Leeds University
-
టిఫిన్ తినకుంటే మార్కులు తగ్గుతాయి!
లండన్: పిల్లలు ఉపాహారం తినకుండానే స్కూల్‌కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఎక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌లోని కొందరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయం తేలింది. తగినన్ని పోషకాలు లేకపోవడం విద్యార్థుల మార్కులపై ప్రభావం పడుతుందని తాము గుర్తించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేటీ అడోల్ఫస్ తెలిపారు. పరిగణనలోకి తీసుకున్న విద్యార్థులందరి గ్రేడ్స్‌ను పాయింట్ల రూపంలోకి మార్చినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసే వారికి ఎక్కువ పాయింట్లు రాగా, మిగిలిన వారికి తక్కువ వచ్చాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతోపాటు, వయసు, బీఎంఐ, ఆడ? మగ? అన్న ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పేమీ లేదని వివరించారు. -
కసరత్తులు అక్కర్లేదు.. ఒక్క ట్యాబ్లెట్ చాలు!
లండన్: అప్పుడప్పుడూ టీవీల్లో యాడ్స్ వస్తుంటాయి.. కష్టపడుతూ గంటల తరబడి జిమ్‌లో కండలు కరిగించాల్సిన అవసరం లేదని, ఈ చిన్నపాటి బెల్టును పెట్టుకుంటే చాలు నాజూగ్గా మారిపోతారంటూ చెబుతారు. అందులో నిజమెంతో, అబద్ధమెంతో తెలియదుగానీ.. శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు అలాంటి మాటలే చెబుతున్నారు. జిమ్‌కు వెళ్లి ఎక్సర్సైజులు చేస్తే శరీరం ఎటువంటి ప్రభావానికి లోనవుతుందో సరిగ్గా అలాంటి మార్పులే శరీరంలో సంభవించేలా చేసే ఓ మాత్రను తయారు చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. వ్యాయామం చేసిన ఫలితాలు పొందుతారంటున్నారు. యూకేలోని లీడ్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మాత్రలను తయారు చేశారట. ‘పీజో1’గా నామకరణం చేసిన ఈ మాత్ర వేసుకోగానే.. వ్యాయామం చేయడం ద్వారా కలిగే ఫలితాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘కసరత్తులు చేసే సమయంలో శరీరంలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. తద్వారా శరీరంలోని కీలక అవయవాలకు మరింత రక్తప్రసరణ జరుగుతుంది. ఇటువంటి మార్పులే తాము తయారు చేసిన పీజో1 మాత్ర వేసుకున్నప్పుడు కూడా కలుగుతాయి’ అని పరిశోధకుల్లో ఒకరైన డేవిడ్ బీచ్ తెలిపారు.