
రంజాన్ షాన్
పాతబస్తీ రంజాన్ జోష్‌ను పులుముకుంది. మార్కెట్లు కొనుగోళ్ల సందడితో నిండిపోయాయి. వీధులు అత్తరు పరిమళాలతో గుబాళిస్తున్నాయి. దారివెంట వెలసిన దుకాణాల్లో హలీం, కుర్బానీ మీఠా రుచులు చవులూరిస్తున్నాయి. రాత్రివేళ చిరు అంగళ్ల వద్ద వెలిగే విద్యుద్దీపాలు.. మిణుగురులు వరుస కట్టినట్టు వెలుగులు చిమ్ముతున్నాయి. ఆదివారం రాత్రి చార్మినార్ పరిసరాలు ఇలా కాంతివంతంగా కనిపించాయి.