భారతదేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి ఆటోమొబైల్ పరిశ్రమ కీలకమని ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు వెల్లడించారు. ఈ తరుణంలో 2035 నాటికి రోజుకు 12,000 కొత్త కార్లు రోడ్డుపైకి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) పేర్కొంది. దీంతో 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.
2035 నాటికి వాహనాల సంఖ్య పెరుగుతుంది, కాబట్టి రోడ్ల విస్తరణ కూడా చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఇంధన వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో పేర్కొంది.
పరిశ్రమలో ఇంధన డిమాండ్‌ను తీర్చడంలో బొగ్గు ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఐఈఏ వెల్లడించింది. అయితే 2070 నాటికి భారత్ జీరో ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇన్‌స్టాల్ బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నట్లు ఐఈఏ వెల్లడించింది.
ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పు
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి వాహన వినియోగం కూడా పెరుగుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు గిరాకీ కూడా 20235 నాటికి 7.1 మిలియన్ బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇంధన వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ కార్ల మార్కెట్లో ఐదవ స్థానంలో ఉన్న భారత్.. ఇంధన వినియోగం, దిగుమతిలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించబడుతున్న ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. ఫ్యూయెల్ వాహనాల సంఖ్య రెండూ పెరుగుతాయని ఐఈఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment