electronic media
-
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్‌మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
తమ దగ్గర ఉన్నదే...
మనసంతా అసూయతో నిండి ఉన్నవారు ఎవరిలోను గొప్పతనాన్ని అంగీకరించ లేరు. ఎవరి గురించి అయినా గొప్పవారు అని అనగానే వెంటనే ఏదో ఒక లోపం వారిలో వెతికి, ఆ ఒక్కదాని వల్ల వారు పనికిరాని వారు అని నిర్ధారించేస్తారు. మానవమాత్రులకి ఏదో ఒక చిన్న లోపం, దోషం కాకపోవచ్చు, ఉండే ఉంటుంది. సద్గుణాలని ఎన్ని ఉన్నా పక్కకి పెట్టి, ఆ చిన్న బలహీనతనే పతాక శీర్షికగా చేస్తారు. ‘‘అయ్యా! మీనుండి సహాయం పొందిన వారే మిమ్మలని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. మీరు వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేమి?’’ అని ప్రశ్నించిన వారికి ఒక మహానుభావుడు ఇట్లా సమాధానం చెప్పారు. ‘‘ఎవరైనా తమ దగ్గర ఉన్న దానిని మాత్రమే ఇవ్వగలరు కదా! నా దగ్గర ఉన్న దానిని నేను పంచుతున్నాను. వారి దగ్గర ఉన్న దానిని వారు వెలిగక్కుతున్నారు.’’ నిజమే కదా! తమ వద్ద లేని దానిని ఎవరైనా ఎట్లా ఇవ్వగలరు? గుండెల నిండా ప్రేమ, సానుభూతి, ఆప్యాయత, దయ మొదలైనవి ఉన్న వారు వాటినే వ్యక్తీకరించ గలుగుతారు. ద్వేషం, పగ, అసూయ ఉన్న వారు వాటినే ప్రకటించగలుగుతారు. మాటలలో వ్యక్తమయ్యే భావాలే మనిషి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి. వాస్తవాన్ని గ్రహించటానికి అటువంటివారి మాటలని వడగట్టవలసి ఉంటుంది. వాటికి వెంటనే ప్రతిస్పందించకుండా ఉండాలి. వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఒక పాత్రలో దేనినైనా నింపుతూ ఉంటే నిండగానే అది పొంగి పొరలుతూ ఉంటుంది. అదేవిధంగా గుండె అనే పాత్రలో ఏది నిండితే అదే వెలుపలికి ఉబికి వస్తుంది. దానిని తట్టుకోగలగటం కష్టమైన పనే అని చెప్పవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ప్రేమని కూడా తట్టుకోటం కష్టం. అవతలి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాయసంలో పడ్డ ఈగ లాగా గిజగిజ లాడ వలసి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా అనిపించినా ప్రమోదమే కాని, ప్రమాదం ఏమీ ఉండదు. అదే ద్వేషమైతే చెప్పనవసరం లేదు. వాతావరణాన్ని కలుషితం చేయటమే కాదు, కొన్నిమారులు ప్రమాదాలు కూడా తెచ్చి పెడుతుంది. ఇటువంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనపడుతూనే ఉంటారు. ఎందుకు ఎదుటివారి మీద విషం కక్కుతారో తెలియదు. ఎవరు బాగున్నా వీరికి నిద్రపట్టదు. ఏదో ఒక వంకర మాట అనవలసినదే. ఒకప్పుడు మాటలకే పరిమితం అయిన ఈ వ్యవహారం తరువాత అచ్చులో కనపడేది. ఇప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియా వేదిక అయింది. ఇక వాట్సప్, ట్విటర్ వంటి వాటిలో విచ్చలవిడిగా విషబీజాలు వెదజల్లటం చూస్తున్నాం. అసలు బాధాకరమైన విషయం ఏమంటే వీటికే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం ఆకర్షణ ఒక్కటే కాదు, ఎందుకు ఆ విధంగా చెప్పారో తెలుసుకుందామనే కుతూహలం కూడా అని కొంతమంది విశ్లేషణ. స్పష్టంగా తెలుస్తూనే ఉందిగా – వారి మనస్సులన్నీ ప్రతికూల భావనలతో నిండి ఉన్నాయని! ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, తన దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా! ఉద్దేశం ఉంటే సరి పోదు. శక్తి ఉండాలి, సంపద కూడా ఉండాలి. అది కూడా ఎంత ఇచ్చినా తనకి తక్కువ కాదు అన్నంత నిండుగా ఉంటేనే సాధ్యం. అది ధనం కావచ్చు, విద్య కావచ్చు. వస్తుసంపద కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు. మంచివే పెంచుకుందాం. పంచుకుందాం. ఈ రోజు మనతో ఎవరి గురించి అయినా చెడుగా చెపుతున్నారు అంటే, రేపు మన గురించి ఎంతమందితో ఏం చెపుతారో! ఇది గుర్తించి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇట్లా చెప్పేవారికి కాస్త సృజనాత్మకత కూడా ఉంటుంది. ఎదుటివారు నమ్మే విధంగా చక్కని కల్పనలు చేయగలరు. బట్టతలకి మోకాలికి ముడి పెట్టగలరు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2024లో ప్రజలు మళ్లీ సీఎం జగన్‌కు పట్టం కట్టడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ మనసున్న నాయకుడు...ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే.. అందరం అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలి’’ అని అలీ అన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
నా కూతురి పెళ్లికి సీఎం జగన్ కానుక ఇచ్చారు : అలీ
-
సీఎం జగన్ అడుగు జాడల్లో నడుస్తా: అలీ
సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా అలీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా అలీ స్పందించాడు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని... తన సేవలను సీఎం జగన్ గుర్తించారని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు. ఈ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీతభత్యాలు అందనున్నాయి. -
ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ
-
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
సాక్షి, విజయవాడ:సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ మీడియా ఏపీ ప్రభు త్వ సలహాదారునిగా సినీనటుడు మహ్మద్ అలీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారని జీఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు
న్యూఢిల్లీ: 2017–18 నుంచి ఈ ఏడాది జూలై 12వ తేదీ దాకా.. ఐదేళ్లలో మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ఈ సొమ్ము వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు, రూ. 1,756.48, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు రూ.1,583.01 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. -
మీడియాను అలా అనుమతించొచ్చా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలను చొప్పించేందుకు జరుగుతున్న భారీ కుట్రను బయటపెడుతున్నామంటూ సుదర్శన్ టీవీలో ప్రసారమవుతున్న బిందాస్ బోల్ కార్యక్రమంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఒక మతం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకునేలా మీడియాను అనుమతించవచ్చా అని ప్రశ్నించింది. ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘ముస్లింలు సివిల్ సర్వీసెస్‌లో చేరడం ఒక పెద్ద కుట్రని మీరు చెప్పాలనుకుంటున్నారు. ఇలా విద్వేషాన్ని, విభేదాలను పెంచడం చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి ప్రచారంతో దేశం మనుగడ సాధించలేదు’ అని వ్యాఖ్యానించింది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో తమకు తెలుసునంది. ఎలక్ట్రానిక్ మీడియా స్వయం నియంత్రణను బలోపేతం చేసేందుకు సూచనలు ఇవ్వాలని కేంద్రం, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్(ఎన్బీఏ)లను కోరింది. సుదర్శన్ టీవీ తరఫున ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చవ్హంకే తన పిటిషన్లో.. బిందాస్ బోల్ కార్యక్రమంలో ‘యూపీఎస్సీ జిహాద్’ అనే మాట వాడటాన్ని సమర్థించుకున్నారు. యూపీఎస్సీ పరీక్ష రాసే ముస్లింలకు జకాత్ ఫౌండేషన్ అన్నివిధాలుగా సాయం అందిస్తోందనీ, ఈ ఫౌండేషన్‌కు ఉగ్ర లింకులున్న సంస్థల నుంచి నిధులందుతున్నాయని పేర్కొన్నారు. ఒకరిద్దరు అభ్యంతరం వ్యక్తం చేసినంతమాత్రాన కార్యక్రమంపై నిషేధం విధించడం తగదని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమం ప్రొమోలో చూపిన దృశ్యాలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. జకాత్ ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. జకాత్ ఫౌండేషన్ ముస్లింలతోపాటు ముస్లిమేతరులకు కూడా సాయం చేస్తోందన్నారు. కాగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బిందాస్ బోల్ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఈ నెల 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై సుదర్శన్ టీవీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసింది. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆగిపోయిందీ కోట్లాదిమంది తెలుసుకోవాలని భావిస్తున్నందున విచారణ ప్రక్రియను లైవ్‌లో చూపేందుకు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కోరింది. వాక్ స్వాతంత్య్రానికి సంబంధించి ఇది చాలా కీలకమైన కేసని పేర్కొంది. -
‘స్వీయ నియంత్రణ’పై సూచనలివ్వండి!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియా పాటించాల్సిన స్వీయ నియంత్రణ విధానానికి సంబంధించి సూచనలు పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్(ఎన్బీఏ)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. సభ్యులుగా ఉన్నవారు, సభ్యులు కాని వారిపై ఎన్బీఏకు ఒకే విధమైన నియంత్రణ ఉండేలా సూచనలు ఇవ్వాలని కోరింది. ఎలక్ట్రానిక్ మీడియాలో స్వీయ నియంత్రణ విధానం సరిగ్గా లేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పై ఆదేశాలు జారీ చేసింది. ‘యూపీఎస్సీ జీహాద్’ పేరుతో ‘సుదర్శన్ టీవీ’ మతతత్వ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోందని, దానిని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ‘కార్యక్రమ నియమ నిబంధనలను పాటించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సుదర్శన్ టీవీని ఆదేశించి అక్కడితో వదిలేసింద’ని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీ ఉందని, ఆ కమిటీ కూడా రూ.లక్ష వరకు మాత్రమే జరిమానా విధించగలదని, అదీ సభ్యత్వం ఉన్నవారికే అని ఎన్బీఏ చెబుతోంది’ అని ధర్మాసనం మండిపడింది. ఎన్బీఏ సభ్యత్వం లేని చానెళ్లపైనా నియంత్రణ ఉండేలా రాజ్యాంగ అధికరణ 142 ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంది. -
కరోనాపై భయాందోళలు తొలగించాలి : మోదీ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి ప్రసార మాధ్యమాలు ప్రజలకు వాస్తవ సమచారం అందజేసి వారిలో భయాందోళనలు తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్ ఒక జీవితకాలపు సవాలు అని తెలిపారు. దానిని అధిగమించడానికి వినూత్న ఆవిష్కరణతో కూడిన పరిష్కారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశలో రిపోర్టర్లు, కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు నిర్విరామ కృషిని జాతికి గొప్ప సేవగా పరిగణించాలని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోమవారం ప్రముఖ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కరోనా మహమ్మారి ముప్పు తీవ్రతను అర్థం చేసుకుని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా కృషి చేస్తున్న అన్ని మాధ్యమాలకూ ముందుగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రిపోర్టర్లు, కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు అటు క్షేత్రస్థాయిలో, ఇటు స్టూడియోల్లో నిర్విరామంగా శ్రమిస్తున్నారంటూ ప్రశంసించారు. అంకితభావం, చిత్తశుద్ధితో కూడిన వారి విధి నిర్వహణను జాతికి చేస్తున్న గొప్ప సేవగా ఆయన కొనియాడారు. అదే సమయంలో కొందరు సిబ్బంది ఇళ్ల నుంచే పని చేసేలా కొన్ని చానెళ్లు వినూత్న ప్రయత్నం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. సుదీర్ఘంగా పోరాడాల్సి ఉంది.. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19ను ఒక జీవితకాలపు సవాలుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త, ఆవిష్కరణాత్మక పరిష్కారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. మన పోరాటం ఇక ముందు కూడా సుదీర్ఘంగా కొనసాగాల్సి ఉందని చెప్పారు. ఇందులో భాగంగా సామాజిక దూరం పాటించడంపై అవగాహన పెంచాలన్నారు. అలాగే తాజా పరిణామాలపై సమాచారాన్ని, కీలక నిర్ణయాలను వేగంగా ప్రజలకు చేరవేయాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఇదంతా సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో ప్రజానీకానికి అందించడంలో వృత్తి నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించారు. ప్రసార మాధ్యమాలు ఒకవైపు- ప్రజలు స్వీయ రక్షణను విస్మరించి, నిర్లక్ష్యానికి తావివ్వకుండా చూడటమేగాక మరోవైపు- వాస్తవ సమాచారమిస్తూ వారిలో నిరాశావాదాన్ని, భయాందోళనలను పారదోలేందుకు కృషి చేయాలని సూచించారు. రిపోర్టర్లకు ప్రత్యేక మైకులు అందజేయాలి.. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఎంతో సాహసంతో ముందునిలిచి, నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిత్యనూతన ఉత్తేజం నింపాల్సిన బాధ్యత కూడా ప్రసార మాధ్యమాలపై ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, ప్రసారంలో వార్తా చానెళ్లు కీలక సాధనంగా ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రిపోర్టర్లకు పొడవాటి గొట్టం చివరన అమర్చిన ప్రత్యేక మైకులను అందించాలని చానెళ్ల యాజమాన్యాలకు ఆయన సూచించారు. ఆ మేరకు వారు ఇంటర్వ్యూల వంటివి నిర్వహించే సమయంలో ఒక మీటరు సామాజిక దూరం పాటించగలిగేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమాచారం ఇచ్చేటప్పుడు శాస్త్రీయ నివేదికలకు ప్రాచుర్యం లభించేలా చూడాలన్నారు. అవాస్తవాల వ్యాప్తి అడ్డుకోవడం కోసం బృంద చర్చలలో నిష్ణాతులైన ప్రముఖులను భాగస్వాములను చేయాలని నిర్దేశించారు. అలాగే వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సామాజిక దూరం పాటించడంలో పౌరులు కూడా క్రమశిక్షణతో మెలగటం ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి చెప్పారు. కరోనా వైరస్ సవాలును ఎదుర్కొవడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ప్రధానమంత్రి నాయకత్వ పటిమకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రధానితో చేయికలిపి ముందడుగు వేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రధానమంత్రికి ప్రజలతో భావోద్వేగపూరిత అనుబంధం ఉందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. అందువల్ల తరచూ ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కోవిడ్-19పై సానుకూల కథనాలను... ప్రత్యేకించి ఆ మహమ్మారి నుంచి విముక్తులైనవారి అనుభవాలను తన ప్రసంగాల్లో ప్రస్తావించాలని కోరారు. అలాగే లేనిపోని వదంతుల నివారణకు, వాస్తవాల నివేదనలో రిపోర్టర్లకు మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన డాక్టర్లతో 24గంటలూ పనిచేసే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వ మాధ్యమం ప్రసారభారతి ద్వారా రోజుకు రెండుసార్లు ప్రజలకు అధికారిక సమాచారం అందించాలని, దీన్ని ఇతర టీవీ చానెళ్లు కూడా వినియోగించుకనే వీలుందని సూచించారు. ఎంతో విలువైన సూచనలు-సలహాలు, సమాచారం ఇచ్చినందుకుగాను ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రతినిధులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరెన్సీ నోట్లద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చానళ్ల ప్రతినిధులకు ఆయన సూచించారు. దీంతో పాటు ప్రజలకు శాస్త్రీయ సమాచార నివేదన ద్వారా మూఢనమ్మకాల వ్యాప్తిని నిరోధించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం సేకరించే విలేకరులు ఆ విషయాలను ఎప్పటికప్పుడు చురుగ్గా తమతో పంచుకోవడంపై ఆ శాఖ కార్యదర్శి ఎలక్ట్రానిక్ మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం రూపొందించిన ప్రభుత్వ శ్రేణి ప్రభుత్వ వ్యవస్థ సంబంధిత వివరాలను ఆమె వివరించారు. దీంతో పాటు సవాళ్లను ఎదుర్కొవడంలో సామర్థ్య నిర్మాణం దిశగా నిరంతరం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. వైరస్ బాధితులకు పరీక్షల సంబంధిత వ్యూహంలోనూ ఇదే విధమైన ప్రతిస్పందన విధానాన్ని అనుసరిస్తున్నామని, పరీక్ష ఉపకరణాలకు ఆమోద ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామని భారత వైద్యపరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ చెప్పారు. కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రితోపాటు ఆ శాఖ కార్యదర్శిసహా ప్రముఖ ఎలక్ట్రానిక్ మాధ్యమ సంస్థల సంపాదకులు, ఇతర సీనియర్ ప్రతినిధులు ఈ ఇష్టాగోష్ఠి సమావేశంలో పాల్గొన్నారు. -
‘రాజకీయ’ సినిమాలు ప్రసారం చేయొద్దు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నమూనా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఒక రాజకీయ పార్టీకి.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ, అభ్యర్థికి అనుకూలంగా ఉండి, పోటీలో ఉన్న ప్రత్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపగల రాజకీయ కథాంశంతో ఉన్న సినిమాలు, జీవిత చరిత్రలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసా రం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు సీఈవో రజత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫైడ్ అంశాలతో కూడుకున్నవి అయినప్పటికీ ఒక అభ్యర్థికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పోటీలో సానుకూలంగా, తోడ్పాటుగా ఉన్న ఏ పోస్టర్, మరే ఇతర ప్రచార సామాగ్రినికానీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రదర్శించకూడదని కూడా చెప్పారు. -
భద్రాద్రిలో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి అరెస్ట్
భద్రాచలం: భద్రాచలంలో ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి అనిల్ రెడ్డిని పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాలు... పట్టణానికి చెందిన కాపుల ప్రవీణ్, గత నెల 15న విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందాడు. అతని మరణానికి అనిల్ రెడ్డి చర్యలే కారణమంటూ ప్రవీణ్ తమ్ముడు కాపుల ప్రకాష్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తన భార్య శ్రావణి.. కాపురానికి రావటం లేదని, ఇందుకు అనిల్ రెడ్డి కారణమని భావించిన కాపుల ప్రవీణ్, తీవ్ర మనోవేదనతో గత నెల 15న తన ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. అతడిని తమ్ముడు ప్రకాష్ వెంటనే పట్టణంలోని మోహన్‌రావు ఆసుపత్రిలో చేర్పించాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి అక్కడ మరింతగా క్షీణించి మృతిచెందాడు. చివరి క్షణాల్లో అతడి వాంగ్మూలాన్ని విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేశారు. మృత దేహాన్ని కుటుంబీకులు భద్రాచలం తీసుకొచ్చి ఖననం చేశారు. తన సోదరుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడి పోలీసులకు ప్రకాష్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ అంబర్ కిషోర్ ఝాను కూడా కలిసి వివరించారు. దీంతో ఇక్కడి పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ రెడ్డితోపాటు శ్రావణిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కేసు నమోదైన నేపథ్యంలో, పట్టణంలోని బస్టాండ్ ఎదురుగాగల సమాధుల స్థలంలో ఖననం చేసిన ప్రవీణ్ మృతదేహాన్ని శనివారం పట్టణ సీఐ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో బయటకు తీయించారు. ఏరియా ఆసుపత్రి వైద్యుడు విజయలక్ష్మణ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఆ తరువాత శవాన్ని తిరిగి పూడ్చివేశారు. ప్రవీణ్ ఆత్మహాత్యకు కారణమైన అనిల్ రెడ్డి, శ్రావణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. -
‘సాక్షి’కి మిషన్ కాకతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి బుధవారం అవార్డులను ప్రకటించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో ఇద్దరు ‘సాక్షి’ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ప్రింట్ మీడియా విభాగంలో సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కల్వల మల్లికార్జున్‌రెడ్డి రాసిన ‘పడావు భూముల్లో సిరుల పంట’అందోల్ పెద్ద చెరువు విజయగాథ కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు నెలవుగా ఉన్న అందోల్ పెద్ద చెరువు 30 ఏళ్లుగా పడావులో ఉన్న వైనాన్ని వివరిస్తూ.. రెండేళ్లుగా పుట్ల కొద్దీ ధాన్యంతో రైతులు పులకిస్తున్న తీరుకు ఈ కథనం అద్దం పట్టింది. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ‘సాక్షి’టీవీ ప్రతినిధి కొత్తకాపు విక్రమ్‌రెడ్డి ‘జలకళ’ పేరిట మిషన్ కాకతీయ ఫలితాలతో సాగు విస్తీర్ణం పెరిగిన తీరుపై ఇచ్చిన ప్రత్యేక కథనానికి రాష్ట్ర స్థాయిలో మూడో బహుమతి లభించింది. అవార్డుకు ఎంపికైన సాక్షి పాత్రికేయులు అవార్డుతో పాటు రూ.50 వేల నగదును త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవంలో అందుకోనున్నారు. -
ఎలక్ట్రానిక్ మీడియాతోనే సమస్య: మంత్రి
విజయవాడ: ఎలక్ట్రానిక్ మీడియాపై మంత్రి పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఛానెల్స్ రేటింగ్ కోసమే మంత్రి లోకేష్ వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నాయి.. మాట్లాడే సమయంలో తప్పులు దొర్లడం సహజమని సమర్ధించారు. ప్రింట్ మీడియా తో ఎటువంటి ఇబ్బంది లేదంటూనే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా తోనే సమస్య అంతా ఎదురవుతోందని చెప్పుకొచ్చారు. లోకేష్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెట్టి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. -
హృదయ వేదన
- ప్రాణాపాయ స్థితిలో సీనియర్ జర్నలిస్ట్ ఆర్‌ఎస్‌జీ కిశోర్ - హుద్రోగంతో ఆసుపత్రిలో పోరాటం - ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు పదిమంది హుద్రోగ చిన్నారుల దీనస్థితిని వెలుగులోకి తెచ్చి, వారి జీవితాల్లో వెలుగునింపిన గుండె లయ తప్పోతుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో పాతికేళ్లు శ్రమించిన ఓ హృదయం కాపాడమని వేడుకుంటోంది. మానవీయ కథనాలను ఎన్నో ప్రసారం చేసి, మావతావాదులను కదిలించిన ఆయననే చివరకు అపన్నహస్తం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. పాత్రికేయుడిగా పలు ఆసక్తి కథనాలను వెలుగులోకి తెచ్చిన నంద్యాల ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ ఆర్‌ఎస్‌జీ కిశోర్ తీవ్ర హుద్రోగంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ప్రాణాపాయంతో పోరాడుతున్నారు. - నంద్యాల మూడు తరాలుగా జర్నలిజంలో ఉంటూ సేవలందిస్తున్న కుటుంబానికి చెందిన ఆర్‌ఎస్‌జీ కిశోర్ నంద్యాలలో తొలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్. ప్రస్తుత గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిడ్డాతున్నారు. పాత్రికేయుడిగా పాతికేళ్లుగా పనిచేసినా బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెట్టుకోలేని పరిస్థితి. అరకొరగా వచ్చే జీవితంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. అతనికి తల్లిదండ్రులు పేరు ప్రతిష్టలను, నైతిక విలువలు, మానవత్వాన్ని పంచిపెట్టారేకాని, ఆస్తులను ఇవ్వలేదు. ఆయన తండ్రి ఆర్వీ శేషాద్రి కర్నూలులో సీనియర్ జర్నలిస్ట్. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు కోడి నరసింహం కుమార్తె శకుంతలమ్మ ఆయన తల్లి. ఆర్వీ శేషాద్రి పాతికేళ్లు జర్నలిస్ట్‌గా సేవలను అందించి, ఒక దినపత్రికలో చీఫ్ రిపోర్టర్ హోదాలో మృతి చెందారు. ఆయన స్ఫూర్తితో బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్) 1996 ఎలక్ట్రానిక్ మీడియా ప్రారంభమైన తొలి రోజుల్లోనే సిటీ కేబుల్ యాజమాన్యం సహకారంతో స్థానిక వార్తలకు శ్రీకారం చుట్టారు. పలు సంచలనాత్మక వార్తలను, మానవీయ కథనాలను ప్రసారం చేసి ఈ తరం ఎలక్ట్రానిక్ మీడియ జర్నలిస్ట్‌లకు స్ఫూర్తిగా నిలిచారు. 2010లో వ్యక్తిగత కారణాలతో సిటీ కేబుల్ నుంచి తప్పుకున్న ఆయన ప్రముఖ చానల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పవన్ కళ్యాణ్ లోకల్ చాన్‌ల్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. దాతల కోసం నిరీక్షణ మూడు దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో ఉంటున్న కిషోర్ వారం క్రితం ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి గుండె బలహీనమై, తక్కువగా కొట్టుకుంటుందని సూచించడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పేస్ మేకర్ ద్వారా గుండె ఆగకుండా ఆపారు. తర్వాత జరిపిన యాంజియోగ్రామ్ పరీక్షలో మూడు రక్తనాళాలు పాడై, బలహీనమయ్యాయి. బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్›సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకం ఆదుకునే అవకాశాలు ఉన్నా పరిధి తక్కువగా ఉంది. మెరుగైన వైద్యం అందించాంటే కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ. ఐదారు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్ నెం: 30728194177 భార్య: రంగా రేణుకదేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
మీడియా వాచ్డాగ్ పాత్రను వీడొద్దు
గవర్నర్ నరసింహన్ సిటీబ్యూరో: సమాజ శ్రేయస్సు కోసం పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వాచ్డాగ్ పాత్రను వీడొద్దని, మీడియా అప్రమత్తత సమాజానికి ఎంతో మేలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో హైదరాబాద్ నూతన ప్రెస్‌క్లబ్ కార్యవర్గం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేసింది. ఈ సందర్భంగా గవర్నర్ కార్యవర్గంతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మీడియా సంస్థలు సెన్సేషన్‌కు ప్రాధాన్యతనిస్తూ కనీస బాధ్యతలను మరిచిపోతున్నాయనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం లేదా ఇతర ఘటనలు చోటు చేసుకునే సందర్భాల్లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే విషయాన్ని పక్కనపెట్టి రకరకాల కోణాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్న తీరు ఆవేదన కలిగిస్తోందని, ఈ తీరులో మార్పు తీసుకువచ్చేందుకు యాజమాన్యాలు, మీడియా ఫోరాలు, ప్రెస్‌క్లబ్ లాంటి సంస్థలు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ మరిన్ని చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షులు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులు గాయత్రి, జనార్దన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు దుగ్గు రఘు, రమేష్ వైట్ల ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
టిఫిన్... అంటే తిట్లే మరి
బ్రేక్‌ఫాస్ట్ అంటే తిట్లు తినడమేనా అని తెలిసింది ఓ అధికారికి. తాజాగా ఏపీ మంత్రి ఒకరు 8 గంటలకే తన ఇంట్లో ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వారు 40 మందివరకూ వచ్చారు. వీళ్లందరికీ బ్రేక్‌ఫాస్ ఫాలోస్ అంటూ మెసేజ్ పెట్టారు. అయితే మినిస్టర్ ఓఎస్డీగారు హోటల్లో టిఫిన్ తెప్పిస్తే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు...పాపం మంత్రి విద్యా సంస్థల్లో ఉన్న ఓ మెస్ నుంచి తెప్పించాలనుకున్నారు. ఉదయం ఏడున్నరకల్లా తేవాల్సిన టిఫిన్ 9 దాటినా తేలేదు. దీంతో రిపోర్టర్లు, కెమె రామెన్లందరూ మంత్రిని తిట్టుకుంటూ వెళ్లిపోయారు. దీంతో మంత్రి... ఓఎస్డీనీ ఓ రేంజ్లో తిట్టిపోశారు. కనీసం టైముకు టిఫిన్ కూడా తెప్పించలేని అధికారులు ఎలా పనిచేస్తారయ్యా అంటూ తిట్లదండకం అందుకున్నారు. చివరకు రిపోర్టర్లు టిఫిన్ ఎందుకు రాలేదూ అని ఆరాతీస్తే...మంత్రిగారి కాలేజీ మెస్‌లో ఆర్డర్ ఇవ్వడం వల్లే లేటయిందని తెలిసింది. ఇదీ మంత్రి గారి బ్రేక్‌ఫాస్ట్ తిట్లు...! -
ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా?
పార్లమెంటు కమిటీ సూచన న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియానూ ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలంటూ.. పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది. ఓ వర్గం మీడియా అనైతిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందున ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావటం అవసరమని సూచించింది. దీంతో పాటు ప్రెస్ కౌన్సిల్ అధికారాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పలు మీడియా సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నందున కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కఠినచర్యలు తీసుకోలేకపోతోందని.. పెయిడ్ న్యూస్ ను నియంత్రించటంలోనూ స్పష్టమైన చట్టాలుండాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొం ది. కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ (ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుంది) అమలుకు ఓ చట్టబద్ధమైన సంస్థ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. -
ఆమె ఎవరు?
మత బోధకుడి కేసులో టాస్క్‌ఫోర్స్ ఆరా ట్రస్ట్ పేరిట వంచన వీడియోతో బెదిరించి రూ.కోట్లు వసూలు విజయవాడ : ట్రస్ట్ పెట్టామంటూ సహకరించమన్నారు. తమ సంస్థ ద్వారా అనాథ మహిళలకు ఆర్థిక, ఇతర సాయం చేస్తున్నట్టు నమ్మబలికారు. సరే ఏదైనా పార్టీ ఏర్పాటు చేయండంటూ మత బోధకుడు అన్నందుకు ‘సర్వం’ సమకూర్చి అదిరిపోయే పార్టీ ఏర్పాటు చేశారు. అంతే వీడియో చిత్రీకరించి కోట్లు దండుకున్నారు. పథకం రచన చేసింది ఎలక్ట్రానిక్ మీడియా మాజీ విలేకరులైతే.. అమలు చేసింది మాత్రం శాటిలైట్ ఛానల్ ప్రతిని ధులు అని పోలీసు వర్గాల సమాచారం. కొందరు న్యాయవాదులు సహా ఈ కుట్రలో అనేక మంది ఉన్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఇప్పుడు మత బోధకుడిని ట్రాప్ చేసేందుకు బ్లాక్‌మెయిలింగ్ ముఠా ఏర్పాటు చేసిన యువతి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు సహా 12మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక పాత్ర ఎవరిది? మత బోధకుడికి పార్టీ చేసినప్పుడు తీసుకొచ్చిన యువతి ఎవరనేది తెలిస్తే బ్లాక్‌మెయిలింగ్ ముఠాకు సంబంధించి మరికొన్ని వివరాలు వెలుగు చూస్తాయని టాస్క్‌ఫోర్స్ అధికారులు అంటున్నారు. వీరి ఆమెను ఏ విధంగా ఆ పార్టీలో ఉపయోగించుకున్నారు? పార్టీ ఏర్పాటు చేసిన వారిలో కీలకం ఎవరు? తదితర అంశాలు రాబట్టాల్సి ఉందంటున్నారు. ఒక్క మత బోధకుడితోనే సరిపెట్టారా లేక ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకున్నాయా? అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ముఠా చేసిన ఆగడాలన్నిం టిని వెలికి తీయాలంటూ పోలీసు కమిషనర్ ఆదేశించడంతో ముందుగా ఆ యువతిని పట్టుకోవాలనేది టాస్క్‌ఫోర్స్ ఆలోచన. ఆమె పట్టుబడితే అనేక కీలక విషయాలు వెలుగు చూస్తాయంటున్నారు. విరాళం కోసం కలిశారు... మత బోధకుడి ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న మాజీ విలేకరి, మరికొందరు కలిసి డొనేషన్ కోసం కలిశారు. పదే పదే వెళ్లి కలవడంతో విరాళం ఇచ్చేందుకు మత బోధకుడు అంగీకరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఏదైనా మంచి పార్టీ ఏర్పాటు చేయండి అంటూ ఆయన చెప్పగా వీరు సరేనన్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ యువతిని ఎరగా వేసి వీడియోలు చిత్రీకరించారు. ఆపై వాటిని చూపించి దశల వారీగా రూ.2 కోట్ల వరకు వసూలు చేశారు. మరో రూ.5 కోట్లు కావాలంటూ ఈ ముఠా ఒత్తిడి తేవడంతో విధిలేని స్థితిలో మత బోధకుడు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను ఆశ్రయించగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళకు బెదిరింపు నగరానికి చెందిన మరో మహిళను కూడా ముఠా సభ్యులు బెదిరించి రూ. లక్షలు గుంజినట్టు తెలిసింది. ఓ గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న ఆమె మత బోధకుడితో సన్నిహితంగా ఉండటం గుర్తించిన ముఠా సభ్యులు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగా రు. విధిలేని స్థితిలో ఆమె వీరికి రూ.16 లక్షల వరకు ముట్టచెప్పినట్టు తెలిసింది. ఒత్తిళ్లు ఎలక్ట్రానిక్ మీడియా ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ దందాకు పాల్పడిన కొందరు వ్యక్తుల పేర్లు వెలుగులోకి రావడంపై జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఆరోపణలు వచ్చిన వ్యక్తుల ప్రమే యం ఉంటే తనకు తెలియకుండా చర్యలు తీసుకోరాదంటూ సైడ్ చేయాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు సమాచారం. -
ఉత్కంఠ
* నేటితో ఎన్నికల ప్రచారానికి తెర * సాయంత్రం 5 గంటల వరకే అవకాశం * ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు * భారీ ర్యాలీలు, సభలతో బల ప్రదర్శన * అంతటా నేడు ఓటరు స్లిప్పుల పంపిణీ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. సభలు, సమావేశాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అన్ని రకాల ప్రచారాన్నీ నిలిపివేయనున్నారు. బల్క్ ఎస్సెమ్మెస్‌ల ప్రచారం కూడా చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. చివరి రోజును వివిధ పార్టీలు డివిజన్ స్థాయిలోనే భారీ సభలు, ర్యాలీలతో బల ప్రదర్శనకు వాడుకునే దిశగా ఏర్పాట్లు చేసుకున్నాయి. టీఆర్ఎస్ శనివారం రాత్రి పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన సభ విజయవంతం కావటంతో ఆ జోష్‌ను పోలింగ్ రోజు వరకు కొనసాగించే దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించింది. బీజేపీ, టీడీపీల తరఫున చివరి రోజు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు ఏపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు కూడా వివిధ సభల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ నేతలు వివిధ ప్రాంతాల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌లో పాల్గొనే ఓటర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని పోలింగ్ బూత్‌లు, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ఓటరు స్లిప్పులు అందజేయనున్నారు. ఇప్పటికే నగరంలో ఇంటింటికీవెళ్లి సుమారు 40 లక్షలు పంపిణీ చేశారు. వెబ్ నుంచి4.10 లక్షలు, యాప్ నుంచి 1.74 లక్షల స్లిప్పులు ఓటర్లకు చేరిపోయాయి. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాల్లో 25 వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. సుమారు 3,200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 52, 722 ఓటరు స్లిప్పుల డౌన్లోడ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి శనివారం మొత్తం 52,722 మంది ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసున్నారు. వీరిలో వెబ్సైట్ నుంచి 14,027 మంది డౌన్లోడ్ చేసుకోగా, మరో 38,695 మంది మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసున్నారు. -
30 కోట్ల మందికి ఈఎస్ఐ సేవల విస్తరణ
♦ ఈఎస్ఐ ఆసుపత్రుల్లో 8,300 పోస్టుల భర్తీకి చర్యలు: దత్తాత్రేయ ♦ ఈఎస్ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు త్వరలోనే త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి దత్తాత్రేయ చెప్పారు. త్రైపాక్షిక సమావేశంలో ఏకగ్రీవానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత, సంక్షేమ ప థకాలను అందజేస్తామని భరోసా ఇచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 30 కోట్ల మంది కార్మికులకు ఈఎస్ఐసీ సేవలను విస్తరించడం భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం బీమా వ్యక్తులు (ఇన్స్యూర్డ్ పర్సన్) 2 కోట్ల మంది, కుటుంబసభ్యులు 8 కోట్ల మంది ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో 5 కోట్ల మంది బీమా వ్యక్తులకు ఈఎస్ఐ సేవలు విస్తరించనున్నామన్నారు. ఢిల్లీలో మంగళవారం ఈఎస్ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని దత్తాత్రేయ ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలో లక్ష మంది ఆటోరిక్షావాలాలకు ప్రయోగాత్మకంగా ఈఎస్ఐని అమలు చేయనున్నామన్నారు. సనత్‌నగర్ వైద్యకళాశాలను త్వరలో ప్రారంభించనున్నామని, ఈ వైద్యకళాశాలలో 40 శాతం సీట్లను కార్మికుల పిల్లలకు కేటాయించనున్నామని దత్తాత్రేయ చెప్పారు. దేశంలోని 650 జిల్లాల్లో సేవలందిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టుల్లో 8,300 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యకళాశాలలో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు అవకాశం లేకపోవడంపై ప్రశ్నించగా, అఖిలభారత ప్రిమెడికల్ పరీక్షను గుర్తిస్తున్నట్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. నిధులను ఓట్లతో ముడిపెట్టొద్దు నిధులను ఓట్లతో ముడిపెట్టవద్దని టీఆర్ఎస్ ఎంపీ కవితకు మంత్రి దత్తాత్రేయ హితబోధ చేశారు. ‘మంత్రి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు హైదరాబాద్‌కు 20 వేల కోట్లు తెస్తే, బీజేపీకి ఓటు వేస్తామని’ టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి దత్తాత్రేయ స్పందించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కారీ రూ. 41 వేల కోట్లు కేటాయించారని, డబుల్ బెడ్రూం పథకానికి కేంద్రం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల రుణం ఇప్పించిందని, గృహనిర్మాణ పథకం కింద 48 వేల ఇళ్లను మంజూరు చేసిందని ఉదహరించారు. రాజకీయాలు ప్రజల సంక్షేమం కోసమే తప్ప, ఓట్ల కోసమే కాదని కవితకు చురక వేశారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభానికి ఆహ్వానిస్తే ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని చెప్పారు. -
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం తుది ఫలితాలు విడుదల
హైదరాబాద్, సాక్షి: ప్రింట్, వెబ్, ఎలక్ట్రానిక్ మీడియాలో పీజీ డిప్లొమా, తదనంతర ఉద్యోగాల కోసం సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం నిర్వహించిన బృంద చర్చ, ఇంటర్వ్యూలకు 192 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 80 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్లతో సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుంచి ఆఫర్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిప్లొమా కోర్సు ప్రారంభ తేదీ వివరాలు ఆఫర్ లెటర్లో ఉంటాయి. ఎంపికైన వారి హాల్‌టికెట్ నంబర్లు ... 211004 211005 211017 211020 211024 211025 211028 211100 221004 221027 221040 231006 231046 231048 231064 231074 231077 231079 231080 231192 231193 231195 231217 231219 231221 231230 231255 231256 231259 231267 231268 231271 231278 231289 231294 231297 231298 231299 231303 231315 231320 231323 231338 231402 241001 241033 251008 251009 251048 251063 251065 261014 271069 271074 271077 271097 281006 281030 281035 301001 301005 301017 301025 301031 301037 301044 301057 321005 321006 361002 371012 381014 381016 381025 381038 381055 381074 411024 411028 411077 -
సీపీ చెబితే నేర్చుకునే పరిస్థితిలో మీడియా లేదు
ఏపీయూడబ్ల్యూజే గాంధీనగర్ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి. వెంకటేశ్వరరావు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు కమిషనర్ చెబితే నేర్చుకునే స్థితిలో మీడియా వారు లేరని, ఆయన చేసిన ప్రకటనలోని కథనమే నిజమని భావించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. కళ్యాణ్ కేసు విషయంలో ఎవరితోనైనా దర్యాప్తు చేయించేందుకు అభ్యం తరం లేదని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు జర్నలిస్టులకు సత్యాన్వేషణ చేసే తీరిక, సామర్థ్యం, తపన, ఆలోచన లేదని చెప్పడంపై వారు అభ్యంతరం తెలిపారు. పౌరుల శాంతియుత జీవనంలో మీడియా పోషిస్తున్న ప్రధాన పాత్ర పోలీసు కమిషనర్‌కు తెలియదా? అని వారు ప్రశ్నిం చారు. మీడియాలో వచ్చే కథనాల్లోని వాస్తవాలు జీర్ణించుకోవడం అందరికీ శ్రేయస్కరమని, అవి తప్పనే రీతిలో ప్రజలకు తప్పుడు సంకేతాలు మీద్వారా అందించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిం చారు. జరిగిన ఘటనలపై అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే వార్తలు ప్రచురితం, ప్రసారం అవుతాయని సీపీలాంటి పెద్దలకు తెలియంది కాదని వారు హితవు పలికారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియాను చులకన భావంతో చూడవద్దని కోరారు. జర్నలిస్టులను సమాజ ద్రోహులుగా చెప్పాలనుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని వారు సూచించారు. ప్రకటన జారీ చేసిన వారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, కృష్ణా అర్బన్ అధ్యక్షుడు జి.రామారావు, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె.జయరాజ్, బొంతా విలియం పాల్ ఉన్నారు. -
ఉగ్రభయం
ఉగ్రవాదుల కేంద్రంగా బెంగళూరు ఇక్కడి నుంచే జిహాదీల నియామకం బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం నగరానికి చేరిన కేంద్ర నిఘా వర్గాలు పరిశీలిస్తున్నామన్న కమిషనర్ ఎంఎన్ రెడ్డి బెంగళూరు : ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరం ఉగ్రవాదుల కేంద్రంగా తయారవుతోందని బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసిన కథనం కలకలం రేపింది. ఈ విషయంపై రెండు మూడు రోజుల క్రితమే సమాచారం అందుకున్న కేంద్ర నిఘా వ్యవస్థకు చెందిన అధికారులు బెంగళూరుకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి ధ్రువీకరించారు. వివరాలు... ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐఎస్ఐఎస్)లో యువకులను సభ్యులుగా చేర్పించడం బెంగళూరు కేంద్రంగా సాగుతోందని బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ ప్రసారం చేసింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలో బోర్డు మెంబర్‌గా ఉన్న మహ్ది అన్న వ్యక్తి ‘షమి విట్నెస్’ అన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వర్గానికి చెందిన యువకులను తన ట్వీట్లోని వ్యాఖ్యల ద్వారా ఆకర్షించేవాడని తెలిపింది. ఆయన అకౌంట్‌కు 17,700 మంది ఫాలోయర్లు ఉన్నారని పేర్కొంది. ఇందులో ఎక్కువ మంది విదేశీయులేనని తెలిపింది. ఇతనికి ‘ఐఎస్ఐఎస్’ తోపాటు ఇతర ప్రభావ ఉగ్రవాద సంస్థలతో కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని మహ్దితో స్వయంగా మాట్లాడి నిర్ధారణకు వచ్చామని ఈ మీడియా పేర్కొంది. ఇంతకంటే ఎక్కువగా అతని వివరాలు చెబితే అతని ప్రాణాలకు ముప్పు వస్తుందని తెలిపింది. కాగా, తనకు కూడా ఐఎస్ఐఎస్ సంస్థలో చేరాలని ఉందని, అయితే సంసార బాధ్యతల వల్ల ఆ పనిచేయలేకపోతున్నానని మహ్ది తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా బ్రిటన్‌లో ఉన్న చాలా మంది జిహాదీలు తనను నిత్యం ఏదో ఒక రూపంలో (మెయిల్, ఫోన్, ట్విట్టర్) పలకరిస్తుంటారని, తమ మధ్య హాస్యోక్తులు కూడా ఉంటాయని ఆయన అకౌంట్లో పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ సభ్యులు విదేశీయుల శిరస్సులను ఖండించడం సమర్థిస్తాను అని మహ్ది పేర్కొన్నట్లు తెలిపింది. ఇలా అనేక విషయాలను సదరు వార్తా సంస్థ ప్రచారం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర నిఘా బృందం బెంగళూరుకు చేరుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంపై నగర కమిషనర్ ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘బ్రిటన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ వార్తా సంస్థ ప్రచారం చేసిన వార్తాకథనంపై దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర నిఘా వర్గంతో పాటు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు.’ అని పేర్కొన్నారు. -
కదం తొక్కిన కలం యోధులు అనంతపురం
క్రైం : పింఛన్ల అక్రమ తొలగింపు వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ‘సాక్షి' స్టాఫ్ ఫొటోగ్రాఫర్ వీరేష్, విలేకరి రమణారెడ్డిలపై టీడీపీ కార్యకర్తల దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు గళమెత్తారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు సాక్షి, అనంతపురం : జర్నలిస్టులపై దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. శింగనమలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, ప్రజాసంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ రామారావుకు వినతి పత్రం అందజేశారు. గుంతకల్లులోని ప్రెస్‌క్లబ్ నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రాస్తారోకో చేశారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ అర్బన్ సీఐ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. పెద్దవడుగూరులో ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కళ్యాణదుర్గంలో ఏపీయూడబ్ల్యూజే మండల శాఖ అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో రిపోర్టర్లు, యువరాజ్యం, నెపోలియన్ ప్రజాసంఘాల నాయకులు ర్యాలీ చేశారు. సీఐ వంశీధర్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. రాయదుర్గంలో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఆర్అండ్బీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తర్వాత డిప్యూటీ తహశీల్దార్ బాలకిషన్‌కు వినతిపత్రం అందజేశారు. రాప్తాడులో వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి బస్టాండ్ కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం అక్కడ రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ధర్మవరంలో కాలేజీ సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత పట్టణ సీఐ ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు. పుట్టపర్తిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి పుల్లయ్య ఆధ్వర్యంలో రిపోర్టర్లు, వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్థానిక సత్యమ్మగుడి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీసుస్టేషన్లో సీఐ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీకి చెందిన మునిసిపల్ కౌన్సిలర్లు రెండుగంటల పాటు ఆందోళన చేశారు. పెనుకొండలో జర్నలిస్టులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ బ్రహ్మయ్యకు వినతిపత్రం సమర్పించారు. గుత్తి పట్టణంలోని గాంధీసర్కిల్లో రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి..సీఐ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. -
ప్రచార వ్యూహకర్త.. మీడియా ప్లానర్
ఏదైనా ఉత్పత్తి గురించి వినియోగదారులకు తెలియాలంటే ఏకైక మార్గం.. ప్రచారం. సరైన పబ్లిసిటీ లేకపోతే ఎంతగొప్ప వస్తువుకైనా మార్కెట్లో ఆదరణ లభించదు. తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి, తద్వారా లాభాలు ఆర్జించడానికి కంపెనీలు ప్రచారాన్నే నమ్ముకుంటాయి. అయితే, ఏ వస్తువు వినియోగదారులు ఎక్కడున్నారు? టార్గెట్ గ్రూప్‌ను ఆకర్షించడం ఎలా? ఏయే మాధ్యమాల ద్వారా వారికి చేరువ కావాలి? అనే విషయాలు అందరికీ తెలియవు. తమ పరిశోధనతో వీటిని తెలియజేసి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసే నిపుణులే.. మీడియా ప్లానర్లు. ప్రచార సంస్థ(అడ్వర్టైజింగ్ ఏజెన్సీ)కు వెన్నెముకలాంటివారు మీడియా ప్లానర్లు. ప్రపంచవ్యాప్తంగా వస్తూత్పత్తుల మార్కెటింగ్ విస్తరిస్తుండడంతో వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్లానర్లకు భారీ వేతనాలు పబ్లిసిటీకి ఒకప్పుడు పత్రికలు, టీవీలు, రేడియోలు, హోర్డింగ్‌లే ప్రధాన మార్గం. ఆధునిక కాలంలో ఇది కొత్తపుంతలు తొక్కుతోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్లలో ఉత్పత్తుల ప్రచారం సాగుతోంది. ఏ వస్తువును ఏ మాధ్యమం ద్వారా పబ్లిసిటీ చేస్తే ప్రజలకు చేరుతుందో మీడియా ప్లానర్ పసిగట్టాలి. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం జరిగేలా చూడాలి. మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తూ ప్రచారం ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి వ్యూహాలు రూపొందించాలి. సృజనాత్మకతతో కూడిన పబ్లిసిటీతో వినియోగదారుల ఆలోచనలను మార్చగలిగే శక్తి మీడియా ప్లానర్‌కు ఉండాలి. వీరికి ప్రస్తుతం మార్కెటింగ్ కంపెనీలు, మీడియా ఏజెన్సీలు, టీవీ ఛానళ్లు, వెబ్సైట్లు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో వేతనాలు భారీగానే ఉంటాయి. వృత్తిలో తగిన నైపుణ్యం, అనుభవం సంపాదిస్తే నెలకు రూ.లక్షల్లోనే అందుకోవచ్చు. సొంతంగా కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ అధిక ఆదాయం ఆర్జించొచ్చు. కావాల్సిన స్కిల్స్: మీడియా ప్లానింగ్‌లో ఒత్తిళ్లు, సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. పనిలో డెడ్లైన్లు ఉంటాయి కాబట్టి వాటిని చేరుకోవడానికి అధికంగా శ్రమించాలి. ప్లానర్లకు ఆర్గనైజేషనల్, ఇంటర్‌పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు అవసరం. రిపోర్ట్లు, ప్రజంటేషన్లను రూపొందించడంలో నైపుణ్యం ఉండాలి. ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానంపై అవగాహన ముఖ్యం. అర్హతలు: మీడియా ప్లానింగ్ స్పెషలైజేషన్‌గా అడ్వర్టైజింగ్ కోర్సులు పూర్తిచేసినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతో ఈ కోర్సుల్లో చేరొచ్చు. మార్కెటింగ్ స్పెషలైజేషన్‌గా ఎంబీఏ చదివినవారు కూడా మీడియా ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. వేతనాలు: మీడియా ట్రైనీకి ప్రారంభంలో రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభిస్తుంది. మీడియా ప్లానర్‌గా ఈ రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం సంపాదిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక ప్యాకేజీ అందుతుంది. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెరుగుతుంది. సూపర్ సీనియర్/టాప్ మేనేజ్మెంట్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటి అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iimc.nic.in ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ -అహ్మదాబాద్ వెబ్సైట్: www.mica.ac.in సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ వెబ్సైట్: ఠీఠీఠీ.టజీఝఛి.్ఛఛీఠ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వర్టైజింగ్-ఢిల్లీ వెబ్సైట్: www.niaindia.org జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ వెబ్సైట్: www.xaviercomm.org నార్సీమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వెబ్సైట్: www.nmims.edu కంపెనీకి, మీడియాకు మధ్య వారధి! ‘‘సంస్థలు చేపట్టే నూతన కార్యక్రమాల సమాచారం, కంపెనీ సాధించిన విజయాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చేరవేస్తూ మీడియా ప్లానర్స్ వారధిలా పనిచేస్తున్నారు. సంస్థల సేవలు, ఉత్పత్తుల పబ్లిసిటీలోనూ వీరిదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో మీడియా ప్లానర్స్‌గా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీ చైర్మన్, ఎండీ, సీఈఓ, బోర్డు సభ్యులతో నిత్యం సంప్రదిస్తూ కంపెనీ తరఫున మీడియాకు సమాచారాన్ని అందిస్తారు. సంస్థకు సంబంధించిన వార్తల ప్రచురణను పర్యవేక్షిస్తారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు మీడియా మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా మీడియా ప్లానింగ్‌ను అభ్యసించొచ్చు. మాస్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, ఎంబీఏ కోర్సులు అభ్యసించిన వారు కూడా మీడియా ప్లానర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు. మీడియా ప్లానర్‌గా రాణించాలంటే మార్కెట్ అధ్యయనం, బిజినెస్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. మీడియా ప్లానర్‌కు మంచి నెట్వర్కింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. అలాగే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేర్పు ఉండాలి’’ - ప్రమోద్ మిట్టా, మేనేజర్, మీడియా రిలేషన్స్, ఎయిర్ కోస్టా కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీపరీక్షల్లో ‘విద్యుత్’ నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? - పి.నాగరాజు, అశోక్‌నగర్ భౌతిక శాస్త్రంలో ‘విద్యుత్’ పాఠ్యాంశం చాలా విస్తృతమైంది. దీన్ని ప్రణాళికా బద్ధంగా చదవాలి. ముఖ్యంగా విద్యుత్ పొటెన్షియల్, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలపై సమస్యలను సాధన చేయాలి. కానిస్టేబుల్ పరీక్షల కోసం 6 నుంచి పదోతరగతి వరకు భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఓమ్ నియమం, నిరోధ నియమాలు, విద్యుదయస్కాంత ఫలితాలు, వాటి అనువర్తనాలు, విద్యుదయస్కాంత ప్రేరణ అనువర్తనాలు ప్రధానమైనవి. ఓమ్ నియమం, లెంజ్ నియమం, ఫ్లెమింగ్ కుడిచేతి నిబంధన, ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన, ఫారడే విద్యుద్విశ్లేషణ తదితర నియమాలను నేర్చుకోవాలి. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ వంటి వాటి నిర్మాణం, అవి పనిచేసే విధానంలోని సూత్రాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి. రాశుల ప్రమాణాలను నేర్చుకోవాలి. ఉదా: కరెంటు- ఆంపియర్; పొటెన్షియల్ భేదం- వోల్ట్; నిరోధం- ఓమ్; విశిష్ట నిరోధం- ఓమ్.మీటర్; విద్యుత్ సామర్థ్యం- వాట్; విద్యుత్ రసాయన తుల్యాంకం-గ్రామ్ / కూలుంబ్. ఇన్పుట్స్: ఎ.నాగరాజ శేఖర్, సీనియర్ ఫ్యాకల్టీ -
బ్యాంకు ఖాతాలులేని కుటుంబాలను గుర్తించండి
చిత్తూరు (సెంట్రల్): మండల స్థాయిలో ఈ నెల 15వ తేదీ నుంచి జేఎంఎల్‌బీసీ సమావేశాలను నిర్వహించి బ్యాంకు ఖాతాలు ప్రారంభించని కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం ఆయన తన కార్యాలయంలోని సమావేశమందిరంలో నిర్వహించిన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. మిషన్మోడ్ కింద సమగ్ర ఆర్థిక చేకూర్పును అమలు చేసే దిశగా బ్యాంకర్లు గ్రామస్థాయిలో క్యాంపులు పెట్టి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించేందుకు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలన్నారు. బ్రాంచ్ మేనేజర్లు మండలి స్థాయిలో ఎంపీడీఓల సమన్వయంతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 15వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కొత్త బ్యాంకు బ్రాంచీలను ఏర్పాటుచేసి ఆర్థిక చేకూర్పుకు సహకరించాలన్నారు. ప్రభుత్వపథకాల్లో భాగంగా 2014-15 సంవత్సరానికి మెప్మా ద్వారా రూ.125 కోట్లు, రాజీవ్ యువశక్తి కింద రూ.6 కోట్లు ఆర్థిక చేకూర్పు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ 164లో రైతు కుటుంబానికి పంట రుణాలు, వ్యవసాయానికి బంగారు రుణాలను రూ.1.5లక్షల వరకు, డ్వాక్రా గ్రూపులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులు వేరుశెనగ పంటకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేలా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ చంద్రారెడ్డి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సుధాకరరావు, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ కిషన్‌ప్రసాద్, ఆర్బీఐ ఏజీఎం కులకర్ని, ఎస్బీఐ ఏజీఎం బ్రహ్మం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి
కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజే వినతి సుబేదారి : జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని ఇండియన్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ) అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నాయకులు బుధవారం కలెక్టర్ జి.కిషన్‌ను కోరారు. బుధవారం కలెక్టర్ కిషన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిన్నా శివకుమార్ మాట్లాడారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారని అన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో కూడా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారన్నారు. జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో సుమారుగా 800 మంది జర్నలిస్టుల పిల్లలు ఇందుకు అర్హులని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరికి ఉచిత విద్యను అందజేయాలని వారు కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ జి. కిషన్ స్పందిస్తూ రంగారెడ్డి జిల్లాలో జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పరిశీలించి చర్యలు తీసుకుంటానని, జిల్లా విద్యాశాఖాధికారికి ఈ విషయమై ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఐజేయూ నాయకుడు దాసరి కృష్ణారెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి విఠల్, తోట సుధాకర్, జిల్లా నాయకులు కంకణాల సంతోష్, సదాశివుడు, ఎండీ.వాజిద్, గోకారపు శ్యాం, బి.సునిల్‌రెడ్డి, నవీన్, ప్రదీప్ పాల్గొన్నారు. -
చివరి వరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతా
గాలి వార్తలు నమ్మకండి జగనన్న బాటలో నడుస్తా నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతానని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురా లు, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత ఆదివారం తొలిసారిగా పుత్తూరు పట్టణంలోని పీఆర్ అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడారు. ఇటీవల కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో తాను పార్టీ వీడనున్నట్టు గాలి వార్తలు వచ్చాయన్నారు. పదవుల కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నా రు. వైఎస్సార్ సీపీలో స్థానం కల్పించిన జగన్మోహన్రెడ్డితోనే కడవరకు ఉం టానని తెలిపారు. నగరి అసెంబ్లీ స్థానం నుంచి తనను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీకి చెందిన సీనియర్ నేత లు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు చెప్పారు. తన గెలుపు కోసం కృషి చేసిన వైఎస్సా ర్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అభివృద్ధిపరమైన అంశాలకు సంబంధించిన నిధులు ఆపడానికి వీలుండదని, ఆ విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావడంలో వెనుకాడే ప్రసక్తే లేదని ఆమె పేర్కొన్నారు. వడమాలపేట ఎంపీపీగా మురళీధర్‌రెడ్డి వడమాలపేట ఎంపీపీగా వైఎస్సార్ సీ పీ నుంచి పత్తి పుత్తూరు ఎంపీటీసీగా గెలుపొందిన ఎం.మురళీధర్‌రెడ్డి పేరు ను ఎమ్మెల్యే ఆర్కే.రోజా ప్రకటించారు. త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీకి చెం దిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఒక్కటిగా ఉన్నారన్నారు. పార్టీలు మారే పరి స్థితి లేదన్నారు. ఆరుగురు ఎంపీటీసీలు ఇక్కడే ఉన్నారంటూ మీడియా ముందు వారిని పరిచయం చేశారు. వార్తా కథనాలు రాసేటపుడు తన వివరణ తీసుకోవాలని, కనీసం ఫోన్ ద్వారానైనా సంప్రదించాలని సూచించారు. సమావేశంలో వడమాలపేట మండలానికి చెందిన వై ఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు లలి త (అప్పలాయగుంట), శకుంతల (పూ డి), ఎం.జ్యోతి(ఎస్బీఆర్ పురం), రంగనాథం(శీతారామపురం), సుబ్బలక్ష్ము మ్మ(ఎఎంపురం), మురళీధర్‌రెడ్డి (పత్తిపుత్తూరు)తో పాటు జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, సింగిల్‌విండో మాజీ అ ధ్యక్షుడు చెంగల్రాజు, ఏఎంపురం స ర్పంచ్ వెంకటరత్నం, నాయకులు చం ద్రశేఖర్రాజు, తులసీరామిరెడ్డి, సుధీర్‌రెడ్డి, ఉమాపతి, మహేష్‌రెడ్డి, సుబ్రమణ్యంరాజు, పుత్తూరు నాయకులు ఏలుమలై (అమ్ములు), ఎన్ఏ.గణేష్, జనార్థన్‌యాదవ్, లారీ మోహన్ పాల్గొన్నారు. -
నగరిలో వికసించిన రోజా
ముద్దుకృష్ణమకు పరాభవం టీడీపీపై వైఎస్సార్ సీపీ గెలుపు 858 ఓట్ల మెజారిటీతో విజయకేతనం కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు పుత్తూరు, న్యూస్‌లైన్: ఎక్కడైతే పొగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను నిజం చేస్తూ నగరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆర్కే.రోజా విజయం సాధించారు. 2004లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ రెండోసారి ఈ స్థానాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ మాజీ మంత్రులు రెడ్డివారి చెంగారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి రాజకీయ ఉద్దండులను సైతం వెనక్కు నెట్టి 858 ఓట్ల మెజారిటీతో విజ యం సాధించారు. 35 ఏళ్ల రాజకీయ అనుభవమున్న గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ముచ్చెమటలు పట్టిం చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి మాధవీలత రోజా గెలుపును ప్రకటిస్తూ తన చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారంను అందజేశారు. రోజా గెలుపు ఖాయమని తెలుసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా ఆమెతో మాట్లాడేందుకు వెళ్లినా పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. రోజా విజయాన్ని అడ్డుకోలేకపోయిన చెంగారెడ్డి ఓటమి తప్పదని తెలిసినా వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి తొలిసారిగా తన కుమార్తె సత్యసర్వూపఇందిరను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దింపారు. కుమార్తె కోసం వైఎస్సార్ సీపీ నగరి టికెట్ కు చెంగారెడ్డి ప్రయత్నించారు. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలూ రాకపోవడంతో టీడీపీ టికెట్ కోసం యత్నించారు. అక్కడా చేదు అనుభవం ఎదురుకావడంతో గతిలేక కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేయించి 5,149 ఓట్లను చీల్చగలిగారు. తద్వారా డిపాజిట్ ధరావత్తును కోల్పోవడమే తప్పా రోజా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. -
రాసలీలల కేసులో దేవిశ్రీకి బెయిల్
ఆమె తన రెండవ భార్యగా పేర్కొన్న స్వామీజీ తన అనుమతితోనే రెండవ పెళ్లి చేసుకున్నారన్న తొలి భార్య బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలల కేసులో అరెస్టైన దేవిశ్రీ గురూజీ కి బెయిల్ మంజూరైంది. బుధవారం ఉదయం స్థానిక ఆరవ ఏసీఎంఎం న్యాయస్థానంలో దేవిశ్రీని పోలీసులు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తమకు గురూజీ నుంచి ప్రాణహాని ఉందంటూ ఆయన కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ ఫిర్యాదు మేరకు హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేసిన వైనం విదితమే. అంతకు ముందే రాసలీలలపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో దేవిశ్రీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులోని ధర్మపురిలో తలదాచుకున్న దేవిశ్రీని మంగళవారం రాత్రి హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు అదుపులోకి తీసుకుని బెంగళూరుకు పిలుచుకొచ్చారు. కాగా, బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే దేవిశ్రీ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను రాసలీలలు సాగించినట్లు ప్రసారం అయిన క్లిప్పింగ్‌లలో ఉన్న మహిళ తన రెండవ భార్య అని పేర్కొన్నారు. మొదటి భార్య అనుమతితోనే ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇందుకు ఎలాంటి సాక్ష్యాలు ఉండవని తెలిపారు. ఏనాడు తాను సన్యాసినని చెప్పుకోలేదని స్పష్టం చేశారు. గత ఆగస్టు 15 నుంచి తనను బ్లాక్మెయిల్ చేశారని, తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి రూ. 2.50 లక్షలు డ్రైవర్ వసంత్‌కు ఇచ్చి, మరో ప్రాంతానికి వెళ్లి సుఖంగా జీవించాలని సూచించానని అన్నారు. గత ఏడాది మే నుంచి తన రెండవ భార్య దూరమైందని, ప్రస్తుతం ఆమె ఎక్కడుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తన అనుమతితోనే తన భర్త రెండవ పెళ్లి చేసుకున్నారని దేవిశ్రీ భార్య కౌసల్య స్పష్టం చేశారు. దేవిశ్రీతో కలిసి టీవీ చానెల్లో ఆమె మాట్లాడారు. వివాహమైన తర్వాత ఆమె తనతో పాటు ఒకే ఇంటిలోనే కలిసి ఉందని, వేరు కాపురానికి అంగీకరించలేదని చెప్పారు. -
ఓటర్లకు యజమాని సెలవివ్వకపోతే జైలుశిక్ష: భన్వర్
హైదరాబాద్: ఏప్రిల్ 30 తేదిన జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ష్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి(30 తేది) సాయంత్రం 6.గంలవరకూ ఆంక్షలు విధించినట్టు ఆయన తెలిపారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌పై పూర్తిగా నిషేధమని, ఈ 48 గంటలపాటు ఒపీనియన్ పోల్స్ ఇవ్వరాదని భన్వర్‌లాల్ హెచ్చరించారు. పోలింగ్ రోజున పూర్తిగా సెలవు ప్రకటించామని భన్వర్‌లాల్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, దుకాణాలన్నింటికీ సెలవని, సెలవు ఇవ్వకుంటే కేసులు పెడతామని భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఓటర్లకు సెలవు ఇవ్వకపోతే యజమానికి ఏడాది జైలుశిక్ష విధిస్తామని భన్వర్‌లాల్ తెలిపారు. -
నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 28వ తేదీ సోమవారం 6 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన జిల్లా కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రచారం చేసేందుకు వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లిపోవాలన్నారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థుల ఇంటింటి ప్రచారాన్ని కూడా నిషేధించామన్నారు. 28వ తేదీ ప్రచారం ముగిసిన అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాజకీయ ప్రకటనలను నిషేధిస్తున్నామన్నారు. అలాగే బల్క్ ఎస్ఎంఎస్లను కూడా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సామర్థ్యం, తాగునీరు, ఎండ నుంచి ఉపశమనం పొందేలా టెంట్లు లేదా ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. 28, 29 తేదీలు అత్యంత కీలకమైనందున ఎంసీసీ, ఎన్ఎస్టీ బృందాలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ స్మితా సబర్వాల్, జేసీ శరత్, డీఆర్ఓ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఓటు వేస్తే నిత్యావసర వస్తువుల కొనుగోలుపై రాయితీ కలెక్టరేట్: ఈనెల 30వ తేదీన ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు ప్రతి వంద రూపాయల నిత్యావసర వస్తువుల కొనుగోలుపై మూడు రూపాయల రాయితీ అందిస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 95 శాతం ఓటింగ్‌ను వినియోగించుకొనేందుకు జిల్లా పాలనా యంత్రాంగం చేపట్టిన పలు కార్యక్రమాలు జిల్లాలో ఫుడ్ గ్రెయిన్స్ హోల్‌సేల్ దుకాణ దారులు పూర్తి స్థాయిలో మద్దతు పలికి మూడు శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. జిల్లాలో 501 హోల్‌సేల్ దుకాణాలు ఈ రాయితీ కల్పిస్తాయని తెలిపారు. ఈనెల 30న మే 1,2 తేదీల్లో వంద రూపాయల నుంచి మూడు వేల రూపాయల వస్తువులు కొనుగోలు చేసిన వారికి మూడు శాతం రాయితీ అందజేస్తారని ఆమె చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు 30వ తేదీన జిల్లాలోని 151 పెట్రోల్ బంక్‌లలో లీటరుపై ఒక రూపాయి రాయితీ కల్పించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. గరిష్టంగా మూడు లీటర్ల వరకు ఈ రాయితీ అందిస్తారని అన్నారు. జిల్లాలోని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. -
ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు అందించాలనే మీడియా సెంటర్‌ను ప్రారంభించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హాల్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెంటర్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని జిల్లా సమాచార శాఖ ద్వారాప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందిస్తామన్నారు. అభ్యర్థుల ఖర్చును నియంత్రించేందుకు ఎన్నికల సంఘం ఎంసిఎంసి కమిటీనిఏర్పాటు చేసిందన్నారు. టీవీ ఛానళ్ల ద్వారా ప్రచారం నిర్వహించదలచినపుడు అభ్యర్థులు ముందస్తుగా ఎంసిఎంసికి దరఖాస్తును ప్రసార సీడీని జతపరచి అందజేయాలన్నారు. ప్రసారాలలో అభ్యంతరాలు ఉంటే కమిటీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. దినపత్రికలలో వచ్చిన వార్తలను కమిటీ పరిశీలించి పెయిడ్ న్యూస్‌గా పరిగణిస్తుందన్నారు. ఎన్నికల నియమావళి అమలుకు జిల్లా, మండలస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎంసి ఎంసికి సంయుక్త కలెక్టర్ చైర్మన్ వ్యవహరిస్తారని, నోడల్ అధికారిగా డీపీఆర్వో, కన్వీనర్‌గా పులిచింతల ప్రత్యేక ఉప కలెక్టర్ డి. వేణుగోపాల్, సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ ప్రసారశాఖ అధికారి హరిప్రసాద్, దూరదర్శన్ ప్రతినిధి ఎంపి.రవి శంకర్, హిందూ స్టాఫ్ రిపోర్టర్ శామ్యూల్జోనాధన్, ఫ్రీ లాన్సర్ సిహెచ్.రామ్‌గోపాలశాస్త్రి ఉంటారన్నారు. కార్యక్రమంలో జెసి వివేక్‌యాదవ్, డిఆర్వో కె.నాగబాబు, పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారులకు శిక్షణ బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆర్వోలు, ప్రత్యేక అధికార్లు, ఎంపీడీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో పాత్రికేయులకు ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రెస్పాస్లు జారీచేయాలని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేర్లున్న ఓటర్లు ఒక చోట మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పీవో, ఎపివోలకు విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెసి వివేక్‌యాదవ్, జెడ్పీ సీఈవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఈనెల 9, 16 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా స్వీకరించిన ఫారం-6 దరఖాస్తుల పరిశీలనను ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ సురేశ్‌కుమార్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను, తహశీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. లక్షా 25వేల ఫారం-6 దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకూ 90వేల దరఖాస్తులను అప్డేట్ చేశామన్నారు. త్వరగా బూత్ లెవల్ అధికారులతో విచారణ పూర్తిచేయించి వివరాలు అప్డేట్ చేయాలన్నారు. పల్నాడు ప్రాంతంలో డబ్బు, మద్యం అక్రమంగా తరలుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి వివేక్‌యాదవ్, డిఆర్వో కె.నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని పోలింగ్ ఆఫీసర్లకు బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు. భన్వర్‌లాల్ వీడియో వీడియో కాన్ఫరెన్స్ ఓటు హక్కుపై ఓటర్లలో సంపూర్ణ అవగాహన కలిగించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన గుంటూరు కలె క్టరేట్లోని అధికారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కలిగించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ వివేక్‌యాదవ్, పాఠశాలవిద్యా ఆర్జేడీ పి.పార్వతి, ఉన్నతవిద్య ఆర్జేడీ ఎం.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే జైలుకే!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచారం కోసం ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల ద్వారా ప్రచారాన్ని, ప్రకటనలు ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రచారం చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు జిల్లా మానటరిం గ్ సెల్ అండ్ మోనిటరింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకో వాలన్నా రు. రిజిస్టర్ అయిన పార్టీలు మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకుంటే కమిటీ పరిశీలించి ఆమోద ముద్ర వేయడం కాని తిరస్కరించడం కానీ చేస్తుందన్నారు. అలాగే రిజిస్టర్ కాని పార్టీలు ఏడురోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నిబంధన ప్రింట్ మీడి యాకు వర్తించదని తెలిపారు. దరఖాస్తులను తిరస్కరించినట్లురుుతే వాటిపై ఎన్నికల కమిషన్‌కు అప్పీలు చేసుకోవచ్చునన్నారు. ఇద్దరు సభ్యులు కలిగిన ఈ కమిటీకి ఎంపీ రిటర్నింగ్ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. సాఫ్ట్ కాపీ, ఎలక్ట్రానిక్ కాపీలతో పాటు ప్రకటన ధరను, ప్రకట నకు మీడియా ప్రతిపాదించిన ధరల వివరాలలు కూడా అం దించాలన్నారు. అలాగే దరఖాస్తుతో పాటు సంబంధిత బా ధ్యు డు లేఖ అందించాలన్నారు. ప్రకటనను ఎవరి పేరు మీద ఇస్తున్నారన్న లేఖ కూడా ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి చెక్ లే దా డీడీల ద్వారా చెల్లింపు వివరాలు అందించాలని, వాటిని తా ము రాష్ట్ర కమిటీకి నివేదిస్తామన్నారు. రాష్ట్ర కమిటీలో జాయింట్ సీఈఓ చైర్మన్‌గా కమిటీ ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీ ఎంపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చైర్మన్‌గా కమిటీ ఉందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడమే కాకుండా రెం డేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెయిడ్ న్యూస్‌పై కూ డా మానటరింగ్ సెల్ నిఘా ఉంటుందన్నారు. ఇలా ఏదేని ఒక పత్రికలో ఒక అభ్యర్ధి గూర్చి పదే పదే వార్తలు వస్తే వాటిని చెల్లింపు వార్తల కింద పరిగణించి ఆయా పత్రికల ధరలననుసరించి అభ్యర్థి ఎన్నికల ఖర్చులో జమ చేస్తామని చెప్పారు. ప్రతీ అభ్యర్థి కూడా ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. అలాగే ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా లో కూడా ఈ విధమైన ప్రకటనలు, ప్రచారాలు నిషేధించినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తప్పనిసరిగా ఉల్లంఘనుల సమా చారాన్ని అందిస్తామన్నారు.వీటిని పరిశీలించడానికి కలెక్టరేట్లోని ఎంసీఎంసీ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ విభాగాన్ని ఎన్నికల సిబ్బంది తో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సిటీ కేబుల్, లోకల్ ఛానల్స్ వంటి ప్రసార సాధనాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని చేపట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఆయనతో పాటు ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు కూడా ఉన్నారు. -
నిబంధనలు మీరితే ఇంటికే
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇంటికి పంపిస్తామని జేసీ టి.బాబూరావునాయుడు హెచ్చరించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎన్నికల నియమావళిపై అధికారులు, పోటీ చేసే అభ్యర్థులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచిందన్నారు. 2010లో బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ తరహా వార్తలపై నియంత్రణ చట్టాన్ని ఎన్నికల సంఘం వర్తింపచేసిందన్నారు. ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికే షన్ మోనటరింగ్ కమిటీలను నియమించినట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న పార్టీలు సంబంధిత ప్రభుత్వ కమిటీల అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే 171 (హెచ్) ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు మీడియాలో సమంగా ప్రచారం కల్పించాలని సూచించారు. ఘర్షణలు, డబ్బు పంపకాలు అధికంగా ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచామన్నారు. అదనపు జేసీ సీహెచ్ నరసింహారావు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు, కమిషనర్ పి.నిరంజనరెడ్డి, డీఎస్పీ వి.రాజగోపాల్, టీపిఓ ఎం.సత్యనారాయణ, రిటర్నింగ్ అధికారి ఉమారాణి, పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ మూర్తి, ఎక్సైజ్ సీఐ సాయి స్వరూప్ పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని పాటించని అభ్యర్థులపై చర్యలు నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించకపోతే చర్యలు తీసుకుంటామని జేసీ టి.బాబూరావునాయుడు అన్నారు. నరసాపురంలో మునిసిపల్ అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలను పాటించని అభ్యర్థులపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులపై 24 గంటలు నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయరాదన్నారు. ప్రచారానికి అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను ప్రచారానికి వినియోగించరాదన్నారు. అభ్యర్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అనంతరం నిజాయితీగా ఓటేస్తామని డ్వాక్రా మహిళలతో జేసీ ప్రతిజ్ఞ చేయించారు. నీతి నిజాయితీగా ఓటువేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. బ్రోచర్లను ఆవిష్కరించారు. ఆర్డీవో జె.ఉదయ భాస్కరరావు, డీఎస్పీ రఘువీరారెడ్డి, తహసిల్దార్ రమేష్, మునిసిపల్ కమిషనర్ పీసీ విజయకుమార్, పార్టీ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
అబ్బే.. అలా అనలేదు: షిండే
షోలాపూర్: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక వర్గాన్ని అణచేస్తామంటూ హెచ్చరించిన కేంద్ర హోం మంత్రి షిండే.. తన మాటలను సవరించుకున్నారు. నలువైపులా విమర్శలు రావడంతో.. సోషల్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించానే గానీ, జర్నలిస్టులను తానేమీ అనలేదని షిండే స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలోని తన సొంత నియోజకవర్గమైన షోలాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా గురించి.. హైదరాబాద్‌లో, కర్ణాటకలో ఈశాన్య ప్రజలపై జరిగిన హింసను ఉద్దేశించి మాట్లాడానని వివరించారు. నిజానికి షిండే ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించే ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాలుగు నెలలుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక వర్గం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. నా పరిధిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఎవరు అలా చేస్తున్నారో నాకు తెలుసు. అలాంటి శక్తులను అణచివేస్తాం’’ అని షిండే హెచ్చరికగా మాట్లాడారు. ఇటీవల కొన్ని జాతీయ చానెళ్లు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ హవా గురించిన సర్వే ఫలితాలను ప్రముఖంగా ప్రసారం చేస్తుండడంతో షిండే ఇలా మాట్లాడటం గమనార్హం. ‘పార్టీ ఆఫీసుల్లోని పెళ్లిళ్లు చెల్లవు’ కోచి: రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జరిపే వివాహాలు చట్టపరంగా చెల్లబోవని కేరళ హైకోర్టు తీర్పుచెప్పింది. వివాహ నమోదు అధికారి (రిజిస్ట్రార్) ముందు లేదా మతపరమైన సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహాలకే చట్టపరంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. -
మీడియా కాదు.. సోషల్ మీడియా అంటూ షిండే యూటర్న్!
ఎలక్ట్రానిక్ మీడియాను మట్టుబెట్టాలంటూ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తాను ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను సోషల్ మీడియా దృష్టిలో ఉంచుకొని మాత్రమే వ్యాఖ్యలు చేశానని షిండే వివరణ ఇచ్చారు. తన స్వంత పట్టణంలోని ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నారని షిండే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల షోలాపూర్ లోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలకు కారణం ఎలక్ట్రానికి మీడియా అని తాను అనలేదని షిండే మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే ఉద్రిక్తతకు దారి తీసిందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందనే నేపథ్యంగా తాను వ్యాఖ్యలు చేశానన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేస్తుందని, మోడీ ప్రభజంనంలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి పాలు కావడం తథ్యం అని పోల్ సర్వేలకు మీడియా ప్రాధాన్యమిస్తోందని షిండే మండిపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన విలేకరి స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అణచేస్తాం: షిండే
షోలాపూర్(మహారాష్ట్ర): కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక వర్గం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తోందని, ఇలాంటి తప్పుడు కథనాలను వెంటనే ఆపకపోతే ఆ వర్గం మీడియాను అణచేస్తామని హెచ్చరించారు. షిండే ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న షోలాపూర్‌లో యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘నాలుగు నెలలుగా ఎలక్ట్రానిక్ మీడియాలోని ఓ వర్గం నాకు, కాంగ్రెస్‌కు సంబంధించిన వార్తలకు మసిపూసి మారేడుకాయ చేస్తోంది. మా పార్టీని అనవసరంగా రెచ్చగొడుతోంది. దీన్ని ఆపకపోతే అణచేస్తాం’ అని అన్నారు. -
పద్యానవనం: నిజం నశించిన విధం
ఆడిన మాటను తప్పిన గాడిదకొడుకా యటన్న, గాడిద యదివి న్వీడా నాకొక కొడుకని గాడిదయే యేడ్చెనటర ఘన సంపన్నా! ఇదొక చాటుపద్యం. ఎంతో కాలంగా ప్రజాసమూహాల్లో ప్రచారంలో ఉంది. ఎవరు రాశారో తెలియదు. మాట తప్పడం ఎంత అవమానకరమో సాపేక్షంగా చెప్పాడు. అల్ప పదాలతోనూ ఆ చెప్పడం అద్భుతంగా ఉన్నందుకేమో పదికాలాలు పదిలంగా ఉండిపోయిందీ పద్యం. నిజమే, మాట మరచినపుడు ఎన్ని అనర్థాలు జరిగాయి! కాలమే మౌన సాక్షి. మాట నిలబెట్టుకోవడానికి ఎందరెందరో ఎన్నెన్ని కష్టాలు పడ్డారో.... అందుకు చరిత్ర సజీవ సాక్ష్యంగా ఉంది. సత్యహరిశ్చంద్రుడి కథ అంతగా ప్రభావితం చేసింది కనుకే మన జాతిపిత మహాత్ముడు సత్య పరిశోధనకు తన జీవితాన్నే ప్రయోగశాల చేసి విజేత అయ్యారు. తానిచ్చిన మాట కూడా కాదు, పితృవాక్యపరిపాలన కోసం శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసి అష్టకష్టాలనుభవించడమే కదా రామాయణం! కాలక్రమంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ మధ్య అలవోకగా అబద్ధాలాడేస్తున్నారు జనాలు. ఇక కొందరు రాజకీయనాయకులైతే... చెప్పనవసరం లేదు. అబద్ధాలాడి కూడా రాజకీయాల్లో ఎలా మనగలుగుతున్నారంటే, శీఘ్ర గతిన మరచిపోయే ప్రజల తత్వం మాటున వారు హాయిగా బతికిపోతున్నారు. మన స్వాతంత్య్రపు తొలినాళ్లలో... అబద్ధమాడటం కాదు, చట్టసభల్లో అబద్ధమన్న పదాన్ని ఉచ్ఛరించడమే పెద్ద తప్పిదంగా భావించేవారు. అందుకే, ఇప్పుడు మన శాసనసభలో కూడా ఎదుటివాళ్లను విమర్శించేప్పుడు అవసరమైతే ‘సత్య దూరమైన మాట’ అనొచ్చంటారు తప్ప ‘అబద్ధం‘ అన్న మాట రికార్డుల్లోకి వెళ్లకుండా చూస్తుంటారు. ఆచరణలో మాత్రం... అధికారంలో ఉంటే ఒక మాట, విపక్షంలో ఉంటే ఇంకోమాట. నిన్నటి మాట మీద ఈ రోజు నిలబడని నేతలెందరో! అవసరమైతే మరో అబద్ధాన్ని జోడించి ‘మీడియా వక్రీకరించింది’ అని తప్పుకోజూస్తారు. పాత రోజులు కాదు కదా, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతి తర్వాత...‘ఇదుగో నిన్న ఇలా అన్నారు, ఈ రోజిలా... ’అని రెండు దృశ్యాలు పక్కపక్కన చూపిస్తూ ఎండగట్టినా దబాయింపే తప్ప తప్పు ఒప్పుకునే సంస్కారం తక్కువ మందిలో ఉంటుంది. ఇచ్చిన మాటకోసం ఎన్ని అవాంతరాలెదురయినా మొక్కవోని దీక్షతో ముందుకు కదలిన పాలకులు లేరని కాదు, కానీ చాలా అరుదు. మాట తప్పకుండా సత్యం పక్షాన నిలిచిన వారు కాలాలకతీతంగా చరిత్రలో నిలిచారు. మాట తప్పిన వాళ్లు అనామకంగా కాలగర్భంలో కలిసిపోయారు. ‘నువ్వెవరో నాకు తెలియదు’ అన్న దుష్యంతుని మాటలకు చిగురుటాకులా అల్లాడిపోయింది శకుంతల. ఎవరి వల్ల తనకు పుత్రోదయం కలిగిందో ఆయనే ఆ మాటలంటే తనకేది తెరగు? అని చింతిస్తూ ఆమె ఒక మాట చెప్పింది. ‘‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కన్న సూనృతవ్రత....’’ అంటూ నన్నయ ఒక గొప్ప పద్యం రాశారు. సత్యవాక్కు గొప్పదనం వివరిస్తేనన్నా వింటాడేమోనని.... ‘నూరు చేదుడు బావుల కన్నా ఒక దిగుడు బావి మేలు, నూరు దిగుడు బావులు తవ్వించడం కన్నా ఒక యజ్ఙం మేలు, నూరు యజ్ఙాలకన్నా ఒక కుమారుణ్ని కలిగి ఉండటం గొప్ప, అటువంటి నూర్గురు కుమారుల కన్నా ఒక సత్యవాక్కు గొప్పద’ని శకుంతల వివరిస్తుంది. అదే నిజమని అశరీరవాణి పేర్కొన్న మీదట దుష్యంతుడు గతం గుర్తుకు తెచ్చుకొని శకుంతలనూ, తనయుడు భరతుణ్నీ చేరదీస్తాడు. వ్యాసభారతంలో ‘‘అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయా ధృతమ్, అశ్వమేధసహస్రాద్ధి సత్యమేవాతిరిచ్చతే’’ అనే గొప్ప మాటుంది. అంటే, వెయ్యి అశ్వమేధయాగా(ఫలా)లూ, సత్యమూ-వీటిని తక్కెడలో పెట్టి తూచగా సత్యమే బరువుగా తూగిందని అర్థం. ‘సత్యమేవ జయతే’. - దిలీప్‌రెడ్డి -
ఎన్నికల ప్రచారంపై.. పదేపదే టీవీల్లో చూపితే అనర్హతే : భన్వర్‌లాల్
ఎన్నికల ప్రచారంపై సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలి ఎన్నికల సంస్కరణలు - ఓటింగ్ ప్రాధాన్యంపై సదస్సు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో ఎలక్ట్రానిక్ మీడియా (టీవీ చానళ్ల)లో ఒకే పార్టీ, ఒకే అభ్యర్థిని పలుమార్లు చూపిస్తూ ప్రచారం చేస్తే అనర్హత వేటు తప్పదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. ఆయన గురువారం మాదాపూర్‌లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో ‘ఎలక్టొరల్ రిఫామ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ (ఎన్నికల సంస్కరణల - ఓటింగ్ ప్రాధాన్యం)’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రచార సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఏదేని పార్టీకి అనుకూలంగా టీవీ చానళ్లలో రోజంతా ప్రచారం చేస్తే దానికి అయ్యే ఖర్చును లెక్కించి ఆ అభ్యర్థి లేదా పార్టీ ఖాతాలో చేరుస్తామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఒకే పార్టీ లేదా అభ్యర్థిని పదే పదే టీవీల్లో చూపిస్తే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. మంచి నాయకుడిని ఎలా ఎంచుకోవాలి అని విద్యార్థులు ప్రశ్నించగా.. గత ఐదేళ్ళలో తమతమ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎలా జరుగుతోంది, పోలీస్ కేసులు లేదా కోర్టు వివాదాలు, ఎమ్మెల్యే అయినప్పటికీ - ఇప్పటికీ ఆస్తి వ్యవహారాలు ఏ విధంగా మార్పులు చెందుతున్నాయో గమనించి సరైన నాయకులను ఎంచుకోవాలని భన్వర్‌లాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐఐ మేనేజింగ్ డెరైక్టర్ సురేష్ చిత్తూరి, సీఐఐ సిబ్బంది పాల్గొన్నారు. -
సకలజన సమైక్యాంధ్ర సక్సెస్
జగ్గంపేట, న్యూస్‌లైన్ : జగ్గంపేటలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సకలజన సమైక్యాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. గ్రామంలో బంద్‌తో పాటు అండర్‌పాస్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన వేదికపై గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, వర్తకులు, విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు, చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ కార్యక్రమాలు సాగాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, రాజస్థానీ మార్వాడీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. మెయిన్ రోడ్డు సెంటర్లో మానవహారం ప్రదర్శన, కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలతో వినూత్న నిరసనలు, దిష్టిబొమ్మల దహనం నిర్వహించారు.