
కొన్ని రెస్టారెంట్ ఏళ్లనాటివి అయినా.. అక్కడ అందించే రుచే వేరు అనిపిస్తుంది. ఎన్నో కొంగొత్త హైరేంజ్ రెస్టారెంట్‌లు వచ్చినా..! ఏళ్ల నాటి మధురస్మృతులకు నిలయమైన ఆ పాత రెస్టారెంట్‌లకే ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది. ఎన్ని హంగు ఆర్భాటలతో ఐదు నక్షత్రాలలాంటి హోటల్స్ వచ్చినా.. వాటి క్రేజ్ తగ్గదు. కేవలం సామాన్యులే కాదు ప్రముఖులు, సెలబిట్రీలు సైతం అలనాటి రెస్టారెంట్ పాక రుచికే మొగ్గుచూపుతారు. వాటి టేస్ట్‌కి ఫిదా అంటూ కితాబిస్తారు కూడా. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రెస్టారెంటే ఈ బెంగళూరుకి చెందిన 'విద్యార్థి భవన్'. ఈ రెస్టారెంట్ అందించే విభిన్న దోసె, వాటిని మెచ్చిన ప్రముఖులు గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!.
బెంగళూరు వాసులు ఇష్టపడే 1943ల నాటి రెస్టారెంట్ ఈ 'విద్యార్థి భవన్'. ఇది ఐకానిక్ బెన్నే దోసెలకు ఫేమస్. ఇక్కడ చేసే బెన్నే దోసెల రుచే వెరేలెవెల్. గాంధీనగర్‌లోని గల్లో ఉండే ఈ ఐకానిక్ రెస్టారెంట్ స్థానికులు, పర్యాటకులకు నోరూరించే రుచులతో మైమరిపిస్తోంది. ఎవ్వరైనా బెన్నే దోస తినాలంటే అక్కడకే వెళ్లాలనేంతగా పేరు తెచ్చుకుంది ఈ రెస్టారెంట్.
నిత్యం రద్దీగా క్యూలైన్లు కట్టి ఉంటారు జనాలు ఆ రెస్టారెంట్ వద్ద. అంతేగాదు అక్కడ యాజమాన్యం 50% అడ్వాన్స్‌డ్ బుకింగ్ సీటింగ్‌కి ప్రాద్యాన్యత ఇస్తుందంటే..ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా బుక్ చేసుకోకపోతే వారాంతల్లో వెళ్లక పోవడమే బెటర్.
ఈ రెస్టారెంట్ చరిత్ర..
ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్‌లో బెన్నే దోసెలు, ఫిల్టర్ కాఫీలను ఆస్వాదించడానికి వచ్చే కస్టమర్లే ఎక్కువట. ఇక్కడ ఉండే సిబ్బంది కూడా విలక్షణంగా ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎనిమిది ప్లేట్‌ల బెన్నెదోసెలను సర్వ్ చేస్తుంటారు. ఆ విధానం చూస్తే..కచ్చితం కళ్లు బైర్లుకమ్ముతాయి. దీన్ని 1943-1944 ప్రారంభంలో వెంకటరామ ఉడల్ నగరం వెలుపల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అదీగాక ఆ టైంలో రెస్టారెంట్లకు చివర్లో భవన్ అని పెట్టేవారట.
అలా దీనికి విద్యార్థి భవన్ అని పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ రెస్టారెంట్ సమీపంలో ఉంటే ఆచార్య పబ్లిక్ స్కూల్, నేషనల్ కాలేజ్ తదితర సమీప పాఠశాల విద్యార్థులకు బోజనం అందుబాటులో ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. అదీగాక ఆ రెస్టారెంట్ ఉన్న ప్రాంతం విద్యాసంస్థలకు నిలయం కావడంతో అనాతికాలంలోనే మంచి ఫేమస్ అయిపోయింది. అంతేగాదు ఇక్కడకు వచ్చే కస్టమర్‌లలో ఎక్కువ మంది ప్రముఖుల, సెలబ్రిటీలు, రచయితలేనట.
ఈ దోసెను మెచ్చిన అతిరథులు..
ముఖ్యంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, చెఫ్ సంజీవ్ కపూర్, స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి వంటి ఎందరో ఈ రెస్టారెంట్ బెన్నే దోసకు అభిమానులట. అంతేగాదు ఈ రెస్టారెంట్ అనగానే ఠక్కున గుర్తువచ్చేది బెన్నేదోసనే అట. అందువల్ల ఆ హోటల్ సిగ్నేచర్ డిష్‌గా ఆ వంటకం మారిపోవడం విశేషం.
ఇక్కడ ఆ దోస తోపాటు ఇడ్లీలు, కేసరి బాత్ లేదా రవా బాత్, మేడు వడ వంటి విభిపకప అల్పాహారాలను కూడా సర్వ్ చేస్తారు. అంతేగాదు అక్కడ టిఫిన్ ముగించి చివరగా ఫిల్టర్ కాఫీని ఆస్వాదించకుండా వెళ్లరట. అంతలా ప్రజాదారణ పొందిన ఈ ఐకానిక్ విద్యార్థి భవన్ రెస్టారెంట్ రుచిని మీరు కూడా ఓ పట్టు పట్టేయండి మరీ..!.
(చదవండి: work life Balance: అలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..! టెకీ సలహ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment