Halim
-
హలీం రుచికి గులాం
నరసరావుపేట ఈస్ట్: హలీం తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు పడుతుంది. తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, గోధుమలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, యాలకులు, నల్ల మిరియాలు, కస్తూరి మేతి, గులాబ్ పత్తి, నల్ల మిరప తదితర రుచికర, బలవర్ధకమైన దినుసులను ఉపయోగిస్తారు. హలీంలో చికెన్, మటన్, వెజిటబుల్ అనే మూడు రకాలు ఉన్నాయి. ప్రస్తుతం చికెన్, మటన్ హలీం మాత్రమే తయారు చేస్తున్నారు. తయారీకి ప్రత్యేక బట్టీల ను ఏర్పాటు చేస్తారు. తొలుత రెండు పెద్ద గిన్నెలు పట్టే పొయ్యిలు ఏర్పాటు చేస్తారు. వీటిపై గిన్నెలు పెట్టి వాటిలో చికెన్, మటన్‌లను మూడు నుంచి నాలుగు గంటలు ఉడికించి మెత్తటి పేస్ట్‌లా వచ్చే వరకు వండుతారు. గోధుమ రవ్వ, గరం మసాలా దినుసులను ఉడకబెట్టిన అనంతరం మెత్తటి పేస్ట్‌లా మారిన చికెన్, మటన్ వంటకాన్ని కలిపి మరోమారు కలయతిప్పుతూ గంట నుంచి రెండు గంటల పాటు వండుతారు. దీంతో రుచికరమైన హలీం సిద్ధమవుతుంది. కొనుగోలుదారులకు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో వేసి దానిపై సన్నగా తరిగి నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి వడ్డిస్తారు. కొలుగోలుదారుని స్తోమతును బట్టి ధర ఉంటుంది. చికెన్ హలీం ప్రారంభ ధర రూ.90లు నుంచి ఉంటుంది. మటన్ హలీం ధర చికెన్ కంటే అధికంగా ఉంటుంది. జిల్లాలో జోరుగా అమ్మకాలు జిల్లాలో హలీం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏడాదిలో ఒక్క రంజాన్ మాసంలోనే లభించే ప్రత్యేక వంటకం కావడంతో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు బట్టీల వద్ద రద్దీ కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సతైనపల్లి వంటి పట్టణాలలో బట్టీలను ఏర్పాటు చేశారు. గ్రామాలకు పార్సిల్స్ తీసుకవెళ్లే వారి కోసం వేడి తగ్గకుండా ఉండేందుకు ప్రత్యేక ప్యాకింగ్ చేసి ఇస్తారు. తయారీలో చేయితిరిగిన వంట మాస్టర్లను హైదరాబాద్ నుంచి రప్పించి రుచికరమైన హలీంను అందిస్తున్నారు. కొన్ని బిర్యాని పాయింట్లలో బట్టీలను ఏర్పాటు చేసి బిర్యానీలతో పాటు హలీంలను విక్రయిస్తున్నారు. వీటితో పాటు రకరకాల చికెన్, మట న్ ఐటమ్స్‌తో పాటు ఖద్ధూర్ (కీర్), స్వీట్లు అందిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక వంటకం హలీం. రంజాన్ నెలలో ప్రతిరోజు తెల్లవారుజాము సహరి నుంచి సాయంత్రం ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు తక్షణ శక్తి కోసం హలీం తీసుకొని శరీరంలో శక్తిని పెంచుకుంటారు. హలీంలో హైప్రొటీన్లు, కాల్షియం, కేలరీలు పుష్కలంగా లభిస్తాయి. దీక్ష కారణంగా శరీరంలో లోపించే విటమిన్లు అందించేందుకు అనువైన ఆహారమే హలీం. అందుకే ఇది కేవలం రంజాన్ మాసంలోనే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అనేక రుచులను ఆస్వాదించే నాలుక హలీం కోసం అర్రులుచాస్తుంటుంది. హలీం తయారీకి నైపుణ్యం కావాలి హలీం తయారీ చెప్పినంత సులువు కాదు. అందు కు నైపుణ్యం అవసరం. దినుసులను సమపాళ్లలో కలపడంతో పాటు చికెన్, మటన్‌లను బట్టీపై మెత్తగా ఉడికించాలి. వంట పూర్తయ్యే వరకు కలయతిప్పుతూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అడుగంటి రుచిలో తేడాతో పాటు నాణ్యత లోపిస్తుంది. నా చిన్నతనం నుంచి హైదరాబాద్‌లో హలీం తయారీలో పని చేస్తున్నా. గత రెండేళ్లుగా రంజాన్ మాసంలో ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నా. – షేక్ హర్షద్, వంట మాస్టర్, హైదరాబాద్ -
హలీం ఎలా తయారు చేస్తారంటే..
ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లుతూ.. నోట్లో వేసుకుంటే కరిగిపోయే.. హలీం, హరీస్.. రుచి అత్యంత మధురం.. వీటి పుట్టుపూర్వోత్తరాల్లోకెళితే.. హలీం, హరీస్‌ను తొలుత అరబ్ దేశాలలో మాత్రమే తయారు చేసేవారు. క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. మొఘల్ పాలకుల కాలంలో ఢిల్లీకి, నిజాం నవాబుల పరిపాలనలో హైదరాబాద్‌కు చేరిన హలీం, హరీస్ రుచులను తెలుగు సంస్కృతి మరింతగా ఆదరించింది. ఆ తరువాత అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. బిర్యానీ ఎప్పుడూ ఉండేదే.. హలీం, హరీస్ మాత్రం రంజాన్ స్పెషల్. ఇల్లెందురూరల్: తెల్లవారుజామున సహరితో రోజా (ఉపవాస దీక్ష) ప్రారంభించి మనసంతా అల్హాహ్కి ఇచ్చేసినా, సాయంత్రం ఇఫ్తార్ వేళ ఏవరైనా హలీం, హరీస్‌లను రుచి చూడాల్సిందే. ప్రతిరోజూ పానీపూరీలు, పుల్కాలకు అలవాటు పడిన ప్రజలు రంజాన్ మాసంలో మాత్రం హలీం, హరీస్లే. ఇంతటి రుచికరమైన వంటకాలను ఆరగించేందుకు ముస్లింలతోపాటు అన్నివర్గాల ప్రజలు రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తుంటారు. ఎలా తయారు చేస్తారంటే.. హలీం, హరీస్‌ల రుచి వంట మాస్టర్ తయారీ విధానంపైనే ఆధారపడి ఉంటుంది. వీటి తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని రుచిగా తయారు చేయడానికి వంట మాస్టర్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. వీటిని తయారు చేసేందుకు ముందుగా ప్రత్యేకమైన మట్టి బట్టీ సిద్ధం చేస్తారు. దీనిలో పెద్ద పాత్ర ఉంచి కట్టెలతో మంట చేస్తారు. నానబెట్టిన గోధమ రవ్వ లేదా గోధుమలు వేసి హలీంకు అయితే మటన్, హరీస్‌కు అయితే చికెన్. ముక్కలు దానిలో వేసి నెయ్యి, నీరు పోసి ఉడికించడం ప్రారంభిస్తారు. ప్రతిరోజూ తెల్లవారు జామున ప్రారంభమైన ఈ వంటకం మధ్యాహ్నం 3 గంటలయితే కానీ పూర్తికాదు. అంతకు ముందే వేరుగా సిద్ధం చేసిన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు వేసి ప్రత్యేకమైన కట్టె గంటెతో కలియబెట్టడం చేస్తారు. ఇలా 3, 4 గంటలు దంచడం, తిప్పడం చేస్తేనే పాత్రలో వేసిన ఆహార పదార్థాలన్నీ పేస్ట్‌లా తయారవుతాయి. దాన్ని ప్లేట్లలోకి తీసుకొని లెమన్, వేయించిన పల్చటి ఉల్లిగడ్డ ముక్కలతో కలిపి వడ్డిస్తారు. శేరువా కూడా ఇస్తారు. అలా.. పొగలు కక్కుతున్న హలీం, హరీస్‌లను నోట్లో వేసుకుంటే స్వర్గంలో ఉన్నట్టుంది అంటుంటారు వాటి రుచి చూసినవారు. అందుకే రంజాన్ మాసంలో మాత్రమే లభించే హలీం, హరీస్ రుచి చూసేందుకు ప్రజలు ఎదురు చూస్తుంటారు. పలు కూడళ్లలో విక్రయ కేంద్రాలు.. ఇంతకు ముందు చాలామంది హైదరాబాద్ వెళ్లి హలీం, హరీస్ రుచి చూసి ఇంటికి వచ్చాక నెలంతా మర్చిపోలేకపోయేవారు. మన ప్రాంతంలో కూడా లభిస్తే బాగుండని అల్లాను కోరుకునేవారు. అలాంటి వారి ఆశల ఫలితమేమో.. దశాబ్ధకాలంగా జిల్లా వ్యాప్తంగా ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు వంటి పట్టణ కేంద్రాలలో హలీం, హరీస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఫుడ్ రెస్టారెంట్లు, హోట ళ్లు కూడా ప్రత్యేకంగా హలీం, హరీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం రంజాన్ స్పెషల్ వంటకాలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. చాలా రుచిగా ఉంటుంది హలీం, హరీస్ పోషక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం. రంజాన్ మాసంలో వీటిని ఇష్టపడని వారుండరు. గతంలో హైదరాబాద్ వంటిì నగరాలకు వెళ్లినప్పుడే మాత్రమే రుచిచేసే వాళ్లం. ఇప్పుడు అన్నిచోట్లా విక్రయించడం ఆనందంగా ఉంది. – సయ్యద్ అబ్ధుల్ భారీ, వెల్టింగ్ షాపు నిర్వాహకుడు, ఇల్లెందు అందుబాటు ధరల్లోనే.. హలీం తయారీ వెనుక ఎంత కష్టమున్నా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే విక్రయిస్తున్నాం. రంజాన్ మాసంలో హలీం రుచిని అందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటు చేశాం. ఉపాధి కూడా ఉంటుంది. విక్రయాలు బావున్నాయి. – అమానుల్లాఖాన్, హలీం సెంటర్ నిర్వాహకుడు, ఇల్లెందు -
బిర్యానీ తగ్గేదేలే..!
నాన్ వెజ్ ప్రియుల నిలయమని నగరం నిరూపించుకుంది. రంజాన్ పండగ వేళ ఈ వంటకాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. కులమతాలకు అతీతంగా ఆరగించే హలీం అమ్మకాల్లో ముందున్నా, చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్ఏ మాత్రం తగ్గకపోవడం విశేషమని ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ అని.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అధ్యయనం తేల్చింది. సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, అభి‘రుచుల’ నిలయం నగరం. ఇక్కడి నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీకి ఉన్న క్రేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ సమయంలో అన్ని వంటకాల్నీ వెనక్కి నెట్టేస్తోంది హలీం. ఈ ఏడాది మాత్రం చికెన్ బిర్యానీ తన క్రేజ్‌ను నిలబెట్టుకుని హలీమ్ కన్నా డిమాండ్‌లో ఉందని స్టడీలో వెల్లడైంది. ‘ఆరు’గించినవి అవే.. రంజాన్ పండగ ప్రారంభమైన తర్వాత ఈ నెల 2 నుంచి 22 వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఆర్డర్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిప్రకారం అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఆరగించిన వంటకాల్లో.. చికెన్ బిర్యానీ, హలీమ్, నీహారిస్, సమోసాలు, రబ్డి, మాల్పువా అగ్రస్థానంలో ఉన్నాయి. బిర్యానీ...అదే క్రేజ్... హలీమ్ హవా ఉన్నప్పటికీ బిర్యానీ పట్ల డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదని స్టడీ తేల్చింది. కేవలం 20రోజుల్లో 8 లక్షల చికెన్ బిర్యానీలు నగరవాసులు హాంఫట్ అనిపించారు. కేవలం ఒక్క డోర్‌డెలివరీ యాప్ ఆర్డర్ల ద్వారానే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటే ఇక మొత్తంగా చూస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ‘ఆహా’లీం.. ఏడాదికోసారి జిహ్వల్ని పలకరించే హలీంను గత ఏడాది కన్నా 33 రెట్లు ఎక్కువగా సిటిజనులు ఆరగించారు. దీనిలో మటన్ హలీం తొలిస్థానం కాగా స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే విరివిగా లభించే నిహారీ కూడా గత ఏడాదితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఆదరణ పొందింది. అత్యధిక ఆర్డర్లు అందుకున్న వాటిలో ఇఫ్తార్ వంటకాలైన సమోసా, భజియా, రబ్డి, ఫిర్నీ, మాల్పువా.. ఉన్నాయి. ఇవి ఈ 20 రోజుల్లో ఏకంగా 4.5లక్షల ఆర్డర్లు సాధించాయి. ఇవి కాకుండా పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశెలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇడ్లీలు సైతం 17వేల ఆర్డర్లు పొందడం విశేషం కాగా. డిసర్ట్స్‌లో గులాబ్‌జామూన్, రస్‌మలాయి, డబుల్ కా మీఠాలు టాప్ త్రీలో ఉన్నాయి. టేస్టీ.. యూనిటీ.. కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చడమే రంజాన్ గొప్పతనం. ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. అందర్నీ ఏకం చేసేలా విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకే వీలున్నన్ని రంజాన్ వంటకాలను రుచిచూడాలని భావిస్తాం. – మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్– మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
ఆహా.. హలీం: భలే టేస్ట్ గురూ
తెనాలి/పాతగుంటూరు: రంజాన్ నెల రాగానే అందరికీ గుర్తుకొచ్చేది హలీం. ఈ పేరు వినగానే మాంసప్రియుల నోరు రసార్ణమవుతుంది. మధుర పదార్థాల మేళవింపుతో.. ఘుమఘుమలాడుతూ.. నోటికి సరికొత్త రుచులనందించే ఈ ప్రత్యేక వంటకాన్ని ఆస్వాదించేందుకు ఆహారప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. వెయ్యిమందికి ఉపాధి రంజాన్ నెలలో రోజంతా ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. దీనిలో పోషక విలువలు అధికంగా ఉండే హలీం తప్పనిసరిగా తీసుకుంటారు. దీనివల్ల నీరసించిన శరీరానికి వెంటనే శక్తి వస్తుందని చెబుతారు. ఇరాన్ నుంచి దిగుమతి అయిన ఈ వంటకాన్ని హైదరాబాదీయులు సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు జోడించి మరింత రుచికరం చేశారు. దాదాపు 20ఏళ్ల క్రితం హలీం ఘుమఘుమలు గుంటూరు వాసులను పలరించాయి. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. ప్రస్తుతం గుంటూరు, తెనాలి, నరసరావుపేట, పిడుగురాళ్లలో వీటి తయారీ కేంద్రాలు, అమ్మకం పాయింట్లు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా సుమారు వెయ్యిమందికి ఉపాధి లభిస్తోందని అంచనా. ఏటా రంజాన్ నెలలో హలీం ద్వారా రూ.12కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని సమాచారం. తెనాలిలో హలీం తయారీ వాడే పదార్థాలివీ.. గొర్రెపోతు మాంసంతో చేసిన హలీంకు జిల్లాలో ఆదరణ ఎక్కువ. ఆ మాంసంతోపాటు గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ, నెయ్యి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర, జీలకర్ర, పచ్చి మిర్చి, కొత్తిమీరతో సహా 21 వస్తువులతో హలీం తయారు చేస్తారు. ప్లేటు రూ.100 కొన్నిచోట్ల హలీం తయారీకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంట మాస్టర్లను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ప్లేటు రూ.100, అర కిలో రూ.200, కిలో రూ.400కు విక్రయిస్తున్నారు. బలవర్ధకం కూడా హలీం అంటే ఎంతో ఇష్టం. ఇది రుచికరమే కాదు.. బలవర్ధకం కూడా. కరోనా వల్ల గత రెండేళ్లు రుచిచూడలేకపోయా. ఈ ఏడాది అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. – షేక్ అహ్మద్ హుస్సేన్, తెనాలి గిరాకీ పెరిగింది గుంటూరు నగరంలో ఎన్నాళ్ల నుంచో హలీం తయారు చేస్తున్నాను. అప్పట్లో ప్లేటు రూ.25 ఉండేది. కాలక్రమేణా సరుకుల ధరలు పెరిగాయి. హలీం ప్రియులూ పెరిగారు. ప్రస్తుతం ప్లేటు రూ.100కు విక్రయిస్తున్నాం. ఏడాదిలో ఒక నెల మాత్రమే తయారు చేస్తుండటంతో వినియోగం బాగా పెరిగింది. చాలామంది వస్తున్నారు. – మహమ్మద్ జాఫర్, నిర్వాహకుడు, గుంటూరు ఎంతో ఇష్టం హలీం అంటే నాకు ఎంతో ఇష్టం. రంజాన్ నెలలో దీనిని ఇంటిల్లిపాదీ రుచి చూస్తుంటాం. హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. దీంతోపాటు ఈనెలలో చికెన్ తందూరీ, ఫలుదాను ఆరగిస్తుంటాం. – సాధిక్, హలీం ప్రియుడు, గుంటూరు గుంటూరుకు పరిచయం చేసింది నేనే హైదరాబాద్ హలీంను గుంటూరుకు పరిచయం చేసింది నేనే. 20 ఏళ్ల క్రితం వంటవాళ్లను తీసుకొచ్చి హలీం రుచులను నగరవాసులకు చూపించాను. తెనాలిలో ఏటా రంజాన్ నెలలో హలీమ్ వ్యాపారం చేస్తున్నా. కరోనా వల్ల రెండేళ్లుగా వీలుపడలేదు. మళ్లీ ఇప్పుడు ఆరంభించా. చాలా సంతోషంగా ఉంది. – షేక్ అబ్దుల్ వహీద్, తెనాలి -
రంజాన్ షాన్
పాతబస్తీ రంజాన్ జోష్‌ను పులుముకుంది. మార్కెట్లు కొనుగోళ్ల సందడితో నిండిపోయాయి. వీధులు అత్తరు పరిమళాలతో గుబాళిస్తున్నాయి. దారివెంట వెలసిన దుకాణాల్లో హలీం, కుర్బానీ మీఠా రుచులు చవులూరిస్తున్నాయి. రాత్రివేళ చిరు అంగళ్ల వద్ద వెలిగే విద్యుద్దీపాలు.. మిణుగురులు వరుస కట్టినట్టు వెలుగులు చిమ్ముతున్నాయి. ఆదివారం రాత్రి చార్మినార్ పరిసరాలు ఇలా కాంతివంతంగా కనిపించాయి. -
హలీంకు గులాం
♦ రుచిని ఆస్వాదిస్తున్న జనం ♦ పెరుగుతున్న విక్రయాలు ♦ మండల కేంద్రాల్లోనూ బట్టీలు ♦ ముస్లింలతో పాటు అన్ని వర్గాలూ ఫిదా రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షల అనంతరం నీరసించిన శరీరానికి తక్షణ శక్తి కోసం తీసుకునే పదార్థమే హలీం. ఈ మాసంలో లభించే ప్రత్యేక ఆహార పదార్థాన్ని ముస్లింలతో పాటు కులమతాలకు అతీతంగా ఇష్టపడి మరీ తింటుంటారు. ప్రాంతాన్ని బట్టి ప్లేటుకు రూ. 70 నుంచి రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు నిర్వాహకులు. గతంలో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఈ హలీం ప్రస్తుతం చిన్నచిన్న పట్టణాల్లోకూడా లభ్యమవుతోంది. - ఘట్కేసర్ టౌన్ రంజాన్ ముస్లింలకు పవిత్రమైన మాసం. ఈ నెలలో ముస్లింలు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలను చేపడతారు. రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక ఆహార పదార్థం హలీం. సూర్యోదయం నుంచి నియమ నిష్టలతో ఉపవాస దీక్షలను చేపడతారు ముస్లిం సోదరులు. అంటే దాదాపు 12 గంటల పాటు మంచినీరు కూడా ముట్టరు. సాయంత్రం దీక్ష విరమిస్తారు. ఈ సమయంలో తక్షణ శక్తినిచ్చేందుకు, బలమైన పోషకాలు, బలవర్ధకమైన ఆహారం కోసం ముస్లింలు హలీంను ఇష్టంగా తింటారు. ఇందుకు కోసం రంజాన్ మాసం ప్రారంభం నుంచే ప్రధాన కూడళ్లలో హలీం విక్రయ కేంద్రాలు వెలుస్తాయి. సాయంత్రం అయిందంటే చాలు చిన్న, పెద్ద, కుల, మత అన్న తేడా లేకుండా హలీం విక్రయ కేంద్రాల వద్ద క్యూలు క డుతుంటారు. ఖరీదైన దినుసులతో తయారు చేసే బలమైన ఆహారం హలీం. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హలీం ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమయ్యేది. ప్రస్తుతం మండల కేంద్రాల్లో హలీం బట్టీలు దర్శనమిస్తున్నాయి. హలీం తయారీ విధానం... హలీం, హరీస్‌ను తయారు చేయడానికి 8-9 గంటల పడుతుంది. పొట్టేలు మాంసంతో చేసిన హలీంగా, కోడి మాంసంతో తయారుచేసిన హలీంను హరీస్గా పిలుస్తారు. హలీం వంటకం తొందరగా జీర్ణమై ఆకలిని పెంచుతుంది. ప్రొటీన్లు, క్యాలరీలు అధికంగా ఇందులో లభిస్తాయి. ముందుగా తాజా కోడి, గొర్రె మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి శుభ్రపరిచి ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, పిస్తా, బాదం, ఖాజు, డ్రైప్రూట్స్, నెయ్యి, ఫిరంజి, అక్రోట్స్, యాలకులు, సాజీర, దాల్చిన చెక్క, జీడిపప్పు, గరం మసాల తదితర 55 రకాలకు పైగా సుగంధ ద్రవ్యాలను కలిపి హలీంను తయారు చేస్తారు. పెద్దపెద్ద బట్టీలు నిర్మించి పాత్రలో గంటల తరబడి ఉడికించడంతో నోటిలో వేసుకుంటేనే కరిగిపోయే విధంగా తయారవుతుంది. రుచి రావడానికి ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీన, నిమ్మరసాన్ని మెత్తగా తయారు చేసిన హలీంతో కలిపి విక్రయిస్తారు. ప్రాంతాన్ని బట్టి ప్లేటుకు రూ. 70 - 80లకు విక్రయిస్తున్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలో హలీం విక్రయలు రోజురోజుకు పెరుగుతున్నాయి. -
ఏపీలోనూ హలీమ్ హవా
రమజాన్ మాసంలో ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు రూ. 125 కోట్లు పైమాటే విజయవాడ బ్యూరో: రమజాన్ మాసం శనివారంతో ముగిసింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ సైతం హలీమ్‌కు సలామ్ చేసిందనే సంగతి అమ్మకాలు చూస్తే తెలుస్తోంది. రమజాన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా హలీమ్తోపాటు ఫాలుదా, బిర్యాని, కబాబ్, రోటీ, చికెన్, మటన్ ఐటెమ్స్ అమ్మకాలు రూ. 125 కోట్ల పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హలీమ్ సెంటర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించారు. గత ఏడాది విజయవాడలో 5 హలీమ్ సెంటర్లు ఉంటే ఈసారి ఏకంగా 40కి పైగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రోజుకు రూ.5 నుంచి 6 కోట్ల అమ్మకాలు జరిగాయి. రంజాన్ మాసంలో మొత్తం మీద రూ. 125 నుంచి 150 కోట్లు విక్రయాలు జరిగినట్టు సమాచారం. హైదరాబాద్‌లో పేరెన్నికగన్న పిస్తాహౌస్‌ను విజయవాడలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి భీమవరం, తెనాలికి విక్రయాలు విస్తరించడం విశేషం. -
హలీం సలాం
అలా మొదలైంది.. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించే వంటకాల్లో ఓ ప్రత్యేక డిష్ గురించి పర్షియా ప్రతినిధులు ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా (వంటగది) సిబ్బందిని పిలిపించి ఆ వంటకాన్ని సిద్ధం చేయించారు. అదే హలీమ్. అలా పర్షియా నుంచి పరిచయమైన హలీం హైదరాబాద్ బిర్యానీలాగే ఇక్కడి వంటకమైంది. ఇరాన్, ఇరాక్, తదితర అరబ్ దేశాల్లో తయారయ్యే హలీంలో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే వినియోగిస్తారు. కానీ హైదరాబాద్ హలీంకు మొదట నెయ్యి తోడైంది. ఆ తరవాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి జతకట్టాయి. ఆ తరువాత అనేక రకాల మార్పులతో మరింత గొప్ప రుచిని సంతరించుకుంది. ఏడో నిజాం నాటికి హలీంకు అనూహ్యమైన డిమాండ్ వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఇండోనేషియా, యెమన్, అరబ్ ఎమిరేట్స్, అమెరికా, బ్రిటన్లలో లొట్టలేసుకుంటూ ఆరగించే వంటకం హైదరాబాద్ హలీం.. ఐదు దశాబ్దాల క్రితమే.. నవాబ్ ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలో బ్రహ్మాండమైన ఆదరణ పొందినప్పటికీ హలీం అమ్మకాలు మాత్రం ఐదు దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి. ఇరాన్ నుంచి నగరానికి వచ్చిన ఓ కుటుంబం పాతబస్తీలోని చార్మినార్ వద్ద మదీనా సర్కిల్లో ‘మదీనా’ పేరుతో హోటల్ పెట్టి హలీం విక్రయాలను ప్రారంభించింది. భిన్న‘రుచుల’ పసందు.. తొలినాళ్లలో నాన్‌వెజ్‌తో తయారైన హలీం ఇప్పుడు వెజిటేరియన్‌గా కూడా లభ్యమవుతోంది. నాన్‌వెజ్‌లో మటన్, చికెన్, బీఫ్, ఫిష్, ఈమూ హలీంలు ప్రత్యేకం. ఇందులో సైతం దక్కని, ఇరానీ, అరేబియన్, జఫ్రానీ, యమనీ విధానాల్లో తయారు చేస్తుంటారు. కొవ్వు తక్కువగా ఉండే ఈమూ హలీం తయారీ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. వెజిటేరియన్లో కూడా అనేక రకాలుగా హలీం హోటల్స్‌లో దొరుకుతోంది. ‘పిస్తా’కు ప్రత్యేక గుర్తింపు హలీం తయారీలో నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నందుకు హైదరాబాద్ పిస్తా హౌస్‌కు జాతీయ స్థాయిలో జియోగ్రాఫికల్ ట్యాగ్ లభించింది. పాతబస్తీలోని శాలిబండలో 1997లో ప్రారంభమైన పిస్తా హౌస్ అనతి కాలంలో దేశ విదేశాలకు విస్తరించి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికే ఐఎస్ఐ మార్కుతో పాటు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 514 అవార్డులు లభించాయి. ప్రతిరోజు సుమారు ఐదు క్వింటాళ్ల వరకు హలీం తయారు చేసి హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో 400కు పైగా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, తదితర ప్రాంతాల్లో ‘పిస్తా’కు ఏడు బ్రాంచీలు ఉన్నాయి. తయారీ ప్రత్యేకం.. ఈ ప్రత్యేక వంటకం తయారీ కూడా ప్రత్యేకమే. హలీం తయారీకి కనీసం 9 గంటల సమయం పడుతోంది. తెల్లవారు జామున 4 గంటలకే తయారీ విధానం ప్రారంభమవుతుంది. హలీం వంటకంలో మటన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫూట్స్ తదితర వాటిని వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, నీటిని కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాసుమతి బియ్యం, పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాల దినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. అనంతరం సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. ఫిష్ హలీంలో గోధుమలు, మసాలాలు కలిపి ఉడికించి చివరన చేప ముక్కలను కలిపి తయారు చేస్తారు. రుచుల్లో రకాలు.. దక్కనీ హలీం ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా తయారు చేస్తారు. ఇందులో గోధుమలు కంటే మాంసం మోతాదు రెండింతలు అధికంగా ఉంటుంది. నెయ్యితో పాటు ఇతర దినుసులను వినియోగిస్తారు. ఇరానీ హలీం ఇరానీ హలీం ఘాటుగా ఉండదు. డ్రై ఫూట్స్‌తో పాటు గోధుమలు, మినపప్పు, తక్కువ మోతాదులో మసాల దినుసులు వినియోగిస్తారు. వెజిటేరియన్ హలీం శాకాహారుల కోసం ప్రత్యేకంగా వెజిటేరియన్ హలీంలను కూడా కొన్ని హోటల్స్ అందిస్తున్నాయి. గోధుమ రవ్వతో పాటు మసాల దినుసులు కలిపి ఈ వంటకం చేస్తారు. దీనిలో బీన్స, క్యారెట్, కీరా, పచ్చి బటానీ కలిపి ఉడికిస్తారు. ఘాటుగా ఉండకుండా పలు హోటల్స్‌లో పెరుగు, పాలు కూడా కలుపుతారు. ప్యారడైజ్ స్పెషల్.. హైదరాబాద్ బిర్యానికి ప్యారడైజ్ హోటల్‌కు ఎంత పేరుందో..స్వచ్ఛమైన హలీంకు సైతం ఇక్కడ గొప్ప ఆదరణ ఉంది. ‘హలీం తయారీకి ఉపయోగించే నాణ్యమైన మాంసం, గోధుమలు, స్వచ్ఛమైన నెయ్యి, దినుసులు అన్నీ హైదరాబాదీవే’అని చెబుతారు హోటల్ మేనేజర్ అహ్మద్. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ హలీం ప్రియుల సందడి మొదలవుతుంది. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్యారడైజ్ హోటల్లో 28 ఏళ్ల నుంచి హలీంను రుచి చూపిస్తున్నారు. ప్రపంచానికి రుచి చూ‘పిస్తా’.. ప్రపంచ వ్యాప్తంగా హలీం విక్రయాలను విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకు ‘టార్గెట్- 2020’గా పెట్టుకున్నాం. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాలతోపాటు వివిధ దేశాలకు ‘హైదరాబాద్ పిస్తా హలీమ్’ను ఎగుమతి చేస్తున్నాం. అమెరికాలో ప్రత్యేకంగా హలీం తయారు చేస్తున్నాం. వచ్చే ఏడాది స్విడ్జర్లాండ్, జెనీవా నగరాల్లో కేంద్రాలను ప్రారంభిస్తాం. వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ తీసుకొని పంపిస్తున్నాం. - మహ్మద్ అబ్దుల్ మాజీద్, పిస్తాహౌస్ యాజమాని ధరలు ఇలా.. మటన్ హలీం రూ. 90 నుంచి 170 వరకు, చికెన్ రూ. 70 నుంచి 90 వరకు, వెజిటేరియన్ హలీం రూ.70 నుంచి రూ.90 వరకు లభిస్తోంది. వీటిలో సింగిల్, ప్లేట్, స్పెషల్, ఫ్యామిలీ, జంబో ప్యాక్ ధరలు వేర్వేర్వుగా ఉంటాయి. -
ప్లస్ టేస్ట్.. ప్లస్ ఏరియా..
చార్మినార్.. చారిత్రాత్మకంగా సిటీకి ప్లస్. హలీమ్.. రంజాన్ మాసంలో సిటీకి అందే ప్లస్ రుచి. హైదరాబాద్ బిర్యానీ.. ప్రపంచ ఖ్యాతి చెందిన ఈ ఘుమఘుమలు.. టేస్ట్ ఆఫ్ సిటీకి మెగా ప్లస్‌గా నిలిచింది. ఒక్కసారి ఈ దక్కన్ బిర్యానీ ముద్ద గొంతులోకి దిగితే.. మరో బిర్యానీ రుచి చేసినప్పుడల్లా.. హైదరాబాద్ గుర్తుకు రావాల్సిందే. హైదరాబాదీలకు అనుకున్నదే తడవుగా బిర్యానీ లాగించే అవకాశం ఉంది. మరి ఇతర నగరవాసులుకో..? మన సిటీ బిర్యాని టేస్ట్ చూడాలంటే వారంతా హైదరాబాద్‌కు రానక్కర్లేదు. మన సిటీ రెస్టారెంట్స్ బిర్యానీని వేడివేడిగా ఇతర రాష్ట్రాలకూ వడ్డించేస్తున్నాయి. మన సిటీలోని రెస్టారెంట్స్‌లో రాజస్థానీ ఫుడ్‌ఫెస్టివల్, పంజాబీ రుచులు, గుజరాతీ టేస్ట్లంటూ రోజూ ఏదో ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ.. హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్స్ ఘనంగానే జరుగుతుంటాయి. చేయి తిరిగిన నలభీములు వండి వార్చినా.. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ తీసుకురాలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ ‘బిర్యానీ బై ఎయిర్’ కాన్సెప్ట్ మొదలైంది. బెంగళూరు, ముంబై, పూణె.. నగరమేదైనా సరే హైదరాబాద్ దమ్ కీ బిర్యానీ రుచి చూడాలనుకుంటే ఇప్పుడు గంటల్లో పని. కాల్ చేసి ఆర్డర్ చేస్తే సరి సాయంత్రానికి వాళ్లింట్లో బిర్యానీ రెడీగా ఉంటుంది. ప్రస్తుతానికి వారానికి మూడు రోజులు ‘బిర్యానీ బై ఎయిర్’ అందుబాటులో ఉంది. ‘బిర్యానీ బై ఎయిర్’ సర్వీస్‌ను మేం ఈ మధ్యే మొదలు పెట్టాము. నాలుగు నెలలుగా ఆర్డర్లను బట్టి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వారానికి మూడు రోజులే సర్వీస్ ఉన్నా.. ఆ మూడు రోజుల్లోనే కనీసం రెండు వేల జంబో బిర్యానీల వరకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎక్కువ శాతం మటన్ బిర్యానీని కావాలంటున్నారు’ అంటున్నారు షా గౌస్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్ మహ్మద్ రబ్బానీ. - శిరీష చల్లపల్లి -
అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు
నల్గొండ : పాఠశాలలో మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఈవో విశ్వనాథరావు శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రాధమికోన్నత పాఠశాలలో గురువారం హలీం అనే ఉపాధ్యాయుడు వీరంగం సృష్టించిన ఉదంతాన్ని పత్రికులు, టీవీ ఛానళ్లలో రావటంతో విద్యాశాఖ మంత్రితో పాటు, ఉన్నతాధికారులు ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో జిల్లా విద్యాశాఖ టీచర్ తతంగంపై నివేదిక తయారు చేసి సస్పెండ్ చేసింది. -
చిత్తుగా తాగి...మూత్ర విసర్జన చేసి...
నల్గొండ : ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు పవిత్ర వృత్తికి కళంకం తెచ్చాడు. పాఠశాలలో మూత్రం పోసి వీరంగం సృష్టించాడు. మద్యం సేవించి విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తించాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న హలీం తన స్నేహితులతో మద్యం తెప్పించుకుని పూటుగా తాగాడు. మైకం కమ్మడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థులపై చేయి చేసుకుని అడ్డుగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడిపై తిరగబడ్డాడు. రిజిస్టర్లు చించి, సహచర టీచర్ల బైక్‌లలోని గాలి తీసి విచ్చలవిడిగా ప్రవర్తించాడు. మైకంలో కదలలేని స్థితిలో తరగతి గదిలోనే మూత్రం పోశాడు. గొడవ జరగటంతో గ్రామస్తులు వచ్చేలోపే ఆ ఉపాధ్యాయుడు పరారయ్యాడు. ఈ ఘటనపై డీఈవో విశ్వనాథం స్పందిస్తూ ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అయితే ఈ సంఘటపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కాగా హలీం గతంలో మద్యం సేవించి హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. -
హలీమ్‌కు గులామ్
రంజాన్ వూసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగరం హలీమ్ ఘుమఘుమలతో గుమ్మెత్తిపోతుంది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అద్భుత శక్తిసావుర్థ్యాలు కలగలిపి అందించే పసందైన వంటకమిది. అందుకే ముస్లింల పవిత్ర వంటక ంగా మొదలైన హలీమ్... ప్రస్తుతం వుతాలకతీతంగా చిన్నాపెద్దా ఆడావుగా తేడా లేకుండా అంతా లొట్టలేసుకుంటూ తినే ఫేవరేట్ డిష్‌గా వూరిపోరుుంది. హైదరాబాద్ బిర్యానీ తరహాలో నగరానికి ఓ బ్రాండ్‌గా అరుుపోరుుంది. భౌగోళిక సూచీ (జియోగ్రాఫికల్ ఇండెక్స్) గుర్తింపు దక్కించుకుంది. దాదాపు 50 దేశాలకు ఎగువుతి అయ్యే హలీమ్ అవ్ముకాల విలువ దాదాపు రూ.150 కోట్లకు పైమటేనట. ఇదీ హైదరాబాద్ హలీమ్ రేంజ్. అవి రంజాన్ మాసం తొలిరోజులు.. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ దర్బారు కొలువు దీరింది.. నిజాం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కీలక సమావేశం జరుగుతోంది... దీనికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు.. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించిన వంటకాల సందర్భంగా ఓ ప్రత్యేక పదార్థం ప్రస్తావన వచ్చింది. నిజాం వెంటనే షాహీ దస్తర్‌ఖానా (వంటిల్లు) సిబ్బందిని పిలిపించి పర్షియా ప్రతినిధులు సూచించిన పదార్థాన్ని సిద్ధం చేరుుంచారు. అదే హలీమ్... ఇది దాదాపు 85 ఏళ్ల క్రితం నాటి సంగతి. హైదరాబాదీ ప్రత్యేకతలుగా ప్రపంచ ఖ్యాతిని పొందిన బిర్యానీ, హలీమ్, మిర్చీ కా సాలన్ లాంటి వంటకాలు పర్షియా నుంచి ఇక్కడికి వచ్చినవే. కానీ... వాటి అసలు రుచి వేరు, ప్రపంచం లొట్టలేసుకుంటూ తినేలా రూపొందిన ప్రస్తుత రుచులు వేరు. హలీమ్‌ను హైదరాబాద్ గొప్ప వంటకంగా మార్చేసింది. బిర్యానీని పరిచయం చేసిన పర్షియా ఇప్పుడు హైదరాబాద్ హలీమ్ అంటే పడిచస్తుంది. స్పైసీ వున స్పెషాలిటీ ఇప్పటికీ ఇరాన్, ఇరాక్, ఇతర ఎడారి దేశాల్లో హలీమ్‌ను వండి వడ్డిస్తున్నారు. అందులో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే ఉంటుంది. అది హైదరాబాదీ వంటకమయ్యాక తొలుత నెయ్యి తోడైంది. ఆ తర్వాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయల రుచి చేరింది. ఆరో నిజాం హయాంలో నగరానికి హలీం పరిచయమైనా... దా ని రూపురేఖలు మారింది మాత్రం ఏడో నిజాం జమానాలోనే. అప్పట్లోనే ఈ స్పైసీ హలీం మొదలైంది. అప్పటి నుంచి దానికి ఎక్కడలేని డిమాండ్ మొదలైంది. ఆ తర్వాత విదేశాల గడప తొ క్కింది. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్. ఇండోనేషియా, యెమన్, యూఏఈ, యూఎస్, యూకేల లో హైదరాబాదీ హలీమ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. మరికొన్ని విశేషాలివీ... * యెమన్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవారు నిత్యం బ్రేక్‌ఫాస్ట్‌గా హలీమ్ తింటారు. * వారి ఇళ్లల్లో స్వీట్ హలీమ్, ఖారా హలీమ్‌లను బ్రేక్‌ఫాస్ట్‌గా లాగించేస్తుంటారు. * హలీమ్‌లో ముఖ్యమైంది కవ్ముటి నెయ్యి. * ఆరోగ్య రీత్యా కొన్ని ప్రాంతాల్లో నెరుు్యకి బదులు ఆలీవ్ ఆయిల్‌ను వాడుతున్నారు. * లో కొలెస్ట్రాల్ కోసం పొట్టేలు మాంసం, *కోడి మాంసం బదులు కొన్నిచోట్ల ఈము మాంసంతో హలీమ్ తయారు చేస్తున్నారు. * హలీమ్లాగే ఉండే మరో పదార్థం హరీస్. ఇందులో మాంసం కంటే గోధుమలశాతం ఎక్కువ. * కేరళలో బిర్యానీకి ముందు (ఇళ్లల్లో) హరీస్‌ను వడ్డిస్తారు. * కొన్ని అరబ్ దేశాల్లో హలీమ్‌ను మగవారు తినే పదార్థంగా, హరీస్‌ను మహిళల వంటగా భావిస్తారు. * హలీమ్‌ను పోలిన ఖిచ్చా అనే వంటకాన్ని పాకిస్థాన్‌లో ఇష్టంగా తింటారు. * నార్త్ ఇండియూలోనూ ఇది దొరుకుతుంది.