
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం.
రంగాల వారీగా..(శాతాల్లో)
విభాగం 2024 2023
మార్చి మార్చి
తయారీ 5.2 1.5
మైనింగ్ 1.2 6.8
విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6
క్యాపిటల్ గూడ్స్ 6.1 10
కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0
కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9
ఇన్‌ఫ్రా/నిర్మాణం 6.9 7.2
ప్రైమరీ గూడ్స్ 2.5 3.3
ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8
Comments
Please login to add a commentAdd a comment