
సాక్షి, అమరావతి బ్యూరో/ఏఎన్‌యూ: ఇండి యన్ ఎకనామిక్ అసోసియేషన్(ఐఈఏ) నూత న అధ్యక్షుడిగా ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.మహేంద్ర దేవ్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ప్రొఫెసర్ సుఖదేవ్ థోరట్ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతారు. ఆ తర్వాత మహేంద్ర దేవ్ బాధ్యతలు చేపడతారు.
ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శనివారం ఐఈఏ సదస్సు ముగింపు సందర్భంగా అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా మహేంద్ర దేవ్‌ను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా తమిళనాడు నుంచి డాక్టర్ డి.కుమార్, గోవా నుంచి డాక్టర్ శరత్ చంద్రన్, ఛత్తీస్‌గఢ్ నుంచి డాక్టర్ హనుమాన్ యాదవ్, రాజస్థాన్ నుంచి డాక్టర్ ఎస్‌ఎస్ సోమ్రా, జార్ఖండ్ నుంచి డాక్టర్ నికిల్ కుమార్ ఝా, నాగాలాండ్ నుంచి డాక్టర్ గిరిబాబు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ప్రక టించారు.
101వ ఐఈఏ సమావేశం బిహార్ రాష్ట్రంలోని బుద్ధగయ మగధ విశ్వవిద్యా లయంలో నిర్వహిస్తామని, ఆ సమావేశానికి అధ్యక్షులుగా వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ కూడా ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారని ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ప్రకటించారు.
దేశ సమగ్రాభివృద్ధికి సూచనలిస్తాం: మహేంద్ర దేవ్
ఐఈఏ ద్వారా దేశ సమగ్రాభివృద్ధికి అవసరమైన సూచనలు చేస్తామని ఆ సంస్థకు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన తెలుగువ్యక్తి, ఆర్థికవేత్త, వ్యవసాయ ఆర్థికరంగ నిపుణుడు ఎస్.మహేంద్ర దేవ్ అన్నారు. ఐఈఏ అధ్యక్షు డిగా ఎన్నికైన సందర్భంగా ఆయన విలేకరు లతో మాట్లాడుతూ దేశాభివృద్ధికి అవసరమైన పరిశోధన, అధ్యయనాలకు ఐఈఏ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. యువ ఆర్థిక శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.