Ramadan
-
Sania Mirza Eid Photos: స్పెషల్ అట్రాక్షన్‌గా సానియా మీర్జా.. అచ్చం ఆ హీరోయిన్లా ఉందంటూ కామెంట్లు (ఫొటోలు)
-
Cricketers Celebrate Eid: రంజాన్ వేడుకల్లో క్రికెటర్లు.. ఫొటోలు చూశారా? (ఫొటోలు)
-
రంజాన్ : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
-
బంజారాహిల్స్ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12 సయ్యద్‌నగర్‌లో పూండ్ల వెంకు రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛారిటుబుల్ ట్రస్ట్ అధినేత పూండ్ల వెంకురెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతియేటా తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని అందులో భాగంగా ఈసారి 3 వేలమందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఫిరోజ్‌ఖాన్, రశీద్‌ఖాన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
India Mosques: రంజాన్ స్పెషల్ దేశంలో ప్రముఖ మసీదుల ఫొటోలు
-
రంజాన్ స్పెషల్ : విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్న చార్మినార్ (ఫొటోలు)
-
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
హలీం రుచికి గులాం
నరసరావుపేట ఈస్ట్: హలీం తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు పడుతుంది. తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, గోధుమలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, యాలకులు, నల్ల మిరియాలు, కస్తూరి మేతి, గులాబ్ పత్తి, నల్ల మిరప తదితర రుచికర, బలవర్ధకమైన దినుసులను ఉపయోగిస్తారు. హలీంలో చికెన్, మటన్, వెజిటబుల్ అనే మూడు రకాలు ఉన్నాయి. ప్రస్తుతం చికెన్, మటన్ హలీం మాత్రమే తయారు చేస్తున్నారు. తయారీకి ప్రత్యేక బట్టీల ను ఏర్పాటు చేస్తారు. తొలుత రెండు పెద్ద గిన్నెలు పట్టే పొయ్యిలు ఏర్పాటు చేస్తారు. వీటిపై గిన్నెలు పెట్టి వాటిలో చికెన్, మటన్‌లను మూడు నుంచి నాలుగు గంటలు ఉడికించి మెత్తటి పేస్ట్‌లా వచ్చే వరకు వండుతారు. గోధుమ రవ్వ, గరం మసాలా దినుసులను ఉడకబెట్టిన అనంతరం మెత్తటి పేస్ట్‌లా మారిన చికెన్, మటన్ వంటకాన్ని కలిపి మరోమారు కలయతిప్పుతూ గంట నుంచి రెండు గంటల పాటు వండుతారు. దీంతో రుచికరమైన హలీం సిద్ధమవుతుంది. కొనుగోలుదారులకు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో వేసి దానిపై సన్నగా తరిగి నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి వడ్డిస్తారు. కొలుగోలుదారుని స్తోమతును బట్టి ధర ఉంటుంది. చికెన్ హలీం ప్రారంభ ధర రూ.90లు నుంచి ఉంటుంది. మటన్ హలీం ధర చికెన్ కంటే అధికంగా ఉంటుంది. జిల్లాలో జోరుగా అమ్మకాలు జిల్లాలో హలీం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏడాదిలో ఒక్క రంజాన్ మాసంలోనే లభించే ప్రత్యేక వంటకం కావడంతో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు బట్టీల వద్ద రద్దీ కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సతైనపల్లి వంటి పట్టణాలలో బట్టీలను ఏర్పాటు చేశారు. గ్రామాలకు పార్సిల్స్ తీసుకవెళ్లే వారి కోసం వేడి తగ్గకుండా ఉండేందుకు ప్రత్యేక ప్యాకింగ్ చేసి ఇస్తారు. తయారీలో చేయితిరిగిన వంట మాస్టర్లను హైదరాబాద్ నుంచి రప్పించి రుచికరమైన హలీంను అందిస్తున్నారు. కొన్ని బిర్యాని పాయింట్లలో బట్టీలను ఏర్పాటు చేసి బిర్యానీలతో పాటు హలీంలను విక్రయిస్తున్నారు. వీటితో పాటు రకరకాల చికెన్, మట న్ ఐటమ్స్‌తో పాటు ఖద్ధూర్ (కీర్), స్వీట్లు అందిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక వంటకం హలీం. రంజాన్ నెలలో ప్రతిరోజు తెల్లవారుజాము సహరి నుంచి సాయంత్రం ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు తక్షణ శక్తి కోసం హలీం తీసుకొని శరీరంలో శక్తిని పెంచుకుంటారు. హలీంలో హైప్రొటీన్లు, కాల్షియం, కేలరీలు పుష్కలంగా లభిస్తాయి. దీక్ష కారణంగా శరీరంలో లోపించే విటమిన్లు అందించేందుకు అనువైన ఆహారమే హలీం. అందుకే ఇది కేవలం రంజాన్ మాసంలోనే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అనేక రుచులను ఆస్వాదించే నాలుక హలీం కోసం అర్రులుచాస్తుంటుంది. హలీం తయారీకి నైపుణ్యం కావాలి హలీం తయారీ చెప్పినంత సులువు కాదు. అందు కు నైపుణ్యం అవసరం. దినుసులను సమపాళ్లలో కలపడంతో పాటు చికెన్, మటన్‌లను బట్టీపై మెత్తగా ఉడికించాలి. వంట పూర్తయ్యే వరకు కలయతిప్పుతూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అడుగంటి రుచిలో తేడాతో పాటు నాణ్యత లోపిస్తుంది. నా చిన్నతనం నుంచి హైదరాబాద్‌లో హలీం తయారీలో పని చేస్తున్నా. గత రెండేళ్లుగా రంజాన్ మాసంలో ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నా. – షేక్ హర్షద్, వంట మాస్టర్, హైదరాబాద్ -
రంజాన్ మాసం : ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
విజయవాడ : రంజాన్ ఘుమఘుమలు (ఫొటోలు)
-
పండుగ వేళ పాకిస్తానీలకు కొత్త కష్టాలు..
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే పాకిస్తాన్లో కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. దీంతో బడుగు, మధ్య ఆదాయవర్గాల వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కేజీ ఉల్లి ధర రూ. 150 (పాకిస్తానీ రూపాయిలు) నుండి 300 రూపాయలకు పెరిగింది. అయితే కొంతమంది విక్రేతలు తగ్గింపు ధరలో కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్ నుండి 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధర కిలో 100 పీకేఆర్ నుండి 150 పీకేఆర్‌కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 పీకేఆర్‌ల నుంచి 320 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం కూడా కిలో 400 పీకేఆర్‌లకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 పీకేఆర్‌ల నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్‌కు 200 పీకేఆర్‌లకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 పీకేఆర్‌లకు అమ్ముతున్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు (ఫొటోలు)
-
రంజాన్ పర్వదినం.. అలీ దంపతుల ఆహ్వానం వీరికే! (ఫొటోలు)
-
ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్ర మాసంగా పాటించే రంజాన్ నెల చివరి రోజైన ‘ఈద్ ఉల్ ఫితర్’పండుగ సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నివాసంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ కేసీఆర్‌కు మహమూద్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అందరికీ కేసీఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్ అలీ ఆతిథ్యాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి కేసీఆర్ స్వీకరించారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, క్షమాగుణం, కరుణ తదితర ఆధ్యాతి్మక భావనలు తదితర అంశాలపై కేసీఆర్ తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన పలువురు మత పెద్దలు, ఇతరులను పేరుపేరునా పలకరించి అలాయ్ బలాయ్ తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలం నుంచీ నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షనీనీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్, సలీం, రవీందర్ సింగ్, మేడె రాజీవ్ సాగర్, సీనియర్ నేతలు మొయిత్ ఖాన్, రాయిడన్ రోచ్ తదితరులు పాల్గొన్నారు. తమ ఆతిథ్యం స్వీకరించిన సీఎంకు మహమూద్ అలీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞాపికను బహూకరించారు. -
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారు చేసుకోండిలా!
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారీ ఇలా! కావలసినవి: ►మటన్– కిలో ►బాసుమతి బియ్యం – ముప్పావు కిలో ►లవంగాలు– పది ►దాల్చిన చెక్క – మూడంగుళాల ముక్కలు రెండు ►ఉప్పు – 2 టీ స్పూన్లు ►అల్లం వెలుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►నీళ్లు– 8 కప్పులు ►నూనె– కప్పు ►ఉల్లిపాయ ముక్కలు – 100 గ్రా ►యాలకులు – 8 ►జీలకర్ర– టీ స్పూన్ ►క్యారట్ తురుము– పావు కేజీ ►కిస్మిస్ – అర కప్పు ►పైన్ నట్స్ లేదా బాదం – అరకప్పు ►ఖర్జూరాలు ; పది. తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. ►బియ్యాన్ని కడిగి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. ►మందపాటి పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, ఒక దాల్చిన చెక్కను పలుకులు చేసి వేయాలి. ►సగం లవంగాలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నీటిని పోసి ఉడికించాలి. ►ముక్క ఉడకడానికి దాదాపు ముప్పావు గంట పడుతుంది. ►బియ్యంలో నీటిని వడపోసి చిల్లుల పాత్రలో వేసి రెండు నిమిషాల సేపు ఉంచాలి. ►మరొక పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పైన్ నట్స్ లేదా బాదం, కిస్మిస్, క్యారట్లను వేయించి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు పెద్ద పెనం పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి అందులో మరో దాల్చిన చెక్క పలుకులు, మిగిలిన సగం లవంగాలు, యాలకులు, జీలకర్ర వేయాలి. ►ఇవి కొద్దిగా వేగిన తరవాత ఉడికించిన మాంసాన్ని నీరు ఇతర దినుసులతో సహా ఇందులో వేయాలి. ►ఉడకడం మొదలైన తర్వాత బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టాలి. ►మీడియం మంట మీద ఉడికించాలి. పది నిమిషాల్లో ఉడుకుతుంది. ►మధ్యలో ఓ సారి జాగ్రత్తగా మసాలా దినుసులు సమంగా కలవడం కోసం బియ్యం విరగకుండా కలపాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యారట్, కిస్మిస్ మిశ్రమాన్ని, ఖర్జూరాలను బిర్యానీ మీద సమంగా పరిచినట్లు అమర్చి గట్టిగా మూత పెట్టి, మంట తగ్గించాలి. ►ఏడెనిమిది నిమిషాలకు బిర్యానీ రెడీ అవుతుంది. ►వేడిగా ఉన్నప్పుడే రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు (ఫొటోలు)
] -
సమతా మమతల పర్వం రమజాన్.. ప్రాముఖ్యత ఇదే..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ప్రధానమైనవి. అనాదిగా ఇవి చలామణిలో ఉన్నవే. ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగ (ఈద్ ) అలాంటిదే. రమజాన్ నెలతో దీనికి సంబంధం ఉండడంతో అదే పేరుతో ప్రసిధ్ధి గాంచింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళకి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాసవ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. ఇకపోతే, వెయ్యి నెలలకంటే విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా రమజాన్‌లోనే ఉంది. అందుకని శక్తివంచన లేకుండా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేస్తారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజుకు వెళతారు. ఆ రోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ‘ఈద్ ’ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే, అలాంటి వారిని దైవం తన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయబోమని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని, సన్మార్గం వైపుకు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా, దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి.ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్ఠలతో గడిపారో ఇకముందు కూడా ఇదే çస్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈ విషయాల పట్ల శ్రధ్ధ వహించకపోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. ఈ విధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు ఈద్ రోజున దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటారు. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి, స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు చేస్తారు. ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి, అత్తరులాంటి సువాసనలు వినియోగిస్తారు. ఈద్ గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ (వేడుకోలు) చేస్తారు. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తారు. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువు బారినుంచి, దుష్టపాలకుల బారినుంచి, కరవుకాటకాల నుంచి, దారిద్య్రం నుంచి తమను, తమ దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, విశ్వమానవాళినంతటినీ కాపాడమని కడు దీనంగా విశ్వప్రభువును వేడుకుంటారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు, పరిచితులు, అపరిచితులందరితోనూ సంతోషాన్ని పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈవిధంగా ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావపూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. మానవీయ విలువల పరిమళాన్ని వెదజల్లుతుంది. దైవభక్తిని, దైవభీతిని, బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని, ఇంకా అనేక సుగుణాలను జనింపజేస్తుంది. ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... – యండి. ఉస్మాన్ ఖాన్ ఈద్ నమాజ్ ఇలా... అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ప్రారంభంలో రెండు రకతుల ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, ‘అల్లాహు అక్బర్’ అని రెండు చేతులూ పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’ పఠించి, మళ్ళీ ‘అల్లాహు అక్బర్’ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్న సూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు. తరువాత రెండవ రకతు కోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి, మూడుసార్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ మూడుసార్లూ చేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాలుగోసారి ‘అల్లాహు అక్బర్’ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు, తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ అన్ని సందర్భాల్లో వెనుక బారులు తీరిన భక్తులంతా ఇమాంను అనుసరిస్తారు. ఈద్ నమాజులో అజాన్ , అఖామత్లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థిలను అన్వయిస్తూ సమాజానికి మార్గదర్శక సందేశం ఇస్తాడు. తరువాత దుఆతో ఈద్ ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ‘ఫిత్రా’ పరమార్థం పవిత్ర రమజాన్ మాసంలో ఆచరించబడే అనేక సత్కార్యాల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్ ’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుంచే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆదేశించారు.మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు. కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్తశుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ , ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి, తమ పరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది! అల్లాహ్ అందరికీ రమజాన్‌ను సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. -
Ramzan Special: 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీమ్‌లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో హైదరాబాదీలు అభి‘రుచి’తీరా పండుగ చేసుకున్నారు. తరచూ తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్ హలీమ్, మిఠాయి వంటకాల దాకా భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే 20% ఎక్కువగా తెప్పించుకుని తిన్నారు. గురువారం స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. ఒక్క యాప్ ద్వారానే ఇంత ఫుడ్ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని నగరవాసులు చెప్తున్నారు. హలీమ్‌కు గులామ్.. రంజాన్ మాసంలో ఎప్పటిలాగే హలీమ్ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్‌లను ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్ హలీమ్ ఉన్నా బిర్యానీకి క్రేజ్ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేశారని.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20% ఎక్కువని వెల్లడించింది. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్ వంటి హలీమ్‌లు అమ్ముడయ్యాయి. మరిన్ని వంటకాలకూ డిమాండ్ రంజాన్ సందర్భంగా మల్పువా, ఫిర్నీ, రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్ పెరిగింది. ఈ స్పెషల్ ఐటమ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు 20% పెరిగాయని స్విగ్గీ తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది. రుచులకు చిరునామాలివీ.. హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. షీర్ కుర్మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు!
అమావాస్య వెళ్లిపోయింది... నెలవంక కోసం ఎదురు చూపు మొదలైంది. చంద్ర దర్శనం నేడు కావచ్చు... లేదా రేపు కావచ్చు. ‘ఈద్ ఉల్ ఫిత్ర్’ వేడుకకు ఇంటిని సిద్ధం చేద్దాం. పాకిస్థానీ షీర్ కుర్మా కావలసినవి: ►సన్న సేమ్యా – పావుకేజీ ►వెన్న తీయని పాలు – లీటరు ►చక్కెర – పావుకేజీ ►నెయ్యి – కప్పు ►జీడిపప్పు – అర కప్పు ►బాదం – అర కప్పు ►పిస్తా – పావు కప్పు ►గులాబీ రెక్కలు– గుప్పెడు ►యాలకులు – పది. తయారీ: ►ఏ జీడిపప్పు, బాదం, పిస్తాలను తరగాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి వీటన్నింటినీ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ►మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేగిన తరవాత పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ►యాలకులను నలగ్గొట్టి పాలలో వేయాలి. పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ మరిగించాలి. ►ఖీర్ చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గింజలను, పూలరెక్కలను వేసి కలిపి దించేయాలి. -
Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం ఆఖరి శుక్రవారమైన జమాత్ అల్ విదా ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుదీర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మక్కా మసీదులో జరిగే ప్రార్థనల కారణంగా ఆ సమయంలో చార్మినార్–మదీనా, చార్మినార్–ముర్గీ చౌక్, చార్మినార్–రాజేష్ మెడికల్ హాల్ (శాలిబండ) మధ్య రోడ్లు పూర్తిగా మూసి ఉంటాయి. ఈ మార్గాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, సర్దార్ మహల్ సహా ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్ కూడా మూసేస్తారు. వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బçస్సులకు వర్తిస్తాయని, సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 9010203626 నంబర్లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు -
రంజాన్ స్పెషల్ స్టోరీ : నాకు కావలసినదల్లా అక్కడుండేది..
అప్పుడు పంతొమ్మిదివందల ఎనభై రోజులు. అపుడు దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ పండగలు మాత్రం ఖచ్చితంగా ఉండేవి. మా ఇళ్లల్లో జరుపుకునే పండగలు కొన్నయితే, బయట కనపడేవీ మరికొన్ని. మా ఇంటికి ఆనుకునే కమ్యూనిస్ట్ మార్కిస్ట్ పార్టీ ఆఫీస్ ఉండేది. వీలు కుదిరినపుడల్లా నేనస్తమానం అక్కడే ఉండేవాణ్ణి. నాకెప్పుడు చూసినా వీలు కుదిరేది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లో నాకెంతో ఇష్టంగా అనిపించే పుస్తకాలు ఉండేవి, తెలుగులో వచ్చే అన్ని దినపత్రికలు అక్కడ దొరికేవి. సాయంకాలాలు కామ్రేడ్స్ మీటింగులు ఉండేవి. ప్రతి సమావేశం ప్రారంభంలోనూ, ముగింపులోనూ పాటలు ఉండేవి. వారితో కలిసి గొంతు కలపడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేది. కలుపుతుంటే సంతోషంగా ఉండేది. మధ్యాహ్నాలు పార్టీ ఆఫీస్ ఖాళీగా ఉండేది. అక్కడ నీలిమందు రంగు, రెడ్ ఆక్సైడ్ కలిపిన జగ్గులు ఉండేవి, కుంచెలు ఉండేవి, తెల్లని గోడలు ఉండేవి. నేనక్కడే గోడల మీద బొమ్మలు వేసుకుంటూ ఉండేవాణ్ణి. నిద్ర తగిలినపుడు చల్లని ఫ్యాన్ కింద విశాలాంధ్రో, ప్రజాశక్తో, ఆంధ్రప్రభో పేపరు పరుచుకుని నిదుర తీసే కాలం ఉండేది. తరుచుగా సామాజిక స్పృహ కలిగిన సాంఘిక నాటకాల, బుర్ర కథల, విప్లవ గీతాల రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి. నేనన్నిటికీ హాజరయ్యేవాణ్ణి, నాటకాల డైలాగులు, బుర్రకథల భళానంటి భాయి తమ్ముడా మేల్ భళానోయ్ తందానాలన్నీ నాలుక చివర పాఠాల్లా అతుక్కుపోయేవి. మా నూనెపల్లె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ మనుష్యుల్లో గొప్ప గుణం ఏమిటంటే చిన్న పిల్లవాడినని, ఏమీ తెలియనివాడిని కదాని నన్నెప్పుడూ దూరం పెట్టేవారు కాదు. నాకు కావలసినదల్లా అక్కడుండేది, నాకు ఆ వాతావరణం నచ్చేది. వారు నాకు అయినవారు అయ్యారు. వారు దేవుడు లేడనేవారు. నేనూ దేవుడు లేడనే అనుకునేవాణ్ణి. లేడని ఎవరితో అనేవాణ్ణి కాదు. దేవుడు ఎవరికి ఉన్నా లేకున్నా టంచనుగా మాత్రం పండగలు వస్తూ ఉండేవి. మేము జరుపుకునే ముస్లిమ్ పండగలు, మేము జరుపుకోకున్నా ఇరుగూ పొరుగులతో జరుపుకున్నంత జరిగే ఇతర పండగలు. అతి ముఖ్యంగా ఆగష్ట్ పదహైదు, జనవరి ఇరవై ఆరు, అక్టోబర్ రెండు, నవంబర్ పద్నాలుగు… మొదలైన జాతీయపండగలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకోడానికి నిద్రలేచేవాళ్లం. అసలు పండగలంటేనే తెల్లవారు ఝామునుండే మొదలయేవి. ఇంటి బయట పెద్ద డేగిసా పెట్టి కట్టెల పొయ్యి మీద నీళ్ళు నిరంతరాయంగా కాగుతూనే ఉంటాయి, కాగిన నీళ్ళు కాగినట్లుగా పట్టుకుపోయి జాలాట్లో గంగాళంలో పోస్తూనే ఉంటారు. జనాలు స్నానాలు చేస్తూనే ఉంటారు. మొదట ఇంట్లో ఉన్న మగవాళ్ళు, పిల్లలు స్నానాలు కానిస్తారు, నమాజులకు వెళ్లాలి కదా. గంగాళంలో ఆ ఉడుకుడుకు నీటిలో ఇత్తడి చెంబు ముంచుకుని స్నానం చేయ్యడమనే అనుభవాన్ని ఆ గోల్డన్ ఓకర్ ఎల్లో రంగుని తలుచుకుంటుంటే గతజన్మ జ్ఞాపకాల్లా అనిపిస్తున్నాయి అవన్నీ. స్నానాలు కాగానే కొత్త బట్టలు తొడుక్కోవాలి కదా! మా మేనత్త భర్త మా కుటుంబానికి ఆస్థాన దర్జి, కాబట్టి మాకెప్పుడూ సమయానికి కొత్త బట్టలు కుట్టి రెడీగాలేవు అనే చింతే రాసిపెట్టి లేదు. ఆ రోజుల్లో పండగలకు కొత్త బట్టల ముచ్చట ఏమో కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొత్త బట్టలకు పండగా, పుణ్యకార్యాల ప్రాప్తత లేదు. జనం దగ్గర డబ్బులు, అప్పులు ఎక్కువయిపోయి ఎప్పుడు పడితే అప్పుడు అవసరమున్నా, లేకున్నా బట్టలు కొనేయడం, వేసేసుకోడమే. అసలు కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది? ఆ రెడీమేడ్ షో రూమ్ ట్రైల్ రూమ్‌లో ఎంతమంది దానిని వేసుకుని, విడిచి, నలగ్గొట్టి బాలేదని బయట పడేసింది వచ్చి మన వాటాకు దక్కిందో! ఇట్లా వచ్చే పండగలకు, మన పుట్టిన రోజు పండగలకు ఆ దగ్గరికాలం రోజుల్లో మన స్కూల్ యూనిఫామ్ కనుక చినగడమో, పొట్టి కావడమో జరగరాదని దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడికి దండం పెట్టుకోవాలి. లేకపోతే దుబారా అవుతుందని ఒక్కోసారి పండగలకు, పుట్టినరోజులకు మనకు స్కూలు డ్రస్సును కొత్తబట్టలుగా కుట్టించడం పెద్దల జాగ్రత్త. పండగనాడు కూడా బడి యూనిఫామ్ ఏమిరా! పైన తెలుపు, కింద ఖాకీ. ఏవయినా రంగులా అవి? స్నానాలు కానించి, కొత్త బట్టలు వేసుకుని, తలకు నూనె పట్టించి, సుబ్బరంగా తల దువ్వుకుని, రెడీ రెడీ అనుకున్నాకా పెద్దలూ పిల్లలూ అందరూ తిక్కస్వామి దర్గా దగ్గర ఈద్గాకు బయలుదేరేవాళ్లం. చక్కగా మడత పెట్టిన దుప్పట్లను మేము పెద్ద పిల్లలం చంకలో పెట్టుకుంటే, మాకంటే చిన్నవాళ్లయిన మా బుల్లి బుల్లి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మా చిన్నాయనగార్లవో, మావో చిటికెనవేళ్ళు పట్టుకుని దారికంతా అత్తరు వాసన అద్దిస్తూ నడిచేవాళ్లం. మామూలుగా ఏ రోజు కూడా అయిదుపైసాలు కూడా పిల్లల చేతిలో పెట్టని మా మాబ్బాషా చిన్నాయన రోజు మా చేతికి, మా జేబుకు నిండుగా రూపాయలు, అర్ధరూపాయల బిళ్లలు నింపేవాడు (అంటే మా చిన్నాయన మూడువందల అరవైనాలుగు రోజుల పిసినారి అని కాదు, డబ్బు పిల్లలను చెడగొడుతుంది అని ఆయన నియమం, అదే అవసరమైన ఖర్చుపెట్టే దగ్గర ఆయనది ధారాళమైన చేయే) ఆ చిల్లర డబ్బులంతా ఎందుకంటే నమాజు ముగిశాకా దారికి రెండు పక్కలా బీదా బిక్కీ జనం ఉంటారు కదా, వారికి ధర్మం చేయడానికి. ఒక్క నాణెం మిగిలిపోకుండా అన్ని బిళ్ళలు అక్కడే పంచి వచ్చేసేవాళ్ళం. అలా నమాజు నడకకు బయలుదేరితే దారి నిండా నమాజులకు వెళ్ళే జనమే. మామూలు రోజుల్లో నిత్యం లుంగీ, కట్ బనీయన్ల మీద కనపడే టీ బంకు లాలూభయ్ గాని, రిక్షా తొక్కే బాషా భయ్ వంటి అనేకం ఆరోజు అమిత శుభ్రంగా, కళకళ్లాడుతూ ముచ్చటగా కొత్తబట్టల్లో కొత్తగా కనపడేవారు. ఈద్గా దగ్గర నా స్కూలు ప్రెండ్స్ కూడా చాలామంది కనపడేవారు. వాడు కనపడగానే వీడు, వీడు అగుపడగానే వాడు పళ్ళికిలించుకోడమే తప్పా, ఆదాబ్ అనో, అస్సలామలైకుం అంటూ లేని గడ్డాన్ని నిమురుకుంటూ గంభీరంగా తెలుగు సినిమా వేషాలు ఏమీ పడేవాళ్లం కాదు. మాకు తెలిసిన అస్సలామలైకుం అల్లా ‘సలాములేకుం సాయబుగారు భలే జోరుగా ఉన్నారు’ అనే గులేబకావళి సినిమా పాట మాత్రమే. ఎక్కువ ఆలస్యం చేయకుండా పండగ నమాజు చేసే ఈద్గాకు త్వరగా చేరుకుంటే స్థలం కోసం అటూ ఇటూ వెదుక్కోకుండా మా దుప్పట్లు పరుచుకునేంత చల్లని నీడని ఏ చెట్టుకిందో చూసుకోవచ్చు. ప్రార్థనలు త్వరగానే ముగిసేవి. ప్రార్థానానంతర ఉపన్యాసాలు ఉంటాయి కదా, అవి చాలా సమయం తీసుకుంటాయి. అప్పటికీ ఎండ చురుకెక్కుతుంది. ఉదయం ఏమీ తినకుండానే వస్తాము కదా, పిల్లలు బెట్ట పోతారని మా చిన్నాయన దిగులు. అందుకే మంచి చెట్టుకింద జాగాలో మా దుప్పట్లు పరుచుకుంటాం. కాసేపటి తరువాత నమాజు మొదలవుతుంది. కుడివాడు కుడికి తల తిప్పితే కుడికి, ఎడమవాడు ఎడమకు తిప్పితే ఎడమ. ఎదుటివాడు ముందుకు వంగితే మనమూ వంగడమే తప్పా దేనినీ శాస్త్రోక్తంగా నేర్చుకున్నది లేదు. చిన్నపుడు పర్లేదు కానీ కాస్త పెద్దయ్యాక మనం చేసేది దొంగ నమాజు. కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసే తోటివాళ్ళు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు కదా! మన మనసు గమనిస్తుంటుంది కదా! సిగ్గుగా ఉండదూ? మనమీద మనకు అసహ్యం వేయదూ? అందుకని ఆ దొంగ పని ఎందుకని అదీనూ మానేశా. (ఆ తరువాత్తరువాత ఈద్గాలో సామూహిక ప్రార్థన వదిలేసి మునిసిపల్ హైస్కూలు గ్రవుండ్‌లో చాచిన చేతులు అల్లా దువా కోసం కాక ఎర్రని కార్కు బంతిని పట్టడం కోసం విచ్చుకునేవి. మధ్యాహ్నం నమాజులు ముగిసే సమయానికి పది ఓవర్ల మ్యాచు ముగిసి రంజాను నమాజు జనాల గుంపు మధ్య కాళ్ళు దూర్చి ఇల్లు చేరుకునేవాడ్ని. మాసిన బట్టలు, చెరిగిన తల, దోక్కుపోయిన మోచేయి అందాక చేసిన ఘనకార్యం చెబుతున్నా నాయనమ్మ, మేనత్తలు, పిన్నులు ఏమీ అనేవారు కాదు. వేడి పాల సేమియాలో నానిన కిస్మిస్‌లకు మాదిరి మెత్తని నవ్వుతో తియ్యగా కనిపించేవారు.) నమాజు ముగిశాకా ఈద్గా దగ్గరి నుండి ఇంటికి చేరే వరకు దారిన తగిలిన ప్రతి ఒకరిని మా పెద్దవాళ్ళు ఆలింగనాలు చేసుకుంటూ వచ్చేవారు. ఏమిటీ నడిరోడ్డు మీద కావిలింతల ఆలస్యం అని విసుక్కుంటూ పిల్లలం మేము మాత్రం గబగబా పరిగెత్తుకు ఇంటికి వెళిపోయేవాళ్లం. వచ్చాం కదాని సరాసరి ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. గుమ్మం దగ్గర మా పిన్నిగార్లల్లో ఎవరో ఒకరు పళ్ళెంలో ఎర్ర నీళ్ళు పట్టుకు నిలబడితే అందులో అయిదు పైసాలో, పది పపైసాలో బిళ్ళ పడేసేవాళ్లం. పిలల్ల తల చుట్టూ ఆ పళ్ళెం తిప్పి దిష్టి తీసేసేవారు. అప్పుడు కాళ్ళు మొహం శుభ్రంగా కడుక్కుని ఇంటి లోపలికి వస్తే చక్కగా కూచోబెట్టి నోటి నిండా తీపిగ సేమియా పాయసం తినపెట్టేవారు. ఈ హైద్రాబాద్ మహానగరానికి వచ్చాకా పత్రికల భాషలాగా పండగ వంటకాలు కూడా మారిపొయినై! క్యా భాయ్! షీర్ కూర్మా నహీ హైక్యా? హలీం నహి ఖిలాతే? ఇఫ్తార్ విందు ఎప్పుడు ఇస్తాయి హై? వంటి విపరీత ఓవరాక్షన్ మాటలు వినపడేవి. అసలు రంజాన్‌ను రంజాన్ అని కూడా అనకూడదట రమ దాన్ అనాలని మళ్ళీ అదొక రుద్దుడు జ్ణానము. వద్దురా దేవుడా! ప్రాంతం ప్రాంతంకి కల్చర్, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు మారిపోతాయిరా స్వామి. మాకసలు పత్రికా పదకోశ పాకముల వంటి బిరియాని, మిర్చ్ కా సాలన్, షీర్ ఖూర్మా, హలీం, హరీస్ లేనే లేవు. మాదంతా నంద్యాల జిల్లా, నూనెపల్లె ఆత్మకింపుగా వండబడిన సేమియా పాయసం, డబల్ కా మీఠా, బగరా ఖానా, దాల్చా, భాజి బోటి, పెరుగు పచ్చడి. అంతే! చాలు! ఇదే మా పండగల జీవితాదర్శం. ఆ విధంగా పండగ పాయసం మీద వేసిన మేవా మెక్కేసి పాయసం లోపల ఉన్న కిస్మిస్, గోడంబి పలుకులు తినేసి, మెత్తని పాయసం తీగల్ని జుర్రేసేలోగా మా చిన్నాయనలు, మా మేనత్తల భర్తలు వచ్చేసేవాళ్ళు. ఇంటి లోపల అందరికీ చక్కగా పొడగాటి సిరి చాపలు, బొంతలు పరిస్తే ఇంటిల్లపాది కూచుని హాయిగా అన్నాలు తినేవాళ్లం. నాకైతే రంజాన్ నాడు వండే పలావు కన్నా మహత్తరమయిన రుచిగల మరో పండగ పలావు ఉండేది. అది పెద్దలపండగ అని వస్తుంది ఆ రోజున వండే పలావుకు రుచే ప్రత్యేకం. అది ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్దల రాత్రి అని ఒక దినం ఉంటుంది. ఆ దినాన మా ఇంట్లో మరణించిన వారినందరిని గుర్తు చేస్తుకుంటూ, వారు తమ జీవితకాలంలో దేన్నయితే ఇష్టపడేవాళ్ళో ఆ పదార్దాలను నైవేద్యంగా పెట్టేవారు. వారి కొరకు కొత్తబట్టలు తెచ్చేవారు. మా జేజినాయనకు గణేష్ బీడి ఇష్టమని బీడి కట్ట ఒకటి, గళ్ళుగళ్ళు గల లుంగి, మా అమ్మకు చీర, చిన్నతనానే చనిపోయిన చిన్నపిల్లల కోసం లడ్డు, బాదుషా, మినపగారెలు, ఇంకా అవీలు ఇవీలు. ఎవరికి ఏది ఇష్టమేదయితే అది అన్నమాట. సాయంత్రం కాగానే మౌలానాగారు వచ్చి ఫాతెహ్ జరిపిన తరువాత ఇంట్లో ఉన్న చిన్నా పెద్దా అందరూ శుభ్రంగా స్నానాలు కానించి, ఈ కొత్త బట్టలు, నైవేద్యాలు దేవుని గూడు ముందు పెడతాం కదా అక్కడకు చేరి, ఆడవాళ్ళు అయితే నెత్తిన కొంగు కప్పుకుంటారు, పిల్లల నెత్తి మీద ఒక టవల్ వేసి, ఉత్త మోకాళ్ళు కనపడకుండా ప్యాంటో, తువ్వాలో, లుంగీనో కట్టపెట్టి, ఇంట్లో చనిపోయిన వారి పేరుపేరిట జేజినాయనకని, అమ్మకని, చిన్నమ్మకని, చిన్న చిన్నాయనకని వారిని తలుచుకుంటూ నిప్పుల్లో సాంబ్రాణి ధూపం వేయిస్తారు. నేను ఈ హైద్రాబాదు నగరానికి వలస వచ్చిన తరువాత కూడా గత రెండు సంవత్సరాల క్రితం వరకు మా మేనత్త మాబున్ని అమ్మ ప్రతి సంవత్సరం మాకు పెద్దల పండగ రాబోతుందని గుర్తు చేసేది. మా ఆవిడ లావణ్య ఇంట్లో పెద్దలకని బట్టలు కొని తెచ్చేది. సాయంకాలం కమ్మగా ఇంత పలావు, మాంసం కూర, పాయసం వండి పెడితే – మాకు ఆ కల్మాలు, సూరాలు తెలీవుగా! అయినా బుర్ర తక్కువయినా, మనసు నిండుతో వారందరి పేర్లను తలుచుకుంటూ సాంబ్రాణి పొగను, మా భక్తితో పాటే ఆకాశం వైపు పంపించేవాళ్ళం. వారందరితో పాటు ఆమధ్యే మాకు దూరమయిన బాపుగారు, పతంజలిగారు, నాయుని కృష్ణమూర్తిగారు, మోహన్‌గారికి కూడా సాంబ్రాణి భక్తిని వేసేవాళ్ళం. మా మేనత్త ఆ మధ్యే పోయారు. ఆవిడతో పాటే ఈ పండగల మంచీ చెడూనూ. సంవత్సరం సంవత్సరం మాతో ఈ పనులు చేయించిన మా మేనత్తకే మా సాంబ్రాణి తాకే ప్రాప్తం లేకపోవడం పెద్ద దుఃఖం. పెద్దలందరి పేరిట సాంబ్రాణి ధూపాలు వేసిని తరువాత ఇంటిల్లిపాది అంతా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి కాసేపు బయట కూచోవాలి. అప్పుడు మా పెద్దలు అందరూ దివినుండి దిగి వచ్చి మేము తెచ్చిపెట్టిన బట్టలు ఇష్టంగా కట్టుకుని, వండిన అన్నాలు తిని వెళ్ళిపోతారని చెప్పేవారు. అవన్నీ మనం చూడకూడదని అందుకే తలుపులు మూయాలని చెప్పెవారు. ఇట్లాంటి మాటలు అన్నీ భలే ఉండేవి. అదే చిన్నతనాన అప్పుడప్పుడూ మా ఇంట్లోకి ఝుమ్మంటూ కందిరీగ వచ్చేది. దాన్ని చూసి ఎక్కడ కుడుతుందోని భయంతో దూరం తోలడానికి విసనకర్రో, చేటో పుచ్చుకుంటామా, దానిని కొట్టవద్దని, పాపమని మా మేనత్త చేప్పేది. అది కందిరీగ కాదట. చనిపోయిన మా జేజినాయన అలా వచ్చాడని చెప్పింది. ఆ మాటను ఇప్పటికీ అలాగే పుచ్చేసుకున్నా. ఈ రోజుకు మా ఇంటి బాల్కనీలో మొక్కల మీదికి ఒక కందిరీగ వస్తుంది, దానికేసి అలానే గమ్మున చూస్తాను. మా పిల్లవాడు వచ్చి అరే! జేజినాయన వచ్చినాడే! అంటాడు. జీవితంలో చాలావాటికి హేతువులు, సమాధానాలు, తెలివితేటలు వాడనక్కరలేదు. కొన్ని విషయాలపై ప్రేమ కలిగి ఉంటే చాలు. చాలా బావుంటుంది. మీరూ ఎప్పుడయినా వాడి చూడవచ్చు. పెద్దల పండగనాడు మూసిన తలుపుల వెనుక మూయని పళ్ళాల మీది పలావు అన్నం, కూర గిన్నె, దాల్చా పాత్రల్లోకి ఇల్లంతా నిండిన సాంబ్రాణి పొగ కాస్త తగిలి కాస్త, కాస్త ములిగి, కాస్త అల్లుకుని ఆ పదార్థాలన్నీ రుచి అవుతాయి చూడండి, అబ్బా అంత రుచయిన తిండి నా వరకు మళ్ళీ ఏ పండగలోనూ తగలదు! అందుకని నాకు రంజాను అంటే తిండి కన్నా పెద్దలామాశ పండగ తిండే గొప్ప. చిన్నతనాన పిల్లల ప్రాణానికి రంజాను అంటే తిండి పండగ కాదు. ఈనాము డబ్బుల పండగ. మాది అప్పట్లో ఉమ్మడి కుటుంబం. మా జేజెమ్మా-జేజినాయనల మగ సంతానం అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో ఉండేవారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయి బయటికి కాపురానికి వెడతారు కదా. నమాజు ముగిశాకా మా మేనత్తలు, మామలు, వాళ్ల పిల్లలూ అందరూ మా ఇంటి దగ్గరికే వచ్చేవారు. పెద్దవాళ్ళు ఈద్ ముబారక్ ఆలింగనాలూ చేసుకుంటే మా వంటి పిల్లలం వంగి పెద్దల కాళ్లకు దండాలు పెట్టుకుని, లేచి ఈనాము డబ్బులు అడిగేవాళ్ళం. ఈనాము కదా డబ్బులు అంటే, సంపద అంటే, ఆస్తి అంటే. వసూలయిన డబ్బుని వచ్చింది వచ్చినట్లుగా ప్రతిసారీ గలగలమని లెక్కలు పెట్టుకుంటుంటే ఎంత బావుండేది! అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, నిక్కర్ జేబులో నాణేల బరువు, ఘల్లు ఘల్లు చప్పుడు అవుతుంటే అచ్చం లక్ష్మీదేవి మా చిల్లర జేబుల్లో కొలువు తీరినట్లుగా ఉండేది. రావాలసిన వాళ్ళు అంతా వచ్చేశారు, ఇవ్వవలసినది ఇచ్చేశారు, ఇక రాలేదేం లేదు అనుకున్నాకా అన్నాదమ్ములం, బావా మరుదులం అంతా సినిమాకని టవున్ దారి పట్టేవాళ్లం. మొదటి ఆట అయిపోయేసరికి రంజాను పండగ ముగిసేది. వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు. అన్నిటికీ తొందరే! ఎప్పుడెప్పుడు సాయంత్రమవుతుందని ఉదయం, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందాని సొమవారం, ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దయిపోయి జిప్పున్న ప్యాంట్ తొడుక్కుంటామని త్వరపడిపోయి బాల్యాన్ని విడిచేశాం. మా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దేవుడు లేడని నాకు చెప్పింది కానీ పండగలు మాత్రం ఉన్నాయని నా చిన్ననాటి ఇల్లు నేర్పింది నాకు. ఇపుడు పెరిగి పెద్దయ్యినాకా ఆఫీసు నుండి ఉదయపు వయసు అలసటతో ఇంటికి వచ్చి సాయంకాలం దీపం వంక చూస్తే దీప జ్యోతిః పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దనః దీపో హారతు మే పాపం దీప జ్యోతిర్ నమోస్తుతే. అని మనసుకు శాంతి అనిపిస్తే జనార్దనుడో, జీససుడో, అల్లా మాలికుడో ఎవరో ఒకరు మనకు ఆయన లేడు అని మనమనుకున్నా మీరంతా నాకు ఉన్నార్రా పిల్లలూ అని దేవుడు దీపంలా తలాడించినట్లు ఉంటుంది. దీపం దేవుడు రంజాను రోజున ఆకాశమెక్కుతుంది. నెలవంకగా మారుతుంది. నా బాల్యంలో ఆకాశంలో కనబడిన రంజాన్ నెలవంకను చూసి వెంటనే కళ్ళు మూసుకుని గోడలు తడుముకుంటూ గొంతెత్తి నా పేరు పిలుస్తూ నా కోసం వచ్చేది మా జేజి. తన చేతుల్లోకి నా మొహన్ని తీసుకుని అప్పుడు కళ్ళు తెరిచి నన్ను చూసేది. నెలవంక తరువాత నా గుండ్రని మొహం. అంతే! నా తరువాతే పండగ. చందమామను, ప్రేమని, పండగని ఎలా అహ్వానించాలో నేర్పిన మొదటి మనిషి మా జేజి, ఆ పై మా మేనత్తలు, పిన్నిగార్లు. ఇప్పుడు పండగ సంవత్సరానికి ఫలానా రోజు వచ్చే ఒక తారీఖు మాత్రమే. ఆ మనుషులూ వాళ్ళ జ్ణాపకాలు, ఆ గోరింట పండే రాత్రుళ్ళు, తెల్లని అరచేతిలో ఉదయించిన ఎర్రని సూరీడు, నెలవంక, నక్షత్రాలు ఆరిపోయాయి. ఇప్పుడు మావాళ్ళు వారు లేని ఊరు జీవితంలోకి ఏ కొత్త చందురుడు వెలగలేడని అర్థం అయ్యింది. జీవితంలోని అసలైన కొన్ని ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్ర రాత్రుళ్ళు, నక్షత్రాలు నశించాయి. ఇక అవి ఎప్పటికీ లేవు. ఇప్పుడు పండగ లేదు. భగవంతుడే ఉన్నాడు. ఆయన దయ వలన జ్ఞాపకాల్లో పండగ మిగిలి ఉంది. అన్వర్, ఆర్టిస్టు, సాక్షి దినపత్రిక -
రంజాన్ ఉపవాసంపై సింగర్ అనుచిత వ్యాఖ్యలు.. నటి ఫైర్
మోడల్, నటి గౌహర్ ఖాన్ త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో తను ఉపవాసం ఉంటుందా? లేదా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. దీనికి గౌహర్ స్పందిస్తూ.. గర్భంతో ఉన్నందున ఈ ఏడాది రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని తెలిపింది. దానికి బదులుగా నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇకపోతే హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ దంపతులు రంజాన్ మాసంలో ఉపవాసం చేయడంపై సెటైర్లు విసిరారు. 'మేమైతే ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. మా శరీరాలకు పోషకాలు కావాలి. అందుకే ఆ ఆలోచన కూడా చేయం. అయినా ఇలా కడుపు మాడ్చుకుని ఉపవాసాలు చేయడమేంటో మాకిప్పటికీ అర్థం కాదు. అంతగా అవసరమైతే టీవీ చూడటం, సెల్‌ఫోన్ వాడటం మానేయండి. అంతే తప్ప తిండి మానేయడమేంటి? మరీ తెలివి తక్కువ వాళ్లలా ఉన్నారనిపిస్తోంది' అని వెకిలిగా మాట్లాడారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన గౌహర్ ఖాన్ సింగర్ జంటపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. దాని వెనక ఉన్న సైన్స్ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి కాస్తైనా తెలుసా? ముందు అవి తెలుసుకోండి. మీకంటూ ఓ అభిప్రాయం ఉండటం తప్పనడం లేదు. కానీ వాటిని ఎలా వ్యక్తీకరించాలనే తెలివి కూడా ఉంటే బాగుంటుంది' అని చురకలంటించింది. ఇక గౌహర్ ఖాన్ విషయానికి వస్తే.. ఆమె సరుకులు కొనడానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు జైద్ దర్బార్‌ను కలిసింది. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది స్నేహానికి దారి తీసింది. కొంత సమయానికే అది ప్రేమగా మారింది. 2020 నవంబర్ 5న వీరి నిశ్చితార్థం జరగ్గా డిసెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. 2022 డిసెంబర్లో తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది నటి. ఆమె చివరగా శిక్షా మండల్ సినిమాలో నటించింది. -
హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)
-
రంజాన్ వేళ.. బిర్యానీ, హాలీం ప్రియుల సందడి (ఫొటోలు)
-
29న సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడి యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని సీఎం తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోంది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తోంది. లౌకికవాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని ఒక ప్రకటనలో తెలిపారు. -
హలీమ్ కు సలాం
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. హైదరాబాద్ సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం అక్కడికే పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం. మదనపల్లె సిటీ/రాయచోటిటౌన్ / రాజంపేట టౌన్: హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్‌కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది. ►మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో జామియా మసీదు సమీపంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చే ముస్లింసోదరులకు అందుబాటులో ఉండేలా 5 హలీం కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో రుచికరమైన చికెన్హలీం రూ.100కు, మటన్ హలీం రూ.150కు లభిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ►రాజంపేటలోని ఆర్ఎస్రోడ్, మెయిన్‌రోడ్లలో హలీంసెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక బాక్స్ రూ.200 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. ►రాయచోటిలో మొత్తం 13 హలీం సెంటర్లు ఉన్నాయి.ట్రంక్ సర్కిల్, దర్గా, బంగ్లా జుమ్మమసీదువద్ద, మదనపల్లెరోడ్డు, రవి, లక్ష్మీ హాల్ సమీపంలో, ఎస్ఎన్ కాలనీ తదితతర ప్రాంతాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మటన్‌తో కూడిన హలీం 250 గ్రాములు కప్పు రూ.200, చికెన్‌తో వండిన హరీన్ కప్పు రూ.110, హాప్ రూ.60లుగా విక్రయిస్తున్నారు. హలీం తయారీలో నిమగ్నుడైన వంట కార్మికుడు , హలీం కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్న ప్రజలు 8 తయారీ ప్రత్యేకమే.. సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పు లు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతిబియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం రుచికే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ఒక కప్పు హలీంలో 365 క్యాలరీలు, కొవ్వు నుంచి లభించే క్యాలరీలు 150 లభిస్తాయి. ’రుచి అమోఘం.... రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి సంవత్సరం కచ్చితంగా తినడాన్ని అలవాటు చేసుకున్నాను. – మహమ్మద్‌ఖాన్, టీచర్, మదనపల్లె. హైదరాబాద్ నుంచి రప్పించాం హలీం తయారీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంటమాస్టర్లను రప్పించాం. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి పోషక ఆహారమైన హలీంను రుచిగా, నాణ్యతగా అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం. – షామీర్, వ్యాపారి,రాజంపేట శక్తివంతమైన ఆహారం హలీం శక్తివంతమైన ఆహారం. మాంసంతో పాటు అనేక రకాల పప్పుదినుసులతో తయారు చేయడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. – డాక్టర్ అశ్విన్‌చంద్ర, ఆకేపాడు పీహెచ్సీ, రాజంపేట మండలం -
ఆధ్యాత్మిక తరంగం రమజాన్
పవిత్ర రమజాన్ ప్రారంభవేళ..పగలంతా ఉపవాసాలు.. సాయంత్రం ఇఫ్తార్ విందులతో వీధులన్నీ కళకళలాడబోతున్నాయి. పిల్లలూ పెద్దల హడావిడితో వాతావరణమంతా అప్పుడే సందడిగా మారింది. మండువేసవిలోనూ నిండు వసంతం కుండపోతలా వర్షించడం మొదలైంది. మానవుల పాపాలను కడిగి, పునీతం చేసే పవిత్ర రమజాన్ నెల ప్రారంభమైంది. మనిషిలోని దుర్లక్షణాలను హరింపచేసి, ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి సానుకూల భావనలను పెంపొందింపచేసే పవిత్ర రమజాన్ మానవాళికి సరైన జీవన సూత్రాలను ప్రబోధించే మార్గదర్శి. రమజాన్ ఒక అలౌకిక భావన. తేజోమయ ఆథ్యాత్మిక తరంగం. సత్కార్యాల సమాహారం. వరాల వసంతం. మండువేసవిలో నిండు వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికీ, జీవన సాఫల్యానికి అవసరమైన సమస్తమూ దీనితో ముడివడి ఉన్నాయి. రమజాన్‌లో పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికీ ఇది ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్ లో ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. ఇవి మానవుల్లో దైవభక్తినీ, దైవభీతిని ప్రోదిచేస్తాయి. స్వర్గానికి బాటలు వేస్తాయి. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి ‘షబేఖద్ర్’ కూడా రమజాన్ లోనే ఉంది. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యినెలల ఆరాధనకన్నా మేలైనది. రమజాన్‌లో సత్కార్యాల ఆచరణ ఎక్కువగా కనబడుతుంది. దుష్కార్యాలు ఆగిపోతాయి. సమాజంలో చక్కని అహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. ఐదుపూటల నమాజుతోపాటు, అదనంగా తరావీహ్ నమాజులు ఆచరించబడతాయి. సాధారణ దానధర్మాలతోపాటు,‘ఫిత్రా’అనే ప్రత్యేక దానాలు కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చాలామంది ‘జకాత్’ కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. అంతేకాదు, రమజాన్ నెలతో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. ప్రధాన ఆరాధన, ప్రత్యేక ఆరాధన మాత్రం’రోజా’ (ఉపవాసవ్రతం)యే. దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చెయ్యాలి. నిజానికి ఉపవాస వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త వారి అనుచరులకు మాత్రమే, అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆరాధన. దీనికి చాలా ఘనమైన, ప్రాచీన సామాజిక నేపథ్యం ఉంది. ఇది అనాదిగా అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చెలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం పవిత్ర ఖురాన్ చెబుతోంది. ‘విశ్వాసులారా..! పూర్వ ప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా విధిగా ఉపవాసాలు పాటించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’ (2 – 183 ) అంటే, ఉపవాసవ్రతం కేవలం ఈనాటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండీ ఆచరణలో ఉన్న సనాతన ధర్మాచారమని మనకు అర్థమవుతోంది. ఈరోజు కూడా ప్రపంచంలోని అన్నిదేశాల్లో అన్ని జాతులు, అన్ని మతాల వారిలో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. మానవ సమాజంలో మంచి, మానవీయత, భయభక్తుల వాతావరణాన్ని జనింపజేయడం, విస్తరింపజేయడమే ఈ ఉపవాసాల ఆచరణలోని అసలు ఉద్దేశ్యం. పవిత్ర ఖురాన్ మార్గదర్శకంలో, ప్రవక్తవారి ఉపదేశానుసారం మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి స్వీయసమీక్ష కు, సింహావలోకనానికి రమజాన్ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని వినమ్రంగా వేడుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Photo Feature: కరోనా కష్టాలు ఎన్నాళ్లు?
కరోనా కష్టాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం ప్రజలు అవస్థలు పడాల్సివస్తోంది. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క తమ ఇళ్ల దగ్గరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది. -
Jr NTR: తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఎన్టీఆర్
Eid Mubarak యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లోకి ఉండి చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్‌లోకి వెళ్లారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నామని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తన హెల్త్ కండిషన్‌పై అప్డేట్ ఇస్తూ రంజాన్ పండగ శుభాకాంక్షలు చెప్పాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని… త్వరలోనే కరోనా రిపోర్ట్ నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ‘ప్రతి ఒక్కరికీ ఈద్ శుభాకాంక్షలు. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాను. త్వరలోనే కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా. జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి’అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్ లో నటిస్తుండగా.. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. -
ఈద్ గెటప్‌లో బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు.. వీడియో వైరల్
Eid Mubarak : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నందమూరి నట సింహం బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు. ఈ మేరకు ఈద్ గెటప్‌లో ఓ వీడియోని విడుదల చేశారు బాలకృష్ణ ‘ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవానిరతి మారుపేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్దలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణతోపాటు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ముస్లిం సోదరులకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు -
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్: డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగపై రూయత్ హిలాల్ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. రంజాన్ వేడుకలను శుక్రవారం రోజునే జరుపుకోవాలని కోరారు. మసీదులు, ఈద్గాలలో నలుగురు కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయొద్దని సూచించారు. -
ఉపవాసం ఉండి వ్యాక్సిన్ తీసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ ఉపవాసంలో ఉండి కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోవచ్చని, దీని ద్వారా ఉపవాసానికి వచ్చిన నష్టమేమి లేదని హైదరాబాద్‌కు చెందిన దారుల్ ఇఫ్తా సంస్థ ముస్లింలకు సలహా(ఫత్వా) జారీ చేసింది. గొంతు మార్గం ద్వారా వ్యాక్సిన్ కడుపులోకి చేరదని, దీంతో ఉపవాస దీక్షలో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తిన సందర్భాల్లో ఉపవాసాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, ఉపవాస దీక్షను తర్వాత వీలును బట్టి మరో రోజు చేపట్టాలని కోరింది. ఏప్రిల్ 14 నుంచి దేశంలో రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఉపవాస దీక్షలో ఉండి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఈ సంస్థ జారీ చేసిన సలహా దోహదపడనుంది. చదవండి: మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్ కరోనా ఉధృతి : టీకా కోసం పడిగాపులు -
ఈద్ ముబారక్
సాక్షి, హైదరాబాద్, అమరావతి: రంజాన్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల్లో సుఖసంతోషాలను నింపుతుందని పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రంజాన్‌ను ఇళ్లలోనే జరుపుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రంజాన్ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. -
రేపు రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శనివారం నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం ఉపవాసం ఉండాలని, 25వ తేదీ సోమవారం రంజాన్ పండుగ నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర నెలవంక నిర్ధారణ కమిటీ (రుహియాత్ ఇలాల్) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా షుత్తారి శనివారం ప్రకటన విడుదల చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమా చారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు షుత్తారి పేర్కొన్నారు. -
వైద్యుల సలహాతోనే రంజాన్ ఉపవాసాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఉపవాసంతో కరోనా సోకే ప్రమాదం ఉన్న ట్లు ఎలాంటి అధ్యయనాల్లో తేలలేదు. గతంలో తరహాలోనే ఈ రంజాన్ సందర్భంగా ఆరోగ్యవంతులు ఉపవాసం ఉండవచ్చు. అయితే, కరోనా రోగులు మాత్రం వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు ఉపవాసం ఉంటే మంచి ది’అని రాష్ట్ర వైద్యారోగ్య శా ఖ సలహా ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ శుభాకాంక్షలే భౌతికదూరం పాటిస్తూ ప్రా ర్థనలు చేసుకోవచ్చు. రోగు ల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు వారికి ఓ దార్పు సందేశాలను పంపు తూ వారికి మానసిక ధైర్యా న్ని ఇవ్వండి. పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారాలను వినియోగించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం రంజాన్ మాసంలో పోషకాహారం చాలా ముఖ్యం. తాజా కూరగాయాలు, పండ్లతో పాటు బలవర్థకమైన ఆహారాన్ని తినాలి. పుష్కలంగా నీళ్లు తాగాలి. శారీరక శ్రమ: కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ప్రజలు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. ఆన్లైన్ ద్వారా శారీరక వ్యాయామ పద్ధతులను తెలుసుకుని పాటించడం ద్వారా శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలి. ఇఫ్తార్ విందులకు నో.. ► రంజాన్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే జకాత్ (వితరణ) సమయంలో భౌతిక దూరాన్ని పాటించండి. ► రద్దీతో ముడిపడిన ఇఫ్తార్ విందులను నివారించి, ముందుగా ప్యాక్ చేసిన ఆహారాన్ని, బహుమతులను పంపిణీ చేయండి. ► పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, వాటర్ పైప్స్ వంటి సాధనాల ద్వారా పొగ పీల్చడం వల్ల కరోనా వ్యాధి ప్రమాద స్థాయిని పెంచే అవకాశముంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవి అనుమతించబడవు. -
పాక్‌లో సామూహిక ప్రార్థనలకు అనుమతి
ఇస్లామాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ నేపథ్యంలో మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం విదితమే. ముఖ్యంగా రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు రద్దు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఇతర వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఇదే బాటలో నడిచిన పాకిస్తాన్ తాజాగా యూటర్న్ తీసుకుంది. రంజాన్ మాసం మొదలుకానున్న తరుణంలో షరతులతో మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మత గురువులతో ఆన్లైన్లో చర్చలు జరిపిన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే మతపెద్దలు ఇందుకు ససేమిరా అనడంతో ప్రభుత్వం వారి ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. (భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం) ఈ నేపథ్యంలో 20 అంశాల ప్రణాళిక ప్రతిపాదించి.. అధ్యక్షుడు మత గురువులను ఒప్పించారు. మసీదుల్లో తారావీ ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతించామన్న ఆయన... ప్రార్థనా సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో మసీదుల్లో పాటించాల్సిన నిబంధనల గురించి మార్గదర్శకాలు జారీచేశారు.(అమెరికా కంటే అధ్వాన్నంగా: బిలావల్ భుట్టో) 1. కార్పెట్లు, చాపలు పరచి ప్రార్థనలు చేయరాదు. మసీదు ఫ్లోర్‌ను ప్రతిరోజు విధిగా శుభ్రం చేసుకోవాలి. 2. ఇంటి నుంచే చాపలు తెచ్చుకుంటే అభ్యంతరం లేదు. 3. ప్రార్థనల అనంతరం ఎవరూ గుమిగూడకూడదు. 4. గార్డెన్ ప్రాంతం కలిగి ఉన్న మసీదుల్లో ఆరుబయటే ప్రార్థనలు చేస్తే మంచిది. 5. 50 ఏళ్లకు పైబడిన వారు, పిల్లలను మసీదులోకి అనుమతించరు. 6. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణుల సూచనల ప్రకారం కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. 7. రోడ్లు, ఫుట్‌పాత్‌లు సహా ఇతర ప్రాంతాల్లో(బహిరంగ ప్రదేశాల్లో)తారావీ ప్రార్థనలు చేయరాదు 8. ఇంట్లో ప్రార్థనలు చేయడం శ్రేయస్కరం. 9. క్లోరినేటెడ్ వాటర్‌తో మసీదు పరిసరాలు శుభ్రపరచాలి 10. ప్రార్థనా సమయంలో ఒక్కో వ్యక్తి మరో వ్యక్తి నుంచి కనీసం ఆరు ఫీట్ల దూరంలో ఉండాలి 11. షేక్హ్యాండ్లు, ఆలింగనాలను పూర్తిగా మానేయాలి 12. ఇఫ్తార్, షేరీ విందులు నిర్వహించకూడదు తదితర 20 అంశాల ప్రణాళిక గురించి వారికి వివరించారు. -
ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి : సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో వీడియో కాన్ఫరెస్స్ నిర్వహించారు. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని అన్నారు. కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కరోనా కారణంగా ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండగలను ఇళ్లలోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు రంజాన్ సమయంలో కూడా ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించి ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలని చెప్పారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా చెప్పక తప్పని పరిస్థితి అని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘కర్నూలు జిల్లాలో కరోనా నివారణ చర్యలు బాగున్నాయి. అందరు కరోనా నివారణకు సహకరిస్తున్నారు. మీరు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. కానీ కొన్ని చానళ్లు, పత్రికలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. నకిలీ వీడియోలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు కలిగిస్తున్నాయి. కర్నూలు ఎమ్మెల్యేపై కూడా లేని పోని ప్రచారాలు చేస్తున్నారు. వీటిపై మీరు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ముస్లిం మత పెద్దలు కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. అటువంటి ప్రచారం చేసేవారిపై నివేదిక పంపాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. -
ఇంట్లోనే రంజాన్ తారావీహ్ ప్రార్థనలు
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పవిత్ర పుణ్య మాసమైన రంజాన్ తారావీహ్ నమాజ్‌లను ఇళ్లలోనే పూర్తి చేసుకోవాలని ఉలేమాలు, ముఫ్తీలు, ఇస్లామిక్ స్కాలర్లు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జామియా–నిజామియా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా సహర్‌తో పాటు ఇఫ్తార్‌లను కూడా ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. డబ్బులు వృథా చేయకుండా పేదలకు చేయూత అందించాలని, లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది. (చదవండి: ఇంకా చాలానే ఉంది..!) ఇక రంజాన్ నెలలో తారావీహ్‌ను ఇంట్లోనే చేసుకోవాలని ఉలేమాన్, ముఫ్తిలు కోరడాన్ని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించినందున ఇదో మంచి విజ్ఞప్తిగా పేర్కొన్నారు. అన్ని ముస్లిమ్ పాఠశాలలకూ మార్గదర్శకాలు జారీ చేశారని, వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కచ్చితంగా పాటించాలన్నారు. In a statement from Jamia Nizamia, Hyderabad Muftis & Ulemas of all Schools of Thought have appealed that taraweeh be offered at home during the coming month of #Ramzan. Of course, these guidelines do not just apply to Telangana & AP, they are to be strictly followed across India pic.twitter.com/j5MGuhqX3b — Asaduddin Owaisi (@asadowaisi) April 16, 2020 -
సత్యనిష్ఠ, సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్ : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రంజాన్ పర్వదినం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’ అని తెలిపారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ శుభాభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు To all my Muslim brethren, #EidMubarak! On this happy occasion, I wish you and your family, good health, happiness and prosperity. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2019 -
మతసామరస్యంలో మన రాష్ట్రం ఆదర్శం
సాక్షి, హైదరాబాద్ :దేశంలోనే తెలంగాణ ‘గంగా, జమునా తెహజీబ్’ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని చూసి మతసామరస్యం గురించి నేర్చుకోవాలని మహాత్మాగాంధీ పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రంజాన్ మాస పవిత్ర ఉపవాసాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆదివారం సాయంత్రం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సీఎం పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాలు, కులాలు సమానమేనని, గత ఐదేళ్ల నుంచి మత సామరస్యం మరింత వెల్లివిరుస్తోందని అన్నారు. అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ వారి పండుగలను సైతం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో సైతం గంగా జమునా తెహజీబ్ మరింత ఆదర్శంగా కొనసాగే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని మైనార్టీల పిల్లలకు గురుకుల విద్యాలయాల (టెమ్రీస్) ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని, వారు అంతర్జాతీయస్థాయిలో పోటీపడటం సంతోషదాయకమన్నారు. మైనారిటీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ముస్లింలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని, వారి అభ్యున్నతికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యను జయించాం... రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో విద్యుత్ కష్టాలు తీవ్రంగా ఉండేవని, ఈ ఐదేళ్లలో విద్యుత్ సమస్య లేకుండా విజయం సాధించగలిగామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది ఉండకూడదనేది తమ ఉద్దేశమని, మిషన్ భగీరథ పథకం ద్వారా 23 వేల గ్రామాల్లో నల్లా ద్వారా తాగునీరు ఇవ్వబోతున్నామని కేసీఆర్ వెల్లడించారు. కేవలం రెండు, మూడు శాతం పనులు మాత్రమే పూర్తి కావల్సి ఉందని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు.. జూలైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. రైతు కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు సాగునీటి ప్రాజెక్టు పనులు అంకితభావంతో చేపట్టామని చెప్పారు. ఇఫ్తార్ విందులో మంత్రులు మహమూద్ అలీ, తల సాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, బీబీ పాటిల్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ గురుకుల టెన్త్టాపర్కు, అనీసుల్ గుర్భా విద్యార్ధులకు సీఎం బహుమతులు అందజేశారు. -
అన్ని మతాల పేదలకు చేయూత: కేటీఆర్
సిరిసిల్ల: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండలంలో బుధవారం సాయంత్రం ముస్లింలకు రంజాన్ కానుకలను కేటీఆర్ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 700 గురుకులాలలో లక్షలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షకు పైగా వెచ్చిస్తోందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని, పేదరికం శాశ్వతంగా తొలగిపోతుందని చెప్పారు. గురుకులాల్లో ముస్లిం పిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సర్వమతాల నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం యువతుల వివాహానికి షాదీముబారక్ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరిసేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. మీ అందరి దీవెనలతో రెండోసారి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తామని కేటీఆర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, ఎస్పీ రాహుల్‌హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొన్నారు. అంతకు ముందు కేటీఆర్ గంభీరావుపేటలో జరిగిన రేణుకాఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొన్నారు. కేటీఆర్‌ను కలిసిన సమీర్ తల్లి సౌదీ అరేబియాలో బందీ అయిన మహ్మద్ సమీర్ (21) తల్లి రఫియా కేటీఆర్‌ను కలసి తన కొడుకును స్వదేశానికి తెప్పించాలని వేడుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సమీర్ ఏప్రిల్ 15 గల్ఫ్ ఏజెంట్ వాహిద్ మాటలు నమ్మి సౌదీ అరేబియా వెళ్లాడు. ఫామ్ హౌస్‌లో పని అని చెప్పి గొర్రెలు కాపిస్తున్నారని పేర్కొంటూ సమీర్ ఏడుస్తూ.. ఇటీవల వాట్సప్ ద్వారా కేటీఆర్ పంపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ సౌదీలోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం అందించారు. పక్షం రోజులుగా సమీర్ ఇల్లు చేరకపోవడంతో అతని తల్లి రఫి యా కేటీఆర్‌ను కలిసి కొడుకును ఇంటికి పం పించే ఏర్పాటు చేయాలని వేడుకోవాలని కోర గా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
ఉపాధి భలే బాగుంది
సాక్షి,సిటీబ్యూరో: రంజాన్ మాసం అంటే నగర ప్రజలకు నోరూరించేది హలీం మాత్రమే. ప్రస్తుతం సిటీలో ఐదు వేలకు పైగా హలీం దుకాణాలు వెలిశాయి. వీటి నిర్వాహకులు హోటల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సర్వీస్‌ను అందిస్తున్నారు. హలీం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు ఉన్న చోటుకే హలీం అందిస్తున్నారు. తమ దుకాణాల వద్ద ప్రత్యేకంగా పదుల సంఖ్యలో వెయిటర్లను పెట్టి సర్వీస్ చేస్తున్నారు. దాంతో ఈ సీజన్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువకులకు మంచి ఉపాధి దొరికినట్టయింది. హలీం సెంటర్ల వద్ద సాయంత్ర నుంచి రద్దీ పెరుగుతుంది. దాంతో కౌంటర్ వద్దకు వెళ్లి హలీం తీసుకోవడం సాధ్యం కాదు. హలీం ప్రియులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఉన్నచోటుకే ఈ వెయిటర్లు డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం తాము ఇరవై మందికి పైగా సిబ్బందిని అదనంగా నియమించుకున్నామని కాలికబర్ బస్టాండ్ పక్కనున్న ‘యా అలీ హోటల్’ నిర్వహకుడు మహ్మద్ యూనుస్ తెలిపారంటే ఈ మాసంలో హోటళ్లు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. -
అత్తర్ గుబాళింపు..
అత్తర్.. ఈ పేరు వినగానే పరిమళాలగుబాళింపు నాసికా పుటాలను తాకుతుంది. మనసు ఆనంద తీరాలకు చేరుతుంది. అపూర్వ పారవశ్యానికి గురిచేస్తుంది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లింలు అత్తర్‌ను విరివిగా వినియోగిస్తారు. నెల రోజులపాటు నిత్యం ఒక్కో రకం అత్తర్‌ను వాడుతూ తమ ప్రత్యేకతను చాటుతారు. ఖరీదు ఎంతయినా అత్తర్ వినియోగాన్ని మాత్రం వీడరు. మహ్మద్ ప్రవక్త కూడా అత్తర్‌ను ఎక్కువగా వాడేవారని, తన సహచరులను దీనిని వాడాలని సూచించేవారని ఇస్లాం మత గురువులు చెబుతుంటారు. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించే ముస్లింలు ఎన్ని డబ్బులు వెచ్చించి అయినా దీనిని కొనుగోలు చేస్తుంటారు. ముస్లింలు రంజాన్ నెలలో అత్తర్ వేసుకోకుండా బయటికి రారంటే అతిశయోక్తి కాదు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్ వాడటం ఆనవాయితీగా మారింది. ఇదీ ప్రత్యేకత.. అత్తర్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాని సువాసన బాగా పెరుగుతుంది. ఎంత పాత అత్తర్ అయితే దాని ధర కూడా అంత ఎక్కువ పలుకుతుంది. నకిలీ అత్తర్ అయితే దాని వాసన తగ్గుతుంది. అత్తర్‌ను చర్మంతో తయారైన బుడ్డీలు, గాజు బుడ్డీల్లో భద్రపరుస్తారు. అవగాహన అవసరం.. అన్ని రకాల అత్తర్‌ను అన్ని సమయాల్లో వాడితే ఆరోగ్యానికి హానికరం. అవగాహన లేకుండా, సమయం కాని సమయంలో వాడితే దీని వాసనతో అనర్థాలు కలిగే ప్రమాదముంది. వేసవి కాలంలో అత్తర్లో ఖసస్, ఇత్రేగుల్, గులాబ్, జామిన్ వల్ల చల్లదనం కలుగుతుంది. చలికాలం, వర్షాకాలంలో శరీరానికి వేడి కలిగించే షమామా, అంబర్, హీరా, జాఫ్రాన్, ఊదుల్ దహర్ వాడాలని పత్తర్‌గట్టీలోని సయ్యిదీ అండ్ సన్స్ అత్తర్ దుకాణా యజమాని సయ్యద్ జహీరుద్దీన్ ఖాద్రీ జఫర్ సూచించారు. విదేశీ రకాలకు డిమాండ్ సౌదీ అరేబియాలో తయారయ్యే అత్తర్‌కు నగర ప్రజలు ఎక్కువగా పసంద్ చేస్తారు. ఇందులో ప్రత్యేకంగా ఉద్ షమ్సు, ఉద్ మక్కితో పాటు ఇటీవల ఫ్రాన్స్‌లో తయారవుతున్న అత్తర్‌కు నగరానికి దిగుమతులు పెరిగాయి. 8 ఎంఎల్ అత్తర్ బాటిళ్లను నగరవాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తయారీ విధానం.. గులాబీ రేకులు, మల్లె, మొగలి పూలతో పాటు గంధం రకరకాల సువాస ఇచ్చే చెట్ల చెక్కలు ఎండిన తర్వాత డేకిసాలలో వేస్తారు. దాన్ని భూమిలో పాతి మరగబెడతారు. డేకిసాపై చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చేలా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అత్తర్గా తయారు అవుతుంది. ఇవీ రకాలు మజ్ముమా, జన్నతుల్ ఫిర్దోష్, షమామా, నాయాబ్, ఫిజా, జమ్జమ్, బఫుర్, ఉదర్, షాజహన్, తమన్నా, బకూర్తో పాటు దాదాపు 250 రకాల అత్తర్లు అందుబాటులో ఉన్నాయి. అసలైన అత్తర్ ఒక్కసారి వాడితే దుస్తులు ఉతికినా దాని వాసన పోదు. అదే సాధారణ అత్తర్ అయితే సువాసన ఒక్కసారే ఉంటుంది. ధరలు ఇలా.. చౌకగా లభ్యమయ్యే అత్తర్ ఒక మిల్లీ లీటర్ రూ.50 పలుకుతోంది. అరబ్బు దేశాల్లో ఎక్కువగా ఇష్టపడే దహనల్æ ఊద్ అత్తర్ 10 మి.లీ రూ.3వేల నుంచి రూ.10 వేల ధర ఉంది. ఇతర అత్తర్ల ధరలు 10 మి.లీ ధర రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పలుకుతున్నాయి. -
సందడిలో చిరుతిళ్లు
శాలిబండ: సాధారణ రోజుల్లో కంటే రంజాన్ నెలలో చార్మినార్ పరిసరాలు ప్రత్యేంగా ఉంటాయి. వివిధ రకాల వ్యాపారాలతో సందడిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలరోజులు చిరు వ్యాపారులకు భలే గిరాకీ ఉంటుంది. ఉపవాస దీక్షలు ముగిశాక ఇఫ్తార్ విందు చేస్తారు. ఇక పిల్లలైతే చార్మినార్, మక్కా మసీద్ చుట్టుపక్కల దొరికే చిరు తిళ్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తక్కువ ఖరీదుతో అందుబాటులో ఉండడంతో ఇలాంటి వాటికే సాధారణ ప్రజలు, పిల్లలు మొగ్గుచూపుతున్నారు. ఉపవాస దీక్షల విరమణ అనంతరం మిర్చీ బజ్జీలు, ఆలు బొండా, ఆలు బజ్జీలు, పుణుగులు, కచోరీ, సమోసా, వడలను ఇష్టంగా తింటుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉన్న వారందరూ వీటి కోసం ఎగబడతారు. దీంతో పాతబస్తీలో మిర్చీ బండీలతో పాటు పిండి వంటల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. వేసవి ప్రత్యేకం ‘దహీవడ’ ఈసారి రంజాన్ మాసం వేసవిలో మొదలవడంతో చల్లదనానిచ్చే ‘దహీవడ’న అధికమంది ఇష్టపడుతున్నారు. పైగా ఈ వంటకం ధర కూడా తక్కువగా ఉండడంతో చాలామంది ఇష్టంగా లాగించేస్తున్నారు. సూర్యోదయానికి ముందు సహర్‌తో ఉపవాస దీక్షలను ప్రారంభించిన అనంతరం రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేసే ముస్లింలు మగ్రీబ్ నమాజు అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఇఫ్తార్‌లో పిండి వంటలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ ధరలకు లభించే ఈ పిండివంటల పట్ల పేద ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారని, వారి నుంచే తమకు గిరాకీ ఉంటుందని మూసాబౌలికి చెందిన వ్యాపారి తిరుపతి శ్రీనివాసరావు, నర్సింగరావు తెలిపారు. -
క్యా క్యాప్ హై!
సాక్షి సిటీబ్యూరో: ముస్లింలకు రంజాన్ నెల పవిత్రమైంది. వారు ఈ నెల రోజులూ ఉపవాసం ఉంటూ ప్రత్యేక ప్రార్థలను చేస్తారు. నిష్టతో ఐదుపూటలా నమాజ్ చేస్తారు. నమాజ్ సమయంలోనే కాకుండా రోజంతా ప్రతి ఒక్కరూ టోపీలు ధరిస్తారు. పైగా ప్రతి ముస్లిం మహ్మద్ ప్రవక్త సంప్రదాయంగా టోపీని ధరించడం ఆనవాయితీ. ఈ టోపీ ధరిస్తే చెడు కార్యాలకు దూరంగా ఉంటారని ఓ నమ్మకం. ఇక ఈ నెలలో శుక్రవారానికి.. అందులోనూ మొదటి శుక్రవానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరోజు ముసల్మానులు ఎవరికి వారు ప్రత్యేకంగా కనబడేందుకు ఆసక్తి చపుతుంటారు. అందుకోసం ఎవరికి వారు లేటెస్ట్ డిజైన్ల టోపీలనే ఎంచుకుంటారు. ఈ సందర్భంగా గురువారం చార్మినార్, మదీనా సర్కిళ్లల్లోని క్యాప్ మార్ట్లు, మొహదీపట్నం,టోలిచౌకీ ప్రాంతాల్లోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వివిధ దేశాల డిజైన్లు దిగుమతి రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని క్యాప్ మార్ట్లు ముస్లింలు ధరించే టోపీలను విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా ఇస్లామిక్ సంప్రదాయం పాటించే ఇండోనేషియా, బంగ్లాదేశ్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఒమాన్, సౌదీ, మలేసియాతో పాటు చైనా నుంచి కూడా టోపీలు నగరానికి దిగుమతయ్యాయి. వీటిలో ఖురేషియా, ఒమానీ, సౌదీ రేషం, ఆజ్మేరీ, తహెరుల్ ఖాద్రీయా, షేర్‌గోలా, పాకిస్తానీ కమాన్, ఆఫ్ఘనీ గోల్, చైనా జాలీ, ఇండోనేసియా కమాల్ వంటి వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక వేడుకల్లో వాడే జిన్నా క్యాప్, సాలార్జంగ్ క్యాప్, రోమీ టోపీలు అదనం. రోజు వారి వాడే టోపీల ధరలు రూ.50 నుంచి రూ.150 వరకు ధర ఉంది. రంజాన్ నెలలో వాడే టోపీల ధరలు రూ 200 నుంచి రూ.500 మధ్య ఉన్నాయి. ఇక వేడుక టోపీల ధరలు రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నాయి. -
నమాజ్.. స్వర్గానికి తాళం చెవి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నమాజ్ అనేది స్వర్గానికి తాళం చెవి లాంటిది. ఇది లేకపోతే స్వర్గ ప్రవేశమే ఉండదు. ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, దైవచింతనలు చేసినా నమాజ్ లేకుండా అల్లా అనుగ్రహం పొందలేరని మౌల్వీలు చెబుతున్నారు. అసలు నమాజ్ లేనిదే రంజాన్ ఉపవాసాలకు పరిపూర్ణత ఉండదు. అందువల్ల నమాజ్ అనేది ఇస్లాం ధర్మానికి మూలాధారం. దీనిని మహమ్మద్ ప్రవక్త తన కంటిచలువగా పేర్కొన్నారు. ప్రతి ముస్లిం కచ్చితంగా రోజుకు ఐదుపూటలా నమాజు చేయాలని నిబంధన. నమాజ్‌ను అరబ్బీ భాషలో సలాహ్, పర్షియన్లు సలాత్ అని అంటారు. నమాజుకు ముందు వజూ (శారీరక శుద్ధత) అనేది తప్పనిసరి. వజూ ద్వారా కాళ్లు, చేతులు, ముఖం, మెడ భాగాలు శుభ్రమవుతాయి. దీనివల్ల శారీరక శుద్ధి లభిస్తుంది. ఆ తర్వాత ఏకాగ్రతతో నమాజు ఆచరించడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది. నమాజు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ముస్లిం కచ్చితంగా నమాజు చేసే విధానం తెలుసుకుని ఉండాలి. అంతేకాకుండా నిత్యజీవితంలో ప్రతి రోజూ ఐదు పూటలా నమాజు ఆచరించాలి. ఎలాంటి పరిస్థితుల్లో కుర్చీలో ఆశీనులై నమాజ్ చేయవచ్చు? సర్వసాధారణమైన నమాజు విధానం ప్రతిఒక్కరికి తెలుసు. అయితే ఆర్థోరైటిస్తో మోకాలు వంగని వ్యక్తులు, వృద్ధులు కూడా నమాజు చేయాల్సి ఉంటుంది. వారు కుర్చీలో కూర్చుని నమాజ్ చేసుకోవచ్చు. అయితే వారు పాటించాల్సిన నమాజు కొంత వేరుగా ఉంటుంది. ఇలాంటి వారికి సదుపాయంగా ఉండేందుకు వీలుగా మసీదుల్లో కుర్చీలు ఏర్పాటు చేశారు. సమయపాలన పాటించాలి.. నమాజుకు సమయపాలన పాటించడం చాలా ముఖ్యం. అందువల్ల అన్ని మసీదుల్లోనూ నమాజు వేళల బోర్డులు ఏర్పాటు చేశారు. అందరూ ఆ సమయానికి చేరుకుని సామూహిక నమాజులో (ఫరజ్ నమాజ్‌లో) పాల్గొనాల్సి ఉంటుంది. నమాజ్ వేళ అయ్యిందని గుర్తుచేయడానికి మసీదుల నుంచి ఐదు పూటలా అజాన్ అనే పిలుపు వినిపిస్తూఉంటుంది. ఉదయం నమాజును ఫజర్ అని, మధ్యాహ్నం నమాజును జొహర్, సూర్యాస్తమయం కంటే గంట లేక గంటన్నర ముందు చేసే నమాజ్‌ను అసర్ అని, సూర్యాస్తమయం తర్వాత చేసే నమాజును మగ్రిబ్, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చేసేది ఇషా నమాజ్. ఇంకా ఆసక్తి కలిగిన వారు ఇష్రాక్, తహజ్జుద్ నమాజులు కూడా చేస్తారు. ఒక్క జొహర్ తప్ప మిగతా నమాజుల వేళలు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలను బట్టి మారుతుంటాయి. నమాజులో ఇవి చేయాలి.. ♦ ఖిబ్లా (మక్కాలోని కాబా మసీదు) వైపు తిరగాలి. శరీర భాగాలు పూర్తిగా కప్పుకోవాలి. ♦ దుస్తులు, శరీరం, సజ్దాచేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. ♦ ప్రార్థనకు ముందు ఆచార శుద్ధత, వజూ, తైమామ్, గుసూల్ వీటిలో ఏదో ఒకటి పాటించాలి. ఇవి చేయకూడదు.. ♦ నమాజు చేసే వారి ముందు ఎవరూ వెళ్లకుండా చూడాలి. ♦ రక్త గాయమై రక్తం ప్రవహిస్తూ ఉంటే నమాజు చేయరాదు. ♦ మహిళలు రుతుక్రమ సమయంలో నమాజు చేయరాదు. నమాజ్‌లోని దశలు.. ♦ తక్బీర్ తహిరియా ∙ ఖియామ్ ∙ రుకూ ♦ సజ్దా ∙ ఖాయిదా ∙ సలామ్ ఫేర్నా ∙దువా నమాజ్ ప్రతి ముస్లింకు తప్పనిసరి ఇస్లాం ధర్మంలో నమాజ్‌కు మినహాయింపు ఉండదు. ప్రతి ముస్లింకు ఇది తప్పనిసరి. ఐదు పూటలా నమాజ్ చేస్తూ మహమ్మద్ ప్రవక్త సూచించిన శైలిలో జీవనం గడపాలి. సమయ పాలన కూడా చాలా ముఖ్యం. ఎప్పుడూ ఆలస్యంగా నమాజు చేసే వారు కూడా అల్లాకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. – ముఫ్తి అబ్దుర్రహ్మాన్ అల్లా చల్లగా చూస్తున్నాడు నేను ఐదు పూటలా నమాజ్ చేస్తుంటాను. నమాజ్‌కు వెళ్లొస్తే మానసిక అలజడులు దూరం అవుతాయి. నమాజ్ అనంతరం దువా చేస్తూ బాధలన్నింటినీ అల్లా ముందు పెట్టేస్తాను. అల్లా నన్ను చల్లగా చూస్తున్నాడు. – సాహెబ్జాని -
రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు నిర్వహణ కోసం ప్రతి మసీదుకు రూ.లక్ష మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రంజాన్ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదు ప్రాంతాల్లో శానిటేషన్, రోడ్లకు మరమ్మతులు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదుల వద్ద తాగునీటి వసతికి మెట్రో వాటర్ బోర్డు సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రాత్రి బజారు నిర్వహించే ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చార్మినార్ వద్ద గల జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మక్కా మసీదు, రాయల్ మాస్కులో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీమ్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హలీం ఆగయా
సాక్షి సిటీబ్యూరో: రంజాన్‌కు ముందే నగరంలో హలీం విక్రయాలు ప్రారంభమయ్యాయి. పండుగకు ఇంకా 15రోజులు ఉండగా... అప్పుడే హోటళ్లలో ఘుమఘుమలాడించే హలీం రెడీ అవుతోంది. రారామ్మని.. హలీం ప్రియులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో హలీం విక్రయాలు జోరందుకున్నాయి. గత రెండేళ్లుగా రంజాన్ వేసవిలో వస్తోంది. హలీం తయారీలో గోధుమలు, మటన్, మసాల దినుసులు వాడతారు. అయితే వేసవి దృష్ట్యా మసాల దినుసులు తక్కువగా వాడుతున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. షబ్బే బరాత్ నుంచే సిటీలో హలీం అందుబాటులోకి వచ్చింది. రంజాన్ పూర్తయ్యే వరకు హలీం నోరూరించనుంది. కపుల్ ప్యాక్, ఫ్రెండ్స్ ప్యాక్, పార్టీ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్, స్పెషల్ హలీం ప్యాక్, చికెన్ 65 హలీం ప్యాక్‌లను అందుబాటు ధరల్లో అందజేస్తున్నామని ట్రిపుల్ ఫైవ్ హోటల్ నిర్వాహకులు అలీ రజా తెలిపారు. ‘ఇరానీలు నగరానికి హలీం పరిచయం చేశారు. వారిలో మా తాతగారు హజీ అబ్బాస్ హష్మి పాత్ర కీలకం. పాతబస్తీలోని మదీనా హోటల్లో మొదట హలీం తయారు చేసి రంజాన్‌లో విక్రయించారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రతి రంజాన్‌లో హలీం తయారు చేస్తున్నాం. ఈసారి రంజాన్ వేసవిలో వస్తున్న దృష్ట్యా శరీరానికి చల్లదనాన్నిచ్చే గులాబీ రేకులతో పాట జైఫాల్, జోవోత్రి మసాలాలు వాడుతున్నామ’ని అలీ రజా చెప్పారు. -
రంజాన్ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటి?
-
రంజాన్ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటి?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలను రంజాన్ మాసంలో జరపడం ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని వస్తున్న వ్యాఖ్యానాలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రంజాన్ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటూనే తమ పనులు చేసుకుంటారని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. రంజాన్ మాసంలో ఎన్నికలు జరగడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఏ విధమైన కారణాలు ఉన్నప్పటికీ.. ముస్లింలను, రంజాన్‌ను వాటి కోసం వాడుకోరాదని విజ్ఞప్తి చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌పై స్పందించిన తృణమాల్ కాంగ్రెస్ నాయకుడు, కోల్కత్తా మేయర్ ఫరీద్ హకీమ్.. ఏడు దశల్లో ఎన్నికలు జరపడం వల్ల సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. రంజాన్ పర్వదినం రోజునే బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలోని కొన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్కడి ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం రాజ్యంగ బద్ధమైన సంస్థ అని.. మేము వారికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని తెలిపారు. -
అల్లా ఆశీర్వదించిన పావురాలు
తెల్లవారుజాము నుండే చేతినిండా ఉన్న పనులతో సతమతమవుతూ, వంటిల్లు అనబడే రణరంగంలో కత్తి పీట, చాకు, అప్పడాల కర్ర, పెనం, అట్లకాడ మొదలైన ఆయుధాలతో పోరాడే సరయూ గుండెలయ, పావు తక్కువ ఎనిమిదింటికి తను ఇంటి దగ్గర ఎక్కే సిటీ బస్సులో కూర్చున్న తరువాతే నియంత్రణలోకి వచ్చేది. ఆ వంటింటి నుండి తనకు విడుదల లేదేమో అనే ఆలోచన మనస్సులో మెదలి కోపం, అసహాయతతో ఉడికిపోతూ, చెమటలు కారుస్తూ బస్సెక్కే ఆమెకు కిటికీ పక్కన సీటు దొరికితే కొద్దిగా నెమ్మదిగా అనిపిస్తుంది. నింపాదిగా ఆమె చుట్టూ ఆవరించే చల్లని గాలికి ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంటుంది. తరువాత కళ్లు తెరచి బయటి దృశ్యాల చిత్రాలను మనస్సులోకి దింపుకున్నప్పుడల్లా లోపలి ఒత్తిడి తగ్గి, మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. అప్పుడే హఠాత్తుగా ఎదురయ్యే మలుపు దగ్గర ఉన్న ఏకాకి వేపచెట్టును దాటి బస్సు తిరుగుతుంది. రైల్వే అండర్ బ్రిడ్జి దాటి దిగువలో ఉన్న బారాకొట్రి అనే రహస్యలోకానికి చేరుకుంటుంది. శాహిదా ఇంటిపనికి వచ్చేదాకా బారాకొట్రి అనే ఒక లోకం ఉన్న సంగతే తెలియదు సరయూకి. ఉదయం తొమ్మిదిగంటలకు సరిగ్గా అల్లాహో అక్బర్ అని వినిపించే సమయానికి కాకతాళీయమేమో అనిపించేటట్టు బస్సు బారాకొట్రిని చుట్టుకుని వెళ్తుంది. చాలావరకు ముస్లిములు నివసించే ఈ ప్రదేశానికి బారాకొట్రి అనే పేరు ఎందుకు వచ్చిందో అని అప్పుడప్పుడూ సరయూ అనుకుంటుంది. రోడ్డుకు దగ్గరగా ఉన్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు, స్పీకర్లు కట్టుకుని నుంచున్న మసీదు, ఉర్దూ ప్రైమరీ స్కూలు, కొన్ని గ్యారేజులు, వర్క్‌షాప్‌లు ఉన్న ఆ ప్రదేశం పాత ప్లాస్టిక్, ఇనుప సామానుల త్యాజ్యాలను పరచుకుని చెల్లాచెదురుగా ఉంటుంది. పొడుగు జుబ్బా, పొట్టి లుంగీ ధరించి తెల్లగడ్డాలలో మునిగిన ముసలివారు, నడుము నుండి జారిపోతుందా అనేట్టున్న జీన్స్‌ప్యాంట్ పైన సల్మాన్, షారూఖ్‌ల చిత్రాలున్న టీషర్ట్లు ధరించి ఛాతీ విరుచుకుని నుంచున్న నవయువకులు చాలా వరకు కనిపిస్తారు. ఎప్పుడైనా ఒకసారి బురఖాలు ధరించిన ఆడవాళ్లతో పాటు అన్ని వయసుల పిల్లలూ బిలబిలమని బస్సులోకి జొరబడతారు. రోడ్డుకు తెరచుకున్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళ వైపు సరయూ ఎప్పుడూ కుతూహలంగా చూస్తూ ఉంటుంది. ఇళ్ళ ముందు మెట్లు కాకుండా పెద్ద నాపరాయి ఏటవాలుగా కనిపిస్తుంది. ఆ రాయిని ఆనుకునే మురికి కాలువ ప్రవహిస్తుంది. కొన్నిసార్లు సర్రుమని తెరలు తొలగించి మెరుపు తీగల వలె దేవకన్యలు బయటకు తొంగిచూస్తారు. ఎప్పుడైనా ఒకసారి ఇంటిముందు పరచిన నాపరాళ్ళ మీద బట్టలు ఉతుకుతూనో, సొట్టలు పడిన అల్యూమినియం పాత్రలు తోముతూనో, చిన్న పిల్లల తలలోని పేలు తీస్తూనో కనిపించే వీరు పాతాళం నుండి పైకొచ్చిన అప్సరసల మాదిరి కళ్ళు మిరుమిట్లుగొలుపుతారు. లేత అందాలతో పాటు చెప్పలేని అంతరంగ ప్రకాశమేదో కనిపిస్తున్నట్లుంటుంది వాళ్ళలో. అకస్మాత్తుగా వారేమైనా బస్సు వైపు చూస్తే, వారినే గమనిస్తున్న సరయూ గాభరా పడుతుంది. అలా వాళ్ళ కళ్ళు కలిసినప్పటి క్షణాలలో కలిగిన భావనలను అర్థం చేసుకోలేక చూపు తిప్పేస్తుంది. ఎప్పటికైనా తను వీళ్ళతోటి తనలో కలిగే ఈ భావనలను పంచుకోవచ్చా? అలాంటి అదను ఎప్పటికైనా వస్తుందా? అనిపించి తనపైన తనకే ఆశ్చర్యం కలుగుతుంది. ముందంతా ధారవాడ నగరానికి బయట, ఎవరూ పట్టించుకోకుండా తానేమో తనదేమో అన్నట్లున్న బారాకొట్రి అనే ఈ మురికి కాలనీ నగరానికి మధ్యకు రాగానే కళ్ళకు కొట్టొచ్చినట్లు మారింది. దానిని ఆనుకునే ఉన్న గౌళిగల్లి ఇప్పుడు బసవగిరిగా గణ్య వ్యక్తులు నివసించే ప్రదేశంగా మారి అక్కడి సైట్ల విలువ ఆకాశానికి చేరుకోవడం ప్రారంభమైనాక ఇప్పుడు ఇంకా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రమక్రమంగా బారాకొట్రి రోడ్లలో మేయడానికి వెళ్తూ కనిపించే పశువులు మాయమై, వేగంగా రయ్‌మని దూసుకెళ్ళే పెద్ద పెద్ద కార్లు కనిపించసాగాయి. అలాగే కొంచెం ముందుకెళితే నిర్మలానగర్ ఉంది. తెల్లటి తెలుపురంగులతో ఆకాశంలోకి చొచ్చుకుపోయే చర్చిలు, కాన్వెంట్లు, శుభ్రంగా కనిపించే పార్కులు, ఆట మైదానాలు కనిపిస్తాయి. అలాగే ముందుకువెళితే విశ్వవిద్యాలయం మహాద్వారం ఎదురవుతుంది. విధానసభను తలపించే యూనివర్సిటీ భవనం కనిపించి బారాకొట్రి గుర్తులను చెరిపేస్తుంది. మెయిన్ బిల్డింగ్ దాటి ముందుకు వెళ్తే డిపార్ట్మెంట్ల నుండి లోపలికీ బయటికీ ఫైలులను ఛాతీకి హుత్తుకుని ఎగురుతున్నట్లు నడిచే విద్యార్థీ విద్యార్థినులు అక్కడి గాలికి సుగంధాన్నలుముతారు. వైవిధ్యాలను జీర్ణించుకున్న విశ్వవిద్యాలయమనే ప్రపంచంలోకి బారాకొట్రికి చెందిన పొగచూరిన పరదాల చాటునుండి వచ్చిన శాహిదా అడుగు పెట్టిందే ఒక ఆశ్చర్యం! లారీ డ్రైవరైన మొగుడు యాసీన్ ఒక ప్రమాదంలో ఒక చేయి పోగొట్టుకున్నాక, తనపైనే ఆధారపడిన ఇద్దరు పిల్లల సంసారాన్ని పోషించడానికి తన రెక్కలు ముక్కలు చేసుకోక తప్పింది కాదు ఆమెకు. యూనివర్సిటీలో తోటపని చేసుకుంటున్న అబ్దుల్లా ద్వారా శాహిదా అక్కడి నేల ఊడ్చడం, తుడవడం చేసే గ్యాంగ్‌లో చేరుకుంది. మొదటిసారి అంత పెద్ద బిల్డింగ్‌లోకి అడుగుపెట్టినప్పుడు శాహిదా కాళ్లు వణికాయి. కుంకుమ, విభూతి ధరించి ఇంతెత్తు నిలుచున్న బీరువాలు, కంప్యూటర్లు, లేసులతో కట్టిన లావుపాటి ఫైళ్ళు, వాటి మధ్యన మునిగిపోయిన కళ్ళద్దాల అధికారులు, సీలు సైన్ అంటూ అటూ ఇటూ పరుగులు తీసే జవాన్లు...ఇవన్నీ చూస్తూ తికమక పడిన శాహిదా కొద్దిగా నిలదొక్కుకోగలిగింది తను పనిచేసే బయోకెమిస్ట్రీ డిపార్డ్మెంట్ ల్యాబుల్లో ధ్యానాసక్తుల వలె తెల్లకోటులు వేసుకున్న విద్యార్థినుల సాహచర్యంలో. వాళ్లను చూసినప్పుడల్లా ఆమెకు తన పిల్లలు సూఫియా, శిఫా గుర్తుకు వచ్చేవారు. కొట్టుమిట్టాడే కలలు మళ్లీ చిగురించేవి. కానీ వెలుగును వెన్నంటే వచ్చే చీకటిలా కలల వెనుకే వచ్చే తన పరిస్థితి యొక్క కలవరం ఆమెను వెక్కిరించేది. చేతకాని తండ్రి వద్ద వదలి వచ్చిన తన నాలుగు సంవత్సరాల సూఫియా, రెండు సంవత్సరాల శిఫాలను తలచుకుని కన్నీరుమున్నీరయ్యేది. అందుకే పొద్దున పదిగంటల నుండి సాయంత్రం ఐదుదాకా చేసే యూనివర్సిటీ పనికి వీడ్కోలు చెప్పేసి ఇంటి పనులు వెతుక్కుంటూ స్టెల్లా ఆంటీ ఇంటికి వచ్చింది. ఆమె కష్టాలు చూడలేక స్టెల్లా ఆంటీ, ఎదురింటి రెడ్డి ఆంటీ, పక్క ఇంటి శోభా ఆంటీ వాళ్ల ఇళ్లను కూడా ఇప్పించింది. స్టెల్లా ఆంటీ వాళ్ల మేడ మీదికి అద్దెకు వచ్చిన సరయూకు శాహిదా పరిచయం ఇలా జరిగింది. ఆరోజు శాహిదా ఇంట్లోకి వచ్చి నుంచున్నప్పుడు ఒక్క క్షణం సరయూ ఆశ్చర్యంగా నిలుచుండిపోయింది. ఆరోజు ఆమె మాట్లాడిన మాటలు ఒకటో రెండో మాత్రమే. స్టెల్లా ఆంటీ పూనుకొని సరయూ ఎదుర్కొంటున్న తిరగలిలాంటి పరిస్థితులని చెప్పి శాహిదాకు ఆమె బాధ్యతలను వివరించింది. సరయూ ఇంట్లోని రొట్టెలపైన శాహిదా వ్రేళ్ళ గీతలు పడినట్లల్లా ఆమె చేతి వెచ్చదనం అనుభవానికి వస్తూ వంటింట్లోనూ వెచ్చని అనుభూతిరాసాగింది. మెడనొప్పితో బాధపడే సరయూ భుజాల పైన శాహిదా వ్రేళ్ళు ఆప్యాయంగా తడిమి నొప్పి మూలాలను వెదకసాగాయి. లోతుకు దిగినకొద్దీ ఎక్కడో పెనవేసుకున్న లతల్లాంటి ఆడబతుకుల బాధలన్నిటికి మూలం ఒకటేనేమో అనిపిస్తూ, ఇద్దరు దగ్గరవుతూ పోయారు. అప్పుడే శాహిదా తన అనాథబాల్యం గురించి చెప్పింది. పెంచుకున్నవాళ్ళు సరిగ్గా తిండి పెట్టకపోవడం దగ్గర నుంచి ఆకలి, అవమానాల వరకు... చివరికి ఆమెకన్న ఒక అంగుళం పొట్టిగా ఉన్న యాసీన్ మెడకు ఆమెను కట్టి నిట్టూర్చేవరకు అన్నీ పంచుకుంది. తరువాత యాసీన్ ప్రేమలో తాను ఒక మనిషే అనే భావన మేలుకుని ఆమె బతుకు నిజంగానే స్వప్న సదృశమయింది. మెరుపుల టిక్లీలున్న చీరతో బురఖాలో దూరి సినిమా చూసిందీ, లారీలోని ఎల్తైన సీట్లో శెహజాదీలా కూర్చుని బయటి ప్రపంచాన్ని చూసింది, ఇలాంటి మురిపాల నడుమ సూఫియా, శిఫా తన ఒడిలో పడిందీ...అన్ని సినిమా రీళ్ళలా సాగిపోయాయి. తనదీ ఒక ముచ్చటైన సంసారం, ఆ సంసారానికి దీపాలుగా పుట్టిన ఈ పాపలు అల్లా ఆశీర్వదించి పంపిన పావురాలే అనిపించేది ఆమెకి. వారిద్దరికీ తను అనుభవించిన అనాథబ్రతుకు, అవమానాలను ఏ మాత్రం తగలకుండా పెంచాలి అనే పట్టుదల కళ్ళ ముందే కూలింది విధి ఆడిన నాటకంతోనే.రోడ్డు ప్రమాదంలో ఒక చెయ్యి పోగొట్టుకున్న యాíసీన్ తన మరో చేతిని కూడా పోగొట్టుకున్నాడు. పక్షవాతం వల్ల చెయ్యి చచ్చుపడిపోయింది. అప్పుడు శాహిదా కృంగిపోయింది. ఎవరూ ఆదుకోవడానికి రాకపోవడం చూసి తనే నడుము బిగించింది. కష్టాలు ఆమెకు కొత్తకావు. కానీ కల చెదిరిపోడమే దిగ్భ్రమ. భర్తకు, పిల్లలకు స్నానాలు చేయించి, బట్టలు ఉతికి, వండి, పిల్లలను భర్తకు అప్పగించి బయటపడే శాహిదాను భయం ఆవరిస్తుంది. దేనినీ ఎత్తలేని, సరిగ్గా నడవనూలేని భర్త నిస్సహాయత, పిల్లల్లో తొంగి చూసే అనాథ భావం ఆమె మనస్సును పిండివేసేది. నెమ్మదిగా తాను తిని, తండ్రికి తినిపించే స్థాయికి చేరుకుంది సూఫియా. ‘‘మనందరిలోనూ చాలా శక్తి ఉంటుందట అక్కా... మరి అది బయటికి రావాలంటే కష్టాలు రావాలికదా... అల్లా దాన్ని పరీక్షిస్తాడట’’ అంటూ సగం నవ్వు సగం ఏడ్పులతో చెప్తూ శాహిదా కళ్లనీళ్ల పర్యంతమయ్యేది. సరయూకు కూడా కళ్లలో నీళ్లు తిరిగేవి. ‘‘ఏమైనా కానీ పిల్లలను మాత్రం బాగా చదివించు శాహిదా. డబ్బుల అవసరం వస్తే అడుగు’’ అంటూ సరయూ చూపిన అభిమానానికి హృదయం నిండిరాగా ‘‘అంత చాలు అక్కా! ఆ మాట చాలు నాకు... కావలసి వస్తే తప్పకుండా అడుగుతాను’’ అంటూ మాట మార్చేది. రంజాన్ నెలలో మాత్రం పనికి రావడం కుదరదు అని కచ్చితంగా చెప్పేది శాహిదా. ఆ నెలలో శ్రీమంతులు దాన ధర్మాలు చేస్తారు. అప్పుడు వారు యాసీన్ దీన పరిస్థితిని చూసి కొంచెం ఉదారంగా ఇచ్చేవారు.ఇవన్నీ ముందు ఆమెకు అలవాటు లేకపోయినప్పటికీ పరిస్థితులు తప్పనిసరిగా అలవాటు చేశాయి. ఒక సంవత్సరానికి సరిపడే ధాన్యాలు, దుస్తులు ఈ నెలలోనే వచ్చి పడేవి. అంతే కాక పండుగ రోజు వాళ్ల వీళ్ల ఇళ్లు శుభ్రం చేసి, వంట సాయం చేసి బక్షీసు తీసుకునేది. రంజాన్ రోజు వాళ్లు చేసే శీర్ కుర్మా మాత్రం తప్పకుండా తెచ్చేది. సరయూ కొడుకు రాఘవకు అదంటే ప్రాణం అని తెలుసు శాహిదాకు. అలాంటి ఒక రంజాన్ నెలలో సరయూ ఊరి నుండి ఆమె చెల్లెలు సుమ, గిరిజత్త వచ్చారు. వాళ్లు వచ్చేటప్పటికి శాహిదా పన్లోకి రావడం లేదు. గిరిజత్తకు శాహిదా చేసిన జొన్న రొట్టెలు, కూరలను ఎలా తినిపించడమా అనే వ్యథ కలిగింది సరయూకు. సుమా తమాషాకు ‘‘అయ్యో అక్కా! ఆమె పేరు ఏ లక్షో్మ, పార్వతి అనో చెప్పెయ్యరాదా. ఒక బింది ప్యాకెట్ శాహిదాకు ఇచ్చి మేము వెళ్లిపోయేదాకా పెట్టుకోమను.’’ అంటూ కన్నుకొట్టింది. శాహిదాకు బొట్టు పెట్టుకుని లక్ష్మిలా కనబడడాన్ని ఊహించుకున్న సరయూ కూడా నవ్వింది. ‘‘క్యాలెండర్‌లోని లక్ష్మిదేవిలా కనిపిస్తుంది శాహిదా’’ అంది. రంజాన్ రోజు సుమా సరయూ చెవిలో ‘‘ఈ రోజు మీ క్యాలెండర్ లక్ష్మి శీర్ కుర్మాతో ప్రత్యక్షమవుతుందా?’’ అంటూ హాస్యమాడింది. ‘‘ఏ లక్ష్మీనే’’ అని గిరిజత్త అడిగినదానికి ఇద్దరూ ముఖాలు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.సాయంత్రానికి శాహిదా శీర్ కుర్మాతో నిజంగానే ప్రత్యక్షమయింది. కానీ ఆ రోజు ఆమె బురఖా ధరించింది. సరయూ ఒక్క క్షణం అవాక్కయింది. ఇంతవరకు శాహిదా ఎప్పుడూ బురఖా ధరించలేదు. అలా చూస్తే వారిద్దరూ ఎప్పుడూ దేవుడి గురించి కానీ, మతం గురించి కానీ ఆచారాల గురించి కానీ మాట్లాడుకోలేదు. శాహిదా మాత్రం మామూలుగా ‘‘ఎల్లుండి నుండి పన్లోకి వస్తానక్కా! ఇది తీస్కుని డబ్బా ఖాళీ చేసిస్తే వెళ్లిపోతాను. చాలా పన్లున్నాయి. చీకటి పడుతోంది’’ అని తొందరపెట్టింది. రాఘవను ముద్దాడి ‘‘బాగా కిస్మిస్, జీడిపప్పు వేశాను. తినాలి నువ్వు సరేనా?’’ అంటూ గడప దాటింది. ‘‘ఇదేమిటి? వాళ్ల అల్లా ప్రసాదమా’’ అంటూ గిరిజత్త రాగం తీసింది. ‘‘మరి ఆ దేవుడు ఈ దేవుడు అంటూ గుళ్లు తిరుగుతావు కదా. ఈ ప్రసాదాన్ని కూడా తీసుకో మరి’’ అంటూ సుమ తమాషా చేసింది గిరిజత్తను. గిరిజత్త మొహం తిప్పేసుకుంటూ ‘‘నాకు రేపటి నుండి రొట్టె, కూర వద్దమ్మా. ఎందుకో కొద్దిగా అజీర్ణమయినట్టనిపిస్తుంది. అన్నమయితే మెత్తగా ఉంటుంది. అది చాలు’’ అంటూ లేచి లోపలికి వెళ్లింది.ఊళ్లో అంతా గిరిజత్త అంటే చాలా మంచిపేరు. మహిళా మండలి, భజన మండలి అంటూ అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటుంది. ఆ రోజు రాత్రి ఆమె సరయు–సుమలకు క్లాసు తీసుకుంది. ‘‘మనవాళ్లు ఈ మధ్య చాలా చెడిపోతున్నారు.ఆచారాలను మంటగలుపుతున్నారు. దీనివలన మన సంస్కృతి చెడిపోతోంది. అందరూ వారి వారి దారిలో సరిగ్గానే నడుస్తున్నారు. మనం మాత్రం ‘మనది’ అన్నదాన్ని కాలరాచివేస్తున్నాం. నీ భర్తను, బాబును రోజూ సంధ్యావందనం చెయ్యమను. నువ్వు కూడా ఏదైనా నోమో వ్రతమో ప్రారంభించు. మనం మాత్రమే మన సంప్రదాయాలను నిలుపుకోవాలని మొన్న స్వామీజీ కూడా చెప్పారు’’ అని మరీ మరీ చెప్పింది. మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా అన్యమనస్కంగా కనిపించింది. సూఫియా, శిఫాల స్కూల్ గురించిన వివరాలడిగినప్పుడు ‘‘అక్కా! సూఫియాను గవర్నమెంట్ స్కూల్లో వేశాం కదా. శిఫానైనా మదరసాకు పంపాలనుకుంటున్నాము. మా రీతి నీతులు అన్నీ నేర్చుకోవాలి కదక్కా! మేమైతే అవేం తెలుసుకోకుండా పెరిగి కాఫిర్లమైనాము. అదైనా కురాన్, హదీస్ అన్నీ నేర్చుకోనీ అని...’’ అంటూ ఆపేసింది. నిన్ననే చాలా ఇబ్బందిగా తన గిరిజత్త నుండి విన్న ఈ ‘మనది’ అనే పదం, మనసును కలవర పెట్టినా మాటలను కొనసాగించకుండా గమ్మునయిపోయింది సరయూ.మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా యాంత్రికంగా రొట్టెలు తట్టుతోంది. గ్యాస్ పొయ్యి మీద పొంగుతున్న రొట్టెను తన చేతివేళ్లతో చాకచక్యంగా తిప్పుతున్నా చూపు ఎక్కడో ఉంది. అంతలో శాహిదా సన్నగా ఏడవడం వినిపించింది. ఆ రోజు ఆదివారం కావడం వలన సరయూ ఆమెను మాటల్లోకి దింపింది. ‘‘అక్కా! ఈ మధ్య మా ఇంటాయన నా పైన చాలా అనుమాన పడుతున్నాడు. బురఖా లేకుండా బయటికి వెళ్లకూడదు అని తాకీదు చేశాడు.నేను ఎవరెవరి ఇళ్లకు పనికి వెళ్లానో వాళ్ల ఇంటి ముందు వచ్చి నిలబడుతాడు. నువ్వేం నన్ను పోషించక్కర్లా అంటూ వడ్డించిన కంచాన్ని ముక్కూ మూతీ చూడకుండా విసిరేస్తాడు. చేతులు ఎత్తడానికి చేతకాదు కదా. అందుకే కూర్చున్న చోటునుంచే కాలితో తంతాడు. అలా కొట్టినప్పుడు పడబోతే మళ్లీ తన్నులు తిన్న నేనే పట్టుకోవాలి. ఆ మనిషిని చూస్తే ఒక్కోసారి చెడ్డ కోపం వస్తుంది. ఒక్కోసారి జాలి వేస్తుంది’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆశ్చర్యమేమంటే గిరిజత్తే శాహిదాను ఓదార్చింది. ‘‘ఈ మగవాళ్లంతా ఇంతేలే. ధైర్యంగా ఉండు’’ అంటూ గిరిజత్త శాహిదా చెయ్యి పట్టుకుని చెప్పింది. ఆ రోజు లలితా సహస్ర నామాలు చదివి ముగించిన తరువాత ‘‘ఆడతనాన్నే అఖండ శక్తి కేంద్రంగా భావిద్దాం. ఆ భావనలో సరయూ, శాహిదా, స్టెల్లా వేరువేరుగా కనిపించరు కదూ’’ అన్నది సుమ. ఆమె మాటలు పుస్తకాలలో ఉపయోగించే మాటల మాదిరిగా అనిపించినా అందులోని అర్థం మనసుకు తెలిసినటై్ట సరయూ, గిరిజత్త మౌనం వహించారు.సరయూకు ట్రాన్స్ఫర్ అయి ఆమె సంసారం ధారవాడ నుండి బయలుదేరినప్పుడు శాహిదా పావురాళ్లలాంటి తన ఇద్దరు కూతుళ్లనూ తన భర్తనూ తీసుకుని వీడ్కోలు చెప్పడానికి వచ్చింది. ‘‘శాహిదా! నీ ఆరోగ్యం జాగ్రత్త. వీరిద్దరినీ బాగా చదివించు... ఏమయ్యా.. మా శాహిదాను ఇబ్బంది పెట్టవద్దు’’ అంటూ సరయూ ఏమేమో అప్పగింతలు చదివింది. ‘‘ఆయనకు చెప్పండక్కా! నాకైతే వీళ్లిద్దరినీ యూనివర్సిటీలో చదివించాలని ఉంది’’ బిడియంగా అంది శాహిదా. ‘‘దానికి నా ఓటు కూడా ఉంది’’ అంటూ శాహిదా చెయి నొక్కింది సరయూ. సరయూ మనసులో ముద్రపడిన ఈ జ్ఞాపకాలను ఏమాత్రం చెదరకుండా మళ్లీ ఆమెను మేలుకొలిపింది మొన్న ఫేస్బుక్లో ఆమె యాక్సెప్ట్ చేసిన ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వలన. శిఫా అనే ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తున్న ఆత్మవిశ్వాసమే మూర్తీభవించినట్టున్న అమ్మాయి రిక్వెస్ట్ అది. ఆ ప్రొఫైల్ చూస్తున్నప్పుడల్లా గుండె ఆత్మీయతతో కొట్టుకోసాగింది. అందులో ఐదారు గోల్డ్ మెడల్స్ ధరించిన అమ్మాయి ఫొటో, పక్కలో నించున్న శాహిదా, వెంట్రుకలు అక్కడక్కడా నెరిసినట్టు కనిపించడం తప్ప మిగతా అంతా తను అప్పుడు చూసిన శాహిదానే! ఇన్‌బాక్స్‌లో ఒక మెసేజ్ కనిపించడం ‘‘అమ్మ మిమ్మల్ని చాలా అనుకుంటుంది ఆంటీ. నేను అక్కా ఇద్దరూ యూనివర్సిటీ చదువులు ముగించాము. సూఫియా బయోకెమిస్ట్రీలో పి.హెచ్.డి చేసి ఇక్కడే యూనివర్సిటీలో పని చేస్తోంది. నాది మొన్న ఇంగ్లీష్ ఎమ్.ఏ అయింది. అమ్మ.. మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది’’ అని ముగించింది. ఇంకో ఫొటోలో సూఫియా, శిఫా ఇద్దరూ దేవకన్యల మాదిరి నుంచుని కనిపించారు. బారాకొట్రిలో నాకు కనిపించిన లేత కన్యలు కొంత గాంభీర్యాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది. కానీ అప్పుడు అక్కడ కనిపించిన ఆంతర్యంలోని వెలుగు మాత్రం మాసిపోకుండా మొహాల్లో కనిపించింది. సమయాన్ని తమ రెక్కల్లో పొదువుకుని ఎగిరే అల్లా ఆశీర్వదించి పంపిన పావురాల్లాగా! కన్నడ మూలం : గీతా వసంత్ అనువాదం: చందకచర్ల రమేశ్‌బాబు -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రమజాన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముస్లీంల పవిత్ర పండుగ రమజాన్ ను తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. కులమతాలకు అతీతంగా సోదరభావంతో ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ముస్లీం ప్రార్థనల కొసం ఈద్గా, మసీదుల వద్ద జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ బొంతు రాంమోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డిలు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాసబ్ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్ వద్ద ముస్లీం సోదరులు నమాజ్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సనత్ నగర్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట మజీద్‌లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రబాద్ చిలకలగూడ ఈద్గాలో మంత్రి పద్మారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాన్సువాడలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నల్గొండలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయవాడ: రమజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిని వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీంలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా రామవరప్పాడు రోడ్డు నిర్మాణంలో తొలగించిన మసీదును ఎందుకు నిర్మించడం లేదంటూ చంద్రబాబును ముస్లీం సోదరులు ప్రశ్నించారు. దీంతో ఏడాది లోపు మసీదు నిర్మిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. కడప: రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన వేడుకల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ప్రధాని మోదీ రమజాన్ సందేశం
న్యూఢిల్లీ : శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం దేశమంతటా ఈద్ ఉల్ ఫితర్ (రమజాన్) పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7.35 గంటలకు నెలవంక కనిపించిందని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ ప్రకటించారు. దేశ ప్రజలకు రమాజన్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్‌తో పవిత్ర రమాజాన్/రంజాన్ మాసం ముగుస్తుంది. 30 రోజులపాటు ఉపవాసం ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపుకునే ముస్లింలు రమజాన్ సందర్భంగా తమ బంధుమిత్రులు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుతారు. మసీదులు, ఈద్గాలు, నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ నిరుపేదలకు సహాయం చేస్తారు. రమజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈద్ ముబారక్. దేశ పౌరులందరికీ, ప్రత్యేకంగా దేశవిదేశాల్లోని మన ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భం మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, మన సమాజం పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ‘ఈద్ ముబారక్, ఈ పర్వదినం సమాజంలో మన ఐక్యతను, సామరస్యాన్ని మరింత పెంపొందించాలని ఆశిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా దేశ ప్రజలకు రమజాన్ శుభాకాంక్షలు చెప్తూ.. ఆడియో ఫైల్‌ను షేర్ చేశారు. పలువురు జాతీయ రాజకీయల నాయకులు, పలువురు ప్రముఖులు కూడా రమజాన్ శుభాకాంక్షలుత తెలిపారు. -
నేడు దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు
-
ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
-
ఇలవంక నెలవంక
రమజాన్ పండుగ సంబరాలుప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో జరుగుతాయి. అల్లాహు అక్బర్ .. అల్లాహుఅక్బర్.. లాయిలాహ ఇల్లల్లాహువల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లాహిల్ హంద్ ..!రమజాన్ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడామగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరినోటవిన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి.కొత్తబట్టలు, కొత్తకొత్త మేజోళ్ళు, కొత్తహంగులు, తెల్లని టోపీలు, అత్తరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి.సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ల హడావిడితో ముస్లిముల లోగిళ్లు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్లలో ఆడవాళ్ల హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగకాదు గదా! నెలనాళ్ల పాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్ ’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్రగ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించిపోతుంటారు. ఆనందహేల అవును, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే రమజాన్ పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండుముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజా వ్రతం పాటిస్తారు. భక్తి శ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేసి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవ నామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయం చెందుతుంటారు. దానధర్మాలు, ఫిత్రాల చెల్లింపులో ఆనంద పరవశులవుతుంటారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాస దీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది .రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్రఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. సామరస్యం వెల్లివిరిసే రోజు రమజాన్ నెల ఆరంభం నుండి ముగింపు వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈ నెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ‘ఈద్’ (పండుగ)ను శ్రామికుని వేతనం (ప్రతిఫలం) లభించే రోజు అని చెప్పడం జరిగింది. సదాచరణల సంపూర్ణ ప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకొని ఆనందతరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్. ఆ రోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్ ’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది. ప్రేమత త్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్థం. ఈద్ నాటి సంప్రదాయం రమజాన్ నెల పూర్తి రోజాలను నెరవేర్చడమంటే, దైవాదేశపాలనలో ఒక గురుతరమైన బాధ్యతను నెరవేర్చడం. ఇలాంటి సందర్భంలో ఒకమనిషిగా అతని హృదయం ఆనందంతో పొంగిపోవడం, ఒక విశ్వాసిగా అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోవడం సహజం. ఈ సహజ భావోద్రేకాలే ’ఈదుల్ ఫిత్ర్’ రూపంలో బహిర్గతమవుతాయి. ఈ పండుగలో విశ్వాసి తాను రోజా విధి నెరవేర్చిన సందర్భంగా తన హృదయంలోని సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. మరోవైపు అల్లాహ్ ఆదేశ పాలనలో ఒకవిధిని నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాడు. ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో జరుగుతాయి. పండుగ సంప్రదాయం గుసుల్ చేయడం: ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్ గాహ్ కు వెళ్లే ముందు గుసుల్ (స్నానం) చేయాలి.మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి.సుగంధ ద్రవ్యాలు వాడటం : ఉన్నంతలోనే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు వాడాలి.ఈద్ గాహ్ కు వెళుతూ బిగ్గరగా తక్బీర్ పలకడం : అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్, లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ వలిల్లాహిల్ హంద్ అని బిగ్గరగా పలుకుతూ ఉండాలి.కాలినడకన ఈద్ గాహ్ కు వెళ్ళడం: నమాజు కోసం ఈద్ గాహ్ కు కాలినడకన వెళ్లాలి. ఒకదారిన వెళ్లి, మరోదారిన తిరిగి రావాలి.ఖర్జూరాలు తినడం : ఈద్ గాహ్ కు వెళ్లే ముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపివస్తువు తినవచ్చు. 3,5,7 ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తిని ప్రవక్త మహనీయులు ఈద్ గాహ్ కు వెళ్లేవారు. – మదీహా అర్జుమంద్ -
వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని వైఎస్ జగన్ అన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
పాతబస్తీలో ప్రశాంతంగా ప్రార్ధనలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో శనివారం రంజాన్ ప్రార్థనలకు 5 వేల మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. సిటీలోని 600 మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచినట్టు తెలిపారు. 50 సమస్యాత్మక మందిరాల వద్ద సీసీ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టామన్నారు. అదేవిధంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. -
సేమియా.. మజా లియా..!
రంజాన్ మాసం.. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. దీక్షతో ఉపవాసముంటూ అల్లాను స్మరిస్తూ, దైవచింతనలో ఉంటారు. ఈమాసం అందరికీ ఆనందదాయకమే.. ఈనెలలోనే ప్రత్యేకంగా తయారు చేసే వేడివేడి రుచికరమైన హలీంను ఉపవాస విరమణ అనంతరం సాయంత్రం సమయంలో ముస్లిం మిత్రులతో కలిసి అందరూ ఆస్వాదిస్తారు. అయితే హలీంతో పాటు సేమియాకు ఈ మాసంలో విశిష్ట స్థానం ఉంది. రంజాన్ పర్వదినాన తమ చుట్టుపక్కల వారికి కులమతాలకు అతీతంగా సేమియాతో తయారు చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేసి ముస్లింలు సోదరభావాన్ని చాటుకుంటారు... వన్‌టౌన్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకు వచ్చే తీపి వంటకం ఖీర్‌ఖుర్మా. రంజాన్ పర్వదినం రోజున ప్రతి ముస్లిం ఇంట సేమియాతో చేసే ఈ వంటకం తప్పనిసరి. పండుగ రోజన ముస్లింలు తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు సేమియాతో చేసిన ఖీర్‌ఖుర్మాను అందజేస్తారు. అంతేకాకుండా తమ దగ్గర ఆత్మీయులకు రంజాన్ సందర్భంగా సేమియాను అందజేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు. అందుకోసం పండుగ సమీపిస్తున్న వారం పది రోజులు ముందుగానే సేమియా తయారీకు సన్నద్ధమవుతుంటారు.అందులో భాగంగానే ఒకొక్కరి ఇంటæ కనీసం ఐదు నుంచి పది కిలోల మేర సేమియాను తయారు చేయిస్తుంటారు. వన్‌టౌన్‌లో సేమియా తయారీ కేంద్రాలు వన్‌టౌన్‌లోని సేమియా తయారీ కేంద్రాలు ఏడెనిమిది వరకూ ఉన్నాయి. రంజాన్ మాసంలో ఆ సేమియా తయారీ కేంద్రాలన్ని ఉదయం నుంచి రాత్రి వరకూ బిజీబిజీగా దర్శనమిస్తుంటాయి. అంతేకాకుండా కొంతమంది ఇళ్ల వద్ద సేమియా తయారీ యంత్రాలు కూడా ఉండటంతో వారే స్వయంగా తయారు చేస్తుంటారు. స్వయం తయారీకే ప్రాధాన్యం.. గోధుమలను శుభ్రం చేసి పిండి ఆడించి పిండిని సిద్ధం చేసుకుంటారు. తిరిగి దానిని శుభ్రపరచి సేమియా తయారీ కేంద్రానికి చేరుస్తారు. అక్కడ తయారీ చేసే సిబ్బంది ఆ పిండిని యంత్రంలో వేసి సేమియాను తీస్తారు. తరువాత తయారైన సేమియాను ఆరుబయట గాలి ఆడేవిధంగా ఆరబెడతారు. ఇది చూడటానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకవైపు ఆధునికత వైపు పరుగులు తీస్తూ సంప్రదాయాలను పక్కనపెడుతున్న ప్రస్తుత కాలంలో ఇంకా సేమియా స్వయం తయారీకే ముస్లింలు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. బయట రకరకాల సేమియాలు విభిన్న రుచుల్లో అందుబాటులో ఉన్నా వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా కొద్దిమంది మాత్రమే అటుగా అడుగులు వేస్తారు. ఖీర్‌ఖుర్మా పంపిణీతో సోదరభావం.. సాధారణంగా పండుగ రోజున ముస్లింలు ఖీర్‌ఖుర్మాను తయారు చేస్తారు. దానిని చుట్టుపక్కల మిత్రులకు, ఇతర బంధువులకు పంపిణీ చేస్తారు. ఖీర్‌ఖుర్మాను పంపిణీ చేయటం ద్వారా రంజాన్ శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలం తమ బంధువులకే కాకుండా చుట్టుపక్కల వారికి పంపిణీ చేసి తమ ఆత్మీయతను చాటుకుంటారు. ఖీర్ఖుర్మాతో పాటుగా సేమియాతో అనేక వంటకాలు చేసి తమ మిత్రులకు అందజేసి తమ సంతోషాన్ని పంచుకుంటారు. సాధారణంగా వన్‌టౌన్‌లో ముస్లింలు తమకు ఆత్మీయులైన హిందువులకు తప్పనిసరిగా ఈ వంటకాన్ని లేదా సేమియాను అందజేయడం అనేక దశాబ్ధాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. మతసామరస్యానికి ఇటువంటి ఆత్మీయ పలకరింపులు వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటారు ఇక్కడి స్థానికులు. సేమియా కూడా మతసామరస్యానికి ఒక సాధనంగా రూపుదాల్చడం ఒక విశేషం. -
సహరీ ఖరో..ఉఠో..!
మదనపల్లె సిటీ: ‘అయ్ రోజే దారో.. ఉఠో హరీ ఖరోరం..’ ముస్లింలు నివాసముండే ప్రాంతాల్లో తెల్లవారుజామున వినిపించే దండోరా ఇది. జూన్ మాసంలో పవిత్ర ఉపవాసదీక్షలు చేపట్టే ముస్లిం సోదరులను మేల్కొల్పేందుకు వీధుల్లో డప్పులు కొడుతూ, తమ మధుర స్వరంతో అల్లా శక్తిని పాటల రూపంలో పాడుతూ చేపట్టే కార్యక్రమం ఇది. తెల్లవారుజాము 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ముస్లింల నివాస ప్రాంతాల్లో ఫకీర్లు దాయారాతో నిద్రలేపుతారు. జిల్లాలో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కొందరు స్వచ్ఛందంగా ఈ పని చేస్తుండగా, మరి కొందరు ఫకీర్లు వారసత్వంగా కొనసాగిస్తున్నారు. 45 ఏళ్లుగా.. మదనపల్లె పట్టణం బడేమకాన్ దర్గాలో ఫకీర్లు దాదాపు ఐదుగురు ఉన్నారు. వీరి గురువు సయ్యద్ సిద్ధివుల్లా షాతో పాటు మరో నలుగురు శిష్యులు రోజూ ముస్లింలు ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని సహరీ కోసం నిద్ర లేపుతారు. ‘అప్పట్లో విద్యుత్‌దీపాలు లేకపోవడంతో లాం తర్లు పట్టుకుని వీధుల్లో తిరిగేవాళ్లం. తరాలు మారినా ఆ సంప్రదాయం అలాగే కొనసాగిస్తున్నాం. ఇషా నమాజు చదివి రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా తెల్లవారుజాము మూడు గంటలకే లేచి ఉపవాసదీక్షలకు సిద్ధమయ్యే ముస్లింలను మేల్కొల్పుతాం’ అని చెబుతారు సయ్యద్ సిద్ధి వుల్లా. మా చాటింపుతో ఎంతో మంది నిద్రలేచి ఉపవాసదీక్షలను పాటిస్తుంటారు. రంజాన్ రోజు ఇచ్చే కానుకలు తీసుకుంటూ అల్లాహ్ పై ఉన్న భక్తితో ఈ పని చేస్తున్నా. దీంతో ఎంతో సంతృప్తి కలుగుతుందని అంటారాయన. మధురం.. కంఠస్వరం సయ్యద్ సిద్ధివుల్లా కంఠస్వరం చాలా మధురంగా ఉంటుంది. ఎంత గాఢనిద్రలో ఉన్నా ఆయన కంఠస్వరం వినగానే ఒక్కసారిగా నిద్రలేచి సహరీకు ఏర్పాట్లు ప్రారంభిస్తాం అని చెబుతారు ఇక్కడి ముస్లింలు. దాదాపు 45 ఏళ్లుగా చాటింపు చెబుతున్న సిద్ధివుల్లా స్థానిక ముస్లింలకు సుపరిచితుడు. ఫకీర్లకే ప్రాధాన్యం.. గతంలో గడియారం, అలారమ్, సైరన్ మోతలు లేకపోవడంతో ఫకీర్లకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఫకీర్లు పొరపాటున చాటింపు వేయకపోతే అక్కడివారు సకాలంలో మేల్కొనకపోవడం వల్ల ఆరోజు వారు ఉపవాసదీక్షలను వదిలేయాల్సి వచ్చేది. కాలానుగుణంగా ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చినా ముస్లింలు మాత్రం ఇంకా ఫకీర్ల చాటింపుపైనే ఆధారపడుతున్నారు. ఫకీర్లు కాలినడకతో పాటు సైకిల్‌లపై డప్పు వాయిస్తూ .. మర్పా కొడుతూ.. డబ్బా వాయిస్తూ ముస్లింలను నిద్ర లేపుతున్నారు. -
ఆఫీస్‌పై బాంబు దాడి ; 12 మంది మృతి
కాబుల్, అప్ఘనిస్తాన్ : మంత్రిత్వ కార్యాలయంపై సోమవారం ఉగ్రదాడి ఘటనలో అప్ఘనిస్తాన్‌లోని కాబుల్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయం బయట భారీ మొత్తంలో పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు వెళ్తున్న సమయంలో బాంబు పేలింది. మొత్తం 12 మంది చనిపోగా, 31 మంది తీవ్రగాయాల పాలయ్యారని ఆ దేశ గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. మహిళలు, పిల్లలు, ఉద్యోగులు బాధితుల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఉగ్రదాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని చెప్పారు. -
బులుగంటే బులుగా పలావెంకారెడ్డా!
భారతీయ కథలలో రంజాన్ ప్రస్తావన రాగానే అందరికీ గుర్తొచ్చే కథ ప్రేమ్‌చంద్ రాసిన ‘ఈద్గా’. తెలుగులో జ్వాలాముఖి రాసిన ‘ఈద్ కా చాంద్’ కథలో కూడా రంజాన్ ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే ‘దర్గామిట్ట కతల్లో’ మూడు వరుస రంజాన్ కథలు కూడా పాఠకులను విశేషంగా అలరించాయి. వాటి నుంచి రెండు కథలు... యిప్పుడంటే కావలి కోర్టెదురుగ్గా పలావు సెంటరు పెట్టి ప్లేటుకు యిరవై ఆరు రూపాయలు కళ్ల చూస్తా వున్నాడుకానీ మేము పిలకాయలుగా వున్నప్పుడు పలావెంకారెడ్డి కూడా బాగా యిబ్బందులు పడినోడే! పలావెంకారెడ్డి (పలావు+వెంకారెడ్డి) మా నాయనకు ప్రాణ స్నేహితుడు. అంతే కాదు. మా నాయన పెళ్లికి పెద్ద కూడా.మా అమ్మను మా నాయనకిచ్చి చేయాలని మా తాత మస్తాన్‌సాయిబు నిచ్చయించుకున్నాక మా నాయన ‘కాండక్టు’ను యింకెవుర్నీ అడక్కుండా నేరుగా పలావెంకారెడ్డినే అడిగినాడంట.‘ఆ పిల్లోడికేమి సామీ. బంగారం. కళ్లు మూసుకొని యిచ్చెయ్యి’ అని పలావెంకారెడ్డి బరోసా యిచ్చినాకే మా తాత కుదుట పడినాడంట.పలావెంకారెడ్డి మా నాయిన కంటే ఏడెనిమిదేళ్ల పెద్దోడు. అయినాగానీ కసరత్తు చేసిన కండలతో (ఆయన ఒకప్పుడు పయిల్వానులే), మంచి ఒంటి చాయతో, తలకురంగేసుకొని తెల్లటి గుడ్డలు కట్టుకొని కుర్రపిల్లోడాల కనిపించేవాడు.‘నిఖా’నాటికి మా అమ్మ పద్నాలుగేళ్ల చిన్నపిల్ల కాబట్టి పలావెంకారెడ్డి మా అమ్మని ‘అమ్మాయ్’ అని పిలిచేవాడంట. ఆ తర్వాత్తర్వాత ఆయనకి ఆ పిలుపే అలవాటయిపోయింది. మా నాయినంటే ఏమోగానీ ఆయనకు మా అమ్మంటేనే బాగా అబిమానం.సంక్రాంతి వచ్చిందంటే చాలు మా అమ్మకు యిష్టమని చెప్పి పెద్ద స్టీలు టిపిను నిండుగా అరిసెలు, మనుబూలు, లడ్లు తీసుకొచ్చి ‘తీసుకో అమ్మాయా’ అంటా యిచ్చేవాడు పలావెంకారెడ్డి. ఆనేక మా నాయిన్ని మా అన్ననీ నన్నూ యింటికి పిలచకెళ్లి, యిస్తరాకు నిండుగా పాయిసం పోసి పండగ బోజనం పెట్టేవాడు. (ఇక్కణ్ణే యింకో సత్యం కూడా చెప్పుకోవాలి. మా అమ్మ ఏ పెళ్లికీ ఏ శుబకార్యానికీ వెళ్లాలన్నా నిన్న మొన్నటిదాకా కూడా పలావెంకారెడ్డి బార్య నగో, ఆయన కోడలి నగో తెచ్చుకునేది హక్కుగా). మేం పిలకాయలుగా వున్నప్పుడు పలావెంకారెడ్డికి యవసాయం వుండేదో లేదో నాకు తెలియదుకానీ యింట్లో మాత్రం ఎప్పుడూ బరెగొడ్లుండేవి. ఆయన బార్య తెల్లారి లేచి బర్రెగొడ్డాల కష్టపడతా వుండేది.యీ కష్టాన్ని రొంతయినా దూరం చేయాలని పలావెంకారెడ్డి రకరకాల యాపారాలు చేసినాడంట. అయితే సత్తెకాలపు మనిషి కాబట్టి డబ్బులు సంపాదించడం ఆయనకి చేతకాల. (చివరాకరికి పలావు సెంటరు పెట్టినాక ఆయన దశ తిరిగింది. అదెప్పుడైతే పెట్టినాడో అప్పుణ్ణుంచి మా వూర్లో ఆయన పేరు రేమాల వెంకారెడ్డికి బదులు పలావెంకారెడ్డిగా మారిపోయింది).మా చిన్నప్పుడు ఆయనకి ఒంగోలు బస్టాండుకాడ గుడ్డల కొట్టు వుండేది. రోజుకు మీటరు గుడ్డకైనా ఆ కొట్టు నడిచేది కాదుగానీ పలావెంకారెడ్డి, ఆయన పెద్ద కొడుకు మాత్రం టంచనుగా అందులో బేరానికి కూచోనుండే వాళ్లు.పలావెంకారెడ్డి గురించి యింత కత ఎందుకు చెప్పినానంటే రంజాను నెల వచ్చినాక ఆయనతో మాకు పని పడింది – మా అమ్మ పోడు వల్ల.‘వీదిలోని ఆడోళ్లంతా గాదంశెట్టి సుబ్బారావు కొట్టుకాడికెళ్లి కోరిన గుడ్డలు తెచ్చుకుంటా వున్నారు. నాక్కూడా రెండొందలో మూడొందలో పారేయ రాదా? నేను కూడా పిలకాయలకు గుడ్డలు తెచ్చుకోనా’ అని రంజాను నెల మొదులైన కాణ్ణుంచి మా నాయన ప్రాణం తీస్తా వుంది మా అమ్మ.మా నాయినేమో ‘ఆ’ అనడూ, ‘ఊ’ అనడూ. మా అమ్మ చూసీ చూసీ మా నాయన వాటానికి యింకిది మందు కాదని చెప్పి, న్యాక్‌గా మా నాయినమ్మను ఉసిగొలిపొదిలింది.‘రే అబయా. ఏందిరా నువ్వూ నీ బేడంగీ పనులూ. మనకు లాకపోయినా పిలకాయలకన్నా నాలుగు గుడ్డముక్కలు తేకపోతే ఎట్టా. వీదిలో కొత్త గుడ్డలేసుకున్న పిలకాయలను చూసి మన పిలకాయలు మనసు కష్టపెట్టుకోరా’ అనింది మా నాయినమ్మ.యింక మా నాయిన ఏమనుకున్నాడో ఏమోకానీ ‘సాయింత్రం పెద్దోణ్ణి, రెండోవాణ్ణి కొట్టుకాడికి పంపించండి. డబ్బులు దొరికితే అట్నే తీసిస్తా’ అని చెప్పేసి పోయినాడు.సాయింత్రానికి మా అమ్మ – నన్నూ మా అన్ననే కాకుండా మా చెల్లెల్ని కూడా రెడీ చేసి రైల్వేరోడ్డులోని మా కరెంటుషాపు కాడికి పంపించింది ఆశగా. కానీ మా నాయిన ఎట్టాంటోడా? మేము పోయేసరికి చేతులు నెత్తిన పెట్టుకొని సప్పంగా కూచోనున్నాడు టేబులు ముందర. మమ్మల్ని చూడ్డం తోటే లేచి ‘ఇయ్యాల కాదులే. యింటికి పాండి’ అన్నాడు – మా చెల్లెల్ని ఎత్తుకొని కొట్టుకి తాళం వేయబోతా.మా ప్రాణాలు వుసూరుమన్నాయి. మా అన్నకైతే ఏడుపొక్కటే తక్కవా.సరిగ్గా అప్పుడే దేవుడిలా వచ్చినాడు పలావెంకారెడ్డి. మమ్మల్ని చూడ్డంతోటే ‘ఏందయ్యో! చిన్న నవాబులంతా కలిసొచ్చినారో’ అన్నాడు నవ్వతా.మా నాయిన కూడా నవ్వి సంగతి చెప్పినాడు. అది విని ‘పండగ గుడ్డలకి పిలకాయలొస్తే ఉత్త చేతులతో వెనక్కి తీసకెళ్లిపోతావా కరీం సాయిబా? నా కొట్టులా. పాండి పాండి’ అన్నాడు పలావెంకారెడ్డి.‘యిప్పుడొద్దులే ఎంకారెడ్డా. డబ్బులొచ్చినాక చూద్దాం’ అన్నాడు మా నాయిన మొహమాటానికి పోతా.‘మా యింట్లో కరెంటు పని చేస్తే నువు డబ్బులడుగుతావా... నీ బిడ్డలకు గుడ్డలిస్తే నేను డబ్బులడిగేదానికి’ అని బయిల్దేరదీశాడాయన. అందరం కలిసి ఒంగోలు బస్టాండుకాడున్న పలావెంకారెడ్డి గుడ్డల కొట్టుకెళ్లాం.‘కరీంసాయిబా! ఎట్టా మళ్ల తీయబోయేది లేదుకానీ తీసేదేదో దిట్టంగా తీసి. నాలుగు రోజులు పడుంటాయి’ అని కొయ్య అల్మారాలో వున్న తానుల్లో నుంచి దిట్టంగా కనిపిస్తున్న బులుగురంగు తానునొకదాన్ని బయటికి లాగినాడు పలావెంకారెడ్డి. ‘గ్యారంటీ గుడ్డ. చిరిగే కొసినే లా’ అన్నాడు.మా నాయనకు ఏమున్నా లాకపోయినా ‘గ్యారంటీ’ అనే మాట వినపడితే చాలు ‘అదే యివ్వు’ అంటాడు కాబట్టి పలావెంకారెడ్డితో కూడా ‘అదే యివ్వు’ అన్నాడు. అంతే. పలావెంకారెడ్డి ఆ తాన్ను కోయడమైతే ఏమి, కొట్టు దిమ్మె మీదున్న దర్జీ సాయిబుకి మేమంతా కొలతలు యివ్వడమైతే ఏమి, దర్జీసాయిబు ఆ గుడ్డని తీసకెళ్లి యినపబకెట్టులో నానబెట్టడమైతే ఏమీ అంతా అయిదు నిమిషాల్లో జరిగిపోయింది. ఎట్టా గుడ్డ మిగిలింది కదా అని మా తమ్ముడికి కూడా వురామారిగా కొలతలు చెప్పి కుట్టెయ్యమన్నాడు మా నాయిన. ఆ రాత్రి ఏదో గనకార్యం చేసినట్టుగా ‘ఎంకారెడ్డి గుడ్డలిచ్చినాడు. డబ్బుల్లా ఏమీ లా’ అని మా అమ్మ దగ్గిర గొప్పలు చెప్పుకున్నాడు.మరుసటి రోజు సాయంత్రం కుట్టిన గుడ్డలు తెస్తా వుంటే మా నాయినకు తోడుగా పలావెంకారెడ్డి కూడావచ్చినాడు మా యింటికి. గుడ్డలు యింట్లోకి రాంగానే మా అమ్మ గబగబా వచ్చి, గుడ్డలన్నీ తెరిచి చూసి, యింత పొడుగున గాలి వొదిలి, గమ్మున లోపలికెళ్లిపోయింది.మా నాయినమ్మ మాత్రం మురిసిపోతా మమ్మల్నందరినీ పిలిచి వాటిని ట్రయిలుకు తొడిగింది. అవి తొడుక్కున్నాక మా అన్నా నేనూ మా చెల్లెలూ మా తమ్ముడూ అందరం పై నుంచి కింద దాకా ఫుల్లుగా బులుగంటే బులుగు!పలావెంకారెడ్డి మమ్మల్నా గుడ్డల్లో చూసి, బుగ్గలు పొంగిస్తా, తృప్తిగా తల వూపినాడు. మా నాయిన కూడా బిర్రుగా మెడ ఎగరేసి ‘అదిరినాయిలే. యింకపా’ అన్నాడు. పలావెంకారెడ్డి లేచినాడు. మా నాయిన బయటికొచ్చి సైకిల్ తీయబోతా వుంటే ‘అన్నో.. మాట’ అంటా పలావెంకారెడ్డిని ఆపేసింది మా అమ్మ.సైకిల్ పట్టుకొని మా నాయిన, ఆయన్ని చిల్లర డబ్బులు అడగతా నేనూ బయట్నే వుండిపోయాం. కాసేపటికి పలావెంకారెడ్డి తత్తరబిత్తరగా తల గోక్కుంటా బయటికొచ్చినాడు.‘య్యో! కరీం సాయిబా! అడిగినోడికి నీకూ బుద్దిలా. యిచ్చినోడికి నాకు బుద్దిలా. నలుగురికీ నాలుగు రకాల తాన్లు కోపిచ్చుంటే పోయుండేది కదా. యిప్పుడు నీ భార్య చూడు. యిస్తే యిచ్చినావుగాని ఎంకారెడ్డనా మరీ అన్యాలంగా బులుగంటే బులుగా అని అడగతా వుంది’ అన్నాడు నవ్వతా.మా అమ్మ అట్టా మాట్లాడద్దని ఊహించని మా నాయిన నోరెళ్ల పెట్టినాడు.‘‘అంతేకాదయ్యా. ‘మా యింటాయనకు పని తెలిసినా లాబంలా. నీకు యాపారం తెలియకపోయినా లాబంలా. యిద్దరూ యిద్దరే. రూపాయి జవురుకొని రారు. నెత్తిన చెయ్యి పెట్టడం నేర్చుకోరు. మీ యింట్లో యీ మనిషి పని చేస్తాడు. నువ్వేమో అందుకు బదులుగా గుడ్డలిస్తావు. యిట్టా చెల్లుకు చెల్లు బేరాలు చేసుకుంటా వుంటే మీరెప్పుటికి బాగుపడతారు నాయినలారా! యికనైనా న్యాక్ నేర్చుకొని మీ పెళ్లాం బిడ్డల్ని సుకపెట్టండి తండ్రులారా’ అని బుద్దులు చెప్పిందయ్యా ఆ బుజ్జమ్మా’’ అన్నాడు బక్తిగా. -
దిల్ దిల్ రమజాన్
రమజాన్ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్ఆన్ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. నేల నేలంతా ఒక్కటే పాట..షానే రమజాన్... జానే రమజాన్... దిల్ దిల్ రమజాన్ప్రేమ, కరుణ, క్షమ, ఆరాధనల పవిత్ర నెల, ఒకరినొకరు క్షమించుకుని చూసుకునే ప్రేమపూర్వక చూపులు, ఆకలి బాధానుభూతులు, ఇఫ్తార్ ఆనందాలు సహెరీ శుభాలు, జకాత్, ఫిత్రా దానాలు, ఖుర్ఆన్ పారాయణ చైతన్యం, తరావీహ్ ఆరాధనలు, మది నిండా రమజాన్ వెలుగులే!మాటల్లో, చేతల్లో దైవాదేశాల పరిమళాలే. నలుదిశలా ప్రేమ పవనాల సుమగంధాలే. ఇదంతా అల్లాహ్ రాసిన వరాల వీలునామా. రమజాన్ వరాలు లెక్కకట్ట తరమా! రమజాన్ అంటే కాల్చివేయడం, దహించి వేయడం అని నిఘంటువు అర్థం చెబుతుంది. మంటల్లో ఏమి వేసినా భస్మీపటలం కావాల్సిందే. ఉపవాసంతో కలిగే ఆకలి మంటలో రోజేదార్ల పాపాలు, చెడుగులన్నీ దహించుకుపోతాయి. ఇలా ముఫ్పై రోజులూ గత ఏడాదిపాటు చేసిన పాపాలన్నీ దగ్ధం అవుతాయి. పాపాలన్నీ కాల్చివేసి రోజేదార్ను పునీతుడిని చేస్తాడు అల్లాహ్. ఈద్ వరకూ రోజేదార్లు తమ పాపాల నుంచి విముక్తి పొంది పవిత్రంగా రూపు దాల్చుతారు. ఇలాంటి పునీతులకు అల్లాహ్ ఈద్ రోజు ప్రసన్నమవుతాడు. అదే ఈద్ కానుక. అల్లాహ్ పట్ల ఎనలేని ప్రేమతో ఆకలి బాధతో వచ్చే ‘యా అల్లాహ్’ అనే ఒక్క పిలుపు సప్తాకాశాలపైన కొలువుదీరిన అల్లాహ్ సింహాసనం వరకు వెళుతుంది. సప్తాకాశాలన్నీ రోజేదార్ల పిలుపుతో మార్మోగుతాయి. రమజాన్ నెల సాంతం సప్తాకాశాలల్లో ఉన్న దైవదూతలంతా రోజేదార్ల మేలు కోసం, యోగక్షేమాల కోసం అల్లాహ్‌ను వేడుకుంటారు. రోజేదార్ల వేడుకోళ్లకు తథాస్తు పలకండని అల్లాహ్ దైవదూతలను పురమాయిస్తాడు. ఇంతటి మహత్తరమైన రమజాన్ వసంతం ముప్ఫై రోజుల పండువలా జరుపుకుంటున్నారు ముస్లిములు. ఇఫ్తార్ ఆనందాలు, సహెరీ శుభాలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒకరినొకరు క్షమించుకోవడం, క్షమ, దాతృత్వం వంటి శుభలక్షణాలు, సుగుణాలు పాలలా ప్రవహిస్తాయి. మది నిండా ప్రేమ, దయ, క్షమతో పొంగిపొర్లుతుంది. ఘడియ ఘడియను అల్లాహ్‌ను మెప్పించేందుకే ప్రయత్నాలన్నీ. ఆ పరమ ప్రభువును ప్రసన్నం చేసుకుంటే చాలు భూమ్యాకాశాల కంటే కూడా విశాలమైన స్వర్గలోకానికి అర్హత సాధించవచ్చన్నదే రోజేదార్ల ఆరాటం. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిర్మల మనస్సుతో అల్లాహ్ మెప్పుపొందడమే రోజేదర్ల తపనంతా. ప్రతివారూ తమతమ మనసు తరచి చూసుకుంటారు. మానవాళి సన్మార్గాన్ని పొందడమే రమజాన్ ఉద్దేశం. ఐహిక సుఖాల పిపాసను ఉపవాసం అంతమొందిస్తుంది. ఆధ్యాత్మిక వికాసం సొంతమవుతుంది. అపరిమిత ధనార్జన మనిషిని వినాశనంపాలు చేస్తే జకాత్, దానాలు ప్రేమభావాన్ని జనింపచేస్తాయి. మనసును జయించాలి.. మనసు చాలా విచిత్రమైనది. కోరికలు కళ్లెంలేని గుర్రాలు. మనసును జయించిన వారే ఆధ్యాత్మిక విజయాన్ని సాధిస్తారు. మనస్సును నిగ్రహించుకోవడంలో ఉపవాసం కీలకపాత్ర పోషిస్తుంది. లేవలేని సమయంలో లేచి అన్నపానీయాలు భుజించడం, తినే తాగే పగటి వేళలో పస్తులుండటం, హాయిగా పడుకునే వేళలో దైవం ముందు ఆరాధన చేయడం ఇవన్నీ మనోనిగ్రహానికి సాధనాలుగా పనిచేస్తాయి. ఈ నిగ్రహం లేకపోతే మనసు ప్రపంచ తళుకుబెళుకుల వెంట పరుగెడుతుంది. ఆకర్షణలకు బానిసవుతుంది. పతనానికి కారణమవుతుంది. అదే మనసును అదుపులో ఉంచుకుంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఆ పనే చేయిస్తుంది ఉపవాసదీక్ష. దైవభీతిని, ధర్మనిష్ఠను పెంపొందించడమే ఉపవాసం ఉద్దేశం అంటోంది ఖుర్ఆన్. రోజంతా ఆకలి దప్పులతో ఇఫ్తార్ వేళలో తన ముందు ఉన్న రుచికరమైన అన్నపానీయాలను ఇఫ్తార్ ఘడియకు క్షణం ముందు కూడా నోట్లో వేసుకోకపోవడానికి కారణం రోజేదార్లలో కలిగే పాపభీతి, వివేకవిచక్షణలే. అందుకే ముస్లిముల హృదయాలు నెలసాంతం ధర్మనిష్ఠతో, మంచి పనులతో పులకించిపోతారు. ప్రేమ, కరుణ, క్షమ, దానగుణం అనే సుగుణాలను పెంపొందించుకుంటారు.ఇఫ్తార్ చేసి నమాజ్ చేసుకుని ఇంటికొచ్చిన సగటు ముస్లిమ్ కాస్సేపు మేను వాల్చాడో లేదో ఇషా నమాజ్ కోసం మస్జిదు నుంచి పిలుపు వస్తుంది. ఆపై తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ వినడం జరుగుతుంది. సుమారు 2గంటల నిడివితో మస్జిదులో అల్లాహ్ ముందు నిలబడి దైవారాధన చేస్తాడు. నిద్ర ముంచుకొస్తున్నా అల్లాహ్ మెప్పు పొందేందుకు హాయి నిద్రను త్యాగం చేస్తాడు. ఈ వాతావరణం ఒక్క రమజాన్ లోనే మనకు కనిపిస్తుంది. రాత్రి దైవారాధనలో గడిపి రాత్రి చాలా పొద్దుపోయాక నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారు జామున మూడున్నర గంటలవుతుంది. వేళకాని వేళ నిద్రమత్తు వదలదు. ఆ వేళలో మస్జిద్ నుంచి మోగే సైరన్‌కు ఠంచనుగా లేస్తాడు ఉపవాసి. పడుకునే వేళలో బ్రష్ చేసి భోజనం చేయాలి. కేవలం పరిమిత సమయంలోగా భోజనం ముగించాలి. ఇలా తెల్లవారు జామున భోజనం చేయడాన్నే సహెరీ అంటారు. సహెరీ తరువాత నిద్రపోదామంటే కుదరదు. వెంటనే పెందలకడ చదివే ఫజర్ నమాజ్ కోసం అజాన్ వాణి పిలుస్తుంటుంది. వేళకాని వేళలో లేవడం, సహెరీ భుజించడం, సహెరీ వంటలు ఇరుగు పొరుగు వారికి పంపడం, నమాజ్ కోసం వెళ్లడం ఈ దృశ్యాలు కేవలం మనకు రమజాన్ నెలలోనే ప్రత్యేకం. ఈ ఆధ్యాత్మిక వాతావరణం కేవలం మనకు రమజాన్ నెలలోనే కనపడుతుంది. సహెరీ, ఇఫ్తార్, నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, జకాత్, సదకా దానాలతో ముస్లిముల మోములు మురిసిపోతుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పద్నాలుగు గంటల దాకా ఆకలిదప్పులతో గడుపుతాడు. మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దడమే రమజాన్ శిక్షణ ఉద్దేశం. ఇఫ్తార్ లో త్యాగభావం... ఇఫ్తార్‌లో నలువైపులా ప్రేమ, త్యాగభావం నిండిన వాతావరణమే కనిపిస్తుంది. స్వార్థం, ప్రలోభం అన్నీ ఇఫ్తార్‌లో చాప చుట్టేస్తాయి. ఉచ్ఛనీచాలు అస్సలే ఉండవు. పేదలు, ధనికులు ఇద్దరూ పక్కపక్కనే కూర్చునే ఆహ్లాదకరమైన వాతావరణం ఇఫ్తార్ వేళలో కనబడుతుంది. తమ పక్కన కూర్చున్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరూ పట్టించుకోరు. తన వద్ద ఉన్న తినుబండారాలు, ఆహార పదార్థాలను ఏమీలేని వ్యక్తికి ఎంతో ప్రేమతో అందించే అందమైన దృశ్యాలు రమజాన్‌లో కనపడతాయి. ఇఫ్తార్‌లో తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటారు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. వీలయినంత ఎక్కువగా ఎదుటివారికి ప్రాధాన్యమివ్వాలనే త్యాగభావం జనిస్తుంది. దాదాపు పధ్నాలుగు గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్థం చేసుకుని ఆదుకుంటాడు. ఆహారాన్ని పంచుకు తినే అద్భుతమైన అందమైన దృశ్యాలు రమజాన్ మాసంలో కనువిందు చేస్తాయి. చివరి పదిరోజులు కీలకం రమజాన్ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్ఆన్ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. చివరి పది రోజులూ ఏతేకాఫ్ అనే ప్రత్యేక ఆరాధనను పాటిస్తారు. అల్ విదా రమజాన్.. రమజాన్ వసంతానికి బాధతో, ఆర్ద్రతతో వీడ్కోలు పలుకుతారు. దిల్ దిల్ రమజాన్ అని పాడుకున్న ముస్లిములు నెలరోజుల అతిథిని ఎంతో గౌరవ ప్రపత్తులతో చూసుకున్న ముస్లిములు 30 రోజుల ఉపవాసాలు ముగింపు దశకు చేరుకునే సరికి బాధతో వీడ్కోలు పలుకుతారు. అల్ విదా.. అల్ విదా.. కారుణ్యాన్ని కురిపించిన వసంతమా అల్ విదా అని ఆర్ద్రతతో పాడుకుంటారు. ప్రేమను కుండపోతలా కురిపింపచేసిన మాసమా నీకు మా వీడ్కోలు అని పాడుకుంటారు. షవ్వాల్ నెలవంక కనపడగానే ఈదుల్ ఫిత్ర్ రమజాన్ పండుగను ఆనందోహాత్సాహలతో జరుపుకుంటారు. ఈద్ రోజు ముస్లిముల çహృదయాల్లో, చేతల్లో కారుణ్య ఛాయలు రెట్టింపవుతాయి. అల్లాహ్ చూపిన కరుణా కటాక్షాలతో నెలరోజుల ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ముప్ఫై రోజుల పాటు దేవుని సమక్షంలో తరావీహ్ నమాజు చేసినందుకుగాను పేదలకు ఫిత్రా దానం చేస్తారు. పండుగ నమాజ్‌కు వెళ్లేముందు ఫిత్రా దానం చేసి పేదలకు చేయూతనిస్తారు. ఈద్గాహ్కు వెళ్లి ఈద్ నమాజ్ చేస్తారు. అందరి ముఖాల్లో చిరునవ్వు తొణికిసలాడేలా చేయడమే ఈదుల్ ఫిత్ర్ ఉద్దేశం. ఈద్ రోజు చిన్నా పెద్దా, ఆడా మగా అందరిలోనూ అనంత సంతోషంతో హృదయాలు ఓలలాడుతాయి. వచ్చే ఏడాది వరకూ ఇదే స్ఫూర్తిని కొనసాగించేవారే నిజమైన సౌభాగ్యవంతులు. అప్పుడే నెలరోజుల రమజాన్ శిక్షణకు సార్థకత. – ముహమ్మద్ ముజాహిద్ -
ఫిత్రా పేదల పెన్నిధి
చూస్తుండగానే పవిత్ర రమజాన్ నెల గడిచిపోతోంది. ఇంకా కొన్నిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈనెలలో ముస్లిములు చేయాల్సిన విధి రోజాలు పాటిస్తూనే, సదఖ, ఖైరాత్, జకాత్, ఫిత్రాలు చెల్లించడం. రమజాన్‌లో ఆచరించే అనేక ఆరాధనల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్నపదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ మాసాంతంలో విధిగా చెల్లించవలసిన దానం. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుండే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త (స ) ఆదేశించారు.ఆ కాలంలో ప్రజలు ముఖ్యాహారంగా వినియోగించే పదార్థాలనే పరిగణనలోకి తీసుకొని ఫిత్రాలు చెల్లించేవారు. హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (ర ) ఇలాచెప్పారు–: ‘ప్రవక్తవారి కాలంలో మేము ఈదుల్ ఫిత్ర్ (పండుగ) దానంగా ఒక ’సా’ పరిమాణమంత పదార్ధాలను ఇచ్చే వాళ్ళం. ఆ కాలంలో యవలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, జున్ను తదితరాలు ముఖ్య ఆహార పదార్థాలుగా ఉండేవి.‘ ’సా’ అంటే పావుతక్కువ రెండు శేర్లు.. మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ రూపంలో అయినా ఫిత్రాలు చెల్లించవచ్చు. ఫిత్రాలవల్ల రెండురకాల లాభాలున్నాయి. ఒకటి –రోజాలను ఎంత నిష్టగా పాటించినా, మానవ సహజ బలహీనత వల్ల ఏవో చిన్నచిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారమే ఈ ఫిత్రాలు. వీటివల్ల రోజాలు పవిత్రతను, పరిపూర్ణతను సంతరించుకొని స్వీకారభాగ్యానికి నోచుకుంటాయి. రెండు–, ఫిత్రాలవల్ల సమాజంలోని పేద , బలహీనవర్గాలకు కాస్తంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారు కూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోగలుగుతారు. ఈ కారణంగానే ప్రవక్త మహనీయులు ఫిత్రాదానాన్ని ’తూమతుల్లిల్ మసాకీన్ ’అన్నారు. అంటే ’దీనులు, నిరుపేదల భృతి’ అని అర్థం.అందుకే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాలను ఉపవాసులకే పరిమితంచేయకుండా, ఈపరిధిని విస్తరించారు. అంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా అందరూ ఫిత్రా చెల్లించాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే, వారందరి తరఫున కుటుంబ యజమాని ఫిత్రా చెల్లించాలి. పండుగ నమాజు కంటే ముందు జన్మించిన శిశువు తరఫున కూడా తల్లిదండ్రులు ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందే ఈ బాధ్యత నెరవేర్చుకోవాలి. కనీసం మూడు నాలుగు రోజులముందు చెల్లిస్తే లబ్ధిదారులు పండుగ సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అందరినీ భాగస్వాములను చేయడమే ఉద్దేశ్యం. ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏరూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు.కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్త శుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ, ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మానవీయ విలువల వికాసానికి కృషిచేయాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతోకొంత ప్రయోజనం చేకూర్చి, తమపరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం మరేమీ ఉండదు. అల్లాహ్ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. దివినుండి భువికి.. దెవప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం, ‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో ‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్ధం. ఈ రాత్రినే ఖురాన్ అవతరణ మొదటిసారిగా ప్రారంభమైంది. ఈ రాత్రి దైవదూతలు దివినుండి భువికి దిగివస్తారు. ఆరాధనలు చేసేవారికోసం వారు మన్నింపు ప్రార్ధనలు చేస్తారు. భక్తులు చేసే అర్ధింపులు, వేడుకోళ్ళకు తథాస్తు పలుకుతారు.ముస్లిములు, ముస్లిమేతరులు అన్న భేదభావం లేకుండా సమాజంలోని పేదసాదలపట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవలసిన అవసరాన్ని రమజాన్ గుర్తుచేస్తుంది. అనవసర భోగవిలాసాలకు తమ ధనం వృధా చేయకుండా అగత్యపరులను ఆదుకోవాల్సిన అవసరాన్ని దివ్య ఖురాన్ నొక్కి చెబుతుంది. అందుకే ప్రవక్తవారు రమజాన్‌ను ‘సానుభూతుల నెల’ అన్నారు. ఉపవాసం పాటించడం వల్ల పేదవాళ్ళ ఆకలిబాధలు అర్ధమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలిబాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వజూతో పాప ప్రక్షాళన
మదనపల్లె సిటీ: రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ముస్లింలు మసీదులకు వెళ్లి రోజుకు అయిదు సార్లు ప్రార్థనలు చేస్తారు. ముందుగా వీరంతా వజూ పాటించాల్సి ఉంది. ఇస్లాంలో ‘వజూ’ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వజూ లేనిదే నమాజు చెల్లదు. ఒక్క నమాజుకే కాదు పవిత్ర ఖురాన్ గ్రంథం చేతిలో పట్టుకోవాలన్నా, పఠించాలన్నా, గుసూల్ చేయాలన్నా వజూ తప్పనిసరి. వజూలో నాలుగు ఫరజ్లు (అల్లా ఆజ్ఞలు) దాగి ఉన్నాయి. ఈ అంశాన్ని అల్లా పవిత్ర ఖురాన్‌లోని సూరే మాయిదా (ఆయాత్–6)లో సెలవిచ్చారు. వజూ చేసిన వారి అవయవాలు వజూ నీళ్లు ప్రవహించిన చోట ప్రళయకాలంలో ఆ మెరుపు ఆధారంగానే మహమ్మద్ ప్రవక్త తన ఉమ్మతీయులను గుర్తిస్తారనేది పవిత్ర ఖురాన్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రళయకాలపు దాహంతో కొట్టుమిట్టాడే తన ఉమ్మతీయులకు మహమ్మద్ ప్రవక్త తన స్వహస్తాలతో ఆబే కౌసర్ జలం తాపిస్తారు. ముస్లింలు నమాజు రోజుకు ఐదు పూటలా పాటిస్తారు. దీని కోసం ఐదు సార్లు వజూ చేయాల్సి ఉంటుంది. వజూలో ఆయా అవయవాల ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయని హఫీజ్ సైపుల్లాసాహెబ్ తెలిపారు. వజూ చేసే విధానం.. ♦ రెండు చేతులను మణికట్టు దాకా మూడు సార్లు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. ♦ నోట్లోకి నీళ్లు తీసుకుని బాగా కదిలించి పుక్కలించాలి. ♦ ముక్కపుటల్లోకి నీళ్లు ఎక్కించి ముక్కును శుభ్రం చేసుకోవాలి. ♦ దోసిలితో నీళ్లు తీసుకుని ముఖం సంపూర్ణంగా తడిసేలా కడుక్కోవాలి. ♦ మోచేతుల దాకా నీరు పోనిచ్చి కుడిచేతిని ఎడమచేతితోను, ఎడమచేతిని కుడిచేతితోనూ మోచేతుల దాకా కడుక్కోవాల్సి ఉంటుంది. ♦ దోసిలితో కొద్ది నీళ్లు తీసుకుని తలవెంట్రుకలు మొత్తం తాకుతూ చేతులను మెడపైభాగం నుంచి పోనిచ్చి బాగా రుద్దుతూ అదే చేతులతో చెవులను శుభ్రపరచుకోవాలి. ఈ విధానాన్ని మసా చేయడం అంటారు. ♦ పాదాలను అంకిల్స్ వరకు సంపూ ర్ణంగా, శుభ్రంగా కడగాలి. ♦ వజూను బిస్మిల్లా అని ప్రారంభించాలి. ప్రతి ప్రక్రియను మూడు సార్లు చొప్పున చేయాలి. వజూ కంటే ముందు మిస్వాక్ కర్రతో దంతాలను శుభ్రపరచుకోవాలి. -
జకాత్, ఫిత్ర్.. పేదల హక్కు
కంభం : ఇస్లాం ధర్మం 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. వీటిలో నాలుగో అంశం జకాత్.. ఇది ధనానికి సంబందించిన ఆరాధన. దీనిని నెరవేర్చడానికి రంజాన్ మాసం ఎంతో అనువైనది. ఏడాది పొడవునా తమవద్ద నిల్వ ఉన్న ధనంలో నుంచి నిర్ణీత ధనాన్ని నిరుపేదల కోసం వెచ్చించి, ఆ ధనాన్ని శుద్ధి పరుచుకోవడమే ‘జకాత్’ ఉద్దేశం. దీనివలన కనికరం, త్యాగం, సానుభూతి జనిస్తాయి. ‘నమాజ్‌ను స్థాపించండి, జకాత్‌ను ఇవ్వండి, ఇంకా రుకూ చేసే వారితో రుకూ చేయండి’ అని దివ్య ఖురాన్లో పేర్కొనబడింది. ‘మేము మీలో కొంత మందికి మీ అవసరాల కంటే ఎక్కువ ధనాన్ని ప్రాప్తం చేసినప్పుడు ఆ ధనం నుంచి కొంత భాగాన్ని ‘జకాత్’ రూపంలో నిరుపేదలకు ఇవ్వండి. మీరు అలా చెయ్యకపోతే ముస్లింలు కాజాలరు. జకాత్ చెల్లించే ఆర్థిక స్థోమత కలవారు ప్రతి సంవత్సరం నూటికి రెండున్నర శాతం ప్రకారం క్రమం తప్పకుండా తమ ధనమునుండి జకాత్ చెల్లించాలి. జకాత్ ధనాన్ని నిరుపేదలు, అనాధలు, లేమికి గురైన బందు మిత్రులు, వితంతువులు, ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారికి విశాల హృదయంతో సాయం అందించాలి. అనాథ బాలలకు కూడు, గుడ్డ, విద్య సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించడం సంపన్నుల బాధ్యత. ఇలాంటి వారికి అల్లాహ్ పరలోక స్వర్గవనాల్లో ప్రవేశం కల్పిస్తాడు’ అని మహమ్మద్ ప్రవక్త సందేశం అందజేశారు. ఏ సంపదలో నుంచైతే జకాత్ తీయబడక, ఆ ధనంలోనే కలిసి ఉంటుందో.. అది ఆ ధనాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్రళయ దినాన ఆ సంపద విషసర్పంగా మారి అతని కంఠాన్ని చుట్టుకుని ‘నేను నీవు కూడబెట్టిన నిధిని’ అంటూ అతని దవడల్ని గట్టిగా కరుచుకుంటుంది అని ప్రవక్త మహమ్మద్ పేర్కొన్నారు. ఫిత్ర్ రంజాన్ మాసంలో ఉపవాసాలను పూర్తిచేసిన శుభ సందర్భంగా తమ ఉపవాసాలలో పొరపాటుగా దొర్లిన లోటుపాట్లను తొలగించడానికి ‘ఫిత్ర్ దానం’ విధించబడుతుంది. దీనివల్ల ఎంతో మంది నిరుపేదలు, అభాగ్యులకు ఆహార పదార్థాల ఏర్పాటు జరుగుతుంది. ఫిత్ర్ అనేది ‘ఇఫ్తార్’ అనే పదం నుంచి వచ్చింది. ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్ అంటాము. ఫిత్ర్ అనేది పేదల హక్కు దీనిని ప్రతి ఒక్కరి తరఫున చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా చెల్లించాలి. ‘ఫిత్ర్ దానం’ ఒక వ్యక్తి తరఫున దాదాపు రెండున్నర కిలోల గోధుమలు గానీ దానికి సరిపడేంత ధాన్యం గానీ, దుస్తులు గానీ, డబ్బు గాని ఇవ్వవచ్చు. దీనిని రంజాన్ పండుగకు కనీసం ఒకవారం ముందుగా చెల్లిస్తే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు కూడా అందరితోపాటు కలిసి సంతోషంగా పండుగ చేసుకోవడానికి వీలవుతుంది. జకాత్ ఎవరు చెల్లించాలి మతి స్థిమితం కలిగి యుక్తవయసు గల ముస్లింలు రుణగ్రస్తుడు కాకుండా ఉండి, తన జీవిత అవసరాలకు మించిన ధనం ఒక సంవత్సర కాలం ఆధీనం కలిగి ఉంటే అతను జకాత్ చెల్లించాలి. జకాత్ ఎవరికి చెల్లించాలి అగత్యపరులకు, నిరుపేదలకు, జకాత్లు చేసేవారికి, ఇస్లాం స్వీకరించి ఆర్థిక ఇబ్బందులకు గురైన వారికి, బానిసలను విముక్తులుగా చేసేందుకు, రుణగ్రస్తుల్ని రుణ విముక్తులుగా చేయడానికి, దైవ ధర్మోన్నతి మార్గంలో కృషి కోసం, అలాగే బాటసారులకు జకాత్ డబ్బును ఖర్చు చేయాలని దివ్య ఖురాన్ ఆదేశిస్తోంది. జకాత్ ఎవరికి చెల్లించకూడదు తల్లిదండ్రులకు, తాత, ముత్తాతలకు, సంతానానికి, మనవళ్లకు, మనవరాళ్లకు, ముస్లిమేతరులకు, భర్తకు, భార్యకు, జకాత్ చెల్లించే శక్తి గల వారికి, సాదాత్ వంశీయులకు(ఫాతిమా(రజి) గారికి పుట్టిన సంతానానికి) జకాత్ డబ్బు ఇవ్వకూడదు. జకాత్ ఎంత చెల్లించాలి 1.యాభై రెండున్నర తులాల వెండి లేదా ఏడున్నర తులాల బంగారం గల వ్యక్తి సంవత్సరాంతం ఆ సొమ్ముపై రెండున్నర శాతం లేదా 40వ వంతు నగదు లేదా వస్తు రూపంలో చెల్లించాలి. 2. చలామణిలో ఉన్న కరెన్సీ ధనంపై నూటికి రెండున్నర రుపాయలు జకాత్ చెల్లించాలి. 3.పైన తెలిపిన బంగారం లేదా వెండికి సమానమైన ధనం ఉన్నా జకాత్ చెల్లించాలి. 4.వ్యాపారంలో ఉన్న నిల్వ, రొక్కంపై కూడా జకాత్ చెల్లించాలి. 5.వర్షం వల్ల పండే ఫలాలు, ధాన్యాల్లో 10వ వంతు, నీరు తోడి పండించే వాటిల్లో 20వ వంతు ‘ఉష్ర్’గా చెల్లించాలి. -
ఆష్తో విందు భలే పసందు
నెల్లూరు(బృందావనం): రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలను విరమించే సాయంసంధ్య వేళలో తొలుత అల్పాహారాన్ని సంప్రదాయం ప్రకారం తీసుకుంటారు. ఆ అల్పాహారంలో ఎండుఫలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే నెల్లూరులో మాత్రం ఒక ప్రత్యేక వంటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నో పోషక విలువలు కలిగి తక్షణశక్తిని అందించి ఉపవాసంతో మందగించిన జీర్ణవ్యవస్థకు తోడ్పాటు అందించే ఆష్తో సింహపురీయులకు ఎంతో అనుబంధం ఉంది. శతాబ్ధాల క్రితం పరిచయమైన ఆష్ వంటకంతో ఉపవాస దీక్ష విరమణను పాటించడం వారి ఆధ్యాత్మిక జీవనంతో పెనవేసుకుంది. హైదరాబాద్‌లో హలీం ఎంత ప్రసిద్ధో నెల్లూరులో ఆష్ కూడా అంతే ప్రసిద్ధి చెందిందనడంలో అతిశయోక్తి లేదు. ఇఫ్తార్‌లో సేవించే ఈ బియ్యపు గంజిని అన్ని మసీదుల వద్ద తయారు చేస్తారు. తయారీ ఇలా అధిక పోషక విలువలు కలిగిన ‘ఆష్’ను మసీదుల వద్ద ప్రత్యేక వంటమాస్టర్లు చేస్తారు. సుమారు 500 మంది నుంచి వెయ్యిమంది కోసం 20 కిలోల బొంబాయ్ రవ్వకు రెండు కిలోల మటన్, మూడు కిలోల పెసరపప్పు, మూడు కిలోల చొప్పున టమోటా, నూనె, ఉల్లిపాయలతో పాటు తగినంత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, ధనియాలు, మిర్చి, పసుపుపొడి, పట్టాలవంగాలు, ఏలకులు తదితర సుగంధద్రవ్యాలను వేస్తారు. సుమారు నాలుగు గంటల పాటు కట్టెల పొయ్యిపై ఉడికించి పలుచగా ద్రవపదార్థంగా తయారు చేస్తారు. అల్లాహ్ ప్రసాదంగా పంపిణీ ధనికులు, పేదవారనే భావం లేకుండా ఈ ఆష్‌ను అల్లాహ్ ప్రసాదంగా అందరికీ పంపిణీ చేస్తారు. 20 కిలోల బొంబాయ్ రవ్వతో ఆష్‌ను చేసేందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని వంటమాస్టర్లు తెలిపారు. తక్షణ శక్తినిచ్చే ఆష్‌ను ముస్లింలు ఎంతో ఇష్టపడతారు. కొన్ని మసీదుల నిర్వాహకులు ఆష్ తయారీ ఖర్చును భరిస్తారు. ఈ పంపిణీ నెలరోజుల పాటు నిరంతరాయంగా కొనసాగడం విశేషం. జీర్ణవ్యవస్థకు తోడ్పాటు ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆష్ జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపకరిస్తుంది. ఉపవాసదీక్షలో ఉన్నవారు ఆష్ తీసుకోవడం ద్వారా తదుపరి తీసుకునే ఆహారపదార్థాలకు, జీర్ణవ్యవస్థకు ఎంతోమేలు కలిగిస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.– షేక్ బాబు శరీరానికి చల్లదనం కలిగిస్తుంది ఆష్‌ను తీసుకోవడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది. దీన్ని అల్లాహ్ ప్రసాదంగా భావిస్తాం. ఎంతో పవిత్రంగా చూస్తాం. ఉపవాస దీక్షతో ఆష్కు విడలేని బంధం ఉంది. తరతరాల నుంచి నెల్లూరు జిల్లాలో ఆష్‌ను సేవించడం సంప్రదాయంగా మారింది.– షేక్ జమీర్ అన్సారీ, మౌజన్, యూసుఫియా మసీదు, కోటమిట్ట -
రక్తదానం కోసం.. రంజాన్ దీక్షను పక్కనబెట్టాడు
సాక్షి, పట్నా: మతం కంటే మానవత్వం గొప్పదని మరోసారి రుజువైంది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తాను చేస్తోన్న ఉపవాస దీక్షను పక్కనబెట్టాడు ఓ మహమ్మదీయుడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా సదార్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు రాజేశ్‌కుమార్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడిని తీసుకువచ్చాడు అతని తండ్రి. తలసేమియా వ్యాధి కారణంగా బాలుడికి అత్యవసరంగా రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పడంతో ఆ తండ్రి ప్రతీ బ్లండ్ బ్యాంకును సంప్రదించాడు. అయినా ఫలితం లేకపోయింది. ప్రాణాలతో పోరాడుతున్న రాజేశ్ దీనగాథ విని జావెద్ ఆలం అనే వ్యక్తి రక్తం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అప్పటికే జావెద్ రంజాన్ దీక్షలో ఉన్నాడు. సాధారణంగా రంజాన్ ఉపవాసంలో ఉన్నవారు ఆ రోజు దీక్ష ముగిసేదాకా మంచినీళ్లయినా ముట్టరు. కానీ, రక్తదానం తరువాత జావెద్ పళ్లరసాలు, కొన్ని పండ్లను తీసుకున్నాడు. బాబు ప్రాణాలు కాపాడేందుకు దీక్ష భగ్నం చేశాడని తెలిసి.. స్నేహితులు జావెద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తలసేమియా వ్యాధి ఉన్న వారికి మూడు, నాలుగు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. -
పవిత్ర దీక్షకు పుణ్యబలం
ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మికమైన శక్తి జాగృతమవుతుంది. భౌతికమైన శక్తి పునరుజ్జీవం అవుతుంది. ప్రాకృతిక శక్తి తోడు నిలుస్తుంది. దైవిక శక్తి అభయమిస్తుంది. ఉపవాసం అనే ఆరాధానను ముగించి తీసుకునే ఆహారం సత్తువ ఇచ్చేదిలా ఉండటానికి ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది అలాంటి ఆహారం. పవిత్రమైన ఉపవాసాలు ఆచరించండి. పుణ్యబలం ఇచ్చే ఆహారాన్ని స్వీకరించండి. ఖర్జూర సేవనం ప్రవక్త సంప్రదాయం రమజాన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖర్జూరం. అందరూ ఇష్టపడే పండు ఖర్జూరం అంటే అతిశయోక్తి కాదు. దైవప్రవక్త ముహమ్మద్ (స) ఖర్జూరాలను చాలా ప్రీతిగా ఆరగించేవారు. మనిషి సమస్త అవసరాలు తీర్చే సామర్థ్యం గల పోషకాలు ఖర్జూరంలో ఉన్నాయి. మనిషికి ఇతర ఏ ఆహారం దొరక్కపోయినా ఒక్క ఖర్జూరం మాత్రమే దొరికినా సంపూర్ణ ఆహారం లభించినట్లే. ప్రస్తుత పరిశోధన ల ప్రకారం మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, సంపూర్ణ శక్తిసామర్థ్యాలు కలవాడుగా ఉండడానికి అతడి ఆహారంలో ఎన్ని క్యాలరీలు అవసరమో అవన్నీ ఖర్జూరంలో ఉన్నాయి. ఈ కారణంగానే ఆ కాలంలో సైన్యాలు ఎడారి ప్రాంతాల్లో చాలాకాలం పాటు బస చేయాల్సి వచ్చినప్పుడు, మరే ఆహారం సమకూరే అవకాశం లేనప్పుడు ఖర్జూరం నిల్వ చేసుకొని నెలల తరబడి ఖర్జూరంతోనే తమ ఆహార అవసరాలు తీర్చుకునేవి. ఖర్జూరం మంచి పోషక విలువలు కలిగిన సంపూర్ణ ఆహారం. అలసటను, నీరసాన్ని దూరం చేసి తక్షణ శక్తినిస్తుంది. ఖర్జూరం ఇంత పౌష్టికాహారం కాబట్టే, ఇందులో ఇన్ని శుభాలు ఉండబట్టే ముహమ్మద్ ప్రవక్త (స) శ్రేష్ఠమైన సెహరీ (ఉపవాసం పాటించేవారు తెల్లవారుజామున సేవించే ఆహారం) ఖర్జూరం అని చెప్పారు. సెహరీలో ఖర్జూరం తినడం వల్ల ఉపవాసకులలో శక్తిసామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. తద్వారా పగటివేళ ఇతరత్రా పనులు చేసుకోవడానికి శక్తి లభిస్తుంది. అలాగే ఉపవాస విరమణకు కూడా ఖర్జూరమే శుభప్రదం. ప్రవక్త మహనీయులు ఖర్జూరంతోనే రోజా విరమించమని ఉపదేశించారు. ఖర్జూరంలో శుభం ఉందని సెలవిచ్చారు. ఒకవేళ ఖర్జూరం దొరకని పక్షంలో నీటితోనే ఉపవాసం విరమించాలి. అందుకే రోజువారీ ఆహారంలో ఖర్జూరాలు చేర్చుకోవాలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు కనీసం మూడు ఖర్జూరాలు తిన్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే రమజాన్ మాసంలో ముస్లింలు దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇఫ్తార్ (ఉపవాస విరమణ) సమయంలో ఖర్జూరం తీసుకోవడానికి ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు. రమజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో వీటిని తీసుకుంటారు... ఖర్జూరం హల్వా కావలసినవి:ఖర్జూరాలు – అర కేజీపాలు – అర లీటరుపంచదార – అర కిలోబాదం పప్పులు – 30జీడి పప్పులు – 20కిస్మిస్ – 20ఏలకుల పొడి – 2 టీ స్పూన్లునెయ్యి – 50 గ్రా. తయారీ: ముందుగా బాదం పప్పు, జీడి పప్పు, కిస్మిస్లను నేతిలో విడివిడిగా వేయించి పక్కన ఉంచుకోవాలి ఠి గింజలు తీసిన ఖర్జూరాలను పాలలో వేసి స్టౌ మీద ఉంచి, సన్న మంట మీద ఉడికించాలి ఠి ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి వేసి మూత పెట్టాలి ఠి మిశ్రమం అడుగంటి పోకుండా గరిటెతో తిప్పుతుండాలి ఠి కొద్దిగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేయాలి ఠి నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలిపి దించేయాలి ఠి కమ్మటి హల్వా రెడీ అయినట్లే. దహీ వడ కావలసినవి:మినప్పప్పు – 150 గ్రా.పెరుగు – 400 గ్రా.ఉప్పు – తగినంతపచ్చి మిర్చి – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)పోపు కోసంఆవాలు – టీ స్పూనుజీలకర్ర – టీ స్పూను పచ్చి సెనగ పప్పు – టీ స్పూనుఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి) కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టాలి ఠి మరుసటి రోజు ఉదయం మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు (నీళ్లు ఎక్కువైతే గారెలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి) జత చేసి గ్రైండ్ చేయాలి ఠి పచ్చి మిర్చి, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ఠి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక గారెలు ఒత్తుకొని నూనెలో వేసి వేయించి తీసేయాలి ఠి ఇలా మొత్తం గారెలు తయారుచేసుకుని పక్కన ఉంచాలి ఠి ఒక గిన్నెలో పెరుగు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి చిక్కగా గిలకొట్టి, ఉప్పు జత చే సి పక్కన ఉంచాలి ఠి బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి పెరుగులో వేసి కలపాలి ఠి తయారుచేసి ఉంచుకున్న గారెలను పెరుగులో వేసి కొద్దిసేపు నానిన తరవాత కొత్తిమీరతో అలంకరించి అందించాలి. చన్నా మసాలా కావలసినవి:సెనగలు – పావు కిలోమిరప కారం – అర టీ స్పూనుఒరుగుల పొడి – అర టీ స్పూనుఅల్లం పొడి – అర టీ స్పూనుజీలకర్ర పొడి – ఒక టీ స్పూనుధనియాల పొడి – ఒక టీ స్పూను జీలకర్ర పొడి – ఒక టీ స్పూనుఇంగువ – చిటికెడుపచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూనుపుదీనా తరుగు – రెండు టీ స్పూన్లుఉప్పు – అర టీ స్పూనుఉల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లునూనె – 2 టేబుల్ స్పూన్లు నీళ్లు – 200 మి.లీ. తయారీ: సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ఠి మరుసటిరోజు సెనగలలో నీళ్లు ఒంపి, శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి కుకర్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చాక మంట తగ్గించి, పది నిముషాల పాటు ఉడికించి దింపేయాలి ఠి విజిల్, కుకర్ మూత తీసి, మరోమారు స్టౌ మీద పెద్ద మంట మీద ఉంచి, నీళ్లు ఇగిరేవరకు కలుపుతుండాలి ఠి మరొక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, కాగాక ఇంగువ, జీలకర్ర పొడి వేసి కలిపాక, పైన చెప్పిన పొడులన్నీ వేసి కలపాలి ఠి అడుగు అంటకుండా కొద్దిగా నీళ్లు పోసి ఒక నిమిషం పాటు కలపాలి ఠి ఉడికించిన సెనగలను అందులో వేసి, పుదీనా, ఉల్లి తరుగు జత చేసి కలపాలి ఠి అంతే... ఘుమఘుమలాడే చన్నా మసాలా రెడీ ఠి దీనికి నిమ్మరసం కూడా జోడిస్తే మరింత రుచిగా ఉంటుంది. ప్రయత్నించండి. ఇఫ్తార్ కి దాల్ కావలసినవి:పచ్చి సెనగ పప్పు – 150 గ్రా.నీళ్లు – 350. మి.లీ.ఉప్పు – సరిపడానిమ్మ రసం – ఒక టీ స్పూన్మిరియాల పొడి – కొద్దిగా కొత్తిమీర – కొద్దిగా తయారీ: పచ్చి సెనగపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ఠి బాగా మెత్తపడ్డాక ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి దింపేయాలి ఠి కొత్తిమీరతో అలంకరించి అందించాలి. ఉపవాసాల రోజుల్లో రోజా విరమణ సమయంలో ఈ పదార్థాలను తీసుకుంటారు మటన్ హలీమ్ కావలసినవి:కంది పప్పు – అర కప్పుఎర్ర కంది పప్పు (మసూర్ దాల్) – అర కప్పుపెసర పప్పు – అర కప్పుమినప్పప్పు – అర కప్పుసెనగలు – అర కప్పుటొమాటో తరుగు – ఒక కప్పుగరం మసాలా – ఒక టీ స్పూనుమిరియాల పొడి – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – రెండు కప్పులుఉప్పు – తగినంతజీడి పప్పు – 50 గ్రా.పసుపు – ఒక టీ స్పూనుమటన్ – అర కేజీమిరప కారం – 4 టీ స్పూన్లు పెరుగు – ఒక కప్పుకొత్తిమీర తరుగు – అర కప్పుపుదీనా తరుగు – అర కప్పుగోధుమ రవ్వ – పావు కేజీ అల్లం వెల్లుల్లి ముద్ద – సరిపడా తయారీ: పైన పేర్కొన్న పప్పులను విడివిడిగా నూనె లేకుండా బాణలిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఠి గోధుమ రవ్వను కూడా దోరగా వేయించి పక్కన ఉంచాలి ఠి వేయించిన పప్పులను, గోధుమ రవ్వను ఒక పెద్ద పాత్రలో వేసి, రెండు లీటర్ల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టి సుమారు అరగంటసేపు ఉడికించి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) పక్కన ఉంచాలి ఠి మరొక కడాయిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ఠి అదే నూనెలో జీడి పప్పు వేసి మరోమారు వేయించి దింపేయాలి ఠి కుకర్‌లో రెండు టీ స్పూన్ల నూనె పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూడు నిమిషాల పాటు బాగా కలపాలి ఠి పసుపు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి ఉడికించాలి ఠి మటన్, అర టీ స్పూను ఉప్పు, నాలుగు టీ స్పూన్ల మిరప కారం వేసి బాగా కలపాలి ఠి అర కప్పు పెరుగు వేసి కలిపి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి ఠి మూత తీసి మరోమారు స్టౌ మీద పెట్టి, నీరు ఇంకిపోయేవరకు కలిపి దించేయాలి ఠి బాగా చల్లారాక పప్పు గుత్తితో మెత్తగా అయ్యేవరకు బాగా మెదపాలి ఠి ఉడికించి ఉంచుకున్న పప్పులను మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి ఠి ఉడికించుకున్న మటన్, రెండు కప్పుల నీళ్లు, సగం పుదీనా తరుగు, సగం కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, నూనె, నెయ్యి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు (ఒక కప్పు) జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, సన్నని మంట మీద సుమారు 20 నిమిషాలు ఉడికించాలి ఠి అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలిపి దించేయాలి ఠి జీడి పప్పు, నెయ్యి, ఒక కప్పు ఉల్లి తరుగు, పుదీనా, కొత్తిమీరలతో అలంకరించి మటన్ హలీం అందించాలి. మటన్ మందీ కావలసినవి: మటన్ – 750 గ్రా.బాస్మతి బియ్యం – 500 గ్రా.జీడి పప్పు – 50 గ్రా.బాదం పప్పులు – 50 గ్రా.నెయ్యి – 4 టేబుల్ స్పూన్లునూనె – తగినంతపచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు పసుపు – అర టీ స్పూనుమిరప కారం – ఒక టీ స్పూనుఉప్పు – తగినంతశొంఠి పొడి – ఒక టీ స్పూనులవంగాలు – 2దాల్చిన చెక్క – మూడు చిన్న ముక్కలుకొత్తిమీర, పుదీనా – తగినంతఎండు నిమ్మ చెక్కలు – 2మందీ స్పైస్ కోసంధనియాలు – ఒక టేబుల్ స్పూనుజీలకర్ర – ఒక టేబుల్ స్పూనులవంగాలు – 4దాల్చిన చెక్క – చిన్న ముక్కఏలకులు – 4మిరియాలు – అర టేబుల్ స్పూనుజాజికాయ – చిన్న ముక్కశొంఠి – కొద్దిగా బిరియానీ ఆకు – 2 (ఈ పదార్థాలన్నీటినీ పొడి చేసి ఉంచుకోవాలి) తయారీ: మటన్‌ను శుభ్రంగా కడిగి తడి లేకుండా నీళ్లు శుభ్రంగా తీసేయాలి ఠి మటన్‌లో ఒక టేబుల్ స్పూను మందీ స్పైస్, ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు, అర టీ స్పూను పసుపు... వీటిని మటన్‌కు పట్టించి, మూడు గంటలపాటు పక్కన ఉంచాలి ఠి మూడు గంటల తరవాత ఒక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉల్లి తరుగు, దాల్చిన చెక్క ముక్కలు, రెండు లవంగాలు వేసి నిమిషం పాటు వేయించాలి ఠి మసాలా పట్టించిన మటన్ ముక్కలు వేసి మరో నిమిషం పాటు కలియతిప్పాలి ఠి ఒకటిన్నర టీ స్పూన్ల మిరప కారం, ఒక టీ స్పూను శొంఠి పొడి వేసి బాగా కలిపి, లీటరున్నర నీళ్లు, అర టేబుల్ స్పూను మందీ స్పైస్, రెండున్నర టీ స్పూన్ల ఉప్పు, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి ఠి ఎండు నిమ్మ చెక్కలు వేసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి ఠి కొద్దిగా పొంగు వచ్చిన తరవాత మూత తీసి, మటన్ ముక్కలు మెత్తగా అయ్యేవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఠి మటన్ ముక్కలు మెత్తగా అయిన తరవాత, ముక్కలు తీసేయాలి ఠి అరగంట నానబెట్టిన బాస్మతి బియ్యం మరుగుతున్న నీటిలో వేసి, సన్నటి మంట మీద ఉడికించి దింపేయాలి ఠి ఉడికిన అన్నం మీద మటన్ ముక్కలు పరిచి, మధ్యలో స్టీలు గిన్నె పెట్టి, అందులో కాలుతున్న బొగ్గు ముక్క ఉంచి, దాని మీద ఒక టీ స్పూను నెయ్యి పోయాలి ఠి పొగరావడం మొదలైన వెంటనే మూత పెట్టి ఐదు నిమిషాల తరవాత మూత తీసేసి, స్టీలు గిన్నె కూడా తీసేయాలి ఠి మటన్ మందీ రెడీ అయినట్లే ఠి ప్లేటులో వడ్డించి, వేయించి ఉంచిన బాదం పప్పులు, జీడి పప్పులతో పాటు, కొత్తిమీర, పుదీనాలతో అలంకరించి అందించాలి. -
ఆహా..హలీమ్..
చార్మినార్: రంజాన్ మాసం వస్తుందంటే ఆహార ప్రియుల అందరిమదిలోనూ ఒక్కటే ఆలోచన... ఈసారి పాతబస్తీలో తయారయ్యే హలీమ్‌లో ఎన్ని రుచులు వస్తున్నాయని. అంతేకాదు.. ఈ మాసంలో అందుబాటులో ఉంచే ప్రత్యేక వంటకాల గురించి ఆరా తీస్తుంటారు. ముస్లింలు ఉపవాస దీక్ష అనంతరం జరిగే ఇఫ్తార్ విందులో నోరూరించే పసందైన రుచుల వంటకాలను ఇష్టంగా తింటారు. భోజనప్రియుల కోసం అవే వంటలను పాతబస్తీలో అందించేందుకు హోటళ్లు సిద్ధంగా ఉంటాయి. హలీమ్‌కు పెట్టింది పేరు పాతబస్తీ.. పాతబస్తీ హలీమ్ రుచులకు పెట్టింది పేరు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ఈ నెలలో ఇక్కడకు వచ్చి మరీ హలీం తినడం అలవాటుగా చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇక్కడి హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతాయి. ఇక పిస్తాహౌజ్ హలీమ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉంది. మదీనా సర్కిల్లోని షాదాబ్ హోటల్, నయాగ్రా హోటల్, శాలిబండలోని షాగౌస్, బార్కాస్ తదితర హోటళ్లలో ఎన్నో ఏళ్లుగా వెజ్, నాన్‌వెజ్ హలీం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి హలీమ్ పర్షియా దేశపు వంటకం. కుతుబ్‌షాహీల కాలంలో మనకు పరిచయమైంది. ప్రస్తుతం ఇరాన్ ప్రజలు సైతం పాతబస్తీ హలీం కోసం ఆరాటపడుతుంటారంటే మన వంటవారి చేతి మహిమ అలాంటిది. శాలిబండలోని ఫిస్తాహౌజ్ అరబ్ దేశాలకు ఇక్కడి హలీమ్‌ను ఎగుమతి చేస్తుంది. శతాబ్ధాల క్రితం ఇరాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఈ వంటకం ఇప్పుడు కొత్త రుచితో అదే ఇరాన్‌కు వెళుతోంది. 21 వస్తువులతో తయారీ ఇలాచీ, దాల్చిని చెక్క, లవంగా, షాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లులి, నెయ్యి, గులాబీ పూలు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేయించిన ఉల్లి తరుగు, కాజు.. గోధుమలు వంటి 21 రకాల దినుసులకు పొటేలు, కోడి మాంసాన్ని కలిపి హలీమ్‌ను తయారు చేస్తారు. శాకాహార ప్రియుల కోసం వెజిటేబుల్ హలీమ్ సైతం నగరంలో అందిస్తున్నారు. బార్కాస్‌లో ఏడాదంతా.. పాతబస్తీ బార్కాస్‌లో రంజాన్ మాసంతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లోనూ హలీమ్ అందుబాటులో ఉంటుంది. కుతుబ్‌షాహీల కాలంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేసేందుకు యెమన్ దేశం నుంచి వచ్చినవారు ఇక్కడ స్థిరపడ్డారు. శతాబ్దాలు గడుస్తున్నా ఇక్కడ ఇప్పటికీ అరబ్ సంస్కృతి అలాగే కొనసాగుతోంది. దీంతో వారు హలీమ్‌ను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నారు. -
పేదింటికి పెద్ద మనసు అండ
కేశంపట(షాద్‌నగర్): రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబానికి ఇల్లును బహూకరించి సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఉదారత చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొండారెడ్డిపల్లిని ప్రకాశ్‌రాజ్ గతంలో దత్తత తీసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన చోటేమియా ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రకాశ్‌రాజ్.. ఆ ఇంటిని కూల్చివేసి కొత్తది కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అన్ని వసతులతో కూడిన ఇల్లును సొంత ఖర్చులతో కట్టించి రంజాన్ పండగ సందర్భంగా సోమవారం ప్రారంభించి, చోటేమియాకు బహూకరించారు. -
దేశవ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు
న్యూఢిల్లీ: ఈద్-ఉల్-ఫితర్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు సోమవారం దేశవ్యాప్తంగా మసీదుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అన్ని ప్రాంతాల్లోని ప్రార్థనాలయాల వద్ద ప్రత్యేక నమాజులు చేసి అల్లాను ప్రార్థించారు. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మసీదులకొచ్చి ప్రార్థనలు జరిపారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీంతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో నగరాలతో పాటు చిన్నా, పెద్ద పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే సందడి నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరిగాయి. అలాగే పవిత్ర రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మసీదుల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు అలాయ్ భలాయ్ తీసుకుంటున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరిగిలే అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదివేల మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పోలీస్ టీమ్‌లను కూడా రంగంలోకి దింపామన్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర సీసీ టీవీలు ఏర్పాటు చేసి... పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లింలు పవిత్ర రంజాన్ సోమవారం జరుపుకోనున్నారు. సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సమరస్యానికి, సుహృద్భావానికి, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని జగన్ ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్‌ను సోమవారం జరుపుకోవాలని మత పెద్దలు నిర్ణయించారు. దీంతో నెలరోజులుగా పాటిస్తోన్న ఉపవాస దీక్షలకు ముస్లింలు ముగింపు పలికారు. రేపే రంజాన్ కావడంతో హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో సందడి నెలకొంది. -
ఈద్ ముబారక్.
-
ఈద్ ముబారక్
ప్రాచీనకాలంనుండి ప్రతి దేశంలో, ప్రతిజాతిలో పండుగల సంప్రదాయం ఉంది. మానవులకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, వ్యక్తిగతంగా కాని, సామూహికంగా కాని ఏదైనా మేలు జరిగినప్పుడు, ప్రయోజనం చేకూరినప్పుడు వారి అంతరంగాల్లోంచి ఆనందం తన్నుకొచ్చి బహిర్గతమవుతుంది. ఇది చాలా సహజమైన విషయం. అలాంటి మానవ సహజ భావోద్రేక ప్రత్యక్ష ప్రతిస్పందనల ప్రతిరూపమే పండుగలు, పబ్బాలు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం కూడా అలాంటి భావోద్రేకాలు, ఆనంద తరంగాల ప్రతిస్పందనల ప్రత్యక్ష ప్రతిరూపమే. ‘రమజాన్’ పేరు వినగానే అందరికీ సేమియా, షీర్ ఖుర్మాలే గుర్తుకు వస్తాయి. పట్టణ వాసులకైతే దీంతోపాటు ‘హలీమ్’ ‘హరీస్’ లాంటి వంటకాలు కూడా నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లిములు ఇంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోడానికి కారణం, ఇది ఒక్కరోజు పండుగ కాదు. నెలరోజులపాటు నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో, ఆరాధనా భావతరంగాల్లో తేలియాడుతూ జరుపుకునే ముగింపు ఉత్సవం. ఈ నెలరోజులూ ముస్లిముల ఇళ్ళు, వీధులన్నీ సేమియా, షీర్ ఖుర్మా, బగారా, బిరియానీల ఘుమఘుమలతో, అత్తరుపన్నీర్ల పరిమళంతో, ఉల్లాసపరవళ్ళ హడావిడితో అలరారుతుంటాయి. సహెరి, ఇఫ్తార్ల సందడితో నిత్యనూతనంగా, కొత్తశోభతో మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. విశ్వాసులందరూ పవిత్రగ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతూ ఉంటారు. ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాల సమ్మేళనాన్నే ‘పండుగ’ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’. అదే రమజాన్ పండుగ. అసలు రమజాన్ అన్నది పండుగ పేరేకాదు. అదొక నెలపేరు. సంవత్సరంలోని పన్నెండునెలల్లో తొమ్మిదవది రమజాన్. అయితే దైవం పవిత్రఖురాన్ లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింపజేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన ‘రోజా’ను విధిగా చేయడానికి ఈ నెలను ఎన్నుకున్నాడు. అందుకే దీనికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్, రోజాలతో ఈనెలకు విడదీయలేని అనుబంధం ఉంది. రమజాన్ నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాసదీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటుసాగి షవ్వాల్ చంద్రవంక దర్శనంతో ముగుస్తాయి. ‘షవ్వాల్’ మొదటితేదీన జరుపుకునే పండుగే ‘ఈదుల్ ఫిత్ర్’. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉండడంతో సాధారణంగా ప్రజలు దీన్ని రంజాన్ పండుగ అని కూడా వ్యవహరిస్తారు. పండుగరోజు ముస్లిములందరూ పెందలకడనే లేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు ఆచరిస్తారు. అనంతరం నూతన వస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు లాంటి సుగంధ పరిమళం వినియోగించి, ఆనందోత్సాహాలతో ఈద్ గాహ్‌కు వెళతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజా వ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనంకోసం, సాఫల్యంకోసం పవిత్రఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు. తరువాత ఇమామ్ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలిసి అల్లాహ్ గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, తమకుటుంబంకోసం, బంధుమిత్రులకోసం, తమదేశంకోసం, దేశవాసుల సుఖసంతోషాలకోసం, యావత్ ప్రపంచ శాంతి సంతోషాలకోసం ఆయన్ని ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపివంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచిచూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్ ’అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈవిధంగా ‘ఈదుల్ ఫిత్ర్’ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకారగుణాన్ని, సహనం, త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ప్రోదిచేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్యవాతావరణాన్ని సృజిస్తుంది. కనుక రమజాన్ స్పూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెల్లాళ్ళ శిక్షణ ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్ళీ రమజాన్ వరకు ఈ తీపిఅనుభూతులు మిగిలి ఉండాలి. అల్లాహ్ సమస్తమానవాళినీ సన్మార్గంలో నడిపించాలని, పుడమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్ ప్రపంచం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం. (రేపు ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సందర్భంగా...) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
లండన్ లో ఘనంగా తెలంగాణ జాగృతి ఇఫ్తార్ విందు
లండన్: తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ తొలిసారిగా లండన్ లోని ఈస్ట్ హంలో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. లండన్ నలుమూలల నుంచి ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠతో ఆచరించే రోజ విరమించే సాయంకాల సమయాన ఇఫ్తార్ విందును జాగృతి సభ్యులతో కలిసి జరుపుకున్నారు. జాగృతి యూకే ముస్లిం మైనారిటీ ఇంచార్జి సలాం యూసఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర నిర్వహాధికారిగా కేంద్రంలో పనిచేస్తున్న శ్రీరామచంద్ర తేజావత్ తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీరామచంద్ర తేజావత్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఖండాంతరాలలో కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా జాగృతి యొక్క ఆవిర్భావం, అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి గురుంచి రామచంద్ర గుర్తు చేశారు. మరో అతిథి, అక్కడి కౌన్సిలర్ పాల్ సథిరిసన్ కూడా పాల్గొని పరమత సహనంతో జాగృతి చేస్తున్న ఈ కార్యక్రమం తనకెంతో నచ్చిందన్నారు. జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి మాట్లాడుతూ.. నూతన కార్యవర్గంతో ఇది రెండో కార్యక్రమమని, ఎంతో విజయవంతంగా టీం యొక్క సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నాం అన్నారు. భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలతో, సంక్షేమ పనులతో పెద్ద ఎత్తున లండన్ తో పాటు ఇతర నగరాల్లో కూడా విస్తరిస్తామని చెప్పారు. మైనార్టీ ఇంచార్జి సలాం యూసఫ్ ముస్లిం సోదరులకు అభివాదం తెలుపుతూ తన ప్రసంగంలో తెలంగాణ అంటే బతుకమ్మ, బోనాలతో పాటు రంజాన్ కూడా విశిష్టమని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చేసే ఈ విందుని జాగృతి తరుఫున ముస్లిం సోదరులతో కలిసి చేసుకోవడం చాలా సంతృప్తిగా తెలంగాణలో ఉన్న భావన కలిగిందన్నారు. ముస్లిం సోదరుల ప్రార్థనలతో, ఆలింగినాలతో అందరు కుటుంబ సమేతంగా సంతోషంగా ఈ వేడుకని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూరప్ అధ్యక్షుడు సంపత్ ధన్నామనేని, జాగృతి యూకే ఉపాధ్యక్షుడు పావని గణేష్, సుష్మ జువ్వాడి, శ్రవణ్ రెడ్డి, కార్యదర్శి సంతోష్ ఆకులతో పాటు ఇతర జాగృతి యూకే కమిటీ సభ్యులు సునీల్ మెహరీర్, సలాం యూసఫ్, వంశీ మునిగంటి, లండన్ గణేష్, రఘు జక్కుల, రమేష్ పాల్తేపు, గణేష్ మల్యాల, వెంకట్ బాలగోని, వంశీ తులసి, వంశీ సముద్రాల, ప్రణీత్ కుమార్ కందుకూరి, లక్ష్మి నర్సింహా రెడ్డి, రాంచందర్ రాపోలు, మానస టేకుమట్ల, విద్య బాలగోని, శ్రావణి బలమూరి, మాధవి రెడ్డి, దీపికా, దీప్తి సముద్రాల, అలీన స్ట్రాట్, రాధికా మునిగంటి తదితరులు పాల్గొన్నారు. -
ఫిత్రా... ఉపవాసులకే పరిమితం కాదు!
రమజాన్ కాంతులు పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో వ్రతం పాటించే వారి అంతర్గతంతోపాటు, బాహ్య శరీరంలోకూడా పవిత్రాత్మ నిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనత వల్ల ఏదో ఒక పొరపాటు దొర్లిపోతూనే ఉంటుంది. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్ల నుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ముహమ్మద్ ప్రవక్త (సం) ఒక దానాన్ని ఉపదేశించారు. ఈ ప్రత్యేక దానాన్ని షరి అత్ పరిభాషలో ‘సద్ ఖా ఫిత్ర్’అంటారు. ఫిత్రాదానం చెల్లించనంత వరకూ రమజాన్ ఉపవాసాలు భూమ్యాకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి. దైవసన్నిధికి చేరవు. అందుకని ఉపవాసాలు దేవుని స్వీకార భాగ్యానికి నోచుకోవాలంటే ఫిత్రాదానం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. దీంతోపాటు ఫిత్రాదానం వల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కూడా ఉంది. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. అందుకే ముహమ్మద్ప్రవక్త (సం) ఫిత్రాదానాన్ని, ‘దీనులు, నిరుపేదల భృతి’అన్నారు. ఈ కారణంగానే ఫిత్రాదానాన్ని కేవలం ఉపవాసులకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ విస్తరించారు. దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలి. -
జోస్ అలుక్కాస్‌లో రంజాన్ స్పెషల్ ఆఫర్
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జోస్ అలుక్కాస్ ప్రత్యేక ఆఫర్లు ప్రారంభించిందని సంస్థ చైర్మన్ జోస్ అలుక్కా ఒక ప్రకటనలో తెలిపారు. విస్తృత శ్రేణిలో సరికొత్త స్వచ్ఛమైన బంగారు ఆభరణాల కలెక్షన్స్ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. ప్రతి కొనుగోలుపై తప్పనిసరిగా బహుమతులుంటాయని.. మీ పాత 22 క్యారెట్ ఆభరణాలను ఎక్ఛ్సేంజ్ చేసుకోవచ్చని తెలిపారు. 916 బీఐఎస్ హాల్‌మార్క్ బంగారం, ఐజీఐ సర్టిఫైడ్ వజ్రాభరణాలకు మార్చుకోవచ్చన్నారు. బంగారు ఆభరణాల అడ్వాన్స్ బుకింగ్‌పై అద్భుత ప్రయోజనాలు పొందాలని సూచించారు. ప్రత్యేక రంజాన్ కలెక్షన్లో భాగంగా రూ.1.48,000 నుంచి ప్రారంభమయ్యే డైమండ్ నెక్లెస్ సెట్లు అమ్మకానికి పెట్టామన్నారు. వజ్రాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని సూచించారు. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటుచేశామన్నారు. ఈ ఆఫర్లు జూన్ 26 వరకు వర్తిస్తాయన్నారు.