
లండన్: పిల్లలు ఉపాహారం తినకుండానే స్కూల్‌కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఎక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌లోని కొందరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయం తేలింది. తగినన్ని పోషకాలు లేకపోవడం విద్యార్థుల మార్కులపై ప్రభావం పడుతుందని తాము గుర్తించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేటీ అడోల్ఫస్ తెలిపారు. పరిగణనలోకి తీసుకున్న విద్యార్థులందరి గ్రేడ్స్‌ను పాయింట్ల రూపంలోకి మార్చినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసే వారికి ఎక్కువ పాయింట్లు రాగా, మిగిలిన వారికి తక్కువ వచ్చాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతోపాటు, వయసు, బీఎంఐ, ఆడ? మగ? అన్న ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పేమీ లేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment