 5.6 శాతం క్షీణత ఈ విభాగంలో ఉంది. ► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు చెందిన ఈ విభాగంలో సైతం రెండు శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 డిసెంబర్లో ఈ విభాగంలో క్షీణ రేటు 3.2 శాతం. ► మైనింగ్: మైనింగ్ రంగం 4.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2019లో ఈ రంగం 5.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణత కాగా పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణించింది. 2019 ఇదే కాలంలో ఇది స్వల్పంగా 0.3 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఐఐపీ నడత ఇలా... 2019 డిసెంబర్లో ఐఐపీ స్వల్పంగా 0.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2019 డిసెంబర్లో తయారీ రంగం 0.3 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం ఇక్కడ ప్రస్తావనాంశం. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, దేశాల రక్షణాత్మక విధానాల వంటి అంశాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితి దీనికి నేపథ్యం. కాగా కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా, తాజా గణాంకాలను కోవిడ్–19 ముందు నెలలతో పోల్చుకోవడం సరికాదని కూడా గణాంకాల శాఖ పేర్కొనడం గమనార్హం. 16 నెలల కనిష్టానికి ‘రిటైల్’ ధరలు జనవరిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం 4.06 శాతంగా నమోదయ్యింది. గడచిన 16 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2019 సెప్టెంబర్‌లో 4 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిత స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడమూ వరుసగా ఇది రెండవనెల కావడం గమనార్హం. డిసెంబర్ 2020లో 4.59 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఎన్ఎస్ఓ తాజా గణాంకాల ప్రకారం, జనవరిలో ఫుడ్ బాస్కెట్ ధర (2019 ఇదే నెల ధరతో పోల్చి) కేవలం 1.89 శాతం పెరిగింది. 2020 డిసెంబర్లో ఈ రేటు 3.41 శాతం. కూరగాయల ధరలు 15.84 శాతం తగ్గాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 13.39 శాతం దిగివచ్చాయి. ప్రొటీన్ రిచ్ మాంసం, చేపలు ధరలు 12.54 శాతం తగ్గితే, గుడ్ల ధరలు 12.85 శాతం తగ్గాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.73 శాతం తగ్గాయి. కాగా సీపీఐలో ఒక భాగంగా ఉన్న ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల 3.87 శాతంగా ఉంది. కొన్ని నిర్దిష్ట గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ఎన్ఎస్ఓ గణాంకాలను సేకరిస్తుంది. ఆర్బీఐ సరళతర పాలసీ కొనసాగింపునకు దోహదం ఆర్థికాభివృద్ధికి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి వినబడుతోంది. వడ్డీరేటు తగ్గింపు ద్వారా డిమాండ్‌కు, వినియోగానికి తద్వారా వృద్ధికి ఊపును ఇవ్వవచ్చని ఆయా వర్గాలు కోరుతున్నాయి. అయితే ద్రవ్యోల్బణం భయాలతో ఆర్బీఐ మరింత రెపో తగ్గించడానికి వెనుకాడుతోంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్. ఫిబ్రవరి నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గుచూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. -
తయారీ రంగానికి ‘రీస్టార్ట్’ కిక్
సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌తో దెబ్బ తిన్న రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రీస్టార్ట్ పేరుతో గ్రీన్ జోన్లో ఉన్న ఫ్యాక్టరీలను ప్రారంభించడానికి అనుమతించడం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఐదు నెలల విరామం తర్వాత రాష్ట్ర తయారీ రంగం వృద్ధి బాట పట్టింది. ఆగస్టు నెలలో తయారీ రంగంలో 1.2 శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర అర్థగణాంక శాఖ తాజాగా విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ ఇండిస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) గణాంకాల్లో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 353 కర్మాగారాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా తయారీ రంగంలో వృద్ధిని అంచనా వేస్తారు. గతేడాది ఆగస్టు నెలలో 120.3 పాయింట్లు ఉన్న తయారీ రంగం ఈ ఏడాది ఆగస్టు నెలలో 121.7 పాయింట్లుగా నమోదైంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 8.6 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం. తయారీ రంగంలో లోహాలు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మెషినరీ, రవాణా పరికరాలు, కెమికల్స్, అప్పరెల్స్ వంటి రంగాలు మంచి పనితీరు కనపరచడంతో ఆగస్టు నెలలో వృద్ధి రేటు నమోదైంది. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ రంగంలో 19.7 శాతం, ఇంటర్మీడియేట్ గూడ్స్ 7.0 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 7.1 శాతం, కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 6.8 శాతం చొప్పున వృద్ధి నమోదైనట్లు ఐఐపీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ సగటు కంటే మెరుగైన పనితీరు.. – ఏప్రిల్–ఆగస్టులో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తి దేశ సగటు కంటే మెరుగైన పనితీరు కనపర్చింది. కోవిడ్ దెబ్బతో ఆ సమయంలో దేశ వ్యాప్తంగా తయారీ రంగంలో 27.9 శాతం క్షీణత నమోదైతే అది మన రాష్ట్రంలో 15.6 శాతానికి పరిమితమైంది. – ఈ సమీక్షా కాలంలో ఆటోమొబైల్ తయారీ రంగంలో గతేడాదితో పోలిస్తే 124.2 శాతం వృద్ధి నమోదైంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ల తయారీలో 71.8 శాతం, ఆహార ఉత్పత్తుల తయారీలో 24.18 శాతం వృద్ధి నమోదైంది. – రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్ కింద త్వరతగతిన పరిశ్రమలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా కష్ట సమయంలో రూ.1,168 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించడంతో సత్ఫలితాలు వచ్చాయని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తిరిగి వృద్ధి బాట పట్టగలమన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా స్పందించాం.. దేశంలోనే తొలిసారిగా ‘రీస్టార్ట్’ ప్యాకేజీ కింద ఏప్రిల్ మూడో వారం నుంచే కొవిడ్ ఆంక్షలను పాటిస్తూ పరిశ్రమలను ప్రారంభించాం. దాంతో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర తయారీ రంగం వేగంగా కోలుకుంది. వైఎస్సార్ నవోదయం పేరుతో ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకున్నాం. గత ప్రభుత్వ రాయితీ బకాయిలను కోవిడ్ సమయంలో ఇవ్వడంతో పరిశ్రమలు త్వరగా ఉత్పత్తి ప్రారంభించగలిగాయి. దీనివల్ల ఈ ఏడాది పారిశ్రామికోత్పత్తిలో దేశ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు అవుతుందని అంచనా వేస్తున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి నాలుగు అంశాలు కలిసొచ్చాయి సంక్షోభ సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నగదు అందజేయడంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. పరిశ్రమల ప్రారంభానికి పారిశ్రామిక ప్రతినిధులతో కలిసి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి సమస్యలను పరిష్కరించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిపుణులను అందిస్తోంది. ఈ నాలుగు అంశాలకు తోడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు బాగుండటం కలిసి వచ్చింది. – డి.రామకృష్ణ, సీఐఐ (ఏపీ చాప్టపర్) చైర్మన్ -
తయారీ, మైనింగ్ పేలవం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్‌లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్‌తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్‌లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► మైనింగ్, తయారీ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. ► దేశంలో పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమనంలో కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్చిలో 2.7 శాతంగా ఉంది. ఏప్రిల్ (4.3 శాతం), మే నెలల్లో (4.6 శాతం) కొంత బాగుందనిపించినా, మళ్లీ జూన్ వచ్చే సరికి భారీగా జారిపోయింది. ► తయారీ: 2018 జూన్‌లో 6.9 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు 2019 జూన్‌లో కేవలం 1.2 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటును నమోదు చేసుకున్నాయి. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. ► మైనింగ్: మైనింగ్‌లో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –5.5 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, దుస్తులు వంటి ఫాస్ట్ మూ వింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికమూ మందగమనమే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ త్రైమాసిక కాలాన్ని చూసినా, పారిశ్రామిక వృద్ధి మందగమనంలోనే ఉంది. ఈ కాలంలో వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. -
ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు!
దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకంలాంటి రెండు కీలక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఒకపక్క పారిశ్రామిక రంగం పుంజుకోగా.. మరోపక్క రిటైల్ ధరలు మరింత శాంతించాయి. కార్పొరేట్ రంగానికి రానున్న రోజుల్లో ఇది సానుకూల పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రానున్న పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగం కోలుకుంటున్న సంకేతాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వృద్ధి రేటు భారీగా పుంజుకొని 2.5 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 0.48 శాతం మాత్రమే. అయితే, క్రితం ఏడాది సెప్టెంబర్‌లో పరిశ్రమల వృద్ధి 2.7 శాతంగా ఉంది. ప్రధానంగా మైనింగ్, తయారీ, యంత్రపరికరాల రంగాల మెరుగైన పనితీరు మొత్తం పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికి ప్రధానంగా దోహదపడింది. ఏప్రిల్-సెప్టెంబర్‌కు ఇలా... ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి కూడా పరిశ్రమల ఉత్పాదకత జోరందుకుంది. ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతానికి ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 0.5 శాతమే కావడం గమనార్హం. రంగాల వారీగా... తయారీ: పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతం వెయిటేజీ ఉన్న ఈ రంగం ఉత్పాదకత సెప్టెంబర్‌లో 2.5 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 1.4 శాతం. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధికి చూస్తే వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 2 శాతానికి పెరిగింది. మొత్తంమీద తయారీ రంగంలోని 22 పారిశ్రామిక విభాగాల్లో 15 విభాగాలు సెప్టెంబర్‌లో వృద్ధి చెందడం ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. మైనింగ్: సెప్టెబర్‌లో ఉత్పాదకత 0.7 శాతంగా వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 3.6 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఉత్పాదకత 2.5%గా నుంచి 2.1 శాతానికి తగ్గింది. యంత్రపరికరాలు: డిమాండ్‌కు కొలమానంగా పరిగణించే ఈ రంగం ఉత్పాదకత వృద్ధి రేటు సెప్టెంబర్‌లో ఏకంగా 11.6 శాతానికి ఎగబాకింది. గతేడాది ఇదే నెలలో ఉత్పాదకత మైనస్ 6.6 శాతంగా ఉంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కూడా మైనస్ 0.6 శాతం క్షీణత నుంచి 5.8 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. విద్యుత్: ఉత్పాదకత 12.9 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో మాత్రం 5.9 శాతం నుంచి 10.4 శాతానికి ఎగసింది. కన్జూమర్ గూడ్స్: ఉత్పాదకత 1 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మైనస్ 1.2 శాతం క్షీణత నుంచి 4.6 శాతం వృద్ధిరేటును సాధించింది. కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత మైనస్ 10.6 క్షీణత నుంచి మరింత తగ్గి మైనస్ 11.3 శాతానికి క్షీణించింది. ఆరు నెలల వ్యవధిలో కూడా ఉత్పాదకత మైనస్ 12.6 శాతానికి(అంతక్రితం ఇదే కాలంలో మైనస్ 11.1 శాతం) దిగజారింది. రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు.. న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో రిటైల్ ధరల పెరుగుదల రేటు కూడా భారీగా తగ్గింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 5.52 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఈ రేటు 6.46 శాతంగా ఉంది. వరుసగా నాలుగో నెలలోనూ ఇది తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2012 జనవరిలో ఈ కొత్త సిరీస్ గణాంకాలను ప్రవేశపెట్టిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. కాగా, బేస్ రేటు తక్కువగా ఉండటం కూడా తాజా గణాంకాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కూరగాయల ఎఫెక్ట్... సీపీఐలో ఆహార ధరల ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్‌లో 7.69 శాతంగా ఉండగా.. అక్టోబర్‌లో 5.59 శాతానికి తగ్గింది. ముఖ్యంగా కూరగాయల ధర పెరుగుదల సెప్టెంబర్‌లో 8.59 శాతంగా ఉంది(గతేడాది ఇదే నెలతో పోలిస్తే). అక్టోబర్‌లో ఈ రేటు మైనస్ 1.45 శాతంగా నమోదైంది. పండ్ల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు కూడా అక్టోబర్‌లో 17.49 శాతానికి తగ్గింది(సెప్టెంబర్‌లో 22.4 శాతం). ఇక గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహారోత్పుత్తలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 6.35 శాతం నుంచి స్వల్పంగా 6.34 శాతానికి తగ్గింది. ఆర్బీఐ సమీక్షపైనే అందరికళ్లూ.. రిటైల్ ధరలు నేలకు దిగిరావడం... టోకు ధరలు కూడా కనిష్టస్థాయిలోనే కొనసాగుతుండటంతో ఆర్బీఐ పాలసీ వడ్డీరేట్లను తగ్గింస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న వృద్ధి రేటును గాడిలోపెట్టాలంటే వడ్డీరేట్లను తగ్గించాల్సిందేనని పారిశ్రామిక రంగం పదేపదే డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 2న ఆర్బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) సెప్టెంబర్‌లో ఐదేళ్ల కనిష్టమైన 2.38 శాతానికి తగ్గడం తెలిసిందే. అక్టోబర్ గణాంకాలు రేపు(శుక్రవారం) రానున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 8 శాతానికి, 2016 మార్చినాటికి 6 శాతానికి తగ్గాలనేది ఆర్బీఐ లక్ష్యం. గత నాలుగు సమీక్షల్లో పాలసీ వడ్డీరేట్లను ఆర్బీఐ గవర్నర రఘురామ్ రాజన్ యథాతథంగా కొనసాగించడం విదితమే. -
ఇన్ఫీ ఫలితాలు.. ఐఐపీపై దృష్టి
న్యూఢిల్లీ: బక్రీద్ సందర్భంగా సోమవారం(6న) స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం(10న) జూలై-సెప్టెంబర్ కాలానికి(క్యూ2) పనితీరు వెల్లడించనుంది. తద్వారా దేశీ కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరలేవనుంది. ఇక అదే రోజు ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడనున్నాయి. మరోవైపు ఆగస్ట్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ వివరాలు మంగళవారం(7న) వెల్లడికానున్నాయి. ఈ అంశాలన్నీ ఈ వారం సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఇన్ఫోసిస్ ఫలితాలు, ఐఐపీ తీరు మార్కె ట్ల నడకను నిర్దేశించగలవని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఎఫ్ఐఐలు, రూపాయి కీలకమే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరుతోపాటు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని అత్యధికశాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఇవికాకుండా అంతర్జాతీయ సంకేతాలు సైతం మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని తెలిపారు. విదేశీ మార్కెట్ల తీరు, అంతర్జాతీయ సంకేతాలు, దేశీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వంటి అంశాలు రానున్న కాలంలో మార్కెట్ల దిశను నిర్దేశించగలవని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ వివరించారు. కాగా, యూఎస్ ఉద్యోగ గణాంకాల ప్రభావం మంగళవారంనాటి ట్రేడింగ్‌పై ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. 2008 జూలై తరువాత ఈ సెప్టెంబర్ నెలకు అమెరికాలో నిరుద్యోగిత బాగా తగ్గడంతో ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఉంటుందని నిపుణులు తెలిపారు. 2,15,000 కొత్త ఉద్యోగాలను అంచనా వేయగా, 2,48,000 నమోదుకావడంతో నిరుద్యోగ రేటు 6.1% నుంచి 5.9%కు దిగింది. దీంతో గడిచిన శుక్రవారం(3న) అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో ఇతర కరెన్సీలతో మారకంలో డాలర్ బలపడింది. ఇది దేశీయంగా ఐటీ షేర్లకు ప్రోత్సాహాన్నిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పరిశ్రమలు పుంజుకున్నాయ్...
* మే నెలలో పారిశ్రామికోత్పత్తి 3.4 % అప్ * వరుసగా2 నెలల క్షీణత తర్వాత వృద్ధి బాటలోకి * 13 నెలల గరిష్టస్థాయి ఇది... * మైనస్ నుంచి ప్లస్‌లోకి తయారీ, మైనింగ్.. * విద్యుత్, యంత్రపరికరాల మెరుగైన పనితీరు... ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు వస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎగుమతులు చాన్నాళ్ల తర్వాత మళ్లీ రెండంకెల వృద్ధిని నమోదుచేయగా... ఇప్పుడు పారిశ్రామికోత్పత్తి కూడా మెరుగైన స్థాయిలో పుంజుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ జోరందుకుంటుందన్న విశ్వాసాన్ని పెంచుతున్నాయి. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా శాంతిస్తుండటం రానున్న రోజుల్లో ప్రగతి పురోగతికి బాటలు వేసేలా చేస్తోంది. న్యూఢిల్లీ: తీవ్ర నైరాశ్యంలో ఉన్న పారిశ్రామిక రంగం ఎట్టకేలకు మళ్లీ శక్తికూడగట్టుకుంది. వరుసగా రెండు నెలల తిరోగమనం నుంచి కోలుకొని వృద్ధి బాటలోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పాదకత సూచీ(ఐఐపీ) 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. ఇది 13 నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. అంతక్రితం 2013 మార్చిలో 3.5 శాతం ఐఐపీ రేటు నమోదైంది. ముఖ్యంగా తయారీ, మైనింగ్ రంగాలు క్షీణత నుంచి ప్రగతి బాటలోకి రావడమే కాకుండా... యంత్రపరికరాలు, విద్యుత్ రంగాలు మెరుగైన వృద్ధి సాధించడంతో మొత్తం పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత పుంజుకోవడానికి దోహదం చేసింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఐఐపీ 1.5 శాతం వృద్ధిని సాధించగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనస్ 1.8 శాతం, మార్చిలో మైనస్ 0.5 శాతం చొప్పున కుంగిన సంగతి తెలిసిందే. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్ఓ) గురువారం తాజా గణాంకాలను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ వరుసగా తిరోగమనం(మైనస్)లోనే ఉన్న పారిశ్రామిక ఉత్పాదకత.. ఆ తర్వాత జనవరిలో కాస్త మెరుగుపడి వృద్ధిబాటలో వచ్చింది. అయితే, మళ్లీ ఫిబ్రవరి, మార్చిలో మైనస్‌లోకి జారిపోవడంతో పరిస్థితి ఆందోళకరంగా మార్చింది. అయితే, తిరిగి ఏప్రిల్‌లో వృద్ధి బాటలోకి రావడమేకాకుండా... మెరుగైన ప్రగతి నమోదుకావడం సానుకూలాంశం. కాగా, ఏప్రిల్‌లో తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూప్‌లలో 14 విభాగాలు వృద్ది పథంలో ఉండటం గమనార్హం. రంగాల వారీగా పరిస్థితి ఇదీ.. తయారీ రంగం: మొత్తం పారిశ్రామిక ఉత్పాదకత(ఐఐపీ)లో దాదాపు 75 శాతం వెయిటేజీ ఉండే ఈ రంగం ఏప్రిల్‌లో 2.6 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 1.2 శాతం క్షీణించగా... క్రితం ఏడాది ఏప్రిల్‌లో 1.8 శాతం వృద్ధి నమోదైంది. మైనింగ్: మార్చిలో మైనస్ 0.4 శాతం క్షీణత నుంచి ఏప్రిల్‌లో వృద్ధి బాటలోకి వచ్చి 1.2 శాతం పుంజుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్‌లో ఈ రంగం మైనస్ 3.4 శాతం క్షీణించింది.యంత్ర పరికరాలు: డిమాండ్‌కు కొలమానంగా భావించే ఈ రంగం వృద్ధి రేటు ఏప్రిల్‌లో ఏకంగా 15.7 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో మైనస్ 0.3 శాతం తిరోగమనంలో ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చిలో మైనస్ 12.5 శాతం క్షీణతలో ఉంది. అంటే క్రితం నెలతో పోలిస్తే అత్యంత వేగంగా పుంజుకున్నట్లు లెక్క. విద్యుత్: గతేడాది ఏప్రిల్‌లో 4.3 శాతం వృద్ధిని నమోదు చేసిన ఈ రంగం ఈ ఏడాది ఇదే నెలలో 11.9 శాతం వృద్ధి రేటును సాధించింది. మార్చిలో ఈ వృద్ధి 5.4 శాతంగా ఉంది.కన్సూమర్ గూడ్స్: మిగతా రంగాలకు భిన్నంగా ఏప్రిల్ నెలలో మైనస్ 5.1 శాతం క్షీణించింది. గతేడాది ఇదే నెలలో 1.7 శాతం వృద్ధిచెందగా.. ఈ ఏడాది మార్చిలో ఈ రంగంఉత్పాదకత మైనస్ 0.9 శాతం క్షీణించింది.కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత క్షీణత గతేడాది ఏప్రిల్‌లో మైనస్ 9.6% కాగా, ఈ ఏడాది ఇదే నెలలో మైనస్ 7.6 %గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో ఈ రేటు మైనస్ 11.8 శాతం. సానుకూల పరిణామమిది: కార్పొరేట్లు ఐఐపీలో కీలకమైన మైనింగ్, తయారీ, విద్యుత్ ఈ మూడు రంగాలూ వృద్ధి బాటలో పయనించడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామమని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగం, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచాలంటే(ఫీల్ గుడ్ ఫ్యాక్టర్) మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు వేగవంతమైన, వృద్ధికి ఊతమిచ్చే విధానాలను తక్షణం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం నుంచి కొన్ని భారీ సంస్కరణలు, విధానపరమైన చర్యలను ఆశిస్తున్నట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా చెప్పారు. -
రికవరీ ఆశల పై నీళ్లు...!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఆర్థిక రికవరీ ఆశలపై నీళ్లు చల్లాయి. 2013 డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు చూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా, క్షీణ దశ కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి 2012 డిసెంబర్లో -0.6 శాతం క్షీణత నమోదుకాగా, 2013 డిసెంబర్లో కూడా ఇదే ఫలితం వెలువడింది. క్షీణత యథాపూర్వం -0.6 శాతంగా నమోదయింది. అయితే కొంతలో కొంత ఊరట అనుకుంటే క్షీణత రేటు తగ్గడం. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత -1.6 శాతం. నవంబర్‌లో -1.3 శాతం. తాజాగా ఇది మరింత తగ్గి - 0.6 శాతానికి చేరింది. ఐదు ప్రధాన రంగాల తీరు... మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్షీణత మరింత పెరిగింది. 2012 డిసెంబర్లో క్షీణత -0.8 శాతం. అదిప్పుడు ఏకంగా -1.6 శాతానికి చేరింది. మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 14 శాతం వాటా ఉండే మైనింగ్ రంగం క్షీణత నుంచి బయటపడింది. ఈ రంగం -3.1 శాతం క్షీణత నుంచి 0.4 శాతం వృద్ధికి మళ్లింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కొంత సానుకూల రీతిలో 5.2 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. మొత్తం వినియోగ వస్తువుల విభాగం క్షీణత మరింత పెరిగి -3.6 శాతం నుంచి -5.3 శాతానికి చేరింది. ఇందులో మన్నికైన వస్తువుల (డ్యూరబుల్) విభాగంలో సైతం క్షీణత మరింత పెరిగింది. -8.1 శాతం నుంచి -16.2 శాతానికి చేరింది. కన్సూమర్ నాన్-డ్యూరబుల్కు వస్తే ఈ విభాగం వృద్ధిబాటకు మళ్లింది. -0.5 శాతం క్షీణత నుంచి 1.6 శాతం వృద్ధిబాటకు మళ్లింది. ఇక డిమాండ్‌కు సూచిక అయిన భారీ వస్తువుల ఉత్పత్తి రంగం క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత మరింత పెరిగింది. -1.1 శాతం నుంచి -3 శాతానికి పడింది. 9 నెలల్లోనూ క్షీణతే... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనూ (2013-14 మార్చి-డిసెంబర్) పారిశ్రామిక రంగం రివర్స్‌గేర్‌లోనే పయనించింది. ఉత్పాదకత క్షీణతలోనే నమోదైంది. 2012 ఏడాది ఇదే కాలంలో 0.7 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, ప్రస్తుతం అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతానికి ఉత్పత్తి కుంగింది. వడ్డీ రేట్ల కోత తప్పనిసరి: పరిశ్రమలు తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధికి ఆర్బీఐ రెపో రేటు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే తయారీ రంగం పునరుత్తేజానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాయి. ముఖ్యంగా తాము తయారీ రంగం తీరు పట్ల ఆందోళన చెందుతున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. పెట్టుబడులు, డిమాండ్ పెరగడానికి తగిన పరపతి విధానం అవసరమన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణి నేపథ్యంలో వడ్డీరేటు తగ్గించడానికి వెసులుబాటు ఉంటుందని విశ్లేషించారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ కూడా దాదాపు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగం వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, దీనిపై వ్యయాలు తీవ్రంగా ఉండడం, రుణ సమీకరణ వ్యయాల భారం వంటి అంశాలను ప్రస్తావించారు. కాగా ద్రవ్యోల్బణం-వృద్ధి మధ్య సమతౌల్యతను సాధించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ... వృద్ధికి ఊతం ఇవ్వడానికి ఆర్బీఐ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ కోరారు.