టిఫిన్... అంటే తిట్లే మరి | AP minister Breakfast story | Sakshi
Sakshi News home page

టిఫిన్... అంటే తిట్లే మరి

Published Sun, Mar 20 2016 6:26 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

టిఫిన్... అంటే తిట్లే మరి - Sakshi

టిఫిన్... అంటే తిట్లే మరి

బ్రేక్‌ఫాస్ట్ అంటే తిట్లు తినడమేనా అని తెలిసింది ఓ అధికారికి. తాజాగా ఏపీ మంత్రి ఒకరు 8 గంటలకే తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వారు 40 మందివరకూ వచ్చారు. వీళ్లందరికీ బ్రేక్‌ఫాస్ ఫాలోస్ అంటూ మెసేజ్ పెట్టారు. అయితే మినిస్టర్ ఓఎస్డీగారు హోటల్‌లో టిఫిన్ తెప్పిస్తే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు...పాపం మంత్రి విద్యా సంస్థల్లో ఉన్న ఓ మెస్ నుంచి తెప్పించాలనుకున్నారు. ఉదయం ఏడున్నరకల్లా తేవాల్సిన టిఫిన్ 9 దాటినా తేలేదు. దీంతో రిపోర్టర్లు, కెమె రామెన్‌లందరూ మంత్రిని తిట్టుకుంటూ వెళ్లిపోయారు.

దీంతో మంత్రి... ఓఎస్డీనీ ఓ రేంజ్‌లో తిట్టిపోశారు. కనీసం టైముకు టిఫిన్ కూడా తెప్పించలేని అధికారులు ఎలా పనిచేస్తారయ్యా అంటూ తిట్లదండకం అందుకున్నారు. చివరకు రిపోర్టర్లు టిఫిన్ ఎందుకు రాలేదూ అని ఆరాతీస్తే...మంత్రిగారి కాలేజీ మెస్‌లో ఆర్డర్ ఇవ్వడం వల్లే లేటయిందని తెలిసింది. ఇదీ మంత్రి గారి బ్రేక్‌ఫాస్ట్ తిట్లు...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement