iea
-
2035 నాటికి రోజుకు 12000 కార్లు రోడ్డుపైకి: ఐఈఏ
భారతదేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా వృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి ఆటోమొబైల్ పరిశ్రమ కీలకమని ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు వెల్లడించారు. ఈ తరుణంలో 2035 నాటికి రోజుకు 12,000 కొత్త కార్లు రోడ్డుపైకి వస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) పేర్కొంది. దీంతో 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.2035 నాటికి వాహనాల సంఖ్య పెరుగుతుంది, కాబట్టి రోడ్ల విస్తరణ కూడా చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఇంధన వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో పేర్కొంది.పరిశ్రమలో ఇంధన డిమాండ్‌ను తీర్చడంలో బొగ్గు ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఐఈఏ వెల్లడించింది. అయితే 2070 నాటికి భారత్ జీరో ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇన్స్టాల్ బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నట్లు ఐఈఏ వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పుప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి వాహన వినియోగం కూడా పెరుగుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు గిరాకీ కూడా 20235 నాటికి 7.1 మిలియన్ బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇంధన వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ప్రపంచ కార్ల మార్కెట్లో ఐదవ స్థానంలో ఉన్న భారత్.. ఇంధన వినియోగం, దిగుమతిలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించబడుతున్న ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. ఫ్యూయెల్ వాహనాల సంఖ్య రెండూ పెరుగుతాయని ఐఈఏ పేర్కొంది. -
రష్యాకు భారత్, చైనా ఆశాకిరణాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలకు గురైన రష్యాకి, మిత్ర దేశాలైన భారత్, చైనా చేదోడుగా నిలుస్తున్నాయి. మే నెలలో రష్యా ఎగుమతి చేసిన చమురులో 80 శాతం ఈ రెండు దేశాలే కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రకటించింది. ‘‘మార్కెట్ కంటే తక్కువకు వచ్చే రష్యా చమురు కొనుగోలుకు ఆసియాలో కొత్త కొనుగోలుదారులు లభించారు. భారత్ రోజువారీ కొనుగోళ్లు 2 మిలియన్ బ్యారెళ్లకు మించింది. చైనా రోజువారీ కొనుగోళ్లను 0.5 మిలియన్ బ్యారెళ్ల నుంచి 2.2 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది’’అని ఐఈఏ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. మే నెలలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా 45 శాతం సమకూర్చగా, చైనాలో ఇది 20 శాతంగా ఉన్నట్టు వివరించింది. రష్యా సముద్రపు ముడి చమురులో 90 శాతం ఆసియాకు వెళ్లిందని, యుద్ధానికి ముందు ఇది 34 శాతంగా ఉండేదని వివరించింది. ‘‘ఏప్రిల్ నెలతో పోలిస్తే భారత్ మే నెలలో 14 శాతం అధికంగా చమురుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెల మొదటి మూడు వారాల్లో సగటు రష్యా చమురు బ్యారెల్ 26 డాలర్లుగా ఉంది’’ అని వివరించింది. భారత్ జీడీపీ 4.8 శాతం భారత్ జీడీపీ 2023 సంవత్సరంలో 4.8 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఈఏ అంచనా వేసింది. 2024లో ఇది 6.3 శాతానికి చేరుతుందని, తదుపరి 2025 నుంచి 2028 మధ్య 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జనాభా పెరుగుదుల, మధ్య తరగతి విస్తరణ సానుకూలమని భావించింది. ప్రపంచ చమురు వినియోగ డిమాండ్‌లో చైనాను భారత్ 2027లో వెనక్కి నెట్టేస్తుందని అంచనా వేసింది. -
చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న చమరు ధరల వల్ల అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి కఠిన సమయంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంధన ధరలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న ధరలను తాత్కాలికంగా తగ్గించుకోవడం కోసం 10 పాయింట్ల ప్రణాళికను సూచించింది. ప్రపంచ చమురు మార్కెట్'లో రష్యా మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రభావం అనేక దేశాల మీద అధికంగా ఉంది. ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ఉన్న ఒక కీలక మార్గం చమురు డిమాండ్'ను తగ్గించడం అని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. తాము సూచించిన 10 పాయింట్ల ప్రణాళిక వల్ల కొంత మేరకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, ఈ 10 పాయింట్ల ప్రణాళిక అమలకు అనేక దేశాల ప్రభుత్వ మద్దతు అవసరం అని పేర్కొంది. ఈ ప్రణాళిక అమలు అనేది ప్రతి దేశ ఇంధన మార్కెట్లు, రవాణా మౌలిక సదుపాయాలు, సామాజిక & రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాల మీద ఆధారపడుతుంది అని తెలిపింది. 10 పాయింట్ల ప్రణాళికలోని ముఖ్య అంశాలు: ప్రస్తుతం హైవేలపై ఉన్న వేగ పరిమితిని గంటకు కనీసం 10 కిలోమీటర్ల వేగం తగ్గించాలి. దీని వల్ల కార్లు వినియోగించే ఆయిల్ వినియోగం సుమారు 290 కేబీ/డీ ఆదా అవుతుంది, ట్రక్కులు వినియోగించే ఆయిల్ వినియోగం 140 కేబీ/డీ ఆదా అవుతుంది. కేబీ/డీ అంటే రోజుకు వెయ్యి బ్యారెల్స్ ఆయిల్ అని అర్ధం. వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఒక రోజు సుమారు 170 కేబీ/డీ ఆయిల్ వినియోగం ఆదా అవుతుంది. అంటే, మూడు రోజులు కలిపి సుమారు 500 కేబీ/డీ ఆదా కానుంది. ప్రతి ఆదివారం నగర రోడ్ల మీద కార్లను అనుమతి ఇవ్వకూడదు. దీనివల్ల ప్రతి ఆదివారం సుమారు 380 కేబీ/డీ ఆదా అవుతుంది; నెలకు ఒక ఆదివారం 1520 కేబీ/డీ ఆదా చేస్తుంది. ప్రజా రవాణాను, మైక్రోమొబిలిటీ, వాకింగ్, సైక్లింగ్ ప్రోత్సహించడం వల్ల సుమారు 330 కేబీ/డీ ఆదా చేస్తుంది. పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రత్యామ్నాయ ప్రైవేట్ కారు యాక్సెస్ పెంచడం వల్ల సుమారు 210 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. కారు షేరింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 470 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సరుకు రవాణా ట్రక్కుల కోసం సమర్థవంతమైన డ్రైవింగ్ & గూడ్స్ డెలివరీని ప్రోత్సహించడం వల్ల సుమారు 320 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సాధ్యమైనంత వరకు విమానాలకు బదులుగా హై స్పీడ్, నైట్ రైళ్లను వినియోగించడం వల్ల సుమారు 40 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న చోట వ్యాపార విమాన ప్రయాణాన్ని చేపట్టక పోవడం వల్ల సుమారు 260 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 100 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. (చదవండి: దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!) -
బిల్లు తగ్గేలా ఇల్లు.. ఐఈఏ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద కుటుంబాల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 లక్షల ఇళ్ల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తున్నారు. గాలి, వెలుతురు విరివిగా ప్రసరించేలా.. తక్కువ కరెంట్ బిల్లులు వచ్చేలా వీటిని డిజైన్ చేయడం ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ పథకం దేశంలోనే అతి పెద్దదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రశంసించింది. దీనివల్ల ఏడాది పాటు 2.50 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ఆ సంస్థ ప్రతినిధి మైకేల్ అప్పర్‌మెన్ తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు జూన్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించడంతో భవన నిర్మాణ మెటీరియల్, ప్రణాళిక వేగంగా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండో–స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రాజెక్టు (బీఈఈపీ) నేతృత్వంలో ఇటీవల వెబినార్ జరిగింది. ఈ వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మీడియాకు ఆదివారం వివరించారు. అడుగడుగునా హై టెక్నాలజీ స్విట్జర్లాండ్, భారత్ సంయుక్త భాగస్వామ్య సంస్థ ఆధ్వర్యంలోని ‘ఎనర్జీ ఎఫీషియెంట్, థర్మల్లీ కంఫర్టబుల్ (ఈఈటీసీ)’ టెక్నాలజీని ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వాడుతోంది. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రతలు కనీసం 2 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఫలితంగా 20 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. గాలి, వెలుతురు విరివిగా రావడం వల్ల సీజనల్ వ్యాధులు సోకేందుకు ఆస్కారం తక్కువ. పైకప్పు మీద రూఫ్ ఇన్సులేషన్ లేదా రిఫ్లెక్టివ్ రంగు వేయడం ద్వారా వేడి తగ్గుతుంది. ఆటోక్లేవ్ ఏరేటెడ్ కాంక్రీట్ (ఏఏసీ) బ్లాక్స్, కేవిటీ వాల్, హేలో బ్రిక్స్ వంటివి వాడటం వల్ల మొత్తం భవనంపై వేడి తగ్గిపోతుంది. కిటికీలకు సరైన తెరలు వాడటం వల్ల కూడా బయటి వేడి లోపలకు రాకుండా ఉంటుంది. క్షేత్రస్థాయి వరకూ శిక్షణ ఇంజనీర్లు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, వార్డు, సచివాలయ సిబ్బందికి బీఈఈపీ, బీఈఈ సంయుక్తంగా తాజా సాంకేతికపై శిక్షణ ఇస్తోంది. 13 వేల మంది ఇంజనీర్లకు దశల వారీగా ఈ శిక్షణ ఉంటుంది. ఇండో–స్విస్ బీఈఈపీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి), రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, స్టేట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సీడ్కో ), ఇంధన శాఖ సహకారంతో శిక్షణ చేపడతారు. ప్రాథమికంగా 50 మంది ఇంజనీర్లకు ‘మాస్టర్ ట్రైనర్లు’గా శిక్షణ ఇస్తారు. అనంతరం వీరు మిగిలిన వారందరికీ శిక్షణ ఇస్తారు. తర్వాత 500 మంది గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందనడానికి ఇదే నిదర్శనమని అజయ్ జైన్ పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పథకంలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ తదితర సౌకర్యాల కోసం పంచాయతీరాజ్, మునిసిపల్, గ్రామీణ నీటి సరఫరా, ఇంధన శాఖలు రూ.32,215 కోట్లు ఖర్చు చేస్తాయని అంచనా వేసినట్టు తెలిపారు. విద్యుత్ షాక్ ఉండదు పేదల కోసం నిర్మించే ఇళ్లల్లో ఇంధన సామర్థ్య పరికరాలు వాడుతున్నాం. దీనికి ఇంధన పొదుపు సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో 20 శాతం కరెంట్ వృథాను అరికట్టే వీలుంది. పేదలకు అతి తక్కువ కరెంట్ బిల్లులు వచ్చే వీలుంది. – ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, సీఈవో, రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ -
ఐఈఏ నూతన అధ్యక్షుడిగా మహేంద్ర దేవ్
సాక్షి, అమరావతి బ్యూరో/ఏఎన్‌యూ: ఇండి యన్ ఎకనామిక్ అసోసియేషన్(ఐఈఏ) నూత న అధ్యక్షుడిగా ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.మహేంద్ర దేవ్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ప్రొఫెసర్ సుఖదేవ్ థోరట్ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతారు. ఆ తర్వాత మహేంద్ర దేవ్ బాధ్యతలు చేపడతారు. ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శనివారం ఐఈఏ సదస్సు ముగింపు సందర్భంగా అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా మహేంద్ర దేవ్‌ను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా తమిళనాడు నుంచి డాక్టర్ డి.కుమార్, గోవా నుంచి డాక్టర్ శరత్ చంద్రన్, ఛత్తీస్‌గఢ్ నుంచి డాక్టర్ హనుమాన్ యాదవ్, రాజస్థాన్ నుంచి డాక్టర్ ఎస్ఎస్ సోమ్రా, జార్ఖండ్ నుంచి డాక్టర్ నికిల్ కుమార్ ఝా, నాగాలాండ్ నుంచి డాక్టర్ గిరిబాబు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ప్రక టించారు. 101వ ఐఈఏ సమావేశం బిహార్ రాష్ట్రంలోని బుద్ధగయ మగధ విశ్వవిద్యా లయంలో నిర్వహిస్తామని, ఆ సమావేశానికి అధ్యక్షులుగా వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ కూడా ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారని ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ప్రకటించారు. దేశ సమగ్రాభివృద్ధికి సూచనలిస్తాం: మహేంద్ర దేవ్ ఐఈఏ ద్వారా దేశ సమగ్రాభివృద్ధికి అవసరమైన సూచనలు చేస్తామని ఆ సంస్థకు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన తెలుగువ్యక్తి, ఆర్థికవేత్త, వ్యవసాయ ఆర్థికరంగ నిపుణుడు ఎస్.మహేంద్ర దేవ్ అన్నారు. ఐఈఏ అధ్యక్షు డిగా ఎన్నికైన సందర్భంగా ఆయన విలేకరు లతో మాట్లాడుతూ దేశాభివృద్ధికి అవసరమైన పరిశోధన, అధ్యయనాలకు ఐఈఏ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. యువ ఆర్థిక శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. -
ప్రజల సంతోషమే అభివృద్ధి
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటమే నిజ మైన అభివృద్ధి. భవనాలు, రహదారులు, వంతెనల నిర్మాణం వంటివి అభివృద్ధికి సూచి కలే. కానీ, అంతకుమించి ప్రజల సంతోషమే నిజమైన ప్రగతికి తార్కాణం. సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగిస్తేనే సర్వతో ముఖాభివృద్ధి సాధించగలం. ఆ బాధ్యత కేంద్రం కంటే రాష్ట్రాల పైనే ఎక్కువగా ఉంది’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. ‘‘వివక్షకు తావు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి. యావత్ జాతి సంక్షేమమే లక్ష్యంగా వనరులను వినియోగిం చుకునేలా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవాలి. అలా చేస్తేనే మనం కలలు కంటున్న నూతన భారతదేశాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2022 నాటికి ఆవిష్కరించగలం’’ అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ)’ శతాబ్ది ఉత్సవాల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలకోపన్యాసం చేశారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాల దిశగా ఉరకలు వేస్తున్న వేళ ఇంకా పేదరికం, అసమానతల గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరమని అన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలకు సరైన మౌలిక వస తులు, విద్య, ఆరోగ్యం, పౌర సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదన్నది కఠిన వాస్తవమని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడమే ధ్యేయంగా ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యవంతమైన మానవ వనరులను తీర్చిదిద్దడానికి విద్య, ఆరోగ్య రంగాల్లో ఎక్కువ నిధులు వెచ్చించాలని రాష్ట్రపతి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలదే ఎక్కువ బాధ్యత దేశ సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి మొదలైనవి రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలోని అంశాలేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి, స్థానిక సంస్థల స్థాయిలోనే సరైన విధానాలు రూపొందించి సమర్థంగా అమలు చేస్తేనే ప్రజా సంక్షేమాన్ని సాధించగలమని చెప్పారు. ఆహారభద్రత కల్పించే దిశగా.. ధనిక–పేద వర్గాలు, పట్టణ–గ్రామీణ ప్రాం తాల మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక విధానాలను రూపొందించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా ఆర్థిక విధానాలు ఉండాలన్నారు. పుట్టగొడుగులాంటి ఆర్థిక వ్యవస్థ ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగు మాదిరిగా ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకోవడం వల్లే పేదరికం సమస్య సమసిపోవడం లేదు’’ అని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అభిప్రాయపడ్డారు. ఐఈఏ సదస్సులో ఆయన మాట్లాడుతూ... ‘‘ఆర్థిక వ్యవస్థ పుట్టగొడుగు మాదిరిగా తయారవుతోంది. కింద సన్నగా ఉంటున్న సంపద పైభాగంలో మాత్రం పెద్ద ఎత్తున పేరుకుపోతోంది. సమాజంలో 99 శాతం ఉన్న అట్టడుగువర్గాలకు సంపద చేరడం లేదు. కేవలం ఒక్క శాతం ఉన్న ఉన్నతవర్గాల వద్దకే చేరుతోంది. అందువల్లే సమాజంలో పేదరికాన్ని రూపుమాపలేకపో తున్నాం’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఐఈఏ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సి.రంగరాజన్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరాట్, ఐఈఏ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఠాకూర్, నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఎ.రాజేంద్ర ప్రసాద్‌తోపాటు దేశ, విదేశాల ఆర్థికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. సింగపూర్‌ని ఆదర్శంగా తీసుకోవాలి విద్య, సాంకేతిక పరిజ్ఞానాలను సాధనాలుగా చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతదేశం రెండంకెల వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అలాగైతేనే అమెరికా, చైనాల తరువాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భ విస్తామని అభిప్రాయపడ్డారు. చిన్నదేశం అయినప్పటికీ సింగపూర్ సాధిస్తున్న ప్రగతిని మనం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆ దిశగా విధానాల రూపకల్పనకు ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా ఆహార పొట్లాల పంపిణీ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తుండగానే, నిర్వాహకులు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు, విద్యార్థులు, విలేకరులకు ఈ పొట్లాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చాలామంది వాటిని అందుకునేందుకు పోటీపడడంతో సదస్సులో కలకలం రేగింది. ఇది గమనించిన రాష్ట్రపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితే ఈ సదస్సులోనూ కనిపిస్తోంది. ప్రతినిధులకు ఆహార పొట్లాలు ఇవ్వడం మంచిదే. కానీ, అది సదస్సులో గందరగోళం సృష్టించేలా ఉండరాదు’’ అని చెప్పారు. ఆహార పొట్లాల పంపిణీని కొద్దిసేపు నిలిపివేయాలని కోరారు. వెంటనే తేరుకున్న పోలీసులు సదస్సులో ఆహార పొట్లాల పంపిణీని నిలిపి వేయించారు. -
హరిత భవిత దిశగా...
దేశంలో పర్యావరణ స్పృహ పెరిగి, అందుకు సంబంధించి చట్టాలు అవసరమని గుర్తించి మూడున్నర దశాబ్దాలు దాటుతోంది. కాలుష్య భూతాన్ని తరిమికొట్ట డానికి, కనీసం దాన్ని నియంత్రణలో ఉంచడానికి ఇన్నేళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆచరణలో అవి పెద్దగా ఫలితాలనివ్వలేదని తరచు రుజువవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన రెండు ఆదే శాలు ఊరటనిస్తాయి. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు హరిత ఆడిట్‌ను చేయించాలన్నది అందులో మొదటిది కాగా... నగరంలో బాణాసంచా వినియోగాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఆదేశం రెండోది. నిజానికి ఈ రెండు ఆదేశాలూ ఇతర నగరాలకు కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. మనకున్న జాతీయ భవనాల కోడ్ (ఎన్బీసీ) లో హరిత ప్రమాణాల ఊసులేదు. కనుక పర్యావరణ అనుకూల భవన నిర్మాణం భావన ఎవరికీ పట్టడం లేదు. దేశ రాజధానిలో కాలుష్యం కోరలు చాస్తోంది. అది చేయి దాటిపోయిందని నిత్యం వెల్లడయ్యే సూచీల్లోని అంకెలే చెబుతున్నాయి. పౌరులు శ్వాసకోశ సంబంధ, గుండె సంబంధ వ్యాధులకూ, పక్షవాతం, కేన్సర్ వంటి వ్యాధులకూ లోనవుతున్నారు. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలియక నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఈ కాలుష్యం అమ్మ కడుపులో ఉన్నవారిని సైతం వదలడం లేదు. వేలాదిమంది తల్లులకు గర్భస్రావాలవుతున్నాయి. అయి దేళ్లలోపు పిల్లలు కూడా ఈ కాలుష్యం వల్ల అర్ధాయుష్కులవుతున్నారని నాలుగు నెలలక్రితం అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) వెల్లడించింది. వాస్తవానికి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఇరవైయ్యేళ్లక్రితం... అంటే 1996లోనే ‘స్లో డెత్’ పేరిట సవివరమైన నివేదికను వెలువరించింది. అది ఒక్క ఢిల్లీ గురించి మాత్రమే కాదు, అనేక నగరాల దుస్థితిని వివరించింది. కాలుష్యాన్ని తనిఖీ చేసే వ్యవస్థ ఏ నగరంలోనూ అమల్లో లేదని చెప్పింది. వాహనాల కాలు ష్యంపై హెచ్చరించింది. కానీ ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడు అందరికీ అర్ధమవుతోంది. ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుస్తోంది. ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో సగం మన దేశంలోనే ఉన్నాయి. ఇందుకు వాహనాలు మాత్రమే కాదు... ఎక్కడబడితే అక్కడ పోగుపడుతున్న చెత్త కుప్పలు, వాటిని తొలగించలేక నిప్పెట్టడం, పరిశ్రమలు అడ్డూ ఆపూ లేకుండా కాలుష్యం వెదజల్లడం వంటివి కారణాలవుతున్నాయి. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై కేసులు నమోదు చేసి శిక్షపడేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఈ పాపంలో భాగస్వాములవుతు న్నాయి. అందరికీ శాస్త్రం చెప్పే బల్లి మాదిరి తామే చట్టాలు ఉల్లంఘిస్తున్నాయి. ఈ అరాచకాన్ని అరికట్టడానికే ఎన్జీటీ బెంచ్ బుధవారం హరిత ఆడిట్ చేయించమని ఆదేశించింది. దీని ప్రకారం ప్రభుత్వానికి చెందిన భవనాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు తమ వద్ద పోగుబడే చెత్తను, ఇతర వ్యర్థాలను ఎలా తొలగిస్తున్నారో ఎక్కడికి తరలిస్తున్నారో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. భవనాల లోపల వాయు నాణ్యత ఎలా ఉంటున్నదో, అది మెరుగ్గా ఉండటానికి అమలు చేస్తున్న వ్యవస్థ ఏమిటో చెప్పాల్సి ఉంటుంది. మురుగు బయటికి పోయేందుకు చేపట్టిన చర్యల గురించి చెప్పాలి. చూడటానికి ఇవన్నీ చిన్న సమస్యలనిపించవచ్చుగానీ వాటివల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని అంతా ఇంతా కాదు. కంప్యూటర్లు, లాప్ టాప్‌లు విరివిగా వినియోగంలోకి రావడం, సీడీలు ఉపయోగించడం అన్నిచోట్లా పెరిగింది. పనికిరాని విడిభాగాలు ఏదో మూలకు విసిరేయడం సర్వసాధారణ మైంది. ఇక ఆసుపత్రుల గురించి చెప్పనవసరమే లేదు. బ్యాండేజీలు, వాడి పారే సిన సిరెంజ్లు, కాలం చెల్లిన మందులు, ట్యాబ్లెట్లు వగైరాలను ఎక్కడబడితే అక్కడ పడేస్తారు. అన్నిచోట్లా ఇలాంటి స్థితే ఉంటుంది. ఒకవేళ చెత్తను తరలించినా శివార్లలో ఎక్కడో వదిలేయడం, ఆ సమీప ప్రాంతాల ప్రజలకు అది ప్రాణాం తకంగా మారడం రివాజే. ఈ స్థితి పోయి పరిశుభ్ర వాతావరణం కోసం కార్యా లయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, తమ ఆవరణల నుంచి తొలగించిన వ్యర్థాలను ఏం చేస్తున్నారో లెక్కచెప్పవలసి వస్తుంది. ఇలాంటి జవాబుదారీతనం అధికార యంత్రాంగం బాధ్యతను పెంచుతుంది. పర్యావరణానికి తమవల్ల జరుగు తున్న అపచారమేమిటో అర్ధమవుతుంది. వ్యర్థాలు పోగుబడే స్థితి ఏర్పడ కుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశమూ ఉంటుంది. ఈ ఆదేశాలు ప్రభుత్వాలపై బాధ్యతను పెంచుతాయి. ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు పోగుబడేలా చేయడం, వాటితో నిత్యం పనులుండేవారు అక్కడికి రాక తప్పని స్థితి కల్పించడం ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో పాలకులకు అర్ధమవుతుంది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరా బాద్‌లో అభివృద్ధి పేరిట ఆయన తీసుకున్న చర్యలు నగర సహజ సౌందర్యాన్ని నాశనం చేశాయి. అది ఇరుగ్గా మారింది. వాహనాల కాలుష్యం హెచ్చయింది. ఆహ్లాదకర వాతావరణం ఆవిరైంది. ఇప్పుడు అమరావతి నిర్మాణంలోనూ ఆ విధానాలనే ఆయన అనుసరిస్తున్నారు. విజయవాడ-గుంటూరుల మధ్య 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తయారయ్యే ఆ రాజధానిలో నగర అంతర్భాగం 212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాగా, సీడ్ క్యాపిటల్ ఎనిమిది చదరపు కిలో మీటర్ల విస్తీర్ణమంటున్నారు. ఈ ప్రాంతమంతా కాంక్రీట్ అరణ్యంగా మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు సమస్తం అక్కడే కేంద్రీకృతమవుతాయి. వస్తే గిస్తే పరి శ్రమలు అక్కడే ఉంటాయి. కనుక కాలుష్యం పెరిగిపోతుంది. ఎన్జీటీ ఆదేశాలు దేశంలోని ఇతర నగరాలకు కూడా వర్తింపజేస్తే, అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు అమలు చేసే ఇలాంటి మతిమాలిన చర్యలకు కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. పర్యావరణ అనుకూల విధానాలపై దృష్టి పెరిగి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్ప డటానికి ఆస్కారం ఉంటుంది. ఈ దిశగా ఎన్జీటీ ఆలోచించాలి.