హలీమ్‌కు గులామ్
రంజాన్ వూసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నగరం హలీమ్ ఘుమఘుమలతో గుమ్మెత్తిపోతుంది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అద్భుత శక్తిసావుర్థ్యాలు కలగలిపి అందించే పసందైన వంటకమిది. అందుకే ముస్లింల పవిత్ర వంటక ంగా మొదలైన హలీమ్... ప్రస్తుతం వుతాలకతీతంగా చిన్నాపెద్దా ఆడావుగా తేడా లేకుండా అంతా లొట్టలేసుకుంటూ తినే ఫేవరేట్ డిష్‌గా వూరిపోరుుంది. హైదరాబాద్ బిర్యానీ తరహాలో నగరానికి ఓ బ్రాండ్‌గా అరుుపోరుుంది. భౌగోళిక సూచీ (జియోగ్రాఫికల్ ఇండెక్స్) గుర్తింపు దక్కించుకుంది. దాదాపు 50 దేశాలకు ఎగువుతి అయ్యే హలీమ్ అవ్ముకాల విలువ దాదాపు రూ.150 కోట్లకు పైమటేనట. ఇదీ హైదరాబాద్ హలీమ్ రేంజ్.
అవి రంజాన్ మాసం తొలిరోజులు.. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ దర్బారు కొలువు దీరింది.. నిజాం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కీలక సమావేశం జరుగుతోంది... దీనికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు.. రంజాన్ ఉపవాసదీక్ష విరమణకు వడ్డించిన వంటకాల సందర్భంగా ఓ ప్రత్యేక పదార్థం ప్రస్తావన వచ్చింది. నిజాం వెంటనే షాహీ దస్తర్‌ఖానా (వంటిల్లు) సిబ్బందిని పిలిపించి పర్షియా ప్రతినిధులు సూచించిన పదార్థాన్ని సిద్ధం చేరుుంచారు.
అదే హలీమ్... ఇది దాదాపు 85 ఏళ్ల క్రితం నాటి సంగతి. హైదరాబాదీ ప్రత్యేకతలుగా ప్రపంచ ఖ్యాతిని పొందిన బిర్యానీ, హలీమ్, మిర్చీ కా సాలన్ లాంటి వంటకాలు పర్షియా నుంచి ఇక్కడికి వచ్చినవే. కానీ... వాటి అసలు రుచి వేరు, ప్రపంచం లొట్టలేసుకుంటూ తినేలా రూపొందిన ప్రస్తుత రుచులు వేరు. హలీమ్‌ను హైదరాబాద్ గొప్ప వంటకంగా మార్చేసింది. బిర్యానీని పరిచయం చేసిన పర్షియా ఇప్పుడు హైదరాబాద్ హలీమ్ అంటే పడిచస్తుంది.
స్పైసీ వున స్పెషాలిటీ
ఇప్పటికీ ఇరాన్, ఇరాక్, ఇతర ఎడారి దేశాల్లో హలీమ్‌ను వండి వడ్డిస్తున్నారు. అందులో గోధుమలు, మాంసం, పప్పు, ఉప్పు, నూనె మాత్రమే ఉంటుంది. అది హైదరాబాదీ వంటకమయ్యాక తొలుత నెయ్యి తోడైంది. ఆ తర్వాత కారం, షాజీరా, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయల రుచి చేరింది. ఆరో నిజాం హయాంలో నగరానికి హలీం పరిచయమైనా... దా ని రూపురేఖలు మారింది మాత్రం ఏడో నిజాం జమానాలోనే. అప్పట్లోనే ఈ స్పైసీ హలీం మొదలైంది. అప్పటి నుంచి దానికి ఎక్కడలేని డిమాండ్ మొదలైంది. ఆ తర్వాత విదేశాల గడప తొ క్కింది. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సింగపూర్. ఇండోనేషియా, యెమన్, యూఏఈ, యూఎస్, యూకేల లో హైదరాబాదీ హలీమ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు.
మరికొన్ని విశేషాలివీ...
* యెమన్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవారు నిత్యం బ్రేక్‌ఫాస్ట్‌గా హలీమ్ తింటారు.
* వారి ఇళ్లల్లో స్వీట్ హలీమ్, ఖారా హలీమ్‌లను బ్రేక్‌ఫాస్ట్‌గా లాగించేస్తుంటారు.
* హలీమ్‌లో ముఖ్యమైంది కవ్ముటి నెయ్యి.
* ఆరోగ్య రీత్యా కొన్ని ప్రాంతాల్లో నెరుు్యకి బదులు ఆలీవ్ ఆయిల్‌ను వాడుతున్నారు.
* లో కొలెస్ట్రాల్ కోసం పొట్టేలు మాంసం,
*కోడి మాంసం బదులు కొన్నిచోట్ల ఈము మాంసంతో హలీమ్ తయారు చేస్తున్నారు.
* హలీమ్‌లాగే ఉండే మరో పదార్థం హరీస్. ఇందులో మాంసం కంటే గోధుమలశాతం ఎక్కువ.
* కేరళలో బిర్యానీకి ముందు (ఇళ్లల్లో) హరీస్‌ను వడ్డిస్తారు.
* కొన్ని అరబ్ దేశాల్లో హలీమ్‌ను మగవారు తినే పదార్థంగా, హరీస్‌ను మహిళల వంటగా భావిస్తారు.
* హలీమ్‌ను పోలిన ఖిచ్చా అనే వంటకాన్ని పాకిస్థాన్‌లో ఇష్టంగా తింటారు.
* నార్త్ ఇండియూలోనూ ఇది దొరుకుతుంది.