Breakfast
-
ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ అంటే..? ఎలా తీసుకోవాలంటే..
చాలామంది బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఏదో తిన్నాంలే అనుకుంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ రోజులో తొలి భోజనమైన ఈ అల్పాహారం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందట. శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఆ విషయం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులు, పిలల్లు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని నిర్లక్ష్య చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు.అల్పాహారంలోని కేలరీ కంటెంట్, పోషక నాణ్యత ఎలా ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుందనే దానిపై అధ్యయనం చేశారు స్పానిష్ పరిశోధకులు. వారి పరిశోధనలో వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం అనేది అత్యంత కీలకమని తేలింది. అల్పాహారమే అని అల్పంగా చూస్తే.. దీర్ఘకాలిక హృదయ ఆరోగ్యంపై గట్టి ప్రభావమే చూపిస్తుందని చెప్పారు. మన దినచర్యలో ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని భాగం చేసుకునే యత్నం చేస్తే దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతాయని అన్నారు. ముఖ్యంగా జీవన నాణ్యాత మెరుగుపరిచి, ఒబెసిటీ వంటి అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం తగ్గుతుందన్నారు పరిశోధకులు. అందుకోసం 55 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న.. దాదాపు 383 మంది వ్యక్తులపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరి హెల్త్ ట్రాక్‌ల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించినట్లు తెలిపారు. ఉదయం తక్కువ కేలరీలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న వారిలో ఆరోగ్య ఫలితాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, పైగా వారి బాడీ సరైన ఆకృతిలో లేకపోవడమే గాక, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువుగా ఉన్నట్లు పరిశోధనలో వెలడైందని చెప్పారు.అంతేగాదు ఈ పరిశోధన అల్పాహారం నాణ్యాత ఎంత ముఖ్యమో అలాగే క్వాంటిటీ కూడా ముఖ్యమని పేర్కొంది. దీర్ఘకాలిక గుండె జబ్బులతో ఉన్నవారు, వృద్ధులు అల్పాహారం విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. దీంతోపాటు ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారాన్ని స్కిప్ చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్‌లో ప్రచురితమైంది. 'ఐడియల్ అల్పాహారం' అంటే..సమతుల్యమైన పోషకాలతో కూడినా ఆహారమే ఐడియల్ అల్పహారం. ఇందులో రోజువారీగా కనీసం 20% నుంచి 30% కేలరీలు ఉండాలని పరిశోధన చెబుతోంది. అందుకోసం తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు కూరగాయలతో కూడినవి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్రాసెస్ చేసిన వాటికి దూరంగా ఉండాలన్నారు. సరైన మొత్తంలో అధిక-నాణ్యత కలిగిన పోషకాహారంతో మనం రోజును ప్రారంభిస్తే.. జీవక్రియ మెరుగై మొత్తం ఆరోగ్యమే బాగుటుందని పరిశోధన చెబుతోంది. రోజులో అతిముఖ్యమైన భోజనం అల్పాహరం అని స్పష్టం చేసింది. అయితే ఏం తింటున్నారు, ఎలాంటిది తింటున్నారు అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా పరిమాణం, పోషక నాణ్యత అనేవి అత్యంత కీలకమైనవని చెప్పారు పరిశోధకులు. (చదవండి: పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ) -
డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా
బరువు తగ్గాలనే ఆలోచనలోఉన్నవాళ్లు కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొవ్వుపదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభించే ఆహారాలను దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, లేదా రాత్రికి అన్నం మానేసి ఏం తినాలి అనేది పెద్ద సమస్య. ఇడ్లీ, దోసలు, నూనెతో నిండిన పూరీలు కూడా రాగులతో ఉప్మాఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ బెస్ట్ ఆప్షన్. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు లభిస్తాయి కూడా. రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మకాయ –1 (పలుచగా తరగాలి).తయారీ: ∙రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙ రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. వేడి వేడి ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇలాగే ఓట్స్తోగానీ, గోధుమ రవ్వతో గానీ చేసుకోవచ్చు. ఇందులో మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని, బఠానీలను కూడా యాడ్ చేసుకుంటే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. -
హీరోయిన్ కత్రినా డైట్ ప్లాన్: రెండుపూటల భోజనం, షట్పావళి అంటే..?
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఎంత ఫిట్‌గా నాజుగ్గా ఉంటారో తెలిసిందే. ఆమె తన అభినయం, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తీగలాంటి శరీరంతో బ్యూటిఫుల్‌గా ఉండే కత్రినా ఏం తింటుంది ఎలాంటి డైట్ ఫాలో అవుతోందో ఆమె వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు చెప్పుకొచ్చింది. కత్రినా ఫిట్నెస్ సీక్రెట్ ఆమె తీసుకునే ఆహారమేనని అన్నారు. ఇంతకీ ఆమె ఎలాంటి డైట్‌ఫాలో అవుతుందంటే..?న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా కత్రినా డైట్ గురించి, ఆమె ఫిట్నెస్ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆమె సోషల్ మీడియాలో చెప్పే డైట్ ప్లాన్లను గుడ్డిగా అస్సలు ఫాలో అవ్వదని అన్నారు. ఆమె ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటుంది. అది శరీరాకృతిని మంచిగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనేది కత్రినా ప్రగాఢ నమ్మకమని అన్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్, ఆరోగ్యకరంగా, ఫిట్‌గా ఉండే డైట్ల గురించి తనను సంప్రదిస్తూ ఉంటుందని అన్నారు. పలు రకాల సందేహాలు నివృత్తి చేసుకుని గానీ ఫాలో అవ్వదని కూడా చెప్పారు. కత్రినా ఆయిల్ ఫుల్లింగ్, షట్పావళి, నాసికా క్లీనింగ్ తదితర స్వీయ సంరక్షణను తప్పనిసరిగా పాటిస్తారని పేర్కొన్నారు. షట్పావళి అంటే..షట్పావళి అనేది ఆయుర్వేద ఆచారం. దీని ప్రకారం భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా 100 అడుగులు నడవడం జరుగుతుంది. ఈ పురాతన అభ్యాసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు..ముఖ్యంగా జీర్ణక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందిభోజననతరం నడవడం వల్ల గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ప్రేరేపించి పేగులు, పెరిస్టాలిక్ కదలికను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇలా నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్ వినయోగాన్ని సులభతరం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిహృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిఇది కేలరీలను బర్న్ చేసి, కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. మెరుగైన రక్త ప్రసరణకు దోహదం చేస్తుందిహృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అలాగే మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది.రోజుకు రెండు పూటలా తినడం మంచిదేనా..?రోజుకు రెండు పూటలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భోజనాల మధ్య 6 గంటల లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ అనేది మన శరీరానికి తదుపరి భోజనానికి ముందు పోషకాలను పూర్తిగా జీర్ణం చేయడానికి, గ్రహించడానికి, సమీకరించడానికి సమయాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.రోజుకు కేవలం రెండు పూటలా భోజనం చేయడం అనేది తరచుగా 'అడపాదడపా ఉపవాసం' అని పిలిచే పద్ధతి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందిటైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి లేదా నిర్వహించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.అజీర్ణం వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆకలిని నియంత్రిస్తుందిమానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. (చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!) -
ఆకలి తెలిసిన మనిషి..
ఆకలికి పేద, గొప్ప తారతమ్యం లేదు. దానికి అందరూ సమానమే.. సమయానికి పిడికెడు మెతుకులు పొట్టలో పడకపోతే అల్లాడిపోతాం. ఆ విలువ తెలిసిన వాడు కనుకే ఆయన ఆకలితో ఉన్న వారి కోసం ఆలోచిస్తారు. మానవ సేవే మాధవ సేవ అన్న మాటను బలంగా నమ్ముతూ సేవా మార్గంలో పయనిస్తున్నారు కందూరికృష్ణ. దానికి తాను సంపాదించిన దాంట్లో కొంత పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 30 ఏళ్లుగా (మూడు దశాబ్దాలుగా) ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. కందూరి కృష్ణ చిక్కడపల్లి నివాసి. స్థానికంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తనకు వచ్చే సంపాదనలో ఏటా సుమారు రూ.2 లక్షలకు పైగా సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. – సుందరయ్య విజ్ఞాన కేంద్రంఆకలితో అలమటించే వారిని ఆదుకోవడం కోసం సాటి మనిషిగా కందూరి కృష్ణ ప్రతినిత్యం పలు ఆలయాల వద్ద అల్పాహారంతో పాటు అన్నదానం చేస్తుంటారు. చిక్కడపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో యాచకులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారాన్ని అందిస్తారు. సమీప ప్రాంతాల్లోని ఆలయాల పరిసరాల్లో టిఫిన్ సెంటర్ల నిర్వహకులకు కృష్ణ ప్రతినెలా రూ.25 వేలు చెల్లిస్తారు. ఈ మేరకు టిఫిన్ సెంటర్ల నిర్వహకులు నిరుపేదలకు అల్పాహారాన్ని అందిస్తారు. అల్పాహారంతో పాటు అరటి పండ్లను పంపిణీ చేస్తారు. ప్రతిరోజూ తన నగల దుకాణం వద్ద ఉదయం 7 గంటలకు అల్పాహారంతో పాటు అరటి పండ్లను పంపిణీ చేస్తారు. ఇందులో పేదలతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువకులు కూడా బారులు తీరుతూ అల్పాహారాన్ని అందుకుంటారు.30 ఏళ్లుగా షెడ్యూల్ ప్రకారం.. అప్పుడప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకుని ఉన్నత ఉద్యోగాల్లో చేరిన యువకులు కందూరి కృష్ణ వద్దకు వచ్చి సార్ మీరు ఇచి్చన అల్పాహారం ఎంతో ఉపయోగపడింది. ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నామని చెబితే ఆయన ఆనందానికి అవధులు లేకుండాపోతుందని చెబుతారు.. 30 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సోమవారం శంకరమఠం, మంగళ, బుధ వారాల్లో సికింద్రాబాద్‌లోని పద్మరావునగర్ స్కంధగిరి ఆలయం, గురువారం బాగ్‌లింగంపల్లిలోని సాయిబాబా మందిరం, శుక్రవారం లిబరీ్టలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, శనివారం చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో అల్పాహారాన్ని అందిస్తూ నిరి్వరామంగా సేవలను కొనసాగిస్తున్నారు. తరచూ గోశాలలోని పశువులకు ఆహారాన్ని అందిస్తారు. అనేకమార్లు సామాజిక సేవలను కొనియాడుతూ ప్రస్తుత గవర్నర్ బండారు దత్తాత్రేయ లాంటి వారు సైతం కందూరి కృష్ణను సన్మానించారు. ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు.. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యానికీ కందూరి కృష్ణ ఇప్పటి వరకూ సుమారు 130కిపైగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన చికిత్సలు అందించారు. 75 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించారు. వృద్ధులకు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్లో సంభవించిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి రూ.4 లక్షలతో దుస్తులను పంపిణీ చేశారు. ఎనిమిది సార్లు ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించి 635 యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తనిధికి అందించారు. ట్విన్ సిటీస్ జ్యూవెలరీస్ అధ్యక్షుడిగా దశాబ్ద కాలంగా కొనసాగుతున్నారు. కందూరి కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవలను కొనసాగిస్తున్నారు.పేద విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు.. ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. నాది వరంగల్ జిల్లా నేను ఎంఫార్మసీ పూర్తి చేశాను. ప్రతి రోజూ నాతో పాటు అనేక మంది విద్యార్థులు క్యూలైన్లో నిలబడి అల్పాహారం తీసుకుంటారు. – పల్లవి, ఎంఫార్మసీ పేదల ఆకలి తీర్చే దేవుడు.. ఈయన పేదల ఆకలి తీర్చే దేవుడు. ప్రతిరోజూ ఉదయం అనేక మంది నాతో పాటు పేదలు వచ్చి అల్పాహారాన్ని తీసుకుంటారు. ఈ ప్రధాన రహదారి నుంచి పోయే చిరువ్యాపారులు సైతం క్యూలో నిలబడి జైశ్రీరామ్ అంటూ అల్పాహారం తీసుకొని సంతోషంగా వెళ్లిపోతుంటారు. – లక్షి్మ, చిక్కడపల్లిమిత్రుల సహకారంతో.. ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్.గోవింద్రావుల సహకారం, ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాం. నా సంపాదనలో కొంత భాగం పేదలకు ఖర్చు పెట్టాలనేదే ఉద్దేశం. ప్రతి రోజూ స్కూల్ విద్యార్థులతో పాటు డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్థులు, ఇతర వర్గాల పేదలు ఉదయం 7.30 గంటల వరకు మా షాపు వద్ద క్యూలైన్లో ఉంటారు. ప్రతిరోజూ సుమారు 250 మందికి అల్పాహారంతో పాటు అరటిపండ్లు అందజేస్తున్నా. – కందూరి కృష్ణ, ఫౌండేషన్ నిర్వాహకులు -
షాహీ నాష్టా.. నోరూరించే నిజాంల నాటి వంటకాలు
షాహీ నాష్టా.. అంటే నిజాం కాలంలో ఉదయం పూట అల్పాహారం. పాయారోటీ, గుర్దాభాజీ, ఖీమారోటీ, ఖిచిడీ ఖీమాలాంటి పదార్థాలను నిజాములు అల్పాహారంగా సేవించేవారు. నిజాముల కాలం నాటి వంటకాలు కొన్ని నేటికీ ప్రజాదరణలో ఉన్నాయి. క్రమేణా ఈ వంటకాలన్నీ పాతబస్తీ హోటళ్లు, సికింద్రాబాద్‌లోని ఒకటి రెండు హోటళ్లలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలో నాన్‌వెజ్ బ్రేక్‌ఫాస్ట్ అందించే రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతోంది. జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో నాన్‌వెజ్ అల్పాహార వంటకాల కోసం ఉదయం పూట వందలాది మంది వేచి చూస్తారంటే అతిశయోక్తి కాదు. – సికింద్రాబాద్వయసుతో పని లేకుండా... ప్రతిరోజు 6 గంటల నుంచే వేడివేడిగా మాంసాహారపు వంటకాల అల్పాహారాలను రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధంగా ఉంచుతున్నారు. భాజీగుర్దా, ఖీమా కర్రీ, పాయ వంటి పురాతన వంటకాలతోపాటు చిల్లిగారె, పూరి, ఇడ్లీ, వడ, దోశ, రాగిముద్ద వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను చికెన్, మటన్‌తో కూడిన వివిధ వంటకాలతో రడీగా ఉంచుతున్నారు. మరికొన్ని హోటళ్లు అయితే ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకూ నాన్‌వెజ్ వంటకాలను అందుబాటులో ఉంచుతున్నారు. రాత్రి 12 గంటల లోపే నాణ్యమైన మాంసం, అవసరమైన ఆకుకూరలు, మసాలాలను సిద్ధం చేసుకుని తెల్లవారుజామున ఒంటిగంట, రెండు గంటల ప్రాంతంలో వంటలు ప్రారంభిస్తున్నారు. ఉదయం 5 గంటలకు రెస్టారెంట్లను తెరిచి పూరి, రోటీ ఇతర టిఫిన్లతో కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు.వయసుతో పని లేకుండా... ఉదయం వేళల్లో చోటా ఆరగించేవాళ్లలో అన్ని వయస్కుల వాళ్లూ కనిపిస్తున్నారు. 18 ఏళ్ల నవయువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ ఈ టిఫిన్లు ఆరగిస్తున్నారు. కేవలం నాన్‌వెజ్ కర్రీతో ప్రత్యేకంగా లభించే టిఫిన్లు ఆరగించడం కోసం వచ్చే వాళ్లు మిత్రులుగా మారిన వారూ ఉంటున్నారు. నాన్‌వెజ్ టిఫిన్లు సేవించేవారు మైదానాల్లోనే మిత్రులుగా మారుతున్నారు. కొందరు ఐతే ఏకంగా నాన్‌వెజ్ టిఫిన్స్ కోసం చాట్ గ్రూప్స్ మెయింటెన్ చేస్తున్నారు. వారాంతాల్లో జాతరే!రోజు రోటీ, ఇతర టిఫిన్లు తినేందుకు నాన్‌వెజ్ టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్ల వద్ద కస్టమర్లు బారులు తీరుతున్నారు. శని, ఆదివారం వచి్చందంటే చాలు మాంసాహార టిఫిన్‌సెంటర్ల ముందు జాతర కనిపిస్తుంది. భాజీగుర్దా.. ఖీమాతో రోటీపాటు, ఇడ్లీ, వడ, దోశ వంటి అల్పాహారాలు కూడా మాంసం కూరలతో తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కస్టమర్లతో రెస్టారెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మార్నింగ్ వాకర్లు, స్మిమ్మర్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు, క్రికెటర్లు వారాంతపు రోజులు, సెలవు దినాల్లో వ్యాయామం ముగించుకున్నాక నేరుగా మాంసాహార టిఫిన్ సెంటర్ల వద్దకు చేరుకుంటారు. వీళ్లే కాకుండా పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా సెలవు దినాల్లో నాన్‌వెజ్ టిఫిన్స్ ఆరగించేందుకు ఉవి్వళ్లూరు తున్నారు. -
ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేయండి: కేటీఆర్ రిక్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో తాము ప్రవేశపెట్టిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.తమిళనాడు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను విస్తరించిన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పిల్లలతో బ్రేక్‌ఫాస్ట్ తింటున్న వీడియోను కేటీఆర్ మంగళవారం(జులై 16) ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసి కామెంట్ చేశారు.‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ లాంటి అద్భుతమైన స్కీమ్‌ను రద్దు చేయడం నిజంగా దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. స్కీమ్‌ను విస్తరించాలని కూడా భావించింది. ప్రస్తుత ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలి’అని కేటీఆర్ కోరారు. -
అల్పాహారం తిని 20 మందికి అస్వస్థత
రామాయంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్లో అల్పాహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్నారు. ఇంతలో ఓ విద్యార్థిని బల్లి పడటం చూశానని ఆరోపిస్తుండగా అప్పటికే తిన్న వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హాస్టల్ వార్డెన్ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో 20 మందికి గ్లూకోజ్ ఎక్కించి వైద్యసేవలు అందించగా కోలుకున్నారు. సమాచారం తెలుసుకున్న మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, తహసీల్దార్ రజనీకుమారి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పంజా విజయకుమార్ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థినులను పరామర్శించారు. అనంతరం ఆర్డీఓ, డీఈఓ, తహసీల్దార్ హాస్టల్‌కు వెళ్లి వండిన అన్నాన్ని పరిశీలించారు. వంటపాత్రలను, బియ్యాన్ని, ఇతర స్టాక్‌ను కూడా పరిశీలన చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి హాస్టల్లోనే భోజనం చేశారు. వంట చేస్తున్న క్రమంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. -
ఫాస్టింగ్ని.. ఇలా బ్రేక్ చేద్దాం!
రేపు ఉదయం దోసెలు కావాలంటే... ఈ రోజు ఉదయమే పప్పు నానబెట్టాలి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే... ఇదిగో... ఇవి ప్రయత్నించండి. దినుసుల కోసం బజారుకెళ్లక్కర్లేదు. పోపుల పెట్టె ముందు పెట్టుకోండి. ఫ్రిజ్ తెరిచి అరలన్నీ వెతకండి. ఇక బాణలి పెట్టి స్టవ్ వెలిగించండి..బ్రెడ్ ఉప్మా..కావలసినవి..బ్రెడ్ ముక్కలు – 3 కప్పులు;నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు;అల్లం తురుము – టీ స్పూన్;వెల్లుల్లి తురుము – టీ స్పూన్;పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు;ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;టొమాటో ముక్కలు – కప్పు;పసుపు – అర టీ స్పూన్;మిరప్పొడి – టీ స్పూన్;టొమాటో కెచప్ – టేబుల్ స్పూన్;నిమ్మరసం– 2 టీ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;ఆవాలు – 2 టీ స్పూన్లు;కరివేపాకు– 1 రెమ్మ;తరిగిన కొత్తిమీర– టేబుల్ స్పూన్;నీరు– 2 టేబుల్ స్పూన్లు.తయారీ..వెడల్పుగా ఉన్న బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి.ఆవాలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు వేయించాలి.ఇప్పుడు టొమాటో ముక్కలు, పసుపు, మిరప్పొడి, నీరు వేసి కలిపి మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి.ఇప్పుడు టొమాటో కెచప్, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి ఓ నిమిషం పాటు మగ్గనివ్వాలి.చివరగా బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసి సమంగా కలిసేటట్లు కలుపుతూ ఓ నిమిషం పాటు వేయించి దించేయాలి. గమనిక: బ్రెడ్ ఉప్మా చేయడానికి తాజా బ్రెడ్ మాత్రమే కాదు గట్టిపడిపోయిన బ్రెడ్‌తో కూడా ఉప్మా చేసుకోవచ్చు.వీట్ వెజిటబుల్ చీలా..కావలసినవి..గోధుమపిండి – 2 కప్పులు;టొమాటో ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (సన్నగా తరగాలి);క్యారట్ తురుము – పావు కప్పు;తరిగిన పచ్చిమిర్చి – టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నీరు – 2 కప్పులు (చిక్కదనం చూసుకుని అవసరమైతే పెంచుకోవచ్చు);నూనె – టేబుల్ స్పూన్;తయారీ..గోధుమ పిండిలో ఉప్పు వేసి నీరు పోసి పెరుగు చిలికే బీటర్‌తో చిలకాలి.ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.పెనం వేడి చేసి పెనాన్ని పచ్చి ఉల్లిపాయతో రుద్దాలి.ఇప్పుడు గోధుమపిండి మిశ్రమం ఒక గరిటె వేసి జాగ్రత్తగా రుద్దాలి.దోశెలాగ పలుచగా రుద్దకూడదు. ఊతప్పంలాగ మందంగా ఉంచాలి.ఈ గోధుమపిండి అట్టు చుట్టూ అర టీ స్పూన్ నూనె వేయాలి.మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా కాలనివ్వాలి.ఇలాగే పిండినంతటినీ అట్లు వేసుకోవాలి. ఈ వీట్– వెజిటబుల్ చీలాని చట్నీ లేదా సాంబార్‌తో తింటే రుచిగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా..కావలసినవి..గోధుమపిండి – కప్పు;జొన్న పిండి – అర కప్పు;రాగి పిండి – అర కప్పు;సజ్జ పిండి– అర కప్పు;మెంతి ఆకులు – అర కప్పు (తరగాలి);నువ్వులు – టేబుల్ స్పూన్;అల్లం – పచ్చిమిర్చి పేస్ట్ – టీ స్పూన్;నూనె – టీ స్పూన్;అవిశె గింజలు – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;నూనె– 3 టేబుల్ స్పూన్లు.తయారీ..పైన చెప్పుకున్న పదార్థాల్లో నూనె మినహా మిలిగినవన్నీ ఒక వెడల్పు పాత్రలో వేసి గరిటెతో కలపాలి.తర్వాత నీటిని పోసి చపాతీ పిండిలా కలపాలి.పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని చపాతీలా వత్తి పెనం మీద వేసి, కొద్దిగా నూనె చిలకరించి రెండు వైపులా చపాతీ కాల్చినట్లే దోరగా కాలిస్తే మల్టీగ్రెయిన్ మేథీ థెప్లా రెడీ.వీటిని ఇక వేరే కాంబినేషన్ అవసరం లేకుండా నేరుగా తినవచ్చు.పప్పు లేదా కూరలతో కూడా తినవచ్చు. లంచ్‌కి ప్యాక్ చేసుకుని వెళ్లడానికి కూడా అనువుగా ఉంటాయి.ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు తింటే చాలు, మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. -
నటి మలైకా అరోరా ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే..!
బాలీవుడ్ నటి మలైకా అరోరా ఐదు పదుల వయసు దాటినా యువ హిరోయిన్లకు దీటుగా అందంగా ఉంటుంది. ఇప్పటికి వయసు 20 అనేలా ఉంటుంది. ఎప్పటికప్పుడూ సరిక్తొత ఫ్యాషన్ డ్రెస్‌లతో తన స్టన్నింగ్ లుక్‌తో మిస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఇంత వయసొచ్చిన ఎక్కడ వృధాప్య ఛాయలు కనపడను కూడా కనపడవు. ఈ ముద్దుగమ్మ ఇంతలా గ్లామర్ మెయింటైన్ చేసేందుకు ఎలాంటి తాను ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో షేర్ చేసింది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌లు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యం తోపాటు అందం మీ సొంతం అని చెబతోంది. ఇంతకీ ఆమె ఇష్టంగా తీసుకునే బ్రేక్ఫాస్లు ఏంటంటే..అవకాడోతో చేసిన బ్రేక్ ఫాస్ట్‌లు తీసుకుంటుంది. ఆ అవకాడోతో నిమిషాల వ్యవధిలా ఎలా బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవచ్చో కూడా సవివరంగా తెలిపింది. అవేంటంటే.. క్లాసిక్ అవోకాడో టోస్ట్ : ఇది కేవల పది నిమిషాల్లో రెడీ అయిపోతుందట. కావల్సిందల్లా కేవలం అవకాడో, బ్రెడ్, ఆలివ్ ఆయిల్, మసాల ఉంటే చాలు. చక్కడగా బ్రేడ్ని వేయించి అవకాడో చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టి దానిపై మసాల వేసి తింటే టేస్ట్ అదుర్స్ అని అంటోంది. చాలా ఈజీ రెసీపీ, త్వరితగతిన చేసుకోవచ్చు అని చెబుతోంది మలైకా అరోరా అవోకాడో ఫెటా చీజ్ టోస్ట్ దీనికి అవకాడో ముక్కలు, పుల్లని పిండి, ఫెటా చీజ్, వేయించిన గుడ్లు ఉంటే చాలు. కేఫ్ స్టైల్ అవకాడో టోస్ట్ సిద్దమయ్యిపోతుంది. అవోకాడో చియా టోస్ట్ అత్యంత పోషకమైన వంటకాల్లో ఇది ఒకటి. జస్ట్ పదినిమిషాల్లో చేసుకోవచ్చు. నిమిషాల్లో తయారయ్యే వంటకం. కేవలం అవకాడో చియా గింజలు ఉంటే చాలు. రెసిపీ రెడీ అయ్యిపోతుంది. తురిమిన గుడ్డు అవోకాడో టోస్ట్ ఇక్కడ అవకాడో తురుము, గుడ్లు తురుముతో చేసే రెసిపీ. ఇది మంచి రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. వీట్ ఆవకాడో టోస్ట్ గోధుమ పిండి, అవకాడోలతో చేసే వంటకం. అయితే ఇది చేయడానకి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇది కూడా మంచి ఆరోగ్య కరమైన అల్పాహారం అని చెబుతోంది. మలైకా. అంతేగాదు మన రోజువారీ డైట్లో బలవర్ధకమైన ఆహారం ఉంటే ఆరోగ్యవంతంగా ఉండటమే గాక మంచి గ్లామర్‌ని కూడా పొందగలుగుతామని చెబుతోంది మలైకా అరోరా. (చదవండి: ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!) -
టిఫినీలు చేసి.. చదివేసి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారం అందించడం, బడిపై పిల్లల్లో ఆసక్తి పెంచడం లక్ష్యంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన ‘ముఖ్యమంత్రి ఉపాహార పథకం’పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా.. పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ ఉపాహార పథకం మ రింత దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. బడి మానేసే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే పిల్లలకు కావాల్సిన ఆహారం విషయమై తామిక ఎలాంటి హడావుడి పడాల్సిన అవసరం ఉండదని తల్లిదండ్రులు అంటున్నారు. రోజుకో రకం అల్పాహారం అందిస్తుండటంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని, క్రమం తప్పకుండా బడికి రావడం వల్ల చదువుల్లోనూ రాణించేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరోగ్యం, ప్రమాణాల పెంపే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి ఉపాహారం పథకం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో 1–10 తరగతులు చదివే విద్యార్థులు 23,05,801 మంది ఉన్నారు. వీళ్ళంతా పేద, మధ్య తరగతికి చెందిన వారే. రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళూ ఎక్కువ మందే ఉన్నారు. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సైతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉదయాన్నే హడావుడిగా తమ పనులకు వెళ్ళడం వల్ల స్కూలుకెళ్లే పిల్లలను పట్టించుకోవడం కష్టంగానే ఉంటోంది. చాలామంది పిల్లలు ఉదయం పూట ఆహారం తీసుకోకుండానే స్కూలుకు వెళ్ళాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం అందిస్తున్నా ఈలోగా తరగతి గదిలో నీరసపడిపోతున్న ఘటనలూ ఉంటున్నాయి. మరోవైపు సరైన పౌష్టికాహార లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్ర విద్యా, ఆరోగ్యశాఖలు జరిపిన సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఎక్కువ మందిని పౌష్టికాహార లోపం వెంటాడుతోందని తేలింది. దీనివల్ల రక్తహీనత, దృష్టి లోపం ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఈ పరిస్థితుల్లోనే నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన ఉపాహారం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో పదో తరగతికి చేరే నాటికే బడి మానేస్తున్న వారి శాతం 13.9గా ఉంటోంది. పేదరికం, సరైన ఆహారం అందే పరిస్థితి లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఉపాహారం అందుబాటులోకి తేవడం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం సార్.. బ్రేక్‌ఫాస్ట్ సూపర్ ఈ రోజు మా స్కూల్లో ఇచ్చిన ఇడ్లీ, పూరీ, కిచిడీ, చట్నీ, సాంబార్ చాలా బాగున్నాయి. ఆరు రోజుల పాటు రకరకాల బ్రేక్ ఫాస్ట్ ఇస్తారట. మా కోసం మంచి పథకం తీసుకొచ్చి న సీఎం సార్‌కు కృతజ్ఞతలు. – హైమావతి, ఏడో తరగతి, రావిర్యాల ప్రభుత్వ పాఠశాల (రంగారెడ్డి జిల్లా) ఇంట్లో సమస్య తీరిపోతుంది ఉదయం పిల్లలు తినీతినకుండానే హడావుడిగా బడికి వెళ్తారు. ఇప్పుడు ప్రభు త్వం ఉపాహారం అందిస్తుండటంతో ఆ సమస్య తీరిపోతుంది. ఇంట్లో తినకుండా మారం చేసేవాళ్లు కూడా అక్కడే బుద్ధిగా తింటారు. మధ్యాహ్న భోజన పథకం మాదిరిగానే ఈ పథకాన్ని కూడా నిరంతరం కొనసాగించాలి. – గుడిమల్ల రాజేష్, విద్యార్థి తండ్రి, భూపాలపల్లి ఈ పథకం ఎంతో ఉపయోగకరం మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులు అధిక శాతం పని చేసుకుంటూ జీవించేవారే. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా విద్యార్థినులు అందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందుతుంది. ఇకపై ఎవరూ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా క్లాసులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు. – మోహనాచార్యులు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మారేడుపల్లి -
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్..మెనూ ఇదే..
-
CM's Breakfast Scheme: సీఎం అల్పాహారంలో ఇడ్లీ సాంబార్, పూరీ కుర్మా కూడా!
సాక్షి, హైదరాబాద్: సాంబార్ ఇడ్లీ, పూరీ–ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఖరారయ్యింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం ప్రారంభించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్‌కి బదులు.. మంత్రి హరీశ్‌రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అల్పాహార పథకం ప్రారంభిస్తారు. విద్యార్థులను బడికి రప్పించడం, వారికి తగిన పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,147 పాఠశాలల్లో 1–10వ తరగతి వరకు చదివే 23 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. హెచ్ఎంలకు నిర్వహణ బాధ్యత రాష్ట్ర విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో అమలయ్యే ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని తొలుత నియోజకవర్గానికి ఒకటీ రెండు పాఠశాలల్లో లాంఛనంగా ప్రారంభిస్తారు. దసరా నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠ శాలల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను, మెనూను విద్యా శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది. అన్ని రకాల విటమిన్స్ లభించే పౌష్టికాహారంతో రోజుకో రకమైన బ్రేక్‌ఫాస్ట్ ఉంటుందని అధికారులు తెలిపారు. పథకం నిర్వహణ బాధ్యత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యులపైనే పెట్టారు. మండల నోడల్ అధికారి మండల స్థాయిలో, జిల్లా విద్యాశాఖాధికారి జిల్లా స్థాయిలో, పాఠశాల విద్య శాఖ రాష్ట్ర స్థాయిలో పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులకు అల్పాహారం అందుతున్న తీరును పర్యవేక్షించే అధికారాలు ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ అందించే వేళలివే..: మధ్యాహ్న భోజనం పథకం కార్మికులే అల్పాహారం తయారు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలు ఉదయం 9.30 మొదలవుతాయి. ఆయా చోట్ల ఉదయం 8.45 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. జంటనగరాల్లో ప్రైమరీ స్కూళ్ళు ఉదయం 8.45 గంటల నుంచి మొదలవుతాయి. దీనివల్ల ఈ స్కూళ్ళలో ఉదయం 8 గంటలకే బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.45 గంటలకు, జంటనగరాల్లో ఉదయం 8 గంటలకు అల్పాహారం అందిస్తారు. ఆరు రోజులు..ఆరు రకాలు సోమవారం: ఇండ్లీ సాంబార్ లేదాపచ్చడితో కూడిన గోధుమరవ్వ ఉప్మా మంగళవారం: ఆలూ కుర్మాతో పూరీ లేదా టమాటో బాత్ సాంబార్‌తో బుధవారం: సాంబార్ ఉప్మా లేదా చట్నీతో కూడిన బియ్యం రవ్వ కిచిడీ గురువారం: మిల్లెట్స్ ఇడ్లీ విత్ సాంబార్ లేదా సాంబార్‌తో పొంగల్ శుక్రవారం: ఉగ్గానీ, పోహా,మిల్లెట్ ఇడ్లీ విత్ చట్నీలో ఏదో ఒకటి లేదా గోధుమరవ్వ కిచిడీ చట్నీతో శనివారం: సాంబార్‌తో పొంగల్ లేదా వెజిటబుల్ పలావ్, రైతా, ఆలూకుర్మా డ్రాపౌట్లు తగ్గిస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికా హారం అందించే ఈ పథకం విద్యార్థుల డ్రాపౌట్ల (బడి మానేవారి సంఖ్య)ను తగ్గిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.672 కోట్లు తన వాటాగా ఖర్చు చేస్తోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో కూడిన భోజనం, వారానికి మూడు గుడ్లను అందిస్తున్నామని తెలిపారు. ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో రూ. 32 కోట్లు వెచ్చించి రాగి జావను ఇస్తున్నామని చెప్పారు. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
నేటి నుంచి విద్యార్థులకు అల్పాహారం పథకం
మంచిర్యాల: సర్కారు బడిలో విద్యార్థులకు అల్పాహారం పథకం శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానుంది. జిల్లాలో నియోజకవర్గానికో పాఠశాలలో పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మంచిర్యాల నియోజకవర్గంలో న్యూగర్మిళ్ల పాఠశాల, చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి ఫిల్డర్బెడ్ ఎంపీపీఎస్, బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి 2ఇంక్లైన్ ఎంపీపీఎస్‌ల్లో పథకాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, ప్రభుత్వ విప్ సుమన్, దుర్గం చిన్నయ్య ప్రారంభిస్తారు. పాఠశాల సమయానికి కంటే 45 నిమిషాల ముందు అల్పాహారం అందిస్తారు. పిల్లలో పోషకాహార లోపం నివారించడం, తరగతి గదిలో హాజరు నమోదు పెంచడానికి ప్రభుత్వం అల్పాహార పథకాన్ని అమలు చేస్తోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఎప్పుడో..? డ్రాపౌట్స్ నివారణతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు నిర్ణయించనట్లు 2020 జూలై 18న కేసీఆర్ ప్రకటించారు. మూడేళ్లయినా పథకం అమలుకు నోచుకోక విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలల్లో 3,600 మంది విద్యార్థులు ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కళాశాలకు ఉదయం 8గంటలకు బయలుదేరితే ఇంటికి వెళ్లేసరికి రాత్రి 8గంటలు దాటుతుందని తెలుస్తోంది. కళాశాలలో చదివే విద్యార్థులందరూ పేదలు కావడంతో ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండానే కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో అర్ధాకలితో పాఠాలు అర్థంకాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న ప్రభుత్వం కనీసం కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. మెనూ ఇలా.. సోమవారం : ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం : పూరి, ఆలుకూర్మా లేదా టోమాటో బాత్, సాంబార్ బుధవారం : ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ గురువారం : చిరుధాన్యాల ఇడ్లీ, సాంబారు లేదా పొంగల్, సాంబారు శుక్రవారం : ఉగ్గని, అటుకలు, చిరుధాన్యాల ఇడ్లి, చట్నీ, లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ శనివారం : పొంగల్, సాంబారు లేదా కూరగాయల పులావ్, పెరుగు చట్నీ, ఆలుకుర్మా -
‘అల్పాహారం’ ఎలా?.. మెనూ తేల్చకుండానే అమలుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ‘అల్పాహారం’ అమలు విధివిధానాల ఖరారు, మెనూపై ఓ స్పష్టత రాకముందే ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలతో అధికారుల్లో హడావుడి మొదలైంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని దసరా రోజు ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే వచ్చేవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ పథకాన్ని ఈ నెల 6నే మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల నుంచి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే విద్యార్థులకు ఏ రోజు ఏం ఇవ్వాలనే దానిపై అధికారులు స్పష్టతకు వచ్చినట్టు లేదు. మెనూపై రూపొందించిన నివేదికపై ఈవారం మంత్రి సబితతో సంప్రదింపులు జరపాలని భావించారు. మార్పులు చేర్పులపై అధికారుల్లో నూ తర్జనభర్జన జరుగుతోంది. దీంతోపాటు అల్పాహారం అమలుకు విధి విధానాలు, ఏ అధికారులకు ఏ తరహా బాధ్యతలు అప్పగించాలనే దానిపై విద్యా శాఖ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. కార్యక్రమాన్ని హడావుడిగా ప్రారంభించినా, కొద్దిరోజుల పాటు అమలు మాత్రం కష్టమేనని అధికారులు అంటున్నారు. దీనిపై వివరణ కోరేందుకు విద్యాశాఖ ఉన్నతాధి కారులను సంప్రదించగా, వారు నిరాకరించారు. చదవండి: ‘కానిస్టేబుల్’ తుది ఫలితాల వెల్లడి -
30 మంది విద్యార్థినులకు అస్వస్థత
మంచాల: హాస్టల్లో వడ్డించిన అల్పాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బీసీ బాలికల వసతి గృహంలో మొత్తం 94 మంది విద్యార్థినులు ఉన్నారు. శనివారం ఉదయం వీరికి అల్పాహారంగా పులిహోర పెట్టారు. అందులో పురుగులు వచ్చాయని విద్యార్థినులు చెబుతున్నా రు. అల్పాహారం తిన్నవారిలో ఒకరి తర్వాత ఒకరు తలనొప్పి, కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. పదుల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురికావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంట వ్యవధిలోనే 30 మందికి పైగా విద్యార్థినులు వాంతులు చేసుకుని, కాళ్లు, చేతులు లాగుతున్నాయని వాపో యారు. వారికి ఆస్పత్రి వైద్యుడు శ్రావణ్ కుమా ర్‌రెడ్డి చికిత్స చేశారు. కాగా, తీవ్ర అస్వస్థతకు గురై న కె.అనిత (7వ తరగతి), కె.అఖిల (8), వి.వైష్ణవి (5), ఎం.శిరీష (5), పి.అక్షర (3), ఎం.పూజ (7), ఆర్.త్రిష (10), ఎం.శ్రీనిధి (4వ తరగతి)ని మెరు గైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇందులో నలు గురిని వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తీసు కెళ్లారు. విద్యార్థుల విషయంలో వార్డెన్‌తో పాటు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ సంఘాల నాయకులు ఆరోపించారు. -
పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10 వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. దీనివల్ల విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీపనులు చేసుకోవడానికి వెల్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా ఈ అల్పాహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరానుంచి అమలు చేయనుంది. చదవండి: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. కాగా.. తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఇటీవలే పంపించారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చింది. అయితే విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సీఎం కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టు ను అందచేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్టర ప్రభుత్వ ఖజానా పై ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడనున్నది. -
జైలులో చంద్రబాబు బ్రేక్ ఫాస్ట్ ఇదే..
-
టిఫిన్‌లో ఇడ్లీ, దోశలు తింటున్నారా? అయితే ఆ వ్యాధి బారినపడ్డట్లే!
సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అని అడిగితే ఎవరైనా ఠక్కున ఇడ్లీ, దోశ అని అనేస్తారు. ఇంతకుముందు అయితే పెరుగులో సద్దన్నం, జొన్న గటక, రాగి సంకటి వంటివి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని అల్పాహారంగా తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇడ్లీ, దోశలను తెగ లాగించేస్తున్నాం. దీనికి తోడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, నెయ్యి లాంటివి కాంబినేషన్‌గా తినేస్తున్నాం. దీనివల్ల రుచి సంగతేమో కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోజులు మారాయి, పద్ధతులు మారాయి, ఆహారపు అలవాట్లూ మారాయి. టిఫిన్స్‌లో ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, వడలను తెగ తినేస్తున్నారు. దీనికి తోడు ఒకేసారి పిండి గ్రైండ్ చేసి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మూడు, నాలుగు రోజులు ఆరంగించేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తప్పితే, ఉదయం, రాత్రిళ్లూ టిఫిన్ల మీద తిని బతికేస్తున్నారు చాలామంది. ఇడ్లీ, దోశ, వడ, పూరీ, పరోటా, బోండా లాంటి టిఫిన్లను ధీర్ఘకాలంగా తింటే అనేక రోగాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఉదాహరణకు వడ తీసుకుంటే.. బియ్యంతో పోలిస్తే మినపప్పులోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. 12 ఏళ్ల పాటు వరుసగా ఇడ్లీ దోశ తినేవారికి మధుమేహ సమస్యలు తొందరగా వచ్చే అవకాశం ఉందట.ఎక్కువగా ఈ టిఫిన్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో పాటు కీళ్లనొప్పులు తొందరగా అటాక్ చేస్తాయి. ఇడ్లీ, దోశల్లో అన్ని క్యాలరీలా? అన్ని టిఫిన్స్‌తో పోలిస్తే పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది ఎంచుకునేది ఇడ్లీనే. ఇది ఆరోగ్యానికి కాస్త మంచిదే అయినా దాంతో తినే సాంబార్, కారంపొడి వంటివి అసిడిటీని పెంచేస్తాయి. రెండు ఇడ్లీలు తింటే 60 కేలరీలు వస్తాయి. అందుకే ఇడ్లీలను రవ్వతో కాకుండా జొన్నలు, రాగులతో చేసుకుంటే బెటర్. ఇక దోశల్లో వాడే నూనె చాలా ముఖ్యమైనది. చాలామంది టిఫిన్స్ బయట హోటళ్లలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం, నాణ్యత లేని ఆయిల్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక దోశ తింటే 132 క్యాలరీల శక్తి వస్తుంది. రోజూ దోశ తినే అలవాటు ఉంటే బియ్యానికి బదులుగా ఓట్స్, రాగితో హెల్తీ దోశ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు. బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి ►చద్దన్నం, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఖర్జూరాలు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకుంటే కొద్దిరోజుల్లోనూ మీ శరీరంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు. ► కొంతమంది రాత్రిళ్లు కూడా టిఫిన్లు తినేస్తుంటారు. వాటిని తగ్గించేసి రాత్రిపూట పండ్లను తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ►ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. -ఇక ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్స్ తినకుండా ఉండలేము అనుకునేవాళ్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లకు పరిమితం చేస్తే మంచిది. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్తీ అని లాగించేవాళ్లు కాస్త డైట్ ప్రకారం మితంగా తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్యం తప్పదంటారు న్యూట్రిషియన్లు. -
మొబైల్ ఘుమఘుమలు
ఇప్పుడు ప్రతి విషయాన్ని కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బుకు అత్యంత విలువ ఇస్తున్నారు. అంతేకాదు.. నాణ్యమైన భోజనంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇరుకు సందుల్లో, జనం గుమికూడిన ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. నగర శివారులోకి వెళితే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన అల్పాహారం తక్కువ ధరలోనే లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చెట్ల నీడన.. అప్పటికప్పుడు తయారు చేస్తున్న అల్పాహారం తినేందుకు ఇష్టపడుతున్నారు. – సాక్షి, కర్నూలు డెస్క్ డబ్బుంటే పెద్ద హోటళ్లకు వెళ్లి తింటారనుకోవడం పొరపాటు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇప్పుడు మంచి హోటల్ ఎక్కడుందని వెతుక్కోవడం మాని శివారు ప్రాంతాల్లో మొబైల్ క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నారు. ఉదయాన్నే గుత్తి పెట్రోల్ బంకు, నంద్యాల చెక్‌పోస్టు, రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మొబైల్ క్యాంటీన్ల చుట్టూ గుమికూడిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తాయి. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వాళ్లు నగరంలోకి వెళ్లే ముందే టిఫిన్ కానిచ్చేస్తే ఆ తర్వాత వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అక్కడే ఆగిపోతున్నారు. ఏదైనా పని మీద వచ్చినా, లేదా కుటుంబంతో వచ్చినా సుమారు ఐదారుగురు వెంట ఉంటుండటంతో మొబైల్ క్యాంటీన్ ఎంచక్కా వీరి ఆకలి తీరుస్తోంది. నగరంలోని ఏ హోటల్‌కు వెళ్లినా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం టిఫిన్ చేయాలంటే సుమారు రూ.500 పైమాటే అవుతుంది. ఇక కూర్చొని తినే హోటళ్లు అయితే.. ఆర్డర్ ఇచ్చిన ఏ అరగంటకో కానీ టిఫిన్ టేబుల్ మీదకు రాని పరిస్థితి. చివరగా టిప్ ఇవ్వకపోతే వెయిటర్ అదో రకంగా చూడటం షరామామూలే. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద టిఫిన్ చేస్తే అప్పటికప్పుడు రుచికరమైన అల్పాహారం క్షణాల్లో రెడీ అయిపోతుంది. అందునా ఏ టిఫిన్ చేసినా రూ.30 మాత్రమే తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్ల వద్ద రద్దీ కూడా అధికంగానే ఉంటోంది. రోజుకు రూ.5లక్షల పైనే వ్యాపారం నగరంలోని ప్రధాన కూడళ్లలో దుకాణం అద్దెకు తీసుకోవాలంటే వేల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. డిపాజిట్ లక్షల్లో చెల్లించడం సరేసరి. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు సరికొత్త ఆలోచనతో రోడ్డెక్కుతున్నాయి. కావాల్సిన విధంగా మార్పులు చేసుకొని సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఒక కూడలిలో వ్యాపారం జరగకపోతే కొంతకాలానికి మరోచోటుకు మార్చుకునే అవకాశం ఉండటం కూడా మొబైల్ క్యాంటీన్లపై ఆసక్తి పెంచుతోంది. ఇకపోతే ప్రస్తుతం నగరంలో వీటి సంఖ్య 80కి పైగానే ఉండటం విశేషం. ప్రతిరోజూ వీరి వ్యాపారం రూ.5లక్షలకు పైగానే ఉంటోందంటే భోజన ప్రియులను ఏస్థాయిలో ఆకట్టుకుంటున్నారో అర్థమవుతుంది. వంట మాస్టర్లకు గిరాకీ హోటల్ వ్యాపారంలో వంట మాస్టర్లు కీలకం. వీళ్లు ఒక్కరోజు సెలవు పెట్టినా యజమాని ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. అందువల్లే మరొకరిని కూడా అందుబాటులో ఉంచుకుంటారు. అయితే మొబైల్ క్యాంటీన్లను ఉదయం మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఆ మేరకు కూలీ ఇస్తున్నారు. చేస్తున్న టిఫిన్ల ఆధారంగా కూడా కూలీ నిర్ణయిస్తున్నారు. నైపుణ్యం ఆధారంగా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని మొబైల్ క్యాంటీన్లు సాయంత్రం కూడా నిర్వహిస్తుండటంతో మాస్టర్లు నెల వారీ జీతం తీసుకుంటున్నారు. వ్యాపారానికి అనువుగా వాహనాలు మొబైల్ క్యాంటీన్ నిర్వాహకులు తమ స్థోమతకు అనువుగా వాహనాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సాధారణంగా వాహనాల ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఉంటుంది. వీటిని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలంటే రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు సెకండ్ హ్యాండ్ వాహనాలను రూ.3లక్షల్లోపు కొనుగోలు చేసి మొబైల్ క్యాంటీన్‌గా అదనపు డబ్బుతో తీర్చిద్దుకుంటున్నారు. ఇతని పేరు ఆంజనేయులు. చిన్న తనంలోనే పారుమంచాల గ్రామం నుంచి కర్నూలు నగరంలో స్థిరపడ్డారు. చెక్‌పోస్టు వద్ద ఒకటి, జి.పుల్లారెడ్డి కళాశాల సమీపంలో మరో మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వీటితో ఇతను ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది కూలీలను ఏర్పాటు చేసుకొని వారికీ ఉపాధి కలి్పస్తున్నారు. ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతను హుస్సేన్‌రెడ్డి. దూరదర్శన్ కేంద్రం సమీపంలో వెంకటసాయి మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఒక వంట మాస్టర్, మరో ముగ్గురు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారం చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వెళ్లే వాళ్లు ఇక్కడే ఆగి టిఫిన్లు చేసి వెళ్తున్నారని చెబుతున్నాడు. ఈ కారణంగా వాళ్లకు తక్కువ ధరలో టిఫిన్ లభించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నాడు. తక్కువ ధరలో అల్పాహారం నగరంలోని హోటళ్లతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో టిఫిన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల కింద ఆహ్లాదకరంగా తినే వీలుంటుంది. కళ్లెదుటే చేస్తుండటంతో నాణ్యత విషయంలోనూ అనుమానం అక్కర్లేదు. రుచికరమైన అల్పాహారం చాలా తక్కువ ధరతో అందిస్తున్నారు. – వెంకటేశ్వర్లు, మెడికల్ రెప్, కర్నూలు కళ్లెదుటే వేడివేడిగా.. మేము కర్నూలులో ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత కాలేజీలో కాస్త పని చూసుకోవాలి. నగరంలోని హోటళ్లకు వెళితే అక్కడ ఆర్డరు చెప్పడం, తీసుకొచ్చే లోపు చాలా సమయం పడుతుంది. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద కళ్లెదుటే వేడివేడి టిఫిన్లు హాయిగా తినొచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. – హుస్సేన్‌వలి, నంద్యాల చాలా రుచిగా ఉంటాయి నేను హమాలీ పని చేస్తుంటా. ఉదయాన్నే పని మీద బయటకు వస్తాం. హోటళ్లలో టిఫిన్ చేయాలంటే మాకు వచ్చే కూలీ సరిపోదు. అందుకే మొబైల్ క్యాంటీన్లలో తింటాం. ఇక్కడ ఎంతో రుచికరంగా, పరిశుభ్రత పాటించి వివిధ రకాల టిఫిన్లను అప్పటికప్పుడు అందిస్తారు. ధరలు కూడా చాలా తక్కువ. – రాజశేఖర్, దూపాడు, కర్నూలు -
హోటళ్లలో తిండి ధరలకు రెక్కలు
బనశంకరి: హోటల్స్‌లో ఆహారాల ధరలకు రెక్కలు రానున్నాయి. పాలు, నిత్యావసరవస్తువులు, కూరగాయలు, గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో బెంగళూరులోని అన్ని హోటల్స్‌లో కాపీ, టీ, అల్పాహారం, భోజనం, చాట్స్‌తో పాటు అన్ని ఆహారపదార్థాలపై 10 శాతం ధర పెంచాలని హోటల్స్ యజమానులు సంఘం తీర్మానించింది. పెంచిన ధరలు ఆగస్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. కాఫీ, టీ ధర రూ.2 నుంచి రూ.3 వరకు, దోసె, ఇడ్లీ, వడ, రైస్‌బాత్, బిసిబెళేబాత్, చౌచౌబాత్ తదితర ఆహారపదార్థాలు ఇప్పడున్న ధరలకు అదనంగా రూ.5 మేర పెరిగే అవకాశం ఉంది. భోజనంపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచాలని బృహత్ బెంగళూరు హోటల్స్ యజమానుల సంఘం తీర్మానించింది. వినియోగదారులకు భారం లేకుండా ధరలు నిత్యావసరవస్తువులు, నెయ్యి, నూనె, పన్నీర్, వంట గ్యాస్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. హోటల్స్ కార్మికులకు వేతనాలు పెంచాల్సి వస్తోంది. దీనికితోడు అద్దెలు పెరిగాయి. వినియోగదారులపై ఎక్కువ భారం మోపకుండా ధరలు పెంచాలని తీర్మానించాం – పీసీ.రావ్, హోటళ్ల సంఘం అధ్యక్షుడు కోవిడ్ నుంచి సమస్య తీవ్రం కోవిడ్ సమయంలో అనేకమంది కార్మికులు పనులు వదిలిపెట్టి వెళ్లారు. వీరిలో చాలామంది తిరిగిరాలేదు. అధిక వేతనం ఇస్తున్నప్పటికీ కార్మికులు లబించడంలేదు. తోపుడు బండ్లపై భోజనం, టిఫిన్లు పెట్టి అమ్ముతున్నారు. దీంతో హోటల్స్ వ్యాపారాలు పడిపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది. – హోటళ్ల యజమానులు -
బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ అరటిపండు తింటున్నారా? అస్సలు అలా చేయకండి
రోజూ ఉదయం అల్పాహారం తప్పనిసరి అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నా కొందరు ఏమాత్రం దీన్ని ఫాలో అవ్వరు. ఖాళీ కడుపుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల గ్యాస్ట్రిక్తో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయం పూట టిఫిన్ చేయరు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ► కొందరు ఓ గ్లాసు పాలతోనే, ఓ చిన్న పండుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని ముగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాసేపటికే ఆకలి మొదలై కనిపించినవన్నీ తినేస్తుంటాం. దీని వల్ల అమాంతం బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. ► ఉదయాన్ని ప్రోటీన్లు, మంచి కొవ్వులు కలగలిపిన ఆహారాన్ని తీసుకోవాలి. సోయా, పప్పు గింజలు, పాలు, పనీర్, గుడ్డు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఛాయిస్. ► తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందుకే ఉదయాన్ని రాగిజావ తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ► పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ► చాలామంది అల్పాహారంలో ఇడ్లీ తీసుకుంటుంటారు. దీంతో పాటు ఒక గ్లాసు పాలు కూడా జత చేసుకుంటే అలసట ఉండదు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. ► ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినకూడదా? అరటిపండ్లలో పోషక విలువలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో దాదాపు 25 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపండ్లను తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల తాత్కాలికంగా బలంగా అనిపించినా కాసేపటికే అలసటగా, ఆకలిగా అనిపించేలా చేస్తుంది. అరటిపండులోని చక్కెర బూస్ట్ కోరికలను ప్రేరేపిస్తుంది.అందుకే అల్పాహారంలో అరటిపండ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్‌గా వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయిని చెబుతున్నారు. -
జనరల్ బోగీల వద్దే భోజనం ప్లేట్ మీల్స్ రూ.50
సాక్షి, హైదరాబాద్: జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికోసం జనాహార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేంద్రాలు ప్రధాన రైల్వేస్టేషన్లలో స్టాళ్లకే పరిమితమయ్యాయి. సాధారణ బోగీల్లో ప్రయాణించేవారి భోజన ఇబ్బందులు తొలగించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనరల్ బోగీలు ఆగేచోటనే ఈ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాంపల్లి రైల్వేస్టేషన్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విజయవాడ, గుంతకల్, రేణిగుంట స్టేషన్ల పరిధిలోనూ ఈ సేవలు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో ఈ తరహా సదుపాయం ప్రవేశపెట్టనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివిడతగా దక్షిణమధ్య రైల్వేలో మొదట నాలుగుస్టేషన్లలో జనాహార్ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. జనరల్ బోగీ ప్రయాణికులు మాత్రం తమకు ఆహారం కావాలంటే ట్రైన్ దిగి స్టేషన్లో అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల నుంచి ఆహారం తెచ్చుకోవాలి. ఈ ఇబ్బందులను తొలగించేందుకే జనరల్ బోగీల వద్దకే జనాహార్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో తయారు చేసిన శుభ్రమైన ఆహారపదార్థాలను ప్రయాణికులకు అందజేస్తారు. రూ.20కే ఏడు పూరీలు, కర్రీ ఇస్తారు. ఇది 250 గ్రాముల వరకు ఉంటుంది. దీనిని ఐఆర్సీటీసీ ఎకానమీ మీల్‌గా పేర్కొంది. కాంబో మీల్ రూ.50కే అందజేస్తారు. ఇందులో 350 గ్రాముల వరకు అన్నం, ఒక కర్రీతోపాటు పప్పు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ప్రయాణికులు డిజిటల్ రూపంలో చెల్లించే సదుపాయం ఉంది. దశలవారీగా విస్తరణ దశలవారీగా సికింద్రాబాద్, తిరుపతి, గుంటూరు, కాకినాడ, వరంగల్, కాజీపేట్ తదితర స్టేషన్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం తక్కువ ధరలోనే లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ తెలిపారు. ప్లేట్ ఇడ్లీ రూ.1,200 గోల్డ్ ఇడ్లీని అమ్ముతున్న హైదరాబాద్ కేఫ్ బంజారాహిల్స్(హైదరాబాద్): గోల్డెన్ ఇడ్లీ.. నగరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త డిష్ ఇది. ప్లేట్ ఇడ్లీ ధర రూ.1200..అందుకే ఆ ఇడ్లీ బంగారమే అనడంతో అతిశయోక్తి లేదు. తినడానికి కొందరు..చూడడానికి మరికొందరు ఇలా భారీ సంఖ్యలో ఆ హోటల్‌కు జనాలు బారులుతీరుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3 నుంచి శ్రీనగర్‌కాలనీకి వెళ్లే రోడ్డులో కర్ణాటక బ్యాంక్ ఎదురుగా రాఘవేంద్ర రెసిడెన్సీలో ఏర్పాటుచేసిన కృష్ణ ఇడ్లీ కేఫ్‌నకు తెల్లవారుజామునుంచే ఫుడ్డీలు చేరుకుంటున్నారు. బంగారు పూత పూసిన ఇడ్లీని గులాబీ రేకులతో కనువిందు చేసే రీతిలో సర్వ్ చేస్తున్నారు. ఒక ప్లేట్‌కు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ గోల్డ్ ఇడ్లీలే కాకుండా బంగారు దోశ, గులాబిజామ్ బజ్జీ, మలాయి కోవా వంటి 100కిపైగా ఫుడ్ ఐటమ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలే కాకుండా చైనీస్ వంటకాలకూ ఈ హోటల్ స్పెషల్. -
దళిత కార్యకర్త ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన కేంద్ర మంత్రి జైశంకర్
వారణాసి: ఈ ఏడాది జీ-20 సమావేశం మన దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 11(ఆదివారం) నుంచి 13వ తేదీ వరకు వారణాసిలో జీ-20 మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జీ-20 సమావేశాల్లో పాల్గొన్న జైశంకర్ ఓ దళిత వ్యక్తి(బీజేపీ బూత్ అధ్యక్షుడు) ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేశారు. మంత్రి రాకకోసం ఒకరోజు ముందు నుంచే ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సుజాత చెప్పారు.'మా కుటుంబమంతా ఆ ఏర్పాట్లలో ఉన్నాం. ఇళ్లు శుభ్రం చేసి కచోరి,ఆలూ పన్నీర్ వండిపెట్టాము. కేంద్ర మంత్రి మా ఇంట్లో తినడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది'అని ఆమె అన్నారు. తమ లాంటి పేదవాళ్ల ఇంట్లో కేంద్ర మంత్రి వచ్చి తినడం చాలా ఆనందాన్ని కలిగించిందని సుజాత మామయ్య చెప్పారు. తిన్న అనంతరం భోజనం చాలా బాగుందని జైశంకర్ చెప్పారు. ఆహార భద్రత,ధాన్యం, ఫర్టిలైజర్స్, చిరుధాన్యాల గురించే ఈ రోజు సమావేశంలో చర్చ జరగనుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ కూడా ఇందులో పాలుపంచుకోనున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి:భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచికి జపాన్ జంట ఫిదా.. -
TS: విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం మొదలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ అందించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ప్రార్థనా సమయానికి ముందు విద్యార్థులకు 250 మిల్లీలీటర్ల చొప్పున రాగిజావ ఇస్తారని చెప్పారు. దీనివల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గురువారం తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును మంత్రి సమీక్షించారు. తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మన ఊరు..మన బడి’, ‘మన బస్తీ.. మన బడి’కింద సకల వసతులతో ఆధునీకరించిన వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభిస్తారని సబిత తెలిపారు. రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న 16,27,457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్ బుక్స్, ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక్కో నోటు పుస్తకం చొప్పున అందించనున్నామన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు, సమాచార బదలాయింపు కోసం రాష్ట్రంలోని 20 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1,600 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 4,800 డిజిటల్ తరగతులను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 10 వేల గ్రంథాలయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు మొదలు వర్సిటీల వరకు విద్యా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు నిర్వహించాలని, రాష్ట్రంలో విద్యా రంగంలో సాధించిన విజయాలను వివరించాలని సూచించారు. రూ.190 కోట్లతో పాఠ్య పుస్తకాలు రూ.190 కోట్లు వ్యయం చేసి 30 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని, ఈ పుస్తకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించామని మంత్రి సబిత తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచి్చంచి ఒక్కో విద్యారి్థకి రెండేసి జతల చొప్పున యూనిఫామ్‌లు అందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ బడుల్లో ఇక రాగి జావ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రధాన మంత్రి పోషణ్’పథకాన్ని ఇక్కడ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు ఐరన్, ఇతర సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్ధేశం. ఈ క్రమంలోనే పోషకాలతో కూడిన రాగి జావను అన్ని తరగతుల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌గా అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే.. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యార్థులకు ఏడాదిలో 110 రోజుల పాటు రాగిజావను పంపిణీ చేస్తారు. ఇప్పటికే స్కూళ్లలో ఇస్తున్న మధ్యాహ్న భోజనానికి అదనంగా.. ఉదయమే ఈ రాగి జావను అందిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో దీని అమలుకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో పీఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ సమావేశం సందర్భంగా ఎందరు విద్యార్థులకు రాగి జావ అందించాల్సి ఉంటుంది? ఇందుకోసం చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. 2023–24లో రాష్ట్రంలో మొత్తంగా 16.82 లక్షల మంది విద్యార్థులకు 110 రోజుల పాటు రాగి జావ అందజేసేందుకు ఆమోదం తెలిపింది. దీనికి రూ.27.76 కోట్లు వ్యయం కానుండగా.. కేంద్రం 16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11.58 కోట్లు భరించనున్నాయి. మధ్యాహ్న భోజనం 231 రోజులు సర్కారు బడుల్లో విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో 231 రోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, బాల వాటికల్లో 231 రోజులు, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో 293 రోజులపాటు మధ్యాహ్న భోజన పథకం అమలుకు పీఏబీ ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు రూ.323.71 కోట్లను వెచ్చించనుండగా.. కేంద్రం రూ.203.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 119.95 కోట్లను భరించనున్నాయి. కేంద్రం మధ్యాహ్న భోజనం కుక్ కమ్ హెల్పర్లకు నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే పారితోíÙకం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేలు అదనంగా కలిపి.. 54,232 మంది సిబ్బందికి నెలకు రూ. 3వేల పారితోషికం ఇస్తోంది. ఈ చొరవను కేంద్రం ప్రశంసించింది. ఆరోగ్య విశ్లేషణ అనంతరం.. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే చేపట్టింది. విద్యార్థుల్లో పోషకాహార లోపం ఉందని, అందుకే చదువుపై సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారని అందులో గుర్తించింది. ఈ క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం ఇచ్చే దిశగా చర్యలు చేపట్టింది. -
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్‌ఫాస్ట్. ఓట్ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
Recipe: సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇలా తయారు చేసుకోండి !
బియ్యపు రవ్వ.. అటుకులతో చేసే సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో ఇంట్లో ఇలా తయారు చేసుకోండి! కావలసినవి: ►బియ్యపురవ్వ – రెండు కప్పులు ►అటుకులు – కప్పు ►పచ్చికొబ్బరి తురుము – కప్పు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – దోసె వేయించడానికి తగినంత. సూర్నాలి దోశ తయారీ ఇలా: ►బియ్యపురవ్వను శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ►నానిన రవ్వలో ఉన్న నీటిని తీసేసి మిక్సీజార్‌లో వేయాలి. ►అటుకులను కూడా కడిగి జార్లో వేయాలి. ►వీటికి కొబ్బరి తురుముని జోడించి కొద్దిగా నీటిని కలిపి దోసెపిండిలా రుబ్బుకోవాలి. ►రుబ్బిన పిండిని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. ►మరుసటి రోజు ఉదయం ఉప్పు కలిపి దోసెలు పోసుకోవాలి. ►దోసె కాలడానికి సరిపడినంత నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సుర్నాలి దోసె రెడీ. ►ఈ దోసె ఏ చట్నీతోనైనా చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా ట్రై చేయండి: Oats Uthappam Recipe: ఓట్స్ ఊతప్పం తయారీ విధానం ఇలా! Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! -
Recipe: హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం తయారీ ఇలా!
రోజూ తినే టిఫిన్లను కాస్త వెరైటీగా చేసుకుంటే కొత్త రుచిని ఆస్వాదించడంతోపాటు, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. అందుకే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ ఊతప్పం రెసిపీ మీకోసం.. ఓట్స్ ఊతప్పం కావలసినవి: ►ఓట్స్ – అరకప్పు ►బియ్యప్పిండి – పావు కప్పు ►పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు ►క్యారట్ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు ►టొమాటో తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి తరుగు. కొత్తిమీర తరుగు – రెండేసి టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా ఓట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడి చేసుకోవాలి ►ఓట్స్ పొడిలో ఉప్పు, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గరిటజారుగా కలుపుకోవాలి ►పాన్‌పై నూనె వేసి పిండిని మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా మీడియం దోసెలా వేసుకోవాలి ►ఇప్పుడు క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగుని ఒకగిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ►ఊతప్పం ఒకవైపు కాలిన తరువాత క్యారట్ ముక్కల మిశ్రమాన్ని ఊతప్పం మొత్తం చల్లుకుని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. ►పిండిమొత్తాన్ని ఇదే విధంగా వేసుకుని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! Chicken Omelette Recipe: చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం ఇలా! -
Health Tips: పరగడుపున ఇవి తింటే చాలా డేంజర్! జాగ్రత్త
మెరుగైన ఆరోగ్యం కావాలంటే.. ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఏ ఆహార పదార్థాలు ఎప్పుడు తినాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పరగడుపున కొన్ని రకాల పదార్థాలు తింటే అనారోగ్యం పాలవుతారు. మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్యనిపుణుల ప్రకారం పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. ►అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపులో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం. వేయించిన చిరుతిళ్లు.. ►ఉదయం వేళల్లో మసాలా లేదా వేయించిన చిరుతిళ్లు తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అతి వద్దు! ►అదే విధంగా పీచు పదార్థాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి. ఛాతీలో మంట.. ►కొంతమందికి బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉంటుంది. తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల శరీరానికి తీవ్రనష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. పూర్తిగా ప్రమాదకరం ►పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు. చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! -
నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు!
ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీలు తాగుతారు. అలాగే బిస్కెట్లు, కుకీలు తింటారు. కానీ ఇది సరైన ఫుడ్ కాదు. మీరు రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాల్సి ఉంటుంది. ఇవి శరీరంలోని అంతర్గత అవయవాలకు శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చూస్తాయి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. ►ఉదయమే ఒక గ్లాసు నీరు తాగడంతో రోజు ప్రారంభించాలి. ►ఆ తర్వాత మనకు నచ్చిన ఏవైనా నానబెట్టిన గింజలు లేదా మొలకలు తీసుకోవాలి. ►వీటిని తీసుకోవడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలసట ఉండదు. ►ఇందుకోసం రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టాలి. ►ఉదయమే కొన్ని నీళ్ళు తాగి వీటిని తినాలి. ఎలాంటి గింజలు తినాలో తెలుసుకుందాం. ►బాదం, ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలని రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి. ►అయితే అవిసె గింజలను ఎప్పుడూ విడిగా నానబెట్టడమే ఉత్తమం. ►వీటికి మరికొన్ని ఆహారాలని కలుపుకోవచ్చు. తేనె, వాల్నట్, మఖానా, జీడిపప్పు, జోడించుకొని తిని తర్వాత పాలు తాగితే శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. చదవండి: Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! -
‘నాకీ భార్య వద్దు’ .. మ్యాగీ వండిపెట్టిందని విడాకులిచ్చాడు
బెంగళూరు: మ్యాగీ చేసి పెట్టినందుకు భార్యకు విడాకులిచ్చాడో భర్త. మ్యాగీ చేస్తే విడాకులిచ్చేస్తారా? అనుమానం రావచ్చు. అతనేమో భోజన ప్రియుడు. ఆమెకేమో వంట రాదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... మూడు పూటలూ మ్యాగీ చేసి పెట్టింది. ఇంకేముంది.. ‘నాకీ భార్య వద్దు’ అంటూ విడాకుల కోసం కోర్టుకెళ్లాడు. పరస్పర అంగీకారం కింద విడాకులూ వచ్చాయి. బళ్లారిలో జరిగిన ఈ ఘటనను మైసూరుకు చెందిన జడ్జి ఎమ్ఎల్ రఘునాథ్ ఇటీ వల వెల్లడించారు. ఈ తరం దంపతులు చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారంటూ ఆయన బళ్లారిలో ఉండగా పరిష్కరించిన ఈ కేసును ఇటీవల ఓ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఒక్క వంట రాదనే కాదు... ప్లేటుకు ఒక పక్క పెట్టాల్సిన ఉప్పుడబ్బాను మరోపక్క పెట్టారని ఒకరు, వెడ్డింగ్ సూట్ కలర్ బాగలేదని మరొకరు విడాకులు తీసుకున్నారని గుర్తు చేశారు. -
ఎంత సంపాదిస్తే ఏం లాభం? వేళకు తిండి, కంటినిండా నిద్రా లేకుంటే!
Healthy Lifestyle Tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజువారీ జీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నారు చాలామంది. కొంత మంది అయితే మాడిపోతున్న పొట్టను పిజ్జా, బర్గర్లతోనో, బిస్కెట్లతోనో మాయ చేస్తూ, కూరుకుపోతున్న కళ్లను టీ చుక్కలతో బలవంతంగా తెరిపి'స్తూ నిద్రాహారాలు మాని మరీ పని చేస్తుంటారు. ఇలా బిజీ లైఫ్‌లో పడి చాలా మంది తమ ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ చూపించడం కూడా మరచిపోతున్నారు. ఫలితంగా కడుపులో అల్సర్లు, గ్యాస్... లావుపాటి కళ్లద్దాలు, ఊబకాయాలతో రకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? వేళకు తిండి, కంటినిండా నిద్రా, ఆ సంపాదనను అనుభవించేందుకు తగిన ఆరోగ్యం లేకపోతే! పరుగులు పెట్టడం తప్పదు, సంపాదించడమూ తప్పదు. అయితే జీవనశైలిలో తగిన మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా... ఆనందంగా జీవించవచ్చు. అందుకు తగిన మార్గాలివిగో... ప్రపంచంతో పాటు పోటీ పడి ముందుకు సాగటం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం. ఇది కాదనలేని సత్యం. అయితే ఇదే సమయంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపడం అత్యవసరం. ఇందుకోసం ప్రతి ఒక్కరు తమ కోసం తాము రోజూ కొంత సమయాన్ని విధిగా కేటాయించాలని, లేదంటే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాయామంతో మొదలు పెట్టాలి కరోనా ప్రభావం వల్ల మొన్నటి దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు చాలా మంది. కొంతమంది ఇప్పటికీ అదే పద్ధతిలో ఉన్నారు. కొన్ని సంస్థలలో మాత్రం వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా, మిగిలిన రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించమని ఉద్యోగులకు చెబుతున్నారు. దీనితో కనీసం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే.. తినడం, పనిచేయడం, పడుకోవడం వంటివి చేస్తున్నారు. దీనిమూలంగా ఒకవిధమైన లేజీనెస్, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించడం, ఇంటిలో చిన్న చిన్న కీచులాటలు తప్పడం లేదు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం లేవగానే రన్నింగ్, జాగింగ్ వంటివి చేయడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే.. ఇంట్లోనే వీలైన వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు లేదా యోగా చేయడం ద్వారా.. పని ఒత్తిడి దూరమై, ప్రతి రోజూ కొత్తగా ప్రారంభించేందుకు వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌ను బ్రేక్ చేయొద్దు: వ్యాయామం చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకించవద్దు. ఇడ్లీ, దోసె, ఉప్మా, చపాతి, మొలకలు, పండ్ల ముక్కలు, కీరా ముక్కలు... ఇలా ఏదైనా సరే మీకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా చేయండి. టిఫిన్ తినకుండా పని చేయడం వల్ల నిస్సత్తువగా ఉండటం, పని మీద ఏకాగ్రత లేకపోవడం, పని చేయడానికి తగిన శక్తి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతే మీ పనిలోకి దిగండి. మంచి నీళ్లు తాగటం మంచిది శరీరంలో అన్ని క్రియలు సరిగ్గా జరగాలంటే నీరు చాలా అవసరం. అందుకే తరచూ నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సమృద్ధిగా నీళ్లు తాగడం వల్ల చర్మం నిగ నిగలాడుతూ.. ఆరోగ్యంగా ఉంటుంది. దాహం అయితేనే నీళ్లు తాగడం అనేది కాకుండా... కనీసం గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోవడమూ మంచిది. ఆహారంపై దృష్టి తప్పనిసరి ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చాలామంది ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. అంతే కాదు, టైమ్ పాస్ కోసం స్నాక్స్ అంటూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రోజు టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకుని.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో స్నాక్స్ వంటివి తీసుకోవడం వల్ల ఆహారంలో రుచితో పాటు పోషకాలు కూడా ఉండేలా చూసుకోవడం అవసరం. రిలాక్సేషన్‌కు రిలాక్సేషన్ ఇవ్వకండి ఎంత పని చేసినా, మధ్య మధ్యలో కాసేపు సేదతీరడం అవసరం. లేదంటే మెదడు వేడెక్కి పనిమీద ధ్యాస తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువ గంటలు పని చేసిన ట్లు అనిపిస్తుంది కానీ చేసిన పని కనిపించదు. ఒత్తిడి వద్దే వద్దు ఇంట్లోనే ఉండటం వల్ల చాలా మందికి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతుండటం సాధారణ సమస్యగా మారింది. ఇందుకోసం ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు పనిని పక్కన పెట్టి.. ఇంట్లో వాళ్లతో మాట్లాడటం కాసేపు ప్రకృతిని ఆస్వాదించడం వంటివి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌గా పక్కన పెట్టేయండి అన్నింటికీ మించి స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఎందుకంటే, చాలా మంది ఫోన్ వాడుతూ టైమ్ ఎంతసేపు గడిచించో కూడా పట్టించుకోరు. అందుకే స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్‌గా వాడటం అలవాటు చేసుకోవాలి. ఎంతసేపు వాడుతున్నాం అనే విషయంపై దృష్టి సారించాలి. నిద్రను జోకొట్టకండి రోజంతా చురుకుగా ఉండాలంటే కంటినిండా నిద్ర పోవడం చాలా అవసరం. రోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. దీని ద్వారా మరుసటి రోజును తాజాగా, నూతనోత్సాహంతో ఆరంభించవచ్చు. మనం పైన చెప్పుకున్నవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లో ఉన్నవారికే అనిపించవచ్చు కానీ, రిటైర్ అయి విశ్రాంత జీవితం గడిపేవారు అయినా, ఇంటి వద్దే ఉండి కుటుంబ సభ్యుల కోసం పనులు చేస్తూ పనిలోనే లీనమైపోయే గృహిణులు అయినా... ఇలా ఎవరూ మినహాయింపు కాదు. చదవండి👉🏾 Vimala Reddy: టైమ్‌పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత.. -
నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులతో బిజీబిజీగా గడిపే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రత్యేకంగా గడిపారు. చెన్నై శివార్లలోని సంచారజాతుల నివాసాలకు వెళ్లి సరదా ముచ్చటించారు. వారి పిల్లాపాపలతో ముచ్చట్లాడి, స్వయంగా ఇడ్లీ తినిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆవడి సమీపంలోని తిరుముల్లవాయల్ పరిసరాల్లో నివసించే సంచారజాతుల నివాసాలను సీఎం స్టాలిన్ శుక్రవారం సందర్శించారు. వీరు పూసలతో హారాలు, గాజులు తయారు చేసే చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కారం తింటే కరోనా రాదయ్యా.. కొద్దిసేపు సీఎం స్టాలిన్ అక్కడి ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆవడి బస్‌స్టేషన్ సమీపంలోని సంచారజాతుల ఇళ్లకు వెళ్లి సంభాషించారు. ఓ ఇంట్లో ఇడ్లీ తిని ఒక బాలికకు తినిపించారు. ఇడ్లీతో పాటు పెట్టిన నాటుకోడి కూర కారంగా ఉందే అని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశ్నించారు. కారం తీంటే కరోనా రాదని మా నమ్మకం అయ్యా అంటూ ఒక మహిళ బదులిచ్చింది. అలాగైతే నేనూ కారం ఎక్కువగా తింటాను అంటూ సీఎం స్టాలిన్ నవ్వుతూ బదులిచ్చారు. ఆ తరువాత అక్కడి ప్రజలకు సీఎం ఆరోగ్య బీమా పథకం కార్డు, రేషన్‌కార్డులు, సామాజిక రక్షణ పథకం కింద ఆర్థిక సాయం, ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. సంచార జాతి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. సంచారజాతుల వారు తయారుచేసిన వివిధ పూసల హారాన్ని సీఎం స్టాలిన్ మెడలో వేసి సత్కరించారు. చదవండి: (రష్యా నుంచి ఎస్–400 మిస్సైల్ సిస్టమ్ రాక) -
చాయ్‌తోపాటు టిఫిన్ ఇవ్వలేదని.. కోడలిని కాల్చి చంపాడు
ముంబై: పిచ్చి పీక్స్‌కు వెళ్లిన ఓ వ్యక్తి కోడలిపై దాష్టీకానికి పాల్పడ్డాడు. చాయ్ (టీ)తో పాటు అల్పాహారం ఇవ్వలేదని ఏకంగా తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన థానేలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)కు అతని కోడలు సీమా రాజేంద్ర (42) గురువారం ఉదయం టీ అందించింది. అయితే, టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వాలని తెలియదా? అంటూ రెచ్చిపోయిన ఆ పెద్ద మనిషి ఆమెపై మాటలతో విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న లైసెన్స్డ్ తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. బాధితురాలి పొట్ట భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కళ్లముందే ఘోరం జరగడంతో నిశ్చేష్టులైన కుటుంబ సభ్యులు గాయాలపాలైన ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచిందని థానే సీనియర్ పోలీస్ అధికారి సంతోష్ ఘటేకర్ తెలిపారు. మృతురాలి తోడి కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కాశీనాథ్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఘటనకు మరేదైన కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. (చదవండి: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి..) -
ఇడ్లీ, దోశ బ్రేక్‌ఫాస్ట్‌లను ఇలా సరికొత్త రుచితో వండుకొని తింటే..
అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల్లో రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు అంతగా సహించవు. రుచి లేదని బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేం కాబట్టి ఇడ్లీ, దోశల తయారీలో కొన్ని కొత్త పదార్థాలను జోడించి వండితే.. రెండు తినేవారు నాలుగు తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లను సరికొత్త రుచితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.. సొరకాయ దోశ కావలసినవి.. మీడియం సైజు సొరకాయ – ఒకటి, బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – నాలుగు కప్పులు, ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), జీలకర్ర – టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఆయిల్ – దోశ వేయించడానికి సరిపడా. తయారీ: ►ముందుగా సొరకాయ తొక్క తీసి శుభ్రంగా కడగాలి. తరువాత గింజలు తీసేసి ముక్కలుగా తరగాలి. ►ముక్కలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ►ఈ పేస్టుని ఒక పెద్దగిన్నెలో వేసి బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లుపోసి బాగా కలపాలి. ►ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కనపెట్టాలి. ►తరువాత వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ చల్లుకుని దోశలా పోసుకోవాలి. ►దోశను రెండువైపుల క్రిస్పీగా కాల్చితే సొరకాయ దోశ రెడీ. చదవండి: Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే! సగ్గుబియ్యం ఇడ్లీ కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, ఇడ్లీ రవ్వ – కప్పు, పుల్లటి పెరుగు – రెండు కప్పులు, బేకింగ్ సోడా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, జీడిపప్పు – 8 తయారీ: ►ముందుగా సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వలను కడగాలి. ►ఒక పెద్దగిన్నెలో సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు పేసి కలపాలి. ►ఈ మిశ్రమంలో రెండు కప్పులు నీళ్లుపోసి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. సమయం లేనప్పుడు కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టాలి. ►నానిన పిండికి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. ►ఇడ్లీ ప్లేటుకు కాస్త ఆయిల్ రాసి జీడిపప్పులు వేసి, వీటిపైన పిండిని వేయాలి. సిమ్‌లో పదిహేను నిమిషాలు ఉడికిస్తే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ. ఏ చట్నీతోనైనా ఈ ఇడ్లీ చాలా బావుంటుంది. -
ఆర్డీవో సాక్షిగా అన్నంలో పురుగులు
బాసర(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ నిర్వహణ తీరు అధ్వానంగా మారింది. విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో మొన్న కప్ప, నిన్న బొద్దింక కనిపించగా... నేడు సాలెపురుగు వచ్చింది. మూడు రోజులుగా విద్యార్థులకు కలుషిత ఆహారం సర్వ్ అవుతూనే ఉంది. మొదటిరోజు ఆలూ కూర్మతో కప్పను, రెండో రోజు పప్పుసాంబారుతో బొద్దింకలని వడ్డించారు శక్తి మెస్ నిర్వాహకులు. మీడియాలో వరుస కథనాలతో సీరియస్ అయిన సర్కార్... మెస్ నిర్వహణపై కలెక్టర్ విచారణకు ఆదేశించింది. ఆర్డీవో లోకేశ్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష ట్రిపుల్ ఐటీలో సోమవారం పర్యటించి మెస్‌లో భోజనం తీరును పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. ఆర్డీవో పరిశీలన కొనసాగుతున్న సమయంలో సైతం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నంలో పురుగులు రావడం తీవ్ర దుమారం రేపింది. వరుసగా కలుషిత ఆహారాన్నే పెడుతున్నా... క్యాంటీన్ నిర్వహిస్తున్న శక్తి మెస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
Health Tips: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. కష్టమే!
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది. అధిక బరువు... టైప్ 2 డయాబెటిస్, కొన్ని క్యాన్సర్లు, గుండె జబ్బులు వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అలాగే, తక్కువ బరువు ఉండటం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత బరువుతో ఆరోగ్యకరంగా జీవించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను ఎంత చిన్న వయసులో ఆరంభిస్తే అంత మంచిది. అయితే, అలా ఆరంభించలేకపోయినందుకు విచారించవద్దు. మీరు ఇప్పుడు నలభైలలో ఉన్నారనుకోండి, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను, జీవన శైలిని ఇప్పటినుంచి ఆరంభించినా, కనీసం అయిదారేళ్లకుపైగా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. అదే అరవైలలో అయితే నాలుగయిదేళ్లు అదనంగా ఆరోగ్యకరంగా జీవించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా అలవరచుకోవాలి. సానుకూలమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కూడా అవసరం. కనీసం ఇప్పుడైనా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే జీవిత కాలాన్ని పొడిగించుకుని ఆరోగ్యంగా... ఆనందంగా జీవించవచ్చు. అల్పాహారం మానద్దు కొంతమంది అల్పాహారం తినడం తగ్గిస్తే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం సమతుల్య ఆహారంలో భాగం అవుతుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పొందడానికి సహాయపడుతుంది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రేక్ వేయకూడదు. తక్కువ ఉప్పు... తక్కువ ముప్పు! ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె వ్యాధులకు దారితీస్తుంది కాబట్టి రుచి కోసం అదనపు ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. చదవండి: అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా? -
బొద్దుగా ఉందని ట్రోలింగ్! పదకొండు కిలోలు తగ్గిన నటి!
ఆ సమీరా.. ఈ సమీరాయేనా? అనేంతగా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాక సమీరా రెడ్డి బాగా లావయ్యారు. మరీ ఇంత బొద్దుగానా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు కూడా. అప్పుడు సమీరా ‘‘తల్లయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ‘ఏంటీ లావయ్యారు?’ అని ఎవరైనా అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదు. మన శరీరం.. మనిష్టం’’ అంటూ తల్లయ్యాక బరువు పెరిగి, బాధపడే అమ్మాయిలను ఉద్దేశించి, నాలుగు మంచి మాటలు కూడా చెప్పారు. అలాంటి సమీరా బరువు తగ్గే పని మీద పడ్డారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం. ఏడాదిలో దాదాపు పది కిలోలు తగ్గారామె. ‘‘గత ఏడాది ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాను. అప్పుడు 92 కిలోలు బరువు ఉండేదాన్ని. ఇప్పుడు 81కి చేరుకున్నాను’’ అన్నారు సమీర. అంటే.. బరువులో పదకొండు పోయే పోచ్ అన్నమాట. ఇక బరువు తగ్గడం వల్ల ఎలా ఉంది? ఎలా తగ్గాలో సమీర చెప్పారు. ► బరువు తగ్గాక నా ఎనర్జీ లెవల్స్ బాగా పెరిగాయి. అలాగే ఏకాగ్రత పెరిగింది. ఇంతకుముందు కంటే చురుకుగా ఉంటున్నాను. నేను బరువు తగ్గడానికి ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ చాలా ఉపయోగపడింది. అంటే.. అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడం వంటిది. ► క్రమం తప్పకుండా చేసిన వ్యాయామాలు నేను తగ్గడానికి బాగా ఉపయోగపడ్డాయి. ► ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటానికి మానసికంగా చాలా కృషి చేశాను. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ పాజిటివ్‌గా ఉంటాయో అప్పుడు మన శరీరం తేలికగా ఉంటుంది. ► బరువు తగ్గాలనుకుంటే ఏదైనా ఒక ఆటను ఎంచుకోవాలి. ఆటలు ఆడితే ఫిట్నెస్కి ఫిట్నెస్.. ఫన్‌కి ఫన్ దొరుకుతాయి. ∙మన జీవిత భాగస్వామి మన బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, ప్రతి వారం మన ఫిట్నెస్ ప్రోగ్రెస్‌ని చెక్ చేస్తూ ఉంటే.. మనకు ఆశాజనకంగా ఉంటుంది. ► అమాంతంగా బరువు తగ్గడం ప్రమాదం. ఇన్ని నెలల్లో ఇన్ని కిలోలు తగ్గితే మంచిది అని తెలుసుకుని, మన టార్గెట్ అన్ని నెలలపై పెట్టాలి. ► చివరిగా చెప్పేదేంటంటే... మీపై మీరు నమ్మకాన్ని కోల్పో వద్దు. అనవసరంగా ఒత్తిడికి గురి కావొద్దు. -
బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!!
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో చాలామంది అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం.. శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల ప్రతి రోజూ అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఏవైనా ఇతర కారణాల వల్ల ఇడ్లీ, చపాతీ, పూరీ, దోసె వంటి వాటిని తీçసుకోవడం ఇష్టం లేకపోతే లేదా సమయం సరిపోకపోతే మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె లేకుండా చపాతీలు, పండ్ల రసాలేకాక... ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలగలిపిన సలాడ్లు వంటివి తీసుకోవడం మంచిది. కనీసం ఇలా చేసినా కూడా అనారోగ్యాన్ని కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్లు దాదాపు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు.. అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధిగమించడమే కాకుండా, జ్ఞాపకశక్తి పెంచుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే డైటింగ్ చేసే వారు నిర్లక్ష్యం చేయకుండా.. అల్పాహారం తీసుకోవడం మరువకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: Mental Health: మంచి మ్యూజిక్, యోగా, డాన్స్, స్విమ్మింగ్.. వీటితో ఒత్తిడి హుష్!! -
ఉపవాసం చేస్తే ఇన్ని ఉపయోగాలా! బరువు తగ్గొచ్చు.. ఇంకా..
ప్రపంచంలోని దాదాపు అన్ని మానవ సమాజాలు ఆహారానికి విరామమివ్వడాన్ని పుణ్యకార్యంగానే భావిస్తాయి. ప్రాచీన ఆరోగ్య విధానాలైన ఆయుర్వేదం లాంటివి ఉపవాసమంటే ఆరోగ్యానికి సహవాసమని చెబుతున్నాయి. ఇక తెలుగు లోగిళ్లలో ‘‘లంఖణం పరమౌషధం’’ అనేది పెద్దవాళ్ల నోట తరుచూ వినే మాటే! ఇవన్నీ ఆషామాషీగా చెప్పిన కబుర్లు కావని, నిజంగానే ఉపవాసానికి, ఆరోగ్యానికి లంకె ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఆకలితో కాలే కడుపుకు అజీర్తి రోగాలు చేరవని, అప్పుడప్పుడు ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) వల్ల ఎనలేని లాభాలని సైంటిస్టులు వివరిస్తున్నారు. పూర్వం రోజుల్లో కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఒకరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండేవారు. దీనిద్వారా పుణ్యం, పురుషార్థం రెండూ కలసి వచ్చేవి. కానీ కాలం మారింది. శారీరక శ్రమ తగ్గి, చల్లటి గదుల్లో కూర్చొని పనిచేసే కొలువులు రావడం, వేళాపాళా లేని ఉద్యోగాలు, జంక్‌ఫుడ్ అలవాటై ఉపవాసం మరుగున పడిపోయింది. ఆధునిక జీవన శైలి పుణ్యమా అని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాదుకదా, కనీసం కొన్ని గంటలు కూడా ఆకలికి ఓర్చుకోకుండా ఏదో ఒకటి నమిలే అలవాటు పెరిగింది. ఇలా అదే పనిగా నోటికి, పొట్టకి విశ్రాంతి ఇవ్వకపోవడంతో రకరకాల వ్యాధులూ విజంభిస్తున్నాయి. యుక్త వయసులోనే ఊబకాయం పలకరిస్తోంది. అందుకే అడ్డదిడ్డంగా తిండి తినే బదులు ఓ క్రమపద్ధతి అలవాటు చేసుకోవాలని, దీనికి ఉపవాసాన్నీ జోడించాలని తాజాగా అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగు పడడం, జీవితకాలం పెరగడంలాంటి పలు ప్రయోజనాలున్నాయని తెలిసిందే, కానీ దీనివల్ల మెదడుపై, నరాల చురుకుదనంపై పాజిటివ్ ప్రభావం ఉంటుందని తాజా పరిశోధనలు వివరిస్తున్నాయి. అసలేంటి ఈ ఫాస్టింగ్? ఎందుకు చేయాలి? ఎంతకాలం చేయాలి? ఎవరు చేయాలి? న్యూరోజెనిసిస్ అంటే ఏంటి? తెలుసుకుందాం... న్యూరోజెనిసిస్ అంటే... మెదడులో కొత్త న్యూరాన్లు పుట్టే ప్రక్రియనే సింపుల్‌గా న్యూరోజెనిసిస్ అంటారు. ఇది సాధారణంగా పిండదశలో జరిగే ప్రక్రియ. కానీ పెద్దల మెదడులోని కొన్ని భాగాల్లో ఈ ప్రక్రియ జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. మెదడులోని హిప్పోక్యాంపస్ ప్రాంతం జ్ఞాపకశక్తికి, కదలికలకు కీలకమైన ప్రాంతం. ఇది ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, అవి ఎక్కువ స్థాయిలో విడుదలైతే క్రమంగా ఉన్న న్యూరాన్లు నశించిపోతుంటాయి. ఈ నశింపు ప్రక్రియ వేగవంతమైతే డెమెన్షియా, ఆల్జీమర్స్‌తో పాటు పలు ఇబ్బందులు ఎదురైతాయి. దీనికి అడ్డుకట్ట న్యూరోజెనిసిస్తోనే సాధ్యం. ఎంతకాలం చేయవచ్చు? ►బ్రైన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం ఫాస్టింగ్ ఎంతకాలం చేయాలన్నది మన లక్ష్యాన్ని బట్టి నిర్దేశించుకోవాలి. అంటే న్యూరోజెనిసిస్ను ప్రేరేపించడమే మన లక్ష్యం కనుక దీనిపైనే శ్రద్ధ పెట్టాలి. మన వయసును బట్టి న్యూరోజెనిసిస్ వేగం ఆధారపడిఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచే దీన్ని యాక్టివేట్ చేయగలిగితే పెద్దయ్యేకొద్దీ ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోగం ►ఎలుకల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోగం జరపగా, 12 గంటలు, 24 గంటలు ఉపవాసం ఉంచిన ఎలుకల్లో తక్కువ న్యూరాన్ల ఉత్పత్తి జరగగా, 16 గంటల ఉపవాసం ఉన్న ఎలుకల్లో న్యూరోజెనిసిస్ చాలా వేగంగా జరిగిందని తేలింది. అసలు ఉపవాసం లేనివాటిలో కొత్త న్యూరాన్ల ఉత్పత్తి ఊసే కనిపించలేదు. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగంటే? ►ఇంటర్మిటెంట్ ఫాస్టింగంటే నిద్ర లేవగానే నోట్లో ఏదో ఒకటి పడేసే అలవాటును దూరం చేసుకోవడమే! దీన్ని పాటించాలనుకున్న రోజున బ్రేక్‌ఫాస్ట్‌కు స్వస్తి పలకాలి. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు తినడం ఆపేయాలి. ఉదయం, రాత్రి తినవద్దన్నామని మిగిలిన సమయమంతా ఎడాపెడా తినేయకూడదు. మధ్యాహ్న భోజనాన్ని వీలయినంత తక్కువగా తీసుకోవాలి. నోటి మరకు విరామం ఇవ్వడం మంచిదే ►మనిషి 16 గంటలు ఉపవాసముంటే బాగా నీరసిస్తాడు కాబట్టి కనీసం 8 గంటల వ్యవధితో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపవాసం వల్ల న్యూరోజెనిసిస్ జరగడంతో పాటు, హద్రోగాలు, మెటబాలిజం సంబంధిత వ్యాధులు దరిచేరవని ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. కొన్నిమార్లు క్రమం తప్పని ఉపవాసం క్యాన్సర్‌ను కూడా అడ్డుకునే అవకాశాలున్నాయన్నది సైంటిస్టుల భావన. సో... నోటి మరకు విరామం ఇవ్వడం మంచిదే కదా! అంత సులభమమేమీ కాదు ►ఈట్ స్టాప్ ఈట్ ఫిట్నెస్ నిపుణుడు బ్రాడ్ పిలాన్ ప్రవేశపెట్టారు. ఇందులో వారంలో ఏవైనా రెండు రోజులు 24 గంటల పాటు ఉపవాసం ఉండాలి. అంటే ఓ రోజు రాత్రి డిన్నర్ చేశాక మరుసటి రోజు రాత్రి డిన్నర్ చేసేంతవరకు ఉపవాసం ఉండాలి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ మధ్య ఉపవాసంగానూ చేసుకోవచ్చు. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే ఇతర పానీయాలు తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ఈ పద్ధతి అనుసరించేటట్లయితే ఆహారం తీసుకొనే దశలో మాత్రం సాధారణంగానే భోజనం ఉండాలి. నిజానికి 24గంటల పాటు ఉపవాసం ఉండడం చాలామందికి అంత సులభమైన విషయం కాదు. ►రోజు మార్చి రోజు(ఆల్టర్నేటివ్ డే) విధానంలో వారంలో మూడు రోజులు రోజు మార్చి రోజు ఉపవాసం ఉండాలి. లేదా 500 కేలరీల ఆహారం తీసుకోవాలి. ఇందులో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నప్పటికీ దీన్ని పాటించడం చాలా కష్టం. మరీ ముఖ్యం ఉపవాసం రోజు రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవడం అంత సులభం కాదు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విధానం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది. మరికొన్ని పద్ధతులు లీన్ గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతి ►లీన్ గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతిలో ఉదయం అల్పాహారం తీసుకోకూడదు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 8గంటల లోపల రెండు, లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవచ్చు. అంటే రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 16 గంటల పాటు ఉపవాసం ఉండాలి. మహిళలైతే 15గంటలు ఉంటే చాలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేని వాళ్లకు ఈ పద్ధతి పాటించడం కష్టం. కానీ అల్పహారం ఎగరగొట్టే వాళ్లకు సులభం. అయితే, ఫాస్టింగ్ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. దీనివల్ల భోజనంపై ధ్యాస కూడా తగ్గుతుంది. ఉపవాసం ముగిశాక తీసుకునే ఆహారం మాత్రం పూర్తి బలవర్థకంగా ఉండాలి. విపరీతంగా జంక్‌ఫుడ్ తినేవారికి, అధికంగా బరువు ఉండే వారికి ఈ విధానంతో ఫలితం ఉండదు. ►ఫాస్ట్ డైట్ పద్దతిలో వారానికి రెండు రోజులు మాత్రం ఉపవాసం ఉండాలి. ఈ రెండు రోజుల్లో మహిళలు 250 కేలరీల చొప్పున, పురుషులు 300 కేలరీల చొప్పున రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. అంటే మహిళలు 500 కేలరీలు, పురుషులు 600 కేలరీలకు మించకుండా ఆహారం తీసుకోవాలి. ఈ విధానంలోని సానుకూల ఫలితాలపై ఇప్పటికీ సరైన పరిశోధనలు లేనప్పటికీ చాలామంది 5:2డైట్‌ను అనుసరిస్తున్నారు. ►ది వారియర్ డైట్ పద్ధతిలో రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు తక్కువ పరిమాణంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 4నుంచి 8 గంటల లోపు లార్జ్ మీల్ భుజించాలి. ఇది ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న విధానం. ►స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్ విధానంలో వారంలో రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్ తీసుకోకూడదు. అయితే, ఏయేరోజు పాటించాలనేది మీ ఇష్టం. ఉదాహరణకు ఏదైనా రోజు ఆకలి లేనప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమృద్ధిగా తినాలి. ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పడు ఒక్కోసారి తినడానికి ఏమీ దొరకవు. అలాంటప్పుడు ఈ పద్ధతి అవలంబించుకోవచ్చు. ►ఆరోగ్యానికి మంచిది కదా అని అన్ని రకాలు ట్రై చేయవద్దు. ఉపవాసం శ్రేయస్కరం కావచ్చు కానీ అతి మంచిది కాదు. -డి. శాయి ప్రమోద్ చదవండి: జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం -
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..
వరంగల్ నగర ప్రజల జిహ్వచాపల్యం భలేగాఉంది. ఉదయం టిఫిన్‌ను ఎక్కువగా ఇడ్లీ తీసుకుంటుండగా, అదేస్థాయిలో ఆయిల్ ఫుడ్ అయిన పూరీని కూడా అంతే ఇష్టపడుతున్నారు. మరికొందరు వడ, దోశ కూడా భుజిస్తున్నారు. ఉదయాన్నే విధులకు హాజరుకావాల్సి ఉండడంతో ఇంట్లో అల్పాహారం తయారీకి తగిన సమయం లేకపోవడంతో హోటళ్లవైపు చూస్తున్నారు. ఇంట్లోకంటే రుచిగా ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. ఇంటివారిని ఉదయాన్నే ఇబ్బంది పెట్టకుండా బయట టిఫిన్ చేస్తున్న వారు మరికొందరు ఉన్నారు. అదేసమయంలో కరోనా సమయం కాబట్టి హోటళ్లకంటే ఇంటికి పార్సిల్ తీసుకెళ్తున్నారు. వరంగల్ నగరంలో ప్రజల అల్పాహార రుచులపై ‘సాక్షి’ సోమవారం పలుచోట్ల సర్వే నిర్వహించింది. వరంగల్, హనుమకొండలో 8 టిఫిన్ సెంటర్లలో సాక్షి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 20 ఏళ్లలోపు వారికి పూరీ అంటేనే ఇష్టం.. కాజీపేట ఏరియాలో నిట్, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ ఏరియాలోని రెండు హోటళ్లలో జరిపిన సర్వేలో యువత పూరీ ఇష్టపడుతున్నారు. ఫాతిమానగర్‌లోని ఓ మెస్‌లో నిట్ విద్యార్థులు పూరీనే అధికంగా తీసుకున్నారు. 10 నుంచి 20 ఏళ్ల వయస్సు గల 25 మందిని సర్వే చేయగా.. ఎవరు కూడా ఇడ్లీని ఇష్టపడడం లేదు. పూరీపైనే ఆసక్తి కనబరిచారు. హన్మకొండలోని మరో ప్రధాన హోటళ్లలో ఇడ్లీ 10 మంది.. పూరీ ఆరుగురు ఇష్టపడ్డారు. వీరంతా యువతే కావడం గమనార్హం. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు.. క్షణం తీరికలేని ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో బిజీ లైఫ్‌లో సైతం ఆహార విషయంలో కచ్చితమైన జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఉదయం తీసుకునే టిఫిన్స్‌పై ప్రజల అభిప్రాయాన్ని అధ్యయనం చేయగా అత్యధిక శాతం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆయిల్ఫుడ్కు దూరంగా ఉండాలనుకోవడం, సులువుగా జీర్ణం అవుతుండడం, ఆరోగ్యవంతమైన ఫుడ్ కావడమే ముఖ్య కారణం. యువత పూరీ, దోశ, వడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవీ తినడానికి రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా 15ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు హోటళ్లలో టిఫిన్స్ కోసం వచ్చారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయస్సుగల యువత ఎక్కువగా ఇడ్లీ, వడ, పూరీ, దోశను ఆర్డర్ చేశారు. 40ఏళ్ల పైపడిన వారు ఇడ్లీ ఎంచుకున్నారు. ఇందులో ఎక్కువ ఇడ్లీ, వడ కాంబినేషన్ తిన్నారు. కొంతమంది ఫేమస్ హోటల్స్ అని తెలవడంతో రుచిచూద్దామనే ఆలోచనతో వచ్చామని చెప్పగా, మరికొందరు ఫ్రెండ్స్‌తో టిఫిన్స్ ఆరగించామని వివరించారు. ఉదయం ఇడ్లీ, పూరీ, బొండా, వడ లాంటి టిఫిన్లను నగర వాసులు ఇష్టపడుతుండగా, సాయంత్రం ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి టిఫిన్లకు ఎక్కువగా గిరాకీ ఉంటున్నదని నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో ఒకే వెరైటీ... ఇంట్లో చేస్తే ఒకే వెరైటీ టిఫిన్ చేస్తారు. అదే హోటల్‌కు వెళితే ఇడ్లీ సాంబార్‌తో, చట్నీ, నెయ్యి, కారంతో లాగించేయొచ్చు. ఇలా ఇంట్లో కుదరదు. ఇడ్లీతోపాటు వడ, పూరీ, చక్కరపొంగలి, పెసరట్టు, దోశతోపాటు వెరైటీలు తినొచ్చు.- గాండ్ల మధు, వరంగల్ రుచికరంగా ఉంటాయంటే వచ్చా కరీమాబాద్ జంక్షన్లో టిఫిన్స్ రుచికరంగా ఉన్నాయని తెలిసి ఫెండ్స్‌తో కలిసి వచ్చాను. అప్పుడçప్పుడు మాత్రమే హోటల్స్‌లో తినడానికి ఇష్టపడతాను. - బొల్లం రాకేశ్, వరంగల్ పూరీ నా ఫేవరెట్ నేను ప్రతి రోజూ పూరీని టిఫిన్‌గా తింటాను, పూరీ నా ఫేవరెట్ టిఫిన్. మా ఇంట్లో చేసిన టిఫిన్ కంటే అన్నపూర్ణ హోటల్లోని పూరీ ఇష్టంగా తింటాను. స్కూల్‌కు వెళ్లే సమయంలో పూరీని టిఫిన్ బాక్స్‌లో తీసుకువెళ్లేందుకు ఇష్టపడతాను. – కట్కూరి అనుష్క, కాజీపేట ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదని నా వయస్సు 55 సంవత్సరాలు. దాదాపు 40 ఏళ్లుగా టైలర్ వృత్తిలో ఉన్నా. వృత్తిరీత్యా ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తుంటాను. నేను తీసుకునే ఆహారం ఈజీగా జీర్ణం కావాలంటే ఇడ్లీ తీసుకోవడమే మంచిది. పొద్దున్నే ఇడ్లీ కాకుండా పూరీ, వడ లాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే జీర్ణం కావు. ఆయిల్‌ఫుడ్ తిని అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడం కంటే వితౌట్ ఆయిల్‌తో చేసిన ఇడ్లీ తినడం ఆరోగ్యానికి మంచిదే కదా. – పొడిశెట్టి వెంకటేశ్వర్లు, టైలర్, కుమార్‌పల్లి సర్వే ఇలా.. వరంగల్, హనుమకొండ ఏరియాల్లో మొత్తం 8 ప్రధాన టిఫిన్ సెంటర్లలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పరిశీలన.. తీసుకున్న శాంపిల్స్ : 105 ఆన్లైన్లో.. 39 పార్సిల్ 46 హోటల్లో తిన్నవారు 128 ఇడ్లీ : 19 పూరీ : 12 వడ : 10 దోశ, ఇతరాలు : 14 ఇడ్లీ : 10 పూరీ : 19 వడ : 04 దోశ, ఇతరాలు : 17 చదవండి: అందరి చూపు చిరుధాన్యాలపైనే.. కారణం ఏంటంటే! -
తేటగుంట పెసరట్టు ఉప్మా తింటే లొట్టలేయాల్సిందే
అందాలరాముడు సినిమాలో నాగభూషణం ‘పెసరట్టు కావాలి’ అంటాడు. ‘పెసలు నానాలండీ’ అంటాడు సెక్రటరీ. అందుకు సమాధానంగా ‘నాను’ అంటాడు నాగభూషణం. ముళ్లపూడి రాసిన ఈ డైలాగులు అందరినీ బాగా నవ్వించాయి. పెసరట్టుని తెలుగువారు అంత ప్రీతిగా అక్కున చేర్చుకుంటారు.పెసరట్టు తెలుగువారి రుచికి చిరునామా...పెసరట్టును ఒంటరిగా కాకుండా జంటగా తినటం మరో ఆనందం. తేటగుంట పెసరట్టు ఉప్మా అంటే లొట్టలు వేయాల్సిందే. అదే ఈ వారం ఫుడ్ ప్రింట్స్ అల్పాహారంలో పెసరట్టు ఉప్మా కాంబినేషన్ లేనిదే చాలా మందికి రుచించదు. అంతటి ప్రీతికరమైన, పసందైన టిఫిన్ అది. తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపాన తేటగుంట జంక్షన్లో కెనరా బ్యాంకుని ఆనుకుని ఉన్న విజయలక్ష్మీ హోటల్లో తయారయ్యే పెసరట్టు ఉప్మా రుచి చూసినవారు, ఇరుగుపొరుగులకు చెప్పకుండా ఉండలేరు. బోడ నాని, విజయలక్ష్మి దంపతులు తయారుచేసే ఈ పెసరట్టు ఉప్మాకు ప్రత్యేక ఆదరణ ఉంది. పెసలు నానబెట్టి రుబ్బడం దగ్గర నుంచి పెసరట్టు కాల్చి అందులోకి అనువైన పచ్చడితో వడ్డించే వరకు ఈ దంపతులు చూపించే శ్రద్ధే ఇంత రుచికి కారణం అంటారు. తక్కువ ధరకే ఎక్కువ రుచి: తునికి 13 కిలో మీటర్లు, అన్నవరానికి ఐదు కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన తేటగుంట జంక్షన్లో కెనరా బ్యాంకుకు దగ్గరగా, తేటగుంటకు చెందిన బోడ నాని ఈ హోటల్‌ను 2000లో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు పెసలు నానబెట్టి, ఏడు గంటల నుంచి కట్టెల పొయ్యి మీద పెసరట్లు తయారుచేస్తుంటారు. పెసరట్టు మీద అల్లం తురుము, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగుతో పాటు నూనె లేదా నెయ్యి వేస్తారు. ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉప్మా వేసి ఘుమఘుమలాడే పెసరట్టు అందచేస్తారు. అందులోకి కారం పొడి, అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి, వేరుసెనగ పచ్చడి, కొబ్బరి చట్నీ, దబ్బకాయ చట్నీలలో ఏది కావాలంటే అది వేసి ప్రేమగా అందిస్తారు. అన్నీ స్వయంగా: గొల్లప్రోలు నుంచి నెలకొకసారి నేరుగా చేలల్లో నాణ్యమైన పెసలు కొనుగోలు చేస్తున్నారు. పెసరట్టు ఉప్మాను రూ.35లకే అందిస్తున్నారు. స్టార్ హోటళ్లలో కంటే ఇక్కడి పెసరట్టు ఉప్మా రుచికరంగా ఉందంటున్నారు ఈ టిఫిన్ రుచిచూసినవారు. అడిగినవారి ఎదురుగానే ఎన్ని పెసరట్లైనా కాల్చి అందిస్తున్నారు. పెసలు నానబెట్టడం నుంచి పెసరట్లు వేయడం, సర్వ్ చేయడం వరకు అన్నీ స్వయంగా చేస్తున్నారు. రోజుకి సుమారు ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు. లాభం వస్తుందనే నమ్మకం ఉండదు. ఒకరోజు వస్తుంది, ఒక రోజు రాదు, అయినా చేస్తున్నామని, దేవుడి దయ వల్ల ఇంతవరకు నష్టం రాలేదని, నాణ్యత విషయంలో రాజీ పడమని, అందుకే అందరూ వస్తుంటారని.. సంతోషంగా చెబుతారు నాని. ముఖ్యంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నవాళ్లు, ఆలయ దర్శనం అయ్యాక ఇక్కడకు వచ్చి తింటున్నారు. ముందుగానే ఫోన్ చేసి, ఏ సమయానికి వస్తారో చెప్పడం వల్ల వారు ఇబ్బంది పడట్లేదు.. అంటారు నాని. ఎలా అడిగితే అలా చేస్తాం... మా తాత సన్యాసిరావుగారు సుమారు అరవై సంవత్సరాల క్రితం తేటగుంట గ్రామంలో టిఫిన్ల వ్యాపారం ప్రారంభించా రు. ఆయన మరణింన కొన్నాళ్లకి నేను హైవే మీద ఈ వ్యాపారం పారరంభించాను. ఇప్పటికి 20 సంవత్సరాలుగా నడుస్తోంది. నేను, మా ఆవిడ, మా అబ్బాయి సాయి.. మేం ముగ్గురమే పనిచేస్తాం. మా దగ్గర పెసరట్టు ఉప్మా బాగా ఫేమస్ అయ్యింది. టిఫిన్ తినడానికి వచ్చినవారు మూడునాలుగు తింటారు. అందుకే మా వ్యాపారంలో ఉప్మా పెసరట్టుకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ప్రారంభించిన ఐదు సంవత్సరాలకి మా హోటల్‌కి మంచి పేరు వచ్చింది. ఒకళ్లు తిని పది మందికి చెప్పడం వల్ల మా వ్యాపారం పెరిగింది. ఇప్పుడు మా మీద మాకు నమ్మకం కలిగింది. ప్రతివాళ్లు తృప్తిగా తిని, డబ్బుల గురించి ఆలోచించకుండా, పది రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్తుంటారు. అదే మాకు సంతోషం. పెసరట్టు కాల్చేటప్పుడు ఒకరు నెయ్యి, ఒకరు బటర్, ఒకరు ఆయిల్, ఒకరు జీడిపప్పు... ఇలా రకరకాలుగా అడుగుతుంటారు. ఉన్నంతలో చేస్తాను, లేదంటే వారు తెచ్చుకుని, అడిగి చేయించుకుంటారు. మా దగ్గర దబ్బకాయ పచ్చడి ప్రత్యేకం. ఇక్కడకు వచ్చినవారు సంతోషంగా ఆనందంగా వెళ్లాలన్నదే మా లక్ష్యం. –నాని, విజయలక్ష్మి – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఇన్పుట్స్, ఫొటోలు: మేళాసు సూర్యనారాయణ, తుని రూరల్ -
లాక్డౌన్లో బరువు పెరిగారా? ఇలా చేయండి
లాక్డౌన్ కారణంగా దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోలను చూసి ప్రొఫెషనల్ షెఫ్ అవతారమెత్తారు. వంటలన్నీ ప్రయోగాలు చేస్తూ హల్చల్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఫిట్నెస్ ప్రీక్‌గా ఉన్నవారు సైతం బరువు పెరిగారు. దీంతో సహజంగానే కాస్త ఒత్తిడి పెరుగుతుంది. అయితే దీని గురించి ఏమాత్రం ఆందోళన చెందవద్దు. కేవలం కొన్ని జాగ్రత్తలు, నియమాలతో మళ్లీ ఫిట్‌గా ఉండొచ్చు. పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు. దీనికి బొప్పాయి పండే పరిష్కారమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన దినచర్యలో అల్పాహారం తీసుకోవడం అతి ముఖ్యమైనది. అయితే కొందరు సమయం లేదనో, ఒకేసారి మధ్యాహ్నం తినొచ్చనో ఏవేవో కారణాలు చెప్పి బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. ఇలా తరుచూ అల్పాహారం తీసుకోకపోవడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి ఫిట్‌గా ఉండాలనుకునేవారు మొదట క్రమం తప్పకుండా అల్పాహారం చేయాలి. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటుందట. (అదృష్టం అంటే నీదిరా బాబు!) ఇక బరువు తగ్గాలనుకునేవారికి ఉత్తమమైన అల్పాహారం బొప్పాయి పండు.దీనిలోని ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు లాంటి ముఖ్యమైన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరానికి ఎంతో శక్తినిచ్చే బొప్పాయిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా చేస్తుందట. ఆఫీసుకు లేట్ అవుతుందని బ్రేక్‌ఫాస్ట్‌ని మానేసేవాళ్లకి ఇదో చక్కని పరిష్కారం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బొప్పాయితో మంచి బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయవచ్చు. ఇందులోని ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా మధ్యాహ్న సమయం వరకు మీ ఆకలిని అరికట్టేందుకు బెస్ట్ ఛాయిస్ అంటున్నారు నిపుణులు. బొప్పాయి గుజ్జు, కప్పు పెరుగు, పావుకప్పు పాలు కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత దీనికి రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలిపి ప్రతీరోజూ ఉదయం అల్పాహారంలా తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ మెరుగుపడుతుంది. సో లాక్డౌన్లో కారణంగా బరువు పెరిగిన వారికి ఇదో చక్కటి పరిష్కారమంటున్నారు వైద్య నిపుణులు. ఈ లిస్ట్‌లో మీరూ ఉంటే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ట్రై చేసేయండి. (నానమ్మ పిజ్జా సూపర్‌హిట్) -
పాఠశాలల్లో ఇక ‘బ్రేక్ ఫాస్ట్’
సాక్షి, అమరావతి: పాఠశాలల్లోని విద్యార్థులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్ని కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల ఆమోదించిన నూతన విద్యావిధానంలో ఆయా అంశాలను పొందుపరిచింది. ప్రతి రోజూ ఉదయాన్నే పోషకవిలువలతో కూడిన అల్పాహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా పసిప్రాయం నుంచే వారిలో మేథోపరమైన, శారీరకాభివృద్ధి సాధ్యమవుతుందని.. దీంతో వారు విద్యా సామర్థ్యాలను సులభంగా నేర్వగలుగుతారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ♦మధ్యాహ్నం భోజనానికి అదనంగా శక్తి నిచ్చే అల్పాహారాన్ని అందించడం ద్వారా ఉత్తమ ప్రమాణాలు సాధించే అవకాశం ఉంటుంది. ♦వేడి అల్పాహారం సాధ్యం కానప్పుడు స్థానికంగా లభించే చిక్కీలు, పండ్లు వంటి ఇతర పౌష్ఠిక పదర్ధాలను అందించవచ్చని సూచించింది. ♦తద్వారా పునాది స్థాయిలోనే అక్షరాస్యత మెరుగుపడుతుంది, ప్రారంభ బాల్య సంరక్షణకు వీలవుతుంది. ♦పాఠశాలస్థాయికి వచ్చేసరికి వారిలో మెరుగైన మేథోవికాసం ఏర్పడి పాఠశాల విద్య బలోపేతమవుతుంది. ♦అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు çఉపాధ్యాయ విద్యను మరింత బలోపేతం చేయాలని కూడా స్పష్టం చేసింది. ♦విద్యపై కేటాయించే నిధులను క్షేత్రస్థాయిలో సకాలంలో ఖర్చు చేయకపోవడం వల్ల కూడా లక్ష్యాల సాధనకు ఆటంకం కలిగిస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. ♦నిధులు సద్వినియోగమయ్యేలా పాలనా ప్రక్రియల్లో మార్పులు చేయడం, క్రమబద్ధీకరించడం ద్వారా బడ్జెట్ మిగిలిపోకుండా చూడవచ్చని పేర్కొంది. ♦ఇందుకోసం కార్యక్రమాలు అమలు చేసే ఏజెన్సీలకు ‘జస్ట్ ఇన్ టైమ్’ అనే కొత్త విధానంతో నిధుల విడుదల నిబంధనలు వర్తింపచేస్తారు. ♦ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, నిధుల మిగులును నివారించడం దీని లక్ష్యం. ♦పారదర్శకత,సాధికార, స్వయంప్రతిపత్తి ఉండే సంస్థలను గుర్తించి వాటికి ఆయా కార్యక్రమాల అమలును అప్పగించాలి. ఇందుకు ప్రయివేటు ఏజెన్సీలను గుర్తించి ప్రోత్సహించడం మంచిదని సూచించింది. ♦వీటితో పాటు విద్యారంగంలో దాతలను ప్రోత్సహించడం ద్వారా వారినుంచి ఆర్థిక సహకారాన్ని పొందడంపై దృష్టి పెట్టాలని.. పబ్లిక్ బడ్జెట్ కంటే ఈ తరహా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేలా ప్రభుత్వ సంస్థలు చొరవ తీసుకోవాలని వివరించింది. -
స్ప్రౌటెడ్ మిలెట్ దోసె, ఇడ్లీ విత్ జింజర్ చట్నీ
పిండి కోసం కావలసినవి: స్ప్రౌట్స్ – ఒక కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు); ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. చట్నీ కోసం కావలసినవి: ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క; వెల్లుల్లి రెబ్బలు – 3 (లేకపోయినా పరవాలేదు); మెంతులు – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 12; కరివేపాకు – పావు కప్పు; ఇంగువ – అర టీ స్పూను; చింతపండు – పావు కప్పు కంటె ఎక్కువ; బెల్లం పొడి – పావు కేజీ పిండి తయారీ: ఉప్పు మినహా పిండి కోసం చెప్పిన మిగతా పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, నానబెట్టిన వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాక, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙సుమారు ఎనిమిది గంటలపాటు ఈ పిండిని నానబెట్టాలి ∙ఈ పిండితో దోసెలు, ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు ∙అల్లం చట్నీతో అందించాలి ∙ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లం చట్నీ తయారీ: చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ధనియాలు, పచ్చి సెనగ పప్పు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, అల్లం ముక్క వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙నానబెట్టిన చింతపండు, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ∙దోసె, ఇడ్లీలతో అందించాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన వంటకాలను బామ్మలు, అమ్మమ్మలు మాత్రమే చెప్తారు. ఇందులో నూనె ఎక్కువగా వాడలేదు. మినుముకు విరుగుడైన అల్లం చట్నీతో తినడం వల్ల శరీరం గట్టి పడుతుంది. -
టిఫిన్ తినకుంటే మార్కులు తగ్గుతాయి!
లండన్: పిల్లలు ఉపాహారం తినకుండానే స్కూల్‌కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఎక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌లోని కొందరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయం తేలింది. తగినన్ని పోషకాలు లేకపోవడం విద్యార్థుల మార్కులపై ప్రభావం పడుతుందని తాము గుర్తించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేటీ అడోల్ఫస్ తెలిపారు. పరిగణనలోకి తీసుకున్న విద్యార్థులందరి గ్రేడ్స్‌ను పాయింట్ల రూపంలోకి మార్చినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసే వారికి ఎక్కువ పాయింట్లు రాగా, మిగిలిన వారికి తక్కువ వచ్చాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతోపాటు, వయసు, బీఎంఐ, ఆడ? మగ? అన్న ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పేమీ లేదని వివరించారు. -
బడిలో ఇక అల్పాహారం!
సదాశివనగర్ (కామారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మరింత పటిష్ట పరచడానికి ప్రభుత్వం వినూత్నంగా అడుగులు వేస్తోంది. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ముందుకు సాగుతోంది. పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్యను తీర్చడంతో పాటు, పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి తోడు ఉదయం పూట అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్)ను ఇవ్వాలని యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం అమలు చేస్తుండడంతో కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరుశాతం కూడా పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు పిల్లల్లో పౌష్టికాహారలోపం సమస్య కూడా కొంత వరకు తీర్చగలుగుతున్నారు. ఉదయం పూట అల్పాహారం కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో జిల్లాలోని లక్షా 45 వేల 443 విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మధ్యాహ్న భోజనం వల్ల విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్య తీర్చడానికి తోడు విద్యార్థుల హాజరుశాతం పెరిగేందుకు దోహదపడుతుంది. ఆయా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లేమితో బాధ పడుతున్నారు. ఒకపూట ఆహారం అందించడం వల్ల కొంత సమస్య తగ్గింది. రెండుపూటలా ఆహారం అందిస్తే వారిలో పౌష్టికాహార లేమి చాలావరకు దూరం చేయవచ్చు. ఉచితంగా ఆహారం అందించడం వల్ల పేదకుటుంబాల పిల్లలు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంటుంది. అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు పాలు, పండ్లు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. అల్పాహారం అందించడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 718 ప్రాథమిక పాఠశాలలు, 213 ప్రాథమికోన్న త పాఠశాలలు, 321 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ పాఠశాలల్లో సుమారు లక్షా 45వేల 443 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పెరిగిన భోజనం ధరలు ఇలా.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఒక్కొక్కరికి మధ్యాహ్నభోజనం కోసం రూ. 4.13 ఇచ్చే వారు. దానిని రూ. 4.35లకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రూ. 6.18 ఇచ్చేవారు ప్రస్తుతం రూ. 6.51కి పెంచారు. విద్యార్థులకు వారంలో రెండు రోజుల పాటు గుడ్డును అందిస్తున్నారు. గతంలో ఒక్కో గుడ్డుకు రూ. 4 చెల్లించగా, ఇప్పుడు రూ. 2 పెంచి రూ. 6 చెల్లించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సన్న బియ్యం భోజనం అందిస్తున్నారు. పెరిగిన ధరలతో విద్యార్థులందరికి నాణ్యమైన భోజనం అందనుంది. రేటు పెంపుతో భోజనం మెరుగు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నభోజనం మెనూ చార్జీలు పెరిగాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందనుంది. గతంలో భోజనం ధరలు తక్కువగా చెల్లించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం నిర్వాహకులకు కష్టంగా మారేది. అంతే కాకుండా రోజు రోజుకు కూరగాయల ధరలు పెరిగిపోతుండడం, దానికి అనుగుణంగా మధ్యాహ్నభోజన ధరలు పెరగక పోవడంతో నాణ్యమైన ఆహారాన్ని అందించలేని పరిస్థితి ఉండేది. ఉత్తర్వులు రాలేదు ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ మరింత మెరుగవుతుంది. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అనే యోచన చేస్తుంది. ఇది అమలయితే మరింత బాగుంటుంది. అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఒకవేళ వస్తే అమలు చేస్తాం. –యోసెఫ్, ఎంఈవో, సదాశివనగర్ -
మధుమేహులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే..
న్యూయార్క్ : టైప్ టూ డయాబెటిస్తో బాధపడేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే మేలని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. వీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ రోజంతా నియంత్రణలో ఉండాలంటే మధుమేహులు అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం తీసుకుంటే మంచిదని పరిశోధకులు పేర్కొన్నారు. తృణధాన్యాలు, ఓట్స్, పండ్లు సహా పాశ్చాత్య బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో టైప్ 2 మధుమేహంతో బాధపడేవారికి ఉదయాన్నే బ్లడ్ షుగర్ అధికమవుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనంకి నేతృత్వం వహించిన జొనాథన్ లిటిల్ చెప్పారు. టైప్ టూ మధుమేహుల్లో అల్పాహారమే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచేస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైందని అన్నారు. వీరిలో షుగర్ లెవెల్స్‌ను భారీగా తగ్గించేందుకు తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వుతో కూడిన ఆహారంతో రోజును ప్రారంభించడం మేలని చెప్పారు. ఇది షుగర్‌తో వచ్చే అనుబంధ లక్షణాలను కూడా నియంత్రించేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. లంచ్, డిన్నర్లో కూడా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మధుమేహులే కాకుండా అందరూ ఈ తరహా ఆహారాన్ని అనుసరించడం ఆరోగ్యకరమని చెప్పారు. -
ఇడ్లీ ప్రియుల్లో బెంగళూరు టాప్
న్యూఢిల్లీ: సాధారణంగా చాలామంది ఉదయాన్నే అల్పాహారంగా ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. త్వరగా జీర్ణమైపోవడంతో పాటు ఆరోగ్యానికి ఇడ్లీ మంచిదని ఆహార నిపుణులు చెబుతుంటారు. గోధుమ రవ్వ లేదా రాగిపిండితో చేసిన ఇడ్లీల ద్వా రా ఆరోగ్యంతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతారు. ‘ఉబెర్ ఈట్స్’ అనే సంస్థ అల్పాహారం విషయంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఉదయా న్నే అల్పాహారంగా ఇడ్లీ తీసుకునే నగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచినట్లు ఉబెర్ ఈట్స్ తెలిపింది. ఈ జాబితాలో ఉత్తరాది నగరం ముంబై రెండోస్థానంలో, చెన్నై మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఉదయం 7.30–11.30 కాలంలో గణనీయమైన సంఖ్యలో ఆర్డర్లు వచ్చినట్లు చెప్పింది. మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం నేపథ్యంలో ఈ వివరాలను ‘ఉబెర్ ఈట్స్’ విడుదల చేసింది. ఈ నెల 10న దేశమంతటా అత్యధిక సంఖ్యలో ఇడ్లీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. వెరైటీ ఇడ్లీలపై మక్కువ ఇడ్లీలపై కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ మక్కువ ఎక్కువేనని సర్వే తేల్చింది. భారత్ వెలుపల అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ, బ్రిటన్‌లోని లండన్ వాసులు ఇడ్లీలను లాగించేస్తున్నారని ఉబెర్ ఈట్స్ వెల్లడించింది. ఇక ఇడ్లీ వెరైటీల విషయంలోనూ భారతీయులు వెనక్కి తగ్గట్లేదని ఈ సందర్భంగా తేలింది. తమిళనాడులోని కోయంబత్తూరు వాసులు చికెన్‌ఫ్రై ఇడ్లీపై మనసు పారేసుకున్నట్లు సర్వే పేర్కొంది. తిరుచినాపల్లి వాసులు ఇడ్లీ మంచూరియాను, నాగ్‌పూర్ నగర వాసులు చాకోలెట్ ఇడ్లీపై మనసు పారేసుకున్నారని సర్వే వెల్లడించింది. అలాగే ఆర్డర్ల సందర్భంగా కొంచెం చట్నీ, కారంపొడి, సాంబార్ ఎక్కువగా వేయాల్సిందిగా చాలామంది వినియోగదారులు కోరారంది. అలాగే ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉన్న మరికొందరు వినియోగదారులు వెజిటబుల్ ఇడ్లీని ఆర్డర్ చేశారని పేర్కొంది. ‘ఇడ్లీ ప్రియులు అత్యధికంగా ఉన్న నగరంగా బెంగళూరు అవతరించడం నిజంగా సంతోషకరమైన విషయం. భారత్‌లో అత్యధికులు ఇడ్లీని తమ అల్పాహారంగా తీసుకుంటారు. అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవాన్ని గత మూడేళ్లుగా జరుపుతున్నారు. తమిళనాడు కేటరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజమణి అయ్యర్ తొలుత ఈ ప్రతిపాదన చేశారు’ అని బెంగళూరుకు చెందిన ‘బ్రాహ్మిణ్స్ థట్టె ఇడ్లీ’ యజమాని సుభాష్ శర్మ తెలిపారు. -
వంట వండలేదని అత్తను కత్తితో.. దారుణం
థానే : ఉదయపు అల్పాహారం వండలేదన్న కోపంతో అత్తను చంపిందో కోడలు. ఈ సంఘటన శనివారం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని థానే ఖోఫట్ ఏరియాకు చెందిన 39ఏళ్ల స్వప్న కులకర్ణి అనే మహిళ అల్పాహారం తయారు చేయవల్సిందిగా 75ఏళ్ల అంధురాలైన శోభా కులకర్ణి అనే మహిళను కోరింది. అయితే ఆ వృద్ధురాలు అల్పాహారం తయారు చేయటానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్పప్న వృద్ధురాలిపై విరుచుకుపడింది. కత్తితో ఆమెను విచక్షణా రహితంగా పొడిచిచంపింది. అతి దారుణంగా.. దాదాపు 15సార్లు ఆమెను పొడిచింది. విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితురాలిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబట్టడానికి విచారణ చేపట్టారు. -
రైలులో కలుషితాహారం.. 40 మందికి అస్వస్థత
ఖరగ్‌పూర్/పశ్చిమ బెంగాల్: పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఐఆర్సీటీసీ సరఫరా చేసిన అల్పాహారం తిని నలభై మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 14మంది ఖరగ్‌పూర్‌లోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పూరి నుంచి బయల్దేరిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్ దాటిన తర్వాత అల్పాహారంగా ఆమ్లెట్, బ్రెడ్ తీసుకున్నామని బాధితులు చెప్పారు. అల్పాహారం తీసుకున్న అనంతరం వాంతులు, కడుపులో నొప్పి మొదలైందని వారు తెలిపారు. రైలు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఖరగ్‌పూర్ రైల్వే ఆస్పత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. కాగా, రైలు ప్రయాణంలో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పే రైల్వే శాఖ ఈ విషయం వెలుగు చూడడంతో చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఐఆర్సీటీసీ పంపిణీ చేసిన బ్రేక్‌ఫాస్ట్ తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నార’ని ఆగ్నేయ రైల్వే జోన్ ప్రజా సంబంధాల అధికారి సంజయ్ ఘోష్ తెలిపారు. ‘ఆహార పదార్థాల నమూనాలు సేకరించాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామ’ని ఖరగ్‌పూర్ డివిజన్ మేనేజర్ రాబిన్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెండర్ వద్ద కాకుండా బయటి వ్యక్తుల నుంచి ఆహార పదార్థాలేవైనా కొన్నారా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. భోజన వసతి అనుకున్నాం.. ఆస్పత్రి పాలయ్యాం ‘పూరి పర్యటనకు వచ్చాం. భోజన వసతి ఉంటుందని శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యాం. కానీ ఇలా ఆస్పత్రి పాలవుతామనుకోలేద’ని బెంగాల్‌కు చెందిన రూపమ్ సేన్ గుప్తా వాపోయారు. రైలులో ఐఆర్సీటీసీ సరఫరా చేసిన ఆహారాన్నే కొన్నామని ఆయన తెలిపారు. -
మీరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?
లండన్ : రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారు స్లిమ్‌గా ఉండటంతో పాటు మున్ముందు బరువు పెరగకుండా ఉంటారని తాజా అథ్యయనం వెల్లడించింది. కేలరీలను తగ్గించుకునేందుకు, నాజూకుగా ఉండేందుకు పలువురు అల్పాహారం తీసుకోవడాన్ని విస్మరిస్తుంటారని, ఇది సరైంది కాదని మయో క్లినిక్ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే 350 మందిని పరిశీలించగా వారి నడుము భాగం సాధారణంగా ఉన్నట్టు గుర్తించామని, పదేళ్ల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తీసుకోనివారు ఎనిమిది పౌండ్లు పెరిగారని తెలిపింది. రోజూ ఉదయాన్నే అల్పాహారం తీసుకున్నవారు పదేళ్లలో కేవలం మూడు పౌండ్ల బరువు మాత్రమే పెరిగారని పరిశోధకులు వెల్లడించారు. బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోనివారు సరైన మోతాదులో సమతుల ఆహారాన్ని పొందలేకపోవడం వల్లే వారిలో కొవ్వు పేరుకుపోతున్నట్టు తేలింది. బ్రేక్‌ఫాస్ట్‌ను తరచూ తీసుకోనివారితో పోలిస్తే నిత్యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేవారు ఆరోగ్యంగా ఉన్నారని తమ పరిశోధనలో వెల్లడైందని మయో క్లినిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వీరెంద్ సోమర్స్ చెప్పారు. అల్పాహారం తీసుకోని వారిలో పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ కొవ్వు టాక్సిన్లను విడుదల చేయడం ద్వారా రక్త నాళాలకు విఘాతం కలుగుతుందన్నారు. తాజా పండ్లు, ధాన్యాలు, గింజలతో కూడిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలని సూచించారు. -
మిస్టర్ సి.. మాస్టర్ చెఫ్
సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసే స్టార్స్ అందుకు భిన్నంగా ఇంట్లో కిచెన్‌లో గరిటె తిప్పితే అది న్యూసే. పైగా రామ్‌చరణ్‌లాంటి స్టార్ అంటే ఏం కుక్ చేశారో తెలుసుకోవాలని ఉంటుంది. అలా అలవోకగా కిచెన్‌లో నిలబడి కుక్ చేస్తున్న ఫొటోలు కూడా చూడాలని కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా.. చరణ్ కుక్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తోంది కదూ. బుధవారం ఉదయం వర్కౌట్స్ పూర్తయ్యాక ఇలా చెఫ్‌గా మారిపోయారు రామ్‌చరణ్. ‘‘మిస్టర్ సి (రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఇలానే పిలుస్తారు) మాస్టర్ చెఫ్‌గా మారి మా అందరి కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు. అది కూడా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్’’ అని పేర్కొన్నారు ఉపాసన. మొన్నీ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైట్ విషయం మొత్తం ఉపాసనదే. హెల్దీ ఫుడ్స్ గురించి తనకు బాగా ఐడియా ఉంది’’ అన్నారు. బహుశా శ్రీమతి చెప్పిన ఓ హెల్దీ రెసిపీతో చరణ్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి ఉంటారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ 21నుంచి ఈ చిత్రం షూటింగ్లో రామ్‌చరణ్ పాల్గొననున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందనున్న చిత్రం బడ్జెట్ 300 కోట్లని టాక్. అక్టోబర్ నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ కానుంది. అది చవకబారుతనం ‘‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబంలాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తాం. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా,సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది’’ అని తన ఫేస్బుక్ ఖాతాలోహీరో రామ్‌చరణ్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై జరుగుతున్న వివాదాలను దృష్టిలో పెట్టుకునే చరణ్ ఈ విధంగా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
కలుషిత ఆహారమా.. ఆత్మహత్య..?
అల్పాహారం తిని శీతలపానీయం తాగిన ముగ్గురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో ఒకరు, మార్గమధ్యంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన హిందూపురంలో కలకలం రేపింది. హిందూపురం అర్బన్: కర్ణాటకలోని గౌరీబిదనూరుకు చెందిన ప్రదీప్(30), పరిగి మండలం కాలువపల్లికి చెందిన శివ(29), హిందూపురంలోని కంసలపేటకు చెందిన బాలాజీ ముగ్గురూ స్నేహితులు. వీరు హిందూపురంలోని ముక్కడిపేటలోని ఒక అద్దెగదిలో ఉంటూ బంగారుదుకాణంలో పనిచేసేవారు. శుక్రవారం ఉదయం ప్రదీప్, శివ టిఫిన్ చేసేందుకని సమీపంలోని హోటల్ నుంచి పూరీలతోపాటు స్ప్రైట్ కూల్‌డ్రింక్ తెచ్చుకున్నారు. వీరిద్దరూ తింటున్న సమయంలో బయటి నుంచి బాలాజీ వచ్చి వారితో జతకలిశాడు. అలా ముగ్గరూ టిపిన్ తిని, కూల్‌డ్రింక్ తాగారు. ఎక్కువ మోతాదులో కూల్‌డ్రింక్ తాగిన శివ అపస్మారకస్థితికి చేరుకోగా.. కొద్దిసేపటికే ప్రదీప్ కుప్పకూలిపోయాడు. కొద్దిగమాత్రమే కూల్‌డ్రింక్ తాగిన బాలాజీ వెంటనే తేరుకుని కేకలు పెట్టాడు. వీధిలో ఉన్న వారు పరుగున వచ్చారు. ఇంతలో బాలాజీ కూడా వాంతులు చేసుకుని పడిపోయాడు. 108 అంబులెన్స్‌లో ముగ్గురినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రదీప్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం నుంచి అనంతపురం తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శివ చనిపోయాడు. బాలాజీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం జరిగిన విషయాన్ని బాలాజీ పోలీసులకు తెలియజేశాడు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, టూటౌన్ సీఐ తమీమ్ అహ్మద్, ఎస్ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. కలుషిత ఆహారమా.. ఆత్మహత్య..? కూల్‌డ్రింక్ లో ఏదైనా విష పదార్థాన్ని కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఆహారం కలుషితం కావడం వల్ల ప్రాణాలు కోల్పోయారా? అనే కోణంలో డీఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు తిన్న ఆహారం, కూల్‌డ్రింక్‌లను సీజ్‌చేసి వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు డీఎస్పీ చెప్పారు. అలాగే వీరి జీవనపరిస్థితులు ఇతర విషయాలపై కూడా ఆరా తీసుకున్నామని చెప్పారు. -
బళ్లారి శ్రీరాములును ట్రంప్ పిలిచారు
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 7, 8 తేదీల్లో విందు ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖల జాబితాలో భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరిగా ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే వైట్‌హౌస్ నుంచి ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని సంఘటన అని తెలిపారు. -
డిన్నర్‌కు ముందు ఇవి తీసుకుంటే మేలు
లండన్ : కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని ఉదయం కాకుండా సాయంత్రం తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డిన్నర్‌కు ముందు కార్బోహైడ్రేట్స్‌ను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయని తేల్చారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పోలిస్తే సాయంత్రం వీటిని తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ భారీగా తీసుకుని లంచ్, డిన్నర్లను మితాహారంతో ముగిస్తే మేలనే సూచనలకు విరుద్ధంగా యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ మైఖేల్ మోస్లే కార్బోహైడ్రేట్లను సాయంత్రం తీసుకోవాలని సూచించారు.పాస్తా, బ్రెడ్ వంటి ఆహారాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకునే బదులు రాత్రి వేళల్లో తీసుకుంటే మంచిదని మోస్లే పేర్కొన్నారు. కార్బోహైడ్రేట్లను రోజు ప్రారంభమయ్యే సమయంలో తీసుకుంటే అవి విడుదల చేసే గ్లూకోజ్‌ను కరిగించేందుకు ఎక్కువ సమయం ఉంటుందని ఉదయాన్నే వీటిని తీసుకోవాలని గతంలో నిపుణులు సూచించేవారు. బీబీసీలో ప్రసారమైన తాజా అథ్యయనం కార్బోహైడ్రేట్స్‌ను ఉదయంతో పోలిస్తే సాయంత్రం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనూహ్యంగా పెరగడం లేదని వెల్లడించింది. అయితే కార్బోహైడ్రేట్లను మితంగా తీసకుంటూ ప్రతి మీల్లో వాటిని ఎక్కువగా చొప్పించకుండా చూసుకోవాలని డాక్టర్ మోస్లే సూచించారు. -
ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో కుంగుబాటు దూరం
సాక్షి,న్యూఢిల్లీ: డిప్రెషన్‌ను దూరం చేసేందుకు మార్గాలపై పలు పరిశోధనలు నిత్యం కొత్త అంశాలను నిగ్గుతేల్చుతూనే ఉన్నాయి. మానసిక అలజడి, కుంగుబాటుతో బాధపడేవారికి మందుల కన్నా మెరుగైన ఆహారమే వారు కోలుకునేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుందని ఉదాయాన్నే తీసుకునే అల్పాహారం కుంగుబాటును దూరం చేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే కోడిగుడ్డు, అవకాడో నిండిన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటే కుంగుబాటుకు చెక్ పెట్టవచ్చని ఆహారం, మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాలపై అథ్యయనం చేసిన పోషకాహార నిపుణులు మెలిస్సా బ్రునెట్టి చెబుతున్నారు. ఆరోగ్యకరమైన మెదడుకు పోషకాహారం అవసరమని, ఆహారంలో పోషకాలు లేకుంటే న్యూరోట్రాన్స్మిటర్స్, న్యూరోకెమికల్స్ సరిగ్గా విడుదల కావని, బ్లడ్ షుగర్ లెవెల్స్, హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుందని బ్రునెట్టి అంటున్నారు. మెదడు ఆరోగ్యానికి నిర్థిష్ట ఆహారం తీసుకోవాలనే నిబంధనలేమీ లేవని, అయితే ఒమెగా -3, విటమిన్ బీ, అమినో ఆమ్లాలు, జింక్, ఐరన్ వంటి ఖనిజాలతో కూడిన ఆహారం మానసిక ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుందని చెప్పారు. -
బ్రేక్‌ఫాస్ట్‌పై బోలెడు ఖర్చు
సాక్షి,న్యూఢిల్లీ: రోజూ తీసుకునే తొలి ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌పై భారతీయులు భారీగానే వెచ్చిస్తున్నారని డైనింగ్ పరిశ్రమపై పరిశోధించిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ వెల్లడించింది. 2015లో భారతీయులు ఉదయం తీసుకునే అల్పాహారంపై చేసిన ఖర్చు కంటే 2016లో 56 శాతం అధికంగా వెచ్చించారని ఈ నివేదిక పేర్కొంది. రోజువారీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన శక్తిని సమీకరించుకునేందుకు బ్రేక్‌ఫాస్ట్ కీలకమని ప్రజలు గుర్తించడంతోనే రెస్టారెంట్లు కిటకిటలాడుతున్నాయని తెలిపింది. ఆమ్లెట్ల వంటి నాన్ వెజ్ ఐటెమ్సే కాకుండా ఇతర ఆహార పదార్థాలనూ భారతీయులు అల్పాహారం కోసం ఇష్టంగా తీసుకుంటున్నారని పేర్కొంది. బెంగుళూర్,ఢిల్లీ,ముంబయి సహా పలు భారతీయ నగరాల్లో అల్పాహారంపై చేసే ఖర్చు గణనీయంగా పెరిగిందని తెలిపింది. పోషకాహారం ప్రాధాన్యతను ప్రజలు గుర్తించడంతో కూడా బ్రేక్‌ఫాస్ట్‌పై భారతీయులు చేసే ఖర్చు పెరిగేందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రోజూ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం, అల్పాహారం తీసుకోవడంలో జాప్యం చేయడం వంటివి దీర్ఘకాలంలో పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
ఓట్మీల్ బ్రేక్‌ఫాస్ట్
కావలసినవి: ఓట్స్ – ఆరు టేబుల్‌స్పూన్లు; నీళ్లు – ఒక కప్పు; సోయా పాలు – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – కావలసినన్ని; ఎండిన కర్బూజ గింజలు – ఒక టేబుల్ స్పూన్; పండు ఖర్జూరాలు – 10 (గింజ తీసి సన్నగా తరగాలి) తయారి: నీళ్లను మరిగించాలి. అందులో ఓట్స్ వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. దీంట్లో ఎండు కర్బూజ గింజలను వేసి స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత సోయాపాలు పోయాలి. ఖర్జూరం, డ్రైఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి వేడిగా ఉన్నప్పుడే ఆరగించాలి. నోట్... దీంట్లో కొవ్వు ఉండదు. ఓట్స్‌లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ప్రొటీన్లు గుండె ఆరోగ్యానికి బలం చేకూరుస్తాయి. సోయాపాలు అందుబాటులో లేకపోతే డైరీ పాలనే వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే అల్పాహారం. -
బ్రేక్ ఫాస్ట్ మానేస్తే చిక్కులే!
న్యూయార్క్: చాలా మంది బరువు తగ్గాలనో, పనుల ఒత్తిడిలో పడి బ్రేక్‌ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేస్తారు. అల్పాహారం తీసుకోకుంటే అథెరోస్క్లెరోసిస్ అనే అనారోగ్య సమస్య ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దళసరిగా ఉన్న ధమనులు గుండె నుంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి. అయితే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ధమనుల పనితీరు మందగించడాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సరైన సమయానికి అల్పాహారం తీసుకోకపోయినా, తక్కువ పోషకాలున్న అల్పాహారం తీసుకున్నా ఈ సమస్య తప్పదని హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనానికి, లంచ్‌కు మధ్య ఉండే గ్యాప్‌ను అల్పాహరంతో పూడ్చడం వల్ల అవసరమైన పోషకాలు శరీరానికి అందడమే కాకుండా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. అదే అల్పాహారాన్ని తీసుకోకుండా ఉంటే శరీర బరువు దెబ్బతినడమే కాకుండా రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశముందని మౌంట్ సినాయ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. ఉదయం మంచి పోషకాలు కలిగిన అల్పాహారం తీసుకోవడం ద్వారా బీపీ, ఒబెసిటీ, ఇతర జీవక్రియలలో కలిగే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాలంటైన్ ఫాస్టర్ తెలిపారు. -
వికటించిన అల్పాహారం
9 మంది ఎన్సీసీ క్యాడెట్లకు అస్వస్థత మందులు లేవన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఆర్డీవో ఆగ్రహం పెద్దాపురం : కాకినాడ 18 ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ శిక్షణ శిబిరంలో ఆదివారం ఉదయం 9 మంది ఎన్సీసీ మహిళా క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. శిబిరం వద్దకు ఉదయాన్నే వండిన అల్పాహారం వికటించడంతో వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎన్సిసి అధికారులు మనీష్‌గౌర్, యు.మాచిరాజు, కృష్ణారావు, సతీష్‌లు హుటాహుటీన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయంలో తెలుసుకున్న పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబులు క్యాడెట్ల ఆరోగ్య సమస్యపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది మందులు బయట నుంచి తీసుకు రమ్మన్నంటున్నారని క్యాడెట్లు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని పిలిచి వారిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల కొరత లేదంటూనే మందులు లేవని సమాధానం చెప్పడమేమిటని మండిపడ్డారు. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి గానీ రోగులపై సమాధానం చెప్పడం బాగోలేదని, ఇలా అయితే చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. వెంటనే వైద్యులను రప్పించి క్యాడెట్లకు అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్డీవో ఆదేశించారు. మంత్రి రాజప్ప ఆరా ఎన్సీసీ క్యాడెట్లు అస్వస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్యాడెట్లకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ఆర్డీవో విశ్వేశ్వరరావు, వైద్యాధికారులకు సూచించారు. క్యాడెట్లకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. -
శ్రీశైలంలో రూ.10కే అల్పాహారం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థమై వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం రూ. 10కే అల్పాహారాన్ని అందిస్తోంది. పాతాళగంగ రోడ్డు మార్గంలోని నీలకంఠేశ్వర యాత్రిక వసతి సముదాయం వద్ద అల్పాహార కేంద్రాన్ని శనివారం ఏఈఓ, పర్యవేక్షకులు రాజశేఖర్, వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సాదారణ భక్తుల సౌకర్యం కోసం తక్కువ ధరలో నాణ్యమైన అల్పహారాన్ని అందించాలనే సంకల్పంతో ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. రెండు ఇడ్లీలు, ఉప్మాతో కలిపి నామమాత్రపు రేటుతో రూ. 10కే అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 7.30గంటల నుంచి ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. -
మన బ్రేక్‌ఫాస్ట్
కేలండర్‌ను ముప్ఫయ్ ఏళ్ల వెనక్కు తిప్పితే... అప్పటి ఆహారపు అలవాట్లు ప్రకృతికి అనుకూలంగా ఉండేవి. సన్‌స్ట్రోక్ తగిలిన తర్వాత కొబ్బరిబొండాంతో సేద దీరడం అన్నది ఏ ఒక్కరికీ అనుభవంలోకి వచ్చి ఉండదు. ఎండాకాలం వచ్చిందంటే ఇడ్లీ పాత్రలు, దోశెపెనాలు అటకెక్కేవి. పొద్దున్నే ఉల్లిపాయతో చద్దన్నం, ఆవకాయతో పెరుగన్నం తింటే ఎంత ఎండలో ఆడుకున్నా పిల్లలకు వడదెబ్బ ఉండేది కాదు. కడుపులో చల్ల కదలకుండా అలిసిపోయే దాకా ఆడుకోవచ్చు, ఆవకాయ రుచిని గుర్తు చేసుకోవచ్చు. ఈ తరం మర్చిపోయిన మన బ్రేక్‌ఫాస్ట్... ఆవకాయ – పెరుగన్నం రాత్రి మిగిలిన అన్నంలో ఒక స్పూన్ పెరుగు కలిపి గోరువెచ్చని పాలు పోస్తే ఉదయానికి గట్టిగా పెరుగున్నం తయారవుతుంది. దీంట్లో ఉప్పు వేసి ఉల్లి పాయ, ఆవకాయ పెచ్చు నంజుకు తింటే... నోరూరడం మాట అలా ఉంచితే మైగ్రేన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. చద్ది బువ్వ అన్నం వండినప్పుడు వార్చిన గంజిని ఒక కుండలో పోయాలి. మిగిలిన అన్నాన్ని అందులో వేస్తే... అదే చద్ది అన్నం. ఆ అన్నంలో కాçస్తంత ఉప్పు, నిమ్మ రసం వేసి దానికి తోడుగా ఉల్లిపాయ కాని, మిరపకాయ కాని తింటే డీ హైడ్రేషన్ అనే పదానికి అడ్రస్సే ఉండదు. గడ్డపెరుగు – మామిడిపండు అన్నాన్ని చల్లార్చి అందులో మీగడ పెరుగు వేసి కలిపి, పక్కన మామిడిపండు ముక్కలు కోసి పెడితే పిల్లలకు చక్కటి లంచ్. నవకాయ పిండివంటలు ఉన్నా వాటి వంక కూడా చూడరు. అన్నం, పాలు, పండుతో పూర్తి స్థాయిలో భోజనం చేసినట్లే పోషకాలు అందుతాయి. ఎండ వేడి బాధించదు. -
కాబోయే శ్రీమతికి ప్రేమతో...
శ్రీమతి చేతి వంటకు అలవాటు పడిన భర్తలందరూ ఇటు ఓ లుక్కేయండి. ఈ ఫొటో చూపించి ‘ఏవండోయ్ శ్రీవారూ... నా కోసం ఓసారి టిఫిన్ చేసి పెట్టండి’ అని అడిగినా అడగొచ్చు. యువ మన్మథుడు అక్కినేని నాగచైతన్య ఎంత సిన్సియర్‌గా వంట చేస్తున్నారో చూశారుగా! కాబోయే శ్రీమతి సమంతకు చైతూ బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టారు. ఏదో సండే ఖాళీగా ఉన్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేశారనుకోండి.. అందులో పెద్ద గొప్పేముందని అనుకోవచ్చు. చైతూ టిఫిన్ చేసింది ఫ్రైడేనాడు. అదీ షూటింగ్‌కి వెళ్లే ముందు సమంతకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి వెళ్లారు. దాంతో సమంత ఆనందానికి అవధులు లేవు. ‘‘మోకాళ్ల మీద కూర్చుని దేవుడికి కృతజ్ఞతలు తెలిపా. ఈ ప్రపంచానికి నేనే రాణి అనే భావన కలిగింది’’ అని సమంత సంబరపడిపోయారు. ‘షూటింగ్‌కి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చైతూ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసినప్పుడు... మీరు చేయలేరా’ అని శ్రీమతి అడిగితే ఏం చెప్పాలో ఆలోచించుకోండి. లేదా ఓ గంట ముందు నిద్రలేచి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి రెడీ అవ్వండి. సో, భర్తలందరూ బీ అలర్ట్. మీకిది స్వీట్ వార్నింగ్! -
తెలుగు రాష్ట్రాల్లో ఉడిపి రుచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీ టు ఈట్ ఉత్పత్తుల విపణిలో ఉన్న ఉడిపి రుచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవేశించింది. బ్రేక్‌ఫాస్ట్, రైస్, మీల్ మిక్సెస్, స్పైస్ మిక్సెస్, హెల్త్ డ్రింక్స్ వంటి 100కుపైగా ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. ఇప్పటి దాకా కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో అమ్మకాలు సాగించామని ఉడిపి రుచి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న శ్రీ ఫ్యామిలీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.ఆర్.రావు సాహిబ్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక డ్రై బ్లెండ్ టెక్నాలజీతో బెంగళూరులో తయారీ కేంద్రం నెలకొల్పినట్టు చెప్పారు. రసాయనాలు కలపకుండా ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన, అభివృద్ధికి రూ.20 కోట్ల వ్యయం చేశామన్నారు. క్లబ్ మహీంద్రా, ఓబెరాయ్, లావజ్జా, స్పార్ సూపర్ మార్కెట్లకు ప్రొడక్టులను సరఫరా చేస్తున్నామన్నారు. రెడీ టు ఈట్ ఉత్పత్తులతో.. శ్రీ ఫ్యామిలీ గ్రూప్ బెంగళూరు, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌లో కెఫే ఉడిపి రుచి రెస్టారెంట్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. వీటిలో రెడీ టు ఈట్ ఉత్పత్తులతోనే ఆహార పదార్థాలను అందిస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కొద్ది రోజుల్లో ఈ ఔట్లెట్ రానుంది. దేశవ్యాప్తంగా మూడేళ్లలో ఫ్రాంచైజీ విధానంలో 300 కెఫేలను నెలకొల్పుతామని రావు సాహిబ్ వెల్లడించారు. ‘50 కేంద్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తాం. కియోస్క్, రెస్టారెంట్, హైవే మోడల్స్‌లో ఇవి రానున్నాయి. మోడల్‌నుబట్టి రూ.12 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు పెట్టుబడి అవసరం. ఫుడ్ తయారీ నిపుణులను నియమిస్తాం’ అని వివరించారు. గ్రూప్‌లో తొలి కంపెనీ నూతచ్ న్యూట్రికేర్ టెక్నాలజీస్‌ను లలిత రావు సాహిబ్ 1999లో రూ.30 వేల పెట్టుబడితో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్ రూ.70 కోట్ల టర్నోవరు, 180 మంది సిబ్బందితో విస్తరిస్తోంది. -
రూ.4కే అల్పాహారం
కేంద్రాన్ని ప్రారంభించిన ఈఓ భరత్ గుప్త అందుబాటులో ఇడ్లీ, ఉప్మా శ్రీశైలం : భ్రమరాంబామల్లికార్జునస్వామి దర్శనార్థమై వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం గంగా, గౌరి సదన్ పక్కనున్న మినిరల్ వాటర్ ప్లాంట్ వద్ద అల్పాహార కేంద్రాన్ని ఈఓ నారాయణభరత్ గుప్త ఆదివారం ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమం చేపట్టినట్లు ఈఓ తెలిపారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి ఇడ్లి(రెండు), ఉప్మా(150 గ్రాములు) అందుబాటులో ఉంటాయన్నారు. రూ.4లకే వాటిని అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రద్దీ దృష్ట్యా ఉదయం, రాత్రి వేళల్లో కూడా కార్యక్రమాన్ని చేపడుతామని, మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నెల వరకూ కేంద్రాన్ని కొనసాగిస్తామని, భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతకముందు ఈఓ, అర్చకులు, వేదపండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటానికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏఈఓ రాజశేఖర్, శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్‌కుమార్, సహాయ సంపాదకులు కెవి సత్యబ్రహ్మచార్య, సిబ్బంది పాల్గొన్నారు. -
దిగ్గజాల దేశవాళీ బ్రేక్‌ఫాస్ట్
నిరాడంబరంఋ ఇంద్రానూయి పెప్సీ సీఈవో. ఇండియాలో పేరున్న చెఫ్ వికాస్ ఖన్నా. ఇద్దరూ కలిసి ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఎక్కడా? చెన్నైలో. చెన్నైలోనే ఎక్కడ? ‘నమ్మ వీడు’ అనే నిరాడంబర హోటల్లో. నూయీ ఇండియా వచ్చినప్పుడు ఖన్నాకు ఇటీవల ఆమెకు ఆతిథ్యం ఇచ్చే అపూర్వ అవకాశం దక్కింది. ఇంతకీ ఈ ఫుడ్ దిగ్గజాలు ఆ హోటల్లో ఏం తిన్నారంటే... అప్పమ్‌లు, పెసరట్టు దోశ, పనియారం, పాయసం, ఉప్మా. అవన్నీ కూడా నూయీ కోసం స్పెషల్‌గా ఖన్నా చేయించినవే. ఆరోగ్యం కోసం చూసుకుంటే రుచి ఉండదనీ, రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం ఉండదని మనకో నమ్మకం. అయితే ఖన్నా ఈ రెండిటినీ.. అంటే రుచినీ, ఆరోగ్యాన్నీ మిక్స్ చేసి నూయీ కోసం ఈ ఐటమ్స్ తయారు చేయించారు. ఇంత మంచి ఫుడ్‌ని తనకు ఆఫర్ చేసినందుకు నూయీ ఫేస్బుక్లో ఖన్నాకు థ్యాంక్స్ చెబుతూ... వాళ్లిద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఈ ఫొటోను పోస్ట్ చేశారు! స్నాక్స్‌కీ, శీతలపానీయాలకు ప్రసిద్ధి చెందిన పెప్సీ సీఈవో చేత భేష్ అనిపించుకున్నారంటే ఖన్నాను గ్రేట్ చెఫ్ అనే అనాలి. -
టిఫిన్ చేస్తే.. మెుక్క ఫ్రీ
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న చిరువ్యాపారి వర్ధన్నపేట టౌన్ : ఆయన ఓ టిఫిన్ సెంటర్ నడుపుకునే చిరు వ్యాపారి. అయితే ఆయన అందరిలా కేవలం టిఫిన్ పెట్టి డబ్బులు మాత్రమే తీసుకోడు. ఒక మెుక్క ఇచ్చి వాగ్దానం కూడా తీసుకుంటాడు. ఎందుకు.. ఏమిటి అంటే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు మాత్రమే కృషి చేస్తే సరిపోదు అందరం శ్రమించాలి అంటూ మెుక్కలను ఉచితంగా అందజేస్తున్నాడు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పులుమాటి శంకర్, హైమావతి దంపతులు కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై ఓ చిన్న టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. విభిన్న వంటకాలను రుచికరంగా చేయగలిగే ఆయనకు చెట్ల పెంపకం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే తన ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా ఇంటి ఆవరణలో మొక్కలను పెంచి తన టిఫిన్ సెంటర్‌కు వచ్చే వినియోగదారులకు వాటిని అందజేస్తూ నాటి పరిరక్షించేలా వాగ్దానం తీసుకుంటున్నాడు. విశేషమేమిటంటే తను పెంచిన మొక్కలు సమయానికి సరిపడా లేకుంటే కూరగాయ విత్తనాలను సైతం ఇస్తూ వినియోగదారులను పర్యావరణం పట్ల చైతన్యవంతులను చేస్తున్నాడు. ఉన్నంతలో ఊరందరికీ ఉపయోగపడుతున్న ఈ వన ప్రేమికుడిని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటే కాలుష్యం అనే మాటే ఉండదేమో. -
రాత్రి భోజనానికీ... మర్నాడు బ్రేక్‌ఫాస్ట్‌కీ మధ్య ఎంత టైమ్ ఉండాలి?
పరిశోధన ఉదయం వేళ తినే ఆహారాన్ని ఇంగ్లిష్‌లో బ్రేక్ ఫాస్ట్ అంటారన్నది విషయం తెలిసిందే. అంటే రాత్రి భోజనానికీ, ఉదయం టిఫిన్‌కు మధ్య వ్యవధి ఎక్కువ కాబట్టి... ఆ సమయాన్ని ఫాస్టింగ్ (ఉపవాసం)గా పరిగణించి, అది బ్రేక్ కావడన్నా బ్రేక్‌ఫాస్ట్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మహిళలు రాత్రిపూట కాస్త కొవ్వులతో కూడిన ఆహారం తిన్నప్పుడు ఈ రాత్రి భోజనానికీ, ఉదయపు ఆహారానికీ మధ్య సమయం (ఫాస్టింగ్ పీరియడ్) కనీసం 13 గంటలు ఉంటే అది రక్తంలో చక్కెరను తగ్గించి సమర్థంగా తగ్గిస్తుందనీ, దానివల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు. రాత్రి భోజనానికీ, ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మధ్య 13 గంటల వ్యవధి ఉండటం వల్ల మహిళల్లో బరువు కూడా తగ్గుతుందని అధ్యయనవేత్తలు తెలిపారు. వాళ్లంతా 27 నుంచి 70 ఏళ్ల వయసున్న 2,413 మంది మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీళ్లందరూ రొమ్ముక్యాన్సర్‌కు చికిత్స పొంది దాని నుంచి విముక్తమైన వారే. వీళ్లకు దాదాపు ఏడేళ్ల కాలంలో నిర్వహించిన ఫాలో అప్ పరీక్షలలో ఒక కీలకమైన అంశాన్ని గుర్తించారు. డిన్నర్‌కూ, బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్య వ్యవధిని 13 గంటల కంటే తగ్గించిన మహిళల్లో కనీసం 36 శాతం మందిలో క్యాన్సర్ తిరగబెట్టే లక్షణాలు కనిపించాయట. అయితే ఇలా వ్యవధి తగ్గించడం వాళ్లలో ప్రాణాంతకమైన ముప్పుగా మాత్రం పరిణమించలేదనీ, ఇది ఒక శుభవార్త అని అన్నారు. ఇక రాత్రి వేళ కంటి నిండా మంచి నిద్రతో ఈ వ్యవధి ఉండటం వల్ల గుండెజబ్బుల ముప్పు, టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని పేర్కొంటున్నారు పరిశోధకులు. ‘‘ఆహారంలో పెరిగే చక్కెల పాళ్లు కణుతుల పెరుగుదలకు మరింత దోహదం చేస్తుంటాయి. ఫాస్టింగ్ వల్ల చక్కెర అంతా దహించుకుపోతుంది కాబట్టి కణుతుల పెరుగుదల ముప్పు కూడా నివారితమౌతుంది’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు ఒకరు తెలిపారు. అధ్యయన ఫలితాలన్నీ ‘జామా ఆంకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురతమయ్యాయి. -
ఒకేసారి నాలుగు టిఫిన్లు...!
ఉద్యోగాలకు వెళ్లే మహిళలకైనా, గృహిణులకైనా ఉదయం లేవగానే ఓ పెద్ద టెన్షన్ మొదలవుతుంది... బ్రేక్ ఫాస్ట్ ఏం తయారు చేయాలా అని. ఇంట్లో ఒక్కొక్కరూ ఒక్కో వెరైటీ కోరుతుంటారు. ఒకరు దోశ కావాలంటే.. మరొకరు ఊతప్పం కావాలంటారు. డైటింగ్ చేసే వాళ్లుంటే చపాతీ చేయమంటారు. మరొకరు ఏ ఆమ్లెట్టో కావాలంటారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోవాలంటే బోలెడంత సమయం, అంతకంటే ఎక్కువ శ్రమ. దీనికి చక్కని పరిష్కారం ఈ నాన్‌స్టిక్ ‘మల్టీ స్నాక్ మేకర్’. మామూలుగా అట్లరేకు మీద ఒక సమయంలో ఒక్కటే వేయగలం. కానీ దీనిలో ఒకేసారి దోశ, చపాతీ, ఆమ్లెట్, ఊతప్పం కూడా వేసేసుకోవచ్చు. టైమ్ సేవ్ అవుతుంది. శ్రమా తగ్గుతుంది. వెల రూ.400-500 వరకూ ఉంటుంది! -
ఇంత చాలు
ఆరోగ్యంగా ఉండటానికి సగటు వ్యక్తులు తీసుకోవాల్సిన ఆహారం ఈ కింద పేర్కొన్నట్లుగా ఉండే చాలు. ఉదయం టిఫిన్‌లో రెండు ఇడ్లీ లేదా ఒక దోశ లేదా ఉప్మా (వెజిటబుల్స్‌తో వండిన కూరలతో), దీంతో పాటు ఒక గ్లాస్ పాలు. ఏదైనా ఒక పండు. మధ్యాహ్నం భోజనంలో మూడు/నాలుగు రోటీలు లేదా మూడు గుప్పెళ్ల అన్నం, ఆకలి తీవ్రతను తగ్గించే తగినన్ని సలాడ్స్‌తో పాటు ఒక కప్పు పప్పు, రోజుకు ఒక రకం చొప్పున అన్ని రకాల వెజిటబుల్స్ కవర్ అయ్యేలా ఒక కూర, పెరుగు. చికెన్, గుడ్డు, చేపలు తినదలచుకుంటే కేవలం మధ్యాన్నం పూటే వాటిని తీసుకోవడం మంచిది. ఇది కూడా పరిమితంగా. సాయంత్రం కాసిన్ని మొలకెత్తిన గింజలు తీసుకొని ఇక రాత్రి భోజనం అంతా మధ్యాన్న భోజనంలాగే తీసుకోవాలి. మధ్యాన భోజనం కంటే రాత్రి భోజనం పరిమాణం మరింత తగ్గితే అది ఆరోగ్యానికీ, వృథాను నివారించడానికీ తోడ్పడుతుంది. -
టిఫిన్... అంటే తిట్లే మరి
బ్రేక్‌ఫాస్ట్ అంటే తిట్లు తినడమేనా అని తెలిసింది ఓ అధికారికి. తాజాగా ఏపీ మంత్రి ఒకరు 8 గంటలకే తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వారు 40 మందివరకూ వచ్చారు. వీళ్లందరికీ బ్రేక్‌ఫాస్ ఫాలోస్ అంటూ మెసేజ్ పెట్టారు. అయితే మినిస్టర్ ఓఎస్డీగారు హోటల్లో టిఫిన్ తెప్పిస్తే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు...పాపం మంత్రి విద్యా సంస్థల్లో ఉన్న ఓ మెస్ నుంచి తెప్పించాలనుకున్నారు. ఉదయం ఏడున్నరకల్లా తేవాల్సిన టిఫిన్ 9 దాటినా తేలేదు. దీంతో రిపోర్టర్లు, కెమె రామెన్లందరూ మంత్రిని తిట్టుకుంటూ వెళ్లిపోయారు. దీంతో మంత్రి... ఓఎస్డీనీ ఓ రేంజ్లో తిట్టిపోశారు. కనీసం టైముకు టిఫిన్ కూడా తెప్పించలేని అధికారులు ఎలా పనిచేస్తారయ్యా అంటూ తిట్లదండకం అందుకున్నారు. చివరకు రిపోర్టర్లు టిఫిన్ ఎందుకు రాలేదూ అని ఆరాతీస్తే...మంత్రిగారి కాలేజీ మెస్‌లో ఆర్డర్ ఇవ్వడం వల్లే లేటయిందని తెలిసింది. ఇదీ మంత్రి గారి బ్రేక్‌ఫాస్ట్ తిట్లు...! -
'జోరుమీద రాహుల్.. మీడియాతో బ్రేక్‌ఫాస్ట్'
గువాహటి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మునుపెన్నడూ లేనంత ఉత్సాహంగా కనిపించారు. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. శనివారం అసోం పర్యటనకు వెళ్లిన రాహుల్.. ఉదయం మీడియా ప్రతినిధులతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం వారితో గంట సమయం పలు అంశాలపై చర్చించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ వివిధ స్థానిక మీడియా ప్రతినిధులు ఎడిటర్స్ ఇతర కార్యనిర్వాహకులతో అల్పహార విందు చేశారు. అనంతరం అసోం ఎన్నికలు, జాతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ అంశాలను స్పృషిస్తూ తన అభిప్రాయాలను మీడియాకు తెలిపారు. చాలా ప్రశ్నలు మీడియా రాహుల్ కు సందించగా వాటిలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాహుల్ గాంధీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు మాత్రం పొడిపొడి సమాధానాలు చెప్పి.. అడిగిన వారికి అనుమానాలు మిగిల్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఆరోపణలు చేసుకుంటూ జీఎస్టీ బిల్లు విషయంలో ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా అని అడిగినప్పుడు సమాధానం కొద్దికొద్దిగా చెప్పారు. జీఎస్టీ బిల్లుకు ఆ కేసుకు ఎలాంటి సమాధానం లేదని అన్నారు. మాకు ప్రధానంగా మూడు ఆందోళనలు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే తాము బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. -
సీఎం ‘బ్రేక్’.. ఫాస్ట్‌తో బెదురుతున్న నేతలు..!
ముఖ్యులు ఉదయాన్నే మా ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు రావాలని పిలిస్తే ఎవరైనా సంతోషిస్తారు. అందులోనూ సీఎం అంతటి వ్యక్తి పిలిస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు బ్రేక్ ఫాస్ట్ అంటే మాత్రం నేతలు ఏదో తిరకాసు ఉందని వెనుకడుగు వేస్తున్నారట. అలా హాజరైన వారికి పదవులు ఇవ్వకుండా బ్రేక్ వేయడానికే ఆయన బ్రేక్ ఫాస్ట్‌కు పిలుస్తారట. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చూద్దామన్నందుకు... రోజూ స్వాతిముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమలహాసన్‌లా ప్రతి రోజూ ఏదో సందర్భంలో ఎక్కడో ఒకచోట కలిసి నమస్కారం పెట్టడం ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఆయన వ్యవహారం గమనించిన చంద్రబాబు పిలిచి రేపు మాయింటికి బ్రేక్ ఫాస్ట్‌కు రావాలని ఆహ్వానించారు. దాంతో తెగ సంతోషపడిన ఆ నేత తనకు ఎమ్మెల్సీ ఖరారైనట్టేనని మిత్రులు, సన్నిహితులందరికీ చెప్పుకున్నారు. ఉదయాన్నే చెప్పిన టైమ్కన్నా అరగంట ముందే సీఎంగారి ఇంటికి చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత పిలుపు అందుకుని లోనికి వెళ్లారు. అల్పాహారం వడ్డింపులైన తర్వాత కుశల ప్రశ్నల పరంపర...! ఈలోగా తన పదవి అంటూ ఆ నేత గుర్తుచేయగా..! నీ గురించి నాకు తెలియదా..! నీ గురించి ఆలోచించేవారు నాకన్నా నీకెవరున్నారు...!! ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాగా...! ఇప్పుడే ఎందుకు తొందర...: అని బ్రేక్ ఫాస్ట్ ముగించి మళ్లీ కలుద్దామన్నారట. అంతే...!!! టికెట్ లేదని చెప్పడానికి ఇంత తతంగమా...! బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ పదవి రాకుండా బ్రేక్ వేశారంటూ ఆ నేత బయటకు రాగానే ఎదురుపడిన నేతలకు చెప్పేసారు. ఆరోజు నుంచి నేతలెవరు కలిసినా బ్రేక్ ఫాస్ట్‌కు మాత్రం వెళ్లకండని చెబుతున్నారట. -
ఇన్స్టంట్ నూడుల్స్‌తో ఆరోగ్యానికి చేటు..
‘ఇన్స్టంట్ నూడుల్స్’ అంటూ హోరెత్తించే ప్రకటనల ప్రభావంతో త్వరగా తయారు చేసుకోగల నూడుల్స్‌నే మీ బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకుంటున్నారా..? అయితే, మీరు చాలా ఆరోగ్య సమస్యలను ‘కొని’ తెచ్చుకుంటున్నట్లే! దక్షిణ కొరియాలో జరిపిన ఒక పరిశోధనలో నూడుల్స్ వల్ల తలెత్తే అనర్థాలు వెలుగులోకి వచ్చాయి. నూడుల్స్ తింటే శరీరంలోని రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి దుష్ఫలితాలు కలుగుతాయని, చివరకు గుండెజబ్బులకు, పక్షవాతానికి గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని ఆ పరిశోధనలో తేలింది. నూడుల్స్‌లోని అధిక మోతాదులో ఉండే సోడియం, అన్‌శాచ్యురేటెడ్ కొవ్వుల వల్ల ఈ దుష్ర్పభావాలు కలుగుతాయని దక్షిణ కొరియా శాస్త్రవేత్త హ్యున్ షిన్ వివరిస్తున్నారు. -
భర్త టిఫిన్ తినలేదని..
జీడిమెట్ల (హైదరాబాద్) : భర్త అలిగి, టిఫిన్ చేయకుండా వెళ్లాడని మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మార్కండేయనగర్లో నివాసం ఉండే సంతోష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. కాగా సోమవారం ఉదయం సంతోష్ ఇంట్లో అలిగి టిఫిన్ తినకుండా వెళ్లినట్టు సమాచారం. అయితే ఇది తట్టుకోలేక సంతోష్ భార్య ఉష(28) మధ్యాహ్నం సమయంలో చీరతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేనమామ శ్రీనివాస్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఇది వెలుగు చూసింది. -
ఉదయం టిఫిన్ చేయండి... గుండెజబ్బులను తరిమేయండి!
ప్రతిరోజూ ఉదయమే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో గుండెజబ్బుల అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోని వారు, తరచూ దాన్ని మిస్ చేసే వారిలో గుండెజబ్బుల రిస్క్ గణనీయంగా పెరిగినట్లు గుర్తించిన ఆ అధ్యయనవేత్తలు ఆ అంశాన్ని ‘సర్క్యులేషన్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో 26,902 మంది పురుషులు పాల్గొన్నారు. వీరిలో 16 నుంచి 82 ఏళ్ల వయసున్నవారూ ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అధ్యయనంలో తరచూ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారిని పరిశీలించగా... వారిలో 27 శాతం మందికి గుండెజబ్బుల రిస్క్ ఫ్యాక్టర్లు మొదలైనట్లు పరిశోధనవేత్తలు గుర్తించారు. ఇక రాత్రివేళ కూడా చాలా ఆలస్యంగా భోజనం చేసేవారిలో 55 శాతం మందికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలున్నట్లు వారు వివరించారు. -
పుట్టింది బాబు అయితే..పాపను ఇచ్చారు
-
పరాటా ఫెస్ట్
బైశాఖి స్పెషల్ పరాటా... ఉత్తరభారతంలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్! పంజాబీలకు అత్యంత ఇష్టమైన వంటకం. ఇందులో ఆలూ, గోబీ, పనీర్, ఆనియన్, మూలీ, ప్లెయిన్... ఇలా అనేక ర కాలు నగరంలోని అన్ని రెస్టారెంట్స్‌లో ఇవి దొరుకుతున్నా... టేస్టీయెస్ట్ పరాటా కావాలంటే మాత్రం దాబాకు వెళ్లాల్సిందే. అయితే దాబాలు అందుబాటులోలేని హైదరాబాదీలకు ఈ పరాటా రుచులనందిస్తోంది తాజ్దక్కన్. పంటలు చేతికొచ్చే ఈ సమయంలోనే పంజాబీలు నూతన సంవత్సర వేడుకగా ‘బైసాకి’ని ఏప్రిల్ రెండవ వారం చివరిలో జరుపుకొంటారు. ఆ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రకరకాల జొన్నలు, సజ్జలతో కలిపి ఈ పరాటా ఫెస్ట్‌ను... ఈ నెల 19 వరకు కండక్ట్ చేస్తోంది తాజ్. పుట్టగొడుగులు, పనీర్, కొత్తిమీర, ఆలూమేతి, ములక్కాడలు... ఇలా డిఫరెంట్ వెజ్ఐటమ్స్తో చేసిన పరాటాలను స్పెషల్‌గా వడ్డించనుంది. పైనుంచి క్రిస్పీగా కన్పించే ఈ పరాటాలు లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఓన్లీ వెజ్జా... అని నిరాశపడిపోనక్కర్లేదు. మాంసాహార ప్రియుల కోసం... గుడ్డు, చికెన్, మటన్, బోఠీ, రొయ్యలతో చేసిన పరాటాలు కూడా స్పైసీగా నోరూరించనున్నాయి. పరాటాతోపాటు లస్సీ ఉంటే... ఆ టేస్టే వేరు! అందుకే... దేశీ స్టైల్లో ప్రిపేర్ చేసిన బటర్‌స్కాచ్ లస్సీ, వెనిల్లా లస్సీని ఈ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ఆఫర్ చేస్తోంది. ‘సిటీలో ఉన్న నార్త్ఇండియన్స్, ఎస్పెషల్లీ పంజాబీస్, మార్వాడీస్, పరాటా లవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పరాటా ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. కాళీ దాల్, రెడ్ అనియన్స్, గ్రీన్ చిల్లీస్, పికిల్స్, కుకుంబర్ స్లైడ్స్ పరోటాకు మరింత టేస్ట్‌ను ఇస్తాయి. ఇది ఎండాకాలం కావడంతో రాగులు, సజ్జలు, జొన్నలతో చేసే ఈ వంటకాల వల్ల చలువ చేస్తుంది’అని అంటున్నారు ఎగ్జిక్యూటివ్ చెఫ్ సజేష్ నాయర్. - శిరీష చల్లపల్లి