29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్‌ | Income Tax Offices In India Remain Open On March 29, 30 And 31st, Know More Details Inside | Sakshi
Sakshi News home page

29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్‌

Mar 28 2025 8:04 AM | Updated on Apr 2 2025 9:02 AM

Income Tax offices India remain open on March 29 30 31

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ కార్యాలయాలు మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు (సెలవు రోజుల్లోనూ) తెరిచే ఉంటాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో ఆదాయపన్నుకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇదీ చదవండి: నెలకు రూ.25,432 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌

మార్చి 30న ఉగాది ఆదివారం, 31న రంజాన్‌ కారణంగా సెలవు కావడం తెలిసిందే. ఆదాయపన్ను శాఖకు సంబంధించి మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకునేందుకు కార్యాలయాలను తెరిచి ఉంచుతున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయిన మార్చి 31న ప్రభుత్వ చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 2023–24 అసెస్‌మెంట్‌ సంవత్సరం అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువు కూడా మార్చి 31తో ముగియనుంది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంక్‌లు మార్చి 31న కార్యకలాపాలు నిర్వహించాలంటూ ఆర్‌బీఐ సైతం ఆదేశించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement