జగ్గంపేటలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సకలజన సమైక్యాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది.
జగ్గంపేట, న్యూస్‌లైన్ :
జగ్గంపేటలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సకలజన సమైక్యాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. గ్రామంలో బంద్‌తో పాటు అండర్‌పాస్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన వేదికపై గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, వర్తకులు, విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు, చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.
రాజకీయాలకు అతీతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ కార్యక్రమాలు సాగాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, రాజస్థానీ మార్వాడీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. మెయిన్ రోడ్డు సెంటర్‌లో మానవహారం ప్రదర్శన, కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలతో వినూత్న నిరసనలు, దిష్టిబొమ్మల దహనం నిర్వహించారు.